ఐసీసీ తాజాగా (నవంబర్ 2) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా డిషింగ్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. టీ20 వరల్డ్‌కప్-2022లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సూర్య భాయ్.. తొలిసారి టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని అధిరోహించాడు. టీమిండియా తరఫున గతంలో విరాట్ కోహ్లి మాత్రమే టాప్‌లో కొనసాగాడు.
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ (51), సౌతాఫ్రికాలపై (68) వరుస హాఫ్ సెంచరీలు బాదిన సూర్యకుమార్.. మొత్తం 863 రేటింగ్ పాయింట్లు తన ఖాతాలో వేసుకుని టాప్‌కు చేరాడు. ఇంతకుముందు టాప్‌లో ఉన్న పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్.. వరల్డ్‌కప్‌లో ఆశించిన మేరకు ప్రభావం చూపలేక అగ్రస్థానాన్ని కోల్పోయాడు.
Suryakumar Yadav has replaced Mohammad Rizwan at the top of the T20I Batting Rankings #Cricket #T20WorldCup pic.twitter.com/jDT4dIuzIj
— Saj Sadiq (@SajSadiqCricket) November 2, 2022
వరల్డ్‌కప్‌లో 3 మ్యాచ్‌లు ఆడిన రిజ్వాన్ ఒక్క మ్యాచ్‌లో మాత్రం 49 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం రెండో స్థానానికి దిగజారిన రిజ్వాన్ ఖాతాలో 842 పాయింట్లు ఉన్నాయి. సూర్య, రిజ్వాన్ తర్వాత మూడో ప్లేస్‌లో న్యూజిలాండ్ క్రికెటర్ డెవాన్ కాన్వే ఉన్నాడు. కాన్వే ఖాతాలో 792 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
ఈ జాబితాలో టీమిండియా స్టార్ ప్లేయర్ కింగ్ కోహ్లి 638 రేటింగ్ పాయింట్స్‌తో పదో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లి.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో కింగ్ కేవలం 12 పరుగులు మాతమే చేసి ఔటయ్యాడు. అంతకుముందు తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై చారిత్రక ఇన్నింగ్స్ (82 నాటౌట్) ఆడిన కోహ్లి.. అనంతరం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అజేయమైన అర్ధ సెంచరీతో (62) రాణించాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ కింగ్ కోహ్లి రెచ్చిపోయాడు. 44 బంతుల్లో 64 పరుగులతో అజేయంగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment