టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ జట్టుకు భారంగా మారుతున్నాడు. ఒకప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫ్రంట్‌లైన్ బౌలర్‌గా ఉన్న భువీ.. ఇప్పుడు మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండు వన్డేలు కలిపి 18 ఓవర్లు వేసిన భువీ 7.27 ఎకానమీతో 131 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న భువనేశ్వర్ గతేడాది ఐదు వన్డేలు ఆడి 9 వికెట్లు తీశాడు. వాస్తవానికి ఇది మంచి ప్రదర్శనే అయినప్పటికి భువీ మునపటి ఫామ్‌ను చూపట్టలేకపోతున్నాడు. ఒకప్పుడు ఆరంభంలో.. డెత్ ఓవర్లలో వికెట్లు తీయడం.. తన కోటా బౌలింగ్‌లో డాట్ బాల్స్ ఎక్కువగా వేయడం.. పొదుపుగా బౌలింగ్ చేయడం భువనేశ్వర్ స్పెషాలిటీ. 2022కు ముందు 42.6 గా ఉన్న డాట్‌బాల్స్ పర్సంటేజీ ఇప్పుడు 61.5కు పెరిగింది. పరిస్థితి ఇలాగే ఉంటే 2022 టి20 వరల్డ్‌కప్ వరకు భువనేశ్వర్ టీమిండియా జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దీంతో భువీని జట్టు నుంచి తొలగించాల్సిన సమయం వచ్చేసిందంటూ పేర్కొంటున్నారు. మూడో వన్డేకు అతని స్థానంలో దీపక్ చహర్‌ను ఎంపిక చేయడం మంచిదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వికెట్ టు వికెట్ బౌలింగ్ వేయడంలో దిట్ట అయిన దీపక్ చహర్ టీమిండియా తరపున 5 వన్డేలు, 17 టి20లు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. అంతేగాక దీపక్ చహర్ బ్యాటింగ్‌లోనూ చేయిందించగల సామర్థ్యం ఉండడం కలిసొచ్చే అంశం. టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ కూడా భువనేశ్వర్ స్థానంలో దీపక్ చహర్‌ను ఎంపిక చేయడమే కరెక్టని అభిప్రాయపడ్డాడు. ఇక భువనేశ్వర్ టీమిండియా తరపున 21 టెస్టుల్లో 63 వికెట్లు, 121 వన్డేల్లో 141 వికెట్లు, 55 టి20ల్లో 53 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment