న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వైఫల్యాలపై వెబ్ సిరీస్ తీస్తానని మాజీ జర్నలిస్ట్, గతంలో కాంగ్రెస్‌తో కలసి పని చేసిన పంకజ్ శంకర్ అన్నారు. గతంలో ఈయన ప్రియాంకా గాంధీ మీడియా వ్యవహారాలను చూసేవారు. కాంగ్రెస్‌ను కష్టాల నుంచి ప్రియాంక గాంధీ మాత్రమే బయటపడేస్తారని ఎన్నికల సందర్భంగా చెప్పారు. అయితే సోనియా గాంధీ పుత్రప్రేమ వలన రాహుల్ గాంధీని ముందుకు తీసుకొచ్చారని అన్నారు. మూడు నెలల్లో ఈ సిరీస్ అందుబాటులోకి వస్తుందన్నారు. అయితే పంకజ్ పబ్లిసిటీ కోసం ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని కాంగ్రెస్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment