హీరోలను పిచ్చిగా ప్రేమించే అభిమానులెందరో! అయితే వారిలో లేడీ ఫ్యాన్స్ కూడా ఉంటారు. అది చూసి తన భార్య తెగ భయపడేదంటున్నాడు హీరో మాధవన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేను యాక్టర్ అవుతానంటే నా భార్య సరిత ఎంతో భయపడిపోయింది. కెరీర్ ప్రారంభంలో నన్ను చాక్లెట్ బాయ్ అని పిలిచేవారు. లేడీ ఫ్యాన్స్ ఎక్కువుండేవారు.
నా పేరెంట్స్‌ను అడిగా
అది చూసి నా భార్య అభద్రతాభావానికి లోనయ్యేది. అప్పుడు నేను నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి మీ బంధాన్ని ఏళ్లతరబడి సంతోషంగా కొనసాగించడానికి కారణమేంటన్నాను. అందుకు వాళ్లు.. మేము మా జీవితాన్ని కలిసి కొనసాగించాలనుకున్నాం. అలాంటప్పుడు ఏదో జరిగిపోతుందని ఎందుకు భయపడటం? అని బదులిచ్చారు.
జాయింట్ అకౌంట్ తీసుకున్నాం
అంతా మంచే జరుగుతుందన్న పాజిటివ్ ఆలోచనతో ఉండేవారు. పైగా అమ్మానాన్న ఇద్దరికీ జాయింట్ అకౌంట్ ఉంది. నేను కూడా అదే ఫాలో అయ్యాను. సరిత, నేను కలిసి జాయింట్ అకౌంట్ తీసుకున్నాం. దీనివల్ల.. నేనేదో తప్పు చేస్తున్నాను, ఎవరికోసమో ఏదో ఖర్చు పెడుతున్నానన్న భయం ఆమెకు ఉండదు. నాపై నమ్మకం మరింత బలపడుతుంది. మేము కొన్న ఆస్తులు, కార్లు కూడా ఇద్దరి పేర్లపై ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. కాగా ఆర్ మాధవన్, సరిత 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి వేదాంత్ అనే కుమారుడు ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment