![Bhuvneshwar Kumar Hilariously Trolled By Wife Nupur Poor Mehendi Design - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/11/bhuvi.jpg.webp?itok=_P6Bi8Gk)
ఢిల్లీ: శ్రీలంక పర్యటన అనంతరం స్వదేశానికి చేరుకొన్న టీమిండియా స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇంటిపట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో భువీ.. తన భార్య నుపుర్ నగర్‌తో మెహందీ డిజైన్ పోటీ పెట్టుకున్నాడు. నుపుర్ మెహందీ డిజైన్‌ను చక్కగా వేయగా.. భువీ మాత్రం మెమందీ డిజైన్ వేయమంటే.. కరోనా పోలిన డిజైన్ వేశాడు. ఇది చూసిన నుపుర్ ఊరుకోకుండా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరి మెహందీ ఫోటోలను షేర్ చేసింది.
భువీని ట్రోల్ చేస్తూ.. '' మా ఆయన వేసిన డిజైన్ కరోనాను పోలి ఉంది.. మీరు ఒక లుక్కేయండి'' అంటూ కామెంట్ చేసింది. నుపుర్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''భువీకి ఇంకా కరోనా భయం పోలేదనుకుంటా.. మంచి డిజైన్ వేయమంటే కరోనా డిజైన్ వేశాడు..'' అంటూ కామెంట్లు చేశారు.
ఇక భువనేశ్వర్ ఇటు బౌలర్‌గా.. అటు వైస్ కెప్టెన్‌గా శ్రీలంక పర్యటనలో అదరగొట్టాడు. మూడు వన్డేల సిరీస్‌లో మూడు వికెట్లు తీసి భారత్ 2-1తో సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక టీ20 సిరీస్‌లోనూ తొలి మ్యాచ్‌లోనూ 4 వికెట్లు తీసిన భువీ ఆ తర్వాతి మ్యాచ్‌ల్లోనూ మంచి ప్రదర్శనే కనబరిచాడు. అయితే టీమిండియా టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది. కాగా భువనేశ్వర్ ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీల్లో ఆడేందుకు త్వరలోనే యూఏఈకి వెళ్లనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment