ICC T20 Rankings: Virat Kohli Placed In 15th Spot, Suryakumar Yadav Placed On 4th Spot - Sakshi
Sakshi News home page

ICC T20 Rankings: దూసుకొస్తున్న రన్‌ మెషీన్‌.. ఆఫ్ఘన్‌పై సెంచరీతో భారీ జంప్‌

Published Wed, Sep 14 2022 4:01 PM

T20 Rankings: Virat Kohli Jumps To 15th spot, Bhuvneshwar Kumar Enters Top 10 - Sakshi

Virat Kohli: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారీ జంప్‌ చేశాడు. ఆసియా కప్‌-2022లో ఆఫ్ఘనిస్తాన్‌పై సూపర్‌ శతకం (61 బంతుల్లో 122 నాటౌట్‌) సాధించి మళ్లీ టాప్‌-10 దిశగా దూసుకొస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 1020 రోజుల తర్వాత సెంచరీ సాధించిన విరాట్‌.. గత వారం ర్యాంకింగ్స్‌తో పోలిస్తే 14 స్థానాలు మెరుగుపర్చుకుని 15వ స్పాట్‌కు చేరుకున్నాడు. 

ఆఫ్ఘన్‌పై సెంచరీ సాధించడంతో కెరీర్‌లో 71వ శతకాన్ని, అంతర్జాతీయ టీ20ల్లో తొలి శతకాన్ని నమోదు చేసిన విరాట్‌.. ఇదే జోరును త్వరలో జరుగనున్న టీ20 సిరీస్‌ల్లోనూ (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) కొనసాగిస్తే తిరిగి అగ్రపీఠాన్ని చేరుకోవడం ఖాయం. 

తాజా ర్యాంకింగ్స్‌లో ఇవాళ (సెప్టెంబర్‌ 14) పుట్టిన రోజు జరుపుకుంటున్న టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 4వ స్థానంలో కొనసాగుతుండగా.. ఆసియా కప్‌లో దారుణంగా విఫలమైన పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ ఓ స్థానాన్ని కోల్పోయి మూడో ప్లేస్‌కు దిగజారాడు. పాక్‌ వికెట్‌కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ తన అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. సఫారీ బ్యాటర్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ రెండో స్థానానికి ఎగబాకాడు. ఆసియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ హీరో, శ్రీలంక బ్యాటర్‌ భానుక రాజపక్ష.. 34 స్థానాలు మెరుగుపర్చుకుని 34వ స్పాట్‌కు చేరుకోగా.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 14వ స్థానంలో కొనసాగుతున్నాడు. 

ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఆసియా కప్‌లో ఆఫ్ఘన్‌పై సంచలన ప్రదర్శన (5/4) చేసిన టీమిండియా స్వింగ్‌ సుల్తాన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. భువీ.. 11వ స్థానం నుంచి సెవెన్త్‌ ప్లేస్‌కు చేరుకున్నాడు. టీమిండియా నుంచి టాప్‌-10లో నిలిచిన ఏకైక బౌలర్‌ భువీ ఒక్కడే కావడం విశేషం.  ఈ జాబితాలో ఆసీస్‌ పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సఫారీ స్పిన్నర్‌ తబ్రేజ్‌ షంషి రెండులో, ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ మూడో ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఆసియా కప్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ విన్నర్‌ వనిందు హసరంగ (శ్రీలంక) తొమ్మిదో స్థానం​ నుంచి ఆరో ప్లేస్‌కు ఎగబాకాడు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement