భూవీ.. ఇది ఎలా సాధ్యం | Bhuvneshwar Kumar Shares Adorable Pictures With His Dog | Sakshi
Sakshi News home page

భూవీ.. ఇది ఎలా సాధ్యం

Published Fri, Jun 5 2020 6:40 PM | Last Updated on Fri, Jun 5 2020 6:42 PM

Bhuvneshwar Kumar Shares Adorable Pictures With His Dog - Sakshi

ఢిల్లీ : టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన పెట్‌ డాగ్‌తో దిగిన క్యూట్‌ ఫోటోలను షేర్‌ చేశాడు. మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహానికి గుర్తుగా ఈ ఫోటోలను పెట్టానంటూ భూవీ పేర్కొన్నాడు. అంతేగాక దానికి ' బడ్డీస్‌ దెన్‌ అండ్‌ నౌ' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. భూవీ షేర్‌ చేసిన ఫోటోలో విశేషమేంటంటే..  రెండు ఫోటోల్లోనూ భూవీ, తన పెంపుడు కుక్క అలెక్స్‌లు సేమ్‌ ఫోజ్‌ పెట్టారు. మొదటిది అలెక్స్‌ చిన్నగా ఉన్నప్పుడు.. లాన్‌లో తీయగా.. రెండో ఫోటో తాజాగా తన ఇంట్లో తీశారు.  ఫోటోలో అలెక్స్‌, భూవీలు ఎదురెదురుగా కళ్లలోకి కళ్లు పెట్టి చూడడం.. దాదాపు రెండు ఫోటోలు ఒకేలా ఉన్నాయి.(ప్రేమ గుట్టు విప్పిన పాండ్యా)

దీనిపై భూవీ భార్య నుపుర్‌ నగర్‌ స్పందిస్తూ..' మై లవ్‌.. మీరిద్దరు అప్పుడు.. ఇప్పుడు ఒకేలా ఫోజు ఇవ్వడం ఎలా సాధ్యం. నిజంగా అద్భుతంగా ఉంది. అలెక్స్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ రెండు ఫోటోల్లోనూ ఒకేలా ఉన్నాయి. నీ పెట్‌ డాగ్‌కు మంచి ట్రైనింగ్‌ ఇచ్చావు భూవీ' అంటూ పేర్కొన్నారు. తాజాగా భూవీ షేర్‌ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఫోటోలు షేర్‌ చేసిన గంటలోనే లక్ష లైకులు రావడం విశేషం. భూవీ అభిమానులు కూడా సో క్యూట్‌ అంటూ ఎమోజీలు పెడుతున్నారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఆటకు విరామం లభించడంతో భువనేశ్వర్‌ తన భార్య, కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఆనందంగా గడిపేస్తున్నాడు. భూవీ టీమిండియా తరపున 114 వన్డేలు, 21 టెస్టులు, 43 టీ20లు ఆడాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement