Bhuvaneshwar Kumar
-
‘అతడి ఖేల్ ఖతం.. ఇకపై టీమిండియాలో చోటు ఉండదు’
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) స్పందించాడు. స్పిన్, పేస్ బౌలర్ల విషయంలో సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు. ఏళ్లకు ఏళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నవారిని.. ఎంపిక చేయకపోవడమే ఉత్తమమని పేర్కొన్నాడు.లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ అధ్యాయం ఇక్కడితో ముగిసిపోయిందన్న ఆకాశ్ చోప్రా.. ‘స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఖేల్ కూడా ఖతమైందని అభిప్రాయపడ్డాడు. కాగా 2017లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించింది. నాడు ఫైనల్లో టీమిండియాను ఓడించి విజేతగా నిలిచిన పాకిస్తాన్(India vs Pakistan).. తాజాగా నిర్వహించబోతున్న మెగా టోర్నీ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది.కుల్దీప్ యాదవ్ వైపు మొగ్గుఅయితే, భద్రతా కారణాల వల్ల టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ శనివారం చాంపియన్స్ ట్రోఫీకి తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే టీమ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు.మరోవైపు.. పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు.. మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో యజువేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్‌లకు అన్యాయం జరిగిందంటూ వారి అభిమానులు సెలక్టర్ల తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘యుజీ చహల్ విషయం కాస్త ప్రత్యేకమైనదే.అతడి కథ ముగిసిపోయింది2023 జనవరిలో అతడు చివరగా ఆడాడు. దాదాపు రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక భువీ.. 10 మ్యాచ్‌లలో అతడి ప్రదర్శన చూసిన తర్వాత అతడిపై సెలక్టర్లు వేటు వేశారు. అయితే, యువీ గణాంకాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. నిలకడగా వికెట్లు తీశాడు కూడా. కాకపోతే.. ఈ టోర్నీ రేసులో అతడు వెనుకబడిపోయాడు.ఇక్కడితో అతడి కథ పూర్తిగా ముగిసిపోయినట్లే. అతడి ఫైల్ క్లోజ్ అయిపోయింది. కానీ సెలక్టర్లు ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. నిజానికి రెండేళ్ల క్రితమే అతడి పనైపోయింది. అందుకే సెలక్టర్లు బహుశా మళ్లీ జట్టులో చోటు ఇవ్వలేదు. ఒకవేళ అతడిని ఎంపిక చేసి ఉంటే.. అది తిరోగమనానికి సూచిక అయ్యేది.భువీని ఎలా సెలక్ట్ చేస్తారు?ఇక భువీ మూడేళ్ల క్రితం చివరగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. అసలు వన్డే ఫార్మాట్లో చాలాకాలంగా జట్టులోనే లేడు. మరి అలాంటి ఆటగాడిని అకస్మాత్తుగా మెగా టోర్నీ కోసం పిలిపిస్తే.. ఇప్పుడు సెలక్టర్లను తిడుతున్న వారే.. అతడిని ఎంపిక చేసినా.. ఇదేం తీరు అని ప్రశ్నించేవారు’’ అని పేర్కొన్నాడు. ఏదేమైనా యుజీ, భువీలు ఇక భారత జట్టులో చోటు దక్కించుకోలేరని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి.చదవండి: కరుణ్ నాయర్‌ను ఎలా సెలక్ట్ చేయగలం?: అగార్కర్ -
కెప్టెన్‌గా రింకూ సింగ్
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్‌కు సువర్ణావకాశం వచ్చింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2024లో అతడు ఉత్తరప్రదేశ్ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన రింకూకు ఈ అవకాశం దక్కింది.టీ20 టోర్నీలో అదరగొట్టిన రింకూకాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఉత్తరప్రదేశ్ జట్టుకు భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. అతడి కెప్టెన్సీలో యూపీ క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకుంది. ఇక ఈ టోర్నీలో రింకూ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 152కు పైగా స్ట్రైక్‌రేటుతో 277 పరుగులు చేశాడు.ఇక లిస్ట్-ఏ(వన్డే ఫార్మాట్) క్రికెట్లోనూ రింకూ సింగ్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు 57 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఖాతాలో 1899 పరుగులు ఉన్నాయి. ఇందులో ఒక సెంచరీతో పాటు 17 అర్ధ శతకాలు ఉన్నాయి.ఈసారి రింకూ కెప్టెన్సీలో భువీఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ-2024కు ప్రకటించిన జట్టుకు రింకూ సింగ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించిన 19 మంది సభ్యులతో కూడిన జట్టులో సారథిగా ఛాన్స్ కొట్టేశాడు. అయితే, భువీ ఈసారి కేవలం బౌలర్‌గానే బరిలోకి దిగనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్సీ చేసిన భువనేశ్వర్.. ఆటగాడిగానూ రాణించాడు.ఈ టోర్నీలో తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి పదకొండు వికెట్లు తీశాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉండటం విశేషం. అయితే, విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం రింకూ కెప్టెన్సీలో భువీ ఆడనున్నాడు. ఇక యూపీ జట్టులో రింకూ, భువీతో పాటు నితీశ్ రాణా, మొహ్సిన్ ఖాన్, శివం మావి వంటి ఐపీఎల్ స్టార్లు కూడా ఉన్నారు. ఇక ఈ దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ డిసెంబరు 21 నుంచి ఆరంభం కానుంది.విజయ్ హజారే ట్రోఫీ-2024కు ఉత్తరప్రదేశ్ జట్టురింకూ సింగ్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మాధవ్ కౌశిక్, కరణ్ శర్మ, ప్రియమ్ గార్గ్, నితీశ్ రాణా, అభిషేక్ గోస్వామి, అక్షదీప్ నాథ్, ఆర్యన్ జుయాల్, ఆరాధ్య యాదవ్, సౌరభ్ కుమార్, కృతజ్ కుమార్ సింగ్, విప్రాజ్ నిగమ్, మొహ్సిన్ ఖాన్, శివం మావి, అక్విబ్ ఖాన్, అటల్ బిహారీ రాయ్, కార్తికేయ జైస్వాల్, వినీత్ పన్వర్.చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’ఇప్పటికైనా చోటిస్తారా?.. టీమిండియా సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్ -
బుమ్రా తర్వాత బెస్ట్ బౌలర్.. భీకర ఫామ్‌లో ఆర్సీబీ పేసర్
ఐపీఎల్-2025 నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఈసారి తమ పేస్ దళాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మెగా వేలానికి ముందే యశ్ దయాళ్ను రిటైన్ చేసుకున్న ఆర్సీబీ.. వేలంలో భాగంగా టీమిండియా స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్‌ను సొంతం చేసుకుంది. ఈ వెటరన్ పేసర్ కోసం ఏకంగా రూ. 10.75 కోట్లు ఖర్చు చేసింది.రిటెన్షన్స్ సమయంలో టీమిండియా ప్రస్తుత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను వదిలేసిన తర్వాత.. ఆర్సీబీ ఈ మేర అతడి స్థానాన్ని సీనియర్‌తో భర్తీ చేసుకుంది. ఈ నేపథ్యంలో భువీ గురించి ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో భాగమైన దినేశ్ కార్తిక్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి.అతడు బెస్ట్ టీ20 బౌలర్ఆర్సీబీ ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్, మొ బొబాట్, ఓంకార్ సాల్వీలతో డీకే మాట్లాడుతూ.. ‘‘బుమ్రా తర్వాత.. ఇప్పటికీ తన ప్రభావం చూపగలుగుతున్న అత్యుత్తమ బౌలర్ ఎవరైనా ఉన్నారా అంటే.. భువనేశ్వర్ కుమార్ పేరు చెబుతాను. అతడు బెస్ట్ టీ20 బౌలర్’’ అని ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా.. కుర్ర పేసర్ రసీఖ్ సలాం గురించి ప్రస్తావనకు రాగా.. 24 ఏళ్ల ఈ ఆటగాడి నైపుణ్యాలు అద్భుతమని డీకే కొనియాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. అభిమానులను ఆకర్షిస్తోంది.భీకర ఫామ్‌లో భువీభువనేశ్వర్ కుమార్ టీ20 ఫార్మాట్లో ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ స్వింగ్ సుల్తాన్.. ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి పదకొండు వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. ఇక భువీ ఈ టోర్నీలో ఇప్పటి వరకు సగటు 12.90తో ఎకానమీ రేటు 5.64గా నమోదు చేయడం విశేషం. అంతేకాదు సారథిగానూ జట్టును విజయపథంలో నడిపి క్వార్టర్ ఫైనల్లో నిలిపి.. సెమీస్ రేసులోకి తెచ్చాడు.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టువిరాట్ కోహ్లి (రూ. 21 కోట్లు) రజత్ పాటిదార్ (రూ.11 కోట్లు) యశ్ దయాళ్ (రూ. 5 కోట్లు) జోష్ హాజల్‌వుడ్ (రూ.12.50 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) భువనేశ్వర్ కుమార్ (రూ.10.75 కోట్లు) లియామ్ లివింగ్‌స్టోన్ (రూ.8.75 కోట్లు) రసిఖ్ ధార్ (రూ.6 కోట్లు) కృనాల్ పాండ్యా (రూ. 5.75 కోట్లు) టిమ్ డేవిడ్ (రూ. 3 కోట్లు) జాకబ్ బెథెల్ (రూ. 2.60 కోట్లు) సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు) దేవ్‌దత్ పడిక్కల్ (రూ. 2 కోట్లు) తుషార (రూ. 1.60 కోట్లు) రొమరియో షెఫర్డ్ (రూ. 1.50 కోట్లు లుంగి ఇన్‌గిడి (రూ. 1 కోటి) స్వప్నిల్ సింగ్ (రూ.50 లక్షలు) మనోజ్ (రూ. 30 లక్షలు) మోహిత్ రాఠి (రూ. 30 లక్షలు) అభినందన్ (రూ. 30 లక్షలు) స్వస్తిక్ చికార (రూ. 30 లక్షలు) .చదవండి: కెప్టెన్ ఫామ్‌లో లేకుంటే కష్టమే.. రోహిత్ ఇకనైనా..: ఛతేశ్వర్ పుజారా -
అశ్విన్ రికార్డును సమం చేసిన భువీ
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో భువీ దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో వికెట్లు తీస్తున్నాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లో కూడా భువీ రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో రెండో వికెట్ తీసిన అనంతరం భువీ.. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డును సమం చేశాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అశ్విన్, భువీ సమంగా నిలిచారు. ప్రస్తుతం వీరిద్దరి ఖాతాలో 310 టీ20 వికెట్లు ఉన్నాయి. ఈ జాబితాలో యుజ్వేంద్ర చహల్ (364 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. పియూశ్ చావ్లా (319) రెండో స్థానంలో ఉన్నాడు. భువీ, అశ్విన్ సంయ్తుంగా మూడో స్థానంలో నిలిచారు.కాగా, ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భువీ (ఉత్తర్‌ప్రదేశ్ కెప్టెన్) ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎస్ భరత్, త్రిపురణ విజయ్ వికెట్లు తీశాడు. భువీ బంతితో రాణించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఏపీ ఇన్నింగ్స్‌లో ఎస్డీఎన్వీ ప్రసాద్ (34 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేవీ శశికాంత్ (23 నాటౌట్), కెప్టెన్ రికీ భుయ్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీకర్ భరత్ (4), అశ్విన్ హెబ్బర్ (11), షేక్ రషీద్ (18), పైలా అవినాశ్ (19), త్రిపురణ విజయ్ (16) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. యూపీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. మొహిసిన్ ఖాన్, శివమ్ మావి చెరో వికెట్ దక్కించుకున్నారు.157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉత్తర్‌ప్రదేశ్.. మరో ఓవర్ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కరణ్ శర్మ (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. రింకూ సింగ్ (22 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, సిక్సర్), విప్రాజ్ నిగమ్ (27 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి యూపీని గెలిపించారు. కే సుదర్శన్ (4-1-23-3), త్రిపురణ విజయ్ (4-0-21-2), సత్యనారాయణ రాజు (4-0-30-1) మెరుగ్గా బౌలింగ్ చేసినప్పటికీ ఏపీని గెలిపించలేకపోయారు. -
ఒకే రోజు రెండు హ్యాట్రిక్‌లు
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఒకే రోజు రెండు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. ఇవాళ (నవంబర్ 5) జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్తర్ ప్రదేశ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తొలి హ్యాట్రిక్ నమోదు చేయగా.. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గోవా బౌలర్ ఫెలిక్స్ అలెమావో రెండో హ్యాట్రిక్ నమోదు చేశాడు. భువీ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. ఈ ఓవర్లో భువీ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో భువీ మొత్తంగా 4 ఓవర్లు వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మెయిడిన్ ఉంది. ఈ మ్యాచ్‌లో భువీతో పాటు మిగతా బౌలర్లు కూడా చెలరేగడంతో జార్ఖండ్‌పై యూపీ 10 పరుగుల తేడాతో గెలుపొందింది.రెండో హ్యాట్రిక్ విషయానికొస్తే.. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గోవా బౌలర్ ఫెలిక్స్ అలెమావో ఇన్నింగ్స్ చివరి మూడు బంతులకు మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో ఫెలిక్స్ మొత్తంగా 5 వికెట్లు తీశాడు. ఫెలిక్స్‌తో పాటు మోహిత్ రేడ్కర్ (4/18) కూడా చెలరేగడంతో నాగాలాండ్‌పై గోవా 108 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గోవా.. దర్శన్ మిసాల్ (91), సూయాశ్ ప్రభుదేశాయ్ (69) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన నాగాలాండ్ నిర్ణీత ఓవర్లలో 129 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నాగాలాండ్ ఇన్నింగ్స్‌లో చేతన్ బిస్త్ (63) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. -
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఉత్తర్ ప్రదేశ్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. జార్ఖండ్‌తో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌లో భువీ ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్ 17వ ఓవర్లో భువీ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. ఈ ఓవర్లో భువీ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో భువీ మొత్తంగా 4 ఓవర్లు వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మొయిడిన్ ఉంది. HAT-TRICK FOR BHUVNESHWAR KUMAR IN SYED MUSHTAQ ALI 🦁- Great news for RCB in IPL 2025...!!! pic.twitter.com/mDw13DhRM4— Johns. (@CricCrazyJohns) December 5, 2024ఈ మ్యాచ్‌లో భువీతో పాటు నితీశ్ రాణా (4-0-19-2), మొహిసిన్ ఖాన్ (2.5-0-38-2), వినీత్ పన్వార్ (4-0-39-1), విప్రాజ్ నిగమ్ (2-0-18-1), శివమ్ మావి (3-0-28-1) రాణించడంతో జార్ఖండ్‌పై ఉత్తర్ ప్రదేశ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రింకూ సింగ్ 28 బంతుల్లో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలువగా.. ప్రియమ్ గార్గ్ 31, సమీర్ రిజ్వి 24, నితీశ్ రాణా 16, శివమ్ మావి 15 పరుగులు చేశారు. జార్ఖండ్ బౌలర్లలో బాల్ కృష్ణ 3 వికెట్లు తీయగా.. వివేకానంద్ తివారి 2, వికాస్ కుమార్, వికాశ్ సింగ్, అనుకుల్ రాయ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జార్ఖండ్.. 19.5 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. అనుకుల్ రాయ్ (44 బంతుల్లో 91) జార్ఖండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. విరాట్ సింగ్ (23), రాబిన్ మింజ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ (8) విఫలమయ్యాడు.ఆర్సీబీలో చేరిన భువీఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. భువీపై ఆర్సీబీ 10.75 కోట్లు వెచ్చించింది. మెగా వేలానికి ముందు భువనేశ్వర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకుంది. భువీ 2014 నుంచి సన్‌రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. భువీకి పవర్ ప్లే మరియు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుంది. భువీ 2016, 2017 ఐపీఎల్ సీజన్లలో పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ 2016లో టైటిల్ సాధించడంలో భువీ కీలకపాత్ర పోషించాడు. -
IPL 2025: ఆర్సీబీ కెప్టెన్ అతడే!
ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. సౌదీ అరేబియా వేదికగా రెండు రోజులపాటు జరిగిన ఆక్షన్‌లో ఫ్రాంఛైజీలు తాము కోరుకున్న ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. ఇక వచ్చే సీజన్లో టైటిల్ లక్ష్యంగా ముందుకు సాగే క్రమంలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడమే తరువాయి. సారథులు వీరేనా?అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తదితర జట్లు రిటెన్షన్‌కు ముందే తమ కెప్టెన్లను వదిలేశాయి. ఈ క్రమంలో... వేలం ముగిసిన తర్వాత ఆయా జట్ల సారథుల నియామకంపై విశ్లేషకులు ఓ అంచనాకు వచ్చారు. పంజాబ్‌కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీకి కేఎల్ రాహుల్, లక్నోకు రిషభ్ పంత్, కోల్‌కతాకు వెంకటేశ్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆర్సీబీ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.కోహ్లి తిరిగి పగ్గాలు చేపడతాడా?ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి తిరిగి పగ్గాలు చేపడతాడా? లేదంటే.. కెప్టెన్సీ అనుభవం ఉన్న రజత్ పాటిదార్, భువనేశ్వర్ కుమార్, ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్‌లలో ఒకరికి సారథ్య బాధ్యతలు ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఇంగ్లండ్ స్టార్లు సాల్ట్, లివింగ్‌స్టోన్‌లకు ది హండ్రెడ్, ఇంగ్లండ్ లిస్ట్-ఎ టోర్నీల్లో నాయకులుగా వ్యవహరించారు.మరోవైపు.. భారత క్రికెటర్లలో రజత్ పాటిదార్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా ఉండగా.. భువీ ఉత్తరప్రదేశ్ సారథిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్సీ అంశంపై సౌతాఫ్రికా దిగ్గజం, బెంగళూరు మాజీ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ కెప్టెన్ అతడే!‘‘ఇప్పటి వరకు ఆర్సీబీ కెప్టెన్ ఎవరో ఖరారు కాలేదు. అయితే, కోహ్లినే తిరిగి కెప్టెన్ అవుతాడని భావిస్తున్నా. ప్రస్తుతం ఉన్న జట్టును బట్టి చూస్తే ఇదే జరుగుతుందని అనిపిస్తోంది’’ అని ఏబీడీ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు. కాగా 2021లో కోహ్లి ఆర్సీబీ కెప్టెన్సీ వదిలేయగా.. సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ మూడేళ్ల పాటు సారథ్యం వహించాడు. అయితే, ఈసారి వేలానికి ముందే ఆర్సీబీ అతడిని విడిచిపెట్టింది.ఫామ్‌లో ఉంటే అతడిని ఎవరూ ఆపలేరుఇదిలా ఉంటే.. ఆర్సీబీ బౌలింగ్ విభాగం గురించి డివిలియర్స్ ప్రస్తావిస్తూ.. ‘‘భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ జట్టులోకి రావడం సానుకూలాంశం. రబడ లేడు.. గానీ.. లుంగి ఎంగిడిని దక్కించుకోగలిగారు. స్లో బాల్‌తో అతడు అద్భుతాలు చేయగలడు. ఒకవేళ ఎంగిడి ఫిట్‌గా ఉండి ఫామ్ కొనసాగిస్తే అతడిని ఎవరూ ఆపలేరు’’ అని పేర్కొన్నాడు. కాగా వచ్చే మార్చి 14- మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: వేలంలో ఎవరూ కొనలేదు..! రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ -
కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్
దేశవాలీ క్రికెట్ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కోసం ఉత్తర్‌ప్రదేశ్ జట్టును ఇవాళ (నవంబర్ 18) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేశారు. ఈ జట్టులో టీమిండియా ఆటగాళ్లు రింకూ సింగ్, నితీశ్ రాణా, పియూశ్ చావ్లా, శివమ్ మావికి చోటు దక్కింది. ఈ జట్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సోదరుడు కార్తికేయ జైస్వాల్ కూడా ఉన్నాడు. ఈ టోర్నీలో భువీకి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) మాధవ్ కౌశిక్ వ్యవహరిస్తాడు.టోర్నీ విషయానికొస్తే.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2024-25 నవంబర్ 23 నుంచి మొదలవుతుంది. 38 జట్లు పాల్గొనే ఈ టోర్నీ దేశంలోని 12 వేర్వేరు వేదికలపై జరుగనుంది. డిసెంబర్ 15న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నీలో ఉత్తర్‌ప్రదేశ్ గ్రూప్-సిలో ఉంది. ఈ గ్రూప్‌లో యూపీతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, మణిపూర్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్, జార్ఖండ్ జట్లు ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ తమ తొలి మ్యాచ్‌ను నవంబర్ 23న ఆడనుంది. ఆ రోజు జరిగే మ్యాచ్‌లో యూపీ ఢిల్లీని ఢీకొట్టనుంది.కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ విషయానికొస్తే.. భువీకి ఐపీఎల్లో కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది. భువీ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సారధిగా వ్యవహరించాడు. భువీ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరెంజ్ ఆర్మీని నాయకత్వం వహించాడు. ఇందులో ఆరెంజ్ ఆర్మీ రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, ఆరింట ఓడింది.సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ కోసం ఉత్తర్‌ప్రదేశ్ జట్టు..భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), మాధవ్ కౌశిక్ (వైస్ కెప్టెన్), కరణ్ శర్మ, రింకూ సింగ్, నితీశ్ రాణా, సమీర్ రిజ్వి, స్వస్తిక్ చికార, ప్రియమ్ గార్గ్, ఆర్యన్ జుయల్, పియూశ్ చావ్లా, విప్రాజ్ నిగమ్, కార్తికేయ జైస్వాల్, శివమ్ శఱ్మ, యవ్ దయాల్, మొహిసిన్ ఖాన్, ఆకిబ్ ఖాన్, శివమ్ మావి, వినీత్ పన్వర్ -
అర్షదీప్ సింగ్ మరో 3 వికెట్లు తీస్తే..!
భారత్-సౌతాఫ్రికా మధ్య ఇవాళ (నవంబర్ 10) రెండో టీ20 జరుగనుంది. సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే.అర్షదీప్ సింగ్ మరో 3 వికెట్లు తీస్తే..!ఇవాళ జరుగనున్న రెండో టీ20లో అర్షదీప్ సింగ్ మరో మూడు వికెట్లు తీస్తే భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్ పేరిట ఉన్న ఈ రికార్డును అర్షదీప్ సింగ్ బద్దలు కొడతాడు. భువీ 87 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్ సింగ్ కేవలం 57 మ్యాచ్‌ల్లోనే 88 వికెట్లు తీశాడు. అర్షదీప్ సింగ్ మరో రెండు వికెట్లు తీస్తే టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను కూడా అధిగమిస్తాడు. బుమ్రా 70 మ్యాచ్‌ల్లో 89 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఘనత యుజ్వేంద్ర చహల్‌కు దక్కుతుంది. చహల్ 80 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు పడగొట్టాడు.భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా..చహల్- 96భువనేశ్వర్ కుమార్- 90జస్ప్రీత్ బుమ్రా- 89అర్షదీప్ సింగ్- 88హార్దిక్ పాండ్యా- 87కాగా, నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ శతక్కొట్టడంతో (50 బంతుల్లో 107; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. భారత బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి తలో మూడు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా పతనాన్ని శాశించారు. ఆవేశ్ ఖాన్ రెండు, అర్షదీప్ సింగ్ ఓ వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో హెన్రిచ్ క్లాసెన్ (25) టాప్ స్కోరర్‌గా నిలువగా.. గెరాల్డ్ కొయెట్జీ (23), ర్యాన్ రికెల్టన్ (21), డేవిడ్ మిల్లర్ (18), ట్రిస్టన్ స్టబ్స్ (11), మార్కో జన్సెన్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. -
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన లక్నో
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (మే 8) జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న లక్నోను భువనేశ్వర్ కుమార్ (4-0-12-2) కట్టడి చేయడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసింది. ఆఖర్లో ఆయుశ్ బదోని (55 నాటౌట్), పూరన్ (48 నాటౌట్) చెలరేగి ఆడటంతో లక్నో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్‌లో డికాక్ (2), స్టోయినిస్ (3), కృనాల్ పాండ్యా (24), రాహుల్ (29) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. బదోని, పూరన్ ఆఖరి రెండు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఏకంగా 34 పరుగులు వచ్చాయి. కమిన్స్ వేసిన ఆఖరి ఓవర్లో 19, నటరాజన్ వేసిన 19 ఓవర్లో 15 పరుగులు వచ్చాయి.ఈ మ్యాచ్‌లో బర్త్ డే బాయ్ కమిన్స్‌ను బదోని, పూరన్ ఆడుకున్నారు. కమిన్స్ 4 ఓవర్లలో వికెట్ తీసి ఏకంగా 47 పరుగులు సమర్పించుకున్నాడు. నటరాజన్ సైతం ధారాళంగా పరుగులిచ్చాడు. నటరాజన్ 4 ఓవర్లలో ఏకంగా 50 పరుగులిచ్చాడు. అరంగేట్రం బౌలర్ (శ్రీలంక) విజయ్‌కాంత్ వియాస్కాంత్ (4-0-27-0) అకట్టుకున్నాడు. -
SRH: వాళ్లిద్దరు అద్భుతం.. నితీశ్‌రెడ్డి సూపర్: కమిన్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్- రాజస్తాన్ రాయల్స్ మధ్య గురువారం నాటి మ్యాచ్ ప్రేక్షకులను మునివేళ్ల మీద నిలబెట్టింది. నువ్వా- నేనా అన్నట్లుగా ఆఖరి బంతి వరకు సాగిన ఈ ఉత్కంఠ పోరు అసలైన టీ20 మజాను అందించింది.ఈ హోరాహోరీ పోరులో రాయల్స్‌పై సన్‌రైజర్స్ పైచేయి సాధించి సొంతగడ్డపై గెలుపు జెండా ఎగురవేసింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాలు అంబరాన్నంటాయి.ఇక గత రెండు మ్యాచ్‌లలో పరాజయాలు చవిచూసి ఎట్టకేలకు మళ్లీ గెలుపు బాట పట్టడంతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సైతం హర్షం వ్యక్తం చేశాడు.అసలైన టీ20 క్రికెట్ అంటే ఇదేటేబుల్ టాపర్ రాజస్తాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లపై కమిన్స్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన మ్యాచ్ ఇది.అసలైన టీ20 క్రికెట్ అంటే ఇదే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఆఖరి బంతిని సంధించేపుడు భువీ తన ప్రణాళికను పక్కాగా అమలు చేశాడు.మిడిల్ ఓవర్లలో వీలైనన్ని వికెట్లు తీసేందుకు ప్రయత్నించాం. అదృష్టవశాత్తూ ఆఖరి వరకు పోరాడగలిగాం. ఇక నటరాజన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. యార్కర్లు సంధించడంలో అతడు దిట్ట.ఉప్పల్‌లో మేము ఇప్పటికే చాలా మ్యాచ్‌లు ఆడాం. కాబట్టి 200 లక్ష్యమనేది ఛేదించగలిగే టార్గెట్ అని తెలుసు. అయితే, విజయం మమ్మల్ని వరించింది.అతడొక అద్భుతం అంతేఈరోజు నితీశ్ రెడ్డి పరిస్థితులను అర్థం చేసుకుని చక్కగా ఆడాడు. అతడొక అద్భుతం అంతే! ఫీల్డింగ్‌లోనూ రాణిస్తున్నాడు. బౌలర్‌గానూ తన వంతు సేవలు అందిస్తున్నాడు’’ అంటూ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి, పేసర్లు భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌ల ఆట తీరును ప్యాట్ కమిన్స్ కొనియాడాడు.కాగా ఉప్పల్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(44 బంతుల్లో 58) శుభారంభం అందించగా.. నాలుగో స్థానంలో వచ్చిన నితీశ్ రెడ్డి దుమ్ములేపాడు.42 బంతులు ఎదుర్కొన్న ఈ యువ ఆటగాడు 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్ల పాటు ఏకంగా 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక విధ్వంసకర వీరుడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి తన బ్యాట్ పవర్ చూపించాడు.కేవలం 19 బంతుల్లోనే 42 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ కేవలం 3 వికెట్ల నష్టపోయి 201 పరుగులు సాధించింది.లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్‌ను భువీ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ జోస్ బట్లర్(0), వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్(3)ను డకౌట్ చేశాడు.ఇక 40 బంతుల్లో 67 పరుగులతో ప్రమాదకరంగా మారుతున్న యశస్వి జైస్వాల్ వికెట్‌ను నటరాజన్ తన ఖాతాలో వేసుకోగా.. టాప్ స్కోరర్ రియాన్ పరాగ్(77)ను కమిన్స్ పెవిలియన్‌కు పంపాడు.నరాలు తెగే ఉత్కంఠఈ క్రమంలో చివరి 3 ఓవర్లలో రాయల్స్ విజయ సమీకరణం 27 పరుగులుగా మారగా.. అప్పటికి చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయల్స్ సునాయాసంగానే లక్ష్యాన్ని ఛేదిస్తుందని అంతా భావించారు.అయితే, రైజర్స్ పేసర్లు అంతా తలకిందులు చేశారు. 18వ ఓవర్లో నటరాజన్, 19వ ఓవర్లో కమిన్స్ తలా కేవలం ఏడు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. చివరి ఓవర్లో సమీకరణం 13 పరుగులు మారింది.అప్పుడు బంతిని అందుకున్న భువీ బౌలింగ్‌లో తొలి ఐదు బంతుల్లో 11 పరుగులు వచ్చాయి. చివరి బంతికి 2 పరుగులు అవసరమైన వేళ రోవ్‌మన్ పావెల్‌ను భువీ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో గట్టెక్కింది. భువీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.Jumps of Joy in Hyderabad 🥳Terrific turn of events from @SunRisers' bowlers as they pull off a nail-biting win 🧡Scorecard ▶️ https://t.co/zRmPoMjvsd #TATAIPL | #SRHvRR pic.twitter.com/qMDgjkJ4tc— IndianPremierLeague (@IPL) May 2, 2024 -
SRH: మా జట్టు సూపర్.. దూకుడుగా ముందుకొస్తాం: కమిన్స్
ఐపీఎల్-2024లో దూకుడైన ఆటతో ముందుకు వస్తామంటున్నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్. తాజా ఎడిషన్‌ను గెలుపుతో మొదలుపెట్టి శుభారంభంతో ఆరెంజ్ ఆర్మీని ఖుషీ చేస్తామని పేర్కొన్నాడు. గత మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న ఎస్ఆర్హెచ్ ఈసారి పలు మార్పులతో బరిలోకి దిగనుంది. వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారా స్థానంలో న్యూజిలాండ్ దిగ్గజ స్పిన్నర్ డానియెల్ వెటోరిని హెడ్‌కోచ్‌గా నియమించింది. అదే విధంగా సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్ స్థానంలో డబ్ల్యూటీసీ 2021-23, వన్డే వరల్డ్‌కప్-2023 విజేత, ఆసీస్ సారథి కమిన్స్‌కు పగ్గాలు అప్పగించింది. మినీ వేలంలో ఏకంగా రూ. 20. 50 కోట్లు ఖర్చు చేసి మరీ ఈ పేస్ బౌలర్‌ను కొనుగోలు చేసింది. ఇక మార్చి 22న ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభం కానుండగా.. మార్చి 23న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘శుభారంభం కోసం ఎదురు చూస్తున్నాం. ఏదేమైనా టీ20 ఫార్మాట్ ఆడటం కాస్త కష్టంగానే ఉంటుంది. కేకేఆర్‌కు మంచి జట్టు ఉంది. అయితే, మేము కూడా తక్కువేమీ కాదు. దూకుడైన ఆటతో తాజా సీజన్‌ను ఆరంభించాలని చూస్తున్నాం. మా జట్టు అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల సమ్మేళనం. భువీ ఉన్నాడు. గతేడాది మార్క్రమ్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. వీరితో పాటు అభిషేక్, ఉమ్రాన్ మాలిక్ వంటి యంగ్ టాలెంట్‌కు కూడా కొదువలేదు. కొత్త సభ్యులతో కలిసి ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నాడు. కొత్త సీజన్ కోసం అభిమానులు సిద్ధంగా ఉండాలంటూ ఆరెంజ్ ఆర్మీకి కమిన్స్ పిలుపునిచ్చాడు. 𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧 𝐂𝐮𝐦𝐦𝐢𝐧𝐬’ 𝐟𝐢𝐫𝐬𝐭 𝐝𝐚𝐲 𝐚𝐬 𝐚 𝐑𝐢𝐬𝐞𝐫 🤩🧡 pic.twitter.com/JWSJ40WwsF — SunRisers Hyderabad (@SunRisers) March 21, 2024 -
శతక్కొట్టిన రాణా.. 5 వికెట్లతో చెలరేగిన భువీ! రహానే మళ్లీ..
Ranji Trophy 2023-24- Mumbai vs Uttar Pradesh: రంజీ ట్రోఫీ 2023-24లో ఉత్తరప్రదేశ్ ముంబై జట్టుపై గెలుపొందింది. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో ఆఖరికి 2 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ముంబైతో మ్యాచ్‌లో యూపీ కెప్టెన్ నితీశ్ రాణా శతక్కొట్టగా.. పేసర్ భువనేశ్వర్ కుమార్ మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. మరో యువ పేసర్ ఆకిబ్ ఖాన్ సైతం అద్భుతంగా రాణించి జట్టు విజయానికి తానూ కారణమయ్యాడు. కాగా ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ తొలుత బౌలింగ్ చేసింది. కొనసాగుతున్న రహానే వైఫల్యం ముంబై కెప్టెన్ అజింక్య రహానే వైఫల్యం కొనసాగగా.. వికెట్ కీపర్ ప్రసాద్ పవార్(36), షమ్స్ ములానీ చెప్పుకోదగ్గ(57)ప్రదర్శన చేశారు. మిగతా వాళ్లు నామమాత్రపు స్కోరుకే పరిమితం కావడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే ఆలౌట్ అయింది. రాణా శతకం యూపీ బౌలర్లలో భువీ రెండు, అంకిత్ రాజ్‌పుత్ మూడు, ఆకిబ్ ఖాన్ మూడు, శివం శర్మ రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఉత్తరప్రదేశ్‌కు ఓపెనర్ సమర్థ్ సింగ్(63) శుభారంభం అందించగా.. కెప్టెన్ నితీశ్ రాణా(106) శతక్కొట్టాడు. దూబే సెంచరీ కొట్టినా దీంతో 324 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించిన యూపీ 126 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబై శివం దూబే(117) మెరుపు శతకం కారణంగా.. 320 పరుగులు చేయగలిగింది. కాగా ముంబై రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్, మిడిలార్డర్‌ను ఆకిబ్ ఖాన్, భువీ కుప్పకూల్చారు. ఆకిబ్ టాప్-3 వికెట్లు పడగొట్టగా.. భువీ మొత్తం మూడు వికెట్లు తీశాడు. దూబే రూపంలో కరణ్ శర్మ కీలక వికెట్ దక్కించుకున్నాడు. రెండు వికెట్ల తేడాతో విజయం ఈ క్రమంలో ముంబై విధించిన 195 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ 8 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. యూపీ కెప్టెన్ నితీశ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్‌లోనూ ముంబై సారథి అజింక్య రహానే బ్యాటింగ్ వైఫల్యం కొనసాగింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 17 (8, 9) పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న అతడు ఇప్పటి వరకు రంజీ-2024లో ఒక్కటైనా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. మరోవైపు టీమిండియా తరఫున రీ ఎంట్రీలో టీ20లలో సత్తా చాటిన శివం దూబే అద్భుత బ్యాటింగ్ తీరుతో టెస్టు రేసులోకి దూసుకురావడం విశేషం. చదవండి: Ind Vs Eng 2nd Test: విశాఖ టెస్టు.. విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ -
రాణించిన నితీశ్ రాణా.. చెలరేగిన భువనేశ్వర్ కుమార్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో టీమిండియా క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్, నితీశ్ రాణా సత్తా చాటారు. నిన్న గుజరాత్‌తో జరిగిన ప్రీక్వార్టర్‌ఫైనల్-1లో ఈ ఇద్దరు ఉత్తర్‌ప్రదేశ్ ఆటగాళ్లు ఆయా విభాగాల్లో రాణించారు. తొలుత బౌలింగ్‌లో భువీ.. ఆతర్వాత బ్యాటింగ్‌లో రాణా చెలరేగారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ను భువనేశ్వర్ కుమార్ (4-0-21-3) దారుణంగా దెబ్బకొట్టాడు. భువీతో పాటు మోహిసిన్ ఖాన్ (4-0-13-2), నితీశ్ రాణా (1-0-9-1), ధన్కర్ (3-0-21-1), కార్తీక్ త్యాగి (4-0-27-1) రాణించడంతో గుజరాత్ 127 పరుగులకు (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సౌరవ్ చౌహాన్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూపీ.. రాణా (49 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రాణాతో పాటు సమీర్ రిజ్వి (30) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టగా.. చింతన్ గజా, హేమంగ్ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు. నిన్ననే జరిగిన క్వార్టర్‌ఫైనల్-2లో బెంగాల్‌పై అస్సాం 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. నవంబర్ 2న మరో రెండు ప్రీ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
స్కై, కేన్లకు టీ20, టెస్ట్ ప్లేయర్ అవార్డులు.. శుభ్‌మన్‌కు డబుల్ ధమాకా
2023 CEAT క్రికెట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిన్న (ఆగస్ట్ 21) దేశ వాణిజ్య రాజధాని ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి క్రికెట్‌తో పాటు ఇతర రంగాలకు చెందిన చాలామంది సెలెబ్రిటీలు హాజరయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో (మూడు ఫార్మాట్లలో) అత్యుత్తమ ప్రదర్శన (రేటింగ్స్ ఆధారంగా) కనబర్చిన ఆటగాళ్లను CEAT జ్యూరీ అవార్డులకు ఎంపిక చేసింది. టీ20 బ్యాటర్ ఆఫ్ ద ఇయర్‌గా టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఎంపిక కాగా.. టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ దక్కించుకున్నాడు. టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. గిల్‌కు ఈ రెండు అవార్డులను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందజేశాడు. ఈ ఏడాది వన్డేల్లో భీకర ఫామ్‌లో ఉన్న గిల్.. ఇప్పటివరకు జరిగిన 12 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 750 పరుగులు చేయగా.. స్కై.. ఈ ఏడాది ఇప్పటివరకు ఆడిన 10 టీ20ల్లో 433 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు టీమిండియా స్టార్లు గతేడాది సైతం ఆయా ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా స్కై 2022లో టాప్ టీ20 రన్స్ స్కోరర్‌గా (187.43 స్ట్రయిక్‌రేట్‌తో 46.56 సగటున 1164 పరుగులు) నిలిచాడు. ఇందులో 68 సిక్సర్లు ఉన్నాయి. CEAT అవార్డులు గెలుచుకున్న ఇతరుల వివరాలు.. టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్: భువనేశ్వర్ కుమార్ ఇన్నోవేటెడ్ కోచ్ ఆఫ్ ద ఇయర్: బ్రెండన్ మెక్కల్లమ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: దీప్తి శర్మ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా దీప్తి శర్మ అవార్డును అందుకుంది. -
ప్రపంచ రికార్డు సమం చేసిన బుమ్రా
ఐర్లాండ్‌తో రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఓ ప్రపంచ రికార్డు సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను (ఛేదనలో) మెయిడిన్ చేసిన బుమ్రా.. అంతర్జాతీయ టీ20ల్లో (ఐసీసీ ఫుల్‌టైమ్ సభ్యదేశాలు పాల్గొన్న మ్యాచ్‌లు) అత్యధిక మెయిడిన్ ఓవర్లు (10) వేసిన బౌలర్‌గా సహచరుడు భువనేశ్వర్ కుమార్ రికార్డును సమం చేశాడు. భువీ 87 టీ20ల్లో 10 మెయిడిన్లు వేస్తే, బుమ్రా తన 62వ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించాడు. ఈ విభాగంలో భువీ, బుమ్రాల తర్వాత బంగ్లాదేశ్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (6), శ్రీలంక నువాన్ కులశేఖర (6) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఐర్లాండ్‌తో రెండో టీ20లో 4 ఓవర్లలో ఓ మెయిడిన్ వేసి 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టిన బుమ్రా మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (74) తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో చహల్ 96 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 90 వికెట్లతో భువనేశ్వర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఐర్లాండ్‌తో నిన్న (ఆగస్ట్ 20) జరిగిన రెండో టీ20లో టీమిండియా 33 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. తద్వారా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ (58), శాంసన్ (40), రింకూ సింగ్ (38), శివమ్ దూబే (22 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఐర్లాండ్ లక్ష్యానికి 34 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఆండ్రూ బల్బిర్నీ (72) టాప్ స్కోరర్‌గా నిలువగా.. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో 2 వికెట్లు, అర్షదీప్ సింగ్ ఓ వికెట్ పడగొట్టాడు. -
భువనేశ్వర్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
ఐపీఎల్లో టీమిండియా వెటరన్ పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ భువనేశ్వర్‌కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఐదు వికెట్ల హాల్‌తో పాటు 25 ప్లస్ పరుగులు చేసిన రెండో బౌలర్‌గా భువనేశ్వర్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2023లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లతో పాటు 27 పరుగులు చేసిన భువీ.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇకఈ ఘనత సాధించిన జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తొలి స్థానంలో ఉన్నాడు. గతంలో డెక్కన్ ఛార్జర్స్‌పై జడేజా 48 పరుగులతో పాటు ఐదు వికెట్లు సాధించాడు. ఇక గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో భువీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన భువనేశ్వర్.. కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఓ రనౌట్‌లో కూడా భాగమయ్యాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో భువీ తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి ఐదు వికెట్లు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గుజరాత్ చేతిలో 34 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమిపాలైంది. దీంతో ప్లేఆఫ్ రేసు నుంచి సన్‌రైజర్స్ అధికారికంగా నిష్క్రమించింది. చదవండి: నువ్వేం తింటావు? గుజరాత్లో ఉన్నాను.. నాకిష్టమైన తిండి దొరకదు కదా: షమీ వ్యాఖ్యలు వైరల్ -
LSG VS PBKS: ఆ ఒక్కడే తప్పించుకున్నాడు.. అప్పుడు భువీ..!
ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం విధితమే. ఒక్కరు కూడా సెంచరీ చేయకపోయినా లక్నో బ్యాటర్లు ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ (257) నమోదు చేశారు. కైల్ మేయర్స్ (54), ఆయూష్ బదోని (43), స్టోయినిస్ (72), పూరన్ (45) విధ్వంసం ధాటికి పంజాబ్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. అయితే లక్నో బ్యాటర్ల బారి నుంచి ఒక్క పంజాబ్ బౌలర్ మాత్రం తప్పించుకున్నాడు. అతడే రాహుల్ చాహర్.ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించగా, రాహుల్ చాహర్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. తన కోటా 4 ఓవర్లను అద్భుతంగా బౌల్ చేసిన చాహర్.. 29 పరుగులు మాత్రమే ఇచ్చి, శివాలెత్తి ఉన్న లక్నో బ్యాటర్లను కట్టడి చేశారు. మరోవైపు మిగతా పంజాబ్ బౌలర్లు లక్నో బ్యాటర్ల ఊచకోతను విలవిలలాడిపోయారు. గుర్నూర్ సింగ్ బ్రార్ 3 ఓవర్లలో 42 పరుగులు, అర్షదీప్ సింగ్.. తన ఐపీఎల్ కెరీర్లో అత్యంత చెత్త గణాంకాలు (4-0-54-1), రబాడ 4 ఓవర్లలో 52 పరుగులు, సికందర్ రజా ఒక ఓవర్లో 17, సామ్ కర్రన్ 3 ఓవర్లలో 38, లివింగ్‌స్టోన్ ఒక ఓవర్లో 19 పరుగులు సమర్పించుకున్నారు. ఛేదనలో పంజాబ్ ఆటగాళ్ల ధాటికి లక్నో బౌలర్లు సైతం భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ.. యశ్ ఠాకూర్ (4/37), నవీన్ ఉల్ హాక్ (3/30) క్రమం తప్పకుండా వికెట్లు తీసి ప్రత్యర్ధి ఓటమిని ఖరారు చేశారు. రవి బిష్ణోయ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ, 2 కీలక వికెట్లు (అథర్వ టైడే (66), లివింగ్‌స్టోన్ (23)) తీశాడు. అప్పట్లో భువీ కూడా ఇంతే.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ (ఆర్సీబీ- 263) నమోదైన మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో ఓ బౌలర్ ఆర్సీబీ బౌలర్ల బారి నుంచి తప్పించుకున్నాడు. నాటి మ్యాచ్‌లో పూణే బౌలర్లంతా విచ్చలవిడిగా పరుగులు సమర్పించుకుంటే.. ఒక్క భువనేశ్వర్ కుమార్ మాత్రం తాండవం చేస్తుండిన ఆర్సీబీ బ్యాటర్లను, ముఖ్యంగా అప్పటికే ఊగిపోతున్న క్రిస్ గేల్‌ను కట్టడి చేశాడు. ఆ మ్యాచ్‌లో భువీ 4 ఓవర్లు వేసి కేవలం 23 పరుగులు మాత్రమే ఇవ్వగా.. మిగతా బౌలర్లంతా 12 నుంచి 29 ఎకానమీ మధ్యలో పరుగులు సమర్పించుకున్నారు. -
14 ఏళ్ల కిందట తండ్రికి ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న అర్జున్ టెండూల్కర్
ముంబై ఇండియన్స్ యువ పేసర్ అర్జున్ టెండూల్కర్ తన తండ్రి సచిన్ టెండూల్కర్‌కు 14 ఏళ్ల కిందట జరిగిన ఓ అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. అది కూడా ఎక్కడైతే తన తండ్రికి ఆ అవమానం జరిగిందో అదై మైదానంలో. వివరాల్లోకి వెళితే.. ఐపీఎల్-2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో అదిరిపోయే విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టి, రెండు వరుస పరాజయాల తర్వాత హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. కెమారూన్ గ్రీన్ (64 నాటౌట్), తిలక్ వర్మ (37) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మరో బంతి మిగిలుండగానే 178 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. చదవండి: సచిన్ కొడుకుతో అట్లుటంది మరి.. శబాష్ అర్జున్! వీడియో వైరల్ సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (48), హెన్రిచ్ క్లాసెన్ (36) ఓ మోస్తరుగా రాణించగా.. ముంబై బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసిన సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అందరి మన్ననలు అందుకుని శభాష్ అనిపించుకున్నాడు. సన్‌రైజర్స్ గెలుపుకు ఆఖరి ఓవర్లో 20 పరుగులు అవసరం కాగా, అర్జున్.. భువనేశ్వర్ కుమార్ వికెట్ తీసుకుని కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబైని గెలిపించాడు. ఐపీఎల్లో అర్జున్‌కు ఇది తొలి వికెట్. అర్జున్.. భువీని ఔట్ చేయడం ద్వారా 14 ఏళ్ల క్రితం ఇదే మైదానంలో తండ్రి సచిన్‌కు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. నాడు భువీ.. సచిన్‌ను ఓ రంజీ మ్యాచ్‌లో ఇదే వేదికపై డకౌట్ చేశాడు. రంజీల్లో సచిన్‌ను డకౌట్ చేసిన ఏకైక బౌలర్ భువీ ఒక్కడే. తాజాగా భువీని అదే మైదానంలో ఔట్ చేయడం ద్వారా అర్జున్, తన తండ్రికి ఎదురైన చేదు అనుభవానికి ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. చదవండి: నీ ఆటకు ఓ దండం రా బాబు.. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో పో! -
వాళ్లదే పైచేయి; డెత్ ఓవర్ల స్పెషలిస్టులు ఉన్నారు.. మాకేం భయం లేదు: మార్కరమ్
IPL 2023- Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: ‘‘శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్ కేకేఆర్‌కు పూర్తి న్యాయం చేస్తున్నారు. కీలక సమయాల్లో అద్భుతంగా రాణించారు. నిజానికి కేకేఆర్ దూకుడైన ఆటతో ముందుకు సాగుతోంది. సమిష్టిగా రాణిస్తే వారిని తట్టుకోవడం కష్టమే. ప్రతి ఒక్కరికి తమ రోజంటూ ఒకటి ఉంటుంది. నిజానికి కేకేఆర్ రూపంలో మాకు భారీ ముప్పు ఎదురుకాబోతుంది. అయితే, మా బలాలు ఏమిటో మాకు తెలుసు. మా ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే గనుక అనుకున్న ఫలితాలను రాబట్టగలం. శార్దూల్, రింకూలు అద్భుతంగా ఫినిషింగ్ చేస్తున్నారు. అయితే, మా బౌలర్లపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలరు’’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ అన్నాడు. వరుస ఓటములు తర్వాత కాగా ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మూడింట ఒకటి మాత్రమే గెలిచింది ఎస్ఆర్హెచ్. సొంతమైదానంలో రాజస్తాన్ రాయల్స్‌తో తమ ఆరంభ మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ మార్కరమ్ దూరం కాగా.. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో ఓడి పరాజయంతో పదహారో ఎడిషన్‌ను ఆరంభించింది. ఇక రెండో మ్యాచ్‌కు మార్కరమ్ అందుబాటులోకి రాగా లక్నో సూపర్ జెయింట్స్‌లో చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తర్వాత.. ఉప్పల్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొంది.. ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసింది. కేకేఆర్‌తో మ్యాచ్ ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ శుక్రవారం తమ నాలుగో మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కెప్టెన్ మార్కరమ్.. తమ బౌలర్లపై నమ్మకం ఉందంటూ ధీమా వ్యక్తం చేశాడు. కేకేఆర్‌కు గత రెండు మ్యాచ్‌లలో విజయాలు అందించిన శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్‌లను చూసి తామేమీ బెదిరిపోవడం లేదని.. వాళ్లను కట్టడి చేసే వ్యూహాలు రచించామని పేర్కొన్నాడు. ముఖాముఖి పోరులో మాత్రం కేకేఆర్‌తో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ కేవలం 8 మ్యాచ్‌లలో మాత్రమే గెలుపొందింది. మిగిలిన 15 సార్లు విజయం కేకేఆర్‌నే వరించింది. ఇక ఈడెన్ గార్డెన్స్‌లో సైతం కోల్‌కతాదే పైచేయి. సొంతమైదానంలో ఎస్ఆర్హెచ్తో ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో కేకేఆర్ ఆరింట గెలుపొందింది. ఇక 2020 తర్వాత సన్‌రైజర్స్ కేవలం ఇక్కడ ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. మీకు తెలుసా? సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి ఇంత వరకు ఒక్కసారి కూడా సునిల్ నరైన్ బౌలింగ్‌లో అవుట్ కాలేదు. నరైన్ బౌలింగ్‌లో త్రిపాఠి 150కి పైగా స్ట్రైక్‌రేటుతో ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. ఇక మార్కరమ్ కేకేఆర్‌తో చివరి మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో 20 బంతుల్లో 40 పరుగులు రాబట్టాడు. సమిష్టిగా పోరాడితేనే సన్‌రైజర్స్ పేస్ దళానికి నాయకుడు టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్. అతడితో పాటు ప్రొటిస్ ఫాస్ట్‌బౌలర్ మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ ఉన్నారు. ఇక స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, గత మ్యాచ్ హీరో మయాంక్ మార్కండే మరోసారి రాణించాలని ఎస్ఆర్హెచ్ కోరుకుంటోంది. తుది జట్టులో బౌలింగ్ విభాగంలో మార్కండే, జాన్సెన్, భువీ, ఉమ్రాన్ మాలిక్‌కు కచ్చితంగా చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బ్యాటింగ్ విభాగంలో టాపార్డర్ రాణిస్తేనే కోల్‌కతాను నిలువరించడం సన్‌రైజర్స్‌కు సాధ్యమవుతుంది. కేకేఆర్‌తో మ్యాచ్ సన్‌రైజర్స్ తుది జట్టు అంచనా మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: ఒకప్పుడు పర్పుల్ క్యాప్ విన్నర్.. తర్వాత నెట్‌బౌలర్! 6.5 కోట్ల నుంచి 50 లక్షల ధరకు.. దుమ్ము రేపుతున్నాడు.. సన్‌రైజర్స్ వదిలేసి పెద్ద తప్పు చేసింది! ఎవరంటే? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మూడేళ్ల తర్వాత హోంగ్రౌండ్లో.. ఎస్ఆర్హెచ్ షెడ్యూల్ ఇదే
ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 16వ సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మార్చి 31 నుంచి మే 28 వరకు జరగనున్న ఐపీఎల్ 2023లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, సీఎస్కే మధ్య జరగనుంది. ఇక కరోనా కారణంగా మూడేళ్ల పాటు సొంత ప్రేక్షకుల మధ్య మ్యాచ్‌లు ఆడలేకపోయిన ఆయా జట్లు ఈసారి మాత్రం హోంగ్రౌండ్లో ఆడబోతున్నాయి. దీంతో అభిమానులు సంతోషంలో మునిగితేలుతున్నారు. ఇక చాలా రోజుల తర్వాత మరోసారి ఐపీఎల్ హైదరాబాద్‌కు తిరిగి వస్తోంది. గత మూడు సీజన్లుగా కరోనా కారణంగా ఈ మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోయింది. అయితే ఈసారి ఉప్పల్ స్టేడియం మరోసారి ఐపీఎల్ అభిమానుల కేరింతలతో మురిసిపోనుంది. ఎస్ఆర్హెచ్ ఏడు మ్యాచ్‌లను హోంగ్రౌండ్లో.. మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో తటస్థ వేదికల్లో ఆడనుంది. ఈసారి ఎస్ఆర్హెచ్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది. గతేడాది 8వ స్థానంలో నిలిచి నిరాశ పరిచిన సన్ రైజర్స్ సొంతగడ్డపై చెలరేగాలని చూస్తోంది. సన్ రైజర్స్ టీమ్ గ్రూప్ బిలో ఉంది. ఎస్ఆర్హెచ్ పూర్తి జట్టు: అబ్దుల్ సమద్, ఐడెన్ మర్క్రామ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్హాక్ ఫారూఖీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్, సంవ్రక్రాంత్ మర్కండే, మయన్క్రాంత్ మర్కండే వ్యాస్, సన్వీర్ సింగ్, ఉపేంద్ర యాదవ్, మయాంక్ దాగర్, నితీష్ కుమార్ రెడ్డి, అకేల్ హోసేన్, అన్మోల్ప్రీత్ సింగ్, హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్. సన్ రైజర్స్ పూర్తి షెడ్యూల్: ఏప్రిల్ 2 - సన్ రైజర్స్ vs రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్ ఏప్రిల్ 7 - లక్నో సూపర్ జెయింట్స్ vs సన రైజర్స్, లక్నో ఏప్రిల్ 9 - సన్ రైజర్స్ vs పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ ఏప్రిల్ 14 - కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్ రైజర్స్, కోల్‌కతా ఏప్రిల్ 18 - సన్ రైజర్స్ vs ముంబై ఇండియన్స్, హైదరాబాద్ ఏప్రిల్ 21 - చెన్నై సూపర్ కింగ్స్ vs సన్ రైజర్స్, చెన్నై ఏప్రిల్ 24 - సన్ రైజర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్ ఏప్రిల్ 29 - ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్ రైజర్స్, ఢిల్లీ మే 4 - సన్ రైజర్స్ vs కోల్‌కతా నైట్ రైజర్స్, హైదరాబాద్ మే 7 - రాజస్థాన్ రాయల్స్ vs సన్ రైజర్స్, జైపూర్ మే 13 - సన్ రైజర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, హైదరాబాద్ మే 15 - గుజరాత్ టైటన్స్ vs సన్ రైజర్స్, అహ్మదాబాద్ మే 18 - సన్ రైజర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్ మే 21 - ముంబై ఇండియన్స్ vs సన్ రైజర్స్, ముంబై 4️⃣4️⃣ days before we're #BackInUppal 😍#OrangeArmy, block your dates and get ready to back your #Risers in the #TataIPL2023 🔥 pic.twitter.com/HFABNikrCi — SunRisers Hyderabad (@SunRisers) February 17, 2023 చదవండి: ఐపీఎల్ 2023 షెడ్యూల్ విడుదల.. మార్చి 31న షురూ -
చహల్ అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్‌గా!
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా చహల్ నిలిచాడు. లక్నో వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఒక్క వికెట్ పడగొట్టిన చహల్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. చహల్ 75 మ్యాచ్‌ల్లో 91 వికెట్లు సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్(90) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో భువీ రికార్డును చహల్ బ్రేక్ చేశాడు. ఇక ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కివీస్ వెటరన్ పేసర్ టిమ్ సౌథీ (107 మ్యాచ్‌ల్లో 134) అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ (109 మ్యాచ్‌ల్లో 128), రషీద్ ఖాన్ (74 మ్యాచ్‌ల్లో 122) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. చదవండి: బుమ్రా 'ఓ బేబీ బౌలర్'.. దారుణంగా అవమానించిన పాక్ మాజీ ఆటగాడు -
లంకతో మూడో టీ20.. భారీ రికార్డుపై కన్నేసిన చహల్
IND VS SL 3rd T20: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. రాజ్‌కోట్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 7) జరుగనున్న నిర్ణయాత్మక మూడో టీ20లో చహల్ (73 మ్యాచ్‌ల్లో 88) మరో 3 వికెట్లు తీస్తే, భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ పేరిట ఉంది. భువీ.. 87 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కివీస్ వెటరన్ పేసర్ టిమ్ సౌథీ (107 మ్యాచ్‌ల్లో 134) అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ (109 మ్యాచ్‌ల్లో 128), రషీద్ ఖాన్ (74 మ్యాచ్‌ల్లో 122) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా, శ్రీలంక చెరో మ్యాచ్ గెలువగా, ఇవాళ జరుగబోయే మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. రెండు జట్లు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. తుది జట్ల విషయానికొస్తే.. భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో విఫలమైన శుభ్‌మన్ గిల్, అర్షదీప్ స్థానాల్లో రుతురాజ్, ముకేశ్ కుమార్ ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. లంక విషయానికొస్తే.. రెండో టీ20లో బరిలోకి దిగిన జట్టే యధాతథంగా కొనసాగవచ్చు. తుది జట్లు (అంచనా) భారత్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్/శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, అక్షర్ పటేల్, చహల్, ముఖేశ్ కుమార్/అర్ష్‌దీప్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్. శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిసాంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, భనుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మదుషంక, కసున్ రజిత. -
IND v SL 2023: విరామం... విశ్రాంతి... వేటు..! బీసీసీఐకి ఇదేం కొత్త కాదు!
బీసీసీఐకి ఇది కొత్త కాదు... ఏదైనా సిరీస్ కోసం జట్టును దాదాపు అర్ధరాత్రి సమయంలో ప్రకటించడమే కాదు... పేర్లు మినహా ఎంపిక గురించి కనీసం ఏకవాక్య సమాచారం కూడా ఇవ్వకపోవడం రివాజుగా మారింది. ఫలానా ఆటగాడిపై వేటు వేశామనో, ఫిట్నెస్ లేదనో, లేదంటే విశ్రాంతినిచ్చామనో, లేదా ఆటగాడు కోరుకుంటే విరామం ఇచ్చామనో ఏమీ ఉండదు... తగిన కారణం లేకుండా ఆటగాళ్లు పేర్లు మాత్రం మారిపోతాయి. మరో వైపు ఉద్వాసనకు గురైన సెలక్షన్ కమిటీతోనే కొత్త జట్లను కూడా ఎంపిక చేయించడం కూడా ఆశ్చర్యం కలిగించే అంశం. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీలంకతో సిరీస్‌లకు ప్రకటించిన జట్లను విశ్లేషిస్తే... వచ్చే ఏడాది స్వదేశంలోనే వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో సీనియర్ సెలక్షన్ కమిటీ కీలక ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గించే నిర్ణయాలే తీసుకుంది. అందువల్లే రోహిత్, కోహ్లి, రిషభ్ పంత్, బుమ్రా, రాహుల్‌లను ఎంపిక చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకుంది. అందులో కొందరిని టి20లకు తీసుకుంటే... మరికొందరిని వన్డేలకు ఎంపిక చేసింది. బుమ్రాలాంటి ఆటగాడిని ప్రపంచకప్ దృష్టితో చూసి ఏ సిరీస్‌కూ ఎంపిక చేయలేదు. నిజానికి అతను ఫిట్‌గానే ఉన్నాడు. అయితే తొందరపడి వెంటనే అంతర్జాతీయ క్రికెట్ బరిలో ఇప్పుడపుడే దింపకూడదని సెలక్టర్లు భావించారు. బంగ్లాలో గాయపడిన రోహిత్ ప్రస్తుతం కోలుకున్నాడు. నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇంకో వారం, పదిరోజుల్లో అతను పూర్తి ఫిట్నెస్ సంతరించుకుంటాడు. అందువల్లే అతన్ని వన్డేలకు ఎంపిక చేశారు. మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కోహ్లి, కేఎల్ రాహుల్ విశ్రాంతి కోరకపోయినప్పటికీ సెలక్టర్లే టి20లకు రెస్ట్ ఇచ్చి వన్డే జట్టులోకి తీసుకున్నారు. బుమ్రాను ప్రపంచకప్ దృష్టితో చూసినట్టే... రిషభ్ పంత్‌ను సొంతగడ్డపై ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం బ్రేక్ ఇచ్చారు. కంగరూతో సిరీస్‌లో కీలకపాత్ర పోషించగలడని భావిస్తున్న పంత్‌ను కండిషనింగ్ క్యాంపునకు పంపారు. ఈ ఏడాది అతను అన్ని ఫార్మాట్లలో కలిపి 44 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. బిజీ షెడ్యూలు నుంచి కాస్త తెరిపినివ్వాలనే ఉద్దేశంతోనే అతన్ని బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి పంపారు. జడేజా విషయానికి వస్తే ముందుగా అతని మ్యాచ్ ఫిట్నెస్ను పరిశీలించాకే జాతీయ జట్టులోకి తీసుకోవాలని సెలక్షన్ కమిటీ భావించింది. గత సీజన్లో పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకున్న ప్రసిధ్ కృష్ణ, ఆల్‌రౌండర్ దీపక్ చహర్ గాయాల నుంచి ఇంకా వంద శాతం కోలుకోలేదు. సీనియర్ సీమర్ భువనేశ్వర్‌ను అసలు పరిశీలించలేదు. దీంతో వచ్చే ప్రపంచకప్‌లో ఆడే టీమిండియా జట్టులో భువనేశ్వర్ భాగంగా లేడని సెలక్టర్లు సంకేతాలు ఇచ్చినట్లయింది. స్పిన్నర్లలో అనుభవజ్ఞుడైన చహల్పైనే సెలక్టర్లు నమ్మకముంచారు. దీంతో రవి బిష్ణోయ్‌కి అవకాశం లేకపోయింది. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, హైదరాబాద్ పేసర్ సిరాజ్‌లు ఫామ్‌లోనే ఉన్నారు. వారి ఆటతీరుపై సెలక్టర్లకు అసంతృప్తి ఏమీ లేదు... కానీ పొట్టి సిరీస్‌కు మాత్రం వీళ్లిద్దరికి విశ్రాంతినిచ్చింది. భావి కెప్టెన్ అంచనాలతో... హార్దిక్ పాండ్యా నాయకత్వ సత్తా ఏంటో ఐపీఎల్లో ఒకే ఒక్క సీజన్‌తో చాటిచెప్పాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలోనూ పగ్గాలు చేపట్టి జట్టును నడిపించాడు. ఈ నేపథ్యంలో భావి కెప్టెన్ అంచనాలున్న ఆల్‌రౌండర్ పాండ్యాకు జట్టులో ఒక రకంగా పూర్తి స్థాయి వైస్ కెప్టెన్సీతో పదోన్నతి ఇచ్చారు. టాపార్డర్‌లో ఇటీవల మంచి అవకాశాలు కల్పించినప్పటికీ పేలవమైన ఆటతీరు కనబరిచిన ధావన్‌పై సెలక్టర్లు వేటు వేశారు. ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్‌లాంటి ప్రతిభావంతులు నిలకడగా రాణిస్తుండటంతో ఇక ధావన్ ఆటకు తెరపడినట్లే భావించవచ్చు. -సాక్షి క్రీడా విభాగం చదవండి: సిరీస్ ఓటమిపై బీసీబీ ఆగ్రహం.. ఉన్నపళంగా రాజీనామా -
చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్
టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా నిన్న (నవంబర్ 6) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు (10) సంధించిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీసిన భువీ.. ఆ ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మొయిడిన్ చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్ల రికార్డును సహచరుడు జస్ప్రీత్ బుమ్రాతో కలిసి షేర్ చేసుకున్న భువీ.. తాజాగా ఈ అరుదైన రికార్డను తన పేరిట లఖించుకున్నాడు. ఓవరాల్‌గా పొట్టి ఫార్మాట్లో అత్యధిక మెయిడిన్ ఓవర్ల రికార్డు విండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ పేరటి ఉంది. నరైన్ టీ20ల్లో మొత్తం 27 మెయిడిన్ ఓవర్లు బౌల్ చేశాడు. అతని తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఉన్నాడు. షకీబ్ ఖాతాలో 23 మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. వీరి తర్వాత విండీస్ లెగ్ స్పిన్నర్ శ్యాముల్ బద్రీ (21), భువనేశ్వర్ కుమార్ (21) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా పేసు గుర్రం బుమ్రా 19 మెయిడిన్లతో ఆరో ప్లేస్‌లో ఉన్నాడు. ఇదిలా ఉంటే, నిన్న జింబాబ్వేపై గెలుపుతో టీమిండియా గ్రూప్-2లో అగ్రస్థానంతో సెమీస్‌కు చేరుకుంది. ఈ గ్రూప్ నుంచి సెమీస్‌కు చేరిన రెండో జట్టుగా పాక్ నిలిచింది. అటు గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించాయి. నవంబర్ 9న జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్-పాకిస్తాన్‌లు.. ఆమరుసటి రోజు (నవంబర్ 10) జరిగే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్ల మధ్య నవంబర్ 13న ఫైనల్ జరుగుతుంది. -
బుమ్రా ప్రపంచ రికార్డు సమం చేసిన భువీ.. మరో అరుదైన రికార్డు కూడా..!
టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌల్ చేసిన భువీ.. రెండు మెయిడిన్లు వేసి తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. భువీ వేసిన సెన్సేషనల్ స్పెల్‌లో వరుసగా రెండు మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో భువీ.. బుమ్రా పేరిట ఉన్న అత్యధిక టీ20 మొయిడిన్ ఓవర్ల ప్రపంచ రికార్డును సమం చేయడంతో పాటు అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా రెండు మొయిడిన్లు సంధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మొయిడిన్ ఓవర్లు వేసిన రికార్డు బుమ్రా పేరిట ఉండేది. బుమ్రా 56 టీ20ల్లో 9 మొయిడిన్లు సంధించగా.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో భువీ (81 మ్యాచ్‌ల్లో 9 మెయిడిన్లు) బుమ్రా రికార్డును సమం చేశాడు. ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 56 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 62 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స) అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఛేదనలో టీమిండియా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఈ విజయంతో భారత్.. మెగా టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి గ్రూప్-2 టాపర్‌గా నిలిచింది. కాగా, టోర్నీ తొలి మ్యాచ్‌లో రోహిత్ సేన్.. పాక్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఆ మ్యాచ్‌లో కోహ్లి వీరోచితంగా పోరాడి టీమిండియాను ఒంటి చేత్తో గెలిపించాడు. -
T20 WC 2022: ఈ ముగ్గురిని ఎంపిక చేసి తప్పుచేశారా? వీళ్లకు బదులు..
T20 World Cup 2022- Indian Squad: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనే దేశాలు ఇప్పటికే జట్లను ప్రకటించాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి సైతం సెప్టెంబరు 12న 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. నలుగురిని స్టాండ్ బైగా ఎంపిక చేసింది. ఇక వరల్డ్‌కప్ కంటే ముందు రోహిత్ సేన స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. అయితే, 2-1తో ట్రోఫీ కైవసం చేసుకున్నప్పటికీ బౌలింగ్ వైఫల్యం, ఫీల్డింగ్ తప్పిదాలు కలవరపెట్టే అంశాలుగా పరిణమించాయి. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ ప్రధాన జట్టుకు ఎంపికైన కొంతమంది క్రికెటర్ల ఆట తీరు ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లను బీసీసీఐ ఎందుకు సెలక్ట్ చేసిందా? అని చాలా మంది పెదవి విరుస్తున్నారు. యజువేంద్ర చహల్ టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మూడు మ్యాచ్‌లలో తుది జట్టులో చోటు దక్కించుకున్న అతడు 9.12 ఎకానమీతో బౌలింగ్ చేసి.. రెండే రెండు వికెట్లు తీశాడు. ఇక ఆసియా కప్-2022 టీ20 టోర్నీలోనూ సూపర్-4లో శ్రీలంకతో మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టడం మినహా తన స్థాయికి తగ్గట్లు రాణించలేక నిరాశపరిచాడు యుజీ. ముఖ్యంగా స్లోగా బంతులు వేయడంలో విఫలమవుతున్నాడు. సమకాలీన లెగ్ స్పిన్నర్లు ఆస్ట్రేలియాకు చెందిన ఆడం జంపా, అఫ్గనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ మాదిరి రాణించలేకపోతున్నాడు. దీంతో.. అతడి స్థానంలో యువ స్పిన్నర్ రవి బిష్ణోయిని ప్రధాన జట్టుకు ఎంపిక చేసినా బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అనుభవం దృష్ట్యా యుజీకి ఓటు వేయడమే సబబు అంటున్నారు అతడి ఫ్యాన్స్. భువనేశ్వర్ కుమార్ టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా పేరుగాంచిన పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తేలిపోయాడు. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన ఈ స్పీడ్‌స్టర్ 91 పరుగులు సమర్పించుకున్నాడు. గతేడాది వరకు టీమిండియా టీ20 అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా కొనసాగిన ఈ స్వింగ్ సుల్తాన్.. గాయం కారణంగా కొన్నిరోజులు జట్టుకు దూరమయ్యాడు. అయితే, తిరిగి జట్టులోకి వచ్చినా అవకాశాల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా డెత్‌ఓవర్లలో ఒత్తిడిని అధిగమించలేక విఫలమవుతున్నాడు. ఆసియా కప్-2022 టీ20 టోర్నీ, ఆసీస్‌తో సిరీస్‌లో డెత్ ఓవర్లలో అతడి వైఫల్యం కనబడింది. నకుల్ బాల్స్, కట్టర్లు వేయడంలో దిట్ట అయిన భువీ ప్రస్తుతం ఫామ్‌లేమితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ వెటరన్ పేసర్‌కు బదులు స్టాండ్ బైగా ఉన్నా దీపక్ చహర్‌ను ఎంపిక చేసినా బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీపక్ హుడా వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్న దీపక్ హుడా.. ఆసీస్‌తో సిరీస్‌కు సైతం ఎంపికయ్యాడు. అయితే, ఒక్క మ్యాచ్‌లోనూ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఇక వెన్ను నొప్పి కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. దీంతో.. ప్రపంచకప్ స్టాండ్ బై ప్లేయర్లలో ఒకడిగా ఉన్న స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో దీపక్ స్థానాన్ని భర్తీ చేశారు. నిజానికి దీపక్ టాపార్డర్‌లో మెరుగ్గా రాణించగలడు. అవసరమైనపుడు స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఒకవేళ గాయం నుంచి కోలుకుని ప్రపంచకప్ ఆరంభ సమయానికి అతడు అందుబాటులో ఉన్నా.. అతడు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌తో పాటు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా.. ఈ ఐదుగురు కచ్చితంగా తుది జట్టులో ఉంటారు. కాబట్టి టాపార్డర్‌లో దీపక్ హుడాతో పనిలేదు. ఇక బౌలింగ్ కారణంగా ఆల్‌రౌండర్ల జాబితాలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయనుకున్నా.. అక్షర్ పటేల్ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అదీ అసాధ్యంగానే కనిపిస్తుంది. అందుకే హుడాను ప్రపంచకప్‌నకు సెలక్ట్ చేసి కూడా పెద్దగా ఉపయోగం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ బ్యాకప్ బ్యాటర్ కావాలనుకుంటే లెఫ్ట్ హ్యాండర్ ఇషాన్ కిషన్ లేదంటే విలక్షణమైన బ్యాటర్‌గా పేరొందిన సంజూ శాంసన్‌ను ఎంపిక చేసినా బాగుండేదంటున్నారు విశ్లేషకులు. జట్టులో మార్పునకు సమయం ఉన్న తరుణంలో ఇప్పటికైనా మార్పులుచేర్పులు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. చదవండి: Sandeep Lamichhane: స్టార్ క్రికెటర్ కోసం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు -
ఇలాంటి ఫీల్డింగ్, బౌలింగ్‌తో కష్టమే.. కప్ కాదు కదా కనీసం!
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో టీమిండియా చెత్త ఫీల్డింగ్, బౌలింగ్‌తో తగిన మూల్యం చెల్లించుకుంది. ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇచ్చిన మూడు సులువైన క్యాచ్‌లను టీమిండియా ఆటగాళ్లు నేలపాలు చేయడం కొంపముంచింది. ఆ తర్వాత వికెట్లు పడి మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చినప్పటికి భువనేశ్వర్, హర్షల్ పటేల్‌లు తమ చెత్త బౌలింగ్‌తో చేజేతులా టీమిండియాను ఓడిపోయేలా చేశారు. భువనేశ్వర్ అయితే మరీ దారుణంగా బౌలింగ్ చేశాడు. 4ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయని భువీ ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకముందు హర్షల్ పటేల్ కూడా దారుణంగా విఫలమయ్యాడు. 4 ఓవర్లలో 49 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేదు. ఇక ఫ్రంట్‌లైన్ స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన చహల్ 3.2 ఓవర్లలోనే 42 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. ఇక ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికి.. బౌలింగ్ మాత్రం బాగా వేశాడు. ఒక దశలో టీమిండియా చేతుల్లోకి మ్యాచ్ వచ్చిందంటే అదంతా అక్షర్ పటేల్ చలవే. అక్షర్ ఒక్కడే 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా టీమిండియా తరపున టి20లు ఆడి చాలా కాలమైనప్పటికి.. ఉమేశ్ యాదవ్ 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అసలు ఫ్రంట్‌లైన్ పేసర్‌గా ఉన్న ఉమేశ్ యాదవ్‌ను రెండు ఓవర్లకే పరిమితం చేయడంలో రోహిత్ శర్మ అంతరం ఏంటో అర్థం కాలేదు. వాస్తవానికి తొలి ఓవర్లో ఉమేశ్ భారీగా పరుగులు ఇచ్చుకున్నప్పటికి.. ఆ తర్వాతి ఓవర్లో సూపర్ బౌలింగ్ వేశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ చేతుల్లోకి తెచ్చాడు. ఆ తర్వాత ఉమేశ్ మళ్లీ బౌలింగ్‌కు రాకపోవడం గమనార్హం. ఇక ఫీల్డింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మూడు విలువైన క్యాచ్‌లు టీమిండియాను విజయానికి దూరం చేశాయి. అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హర్షల్ పటేలు సులవైన క్యాచ్‌లు వదిలేసి మూల్యం చెల్లించుకున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం టీమిండియా ఆసీస్‌కు సిరీస్‌ను కోల్పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతేకాదు ఇలాంటి ఫీల్డింగ్, బౌలింగ్ వనరులతో టి20 ప్రపంచకప్‌కు వెళితే కప్ కాదు కదా.. తొలి రౌండ్‌ను దాటడం కూడా కష్టమే. అయితే బుమ్రా, షమీ రూపంలో ఇద్దరు నాణ్యమైన పేసర్లు అందుబాటులో లేకపోవడం కూడా టీమిండియాకు దెబ్బే అని చెప్పొచ్చు. అయితే వచ్చే టి20కి షమీ, బుమ్రాలలో ఒకరు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. చదవండి: 'సరైన బౌలర్లు లేరు.. అందుకే ఓడిపోయాం' -
దూసుకొస్తున్న రన్ మెషీన్.. ఆఫ్ఘన్‌పై సెంచరీతో భారీ జంప్
Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారీ జంప్ చేశాడు. ఆసియా కప్-2022లో ఆఫ్ఘనిస్తాన్పై సూపర్ శతకం (61 బంతుల్లో 122 నాటౌట్) సాధించి మళ్లీ టాప్-10 దిశగా దూసుకొస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 1020 రోజుల తర్వాత సెంచరీ సాధించిన విరాట్.. గత వారం ర్యాంకింగ్స్‌తో పోలిస్తే 14 స్థానాలు మెరుగుపర్చుకుని 15వ స్పాట్‌కు చేరుకున్నాడు. ఆఫ్ఘన్‌పై సెంచరీ సాధించడంతో కెరీర్లో 71వ శతకాన్ని, అంతర్జాతీయ టీ20ల్లో తొలి శతకాన్ని నమోదు చేసిన విరాట్.. ఇదే జోరును త్వరలో జరుగనున్న టీ20 సిరీస్‌ల్లోనూ (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) కొనసాగిస్తే తిరిగి అగ్రపీఠాన్ని చేరుకోవడం ఖాయం. Big rewards for star performers from the #AsiaCup2022 in the latest update of the @MRFWorldwide ICC Men's T20I Player Rankings 📈 Details ⬇️ https://t.co/B8UAn4Otze — ICC (@ICC) September 14, 2022 తాజా ర్యాంకింగ్స్‌లో ఇవాళ (సెప్టెంబర్ 14) పుట్టిన రోజు జరుపుకుంటున్న టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో కొనసాగుతుండగా.. ఆసియా కప్‌లో దారుణంగా విఫలమైన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఓ స్థానాన్ని కోల్పోయి మూడో ప్లేస్‌కు దిగజారాడు. పాక్ వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ తన అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. సఫారీ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ హీరో, శ్రీలంక బ్యాటర్ భానుక రాజపక్ష.. 34 స్థానాలు మెరుగుపర్చుకుని 34వ స్పాట్‌కు చేరుకోగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 14వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆసియా కప్‌లో ఆఫ్ఘన్‌పై సంచలన ప్రదర్శన (5/4) చేసిన టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ టాప్-10లోకి దూసుకొచ్చాడు. భువీ.. 11వ స్థానం నుంచి సెవెన్త్ ప్లేస్‌కు చేరుకున్నాడు. టీమిండియా నుంచి టాప్-10లో నిలిచిన ఏకైక బౌలర్ భువీ ఒక్కడే కావడం విశేషం. ఈ జాబితాలో ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సఫారీ స్పిన్నర్ తబ్రేజ్ షంషి రెండులో, ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మూడో ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఆసియా కప్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ విన్నర్ వనిందు హసరంగ (శ్రీలంక) తొమ్మిదో స్థానం నుంచి ఆరో ప్లేస్‌కు ఎగబాకాడు. -
కోహ్లిని అధిగమించిన రిజ్వాన్
పాకిస్తాన్‌తో ఆదివారం (సెప్టెంబర్ 11) జరిగిన ఆసియా కప్-2022 తుది సమరంలో శ్రీలంక 23 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసి ఆరో సారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లంక జట్టు.. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో భంగపడినప్పటికీ, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని భారత్, పాక్‌లపై వరుస విజయాలు సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఫైనల్లో శ్రీలంక.. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి పాక్‌కు వరుసగా రెండో మ్యాచ్‌లో షాకిచ్చింది. అద్భుతమైన హాఫ్ సెంచరీతో లంకకు డిఫెండింగ్ టోటల్ అందించిన భానుక రాజపక్ష (45 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకోగా.. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా బౌలింగ్ చేసిన వనిందు హసరంగకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. And with that, we close the DP World #AsiaCup 2022, with Sri Lanka as CHAMPIONS! 🇱🇰🏆 What a tournament we've had! 🤩 Here are the overall performers who have impressed us with their incredible displays 👏#ACC #AsiaCup2022 #GetReadyForEpic pic.twitter.com/M5v6p5QGEw — AsianCricketCouncil (@ACCMedia1) September 11, 2022 ఇక ఈ టోర్నీ మొత్తంలో 'టాప్' లేపిన ఆటగాళ్ల విషయానికొస్తే.. పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (281 పరుగులు).. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (276) అధిగమించి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రిజ్వాన్ 6 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు చేయగా.. కోహ్లీ 5 మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో 92 సగటున పరుగులు సాధించాడు. వీరి తర్వాత టాప్-5లో ఆఫ్ఘాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (196), శ్రీలంక హిట్టర్ భానుక రాజపక్స (191), పతుమ్ నిస్సంక (173) ఉన్నారు. బౌలర్ల విషయానికొస్తే.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన ఘనత టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్‌కు దక్కింది. భువీ 5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. భువీ తర్వాతి ప్లేస్‌లో లంక స్పిన్నర్ హసరంగ (9 వికెట్లు), పాక్ బౌలర్లు హరీస్ రౌఫ్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ ఉన్నారు. ఈ ముగ్గురు తలో 8 వికెట్లు సాధించారు. ఈ టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కూడా భువీ పేరిటే నమోదై ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ 4 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్ కూడా ఉంది. ఇక, టోర్నీలో నమోదైన ఏకైక సెంచరీ విరాట్ సాధించినదే కావడం విశేషం. -
భువీ చర్యకు షాక్ తిన్న సూర్యకుమార్..
ఆసియా కప్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా సూపర్-4లో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్, శ్రీలంకలపై వరుస పరాజయాలు చవిచూసిన టీమిండియా.. అఫ్గానిస్తాన్‌పై భారీ విజయం అందుకొని టోర్నీని ముగించింది. ఆసియాకప్‌లో అఫ్గన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 71వ సెంచరీతో అభిమానులను సంతోషపెట్టాడు. ఇలా ఒక హ్యాపీ ఎండింగ్‌తో యూఏఈని వీడిన టీమిండియా స్వదేశానికి చేరుకుంది. కాగా స్వదేశానికి బయలుదేరడానికి ముందు టీమిండియా ఆటగాళ్లు హోటల్ రూం నుంచి ఎయిర్పోర్ట్ వరకు బస్సులో వచ్చారు. కాగా ఆటగాళ్లు బస్ ఎక్కే సమయానికి పెద్ద ఎత్తున అభిమానులు గూమిగూడారు. కోహ్లి, రోహిత్, అశ్విన్, కేఎల్ రాహుల్ సహా ఇతర క్రికెటర్లు అభిమానులకు నవ్వుతూ అభివాదం చేశారు. ఈ సమయంలో అఫ్గానిస్తాన్ మ్యాచ్ హీరో భువనేశ్వర్.. వెనకాలే సూర్యకుమార్ వచ్చాడు. భువీ కనిపించగానే.. అభిమానులు భువీ.. భువీ అంటూ గట్టిగా అరిచారు. కానీ భువనేశ్వర్ మాత్రం అభిమానులను ఏమాత్రం పట్టించుకోకుండా బస్ ఎక్కేశాడు. వెనకే ఉన్న సూర్యకుమార్.. ''నిన్ను పిలుస్తున్నారు.. వాళ్లకి హాయ్ చెప్పు'' అని భువీకి చెప్పినా అతని మాటలు వినకుండానే వెళ్లిపోయాడు. ఈ చర్యతో సూర్యకుమార్ షాక్‌కు గురయ్యాడు. భువీ చేసిన పనితో కన్ఫూజన్‌కు గురయ్యి.. అభిమానులకు సారీ చెప్పిన సూర్య బస్ ఎక్కేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత పంత్ మాత్రంఅభివాదం ఒక్కటే చేయకుండా.. వారి దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్, సెల్పీలు దిగి అభిమానులను సంతోషపరిచాడు. ఇక స్వదేశానికి చేరుకున్న టీమిండియా.. టి20 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టి20 ఫార్మాట్లో హోం సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు టీమిండియా ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లనుంది. చదవండి: Asia Cup 2022: లంకదే ఆసియాకప్.. ముందే నిర్ణయించారా! ఫైనల్లో నసీం షా ఇబ్బంది పెడతాడనుకుంటున్నారా? లంక ఆల్‌రౌండర్ రిప్లై అదిరింది! -
టీమిండియా పేసర్ల సరికొత్త రికార్డు.. టి20 క్రికెట్లో ఇదే తొలిసారి
ఆసియాకప్‌లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ నిర్ణయానికి టీమిండియా బౌలర్లు న్యాయం చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 19.4 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఇక్కడ విశేషమేమిటంటే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా తీసిన 10 వికెట్లు పేసర్లే పంచుకున్నారు. భువనేశ్వర్ కుమార్ 4, హార్దిక్ పాండ్యా 3, అర్షదీప్ సింగ్ 2, ఆవేశ్ ఖాన్ ఒక వికెట్ తీశారు. ►టీమిండియా తరపున టి20 క్రికెట్లో అన్ని వికెట్లు పేసర్లు తీయడం ఇదే మొదటిసారి. ఇంతకముందు ప్లొరిడాలో వెస్టిండీస్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో టీమిండియా నుంచి అన్ని వికెట్లు స్పిన్నర్లు పడగొట్టారు. ►ఇక భువనేశ్వర్ కుమార్ టి20ల్లో పాకిస్తాన్‌పై కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ 4 ఓవర్లు వేసి 26 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ►టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆసియాకప్‌లో పాకిస్తాన్‌పై రెండోసారి మూడు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన హార్దిక్ 25 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇంతకముందు 2016లో 3.3 ఓవర్లలోనే 8 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. చదవండి: IND Vs PAK Fakhar Zaman: ప్రత్యర్థివైనా మెచ్చుకోకుండా ఉండలేం.. Asia Cup 2022 IND Vs PAK: రోహిత్ తప్పు చేశాడా!.. పంత్‌ను పక్కనబెట్టడంపై విమర్శలు -
భువీ రికార్డు బద్ధలు కొట్టిన బుమ్రా
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే ఓ ప్రపంచ రికార్డును బద్ధలు కొట్టిన (టెస్ట్ క్రికెట్లో ఓ ఓవర్లో అత్యధిక పరుగులు (31)) బుమ్రా తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 21 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఇంగ్లండ్ గడ్డపై ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2014 సిరీస్‌లో భువనేశ్వర్ కుమార్ పడగొట్టిన 19 వికెట్లే (5 మ్యాచ్‌ల సిరీస్‌లో) ఇప్పటివరకు అత్యధికం కాగా, తాజా సిరీస్‌లో బుమ్రా.. భువీ రికార్డును తిరగరాశాడు. ఈ జాబితాలో జహీర్ ఖాన్ (2007లో 18 వికెట్లు), ఇషాంత్ శర్మ (2018లో 18 వికెట్లు), సుభాశ్ గుప్తే (1959లో 17 వికెట్లు) బుమ్రా, భువీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సాధారణంగా టీమిండియా తరఫున అత్యధిక వికెట్ల ఘనత స్పిన్నర్లకు దక్కుతుంటుంది. అయితే ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక వికెట్లు (ఓ సిరీస్‌లో) సాధించిన టాప్-5 బౌలర్లలో ఒక్కరే స్పిన్నర్ ఉండటం విశేషం.సుభాశ్ గుప్తే.. 1959 ఇంగ్లండ్ సిరీస్‌లో (5 టెస్ట్ మ్యాచ్‌లు) 17 వికెట్లు సాధించాడు. కాగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో పదో స్థానంలో బరిలోకి దిగి బ్యాట్‌తో (16 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ల సాయంతో 31 పరుగులు) చెలరేగిన బుమ్రా.. ఆతర్వాత బంతితోనూ, ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటాడు. తొలుత ఇంగ్లండ్ టాప్ 3 బ్యాటర్లను ఔట్ చేసి బుమ్రా.. ఆ తర్వాత ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అద్భుతమైన డైవిండ్ క్యాచ్ అందుకుని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇక మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్ప్‌లో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసిన భారత్.. ఓవరాల్‌గా 257 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. పుజారా (50), పంత్ (30) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో రోజు ఆటలో టీమిండియా మరో 100 పరుగులు చేయగలిగితే మరింత పటిష్ట స్థితికి చేరుకుంటుంది. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Eng: 257 పరుగుల ఆధిక్యం.. ఇంగ్లండ్‌కు కష్టమే.. టీమిండియాదే విజయం! -
IND VS IRE 1st T20: భువీ ఖాతాలో అరుదైన రికార్డు
Bhuvaneshwar Kumar: టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఆండ్రూ బల్బిర్నీ వికెట్ పడగొట్టడం ద్వారా భువీ పొట్టి ఫార్మాట్ పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు (34 వికెట్లు) సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. భువీకి ముందు ఈ రికార్డు విండీస్ స్పిన్నర్ శామ్యూల్ బద్రీ, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీల పేరిట ఉండేది. వీరిద్దరు పవర్ ప్లేలో 33 వికెట్లు సాధించారు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఫలితంగా హార్ధిక్ సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భువీ తొలి ఓవర్ ఐదో బంతికే ఐరిష్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన భువీ కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. భువీ తన స్పెల్‌లో మెయిడిన్ కూడా వేయడం విశేషం. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ తొలి ఓవర్లో భువీ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఓ అద్భుతం చోటు చేసుకుంది. ఈ ఓవర్లో భువీ బౌలింగ్ చేస్తుండగా స్పీడోమీటర్ మూడు సార్లు గంటకు 200కు పైగా కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరినట్లు చూపించింది. ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్‌కు వేసిన బంతి 201 Km/h, అదే విధంగా బల్బిర్నీ ఎదుర్కొన్న రెండు బంతులు 208, 201 కిమీ వేగంతో విసిరినట్లుగా రికార్డైంది. అయితే, భువీ నిజంగా ఈ ఫీట్ నమోదు చేశాడా లేదంటే సాంకేతిక తప్పిదం కారణంగా స్పీడోమీటర్ ఇలా చూపిందా అన్న విషయం తెలియాల్సి ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్(161.3 km/h) పేరిట నమోదై ఉంది. చదవండి: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. త్వరలోనే ఐపీఎల్లో ఆడుతాడు' -
భువనేశ్వర్ ఖాతాలో మరో అరుదైన రికార్డు
Bhuvneshwar Kumar: టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైన భువీ.. తన 10 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో నాలుగోసారి ఈ ఘనతను సాధించాడు. భారత క్రికెట్ చరిత్రలో మరే పేసర్ ఇన్నిసార్లు (4) ఈ అవార్డును గెలుచుకోలేదు. గతంలో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలు మూడు సార్లు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకోగా.. తాజాగా భువీ వారిద్దరినీ వెనక్కునెట్టి ఈ ఘనత సాధించిన తొలి భారత పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. For his impressive bowling performance against South Africa, @BhuviOfficial bags the Payer of the Series award. 👏👏#TeamIndia | #INDvSA | @Paytm pic.twitter.com/gcIuFS4J9y — BCCI (@BCCI) June 19, 2022 ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో టాప్ ఫామ్‌లో కనిపించిన భువీ పవర్ ప్లేలో అదరగొట్టాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 6.05 ఎకానమీతో 6 వికెట్లు పడగొట్టాడు. ఇక, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో హర్షల్ పటేల్ (7) టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. అయితే భువీ వికెట్లతో పాటు పవర్ ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. చదవండి: టీ20 వరల్డ్‌కప్-2022కు సంబంధించి కీలక ప్రకటన -
ప్రతీసారి కలిసిరాదు.. ఈ చిన్న లాజిక్ ఎలా మరిచిపోయారు
ప్రతీసారి మనకు కలిసిరాదు అని అంటుంటారు. అదే విషయం ప్రస్తుతం మనం చెప్పుకునే సందర్భానికి సరిగ్గా అతుకుతుంది. విషయంలోకి వెళితే.. కటక్ వేదికగా టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య రెండో టి20 మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఇక సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికి వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. అయితే గత మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చిన డ్వేన్ ప్రిటోరియస్ ఉన్నంతసేపు హడలెత్తించాడు. 13 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. ఒక రకంగా సౌతాఫ్రికా మ్యాచ్ గెలవడంలో ప్రిటోరియస్ది కూడా కీలకపాత్రే. ఒక రకంగా బవుమా సక్సెస్ సాధించాడనే చెప్పాలి. ఆ తర్వాత డుసెన్, మిల్లర్లు పనిని పూర్తి చేశారు. అయితే రెండో టి20లో మాత్రం ప్రిటోరియస్‌కు కలిసిరాలేదు. 4 పరుగులు మాత్రమే చేసిన ప్రిటోరియస్ భువనేశ్వర్ బౌలింగ్‌లో ఆవేశ్‌ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అలా ప్రిటోరియస్తో ఈ మ్యాచ్‌లోనూ భారీ హిట్టింగ్ చేయించి గెలుపును సుగమం చేసుకోవాలన్నా బవుమా ప్లాన్ ఫలించలేదు. దీంతో అభిమానులు.. ప్రతీసారి కలిసిరాదు.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు.. అంటూ కామెంట్ చేశారు. చదవండి: IND vs SA 2nd T20: విఫలమైన హార్దిక్ పాండ్యా.. ప్రొటీస్ బౌలర్ చర్య వైరల్ -
సన్‌రైజర్స్‌తో తలపడనున్న పంజాబ్.. ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ ఎవరంటే..!
ఐపీఎల్ 2022 సీజన్ చిట్టచివరి లీగ్ మ్యాచ్‌లో ఇవాళ (మే 22) సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. సన్‌రైజర్స్, పంజాబ్ ఇదివరకే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగనుంది. ఈ సీజన్ ఫైనల్ ఫోర్కు గుజరాత్, రాజస్థాన్, లక్నో, ఆర్సీబీ జట్లు చేరుకోగా మిగతా జట్లు (ఢిల్లీ, కేకేఆర్, పంజాబ్, సన్‌రైజర్స్, సీఎస్కే, ముంబై) లీగ్ నుంచి నిష్క్రమించాయి. సన్‌రైజర్స్- పంజాబ్ జట్లకు నేటి మ్యాచ్ నామమాత్రం కావడంతో భారీ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో ఆరెంజ్ ఆర్మీని భువనేశ్వర్ కుమార్ ముందుండి నడిపించే అవకాశం ఉంది. సన్‌రైజర్స్.. గత మ్యాచ్‌లో ముంబైని ఖంగుతినిపించిన జట్టులో నుంచి నటరాజన్, మార్క్రమ్, వాషింగ్టన్ సుందర్‌లకు విశ్రాంతినిచ్చి అబ్దుల్ సమద్, రొమారియో షెపర్డ్, గ్లెన్ ఫిలిప్స్, కార్తీక్ త్యాగిలకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. మరోవైపు పంజాబ్.. తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిన జట్టు నుంచి హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధవన్, భానుక రాజపక్సలను తప్పించి బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, వైభవ్ అరోరా తుది జట్టులో ఆడించే ఛాన్స్ ఉంది. పంజాబ్‌కు షాకిచ్చిన సన్‌రైజర్స్.. ఇదే సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్.. పంజాబ్‌కు భారీ షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ (4/28), భువనేశ్వర్ (3/22) రెచ్చిపోయి పంజాబ్ నడ్డి విరిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ వీరిద్దరి ధాటికి 151 పరుగులకు చాపచుట్టేయగా.. ఛేదనలో త్రిపాఠి (34), అభిషేక్ శర్మ (31), మార్క్రమ్ (41 నాటౌట్), పూరన్ (35 నాటౌట్) తలో చేయి వేసి సన్‌రైజర్స్‌ను గెలిపించారు. క్వాలిఫయర్స్, ఎలిమినేటర్ మ్యాచ్‌లు ఇలా.. ఈడెన్ గార్డెన్ వేదికగా మే 24న జరిగే తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్-రాజస్థాన్ జట్లు తలపడనుండగా, ఇదే వేదికగా మే 25న జరిగే ఎలిమినేటర్‌లో లక్నో-ఆర్సీబీ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అనంతరం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మే 27న రెండో క్వాలిఫయర్ (క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు వర్సెస్ ఎలిమినేటర్ విన్నర్).. ఇదే వేదికగా మే 29న ఫైనల్ (క్వాలిఫయర్ 1 విన్నర్ వర్సెస్ క్వాలిఫయర్ 2 విన్నర్) మ్యాచ్ జరుగనుంది. తుది జట్లు (అంచనా).. సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ప్రియం గార్గ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, నికొలస్ పూరన్ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), ఫజల్ హక్ ఫారూఖి, ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగి. పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధవన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టొన్, బెన్నీ హోవెల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), ఇషాన్ పోరెల్, వైభవ్ అరోరా, కగిసొ రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్. చదవండి: ఐపీఎల్లో తొలి భారత బౌలర్‌గా బుమ్రా అరుదైన ఫీట్ -
MI VS SRH: మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఓవర్.. భువీ అరుదైన ఘనత
ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 194 పరుగల భారీ లక్ష్య ఛేదనలో ముంబై చివరి నిమిషం వరకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో భువీ వేసిన 19వ ఓవర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. 12 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన కీలక తరుణంలో బంతినందుకున్న భువీ.. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మొయిడిన్ ఓవర్ వేసి సన్‌రైజర్స్ విజయానికి బాటలు వేశాడు. ఈ ఓవర్లో బుమ్రాను యార్కర్లతో ఉక్కిరిబిక్కిరి చేసిన భువీ.. అరంగేట్రం ఆటగాడు సంజయ్ యాదవ్ వికెట్ పడగొట్టి మొయిడిన్ వికెట్ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో భువీ మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మెయిడిన్లు (11) వేసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ 14 మెయిడిన్ ఓవర్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఇర్ఫాన్ పఠాన్ (10), లసిత్ మలింగ (8), జస్ప్రీత్ బుమ్రా (8) టాప్ 5లో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ.. రాహుల్ త్రిపాఠి(44 బంతుల్లో 76; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఛేదనలో ముంబై చివరి నిమిషం వరకు పోరాడి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో (190/7) నిలిచిపోయి సీజన్లో 10వ ఓటమిని మూటగట్టుకుంది. చదవండి: MI VS SRH: బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్ మాలిక్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐపీఎల్ చరిత్రలో చెత్త బౌలింగ్ రికార్డును సమం చేసిన సన్‌రైజర్స్ బౌలర్
Bhuvaneshwar Kumar: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా సోమవారం (ఏప్రిల్ 11) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఓ చెత్త బౌలింగ్ రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్ బౌల్ చేసిన భువీ.. వైడ్ల రూపంలో 11 పరుగులు (5+5+1), ఓ లెగ్ బై సహా మొత్తం 17 పరుగులు సమర్పించుకుని, ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరఫున అత్యంత విలువైన తొలి ఓవర్‌ను బౌల్ చేశాడు. 2015లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో డేల్ స్టెయిన్ తొలి ఓవర్లో 17 పరుగులు సమర్పించుకోగా, తాజాగా భువీ స్టెయిన్ పేరిట ఉన్న చెత్త ఐపీఎల్ రికార్డును సమం చేశాడు. ఈ ఓవర్లో భువీ ఏకంగా 9 బంతులు సంధించి, ప్రస్తుత సీజన్లో సుదీర్ఘమైన ఓవర్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భువీ వేసిన ఈ ఓవర్లో గుజరాత్ ఓపెనర్లు మాథ్యూ వేడ్ (4; ఫోర్), శుభ్‌మన్ గిల్ (1) 5 పరుగులు మాత్రమే సాధించగా మిగతా పరుగులు (15) ఎక్స్‌ట్రాల రూపంలో ప్రత్యర్ధికి కలిసొచ్చాయి. ఆరేళ్ల పాటు వన్డేల్లో ఒక్కసారి కూడా గీత దాటని (నో బాల్స్) భువీ.. తాజా ఐపీఎల్ సీజన్లో ఎక్స్‌ట్రాల రూపంలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం విశేషం. ప్రస్తుత సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో భువీ పోటీపడి నో బాల్స్ సంధించి ఎస్ఆర్హెచ్ ఓటమికి పరోక్ష కారణమైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో శతక్కొట్టిన జోస్ బట్లర్.. భువీ నో బాల్ కారణంగా ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని ఆ తర్వాత విధ్వంసం సృష్టించాడు. ఇదిలా ఉంటే, గుజరాత్‌తో మ్యాచ్‌లో తొలి ఓవర్ తర్వాత తేరుకున్న భువీ.. రెండో ఓవర్లో ఇన్ ఫామ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను, ఆఖర్లో అభినవ్ మనోహర్‌ను ఔట్ చేసి, ప్రత్యర్ధి భారీ స్కోర్ సాధించకుండా కట్టడి చేయగలిగాడు. భువీ (2/37), నటరాజన్ (2/34), మార్కో జన్సెన్ (1/27), ఉమ్రాన్ మాలిక్ (1/39) ధాటికి గుజరాత్ టైటాన్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా, ఛేదనలో ఎస్ఆర్హెచ్కు అభినవ్ శర్మ (42), కేన్ విలియమ్సన్ (57) అదిరిపోయే ఆరంభాన్ని అందించి మ్యాచ్‌ను గెలిపించారు. ఆఖర్లో పూరన్ (18 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (8 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్) చెలరేగి ఎస్ఆర్హెచ్ను విజయతీరాలకు చేర్చారు. చదవండి: వికెట్ల కోసం కాకుండా నో బాల్స్‌కు పోటీ పడ్డారు.. ఎంతైనా ఎస్ఆర్హెచ్ కదా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వికెట్ల కోసం కాకుండా నో బాల్స్‌కు పోటీ పడ్డారు.. ఎంతైనా ఎస్ఆర్హెచ్ కదా
ఐపీఎల్ 2022లో భాగంగా ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచి ఎస్ఆర్హెచ్ బౌలర్లు నో బాల్స్ కోసం పోటీ పడుతున్నారు. ఎక్కడైనా బౌలర్ వికెట్లు తీస్తే ఆనందిస్తారు.. కానీ ఎస్ఆర్హెచ్ తాము స్పెషల్‌గా ఉండాలని అనుకుందేమో. భువనేశ్వర్‌తో మొదలుపెడితే.. ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్‌లు తమ మొదటి ఓవర్లోనే నో బాల్స్ వేశారు. ఇందులో భువనేశ్వర్ నోబాల్‌తో వికెట్ తీసే అవకాశాన్ని కోల్పోయాడు. దీంతో లైఫ్ పొందిన బట్లర్ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇక మిగతా ఇద్దరు దారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. ఎక్కడైనా బౌలర్స్ వికెట్ల కోసం పోటీ పడతారు.. కానీ ఇక్కడ మాత్రం నోబాల్స్ కోసం తపిస్తున్నారు.. ఎంతైనా ఎస్ఆర్హెచ్ కదా ఆ మాత్రం ఉంటుంది అని కామెంట్ చేశారు. దీంతో ఎస్ఆర్హెచ్ నో బాల్స్ గోల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2022: స్పెషల్ బంతితో మెరిశాడు.. ప్రతీసారి జరగాలని రాసిపెట్టి ఉండదు! -
జట్టుకు భారమయ్యాడు.. తొలగించే సమయం ఆసన్నమైంది
టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ జట్టుకు భారంగా మారుతున్నాడు. ఒకప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫ్రంట్‌లైన్ బౌలర్‌గా ఉన్న భువీ.. ఇప్పుడు మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండు వన్డేలు కలిపి 18 ఓవర్లు వేసిన భువీ 7.27 ఎకానమీతో 131 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న భువనేశ్వర్ గతేడాది ఐదు వన్డేలు ఆడి 9 వికెట్లు తీశాడు. వాస్తవానికి ఇది మంచి ప్రదర్శనే అయినప్పటికి భువీ మునపటి ఫామ్‌ను చూపట్టలేకపోతున్నాడు. ఒకప్పుడు ఆరంభంలో.. డెత్ ఓవర్లలో వికెట్లు తీయడం.. తన కోటా బౌలింగ్‌లో డాట్ బాల్స్ ఎక్కువగా వేయడం.. పొదుపుగా బౌలింగ్ చేయడం భువనేశ్వర్ స్పెషాలిటీ. 2022కు ముందు 42.6 గా ఉన్న డాట్‌బాల్స్ పర్సంటేజీ ఇప్పుడు 61.5కు పెరిగింది. పరిస్థితి ఇలాగే ఉంటే 2022 టి20 వరల్డ్‌కప్ వరకు భువనేశ్వర్ టీమిండియా జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో భువీని జట్టు నుంచి తొలగించాల్సిన సమయం వచ్చేసిందంటూ పేర్కొంటున్నారు. మూడో వన్డేకు అతని స్థానంలో దీపక్ చహర్‌ను ఎంపిక చేయడం మంచిదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వికెట్ టు వికెట్ బౌలింగ్ వేయడంలో దిట్ట అయిన దీపక్ చహర్ టీమిండియా తరపున 5 వన్డేలు, 17 టి20లు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. అంతేగాక దీపక్ చహర్ బ్యాటింగ్‌లోనూ చేయిందించగల సామర్థ్యం ఉండడం కలిసొచ్చే అంశం. టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ కూడా భువనేశ్వర్ స్థానంలో దీపక్ చహర్‌ను ఎంపిక చేయడమే కరెక్టని అభిప్రాయపడ్డాడు. ఇక భువనేశ్వర్ టీమిండియా తరపున 21 టెస్టుల్లో 63 వికెట్లు, 121 వన్డేల్లో 141 వికెట్లు, 55 టి20ల్లో 53 వికెట్లు తీశాడు. -
బరువు తగ్గేందుకు శ్రమిస్తున్న రోహిత్ శర్మ.. ఫొటో షేర్ చేసిన ధావన్
Rohit Sharma- Dhawan Pic Goes Viral: వన్డే కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత తొలి సిరీస్‌కే దూరమయ్యాడు రోహిత్ శర్మ. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లలేకపోయాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ సెంటర్లో హిట్‌మ్యాన్ చికిత్స పొందుతున్నాడు. ఫిట్నెస్ నిపుణుల పర్యవేక్షణలో ట్రెయినింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో బరువు తగ్గాల్సిందిగా శిక్షకులు అతడికి సూచించినట్లు సమాచారం. తద్వారా మోకాలిపై భారం తగ్గి త్వరగా కోలుకునేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. సుమారు 5-6 కిలోలు బరువు తగ్గాల్సిందిగా సూచించిన నేపథ్యంలో... రోహిత్ ఆ దిశగా వర్కౌట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా టీమిండియా ఆటగాళ్లు రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, సంజూ శాంసన్ తదితరులు కూడా రిహాబిలిటేషన్ సెంటర్లో రోహిత్‌తో పాటు ట్రెయినింగ్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గబ్బర్.. తమ కెప్టెన్ రోహిత్, భువీతో ఉన్న ఫొటోను సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్.. హిట్‌మ్యాన్ కాస్త సన్నబడినట్లు కనిపిస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక గాయం కారణంగా దక్షిణాఫ్రికా టూర్‌కు దూరం కాగా.... ధావన్, భువీ శిక్షణ పూర్తైన తర్వాత వన్డే సిరీస్ నిమిత్తం సౌతాఫ్రికాకు వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా సెంచూరియన్‌లో మొదటి టెస్టు గెలిచిన కోహ్లి సేన... వాండరర్స్లోనూ విజయం సాధించి సఫారీ గడ్డపై చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక జనవరి 19 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: SA vs IND: టీమిండియాకు భారీ షాక్.. వన్డే సిరీస్‌కు కోహ్లి దూరం! Great to see these two champions 🤗 Training with them is always fun 😁 pic.twitter.com/mpexyHR6of — Shikhar Dhawan (@SDhawan25) January 3, 2022 View this post on Instagram A post shared by Sanju V Samson (@imsanjusamson) -
కేన్ మామ అదరగొట్టాడు.. అయినా పాపం..
SRH Practice Match: ఐపీఎల్-2021 తొలి దశలో రాణించని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండో అంచెలో ఎలాగైనా రాణించాలని భావిస్తోంది. గత తప్పిదాలు పునరావృతం చేయకుండా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ ఆటగాళ్లు పూర్తిగా ప్రాక్టీసులో నిమగ్నమయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే బుధవారం నాటి మ్యాచ్ కోసం రెండు జట్లుగా విడిపోయి ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎస్ఆర్హెచ్ తమ ట్విటర్ ఖాతాలో పంచుకుంది. వివరాల ప్రకారం.. కెప్టెన్ విలియమ్సన్, బౌలర్ భువనేశ్వర్ కుమార్ జట్లు ఈ మ్యాచ్‌లో తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భువీ టీం.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన కేన్ మామ సేన.. 4 వికెట్లు కోల్పోయి కేవలం 151 పరుగులే చేసి ఓటమి పాలైంది. దీంతో కేన్ విలియమ్సన్ అర్ధ సెంచరీ(41 బంతుల్లో 61 పరుగులు, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) వృథా అయింది. ఈ క్రమంలో కేన్ మాట్లాడుతూ.. తమ కుర్రాళ్లు బాగా కష్టపడుతున్నారని, కావాల్సినంత ప్రాక్టీసు దొరికిందని చెప్పుకొచ్చాడు. ఇక స్టార్ బౌలర్ రషీద్ ఖాన్.. ‘‘తొలి దశలో మేం మెరుగ్గా రాణించలేకపోయాం. అయితే, ఇప్పుడు మాత్రం కచ్చితంగా మంచి ప్రదర్శన కనబరిచి ముందుకు సాగుతాం’’ అని ధీమా వ్యక్తం చేశాడు. చదవండి: Sanju Samson: గెలుపుతో జోరు మీదున్న రాజస్తాన్‌కు ఎదురుదెబ్బ! #TeamBhuvi vs #TeamKane in our last practice match before our #IPL2021 begins! Watch the video to see how things went down! #OrangeArmy #OrangeOrNothing #IPL2021 pic.twitter.com/NFfIEDcZ2Z — SunRisers Hyderabad (@SunRisers) September 21, 2021 Practice is a means of inviting the perfection desired, and the Swing King is a testament to it! ✌️#OrangeArmy #OrangeOrNothing #IPL2021 pic.twitter.com/tMQoMYafOS — SunRisers Hyderabad (@SunRisers) September 21, 2021 -
కోహ్లీ, రాహుల్ ర్యాంకులు పదిలం.. సెకెండ్ ప్లేస్‌కు దూసుకెళ్లిన లంక ప్లేయర్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(5వ ర్యాంక్), స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్(6వ ర్యాంక్)లు తమ ర్యాంకులను నిలబెట్టుకున్నారు. ఇక శ్రీలంక పర్యటనలో దుమ్మురేపిన స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్(16వ ర్యాంక్), స్పిన్నర్ యుజువేంద్ర చహల్(21వ ర్యాంక్), దీపక్ చాహర్(34వ ర్యాంక్) మెరుగైన ర్యాంకులను సొంతం చేసుకోగా.. శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగా 720 రేటింగ్ పాయింట్స్‌తో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ఈ విభాగంలో దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంషీ 792 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆఫ్ఘన్ బౌలర రషీద్ ఖాన్ ఓ స్థానాన్ని కోల్పోయి మూడో ప్లేస్‌కు పడిపోయాడు. ఇక శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో నాలుగు వికెట్లతో చెలరేగిన భువీ.. వాషింగ్టన్ సుందర్(17వ ర్యాంక్)ను వెనక్కు నెట్టి 16వ స్థానాన్ని దక్కించుకున్నాడు. భువీ.. సుందర్ కన్నా 3 పాయింట్లు ఎక్కువగా సాధించి 588 పాయింట్లతో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. ఈ జాబితాలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బాబర్ ఆజామ్, ఆరోన్ ఫించ్, డెవాన్ కాన్వే వరుసగా రెండు మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ, రాహుల్‌లు గత కొంతకాలంగా అంతర్జాతీయ టీ20లు ఆడనప్పటికీ తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. రోహిత్ శర్మ ఓ స్థానం దిగజారి 14వ స్థానంలో నిలిచాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్ నుంచి ఒక్కరు కూడా టాప్-10లో లేకపోవడం గమనార్హం. ఈ లిస్ట్‌లో ఆఫ్ఘన్ ప్లేయర్ మహ్మద్ నబీ, బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌లు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. -
హార్ధిక్ పాండ్యా పనైపోయింది.. ఆ ఇద్దరికి అవకాశాలివ్వండి..!
ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న హార్ధిక్‌ను సన్నీ ఏకి పారేశాడు. కెరీర్ ఆరంభంలో బంతితో, బ్యాట్‌తో చెలరేగిపోయిన హార్ధిక్లో ఇప్పుడు ఆ జోరు కనపడటం లేదని, ఫిట్నెస్ విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించాడు. హార్దిక్‌కు ప్రత్యామ్నాయాన్ని వెదుక్కోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించాడు. ఇక హార్ధిక్ పనైపోయిందని, అతని స్థానాన్ని దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్‌లతో రీప్లేస్ చేయాలని సూచించాడు. చాహర్, భువీలకు తగినన్ని అవకాశాలిచ్చి వారిని మేటి ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దాలని బీసీసీఐని అభ్యర్ధించాడు. ప్రస్తుతం జరుగుతున్న లంక సిరీస్ రెండో వన్డేలో ఓటమి అంచుల్లో ఉన్న టీమిండియాను చాహర్, భువీ అద్భుతమైన బ్యాటింగ్‌తో గట్టెక్కించారని, లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగిన ఈ ఇద్దరూ పక్కా ప్రొఫెషనల్స్‌లా బ్యాటింగ్ చేశారని ప్రశంసించాడు. ఈ మ్యాచ్‌లో చాహర్ 82 బంతుల్లో సిక్స్, 7 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేయగా, భువీ.. 28 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు స్కోర్ చేశారని, అంతకుముందు బౌలింగ్‌లోనూ వీరిద్దరూ రాణించారని కితాబునిచ్చాడు. కేవలం ఈ మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగానే వీరికి మద్దతు తెలపడం లేదని, గతంలో వీరి ఆల్‌రౌండ్ ప్రదర్శనలను బేరీజు వేసుకునే ఈ నిర్ణయానికొచ్చానని, తన అభిప్రాయాన్ని సమర్ధించుకున్నాడు. -
ఆ నిర్ణయం ద్రవిడ్‌దే.. అందువల్లే గెలవగలిగాం: భువీ
కొలంబో: ఉత్కంఠ పోరులో ఏడో స్థానంలో బరిలోకి దిగి అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించిన దీపక్ చాహర్(82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్)పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తున్న వేళ, టీమిండియా వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. వికెట్లు వడివడిగా పడుతున్న సమయంలో చాహర్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపాలన్న నిర్ణయం కోచ్ రాహుల్ ద్రవిడ్దేని, అందువల్లే తాము మ్యాచ్ గెలవగలిగామని తెలిపాడు. మరపురాని ఇన్నింగ్స్‌తో చాహర్ ఏడో స్థానానికి న్యాయం చేశాడని ప్రశంసించాడు. మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చివరి బంతి వరకు ఆడాలని తాము ముందుగానే నిర్ధేశించుకున్నామని పేర్కొన్నాడు. ద్రవిడ్ కోచింగ్‌లో భారత్-ఏ తరఫున చాహర్ భారీగా పరుగులు చేశాడని, అతడు భారీ షాట్లు ఆడగలడని ద్రవిడ్‌కు ముందే తెలుసని, అందుకే చాహర్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా పంపాడని వెల్లడించాడు. ద్రవిడ్ పెట్టుకున్న నమ్మకాన్ని చాహర్ కూడా వమ్ము చేయలేదని అన్నాడు. తాను కూడా రంజీల్లో చాహర్ బ్యాటింగ్‌ను చూశానని, అందేవల్లే అతనితో సమన్వయం చేసుకోగలిగానని తెలిపాడు. కాగా, చాహర్ తన 5 వన్డేల కెరీర్లో ఎప్పుడు కూడా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగలేదు. ఇదిలా ఉంటే, చాహర్ సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ, భువీ(28 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు)తో కీలక 84 పరుగుల భాగస్వామ్యం తోడవ్వడంతో టీమిండియా మూడు వికెట్లతో శ్రీలంకపై గెలుపొందింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌లో రెచ్చిపోయిన చాహర్ (2/53), భువీ(3/54) బౌలింగ్‌లోనూ రాణించారు. ఇరు జట్ల మధ్య నామకార్ధమైన మూడో వన్డే ఇదే వేదికగా శుక్రవారం(జులై 23) జరగనుంది. -
మనీశ్ పాండే పోరాటం వృధా.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో భువీ సేన విజయం
కొలంబో: పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన శిఖర్ ధవన్ నేతృత్వంలోని భారత జట్టు.. క్వారంటైన్ పూర్తి చేసుకొని, తాజాగా ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడింది. కెప్టెన్ ధవన్, వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ల నేతృత్వంలో రెండు జట్లుగా విడిపోయి ఈ సన్నాహక మ్యాచ్ ఆడుతున్నారు. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ధవన్ జట్టు.. అద్భుతంగా రాణించి, నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. High Energy ⚡️ Full🔛 Intensity 💪 A productive day in the field for #TeamIndia during their T20 intra squad game in Colombo 👌 👌#SLvIND pic.twitter.com/YLbUYyTAkf — BCCI (@BCCI) July 5, 2021 The recap with a twist 🔀 Paras Mhambrey takes the 9⃣0⃣-seconds match-rewind ⏪ challenge 😎 😎 Watch NOW ⌛️ 🎥#TeamIndia #SLvIND pic.twitter.com/UTpRH0V9ug — BCCI (@BCCI) July 5, 2021 మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే(45 బంతుల్లో 63) అర్ధశతకంతో రాణించగా, రుతురాజ్ గైక్వాడ్, ధవన్ పర్వాలేదనిపించారు. ప్రత్యర్ధి కెప్టెన్ భువనేశ్వర్ కుమార్(2/23) బౌలింగ్‌లో రాణించాడు. అనంతరం ఛేదనలో సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా, పడిక్కల్‌లు మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భువీ సేన 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని అద్భుత విజయం సాధించింది. ఇదిలా ఉంటే, రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో లంకకు బయల్దేరిన టీమిండియా.. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడనుంది. ఇందు కోసం 20 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసిన భారత సెలెక్షన్ కమిటీ.. ఐదుగురిని నెట్ బౌలర్లుగా ఎంపిక చేసింది. కోహ్లీ నేతృత్వంలోని భారత రెగ్యులర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రయోగాత్మకంగా శిఖర్ ధవన్ నేతృత్వంలోని యువ జట్టును శ్రీలంకకు పంపింది. ఐపీఎల్, భారత్ ఏ తరఫున సత్తా చాటిన ఆటగాళ్లను ఈ టూర్‌కు ఎంపిక చేసింది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే ఈనెల 13న జరుగనుంది. భారత జట్టు: శిఖర్ ధవన్(కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుత్‌రాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), యజువేంద్ర చాహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతం, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్(వైస్ కెప్టెన్), దీపక్ చహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా నెట్ బౌలర్లు: ఇషాన్ పోరెల్, సందీప్ వారియర్, అర్షదీప్ సింగ్, సాయి కిషోర్, సిమ్రన్ జీత్ సింగ్ -
WTC Final: భువీని తీసుకెళ్లకపోవడం అతిపెద్ద పొరపాటు..
న్యూఢిల్లీ: భువనేశ్వర్ కుమార్ లాంటి అనుభవజ్ఞుడైన స్వింగ్ బౌలర్‌ను ఇంగ్లండ్ పర్యటనకు తీసుకెళ్లకపోవడం టీమిండియా యాజమాన్యం చేసిన అతిపెద్ద పొరపాటని భారత మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ అన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమిని విశ్లేషిస్తూ ఆయన ఈమేరకు వ్యాఖ్యానించాడు. భారత జట్టులో అత్యుత్తమ స్వింగ్ బౌలరైన భువీని ఇంగ్లండ్ పర్యటన నిమిత్తం పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని పేర్కొన్నాడు. ఫైనల్‌కు ముందు టీమిండియా ప్రకటించిన 15 మంది జాబితాలో శార్ధూల్ ఠాకూర్ పేరు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని వ్యాఖ్యానించాడు. అలాగే, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్‌పై అతిగా ఆధారపడటాన్ని ఆయన తప్పుపట్టాడు. గత కొంత కాలంగా హార్ధిక్ బౌలింగ్ చేయకపోవడాన్ని ఉదహరించాడు. ఈ క్రమంలో శార్ధూల్, విజయ్‌శంకర్, శివమ్ దూబేలలో ఒకరిని ప్రోత్సహించాలని ఆయన సూచించాడు. ప్రస్తుత జట్టులో యువ పేసర్ మహ్మద్ సిరాజ్ బాగా బౌలింగ్ చేస్తున్నాడని, రాబోయే ఇంగ్లండ్ సిరీస్‌లో అతనికి వీలైనన్ని ఎక్కవ అవకాశాలు కల్పించాలని ఈ మాజీ సెలెక్టర్ సూచించారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో టీమిండియా రొటేషన్ పద్ధతి పాటించి, ప్రతి ఆటగాడికి అవకాశం కల్పించాలని ఆయన అభిప్రాయడ్డాడు. తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లను ఆడించినా పరిస్థితులను బట్టి అదనపు పేసర్‌ను కూడా తీసుకోవాలని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఆయన టీమిండియా బ్యాటింగ్‌లో లోపాలను కూడా ఎత్తి చూపాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన స్థాయి మేరకు రాణించలేకపోతున్నాడని, అతను అతిగా ఒత్తిడికి లోనవుతున్నాడని తెలిపాడు. పుజారా, రహానే లాంటి సీనియర్ ఆటగాళ్లు ఎప్పుడూ ఒకేలా ఆడుతున్నారని, వారు పరిస్థితులకు తగ్గట్టు మారాలని సూచించాడు. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్‌లపై భారం తగ్గించే ఆటగాళ్లు కావాలని తెలిపాడు. మొత్తంగా కోహ్లీ సారథ్యంలోని టీమిండియా బాగానే ఆడుతున్నా, ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోవడం విచారకరమని పేర్కొన్నాడు. చదవండి: WTC Final: పాస్ పోర్టులు లాక్కొని మరీ గద కోసం ఆరా తీశారు.. -
క్రికెటర్ భువనేశ్వర్ ఇంట్లో విషాదం..
లక్నో: టీమిండియా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భువీ తండ్రి కిరణ్ పాల్ సింగ్(63) క్యాన్సర్‌తో పోరాడుతూ గురువారం కన్నుముశారు.ఆయన కొంతకాలంగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నోయిడా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.ఇటీవలే కీమోథెరపీ చేయించుకున్న భువీ తండ్రి ఇంటికి తిరిగివచ్చారు. కాగా కిరణ్ పాల్ ఆరోగ్య పరిస్థితి మరోసారి క్షీణించడంతో మీరట్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడినుంచి ముజఫర్‌నగర్‌లోని ప్రముఖ ఆసుపత్రికి షిప్ట్ చేయగా.. చికిత్స తీసుకుంటూ నేడు సాయంత్రం మృతి చెందారు. కిరణ్ పాల్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పోలీస్ విభాగంలో విధులు నిర్వర్తించారు. ఆరోగ్య కారణాల రిత్యా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆయన అప్పటినుంచి క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్నారు. ఇక భువనేశ్వర్ ఇటీవలే ఐపీఎల్ 14వ సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున పాల్గొన్నాడు. కరోనా మహమ్మారి సెగ ఐపీఎల్‌కు కూడా తగలడంతో బీసీసీఐ టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇంటికి చేరుకున్న భువీ తన తండ్రికి సహాయంగా ఉంటున్నాడు. కాగా గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న భువీ మునుపటి ఫామ్‌ను ప్రదర్శించలేకపోతున్నాడు. ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఊదు టెస్టుల సిరీస్‌కు భువీని ఎంపిక చేయలేదు. పరిమిత ఓవర్ల ఆటపై దృష్టి పెట్టేందుకు భువీ కావాలనే టెస్టులకు దూరమయ్యాడంటూ రూమర్లు కూడా వచ్చాయి. కానీ తనపై వచ్చిన రూమర్లను భువీ కొట్టిపారేస్తూ తాను అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. టీమిండియా తరఫున భువీ 21 టెస్టులు, 117 వన్డేలు, 48 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 246 వికెట్లు పడగొట్టాడు. చదవండి: అవన్నీ తప్పుడు వార్తలు.. నేను ఎప్పుడు సిద్ధమే: భువీ పాడు వైరస్.. తాతను తీసుకెళ్లిపోయింది: క్రికెటర్ భావోద్వేగం -
భువీ బర్త్ డే.. కెరీర్ విశేషాలివే..!
హైదరాబాద్: టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్‌కు ప్రపంచవ్యాప్త క్రీడాభిమానుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నేడు (ఫిబ్రవరి 5) భువీ 31వ పడిలోకి అడుగుపెట్టాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ మీడియం పేసర్.. బంతిని రెండువైపులా స్వింగ్ చేయడంలో సమర్ధుడు. ప్రతి బంతిలోనూ వైవిధ్యం చూపగలిగే ఈ ఆటగాడు.. ఆరంభ ఓవర్లలో వికెట్లు తీయడంతో పాటు ఆఖరి ఓవర్లలో బంతి వేగంలో వైవిధ్యాన్ని చూపుతూ పొదుపుగా బౌలింగ్ చేయడంలో దిట్ట. 'నకుల్' బంతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన భువీ.. సమర్ధవంతమైన బౌలర్‌గానే కాకుండా నమ్మకమైన లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. టీమిండియా తరపున 21 టెస్ట్‌లు, 114 వన్డేలు, 43 టీ20లు ఆడిన భువీ.. 63 టెస్ట్ వికెట్లు, 132 వన్డే వికెట్లు, 41 టీ20 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న భువీ.. టీమిండియా సాధించిన అనేక విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 2011 ఐపీఎల్ సీజన్లో పూణే వారియర్స్ తరపున బరిలోకి దిగిన భువీ.. సంచలన ప్రదర్శనలతో వెలుగులోకి వచ్చి, జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను.. గాయం కారణంగా గతేడాది కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే పరిమితమయ్యాడు. ఇటీవల ముగిసిన ముస్తాక్ అలీ టోర్నీలో పునరాగమనం చేసిన భువీ.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో జట్టులో స్థానం సంపాదించేందుకు కృషి చేస్తున్నాడు. భువీ జన్మదినం సందర్భంగా అతని కెరీర్‌లోని విశేషాలపై ఓ లుక్కేద్దాం. రంజీల్లో సచిన్‌ను డకౌట్ చేసిన తొలి బౌలర్‌గా గుర్తింపు వన్డే కెరీర్లో తొలి బంతికే వికెట్ సాధించాడు 2014 ఇంగ్లండ్ పర్యటనలో 9వ నంబర్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగి మూడు అర్ధశతకాలు సాధించిన తొలి భారత క్రికెటర్ ఐపీఎల్ చరిత్రలో రెండు వరుస సీజన్లలో(సన్‌రైజర్స్ తరపున 2016, 2017) పర్పుల్ క్యాప్ సాధించిన ఏకైక ఆటగాడు మూడు క్రికెట్ ఫార్మాట్లలో 5వికెట్ల ఘనత సాధించిన తొలి భారత బౌలర్ Just a thread of Bhuvi and Nupur being the cutest together ❤️ @BhuviOfficial#HappyBirthdayBhuvi pic.twitter.com/WLF1v1lnde — Happy Birthday Bhuvs ❤️ (@ishita11x) February 5, 2021 -
సన్‌రైజర్స్ జట్టులో ఆంధ్ర బౌలర్
అబుదాబి: ఆంధ్ర రంజీ జట్టు పేస్ బౌలర్ యెర్రా పృథ్వీరాజ్ ఐపీఎల్ –13లో గాయపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ స్థానంలోకి వచ్చాడు. ఈ మేరకు ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 19వ ఓవర్ వేస్తుండగా భువీ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో తదుపరి మ్యాచ్‌కే కాకుండా గాయం తీవ్రత దష్ట్యా ఏకంగా లీగ్‌కే దూరమయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల పృథ్వీరాజ్‌కు ఐపీఎల్ కొత్తేం కాదు. గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. అలాగే 11 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన ఈ పేసర్ 39 వికెట్లు పడగొట్టాడు. (‘సూర్య’ ప్రతాపం) -
భూవీ.. ఇది ఎలా సాధ్యం
ఢిల్లీ : టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ శుక్రవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా తన పెట్ డాగ్‌తో దిగిన క్యూట్ ఫోటోలను షేర్ చేశాడు. మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహానికి గుర్తుగా ఈ ఫోటోలను పెట్టానంటూ భూవీ పేర్కొన్నాడు. అంతేగాక దానికి ' బడ్డీస్ దెన్ అండ్ నౌ' అంటూ క్యాప్షన్ జత చేశాడు. భూవీ షేర్ చేసిన ఫోటోలో విశేషమేంటంటే.. రెండు ఫోటోల్లోనూ భూవీ, తన పెంపుడు కుక్క అలెక్స్‌లు సేమ్ ఫోజ్ పెట్టారు. మొదటిది అలెక్స్ చిన్నగా ఉన్నప్పుడు.. లాన్లో తీయగా.. రెండో ఫోటో తాజాగా తన ఇంట్లో తీశారు. ఫోటోలో అలెక్స్, భూవీలు ఎదురెదురుగా కళ్లలోకి కళ్లు పెట్టి చూడడం.. దాదాపు రెండు ఫోటోలు ఒకేలా ఉన్నాయి.(ప్రేమ గుట్టు విప్పిన పాండ్యా) దీనిపై భూవీ భార్య నుపుర్ నగర్ స్పందిస్తూ..' మై లవ్.. మీరిద్దరు అప్పుడు.. ఇప్పుడు ఒకేలా ఫోజు ఇవ్వడం ఎలా సాధ్యం. నిజంగా అద్భుతంగా ఉంది. అలెక్స్ ఎక్స్ప్రెషన్స్ రెండు ఫోటోల్లోనూ ఒకేలా ఉన్నాయి. నీ పెట్ డాగ్‌కు మంచి ట్రైనింగ్ ఇచ్చావు భూవీ' అంటూ పేర్కొన్నారు. తాజాగా భూవీ షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఫోటోలు షేర్ చేసిన గంటలోనే లక్ష లైకులు రావడం విశేషం. భూవీ అభిమానులు కూడా సో క్యూట్ అంటూ ఎమోజీలు పెడుతున్నారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ఆటకు విరామం లభించడంతో భువనేశ్వర్ తన భార్య, కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఆనందంగా గడిపేస్తున్నాడు. భూవీ టీమిండియా తరపున 114 వన్డేలు, 21 టెస్టులు, 43 టీ20లు ఆడాడు. View this post on Instagram Buddies THEN and NOW!! 🐶🦮 #dogsofinstagram #alexnagar #buddies #buddiesforlife #thenandnow A post shared by Bhuvneshwar Kumar (@imbhuvi) on Jun 5, 2020 at 2:49am PDT -
హార్దిక్, ధావన్, భువనేశ్వర్ పునరాగమనం
అహ్మదాబాద్: గాయాల నుంచి కోలుకున్న భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా... ఓపెనర్ శిఖర్ ధావన్... పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌లు జాతీయ జట్టులో మళ్లీ స్థానం దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల బృందాన్ని కొత్త చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషి ఆదివారం ప్రకటించారు. పిక్క గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను ఈ సిరీస్ కోసం ఎంపిక చేయలేదు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విఫలమైన మయాంక్ అగర్వాల్ స్థానంలో శిఖర్ ధావన్... శార్దుల్ ఠాకూర్ స్థానంలో భువనేశ్వర్... ఆల్‌రౌండర్ శివమ్ దూబే స్థానంలో హార్దిక్ పాండ్యా రాగా... ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌పై వేటు పడింది. ఇటీవల కాలంలో 35 ఏళ్ల కేదార్ అంతగా ఆకట్టుకోకపోవడంతో మూల్యం చెల్లించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు వరుసగా ఈనెల 12న (ధర్మశాల), 15న (లక్నోలో), 18న (కోల్‌కతాలో) జరగనున్నాయి. భారత వన్డే జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, పృథ్వీ షా, లోకేశ్ రాహుల్, శుబ్‌మన్ గిల్, మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్. -
ఎంత పని చేశావ్ భువీ..?
మాంచెస్టర్ : ప్రపంచకప్‌లో భాగంగా తొలి సెమీస్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తొలి ఓవర్ తొలి బంతికే రివ్యూకు వెళ్లి టీమిండియా సారథి విరాట్ కోహ్లి, బౌలర్ భువనేశ్వర్ కుమార్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. బుధవారం ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా న్యూజిలాండ్- టీమిండియా మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ రివ్యూ భారత్‌కు ప్రతికూలంగా రావడంతో టీమిండియా ఆటగాళ్లతో పాటు, అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో సోషల్ మీడియా వేదికగా భువనేశ్వర్, కోహ్లిలను విమర్శిస్తున్నారు. (చదవండి: ఇదేంటి.. జట్టులో షమీ లేడు? ) ‘తొలి బంతికే రివ్యూ కోల్పోయాం.. ఇక డీఆర్ఎస్ లేకుండానే మిగిలిన 299 బంతులు వేయాలి’. ‘సెమీస్ వంటి కీలక మ్యాచ్‌ల్లో రివ్యూ ఎంతో కీలకం.. దానిని వినియోగించుకోవడంలో కోహ్లి విఫలమ్యాడు’, ‘భువీ తొలి బంతికే ప్రత్యర్థి జట్టుకు బూస్ట్ ఇచ్చాడు’, ‘ఎంత పని చేశావ్ భువీ’అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో షమీని కాదని భువీని తీసుకోవడం పట్ల కూడా నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అసంలేం జరిగిందంటే.. మ్యాచ్ ప్రారంభమైన వెంటనే టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడంతో ఇన్నింగ్స్‌ను మార్టిన్ గప్టిల్, హెన్రీ నికోలస్లు ఆరంభించారు. కాగా, భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి.. తొలి ఓవర్‌ను భువనేశ్వర్ చేతికి అందించాడు. తొలి బంతికే భువనేశ్వర్ కుమార్ వికెట్ సాధించినంత పని చేశాడు. భువీ వేసిన తొలి ఓవర్ మొదట బంతిని గుడ్ లెంగ్త్‌లో సంధించాడు. ఇది కాస్తా గప్టిల్ బ్యాట్‌ను దాటుకుని ప్యాడ్లకు తాకింది. దీనిపై భారత్ అప్పీల్ చేయగా, ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. దానిపై భారత్ చివరి క్షణాల్లో రివ్యూకు వెళ్లడంతో ఆ బంతి లెగ్ స్టంప్‌కు అతి సమీపం నుంచి బయటకు వెళుతున్నట్లు రిప్లేలో తేలింది. దాంతో భారత్‌కు ప్రతికూల ఫలితం వచ్చింది. దాంతో మొదటి బంతికే భారత్ రివ్యూ కోల్పోయింది. -
ఇదేంటి.. జట్టులో షమీ లేడు?
మాంచెస్టర్ : నాలుగు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు.. అందులో ఒక హ్యాట్రిక్.. ప్రస్తుత ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ రికార్డు. కీలక సమయంలో వికెట్లు పడగొట్టడం.. స్లాగ్ ఓవర్లలో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకునే షమీని టీమిండియా పక్కకు పెట్టింది. ప్రపంచకప్‌లో భాగంగా తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా షమీని పక్కకు పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. షమీని ఎందుకు జట్టులోకి తీసుకోలేదంటూ నెటిజన్లు, మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత హర్షా బోగ్లే కూడా షమీ జట్టులో లేకపోవడం తనను విస్మయానికి గురిచేసిందని పేర్కొన్నాడు. ‘మహ్మద్ షమీ జట్టులో లేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. కీలక సమయాలలో వికెట్లు పడగొట్టడం షమీ స్టైల్. అంతేకాకుండా స్లాగ్ ఓవర్లలో అద్భుతమైన యార్కర్లు వేసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తాడు. అలాంటి షమీని జట్టులోకి ఎందుకు తీసుకోలేదు? ఇక రవీంద్ర జడేజాను తీసుకోవడం శుభపరిణామం.’అంటూ బోగ్లే ట్వీట్ చేశాడు. ఇక షమీని కాదని భువనేశ్వర్‌ను తీసుకోవడాన్ని పలువురు మద్దతిస్తున్నారు. భువీ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థం ఉండటంతోనే షమీని కాదని అతడిని జట్టులోకి తీసుకున్నారని అభిప్రాయ పడుతున్నారు. సెమీస్ వంటి కీలక మ్యాచ్‌ల్లో లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ బలంగా ఉండాలనే ఉద్దేశంతోనే భువీ, జడేజాలను జట్టులోకి తీసుకున్నారని పేర్కొంటున్నారు. -
ఆసీస్‌పై గర్జించిన టీమిండియా
లండన్ : ప్రపంచకప్‌లో టీమిండియా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఓవల్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో కోహ్లి సేన జయభేరి మోగించింది. టీమిండియా నిర్దేశించిన 353 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన ఆసీస్ 316 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది. భారత్ బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా(3/61), భువనేశ్వర్(3/50), చాహల్(2/62)లు కీలక సమయాలలో వికెట్లు తీసి టీమిండియాకు విజయాన్నందించారు. ఈ మ్యాచ్‌లో శతకం బాదిన శిఖర్ ధావన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆసీస్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్(56; 84 బంతుల్లో 5ఫోర్లు), స్టీవ్ స్మిత్(69; 70 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్), అలెక్స్ కేరీ(55; 35 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్)లు మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఒకానొక దశలో ఆసీస్ లక్ష్యం ఛేదించేలా కనిపించింది. 36.4 ఓవర్లలో మూడు వికెట్లకు 202 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. అయితే 40వ ఓవర్లలో భువనేశ్వర్ మ్యాచ్ స్వరూపానే మార్చేశాడు. ఒకే ఓవర్లో జోరు మీదున్న స్మిత్‌ను, స్టొయినిస్‌ను పెవిలియన్‌కు పంపించాడు. దీంతో మ్యాచ్ టీమిండియా చేతుల్లోకి వచ్చింది. అనంతరం బుమ్రా, భువీలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ ఓటమి ఖాయమైంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. భానత ఆటగాళకల్లో శిఖర్ ధావన్(117; 109 బంతుల్లో 16 ఫోర్లు) శతక్కొట్టగా.. రోహిత్ శర్మ(57; 70 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్), విరాట్ కోహ్లి(82; 77 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా(48; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు మెరుపులు మెరిపించడంతో ఆసీస్‌కు టీమిండియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ బౌలర్లలో స్టోయినిస్ రెండు వికెట్లు సాధించగా, కమిన్స్, స్టార్క్, కౌల్టర్ నైల్‌లకు తలో వికెట్ లభించింది. -
భువీ 3,2,1,1,5..
లండన్ : ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 352 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు ఆరంభంలోనే భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ తన తొలి స్పెల్‌లో ఆసీస్ ఓపెనర్లకు వణుకుపుట్టించాడు. బంతిని రెండు వైపుల స్వింగ్ చేస్తూ, పరుగులు ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఇక వార్నర్ పదేపదే ఫుట్‌వర్క్ మార్చి బ్యాటింగ్ చేసిన పరుగుల కోసం తంటాలు పడుతున్నాడు. అయితే తొలి స్పెల్‌లో ఐదు ఓవర్లలో భువీ వరుసగా 3,2,1,1,5 పరుగులు మాత్రమే ఇచ్చి ఆకట్టుకున్నాడు. (చదవండి: సచిన్ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్) అయితే దీనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చదువుల్లో ర్యాంకుల్లా భువీ బౌలింగ్‌లో పరుగులు వస్తున్నాయంటూ చమత్కరిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. టీమిండియా ఆటగాళ్లలో శిఖర్ ధావన్(117; 109 బంతుల్లో 16 ఫోర్లు), రోహిత్ శర్మ(57; 70 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్), విరాట్ కోహ్లి(82; 77 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా(48; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. -
‘భువీ లేకున్నా సన్‌రైజర్స్ ఇరగదీస్తోంది’
ముంబై : సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ విభాగం అద్బుతంగా రాణిస్తోందని టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పఠాన్ ఐపీఎల్లో రాణిస్తున్న యువ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సీజన్లో అత్యంత శక్తివంతమైన బౌలింగ్ అటాకింగ్ సన్రైజర్స్దేనని ఈ మాజీ పేసర్ చెప్పుకొచ్చాడు. ‘భువనేశ్వర్ వంటి దిగ్గజ బౌలర్ జట్టులో లేకున్నా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తోంది. భారత జట్టుకు బుమ్రా ఎంత కీలక బౌలరో సన్‌రైజర్స్‌కు భువీ అంత కీలకం. అతను లేకున్నా గత మూడు మ్యాచ్‌లను సన్‌రైజర్స్ తక్కువ స్కోర్లను కాపాడుకుంటూ గెలిచింది. ఇది అషామాషీ వ్యవహారం కాదు. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం లేకున్నా.. యువ ఆటగాళ్లు సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మలతో కూడిన పేస్ విభాగం చెలరేగుతోంది. ఇక అంతర్జాతీయ క్రికెటర్లు రషీద్, షకీబ్ అల్ హసన్‌లు ఆకట్టుకుంటున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం కుర్రాళ్లు అద్బుతంగా బౌలింగ్ చేస్తున్నారు. సరైన ప్రదేశాల్లో బంతులు వేస్తున్నారు. దీంతో సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం ఈ ఐపీఎల్ అత్యంత శక్తివంతమైన అటాక్ అని నేను భావిస్తున్నా.’’ అని భారత్ గెలిచిన తొలి టీ20 ప్రపంచకప్ జట్టులో కీలక సభ్యుడైన పఠాన్ చెప్పుకొచ్చాడు. ఇక వెన్ను నొప్పితో భువనేశ్వర్ గత మూడు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ఈ మూడింటిలో సన్‌రైజర్స్ స్వల్ప స్కోర్లనే కాపాడుకొని విజయాలందుకుంది. ఇర్ఫాన్ పఠాన్ సోదరుడు యూసఫ్ పఠాన్ ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ముంబై ఇండియన్స్ యువస్పిన్నర్ మయాంక్ మార్కెండేను సైతం పఠాన్ కొనియాడాడు. -
వార్నర్ ఆట ఒక ఎత్తు అయితే మిగతా..
2014లో 528 పరుగులు ...2015లో 562...2016లో 848...2017లో 641...సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున గత నాలుగేళ్లు డేవిడ్ వార్నర్ ప్రదర్శన ఇది. ఒంటి చేత్తో అతను మ్యాచ్‌లు గెలిపించాడు. 2014 నుంచి 59 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 52.63 సగటు, 147.71 స్ట్రైక్ రేట్‌తో 2,579 పరుగులు చేశాడు. ఇందులో 26 అర్ధ శతకాలు, ఒక శతకం ఉన్నాయి. ఇదే సమయంలో జట్టంతా చేసిన పరుగులు 6,292. సగటు23.74 కాగా, స్ట్రైక్ రేట్ 123.98 మాత్రమే. వీటిలో 28 అర్ధ శతకాలున్నాయి. ఇప్పటివరకు సన్‌రైజర్స్ జట్టులో వార్నర్ ఆట ఒక ఎత్తు అయితే మిగతా ఆటగాళ్ల ఆట అంతా ఒక ఎత్తు. 2016లో విశ్వరూపం చూపించిన వార్నర్ ఏకంగా 848 పరుగులు చేసి ఫ్రాంచైజీని విజేతగా నిలిపాడు. 10 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా తన హార్డ్ హిట్టింగ్తో మెరుపు ఆరంభం దక్కేది. చివరకు జట్టుకు గౌరవప్రద స్కోరు అందేది. బ్యాటింగ్‌లో వార్నర్ వేసిన పునాదిపై భువనేశ్వర్, రషీద్‌ఖాన్ వంటి బౌలర్లు గెలుపు మేడ కట్టేవారు. అతడి చురుకైన ఫీల్డింగ్ కూడా ఎంతో మేలు చేసేది. నిలకడ లేమితో సతమతం అవుతున్న శిఖర్ ధావన్ వార్నర్ సహచర్యంతోనే తిరిగి గాడిన పడ్డాడని చెప్పొచ్చు. ఇలాంటి ఆటగాడు ఇప్పుడు ఐపీఎల్‌కు దూరం కావడం ఫ్రాంచైజీకి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. కొత్త సీజన్లో భారమంతా ధావన్, మనీశ్ పాండేలపై పడనుంది. వార్నర్ స్థానంలో మంచి హిట్టర్లయిన గప్టిల్, కుశాల్ పెరీరా, హేల్స్, మోర్గాన్, లెండిల్ సిమ్మన్స్, క్లాసెన్లలో ఒకరిని ఎంచుకుంటే సన్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండవచ్చు. విలియమ్సన్ ఏం చేస్తాడో! వార్నర్ స్థానంలో కెప్టెన్ ఎవరా..? అని ఆలోచిస్తున్న అభిమానులకు విలియమ్సన్ నియామకం ఆశ్చర్యపర్చింది. జట్టులో చోటే కష్టమైన అతడికి ఏకంగా సారథ్యం అప్పగించడం సాహసమే అని చెప్పాలి. గత మూడు సీజన్లలో సన్‌రైజర్స్‌కు 15 మ్యాచ్‌లాడిన విలియమ్సన్ 411 పరుగులే చేశాడు. ఇందులో మూడే అర్ధ శతకాలు. స్వదేశంలో ఇటీవలి ముక్కోణపు టి20 టోర్నీ సందర్భంగానూ పొట్టి ఫార్మాట్లో అతడి ఆటతీరుపై విమర్శలు వచ్చాయి. అయితే... తర్వాతి మ్యాచ్‌లో అతడు 46 బంతుల్లో 72 పరుగులు చేసి వాటికి జవాబిచ్చాడు. సాంకేతికతలో తిరుగులేని ఈ కివీస్ సారథి మూడేళ్ల ఐపీఎల్ స్ట్రైక్ రేట్ 129.24. దీనిని అతడు మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో ధావన్, మనీశ్ పాండే వంటివారితో మంచి భాగస్వామ్యాలు నమోదు చేయాలి. చివర్లో యూసుఫ్ పఠాన్, హుడా వంటి హిట్టర్లు చెలరేగితే జట్టు భారీ స్కోరు చేయగలుగుతుంది. ఇక వైస్ కెప్టెన్ హోదా దక్కిన పేసర్ భువనేశ్వర్పైన కూడా పెద్ద బాధ్యత ఉంది. తక్కువ స్కోరు చేసిన మ్యాచ్‌లో భువీ, రషీద్‌ఖాన్, షకిబ్‌ల బౌలింగ్ ప్రతిభే గట్టెక్కించగలుగుతుంది. వనరులను వినియోగించుకోవడం, వ్యూహాలు పన్నడం వంటివి కెప్టెన్‌గా విలియమ్సన్ సామర్థ్యానికి పరీక్షే. సన్‌రైజర్స్: విలియమ్సన్ (కెప్టెన్), ధావన్, మనీశ్ పాండే, రికీ భుయ్, సచిన్ బేబీ, తన్మయ్ అగర్వాల్, భువనేశ్వర్, రషీద్‌ఖాన్, థంపి, సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, నటరాజన్, సందీప్‌శర్మ, స్టాన్లేక్, షకీబ్, హుడా, కార్లోస్ బ్రాత్‌వైట్, యూసుఫ్ పఠాన్, నబీ, జోర్డాన్, బిపుల్ శర్మ, మెహదీ హసన్, వద్ధిమాన్ సాహా, శ్రీవత్స్ గోస్వామి. – సాక్షి క్రీడా విభాగం -
ఎక్కడా తగ్గలేదు
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో రెండు పరిమిత ఓవర్ల సిరీస్‌లు గెలుచుకొని సగర్వంగా తిరిగి వెళుతుండటం పట్ల తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ చాలా సంబరంగా ఉన్నాడు. చివరి టి20లో కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్, ఈ మ్యాచ్‌లో తమ వ్యూహాలన్నీ సఫలమయ్యాయని చెప్పాడు. ‘ఈ రెండు పరిమిత ఓవర్ల ట్రోఫీలను అందుకోవడం సంతోషంగా ఉంది. సిరీస్ మొత్తం మేం చాలా దూకుడుగా ఆడాం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా బృందం వెనకడుగు వేయలేదు. దాని వల్లే ఇవాళ విజేతలుగా ఇక్కడ నిలబడ్డాం’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. తొలి ఆరు ఓవర్లలో కచ్చితత్వంతో వికెట్లపైకి మాత్రమే బంతులు వేయాలనేది తమ వ్యూహమని, దీనిని సమర్థంగా అమలు చేసి బౌలర్లు మ్యాచ్ గెలిపించారని అతను అన్నాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే మేం మరో 15 పరుగులు తక్కువగా చేశాం. మాకు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే చివర్లో కాస్త జోరు తగ్గింది. అయితే ఈ అనుభవంతో మున్ముందు మరిన్ని విషయాలు నేర్చుకుంటాం’ అని రోహిత్ అభిప్రాయ పడ్డాడు. ఏ జట్టుకూ సాధ్యం కాని రీతిలో గత రెండున్నర నెలలుగా అద్భుత ప్రదర్శన కనబర్చామన్న భువనేశ్వర్ కుమార్...ఈ పర్యటన తనకు మధురానుభూతిగా మిగిలిపోయిందని చెప్పాడు. -
ఘనంగా క్రికెటర్ భువీ వివాహం
సాక్షి, మీరట్ : భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఓ ఇంటి వాడయ్యాడు. నేడు (గురువారం) మీరట్‌లో తన ప్రేయసి నుపుర్ నాగర్‌తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు భువనేశ్వర్. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో భువీ, నుపుర్ నాగర్ల వివాహం ఘనంగా నిర్వహించారు. వివాహం నేపథ్యంలో ప్రధాన పేసర్ భువీకి లంకతో జరగనున్న రెండో, చివరి టెస్టులకు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. కోరుకున్న యువతితోనే కుమారుడు భువీ వివాహం జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు క్రికెటర్ తండ్రి కిరణ్ పాల్ సింగ్. టీమిండియా సభ్యులు, బీసీసీఐ అధికారులు కూడా ఈ వేడుకకు హాజరయ్యేలా నవంబర్ 26, 30 తేదీల్లో బులంద్షా, ఢిల్లీలో రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. మరో విశేషం ఏంటంటే.. ఈరోజు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి, బాలీవుడ్ నటి సాగరిక ఘట్గేను జహీర్ వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి ఫొటోలను జహీర్ స్నేహితురాలు, స్పోర్ట్ ఫిట్నెస్ స్టూడియో మార్కెటింగ్ హెడ్ అంజనా శర్మ షేర్ చేశారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భువనేశ్వర్ మ్యారేజ్ డేట్ ఫిక్స్
సాక్షి, న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టులో ప్రధాన పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈనెల 23న మీరట్‌లో తన ప్రేయసి నుపుర్ నాగర్‌తో భువనేశ్వర్ వివాహం జరుగనుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరుగనున్నట్లు క్రికెటర్ భువనేశ్వర్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ చెప్పారు. టీమిండియా సభ్యులు, బీసీసీఐ అధికారులు కూడా ఈ వేడుకకు హాజరయ్యేలా నవంబర్ 26, 30 తేదీల్లో బులంద్షా, ఢిల్లీలో రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. -
ఘనంగా భువనేశ్వర్ నిశ్చితార్థం
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నిశ్చితార్థం ప్రేయసి నుపూర్ నగార్‌తో బుధవారం గ్రేటర్ నోయిడాలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు భువీ-నుపూర్ దగ్గరి స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. డిసెంబర్లో వీరి వివాహాం జరిపించాలని కుటుంబ సభ్యులు నిశ్చయించారు. ఇక ఈ నిశ్చితార్థంకు ముందు భువీ తన ప్రియురాలు నుపూర్ నగార్ అని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపిన విషయం తెలిసిందే. భువి స్వస్థలం గంగానగర్‌లోనే నుపుర్ కుటుంబం నివాసం ఉండేది. భువి తండ్రి కిరణ్‌పాల్ సింగ్, నుపుర్ తండ్రి యశ్పాల్ సింగ్ పోలీస్ ఇద్దరూ యూపీ పోలీసు డిపార్టుమెంట్లో సబ్ఇన్స్పెక్టర్లుగా చేసి రిటైర్ కావడం విశేషం. నుపూర్ నగార్ ఇంజనీరింగ్ చదివి నోయిడాలోని ఓ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ‘మా రెండు కుటుంబాలు ఒకరికొకరికి బాగా తెలుసు. ఇక అమ్మాయి బాగా చదువుకున్నది. భువనేశ్వర్ వరుస సిరీస్‌లతో బిజీగా ఉన్నాడు. ఒక పదిరోజుల సమాయాన్ని చూసుకొని పెళ్లి డేట్‌ను ఫిక్స్ చేస్తాం’ అని భువనేశ్వర్ తండ్రి మీడియాకు తెలిపారు. -
హీరోయిన్ తో భువీ డేటింగ్..!
ముంబై: టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి వాడివేడి చర్చకు దారి తీసింది. ఆ ఫొటోకు 'డిన్నర్ డేట్' అనే క్యాప్షన్ పెట్టడమే భువీ వార్తల్లో నిలవడానికి కారణమైంది. నగరంలోని ఓ రెస్టారెంట్ కు వెళ్లిన సందర్భంలో చేతిలో గ్లాస్, అందులో రెండు స్ట్రాలు ఉన్న ఫొటోను గత కొన్ని రోజుల క్రితం అప్ లోడ్ చేశాడు భువి. దానికి డిన్నర్ డేట్ అని క్యాప్షన్ తగిలించాడు. అయితే కేవలం భువీ మాత్రమే ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. త్వరలోనే ఫుల్ పిక్చర్ ను చూస్తారంటూ మరింత ఆసక్తిని రేకెత్తించాడు. దాంతో భువీ.. ఆ అమ్మాయి ఎవరు? అంటూ అభిమానులు తీవ్రంగా చర్చించుకున్నారు. అయితే ఆ అమ్మాయి ఒక హీరోయిన్ గా తెలుస్తోంది. ఇప్పటికే పలు బెంగాలీ సినిమాల్లో నటించి బాలీవుడ్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న అనుస్మృతీ సర్కార్ అని సమాచారం. ఆ రెస్టారెంట్ నుంచి బయటకొచ్చిన తరువాత కారులో కూర్చున్న సమయంలో కొంతమంది ఫొటోగ్రాఫర్లు క్లిక్ మనిపించిన ఫొటోలు అందుకు బలాన్నిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ అమ్మాయి అనుస్మృతీ సర్కార్ అవునో.. కాదో భువీనే తేల్చాలి. అసలు ఫుల్ పిక్చర్ ను చూస్తారంటూ భువీ పోస్ట్ చేయడం వెనుక ఉద్దేశమూ అతనికే తెలియాలి. -
భువీ మరో అరుదైన ఘనత
హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో వంద వికెట్లను సాధించిన క్లబ్ లో చేరిపోయాడు. సోమవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన భువీ.. ఐపీఎల్ లో 100 వికెట్ల మార్కును చేరాడు. మరొకవైపు అతి తక్కువ మ్యాచ్ ల్లో ఈ రికార్డు నమోదు చేసిన రెండో బౌలర్ గా గుర్తింపు పొందాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్ ఆటగాడు లసిత్ మలింగా అతి తక్కువ మ్యాచ్ ల్లో వంద వికెట్లను సాధించిన తొలి ఆటగాడిగా ఉన్నాడు. లసిత్ మలింగా 70 మ్యాచ్ లో ఈ ఘనత సాధించగా, భువీ 81 మ్యాచ్ ల్లో సాధించాడు. ఇదిలా ఉంచితే, 2014 నుంచి సన్ రైజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భువీ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఓటములకు అడ్డు గోడలా నిలిచి జట్టును విజయాల తీరం వైపు మళ్లిస్తున్నాడు. భువీ పొదుపు బౌలింగ్ తో స్వల్ప లక్ష్యాలను సైతం కాపాడుకుంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ డంకా మోగిస్తుంది. 2016 సీజన్లో 17 మ్యాచ్ లు ఆడిన భువీ 23 వికెట్లతో అగ్రస్దానంలో నిలిచి జట్టు ఛాంపియన్ గా నిలవడంలో కీలక పాత్ర పోశించాడు. సన్ రైజర్స్ లో చేరిన తర్వాత భువీ తన బౌలింగ్ ప్రతిభను చాటాడు. 2014లో 20 మ్యాచ్ లు ఆడి 20 వికెట్లతో బౌలర్ల పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో నిలిచాడు. 2015 లో 18 వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు 2010 నుంచి 2013 వరకు అప్పటి జట్టు పుణే వారియర్స్ ఇండియా తరుపు ఆడి 25 వికెట్లు తీశాడు. 2008-2009 సీజన్ లో బెంగళూరుకు ఎంపికైన భువీకి అంతగా అవకాశం రాలేదు. -
ఆ రెండు హైదరాబాద్‌వే..
హైదరాబాద్: ఐపీఎల్-10లో డిఫెండింగ్ చాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనాలకు అనుగుణంగా రాణిస్తోంది. సమిష్టిగా ఆడుతున్న మెరుగైన స్థితిలో నిలిచింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. కోల్‌కతా, ముంబై 8 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడిన సన్ రైజర్స్ టీమ్ మూడింట్లో గెలిచి రెండిట్లో ఓడింది. తొలి రెండు మ్యాచుల్లో గెలిచి తర్వాత రెండు మ్యాచులు ఓడింది. ఆదివారం జరిగిన హోంగ్రౌండ్ లో జరిగిన తన ఐదో మ్యాచ్ లో పంజాబ్ ను ఓడించి మళ్లీ విజయాల బాట పట్టింది. సన్ రైజర్స్ విజయంలో కెప్టెన్ డేవిడ్ వార్నర్, పేసర్ భువనేశ్వర్ కుమార్ కీలకపాత్ర పోషించారు. బ్యాట్స్ మన్, బౌలర్ విభాగాల్లో వీరిద్దరూ ముందుండడం విశేషం. ఐదు మ్యాచుల్లో 235 పరుగులు చేసిన వార్నర్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోగా, 15 వికెట్లు పడగొట్టి భువీ పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. సన్ రైజర్స్ జట్టుకే చెందిన రషిద్ ఖాన్ 9 వికెట్లతో బౌలర్ల విభాగంలో రెండో స్థానంలో ఉన్నాడు. ఫోర్లు బాదడడంలోనూ వార్నర్ ముందున్నాడు. ఐదు మ్యాచుల్లో అతడు 26 ఫోర్లు కొట్టాడు. -
స్టెయిన్ దగ్గర నేర్చుకుంటున్నా
మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది భువనేశ్వర్ కుమార్ ఇంటర్వ్యూ న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్లో భువనేశ్వర్ కుమార్ పెద్ద సంచలనం. సన్‌రైజర్స్ జట్టు విజయాల్లో తనదే కీలక పాత్ర. కొత్త బంతిని అద్భుతంగా స్వింగ్ చేయడంలో దిట్ట అయిన ఈ భారత బౌలర్ ఈసారి డెత్ ఓవర్లలోనూ రాణిస్తున్నాడు. తన బౌలింగ్ మెరుగుపరుచుకోవడానికి స్టెయిన్ సలహాలు తీసుకుంటున్నానని చెబుతున్న భువనేశ్వర్ ఇంటర్వ్యూ... ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శనపై స్పందన? చాలా సంతోషంగా ఉంది. రాజస్థాన్‌పై విజయం మా జట్టులో ఆత్మవిశ్వాసం పెంచింది. ఇంకా ఆడాల్సిన మ్యాచ్‌లు చాలా ఉన్నాయి. మంచి ఆటతీరును ప్రదర్శించి పాయింట్ల పట్టికలో దూసుకెళ్తాం. చిన్న స్కోర్లను సన్‌రైజర్స్ ఎలా కాపాడుకుంటోంది? ఐపీఎల్లో ఏ జట్టుకూ లేని అత్యుత్తమ బౌలింగ్ లైనప్ మా సొంతం. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో మొతేరా పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదని మాకు అర్ధమైంది. బౌలర్లు రాణించడం వల్లే తక్కువ స్కోరైనా విజయం సాధించాం. ఈ మ్యాచ్‌లో నా ప్రదర్శన ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. డెత్ ఓవర్లలో చక్కగా బంతులు వేయడంలో స్టెయిన్ సహకారం ఉందా ? ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌తో కలిసి బౌలింగ్ చేయడాన్ని నేను ఆస్వాదిస్తున్నా. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ వేయాలో చెబుతూ స్టెయిన్ తన అనుభవాన్ని పంచుకుంటాడు. తన దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటున్నా. ఇప్పటివరకు డెత్ ఓవర్లలో బంతుల్ని చక్కగా వేయగలుగుతున్నా. ఇన్నింగ్స్ ఆరంభంలో, చివర్లో వికెట్లు తీయగలుగుతున్నా. ఏ వికెట్‌పైనైనా బంతి స్వింగ్ చేయగల సమర్థుడని మాజీ కెప్టెన్ శ్రీకాంత్ అన్నాడు. దీనిపై మీ స్పందన ? జ. స్వింగే నా బలం (నవ్వుతూ..). నేను బంతిని కావాల్సిన విధంగా స్వింగ్ చేయగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. టి20 క్రికెట్లో వికెట్లు పడగొట్టడం చాలా ముఖ్యం. బ్యాట్స్‌మెన్‌ను ఎప్పుడు అవుట్ చేద్దామా అని ఎదురుచూస్తూ ఉంటా.