ICC T20 rankings
-
ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా..
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా సత్తా చాటాడు. టీ20 మెన్స్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మరోసారి అగ్రస్థానం సంపాదించాడు. ఇటీవల సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న హార్దిక్.. వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించాడు.ఈ మేరకు ఐసీసీ బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి అగ్రపీఠం కైసవం చేసుకున్నాడు. ఈ క్రమంలో నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ, ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు లియామ్ లివింగ్‌స్టోన్‌ను హార్దిక్ పాండ్యా అధిగమించాడు.తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎగబాకిమరోవైపు.. టీమిండియా యువ సంచలనం, సెంచరీల వీరుడు తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎగబాకి.. టీ20 మెన్స్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంకు సాధించడం విశేషం. అదే విధంగా.. మరో శతకాల వీరుడు సంజూ శాంసన్ కూడా 17 స్థానాలు జంప్ చేసి.. 22వ ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా ఇటీవల నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటించిన విషయం తెలిసిందే.సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో సఫారీ గడ్డపై 3-1తో ఈ సిరీస్‌ను భారత జట్టు సొంతం చేసుకుంది. ఇందులో 31 ఏళ్ల హార్దిక్ పాండ్యా ఇటు బంతితో.. అటు బ్యాట్‌తో రాణించి తన వంతు పాత్ర పోషించాడు.ముఖ్యంగా నిర్ణయాత్మక నాలుగో టీ20లో మూడు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి.. టీమిండియా గెలుపునకు బాట వేశాడు.సంజూ శాంసన్ సైతంఇక రెండో టీ20లోనూ 39 పరుగులతో అతడు అజేయంగా నిలిచాడు. కాగా టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ప్రథమ స్థానం సంపాదించడం ఇది రెండోసారి. ఇక తిలక్ వర్మ సఫారీలతో సిరీస్‌లో వరుస సెంచరీలతో చెలరేగాడు. మూడో టీ20లో 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ బ్యాటర్.. నాలుగో మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే 120 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు.. సంజూ శాంసన్ సౌతాఫ్రికాలో తొలి టీ20లో 107, నాలుగో టీ20లో 109(నాటౌట్) పరుగులు సాధించాడు.ఐసీసీ టీ20 మెన్స్ ఆల్‌రౌండర్ల ర్యాంకులు టాప్-51. హార్దిక్ పాండ్యా(ఇండియా)- 244 రేటింగ్ పాయింట్లు2. దీపేంద్ర సింగ్ ఐరీ(నేపాల్)- 231 రేటింగ్ పాయింట్లు3. లియామ్ లివింగ్‌స్టోన్(ఇంగ్లండ్)- 230 రేటింగ్ పాయింట్లు4. మార్కస్ స్టొయినిస్(ఆస్ట్రేలియా)- 209 రేటింగ్ పాయింట్లు5. వనిందు హసరంగ(శ్రీలంక)- 209 రేటింగ్ పాయింట్లుఐసీసీ టీ20 మెన్స్ బ్యాటర్ల జాబితా టాప్-51. ట్రవిస్ హెడ్(ఆస్ట్రేలియా)- 855 రేటింగ్ పాయింట్లు2. ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్)- 828 రేటింగ్ పాయింట్లు3. తిలక్ వర్మ(ఇండియా)- 806 రేటింగ్ పాయింట్లు4. సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 788 రేటింగ్ పాయింట్లు5. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 742 రేటింగ్ పాయింట్లు.టాప్-10లో అర్ష్‌దీప్ సింగ్ఇదిలా ఉంటే.. టీ20 బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్‌కు చెందిన ఆదిల్ రషీద్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. వనిందు హసరంగ(శ్రీలంక), ఆడం జంపా(ఆస్ట్రేలియా), అకీల్ హొసేన్(వెస్టిండీస్), మహీశ్ తీక్షణ(శ్రీలంక) టాప్-4లో ఉన్నారు. ఇక టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని తొమ్మిదో ర్యాంకు పొందాడు.చదవండి: కోహ్లి పాకిస్తాన్లో ఆడాలని అనుకుంటున్నాడు: పాక్ దిగ్గజ బౌలర్ షాకింగ్ కామెంట్స్ -
వరల్డ్ నంబర్ వన్‌గా ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు
ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు లియామ్ లివింగ్‌స్టోన్ ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించాడు. ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో సత్తా చాటి.. ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి.. నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. తన కెరీర్లోనే అత్యుత్తమంగా 253 రేటింగ్ పాయింట్లతో లివింగ్‌స్టోన్ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా స్టార్ మార్కస్ స్టొయినిస్(211 రేటింగ్ పాయింట్లు)ను అగ్రస్థానం నుంచి వెనక్కి నెట్టి.. అతడికి అందనంత ఎత్తులో నిలిచాడు. కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో లివింగ్‌స్టోన్ అదరగొట్టాడు.ఆసీస్‌తో సిరీస్‌లో అదరగొట్టిసౌతాంప్టన్లో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాటర్‌గా 37 పరుగులు చేయడంతో పాటు.. 22 పరుగులు మాత్రమే ఇచ్చి.. మూడు వికెట్లు తీసిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. రెండో టీ20లో విశ్వరూపం ప్రదర్శించాడు. కార్డిఫ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 47 బంతుల్లోనే 87 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్.. కేవలం 16 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. నంబర్ వన్ బ్యాటర్ అతడేతద్వారా ఇంగ్లండ్‌ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ సిరీస్‌లో ఆసీస్- ఇంగ్లండ్ చెరో మ్యాచ్ గెలవగా.. మూడో టీ20 వర్షం కారణంగా రద్దైంది. కాగా 2017లో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 31 ఏళ్ల లివింగ్‌స్టోన్.. ఇప్పటి వరకు ఒక టెస్టు, 25 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 16, 558, 815 పరుగులు చేయడంతో పాటు.. వన్డేల్లో 17, టీ20లలో 29 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఐసీసీ టీ20 బ్యాటర్ల జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ ట్రవిస్ హెడ్ తన టాప్ ర్యాంకును మరింత పదిలం చేసుకోగా.. లివింగ్‌స్టోన్ 17 స్థానాలు మెరుగుపరచుకుని 33వ ర్యాంకు సంపాదించాడు. బౌలర్ల టాప్-5 యథాతథంఇక బౌలర్ల విషయానికొస్తే.. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నంబర్ వన్‌గా కొనసాగుతుండగా.. వెస్టిండీస్ పేసర్ అకీల్ హొసేన్, అఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, వెస్టిండీస్ బౌలర్ గుడకేశ్ మోటీ, శ్రీలంక వనిందు హసరంగ టాప్-5లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అయితే, ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ అన్రిచ్ నోర్జేను వెనక్కినెట్టి ఆరోస్థానానికి చేరుకున్నాడు. కాగా టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా నుంచి హార్దిక్ పాండ్యా ఒక్కడే టాప్-10(ఏడో స్థానం)లో ఉన్నాడు.ఐసీసీ తాజా టీ20 ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్- టాప్ 51. లియామ్ లివింగ్‌స్టోన్(ఇంగ్లండ్)- 252 రేటింగ్ పాయింట్లు2. మార్కస్ స్టొయినిస్(ఆస్ట్రేలియా)- 211 రేటింగ్ పాయింట్లు3. సికందర్ రజా(జింబాబ్వే)- 208 రేటింగ్ పాయింట్లు4. షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్)- 206 రేటింగ్ పాయింట్లు5. వనిందు హసరంగ(శ్రీలంక)- 206 రేటింగ్ పాయింట్లు.చదవండి: నాకంటే నీకే బాగా తెలుసు కదా: కోహ్లికి షాకిచ్చిన గంభీర్! -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన హార్దిక్ పాండ్యా.. నెం1 ఆల్‌రౌండర్‌గా
ఐసీసీ టీ20 ర్యాకింగ్స్లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సత్తాచాటాడు. టీ20ల్లో నెం1 ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా అవతరించాడు. రెండు స్థానాలు ఎగబాకి శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగతో అగ్రస్థానాన్ని హార్దిక్ పంచుకున్నాడు.ప్రస్తుతం వీరిద్దరూ 222 రేటింగ్ పాయింట్లతో సమంగా ఉన్నారు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్-2024లో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పాండ్యా.. భారత్ రెండో సారి టీ20 వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లోనూ పాండ్యా సంచలన ప్రదర్శన కనబరిచాడు. ప్రోటీస్ విధ్వంసకర బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్‌ను ఔట్ చేసి భారత్‌ను విజేతగా నిలిపాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో పాండ్యా 6 ఇన్నింగ్స్‌లలో 151.57 స్ట్రైక్ రేట్‌తో 144 పరుగులు చేశాడు. అటు బౌలింగ్‌లోనూ 11 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 వరల్డ్‌కప్ సమయంలో ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానంలో ఉన్న అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ ఏకంగా ఆరో స్థానానికి పడిపోయాడు. అదే విధంగా ఈ పొట్టి ప్రపంచకప్‌లో అదరగొట్టిన ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిష్ ఒక్క స్ధానం ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ వరుసగా నాలుగు ఐదు స్ధానాల్లో నిలిచారు. -
ICC: టాప్ ర్యాంకు కోల్పోయిన సూర్య.. నంబర్ వన్ ఎవరంటే?
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానం కోల్పోయాడు. దాదాపు ఏడాదిన్నర కాలంగా టాప్ ర్యాంకులో కొనసాగుతున్న ఈ ముంబై క్రికెటర్ రెండో స్థానానికి పడిపోయాడు.గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్న ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రవిస్ హెడ్ నంబర్ వన్ ర్యాంకు సాధించాడు. అయితే, ఈ ఇద్దరి మధ్య కేవలం రెండు రేటింగ్ పాయింట్ల తేడా మాత్రమే ఉండటం గమనార్హం.ఆరంభంలో తడ‘బ్యా’టు కాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభంలో సూర్యకుమార్ యాదవ్ పరుగులు రాబట్టలేక సతమతమయ్యాడు. ఆ తర్వాత అమెరికా(50 నాటౌట్), అఫ్గనిస్తాన్(28 బంతుల్లో 53) జట్లపై వరుసగా హాఫ్ సెంచరీలతో మెరిశాడు.ఇక వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌లో 33 ఏళ్ల ఈ ముంబై బ్యాటర్.. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 139.25 స్ట్రైక్‌రేటుతో 149 పరుగులు చేశాడు.అద్భుత ప్రదర్శనమరోవైపు.. 30 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ ట్రవిస్ హెడ్ టీ20 ప్రపంచకప్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియాపై అర్థ శతకం(43 బంతుల్లో 76)తో దుమ్ములేపాడు. ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి ఓవరాల్‌గా సగటు 42.50, స్ట్రైక్‌రేటు 158.38తో 255 పరుగులు సాధించాడు.ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో హెడ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి అగ్రపీఠం కైవసం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా ఈ టోర్నీలో సెమీస్ చేరగా.. ఆస్ట్రేలియా సూపర్-8 దశలోనే నిష్క్రమించింది.ఐసీసీ టీ20 బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్- టాప్-5 బ్యాటర్లు వీరే1. ట్రవిస్ హెడ్(ఆస్ట్రేలియా)- 844 రేటింగ్ పాయింట్లు2. సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 842 రేటింగ్ పాయింట్లు3. ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్)- 816 రేటింగ్ పాయింట్లు4. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 755 రేటింగ్ పాయింట్లు5. మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్)- 746 రేటింగ్ పాయింట్లు. -
ICC Rankings: అక్షర్ పటేల్ తొలిసారి.. మనోడే మళ్లీ నంబర్ వన్!
టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపాడు. టీ20 మెన్స్ ర్యాంకింగ్స్ ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ తొలిసారిగా మూడో స్థానం సంపాదించాడు. బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ స్టార్ ఆదిల్ రషీద్, శ్రీలంక కీలక ఆటగాడు వనిందు హసరంగ తర్వాతి స్థానం ఆక్రమించాడు.వెస్టిండీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అకీల్ హొసేన్ సౌతాఫ్రికాతో సిరీస్‌లో తేలిపోవడంతో ఐదు స్థానాలు దిగజారగా.. అతడి స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేశాడు. ఇక టీమిండియా నుంచి మరో స్పిన్నర్ రవి బిష్ణోయి టాప్-5లో చోటు దక్కించుకోవడం విశేషం.ఐసీసీ టీ20 మెన్స్ తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్-51. ఆదిల్ రషీద్- ఇంగ్లండ్- 722 రేటింగ్ పాయింట్లు2. వనిందు హసరంగ- శ్రీలంక- 687 రేటింగ్ పాయింట్లు3. అక్షర్ పటేల్- ఇండియా- 660 రేటింగ్ పాయింట్లు4. మహీశ్ తీక్షణ- శ్రీలంక- 659 రేటింగ్ పాయింట్లు5. రవి బిష్ణోయి- ఇండియా- 659 రేటింగ్ పాయింట్లు.మనోడే మళ్లీ నంబర్ వన్ బౌలర్ల సంగతి ఇలా ఉంటే.. టీ20 బ్యాటర్ల జాబితాలో టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అదే విధంగా టాప్-6 ఆటగాళ్లంతా తమ తమ స్థానాల్లో కొనసాగుతుండగా.. ఇంగ్లంఢ్ సారథి జోస్ బట్లర్ ఒక ర్యాంకు మెరుగుపరచుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు.ఇక వెస్టిండీస్ స్టార్ బ్రాండన్ కింగ్ ఏకంగా ఐదుస్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకు సాధించాడు.ఐసీసీ మెన్స్ టీ20 తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-51. సూర్యకుమార్ యాదవ్- ఇండియా- 861 పాయింట్లు2. ఫిల్ సాల్ట్- ఇంగ్లండ్- 788 పాయింట్లు3. మహ్మద్ రిజ్వాన్- పాకిస్తాన్- 769 పాయింట్లు4. బాబర్ ఆజం- పాకిస్తాన్- 761 పాయింట్లు5. ఐడెన్ మార్క్రమ్- సౌతాఫ్రికా- 733 పాయింట్లు.చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్ -
టాప్-10లోకి దూసుకొచ్చిన జైస్వాల్, అక్షర్ పటేల్
ఐసీసీ తాజాగా (భారత్-ఆఫ్ఘనిస్తాన్ మూడో టీ20 అనంతరం) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, బౌలింగ్‌లో అక్షర్ పటేల్ టాప్-10లోకి దూసుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20లో మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించిన యశస్వి.. ఏడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. ఇదే సిరీస్‌లో విశేషంగా రాణించిన అక్షర్ పటేల్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకి ఐదో ప్లేస్‌కు చేరుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో ఆడనప్పటికీ సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్‌ను కాపాడుకోగా.. ఆఫ్ఘన్ సిరీస్‌కు దూరమైన రుతురాజ్ ఓ స్థానం కోల్పోయి తొమ్మిదో ప్లేస్‌కు పడిపోయాడు. ఈ జాబితాలో ఫిలప్ సాల్ట్, మొహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్ రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ ఎఫెక్ట్ సహచర బౌలర్ రవి భిష్ణోయ్పై పడింది. తాజా ర్యాంకింగ్స్‌లో బిష్ణోయ్ ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి ఆరో ప్లేస్‌కు పడిపోయాడు. జింబాబ్వే సిరీస్‌లో రాణించిన లంక బౌలర్లు హసరంగ, తీక్షణ ఒకటి, రెండు స్థానాలు మెరుగుపర్చుకుని సంయుక్తంగా మూడో స్థానానికి ఎగబాకారు. ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అకీల్ హొసేన్ ఓ స్థానం మెరుగుపర్చుకుని రెండో ప్లేస్‌కు చేరాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న ముగిసిన టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రసవత్తరంగా సాగిన నిన్నటి సమరంలో భారత్ రెండో సూపర్ ఓవర్లో విజయం సాధించింది. తొలుత రోహిత్ శర్మ మెరుపు శతకంతో విరుచుకుపడటంతో భారత్ 212 పరుగులు చేయగా.. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే స్కోర్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో సైతం మరోసారి స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్లో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది. -
టీమిండియా స్పిన్ సంచలనం.. ఏడాది కాలంలోనే వరల్డ్ నంబర్ వన్‌గా!
ICC T20I Rankings: Ravi Bishnoi Top Spot in Bowling Charts: రవి బిష్ణోయి.. టీమిండియా యువ స్పిన్ సంచలనం.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఏడాది కాలంలోనే పొట్టి ఫార్మాట్లో నంబర్ వన్ బౌలర్‌గా ఎదిగాడు. అడపాదడపా వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సంపాదించాడు. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో 2000వ సంవత్సరంలో సెప్టెంబరు 5న జన్మించాడు రవి. క్రికెటర్ కావాలన్న కలతో చిన్ననాటి నుంచే కఠోర శ్రమకోర్చిన అతడు.. లెగ్ బ్రేక్ స్పిన్నర్‌గా ఎదిగాడు. దేశవాళీ క్రికెట్లో తొలుత రాజస్తాన్‌కు ఆడిన రవి బిష్ణోయి.. ఇటీవలే గుజరాత్ జట్టుకు మారాడు. ఇక ఎంతో మంది యువ క్రికెటర్ల మాదిరిగానే రవి బిష్ణోయి కూడా అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్ ద్వారా తొలుత వెలుగులోకి వచ్చాడు. సౌతాఫ్రికాలో 2020లో జరిగిన ఈ ఐసీసీ టోర్నీలో మొత్తంగా 17 వికెట్లతో సత్తా చాటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీల దృష్టిలో పడ్డాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2020 సీజన్లో పంజాబ్ కింగ్స్ ద్వారా అరంగేట్రం చేసిన అతడు.. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఒక వికెట్ సాధించాడు. ఆ తర్వాత 2022లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు మారిన రవి బిష్ణోయి.. ఆ సీజన్లో మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఈ రైటార్మ్ స్పిన్నర్.. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన రవి బిష్ణోయి.. తొలి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రవి.. సౌతాఫ్రికాతో సిరీస్ సందర్భంగా వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు మొత్తంగా టీమిండియా తరఫున 21 టీ20లు ఆడిన రవి బిష్ణోయి.. 34 వికెట్లు తీశాడు. అతడి అత్యుత్తమ గణాంకాలు 4/16. ఇక ఆడిన ఏకైక వన్డేలోనూ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు 23 ఏళ్ల రవి. ఇటీవల ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సందర్భంగా.. రవి బిష్ణోయి మొత్తంగా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. తద్వారా తాజా ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానం ఆక్రమించాడు. ఆసీస్‌తో సిరీస్‌ను టీమిండియా 4-1తో గెలవడంలో తన వంతు పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడంతో పాటు.. ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గానూ అవతరించాడు రవి. నిలకడైనా ఆట తీరుతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఏడాది కాలంలోనే టాప్ బౌలర్‌గా నిలిచాడు. టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు ఈ మేరకు అద్భుత ప్రదర్శనతో టీమిండియాలో తన స్థానం దాదాపుగా ఖాయం చేసుకున్నాడు. తద్వారా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ప్రపంచకప్ ఆశలకు పరోక్షంగా గండికొట్టాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్‌ల రూపంలో గట్టి పోటీ ఎదుర్కొని.. ఈ స్థాయికి చేరుకున్నాడు. ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్- టాప్-5 బౌలర్లు వీరే ►రవి బిష్ణోయి(ఇండియా)- 699 రేటింగ్ పాయింట్లు ►రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్)- 692 రేటింగ్ పాయింట్లు ►వనిందు హసరంగ(శ్రీలంక)- 679 రేటింగ్ పాయింట్లు ►ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్)- 679 రేటింగ్ పాయింట్లు ►మహీశ్ తీక్షణ(శ్రీలంక)- 677 రేటింగ్ పాయింట్లు. చదవండి: నువ్వే నా ప్రపంచం.. నా సర్వస్వం: బుమ్రా భార్య భావోద్వేగ పోస్ట్ A thrilling finish to an action-packed T20I series 👏👏#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/Cu9BjqojQK — BCCI (@BCCI) December 3, 2023 -
టీ20ల్లోనూ మనోళ్లదే హవా.. వరల్డ్ ఛాంపియన్లు కూడా మన తర్వాతే..!
ఐసీసీ ఇవాళ (మే 2) విడుదల చేసిన వార్షిక టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా నడిచింది. టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియాను కిందకు దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన భారత జట్టు.. టీ20 ర్యాంకింగ్స్‌లో మరో రెండు పాయింట్లు పెంచుకుని (267) అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. దీంతో జగజ్జేత, టీ20 వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ (259) కూడా భారత్ తర్వాతి స్థానానికే పరిమితమైంది. టీమిండియాకు ఇంగ్లండ్‌కు మధ్య 8 పాయింట్ల వ్యత్యాసం ఉంది. వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత్ (267), ఇంగ్లండ్ (259) తర్వాత న్యూజిలాండ్ (256), పాకిస్థాన్ (254), సౌతాఫ్రికా (253), ఆస్ట్రేలియా (248), వెస్టిండీస్ (238), శ్రీలంక (237), బంగ్లాదేశ్ (222), ఆఫ్ఘనిస్థాన్ (219) వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి. కాగా, వార్షిక ర్యాంకింగ్‌లకు ఇప్పటివరకు జరిగిన సిరీస్‌లతో పాటు 2020 మే- 2022 మే మధ్యలో జరిగిన సిరీస్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 20-22 మధ్యలో పూర్తైన సిరీస్‌లకు 50 శాతం, ఆతర్వాత జరిగిన సిరీస్‌లకు 100 శాతం పాయింట్లు కేటాయిస్తారు. 2020 మే తర్వాత టీ20ల్లో టీమిండియాకు ఘనమైన రికార్డు ఉంది. రోహిత్ సేన ఈ మధ్యకాలంలో ఆడిన ఒకే ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో (శ్రీలంక చేతిలో) మాత్రమే ఓడింది. 2022లో సౌతాఫ్రికాతో జరిగిన ఓ సిరీస్ డ్రా కాగా.. మిగితా 13 సిరీస్‌ల్లో భారత్ జయకేతనం ఎగురవేసింది. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 5 నుంచి మూడో స్థానానికి చేరుకుంది. -
బాబర్ ఆజమ్ శతక్కొట్టినా, సూర్యకుమార్‌ను కదిలించలేకపోయాడు
ICC T20 Rankings: భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. గత ఏడాది నవంబర్ 2న సూర్య టాప్ ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. బుధవారం (ఏప్రిల్ 26) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సూర్య 906 రేటింగ్ పాయింట్లతో అగ్ర స్థానంలోనే ఉన్నాడు. రిజ్వాన్ (811 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో, బాబర్ ఆజమ్ (756 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. చదవండి: Hardik Pandya: కెప్టెన్ అన్న అహంకారంతో విర్రవీగుతున్నాడు, తీసేయండి..! బాబర్ ఆజమ్ శతక్కొట్టినా, సూర్యకుమార్‌ను కదిలించలేకపోయాడు.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో (5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో టీ20) సూపర్ సెంచరీతో (58 బంతుల్లో 101) చెలరేగిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. బాబర్ శతక్కొట్టినా అతని ర్యాంకింగ్‌లో ఎలాంటి మార్పు లేదు. అతను ఇంకా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదే సిరీస్ మహ్మద్ రిజ్వాన్ కూడా రెండు హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ అతని ర్యాంక్ కూడా మారలేదు. అతను రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. చదవండి: Rahane: ఇప్పుడేం చూశారు.. ముందుంది ముసళ్ల పండుగ, సినిమా చూపిస్తా..! -
విఫలమవుతున్నా నెంబర్‌వన్ స్థానంలోనే..
టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు. బుధవారం ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ 906 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. తర్వాతి స్థానంలో పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్(811 పాయింట్లు) ఉన్నాడు. ఇక మూడో స్థానంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం(755 పాయింట్లు), సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్ 748 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. 745 పాయింట్లతో న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వే ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక కోహ్లి 15వ స్థానంలో ఉండగా.. మిగతా టీమిండియా బ్యాటర్లు ఎవరు టాప్-20లో చోటు దక్కించుకోలేకపోయారు. అయితే ఇటీవలే ప్రారంభమైన ఐపీఎల్ 16వ సీజన్లోనూ సూర్యకుమార్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 12,1,0 పరుగులు చేశాడు. ఇందులో ఒక గోల్డెన్ డక్ కూడా ఉంది. అయితే సూర్య నెంబర్‌వన్ స్థానంలో కొనసాగాడానికి మ్యాచ్‌లు అంతర్జాతీయంగా మ్యాచ్‌లు జరగకపోవడమే. ఇక పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య ప్రారంభమవనున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌తో ర్యాంకింగ్స్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. సూర్య వెనకాలే ఉన్న మహ్మద రిజ్వాన్, బాబర్ ఆజంలు సిరీస్‌లో రాణిస్తే సూర్యను దాటే చాన్స్ ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తొలి స్థానంలో ఉండగా.. ఫజల్లా ఫరుకీ రెండు, జోష్ హాజిల్‌వుడ్ మూడు, వనిందు హసరంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. టీమిండియా నుంచి ఒక్క బౌలర్ కూడా టాప్-10లో చోటు దక్కించుకోవడం గమనార్హం. చదవండి: మైదానంలోనే కాదు.. డ్రెస్సింగ్‌రూమ్‌లోనూ మనోడే హీరో! -
వరల్డ్ నంబర్ 1 రషీద్! పాక్‌పై చెలరేగి టాప్-3లో అతడు.. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఖుషీ
ICC T20I Bowling Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అఫ్గనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ సత్తా చాటాడు. పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన ఈ లెగ్ స్పిన్నర్ మరోసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగను వెనక్కినెట్టి మొదటి ర్యాంకు సాధించాడు. టీ20 ఫార్మాట్లో 2018లో తొలిసారి అగ్రపీఠాన్ని అధిరోహించిన రషీద్ ఖాన్.. మరోసారి వరల్డ్ నంబర్ 1గా నిలిచాడు. కాగా షార్జా వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రషీద్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. తొలి టీ20లో ఒక వికెట్ తీసిన ఈ అఫ్గన్ సారథి.. రెండో మ్యాచ్‌లోనూ ఒక వికెట్ పడగొట్టాడు. ఆఖరిదైన మూడో టీ20లోనూ ఒక వికెట్‌తో మెరిశాడు. టాప్-3లో ఇద్దరు.. ఈ క్రమంలో 710 రేటింగ్ పాయింట్లతో హసరంగను అధిగమించి ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడు. అఫ్గన్‌కు చెందిన పేసర్ ఫజల్హక్ ఫారూకీ మూడో స్థానంలోకి దూసుకువచ్చాడు. పాక్‌తో సిరీస్‌లో 5 వికెట్లతో చెలరేగిన అతడు టాప్-5లో అడుగుపెట్టాడు. దీంతో ఐపీఎల్-2023కి ముందు మంచి బూస్టప్ లభించిందంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ సీజన్లో ఫారూకీ ఎస్ఆర్హెచ్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఇక మిస్టరీ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఎనిమిదో ర్యాంకుకు ఎగబాకాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌ను 2-1తో గెలిచిన రషీద్ బృందం చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఐసీసీ టీ20 బౌలింగ్ తాజా ర్యాంకింగ్స్ 1. రషీద్ ఖాన్- అఫ్గనిస్తాన్- 710 పాయింట్లు 2. వనిందు హసరంగ- శ్రీలంక- 695 పాయింట్లు 3. ఫజల్హక్ ఫారూకీ- అఫ్గనిస్తాన్- 692 పాయింట్లు 4. జోష్ హాజిల్‌వుడ్- ఆస్ట్రేలియా- 690 పాయింట్లు 5. ఆదిల్ రషీద్- ఇంగ్లండ్- 684 పాయింట్లు View this post on Instagram A post shared by SunRisers Hyderabad (@sunrisershyd) -
దుమ్మురేపిన శుభ్‌మన్ గిల్.. సత్తా చాటిన హార్ధిక్ పాండ్యా
ఐసీసీ తాజాగా (ఫిబ్రవరి 8) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. న్యూజిలాండ్‌పై సిరీస్ విక్టరీ (2-1) సాధించడంతో భారత ఆటగాళ్ల ర్యాంక్‌లు అమాంతం పెరిగిపోయాయి. యువ సంచలనం శుభ్‌మన్ గిల్ ఏకంగా 168 స్థానాలు ఎగబాకి 30 స్థానానికి చేరుకోగా.. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్ధిక్ పాండ్యా అగ్రస్థానానికి అతి చేరువలో రెండో స్థానంలో ఉన్నాడు. కివీస్‌తో సిరీస్‌లో పర్వాలేదనిపించిన అర్షదీప్ సింగ్ 8 స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బౌలింగ్‌లో రషీద్ ఖాన్, ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్ అల్ హసన్ టాప్ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి ఒక స్థానం దిగజారగా (14 నుంచి 15), కేఎల్ రాహుల్ 2 స్థానాలు దిగజారి 27కు, కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం దిగజారి 28 నుంచి 29 స్థానానికి చేరుకున్నాడు. టాప్ 30లో మొత్తంగా ఐదుగురు టీమిండియా ఆటగాళ్లు ఉన్నారు. సూర్యకుమార్ తర్వాత మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, డెవాన్ కాన్డే, డేవిడ్ మలాన్, రిలీ రొస్సో, ఆరోన్ ఫించ్ గ్లెన్ ఫిలిప్స్, అలెక్స్ హేల్స్ టాప్-10లో ఉన్నారు. బౌలింగ్ కేటగిరి టాప్-30లో నలుగురు టీమిండియా ఆటగాళ్లు ఉన్నారు. అర్షదీప్ 13, భువనేశ్వర్ కుమార్ 21, అశ్విన్ 29, అక్షర్ పటేల్ 30వ స్థానంలో నిలిచారు. రషీద్ తర్వాత వనిందు హసరంగ, ఆదిల్ రషీద్, జోష్ హేజిల్‌వుడ్, సామ్ కర్రన్, తబ్రేజ్ షంషి, ఆడమ్ జంపా, ముజీబుర్ రెహ్మాన్, అన్రిచ్ నోర్జే, మిచెల్ సాంట్నర్ టాప్-10లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్, హార్ధిక్ తర్వాత మహ్మద్ నబీ, హసరంగ, జెజె స్మిట్, సికందర్ రజా, డేవిడ్ వీస్, స్టొయినిస్, మొయిన్ అలీ, మ్యాక్స్‌వెల్ టాప్-10లో ఉన్నారు. ఇదిలా ఉంటే, టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఆల్‌టైమ్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించడానికి మరో 9 పాయింట్లు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం స్కై ఖాతాలో 906 పాయింట్లు, ఉండగా ఆల్‌టైమ్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు డేవిడ్ మలాన్ పేరిట ఉన్నాయి. మలాన్ 2020లో 915 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో హార్ధిక్ పాండ్యా అగ్రస్థానానికి చేరుకునేందుకు మరో 2 రేటింగ్ పాయింట్ల దూరంలో ఉన్నాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్న టీమిండియా ఆల్‌రౌండర్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ స్నేహ్ రాణా తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ముక్కోణపు టోర్నీ ఫైనల్లో రెండు వికెట్లు పడగొట్టిన స్నేహ్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌లో నిలిచింది. భారత్‌కే చెందిన దీప్తి శర్మ, రేణుక సింగ్ ఒక్కో స్థానం పడిపోయి వరుసగా మూడు, ఎనిమిది ర్యాంకుల్లో నిలిచారు. ఇక ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్కిల్స్టోన్ 763 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. సౌతాఫ్రికాకు చెందిన నొన్కులుకో లాబా 753 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన మూడో స్థానంలో, షఫాలీ వర్మ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక టాప్‌లో ఆస్ట్రేలియాకు చెందిన తాహిలా మెక్‌గ్రాత్ 803 పాయింట్లతో కొనసాగుతుంది. టి20 ర్యాంకింగ్స్‌లో తాహిలా 800 పాయింట్లు అందుకోవడం ఇదే తొలిసారి.ఇంతకముందు చార్లెట్ ఎడ్వర్డ్స్ జూన్ 2009లో 843 పాయింట్లతో కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు అందుకుంది. చదవండి: డబ్ల్యూపీఎల్ వేలం.. బరిలో 409 మంది -
ICC T20 No.1: దుమ్ములేపిన సూర్య.. అదే జరిగితే మలన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ICC Men's T20I Batting Rankings- Suryakumar Yadav: పొట్టి ఫార్మాట్లో టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ హవా కొనసాగుతోంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న మిస్టర్ 360.. ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలన్ అరుదైన రికార్డుపై కన్నేశాడు. కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌తో సూర్య బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాంచీ మ్యాచ్‌తో.. ఈ క్రమంలో రాంచిలో జరిగిన తొలి మ్యాచ్‌లో 34 బంతుల్లో 47 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. 910 రేటింగ్ పాయింట్లు సాధించి సత్తా చాటాడు. అయితే, రెండో టీ20లో 31 బంతుల్లో 26 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో రెండు పాయింట్లు కోల్పోయి 908 రేటింగ్ పాయింట్ల వద్ద నిలిచిపోయాడు. మలన్ ఆల్‌టైం రికార్డు అయితే, అహ్మదాబాద్‌లో ఆఖరిదైన మూడో టీ20లో ఈ ముంబైకర్ బ్యాట్ ఝులిపిస్తే గనుక కెరీర్ బెస్ట్ రేటింగ్ అందుకునే అవకాశం ఉంది. కాగా 2020లో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలన్ 915 పాయింట్లతో టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. పాయింట్ల రికార్డు విషయంలో సూర్య ప్రస్తుతం మలన్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీ20 ఫార్మాట్లో దుమ్మురేపుతున్న సూర్యకుమార్ యాదవ్.. ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే టీమిండియాతో సిరీస్‌లో సత్తా చాటిన కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్.. ఎనిమిది స్థానాలు ఎగబాకి 19వ ర్యాంకుకు చేరుకున్నాడు. అదే విధంగా డారిల్ మిచెల్ తొమ్మిది స్థానాలు మెరుగుపరచుకుని 29వ స్థానంలో నిలిచాడు. ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్- టాప్-5లో ఉన్నది వీళ్లే 1.సూర్యకుమార్ యాదవ్(908 పాయింట్లు)- ఇండియా 2. మహ్మద్ రిజ్వాన్ (836)- పాకిస్తాన్ 3. డెవాన్ కాన్వే(788)- న్యూజిలాండ్ 4. బాబర్ ఆజం(778)- పాకిస్తాన్ 5. ఎయిడెన్ మార్కరమ్(748)- సౌతాఫ్రికా చదవండి: Hanuma Vihari: శభాష్ విహారి.. నీ పోరాటానికి సలాం, మణికట్టు గాయమైనా ఒంటి చేత్తో వీరోచిత పోరాటం Prithvi Shaw: పృథ్వీ షాకు నో ఛాన్స్! ఓపెనర్లుగా గిల్- ఇషాన్ జోడీనే.. ఎందుకంటే.. Ind Vs NZ: ఏదైతేనేం.. హార్దిక్ అలా! సూర్య ఇలా!... ఎన్నో మార్పులు.. భావోద్వేగానికి లోనైన ‘స్కై’ -
నెంబర్‌వన్‌కు అడుగుదూరంలో భారత క్రికెటర్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మూడో ర్యాంక్ నుంచి రెండో ర్యాంక్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ముక్కోణపు టి20 టోర్నీలో దీప్తి 9 వికెట్లు పడగొట్టింది. అగ్రస్థానంలో ఉన్న సోఫీ ఎకిల్‌స్టోన్ (ఇంగ్లండ్)కు దీప్తికి కేవలం 26 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసమే ఉంది. రేపు దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్లో భారత స్పిన్నర్ తన జోరు కొనసాగిస్తే టాప్ ర్యాంక్ సాకారమయ్యే చాన్స్ ఉంది. టాప్–10లో మరో ఇద్దరు భారత బౌలర్లు రేణుక (7వ), స్నేహ్ రాణా (10వ) ఉన్నారు. చదవండి: భారత పర్యటనలో ‘వార్మప్’ ఆడకపోవడం సరైందే: స్మిత్ Virat Kohli: మ్యాచ్‌లు లేకుంటే ఆధ్యాత్మిక ధోరణిలోకి -
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు సొంతం
ICC T20 Rankings: టీమిండియా డాషింగ్ బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెట్లో భారత్ తరఫున ఎవరికీ సాధ్యం కాని అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో 908 రేటింగ్ పాయింట్స్ సాధించి, పొట్టి ఫార్మాట్లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్న స్కై.. 900 అంతకంటే ఎక్కువ రేటింగ్ పాయింట్స్ సాధించిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 45 బంతుల్లోనే విధ్వంసకర శతకం బాదిన సూర్యకుమార్.. తొలిసారి 900 రేటింగ్ పాయింట్స్ మార్కును తాకి, టీ20 ర్యాంకింగ్స్‌లో ఎవరికీ అంతనంత ఎత్తుకు దూసుకెళ్లాడు. టీ20 ర్యాంకింగ్స్ చరిత్రలో గతంలో డేవిడ్ మలాన్, ఆరోన్ ఫించ్‌లు మాత్రమే 900 రేటింగ్ పాయింట్స్‌ను సాధించగా.. తాజాగా స్కై వీరిద్దరి సరసన చేరాడు. తాజా ర్యాంకింగ్స్‌లో స్కై తర్వాత అల్లంత దూరాన పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. రిజ్వాన్.. 836 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత డెవాన్ కాన్వే, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మలాన్, గ్లెన్ ఫిలిప్స్, రిలీ రొస్సో, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్ వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 631 రేటింగ్ పాయింట్స్‌తో 13వ ప్లేస్‌లో నిలిచాడు. టాప్-20లో టీమిండియా తరఫున స్కై, విరాట్లు మాత్రమే ఉన్నారు. కాగా, లంకపై మూడో టీ20లో మెరుపు శతకం బాదిన సూర్యకుమార్‌కు అదే జట్టుతో జరిగిన తొలి వన్డేలో చోటు దక్కకపోవడం విశేషం. ఇప్పటివరకు 45 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 46.41 సగటున 180.34 స్ట్రయిక్ రేట్‌తో 1578 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే టీమిండియా తరఫున 16 వన్డేలు ఆడిన స్కై.. 32 సగటున, 100.5 స్ట్రయిక్ రేట్‌తో 384 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. -
అదరగొట్టిన ఆసీస్ బ్యాటర్.. టీ20ల్లో వరల్డ్ నెం.1 ర్యాంక్
భారత మహిళలతో టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న ఆస్ట్రేలియా బ్యాటర్ తహీలా మెక్‌గ్రాత్.. ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ముంబై వేదికగా జరిగిన తొలి రెండు టీ20ల్లో మెక్‌గ్రాత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. రెండు మ్యాచ్‌లు కలిపి మెక్‌గ్రాత్ 110 పరుగులు సాధించింది. ఈ క్రమంలో తన సహచర క్రికెటర్లు , బెత్ మూనీ, మెగ్ లానింగ్, భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానలను అధిగమించి మెక్‌గ్రాత్ టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. కాగా ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు తొలి స్థానంలో మూనీ కొనసాగింది. ఇక ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో నెం1 ర్యాంక్ సాధించిన 12 ఆస్ట్రేలియా బ్యాటర్‌గా మెక్‌గ్రాత్ నిలిచింది.మెక్‌గ్రాత్ తన కెరీర్లో కేవలం 16 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడి నెం1 ర్యాంక్‌ను తన ఖతాలో వేసుకుంది. కాగా ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్ టాప్-10లో భారత నుంచి ముగ్గురు బ్యాటర్లు ఉన్నారు. మూడో స్థానంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, ఆరు, తొమ్మిది ర్యాంక్‌లలో షషాలీ వర్మ, రోడ్రిగ్స్ కొనసాగుతున్నారు. చదవండి: IND vs BAN 1st Test: కోహ్లి, పంత్ 125 పరుగులు చేస్తారు! వారిద్దరూ 20 వికెట్లు తీస్తారు.. -
దిగజారిన కోహ్లి ర్యాంక్.. 4 హాఫ్ సెంచరీలు చేసినా కూడా..!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లి ర్యాంక్ మరింత దిగజారింది. టీ20 వరల్డ్‌కప్-2022లో 4 హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లి ర్యాంక్ పడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గత వారం ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉండిన కింగ్.. తాజా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు కోల్పోయి 13వ ప్లేస్‌కు పడిపోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో పాల్గొనకపోవడం కూడా కోహ్లి ర్యాంక్ పడిపోవడానికి కారణమైంది. ఇక, న్యూజిలాండ్‌తో సిరీస్‌లో సుడిగాలి శతకంతో రెచ్చిపోయిన సూర్యకుమార్.. రేటింగ్ పాయింట్లను (890) భారీగా పెంచుకుని అగ్రపీఠాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న మహ్మద్ రిజ్వాన్ (836)కు సూర్యకుమార్‌కు ఏకంగా 54 పాయింట్ల వ్యత్యాసం ఏర్పడింది. భారత్‌తో సిరీస్‌లో హాఫ్‌సెంచరీతో రాణించిన డెవాన్ కాన్వే.. ఓ స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరుకోగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నాలుగో ప్లేస్‌కు పడిపోయాడు. వీరి తర్వాత మార్క్రమ్, డేవిడ్ మలాన్, గ్లెన్ ఫిలిప్స్, రిల్లీ రొస్సో, ఫించ్. పథుమ్ సిస్సంక, అలెక్స్ హేల్స్, బట్లర్ వరుసగా 4 నుంచి 12 స్థానాల్లో నిలిచారు. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ 3 స్థానాలు దిగజారి 21వ స్థానంలో, కేఎల్ రాహుల్ రెండు స్థానాలు కోల్పోయి 19వ ప్లేస్‌లో ఉన్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. లంక స్పిన్నర్ హసరంగ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. రషీద్ ఖాన్, ఆదిల్ రషీద్ వరుసగా 2, 3 స్థానాల్లో కొనసాగుతున్నారు. టీమిండియా నుంచి టాప్-10 బౌలర్లలో ఒక్కరూ లేకపోవడం చింతించ దగ్గ విషయం. ఆల్‌రౌండర్ల విభాగంలో బంగ్లా స్కిప్పర్ షకీబ్ టాప్‌లో కొనసాగుతుండగా.. మహ్మద్ నబీ, హార్ధిక్ పాండ్యా 2, 3 ప్లేస్ల్లో నిలిచారు. -
కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్.. అందనంత ఎత్తులో సూర్యకుమార్
ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో టీమిండియా స్టార్ సూర్యకుమార్ అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సూర్య తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో రెండో టి20లో సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ 890 పాయింట్లతో కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌కు 836 పాయింట్లు ఉన్నాయి. తొలి రెండు స్థానాల్లో ఉన్న సూర్యకుమార్, రిజ్వాన్‌ల మధ్య వ్యత్యాసం 54 పాయింట్లుగా ఉంది. ఇక టీమిండియాతో సిరీస్‌లో ఆకట్టకున్న కివీస్ బ్యాటర్ డెవన్ కాన్వే ఒక స్థానం ఎగబాకి 788 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకోగా.. బాబర్ ఆజం 778 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక కివీస్‌తో సిరీస్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన ఆల్‌రౌండ్ హార్దిక్ పాండ్యా 50వ స్థానానికి చేరుకున్నాడు. ఇక టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి రెండు స్థానాలు దిగజారి 650 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్ విభాగంలో టీమిండియా నుంచి భువనేశ్వర్ కుమార్ 11వ స్థానంలో ఉండగా.. కివీస్‌తో సిరీస్‌లో రాణించిన అర్ష్‌దీప్ సింగ్ ఒకస్థానం ఎగబాకి 21వ స్థానంలో నిలిచాడు. స్పిన్నర్ చహల్ 8 స్థానాలు ఎగబాకి 40వ స్థానానికి చేరుకున్నాడు. ఇక 704 పాయింట్లో లంక స్పిన్నర్ హసరంగా తొలి స్థానంలో ఉండగా.. రషీద్ ఖాన్, ఆదిల్ రషీద్‌లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. 🔹 Suryakumar Yadav continues to shine 🔹 A host of Australia stars make big gains The latest movements on the @MRFWorldwide ICC Men's Player Rankings ⬇️ https://t.co/3WOEsj9HrQ — ICC (@ICC) November 23, 2022 చదవండి: అల్లర్లకు ఆస్కారం.. టీమిండియాతో వన్డే వేదికను మార్చిన బంగ్లా జాతీయ గీతం పాడనందుకు ఆటగాళ్లను చంపాలనుకున్నారు..! -
సూర్య అగ్రస్థానం పదిలం.. 22 స్థానాలు ఎగబాకిన అలెక్స్ హేల్స్
ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ అలెక్స్ హేల్స్ ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో హేల్స్ ఏకంగా 22 స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకున్నాడు. టి20 ప్రపంచకప్‌లో టీమిండియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో అలెక్స్ హేల్స్ 47 బంతుల్లోనే 86 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అతని ధాటికి టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ ప్రపంచకప్‌లో అలెక్స్ హేల్స్ 212పరుగులు సాధించి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇక టీమిండియా సంచలనం సూర్యకుమార్ యాదవ్ మాత్రం నెంబర్‌వన్ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. టి20 ప్రపంచకప్‌లో 239 పరుగులు చేసిన సూర్యకుమార్ టోర్నీలో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌గా ఉన్న సూర్యకుమార్ ఖాతాలో 859 పాయింట్లు ఉన్నాయి. ఇక ఆ తర్వాత పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 836 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం 778 పాయింట్లతో మూడోస్థానానికి చేరుకోగా.. ఒక స్థానం పడిపోయిన న్యూజిలాండ్ బ్యాటర్ డెవన్ కాన్వే 771 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా మార్ర్కమ్, డేవిడ్ మలాన్, రిలీ రొసౌ, గ్లెన్ ఫిలిప్స్, ఆరోన్ ఫించ్, పాతుమ్ నిస్సాంకలు ఉన్నారు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే ఇంగ్లండ్ బౌలర్లు ఆదిల్ రషీద్, సామ్ కరన్‌లు ముందంజ వేశారు. టి20 ప్రపంచకప్‌లో టీమిండియాతో సెమీఫైనల్, పాకిస్తాన్‌తో ఫైనల్లో మంచి ప్రదర్శన కనబరిచిన రషీద్ ఐదు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలవగా.. ఆల్‌రౌండర్ సామ్ కరన్ రెండు స్థానాలు ఎగబాకి టాప్-5కి చేరుకున్నాడు. ఇక లంక స్పిన్నర్ వనిందు హసరంగా 704 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆఫ్గన్ బౌలర్ రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. Top #T20WorldCup performers biggest gainers in the latest @MRFWorldwide ICC Men’s T20I Player Rankings. Details 👇https://t.co/MKEWVUpZCs — ICC (@ICC) November 16, 2022 చదవండి: అశ్విన్ విషయంలో రాజస్తాన్ రాయల్స్ దిమ్మతిరిగే కౌంటర్ -
అగ్రపీఠంపై సూర్య భాయ్.. కోహ్లి తర్వాత తొలి భారతీయుడిగా రికార్డు
ఐసీసీ తాజాగా (నవంబర్ 2) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా డిషింగ్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. టీ20 వరల్డ్‌కప్-2022లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సూర్య భాయ్.. తొలిసారి టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని అధిరోహించాడు. టీమిండియా తరఫున గతంలో విరాట్ కోహ్లి మాత్రమే టాప్‌లో కొనసాగాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ (51), సౌతాఫ్రికాలపై (68) వరుస హాఫ్ సెంచరీలు బాదిన సూర్యకుమార్.. మొత్తం 863 రేటింగ్ పాయింట్లు తన ఖాతాలో వేసుకుని టాప్కు చేరాడు. ఇంతకుముందు టాప్‌లో ఉన్న పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్.. వరల్డ్‌కప్‌లో ఆశించిన మేరకు ప్రభావం చూపలేక అగ్రస్థానాన్ని కోల్పోయాడు. Suryakumar Yadav has replaced Mohammad Rizwan at the top of the T20I Batting Rankings #Cricket #T20WorldCup pic.twitter.com/jDT4dIuzIj — Saj Sadiq (@SajSadiqCricket) November 2, 2022 వరల్డ్‌కప్‌లో 3 మ్యాచ్‌లు ఆడిన రిజ్వాన్ ఒక్క మ్యాచ్‌లో మాత్రం 49 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం రెండో స్థానానికి దిగజారిన రిజ్వాన్ ఖాతాలో 842 పాయింట్లు ఉన్నాయి. సూర్య, రిజ్వాన్ తర్వాత మూడో ప్లేస్‌లో న్యూజిలాండ్ క్రికెటర్ డెవాన్ కాన్వే ఉన్నాడు. కాన్వే ఖాతాలో 792 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ప్లేయర్ కింగ్ కోహ్లి 638 రేటింగ్ పాయింట్స్‌తో పదో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లి.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో కింగ్ కేవలం 12 పరుగులు మాతమే చేసి ఔటయ్యాడు. అంతకుముందు తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై చారిత్రక ఇన్నింగ్స్ (82 నాటౌట్) ఆడిన కోహ్లి.. అనంతరం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అజేయమైన అర్ధ సెంచరీతో (62) రాణించాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ కింగ్ కోహ్లి రెచ్చిపోయాడు. 44 బంతుల్లో 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. -
ఒక్క ఇన్నింగ్స్‌తో టాప్-10లోకి దూసుకొచ్చిన 'కింగ్' కోహ్లి
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్(53 బంతుల్లో 82 నాటౌట్) ఆడిన టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఎగబాకాడు. టి20 ప్రపంచకప్‌కు ముందు 14వ స్థానంలో ఉన్న కోహ్లి.. పాక్‌పై ఆడిన ఒక్క ఇన్నింగ్స్‌తో టాప్-10లో చోటుదక్కించుకన్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో కింగ్ కోహ్లి 635 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. పాక్‌పై మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న కోహ్లి ఆరు స్థానాలు ఎగబాకాడు. గతేడాది నవంబర్‌లో జరిగిన టి20 ప్రపంచకప్ అనంతరం కోహ్లి ఐసీసీ టి20 టాప్-10 ర్యాంకింగ్స్‌లో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత కూడా పెద్దగా రాణించని కోహ్లి 4 టి20లు కలిపి 81 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత ఆసియా కప్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి.. రెండు అర్థసెంచరీలతో పాటు అఫ్గానిస్తాన్‌పై సూపర్ శతకంతో అలరించాడు. అయితే సరిగ్గా ఏడాది వ్యవధిలోనే మళ్లీ అదే టి20 ప్రపంచకప్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడి టాప్-10లోకి వచ్చాడు. ఇక టీమిండియా నుంచి టాప్-10లో ఇద్దరు మాత్రమే ఉన్నారు. మొన్నటిదాకా రెండో స్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ 828 పాయింట్లతో తాజాగా మూడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన డెవాన్ కాన్వే 831 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకోగా.. పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం 849 పాయింట్లతో తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక టీమిండియాతో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన బాబర్ ఆజం 799 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయాడు. ఇక సౌతాఫ్రికా హిట్టర్ ఐడెన్ మార్క్రమ్ 762 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: టీ20లకు కోహ్లి గుడ్ బై చెప్పాలి.. ఎందుకంటే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Virat Kohli on the rise 👊 The Indian star's sensational innings against Pakistan sees him surge up in the latest @MRFWorldwide ICC Men's T20I Player Rankings 📈 Details ⬇https://t.co/Up2Id40ri0 — ICC (@ICC) October 26, 2022 -
టాప్ ర్యాంక్ కోల్పోయిన సూర్యకుమార్
Surya Kumar Yadav: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానానికి పడిపోయాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో టాప్ లేపిన (అగ్రస్థానం) సూర్య.. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో విఫలం కావడంతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. గత కొంతకాలంగా టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సూర్యకుమార్ తన టాప్ ర్యాంక్‌ను ఎక్కువ రోజులు కాపాడుకోలేకపోయాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ ఆఖరి టీ20లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి నిరుత్సాహపరిచాడు. తాజా ర్యాంకింగ్స్‌లో పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ తిరిగి అగ్రపీఠాన్ని అధిరోహించగా.. బాబర్ ఆజమ్ మూడులో దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మలాన్ (ఇంగ్లండ్), ఆరోన్ ఫించ్, డెవాన్ కాన్వే (న్యూజిలాండ్), పథుమ్ నిస్సంక (శ్రీలంక), మహ్మద్ వసీం (యూఏఈ), మార్టిన్ గప్తిల్ వరుసగా నాలుగు నుంచి పది స్థానాల్లో నిలిచారు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. తాజా ర్యాంకింగ్స్‌లో జోష్ హేజిల్‌వుడ్. రషీద్ ఖాన్, వనిందు హసరంగ టాప్-3లో కొనసాగుతున్నారు. -
ICC T20 Rankings: మరోసారి అదరగొట్టిన సూర్య! అగ్రస్థానానికి అడుగు దూరంలో..
ICC T20 Batting Latest Rankings: టీ20 తాజా ర్యాకింగ్స్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం విడుదల చేసింది. ఇందులో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సత్తా చాటాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న అతడు మరోసారి కెరీర్ బెస్ట్ ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో సూర్య రాణించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్‌లో జరిగిన మూడో టీ20లో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 69 పరుగులు చేశాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఈ క్రమంలో 801 రేటింగ్ పాయింట్లు సాధించిన ఈ ముంబై బ్యాటర్ మరోసారి రెండో ర్యాంకు అందుకున్నాడు. ఇక పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 861 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి ర్యాంకు ఎంతంటే! దక్షిణాఫ్రికా బ్యాటర్ ఎయిడెన్ మార్కరమ్ రెండో ర్యాంకు కోల్పోయి.. నాలుగో స్థానానికి పడిపోగా.. పాక్ సారథి బాబర్ ఆజం ఒక ర్యాంకు మెరుగుపరచుకుని మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్ స్వదేశంలో ఏడు మ్యాచ్ టీ20 సిరీస్‌లో భాగంగా బాబర్.. రెండో మ్యాచ్‌లో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి ఒక స్థానం మెరుగుపరచుకుని 15వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 13వ స్థానంలో ఉన్నాడు. ఐసీసీ టీ20 బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్) 2. సూర్యకుమార్ యాదవ్(ఇండియా) 3. బాబర్ ఆజం(పాకిస్తాన్) 4. ఎయిడెన్ మార్కరమ్(దక్షిణాఫ్రికా) 5. ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా) చదవండి: Ind Vs SA 1st T20: అతడు లేని జట్టు బలహీనం.. టీమిండియా ఓడిపోతుంది: భారత మాజీ క్రికెటర్ -
ఐసీసీ టి20 ర్యాంకింగ్స్: ‘టాప్’లోనే భారత్
దుబాయ్: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీమ్ ర్యాంకింగ్స్‌లో తన టాప్ ర్యాంక్‌ను పటిష్టం చేసుకుంది. సోమవారం విడుదల చేసిన టీమ్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ బృందం 268 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 261 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉండగా... 258 పాయింట్లతో దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. ఇంగ్లండ్‌తో ఏడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ గెలిస్తే రెండో ర్యాంక్‌కు ఎగబాకే అవకాశం ఉంది. l252 పాయింట్లతో న్యూజిలాండ్ ఐదో స్థానంలో నిలిచింది. 250 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో ఉన్న ఆస్ట్రేలియా సొంతగడ్డపై ప్రపంచకప్‌నకు ముందు వెస్టిండీస్‌తో రెండు, ఇంగ్లండ్‌తో మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. హార్దిక్ దూరం.. యువ ఆల్‌రౌండర్‌కు చోటు! -
ICC T20I Rankings: బాబర్‌ను వెనక్కినెట్టిన సూర్య.. పడిపోయిన కోహ్లి ర్యాంకు!
Ind Vs Aus 1st T20- ICC Latest T20 Rankings- Suryakumar Yadav: ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను అధిగమించి మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో మొదటి టీ20లో సూర్యకుమార్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. మొహాలీ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 25 బంతులు ఎదుర్కొన్న సూర్య.. రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 46 పరుగులు సాధించాడు. దిగజారుతున్న బాబర్ ర్యాంకు ఈ నేపథ్యంలో 780 పాయింట్లతో టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక ఎయిడెన్ మార్కరమ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ర్యాంకు పతనం కొనసాగుతోంది. ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో వైఫల్యం కారణంగా మూడో స్థానానికి పరిమితమైన బాబర్.. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మరో స్థానం దిగజారి నాలుగో ర్యాంకుకు పడిపోయాడు. ఇక ఆసీస్‌తో తొలి టీ20లో విఫలమైన టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి(2 పరుగులు) ఒక ర్యాంకు కోల్పోయి పదహారో స్థానానికి పరిమితమయ్యాడు. ఐసీసీ టీ20 బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్) 2. ఎయిడెన్ మార్కరమ్(దక్షిణాఫ్రికా) 3. సూర్యకుమార్ యాదవ్(ఇండియా) 4. బాబర్ ఆజం(పాకిస్తాన్) 5. డేవిడ్ మలన్(ఇంగ్లండ్) చదవండి: Ind Vs Aus 1st T20: పాండ్యా భావోద్వేగం! పాక్‌తో మ్యాచ్‌లోనూ ఓడిపోవాలంటూ నటి ట్వీట్! మీ వాళ్లేదో పొడిచేసినట్టు?! -
ICC T20I Rankings: దుమ్ము రేపిన మంధాన.. నెంబర్ 1 స్థానానికి చేరువలో!
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మరోసారి దుమ్మురేపింది. తన టీ20 కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌ను మంధాన సాధించింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మంధాన అదరగొట్టింది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన ఆమె 111 పరుగులు సాధించింది. ఈ అద్భుత ప్రదర్శన కారణంగా ఆమె రెండు స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంక్‌కు చేరువైంది. అదే విధంగా వన్డే ర్యాంకింగ్స్‌లో మంధాన సత్తా చాటింది. వన్డేల్లో మూడు స్థానాలు ఎగబాకి 7వ ర్యాంక్‌కు ఈ భారత స్టార్ ఓపెనర్ చేరుకుంది. కాగా ఇంగ్లండ్ మహిళలతో జరిగిన తొలి వన్డేలో 91 పరుగులు చేసి భారత విజయంలో మంధాన కీలక పాత్ర పోషించింది. అదే విధంగా భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వన్డే ర్యాంకింగ్స్‌లో నాలుగు స్ధానాలు ఎగబాకి 9వ స్థానానికి చేరుకుంది. చదవండి: CSA T20 League: దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమాకు ఘోర అవమానం! ఎందుకిలా జరిగిందో చెప్పిన మాజీ ఆల్‌రౌండర్ -
దూసుకొస్తున్న రన్ మెషీన్.. ఆఫ్ఘన్‌పై సెంచరీతో భారీ జంప్
Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారీ జంప్ చేశాడు. ఆసియా కప్-2022లో ఆఫ్ఘనిస్తాన్పై సూపర్ శతకం (61 బంతుల్లో 122 నాటౌట్) సాధించి మళ్లీ టాప్-10 దిశగా దూసుకొస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 1020 రోజుల తర్వాత సెంచరీ సాధించిన విరాట్.. గత వారం ర్యాంకింగ్స్‌తో పోలిస్తే 14 స్థానాలు మెరుగుపర్చుకుని 15వ స్పాట్‌కు చేరుకున్నాడు. ఆఫ్ఘన్‌పై సెంచరీ సాధించడంతో కెరీర్లో 71వ శతకాన్ని, అంతర్జాతీయ టీ20ల్లో తొలి శతకాన్ని నమోదు చేసిన విరాట్.. ఇదే జోరును త్వరలో జరుగనున్న టీ20 సిరీస్‌ల్లోనూ (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) కొనసాగిస్తే తిరిగి అగ్రపీఠాన్ని చేరుకోవడం ఖాయం. Big rewards for star performers from the #AsiaCup2022 in the latest update of the @MRFWorldwide ICC Men's T20I Player Rankings 📈 Details ⬇️ https://t.co/B8UAn4Otze — ICC (@ICC) September 14, 2022 తాజా ర్యాంకింగ్స్‌లో ఇవాళ (సెప్టెంబర్ 14) పుట్టిన రోజు జరుపుకుంటున్న టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో కొనసాగుతుండగా.. ఆసియా కప్‌లో దారుణంగా విఫలమైన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఓ స్థానాన్ని కోల్పోయి మూడో ప్లేస్‌కు దిగజారాడు. పాక్ వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ తన అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. సఫారీ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ హీరో, శ్రీలంక బ్యాటర్ భానుక రాజపక్ష.. 34 స్థానాలు మెరుగుపర్చుకుని 34వ స్పాట్‌కు చేరుకోగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 14వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆసియా కప్‌లో ఆఫ్ఘన్‌పై సంచలన ప్రదర్శన (5/4) చేసిన టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ టాప్-10లోకి దూసుకొచ్చాడు. భువీ.. 11వ స్థానం నుంచి సెవెన్త్ ప్లేస్‌కు చేరుకున్నాడు. టీమిండియా నుంచి టాప్-10లో నిలిచిన ఏకైక బౌలర్ భువీ ఒక్కడే కావడం విశేషం. ఈ జాబితాలో ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సఫారీ స్పిన్నర్ తబ్రేజ్ షంషి రెండులో, ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మూడో ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఆసియా కప్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ విన్నర్ వనిందు హసరంగ (శ్రీలంక) తొమ్మిదో స్థానం నుంచి ఆరో ప్లేస్‌కు ఎగబాకాడు. -
పాక్ కెప్టెన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లిన స్టార్ ఓపెనర్
ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ దుమ్మురేపాడు. ఆసియాకప్‌లో స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న రిజ్వాన్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ తన స్థిరత్వాన్ని నిలబెట్టుకున్నాడు. ఆసియా కప్‌లో మూడు మ్యాచ్‌లాడిన రిజ్వాన్ ఒక అర్థసెంచరీ సాయంతో 197 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఐసీసీ ప్రకటించిన తాజా టి20 ర్యాంకింగ్స్‌లో రిజ్వాన్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. 815 పాయింట్లతో తొలి స్థానంలో రిజ్వాన్ ఉండగా.. నిన్నటివరకు టాప్ ప్లేస్‌లో ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజం 794 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. ఇక సౌతాఫ్రికా స్టార్ మార్క్రమ్ 792 పాయింట్లతో మూడు.. టీమిండియా నుంచి సూర్యకుమార్ యాదవ్ 775 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ఐదో స్థానంలో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ ఉన్నాడు. ఇక ఆసియాకప్‌లో భాగంగా సూపర్-4లో మంగళవారం శ్రీలంకతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 612 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన లంక ఓపెనర్ పాతుమ్ నిసాంక ఒక స్థానం ఎగబాకి 675 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా తరపున ఆసియాకప్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్న కోహ్లి మాత్రం రెండు స్థానాలు దిగజారి 29వ స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో జోష్ హాజిల్‌వుడ్ 792 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. తబ్రెయిజ్ షంసీ రెండు, ఆదిల్ రషీద్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో అఫ్గానిస్తాన్ కెప్టెన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ 256 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 248 పాయింట్లతో షకీబ్ అల్ హసన్ రెండు.. 221 పాయింట్లతో మొయిన్ అలీ మూడో స్థానంలో ఉన్నాడు. On 🔝 of the @MRFWorldwide ICC Men’s T20I Batting Rankings 👑 Congratulations, @iMRizwanPak 👏 👉 https://t.co/mvY3tc8Zdi — ICC (@ICC) September 7, 2022 చదవండి: ఆసియా కప్‌లో వరుస పరాజయాల నేపథ్యంలో భారత అభిమానుల ఆక్రోశం Asia Cup 2022: అంతా అయిపోయింది .. వెళ్లి లాగేజీ సర్దుకోండి! టాటా బై బై! -
ICC T20 Rankings: దుమ్ములేపిన హార్దిక్.. తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా..
Asia Cup 2022 India Vs Pakistan- Hardik Pandya- ICC T20 Latest Rankings: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి ఆల్‌రౌండర్ల జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు. తద్వారా కెరీర్లో తొలిసారిగా ఈ మేరకు అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. కాగా ఆసియా కప్-2022 టోర్నీలో పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. అద్భుతంగా రాణించి.. చిరకాల ప్రత్యర్థి పాక్‌తో దుబాయ్ వేదికగా ఆదివారం(ఆగష్టు 28) సాగిన మ్యాచ్‌లో పాండ్యా బాల్‌తో, బ్యాట్‌తోనూ రాణించాడు. 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన హార్దిక్.. 25 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక లక్ష్య ఛేదనలో భాగంగా.. ఆరోస్థానంలో బరిలోకి దిగాడు. 17 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 33 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే సిక్స్ బాది టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో 167 రేటింగ్ పాయింట్లు సాధించిన హార్దిక్ పాండ్యా ఐసీసీ టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఈ ర్యాంకింగ్స్‌లో అఫ్గనిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ మొదటి స్థానం(257 పాయింట్లు)లో కొనసాగుతున్నాడు. ఐసీసీ తాజా టీ20 ఆల్‌రౌండర్ల జాబితా: టాప్-5లో ఉన్నది వీళ్లే 1. మహ్మద్ నబీ- అఫ్గనిస్తాన్(257) 2. షకీబ్ అల్ హసన్- బంగ్లాదేశ్(245) 3. మొయిన్ అలీ- ఇంగ్లండ్(221) 4. గ్లెన్ మాక్స్వెల్- ఆస్ట్రేలియా(183) 5. హార్దిక్ పాండ్యా- ఇండియా (167) చదవండి: Rishabh Pant: జట్టులో పంత్‌కు ప్రస్తుతం స్థానం లేదు! అతడిని తప్పిస్తే గానీ.. చోటు దక్కదు! Asia Cup 2022: శ్రీలంకతో మ్యాచ్! మాకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి.. -
ఐసీసీ టీట్వంటీ ర్యాంకింగ్స్ లో భారత క్రికెటర్ల జోరు
-
ICC T20 Rankings: పాపం సూర్య.. నెంబర్ 1 కాలేకపోయాడు! అదరగొట్టిన రవి బిష్ణోయి!
ICC Batting And Bowling T20 Rankings: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అతడికి చేరువగా వచ్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ తాజా ర్యాంకింగ్స్‌లోనూ రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌కు సూర్యకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఆడి మంచి స్కోరు నమోదు చేసి ఉంటే సూర్య.. నంబర్ 1గా నిలిచేవాడు. కానీ.. అలా జరుగలేదు. టాప్-5లో.. ఐసీసీ బుధవారం ప్రకటించిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ 805 పాయింట్లతో రెండో స్థానానికే పరిమితమయ్యాడు. బాబర్ ఆజం 818 పాయింట్లతో మొదటి ర్యాంకును కాపాడుకున్నాడు. ఇక వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్), ఎయిడెన్ మార్కరమ్(దక్షిణాఫ్రికా), డేవిడ్ మలాన్(ఇంగ్లండ్) నిలిచారు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో మొత్తంగా 115 పరుగులు సాధించిన టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. 66వ స్థానం నుంచి 59వ ర్యాంకుకు చేరుకున్నాడు. రవి బిష్ణోయి అదరగొట్టిన రవి బిష్ణోయి.. టాప్-50లోకి.. ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయి దుమ్ములేపాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టిన అతడు ఏకంగా టాప్-50లోకి చేరుకున్నాడు. 481 పాయింట్లతో కెరీర్ బెస్ట్ 44వ ర్యాంకు సాధించాడు. ఇక ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో అద్బుతంగా(6 వికెట్లు) రాణించినప్పటికీ.. విండీస్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ 28వ స్థానం నుంచి 35వ స్థానానికి పడిపోయాడు. ఇక టీమిండియా పేసర్ హర్షల్ పటేల్ విషయానికొస్తే.. ఒక స్థానం దిగజారి 28వ ర్యాంకుకు పడిపోయాడు. మరో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తొమ్మిదో ర్యాంకుకు దిగజారాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా స్టార్ జోష్ హాజిల్‌వుడ్ 792 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఉన్నది వీళ్లే! 1.బాబర్ ఆజం(పాకిస్తాన్)- 818 పాయింట్లు 2. సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 805 పాయింట్లు 3.మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్)- 794 పాయింట్లు 4.ఎయిడెన్ మార్కరమ్(దక్షిణాఫ్రికా)- 792 పాయింట్లు 5.డేవిడ్ మలాన్(ఇంగ్లండ్)- 731 పాయింట్లు 6. ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా)- 716 పాయింట్లు 7.పాథుమ్ నిశాంక(శ్రీలంక)-661 పాయింట్లు 8.డెవాన్ కాన్వే(న్యూజిలాండ్)- 655 పాయింట్లు 9.నికోలస్ పూరన్(వెస్టిండీస్)-644 పాయింట్లు 10. మార్టిన్ గఫ్టిల్(న్యూజిలాండ్)-638 పాయింట్లు చదవండి: Asia Cup 2022: టీమిండియా సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు అదే! టాప్ స్కోరర్లను వదిలేసి.. -
నాలుగో ర్యాంక్‌లో టీమిండియా ఓపెనర్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన రెండు స్థానాలు పడిపోయి నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది. షఫాలీ వర్మ ఆరో స్థానానికి పడిపోగా... జెమీమా ఏడు స్థానాలు ఎగబాకి తొమ్మిది నెలల తర్వాత మళ్లీ పదో ర్యాంక్‌లో నిలిచింది. టాప్ ర్యాంక్‌లో ఆసీస్ ఓపెనర్ బెత్ మూనీ ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో ఆసీస్ కెప్టెన్ లానింగ్, న్యూజిలాండ్ కెప్టెన్ సోఫియా డివైన్ కొనసాగుతున్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత పేస్ బౌలర్ రేణుక సింగ్ పది స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ 18వ ర్యాంక్‌ను అందుకుంది. -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన ఆసీస్ ఓపెనర్.. మళ్లీ నెంబర్ 1 స్థానానికి!
ఐసీసీ మహిళల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ అదరగొట్టింది. కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన మూనీ టీ20 ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్లో 179 పరుగులతో మూనీ టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఫైనల్లో భారత్‌పై 61 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన మూనీ.. పాకిస్తాన్, న్యూజిలాండ్‌పై పై 70, 36 పరుగులతో రాణించింది. దీంతో రెండో స్థానంలో ఉన్న ఆమె 743 పాయింట్లతో ఆసీస్ కెప్టెన్ లానింగ్‌ను వెనుక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. కాగా మూనీ ఇప్పటి వరకు తన టీ20 కెరీర్లో మూడో సారి నెం1 ర్యాంక్ సాధించడం గమనార్హం. మరోవైపు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ తహిలియా మెక్‌గ్రాత్ తన కెరీర్లో అత్యత్తుమ ర్యాంక్ సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొట్టిన మెక్‌గ్రాత్.. తన కెరీర్లో తొలి సారి ఐదో స్థానానికి చేరుకుంది. ఆదే విధంగా భారత బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ కూడా తొలి సారి 10వ ర్యాంక్ సాధించింది. ఇక ఓవరాల్‌గా టాప్ ర్యాంక్‌లో బ్రెత్ మూనీ ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో ఆసీస్ కెప్టెన్ లానింగ్, న్యూజిలాండ్ కెప్టెన్ సోఫియా డివైన్ కొనసాగుతున్నారు. చదవండి: Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్.. డీకే, అశ్విన్ వద్దు! అతడు ఉంటేనే బెటర్! -
అదరగొట్టిన సూర్యకుమార్.. ఏకంగా 44 స్థానాలు ఎగబాకి.. టాప్-5లోకి!
ICC T20 Batting Rankings- Suryakumar Yadav: ఐసీసీ టీ20 క్రికెట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ సూర్యకుయార్ యాదవ్ దుమ్ములేపాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన అతడు ఏకంగా 44 స్థానాలు ఎగబాకాడు. మొత్తంగా 732 పాయింట్లు సాధించిన సూర్య.. కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. ఐదో స్థానంలో నిలిచి సత్తా చాటాడు. కాగా ఇంగ్లండ్‌తో టీమిండియా టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ మెరుగైన ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. మొదటి టీ20లో 39 పరుగులు చేసిన సూర్య.. రెండో మ్యాచ్‌లో 15 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, మూడో టీ20 మ్యాచ్‌లో మాత్రం ఈ ముంబై బ్యాటర్ విశ్వరూపం ప్రదర్శించాడు. 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగి 212 స్ట్రైక్‌రేటుతో 117 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైనా సూర్య అద్భుత ఇన్నింగ్స్ అభిమానులను ఆకట్టుకుంది. కాగా టీ20 ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్‌కు ఇది తొలి సెంచరీ కావడం విశేషం. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న మూడు వన్డేల సిరీస్ జట్టులోనూ అతడు భాగమై ఉన్నాడు. ఇక సూర్య మినహా మరే ఇతర టీమిండియా బ్యాటర్‌కు టాప్-10లో చోటు దక్కకపోవడం గమనార్హం. ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్- టాప్-10లో ఉన్నది వీళ్లే: 1.బాబర్ ఆజమ్(పాకిస్తాన్)- 818 పాయింట్లు 2. మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్)- 794 పాయింట్లు 3.ఎయిడెన్ మార్కరమ్(దక్షిణాఫ్రికా)- 757 పాయింట్లు 4. డేవిడ్ మలన్(ఇంగ్లండ్)- 754 పాయింట్లు 5. సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 732 పాయింట్లు 6.ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా)- 716 పాయింట్లు 7. డెవాన్ కాన్వే(న్యూజిలాండ్)- 703 పాయింట్లు 8.నికోలస్ పూరన్(వెస్టిండీస్)- 667 పాయింట్లు 9.పాథుమ్ నిశాంక(శ్రీలంక)- 661 పాయింట్లు 10. మార్టిన్ గఫ్టిల్(న్యూజిలాండ్), రసీ వాన్ డెర్ డసెన్(దక్షిణాఫ్రికా)- 658 పాయింట్లు. చదవండి: ICC world Cup Super League: వన్డే సిరీస్ రద్దు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్! ప్రపంచకప్ రేసు నుంచి తప్పుకొన్నట్లేనా? Surya Kumar Yadav: ప్రస్తుతం అతడిని ఎదుర్కోగల బౌలర్ ప్రపంచంలోనే ఎవరూ లేరు! A huge climb for Suryakumar Yadav in T20I cricket, as Dimuth Karunaratne reaches a career-high ranking on the Test scene! More on the latest @MRFWorldwide rankings 📈 — ICC (@ICC) July 13, 2022 An innings worth millions - whole crowd gave a standing ovation to Suryakumar Yadav. pic.twitter.com/gj2ZzhyS76 — Mufaddal Vohra (@mufaddal_vohra) July 10, 2022 -
విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ హవా కొనసాగుతూ ఉంది. తాజా ర్యాంకింగ్స్‌లోనూ ఆజమ్ తన అగ్రపీఠాన్ని (818 పాయింట్లు) పదిలంగా కాపాడుకున్నాడు. ఈ క్రమంలో బాబర్ ఆజమ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం నంబర్ 1 స్థానంలో ఉన్న బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. Another record for Babar Azam 👊 All the changes in this week's @MRFWorldwide men's rankings 👇 — ICC (@ICC) June 29, 2022 కోహ్లి 1013 రోజుల పాటు అగ్రస్థానంలో కొనసాగగా.. తాజాగా బాబర్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఏడాది కేవలం 2 టీ20లు మాత్రమే ఆడిన కోహ్లి తాజా ర్యాంకింగ్స్‌లో 21వ స్థానానికి పడిపోగా.. బాబర్ మాత్రం తన రేటింగ్ పాయింట్లను మెరుగుపర్చుకుంటూ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు. బాబర్ తర్వాత రెండో ప్లేస్‌లో పాక్ వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ (794) కొనసాగుతున్నాడు. రిజ్వాన్‌కు బాబర్‌కు మధ్య 24 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. ఇక ఇతర స్థానాల విషయానికొస్తే.. ఈ జాబితా టాప్ 10లో టీమిండియా నుంచి ఇషాన్ కిషన్ (682) ఒక్కడికే స్థానం లభించింది. గత వారం ర్యాంకింగ్స్‌లో 6వ ప్లేస్‌లో ఉన్న ఇషాన్.. ఓ స్థానం కోల్పోయి సెవెన్త్ ప్లేస్‌కు పడిపోయాడు. ఈ ఒక్క మార్పు మినహా గత వారం ర్యాంకింగ్స్‌తో పోలిస్తే ఈ వారం పెద్దగా మార్పులు లేవు. మార్క్రమ్ (757), డేవిడ్ మలాన్ (728), ఆరోన్ ఫించ్ (716), డెవాన్ కాన్వే (703), పథుమ్ నిస్సంక (661), మార్టిన్ గప్తిల్ (658), డెస్సెన్ (658) వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. టీమిండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 17, రోహిత్ శర్మ 19 ర్యాంక్‌ల్లో కొనసాగుతుండగా.. ఐర్లాండ్ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన దీపక్ హుడా ఏకంగా 414 స్థానాలు ఎగబాకి 104వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. చదవండి: IND VS IRE 2nd T20: హార్దిక్ సేన ఖాతాలో చెత్త రికార్డు -
Ishan Kishan: టాప్-10లోకి తొలిసారి .. ఒకేసారి 68 స్థానాలు ఎగబాకి
ఐసీసీ బుధవారం ప్రకటించిన టి20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఇషాన్ కిషన్ సూపర్ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో 164 పరుగులు చేసిన ఇషాన్ ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దీంతో ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో ఇషాన్ కిషన్ తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. 23 ఏళ్ల ఇషాన్ ఒకేసారి 68 స్థానాలు ఎగబాకి 689 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. మిగతా టీమిండియా బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్ 17వ స్థానానికి పడిపోగా.. సిరీస్‌కు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ 14, రోహిత్ శర్మ 16, విరాట్ కోహ్లి రెండు స్థానాలు దిగజారి 21వ స్థానంలో నిలిచాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో తొలి ఆరు స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. టి20 ప్రపంచ నెంబర్‌వన్ బ్యాటర్‌గా బాబర్ ఆజం(818 పాయింట్లు) నిలవగా.. పాకిస్తాన్‌కే చెందిన మహ్మద్ రిజ్వాన్ 794 పాయింట్లతో రెండో స్థానంలో.. సౌతాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ 772 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. టాప్-10 టీమిండియా నుంచి ఒక్క బౌలర్ కూడా చోటు దక్కించుకోలేదు. సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌లో బౌలింగ్‌లో విశేషంగా రాణిస్తున్న భువనేశ్వర్ కుమార్ ఏడు స్థానాలు ఎగబాకి 11వ స్థానంలో నిలవగా.. చహల్ 26వ స్థానంలో నిలిచాడు. ఇక ప్రపంచ నెంబర్ వన బౌలర్‌గా ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్(792 పాయింట్లు) తొలి స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఆదిల్ రషీద్(746 పాయింట్లు) రెండో స్థానంలో.. దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రెయిజ్ షంసీ మూడో స్థానంలో ఉన్నాడు.ఆల్‌రౌండర్ల విభాగంలో అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ తొలి స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్ స్టార్ షకీబుల్ హసన్ రెండు, మొయిన్ అలీ(ఇంగ్లండ్) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. Josh Hazlewood claims No.1 spot🔝 Ishan Kishan gallops into top 10 🔥 Glenn Maxwell, Wanindu Hasaranga gain 🔼 Plenty of 📈📉 in the @MRFWorldwide ICC Men's T20I Player Rankings 👉 https://t.co/ebcusn3vBT pic.twitter.com/dyQVqkmRPG — ICC (@ICC) June 15, 2022 చదవండి: ENG vs NZ 2nd Test: విజయానందంలో ఉన్న ఇంగ్లండ్‌కు ఐసీసీ షాక్.. -
శ్రేయాస్ అయ్యర్ జోరు.. టాప్-10 నుంచి కోహ్లి ఔట్
ఐసీసీ బుధవారం విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ జోరు చూపెట్టాడు. శ్రీలంకతో ఇటీవలే ముగిసిన టి20 సిరీస్‌లో శ్రేయాస్ మూడు మ్యాచ్‌లు కలిపి మూడు అర్థ సెంచరీల సాయంతో 204 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన అయ్యర్.. తాజాగా టి20 ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. లంకతో సిరీస్‌కు ముందు టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విభాగంలో 45వ స్థానంలో ఉన్న అయ్యర్ ఏకంగా 27 స్థానాలు ఎగబాకి 18వ స్థానంలో నిలిచాడు. ఇక లంకతో టి20 సిరీస్‌కు దూరంగా ఉన్న కోహ్లి టాప్ 10లో స్థానం కోల్పోయాడు. 612 పాయింట్లతో ఐదు స్థానాలు దిగజారిన కోహ్లి 15వ స్థానంలో నిలిచాడు. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా నుంచి కేఎల్ రాహుల్ ఒక్కడే టాప్-10లో చోటు దక్కించుకోవడం విశేషం. 646 పాయింట్లతో రాహుల్ 10వ స్థానంలో నిలిచాడు. చదవండి: Mohammed Siraj: ఆ తొమ్మిది వికెట్లు నా తలరాతను మార్చాయి: సిరాజ్ ఇక పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ 805 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్) 798 పాయింట్లతో రెండు, ఎయిడెన్ మార్క్రమ్(సౌతాఫ్రికా) 796 పాయింట్లో మూడో స్థానంలో ఉన్నాడు. డేవిడ్ మలాన్( ఇంగ్లండ్, 728 పాయింట్లు), డెవన్ కాన్వే(న్యూజిలాండ్, 703 పాయింట్లు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక టీమిండియాతో రెండో టి20లో 75 పరుగుల ఇన్నింగ్స్‌తో మెరిసిన లంక బ్యాట్స్‌మన్ పాతుమ్ నిస్సాంక ఆరు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో టాప్‌టెన్‌లో టీమిండియా నుంచి ఒక్కరు కూడా లేరు. ఇక లంకతో సిరీస్‌లో బౌలింగ్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన భువనేశ్వర్ మూడు స్థానాలు ఎగబాకి 17వ స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికాకు చెందిన తబ్రెయిస్ షంసీ(784 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియాకు చెందని జోష్ హాజిల్‌వుడ్ 752 పాయింట్లతో రెండు, ఆదిల్ రషీద్( ఇంగ్లండ్, 746 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. చదవండి: Sunil Narine: భీకర ఫామ్‌లో కేకేఆర్ ప్లేయర్..8 సిక్సర్లు, 3 ఫోర్లతో విధ్వంసం లంకతో మూడో టి20: శ్రేయాస్ అయ్యర్ (73*) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ వీడియో 🔹 Rashid Khan breaks into top 10 ODI bowlers 🔹 Pathum Nissanka moves to No.9 in T20I batters’ list Full rankings ➡️ https://t.co/saWOSRZ2py pic.twitter.com/UUXbK8RDme — ICC (@ICC) March 2, 2022 ❇️ Kagiso Rabada in top 3 Test bowlers ❇️ Colin de Grandhomme moves up in Test all-rounders’ list Full rankings ➡️ https://t.co/saWOSRZ2py pic.twitter.com/ZQodsgwBpo — ICC (@ICC) March 2, 2022 -
ICC T20 Rankings: టీమిండియా నెంబర్‌వన్.. ఆరేళ్ల తర్వాత
దుబాయ్: ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. ఆదివారం వెస్టిండీస్‌తో సిరీస్‌ను 3–0తో గెలుచుకున్న అనంతరం భారత్ నంబర్‌వన్‌గా (269 రేటింగ్ పాయింట్స్) నిలిచింది. ఇప్పటి వరకు నంబర్‌వన్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను రెండో స్థానానికి పడేసి రోహిత్ సేన ముందంజ వేసింది. ఇంగ్లండ్‌కు కూడా సమానంగా 269 రేటింగ్ పాయింట్లే ఉన్నా... 39 మ్యాచ్‌ల ద్వారా పాయింట్లపరంగా భారత్ (10,484), ఇంగ్లండ్‌కంటే (10,474) పది పాయింట్లు ఎక్కువగా ఉండటంతో అగ్రస్థానం దక్కింది. ఈ జాబితాలో పాకిస్తాన్ (266) మూడో స్థానంలో నిలిచింది. గతంలో భారత్ 2016లో చివరిసారిగా నంబర్‌వన్‌గా నిలిచింది. రెండు నెలల పాటు ఆ స్థానంలో ఉన్న జట్టు ఆ తర్వాత వెనుకబడిపోయింది. ప్రస్తుత ర్యాంకింగ్స్ పీరియడ్‌లో 5–0తో న్యూజిలాండ్‌తో, 2–1తో ఆ్రస్టేలియాపై, 3–2తో ఇంగ్లండ్‌పై, 3–0తో న్యూజిలాండ్‌పై, 3–0తో వెస్టిండీస్‌పై సాధించిన విజయాల కారణంగా భారత్‌కు టాప్ ర్యాంక్ లభించింది. -
ఐపీఎల్లో అన్‌సోల్డ్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం.. ఆ వెనుకే 7.75 కోట్ల ఆటగాడు!
ICC T20 Rankings: ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. టీ20 ఫార్మాట్ బౌలర్ల విభాగంలో నాలుగు స్థానాలు ఎగబాకాడు. 783 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంసీ (784 పాయింట్లు) అగ్రస్థానానికి చేరుకున్నాడు. అతడి కంటే ఒకే ఒక్క పాయింట్ వెనుకబడి ఉన్న హాజిల్‌వుడ్ ద్వితీయ స్థానానికి పరిమితమయ్యాడు. కాగా శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న అతడు ఈ మేరకు టాప్-2లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక లంకతో సిరీస్‌లో హాజిల్‌వుడ్ వరుసగా 4, 3(ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్), ఒక వికెట్ పడగొట్టాడు. ఇప్పటికే 3-0 తేడాతో ఈ సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకుంది. కాగా శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగ, ఆదిల్ రషీద్(ఇంగ్లండ్), ఆడం జంపా(ఆస్ట్రేలియా), రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్), ముజీబ్ ఉర్ రహమాన్(అఫ్గనిస్తాన్), అన్రిచ్ నోర్జే(దక్షిణాఫ్రికా), షాబాద్ ఖాన్(పాకిస్తాన్), టిమ్ సౌథీ(న్యూజిలాండ్) టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 7.75 కోట్లు వెచ్చించి హాజిల్‌వుడ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉన్న తబ్రేజ్ అమ్ముడుపోకుండా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. 👑 New number one T20I bowler 🚀 Rohan Mustafa launches into the top-10 ⏫ Josh Hazlewood climbs four spots after an incredible performance against Sri Lanka Some big movements in the latest @MRFWorldwide ICC Men's Player Rankings for T20Is. Details 👉 https://t.co/YrLa53Ls5E pic.twitter.com/otGbDw3B0r — ICC (@ICC) February 16, 2022 -
చరిత్ర సృష్టించిన షఫాలీ వర్మ.. తొలిసారి
ICC Women's T20I: ఐసీసీ టి20 వుమెన్స్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ షఫాలీ వర్మ అదరగొట్టింది. తాజాగా ప్రకటించిన బ్యాట్స్‌వుమెన్ ర్యాంకింగ్స్‌లో షఫాలీ 726 పాయింట్లతో తొలిసారి అగ్రస్థానంలో నిలిచింది. ఇక మరో టీమిండియా ప్లేయర్ స్మృతి మంధాన మాత్రం 709 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన ఆస్ట్రేలియన్ బ్యాటర్ బెత్‌మూనీ 724 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చదవండి: Gautam Gambhir: వెంకటేశ్ అయ్యర్‌కు వన్డే క్రికెట్ ఆడే మెచ్యూరిటీ లేదు.. ఇక ఇంగ్లండ్‌తో హోమ్ సిరీస్‌లో తొలి టి20లో 64 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియన్ కెప్టెన్ మెగ్ లానింగ్ 714 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. అదే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ తాహిలా మెక్‌గ్రాత్ 91 పరుగుల సునామీ ఇన్నింగ్స్‌తో ర్యాంకింగ్స్‌లో ఏకంగా 29 స్థానాలు ఎగబాకి 28వ స్థానంలో నిలిచింది. ఇక శ్రీలంక బ్యాటర్ చమేరీ ఆటపట్టు అటు బ్యాటింగ్.. ఇటు ఆల్‌రౌండ్ విభాగంలో టాప్‌టెన్‌లో నిలవడం విశేషం. బ్యాటింగ్‌లో 8వ స్థానంలో నిలిచిన చమేరీ.. ఆల్‌రౌండర్ విభాగంలో ఏడో స్థానంలో ఉంది. ఇక ఆల్‌రౌండర్ విభాగంలో 370 పాయింట్లతో తొలిస్థానంలో నిలవగా.. ఇంగ్లండ్‌కు చెందిన నటాలీ సీవర్ 352 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. చదవండి: కేశవ్ మహరాజ్ 'జై శ్రీరామ్'.. అభిమానుల ప్రశంసల వర్షం 🔹 Shafali Verma back on 🔝 🔹 Big gains for Chamari Athapaththu 🙌 Here are the movements in this week's @MRFWorldwide ICC Women's Player Rankings 📈 Details 👉 https://t.co/vgKLeRzB8D pic.twitter.com/Eh6A9fi7bj — ICC (@ICC) January 25, 2022 -
విరాట్ కోహ్లి ఔట్.. కేఎల్ రాహుల్ ఒక్కడే
Virat Kohli Out From Top 10 ICC T20 Batting Rankings.. ఐసీసీ బుధవారం టి20 ర్యాంకింగ్స్ విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక్కడే టాప్-5 లో నిలిచాడు. ఇక టి20 మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్-10 నుంచి ఔటయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో రోహిత్, రాహుల్ మంచి ప్రదర్శన కనబరిచారు. తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన రాహుల్ 80 పరుగులు చేశాడు. దీంతో తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపరుచుకొని 729 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. చదవండి: KL Rahul: కివీస్‌తో టెస్టుకు ముందు బిగ్‌షాక్.. గాయంతో కేఎల్ రాహుల్ ఔట్ ఇక సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రోహిత్ శర్మ రెండు స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. ఇక పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ 809 పాయింట్లతో టాప్ స్థానాన్ని కాపాడుకోగా.. 805 పాయింట్లతో డేవిడ్ మలాన్(ఇంగ్లండ్) రెండో స్థానంలో.. దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్రమ్ 796 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 735 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ చాలా రోజుల తర్వాత టాప్‌టెన్‌లో చోటు సంపాదించాడు. గప్టిల్ 658 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో వనిందు హసరంగ(శ్రీలంక) 797 పాయింట్లతో తొలి స్థానం.. తబ్రెయిజ్ షంసీ(దక్షిణాఫ్రికా) 784 పాయింట్లతో రెండో స్థానం.. ఆడమ్ జంపా(ఆస్ట్రేలియా) 725 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో టాప్‌టెన్‌లో ఒక్కరు కూడా లేరు. ఇక ఆల్‌రౌండ్ విభాగంలో మహ్మద్ నబీ(అప్గానిస్తాన్).. 265 పాయింట్లతో తొలిస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్).. 231 పాయింట్లతో రెండో స్థానంలో.. లియామ్ లివింగ్‌స్టోన్( ఇంగ్లండ్).. 179 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. చదవండి: Ravichandran Ashwin: ఫైనల్ తర్వాత ఇప్పుడే మళ్లీ.. అశ్విన్ ముంగిట అరుదైన రికార్డులు! -
Wanindu Hasaranga: అదరగొట్టిన హసరంగ.. టీమిండియా బౌలర్లు ఒక్కరూ లేరు!
ICC T20 Rankings: Wanindu Hasaranga Tops No Indian Bowlers In Top 10: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో ఆకట్టుకున్న శ్రీలంక యువ సంచలనం వనిందు హసరంగ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. బౌలర్ల జాబితాలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న హసరంగ.. ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్-3లో నిలిచాడు. ఒక స్థానం మెరుగుపరచుకుని 173 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇక అఫ్గనిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ ఆల్‌రౌండర్ల జాబితాలో 265 పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు గాయం కారణంగా టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీ మధ్యలోనే జట్టుకు దూరమైన బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్(260) ఒక స్థానం కోల్పోయి రెండో ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. వనిందు హసరంగ(శ్రీలంక- 173), గ్లెన్ మాక్స్వెల్(ఆస్ట్రేలియా- 165), ఒమన్ కెప్టెన్ జీషన్ మక్సూద్(160) పాయింట్లతో మొదటి 5 ర్యాంకుల్లో చోటు దక్కించుకున్నారు. టీమిండియా బౌలర్లు ఒక్కరూ లేరు ఐసీసీ టీ20 బౌలర్ల ర్యాంకింగ్ జాబితాలో వనిందు హసరంగా(797) పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2021లో మొత్తంగా(క్వాలిఫయర్స్, సూపర్ 12) 16 వికెట్లు పడగొట్టిన అతడు.. తన ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత తబ్రేజ్ షంసీ(దక్షిణాఫ్రికా- 784), ఆదిల్ రషీద్(ఇంగ్లండ్- 727), రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్- 710), ఆడం జంపా(ఆస్ట్రేలియా- 709) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక ఆల్‌రౌండర్, బౌలర్ల జాబితాలో ఒక్క టీమిండియా ప్లేయర్ కూడా టాప్-10లో లేకపోవడం గమనార్హం. కాగా పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో పరాజయాల నేపథ్యంలో.. తర్వాతి మ్యాచ్‌లలో ఆకట్టుకున్నా కోహ్లి సేన సెమీస్ చేరలేక ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. చదవండి: Virat Kohli: అగ్రస్థానంలో బాబర్ ఆజమ్.. 4 స్థానాలు దిగజారిన కోహ్లి.. ఏకంగా.. After a strong #T20WorldCup campaign, Aiden Markram continues his climb 🧗♂️ Plenty of movement in the @MRFWorldwide T20I player rankings 👉 https://t.co/vJD0IY4JPU pic.twitter.com/Y7tTwgdvPM — ICC (@ICC) November 10, 2021 -
దూసుకొచ్చిన మార్క్రమ్.. దిగజారిన టీమిండియా బ్యాటర్స్ ర్యాంకింగ్
Aiden Markram Career Best ICC T20 Rankings.. ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ సత్తా చాటాడు. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో 40, 51* రాణించిన మార్క్రమ్ ఏకంగా 8 స్థానాలు ఎగబాకి 743 పాయింట్లతో మూడోస్థానానికి చేరుకొని కెరీర్ బెస్ట్ అందుకున్నాడు. ఇక పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ కూడా తన కెరీర్ బెస్ట్ సాధించాడు. చదవండి: T20 WC 2021: ఫోకస్‌గా లేవు.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు పక్కనపెడుతున్నా టీమిండియాతో మ్యాచ్‌లో సూపర్ హాఫ్ సెంచరీ.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 33 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన రిజ్వాన్ మూడుస్థానాలు ఎగబాకి 727 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. డేవిడ్ మలాన్ 831 పాయింట్లతో తన నెంబర్‌వన్ స్థానాన్ని కాపాడుకోగా.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ 820 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు కేఎల్ రాహుల్ ర్యాంకులు దిగజారాయి. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి అర్థసెంచరీ సాధించినప్పటికి ఒకస్థానం దిగజారి 725 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక కేఎల్ రాహుల్ రెండు స్థానాలు దిగజారి 684 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓటమి.. భారత బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపెట్టాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రెయిజ్ షంసీ 750 పాయింట్లతో నెంబర్‌వన్ స్థానంలో ఉండగా.. శ్రీలంక బౌలర్ వనిందు డిసిల్వా(726 పాయింట్లు), అఫ్గన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్(720 పాయింట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. చదవండి: Quinton De Kock: మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు డికాక్ ఔట్.. కారణం ⚡ Big gains for Aiden Markram, JJ Smit 🔥 Mohammad Rizwan rises to No.4 among batters All you need to know about the latest rankings 👉 https://t.co/1sQBCW4KB0 pic.twitter.com/WfPp8XBb5I — ICC (@ICC) October 27, 2021 -
ICC Rankings: స్థానం దిగజారిన షఫాలీ వర్మ.. స్మృతి మంధన మాత్రం
Shafali Verma And Smrithi Mandhana ICC T20 Rankings.. ఐసీసీ మంగళవారం ప్రకటించిన టి20 వుమెన్స్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ(726 పాయింట్లు) టాప్ ప్లేస్‌ను చేజార్చుకొని రెండో స్థానానికి పరిమితం కాగా.. మరో టీమిండియా బ్యాటర్ స్మృతి మంధన(709 పాయింట్లు) మాత్రం తన మూడో స్థానాన్ని పదిలపరుచుకుంది. ఇక ఆస్ట్రేలియా వుమెన్ బ్యాటర్ బెత్ మూనీ 754 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆసీస్‌కే చెందిన మెగ్ లానింగ్(698 పాయింట్లు), సోఫీ డివైన్( 692 పాయింట్లు), అలెసా హేలీ(673 పాయింట్లు)లు వరుసగా 4,5,6 స్థానాల్లో నిలిచారు. కాగా ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌పై ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. కాగా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో ఐదుగురు ఆసీస్ మహిళా క్రికెటర్లు ఉండడం విశేషం. ఇక బౌలింగ్ విభాగంలో ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్కిల్స్టోన్ 771 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. సారా గ్లెన్(ఇంగ్లండ్, 744 పాయింట్లు) రెండో స్థానంలో.. షబ్నిమ్ ఇస్మాయిల్(దక్షిణాఫ్రికా, 718 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. ఇక ఆల్‌రౌండ్ విభాగంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్ 370 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉండగా.. టీమిండియా నుంచి దీప్తి శర్మ 315 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. చదవండి: Virat Kohli: కెప్టెన్‌గా ఇదే చివరిసారి.. అంపైర్‌తో కోహ్లి వాగ్వాదం T20 World Cup: రషీద్ ఖాన్ టాప్-5 టీ20 క్రికెటర్ల లిస్టు.. ఎవరెవరంటే! We have a new No. 1 in town 👏 Plenty of movement in this week's @MRFWorldwide ICC Women's T20I Player Rankings 📈 More 👉 https://t.co/9r1AQ9zGSu pic.twitter.com/o0U1hEYJ1T — ICC (@ICC) October 12, 2021 -
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: టాప్- 10లో కోహ్లి.. ఇంకా...
ICC men’s T20I rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక స్థానం ఎగబాకి 4 వ స్థానంలో నిలిచాడు. మరో భారత బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తన ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కాగా ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రెండువ స్థానంలో, ఆస్ట్రేలియా వైట్ బాల్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ 3 వ స్థానంలో నిలిచారు. దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ నాలుగు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. మరో వైపు బౌలర్లలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రాజ్ షమ్సీ ఆగ్రస్థానంలో కొనసాగుతండగా, శ్రీలంక హాఫ్ స్పిన్నర్ వనిందు హసరంగా రెండో స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ పాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ రెండు స్థానాలు ఎగబాకి 8 వ స్థానంలో నిలిచాడు. చదవండి: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్ ర్యాంక్‌లో మిథాలీ రాజ్ 🔹 Gains for Quinton de Kock 👏 🔹 Mustafizur Rahman rises up 🙌 This week's @MRFWorldwide ICC Men's T20I Player Rankings has some big movements 📈 Details 👉 https://t.co/rxcheDGCjM pic.twitter.com/83AUWRMqwf — ICC (@ICC) September 15, 2021 -
టాప్ ర్యాంక్‌లో షఫాలీ వర్మ.. మూడో స్థానంలో స్మృతి మంధాన
ICC T20I Rankings: భారత మహిళా క్రికెట్ టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ టి20ల్లో తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసిన టి20 బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో ఆమె 759 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో ఆ్రస్టేలియా బ్యాటర్ బెత్ మూనీ (744 రేటింగ్స్)... మూడో స్థానంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (716) ఉన్నారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ ఆరో స్థానంలో... పూనమ్ యాదవ్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. చదవండి: మ్యాచ్ గెలిపించినా అక్షింతలు తప్పలేదు.. టీమిండియా కెప్టెన్‌పై బీసీసీఐ ఆగ్రహం -
మొన్న కోహ్లికి ఎసరు పెట్టాడు.. ఇప్పుడు మలాన్ వంతు
దుబాయ్: ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబార్ ఆజమ్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఇటీవలే టీమిండియా సారధి విరాట్ కోహ్లి నుంచి వన్డే టాప్ ర్యాంక్‌ను చేజిక్కించుకున్న బాబర్.. టీ20 అగ్రస్థానంపై కూడా కన్నేశాడు. దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గతవారం జరిగిన మూడవ టీ20లో అద్భుత శతకంతో(122) అదరగొట్టిన బాబార్.. 47 రేటింగ్ పాయింట్లు దక్కించుకుని రెండో స్థానంలో ఉన్న ఆసీస్ ఆటగాడు ఆరోన్ ఫించ్‌ను వెనక్కునెట్టి ఆ స్థానానికి దూసుకొచ్చాడు. సఫారీలపై బాబర్ సాధించిన శతకం అతని కెరీర్లో తొలి అంతర్జాతీయ టీ20 శతకం కావడం విశేషం. ప్రస్తుతం 844 రేటింగ్ పాయింట్లు కలిగి ఉన్న బాబర్... అగ్రస్థానంలో ఉన్న డేవిడ్ మలాన్(ఇంగ్లండ్)(892) కంటే కేవలం 48 పాయింట్లు మాత్రమే వెనుకపడి ఉన్నాడు. కాగా, గతేడాది నవంబర్ వరకు టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగిన బాబర్‌కు మరోసారి టీ20 అగ్రపీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది. పాక్ జట్టు నేటి (ఏప్రిల్ 21) నుంచి జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో బాబర్ ఓ మోస్తరుగా రాణించినా డేవిడ్ మలాన్ అగ్రస్థానానికి ఎసరు పెట్టడం ఖాయం. ఇదిలా ఉంటే, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(762) ఒక స్థానం కిందకు పడిపోయాడు. గతవారం ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న విరాట్.. తాజా జాబితాలో ఐదో ర్యాంక్‌కు దిగజారాడు. టీమిండియాకు చెందిన మరో ఆటగాడు కేఎల్ రాహుల్(743) సైతం రెండు స్థానాలు కోల్పోయి 7వ స్థానంలో ఉండగా, భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(613) ఒక స్థానాన్ని మెరుగుపరచుకుని 13వ ర్యాంక్‌కు చేరాడు. ఇక టీ20 బౌలర్ల జాబితా విషయానికొస్తే.. దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ షంషి(732), ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్(719), ఆసీస్ బౌలర్ ఆష్టన్ అగర్లు(702) మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. టీం ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్(272) మొదటి స్థానంలో ఉండగా, భారత్(270), ఆస్ట్రేలియా(267), పాక్(262) వరుసగా రెండు నుంచి నాలుగు ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నాయి. చదవండి: వైరలవుతున్న టీమిండియా ప్రస్తుత, మాజీ కెప్టెన్ల భార్యల ఫోటోలు -
దిగజారిన కోహ్లి, రాహుల్.. దుమ్మురేపిన కాన్వే
దుబాయ్: ఐసీసీ బుధవారం విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల ర్యాంకింగ్స్ దిగజారాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక స్థానం దిగజారి 762 పాయింట్లతో 5వ స్థానంలో నిలవగా.. కేఎల్ రాహుల్ ఒక స్థానం దిగజారి 743 పాయింట్లతో ఆరవ స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టీ20లో 52 బంతుల్లోనే 92 పరుగులతో విధ్వంసం సృష్టించిన న్యూజిలాండ్ ఆటగాడు డెవొన్ కాన్వే 5 స్థానాలు ఎగబాకి 784 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచి కెరీర్ బెస్ట్ సాధించాడు. ఇక ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ 892 పాయింట్లతో అగ్రస్థానం నిలుపుకోగా.. ఆరోన్ ఫించ్(830 పాయింట్లు), బాబర్ అజమ్( 801 పాయింట్లు) రెండు.. మూడు స్థానాల్లో నిలిచారు. ఇక బౌలింగ్ విభాగంలో టీమిండియా నుంచి ఒక్క బౌలర్ కూడా టాప్ 10లో చోటు సంపాదించలేకపోయారు. 733 పాయింట్లతో తబ్రియాజ్ షంషీ టాప్ లేపగా.. అప్ఘన్ బౌలర్ రషీద్ ఖాన్ 719 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. ఆసీస్ బౌలర్ ఆస్టన్ అగర్ 702 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ విభాగంలో ఆఫ్ఘన్‌కు చెందిన మహ్మద్ నబీ 285 పాయింట్లతో మొదటి స్థానం.. బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 248 పాయింట్లతో రెండో స్థానంలో.. ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 226 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇక టీమ్ విభాగంలో ఇంగ్లండ్(272 పాయింట్లు) టాప్ స్థానంలో నిలవగా.. భారత్ 270 పాయింట్లతో రెండో స్థానంలో.. ఆస్ట్రేలియా 267 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. చదవండి: ‘పంత్‌ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్లు ఉంటుంది’ ఐపీఎల్ 2021: వైఫై అస్సలు బాలేదు.. సాయం చేయండి -
కెప్టెన్ 4లో, వైస్ కెప్టెన్ 14లో
దుబాయ్: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారధి విరాట్ కోహ్లి హవా కొనసాగుతోంది. ప్రస్తుతం వన్డేల్లో అగ్రస్థానంలో, టెస్టులో 5వ స్థానంలో కొనసాగుతున్న ఆయన.. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన(3 హాఫ్ సెంచరీలు)తో అదరగొట్టి, తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇదే సిరీస్‌లో వరుస డకౌట్లతో దారుణంగా విఫలమైన కేఎల్ రాహుల్ ఒక ర్యాంకు కోల్పోయి ఐదో స్థానానికి పడిపోగా, ఆఖరి టీ20లో అర్ధశతకంతో చెలరేగిన రోహిత్(64).. మూడు స్థానాలు మెరుగుపరచుకొని 14వ ర్యాంకులో నిలిచాడు. టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ ఐదు స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ ర్యాంక్ 26వ స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, రెండవ స్థానంలో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, మూడో స్థానంలో పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ కొనసాగుతున్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ఈ జాబితాలో టీమిండియా నుంచి ఏ ఒక్క బౌలర్‌కు కూడా టాప్-10లో చోటు దక్కలేదు. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 597 రేటింగ్ పాయింట్లతో 14వ స్ధానంలో నిలువగా, రీఎంట్రీలో అదరగొట్టిన టీమిండియా పేసర్ భువనేశ్వర్ ఏకంగా 29 స్థానాలు మెరుగుపరుచుకొని 24వ స్థానంలో నిలిచాడు. టాప్-10 బౌలర్లలో దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంషీ అగ్రస్థానానికి ఎగబాకగా, ఆఫ్గనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ రెండో స్థానానికి పడిపోయాడు. చదవండి: టాప్ 5లోకి కోహ్లి..దిగజారిన కేఎల్ రాహుల్ ర్యాంకింగ్ -
దుమ్మురేపిన కాన్వే.. రాహుల్ మాత్రం అక్కడే
దుబాయ్: ఐసీసీ బుధవారం విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ 816 పాయింట్లతో రెండో స్థానం నిలుపుకోగా.. విరాట్ కోహ్లి మాత్రం 697 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్ 915 పాయింట్లతో టాప్ స్థానాన్ని నిలుపుకోగా.. పాక్ ఆటగాడు బాబర్ అజమ్ 801 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా), వాన్ డెర్ డసెన్(దక్షిణాఫ్రికా) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇక క్రైస్ట్ చర్చి వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో 99* పరుగుల దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ డెవోన్ కాన్వే తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్‌ను సాధించాడు. కాన్వే 46 స్థానాలు ఎగబాకి 17వ స్థానంలో నిలవగా.. కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 97 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్‌తో 11వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే.. ఆఫ్ఘన్ బౌలర్ రషీద్ ఖాన్ 736 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. తబ్రేయిజ్ షంషీ(దక్షిణాఫ్రికా) 733 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా..ముజీబ్ ఉర్ రెహమాన్ 730 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో టాప్ టెన్‌లో ఒక్కరు కూడా లేరు. ఇక ఆల్‌రౌండర్ కోటాలో మహ్మద్ నబీ 294 పాయింట్లతో మొదటి స్థానంలో.. బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ ఆల్ హసన్ రెండో స్థానంలో.. ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ మూడో స్థానంలో ఉన్నాడు. చదవండి: కివీస్‌పై ఆసీస్ ఘన విజయం: ఆర్సీబీ ఫ్యాన్స్ హర్షం! -
షఫాలీ చేజారిన టాప్ ర్యాంక్
దుబాయ్: టి20 వరల్డ్ కప్ ఫైనల్లో వైఫల్యం భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ ర్యాంకింగ్‌పై ప్రభావం చూపింది. సోమవారం విడుదలైన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజా ర్యాంకింగ్స్‌లో 16 ఏళ్ల షఫాలీ వర్మ టాప్ ర్యాంక్ నుంచి పడిపోయి 744 రేటింగ్ పాయింట్లతో మూడో ర్యాంక్‌కు చేరుకుంది. టి20 ప్రపంచకప్‌లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక షఫాలీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఫైనల్లో షఫాలీ కేవలం రెండు పరుగులు చేసి అవుటవ్వడంతో ఆమె ర్యాంక్ పడిపోయింది. ఫైనల్లో అజేయంగా 78 పరుగులు చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ బెథ్ మూనీ రెండు స్థానాలు పురోగతి సాధించి 762 ర్యాంకింగ్ పాయింట్లతో కొత్త ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది. న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ 750 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌లో కొనసాగుతోంది. భారత్‌కే చెందిన స్మృతి మంధాన ఏడో ర్యాంక్‌లో, జెమీమా రోడ్రిగ్స్ తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్లు దీప్తి శర్మ, రాధా యాదవ్, పూనమ్ యాదవ్ వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. -
టాప్ టెన్‌లో విరాట్ కోహ్లి
హైదరాబాద్: వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20లో టీమిండియా సారథి విరాట్ కోహ్లి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. కోహ్లికి రోహిత్, రాహుల్‌లు జత కలవడంతో పాటు బౌలర్లు సమష్టిగా రాణించడంతో టీమిండియా 67 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్‌లో అదరగొట్టిన కోహ్లి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ ను గెలుచుకున్నాడు. అంతేకాకుండా తాజాగా విడుదల చేసిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ టాప్-10లోకి దూసుకొచ్చాడు. ఇప్పటికే ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న కింగ్ కోహ్లి తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌లో ఆరు స్థానాలు మెరుగుపర్చుకొని పదో స్థానానికి చేరుకున్నాడు. దీంతో మూడు ఫార్మట్లలో టాప్-10లో చోటు దక్కించుకున్న కోహ్లి ఈ ఏడాదిని ఘనంగా ముగించనున్నాడు. అంతేకాకుండా ఈ ఏడాది మూడు ఫార్మట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించడంతో పాటు 50కి పైగా సగటు నమోదు చేసిన ఏకైక క్రికెటర్‌గా కోహ్లి మరో ఘనతను అందుకున్నాడు. ఇక తొలి, చివరి టీ20ల్లో రాణించిన భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి ఎగబాకాడు. మరో ఓపెనర్, టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మాత్రం ఒక స్థానానికి దిగజారాడు. ముంబై మ్యాచ్‌లో మినహా తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమవ్వడంతో ర్యాంకింగ్స్‌లో ఎనిమిది నుంచి నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజమ్ కొనసాగుతున్నాడు. కాగా, ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఏ ఒక్క భారత బౌలర్ కూడా టాప్-10లో చోటు దక్కించుకోకపోవడం గమనార్హం. KL Rahul ⬆️ Virat Kohli ⬆️ After their 💥 performances against West Indies, the Indian duo have risen in the @MRFWorldwide ICC T20I Rankings for batting. Updated rankings ▶️ https://t.co/EdMBslOYFe pic.twitter.com/90fnJGtksp — ICC (@ICC) December 12, 2019 -
టాప్-10లోకి రాహుల్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌లో లోకేశ్ రాహుల్ టాప్ –10లోకి చేరాడు. ఆసీస్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌లో రాణించిన రాహుల్.. గురువారం విడుదలైన టీ20 ర్యాంకింగ్స్ బ్యాట్స్‌మెన్ జాబితాలో 726 పాయింట్లతో ఆరో ర్యాంకు పొందాడు. రాహుల్ మినహా టాప్–10లో ఒక్క భారత బ్యాట్స్‌మెన్ కూడా లేరు. రోహిత్ 12వ, ధవన్ 15వ, కోహ్లీ 17వ, సీనియర్ ఆటగాడు ధోని 56వ స్థానాల్లో ఉన్నారు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో సెంచరీతో వీరవిహారం చేసిన ఆఫ్ఘాన్ బ్యాట్స్‌మన్ హజ్రతుల్లా జజాయ్ ఏకంగా 31 స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. బౌలర్ల విభాగంలో బుమ్రా 12, కృనాల్ 18 ర్యాంకులు ఎగబాకి వరుసగా 15, 43వ ర్యాంకులు పొందారు. కుల్దీప్ యాదవ్ రెండు స్థానాలు దిగజారి 4వ ర్యాంకుకు చేరాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ కోల్పోయినప్పటికీ టీమ్ విభాగంలో భారత్ రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ఆసీస్ మూడో ర్యాంకుకు చేరుకుంది. -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో చహల్ ‘మాయాజాలం’
దుబాయ్ : గత రెండు రోజుల క్రితం శ్రీలంకలో జరిగిన నిదహాస్ ముక్కోణపు టీ 20 ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టు ఆటగాళ్ల సంతోషం రెండింతలయింది. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లకు మెరుగైన ర్యాంకులు లభించాయి. తన మణికట్టు మాయాజాలంతో సిరీస్ గెలవటంలో కీలక పాత్ర పోషించిన యుజవేంద్ర చహల్ కెరీర్ అత్యుత్తమంగా రెండో ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో ఎనిమిది వికెట్లు తీసిన చహల్ ఏకంగా 12స్థానాలు ఎగబాకి 706 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మరొకవైపు పొదుపుగా బౌలింగ్ చేసి ఎనిమిది వికెట్లు తీసిని వాషింగ్టన్ సుందర్ ఏకంగా 151 స్థానం నుంచి 31 స్థానంలో నిలిచాడు. అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ 759 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీ20 బ్యాటింగ్ జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్‌తో ఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి కప్ అందించిన దినేశ్ కార్తీక్ 126 స్థానం నుంచి 95వ స్థానానికి చేరాడు. కార్తీక్‌కు టీ20లో ఇదే అత్యుత్తమం కావడం విశేషం. ఇక తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ 13,17 స్థానాలలో కొనసాగుతున్నారు. విరాట్ కోహ్లి 670 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుండగా న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మున్రో 801 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. సిరీస్‌లో సగం మ్యాచ్‌లు ఆడలేకపోయిన బంగ్లా కెప్టెన్ షకీబుల్ హసన్ ఆల్‌రౌండర్ జాబితాలో నెంబర్ వన్ స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. మాక్స్వెల్ తొలి స్థానానికి ఎగబాకాడు. టీ20 టీం జాబితాలో భారత్ 124పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. పాకిస్తాన్ 126 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. -
క్లీన్‌స్వీప్ చేసినా భారత్ ర్యాంకు అంతే!
సాక్షి, స్పోర్ట్స్: ఓటమనేది లేకుండా ముక్కోణపు ట్వంటీ 20 సిరీస్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. మరోవైపు ఐసీసీ టీ20 తాజా ర్యాంకింగ్స్‌లోనూ ఆసీస్, టీమిండియాను వెనక్కి నెట్టేసింది. దాదాపు పదిహేను పాయింట్లు మెరుగు పరుచుకున్న ఆసీస్ రెండో స్థానంలో నిలవగా, భారత్ మూడో స్థానానికి పరిమితమైంది. పాకిస్తాన్ 126 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానం సొంతం చేసుకోగా, అదే రేటింగ్ పాయింట్లున్న ఆసీస్ ఓవరాల్ పాయింట్లలో వ్యత్యాసంతో రెండో స్థానంలో ఉండగా, 122 పాయింట్లతో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల మధ్య టీ20 ట్రై సిరీస్ నిర్వహించగా, కివీస్, ఆసీస్‌లు ఫైనల్ చేరాయి. కాగా నేడు జరిగిన ఫైనల్లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో కివీస్‌పై ఆసీస్ నెగ్గిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోన్న విరాట్ కోహ్లి సేన తొలి టీ20లో నెగ్గగా, నేడు రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. అయితే మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్విప్ చేసినా భారత్ ర్యాంకుల్లో మాత్రం ఏ మార్పు ఉండదు. నేడు సెంచూరియన్ వేదికగా సూపర్ స్పోర్ట్స్ పార్క్ మైదానంలో రాత్రి 9.45 గంటలకు రెండో టీ20 ప్రారంభం కానుంది. కాగా, వర్షం కారణంగా ఇదివరకే ఈ మైదానంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న నాలుగో టీ20కి అంతరాయం ఏర్పడ్డ విషయం తెలిసిందే. -
ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో భారత్ 2... కోహ్లి 3
శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో 121 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. 124 పాయింట్లతో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉండగా... ఇంగ్లండ్ మూడు, న్యూజిలాండ్ నాలుగు, వెస్టిండీస్ అయిదో స్థానంలో నిలిచాయి. వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో 824 పాయింట్లతో నంబర్ వన్‌గా ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లి వివాహం కారణంగా లంకతో సిరీస్ ఆడలేదు. దీంతో 48 పాయింట్లు కోల్పోయి 776 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ఫించ్ (784 పాయింట్లు), విండీస్ ఆటగాడు ఎవిన్ లూయీస్ (780) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
అనుష్కతో పెళ్లి.. కోహ్లి ర్యాంకు ఢమాల్!
బాలీవుడ్ నటి అనుష్క శర్మతో పెళ్లి నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి శ్రీలంకతో వన్డే, టీ-20 సిరీస్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. దీనితో తాత్కాలిక కెప్టెన్ అయిన రోహిత్ శర్మ సారథిగా విజయాలు సాధించడమే కాదు.. బ్యాటుతోనూ చెలరేగిపోయాడు. ఈ క్రమంలో సోమవారం వెలువడిన ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్‌లో కోహ్లి ర్యాంకు అమాంతం పడిపోయింది. దీంతో సోషల్ మీడియాలో అప్పుడే జోకులు వెల్లువెత్తుతున్నాయి. అయితే, శ్రీలంకతో టీ-20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగుపరుచుకుంది. ఇంగ్లండ్, న్యూజిల్యాండ్, వెస్టిండీస్ జట్లను వెనుకకునెట్టి.. రెండోస్థానాన్ని సొంతం చేసుకుంది. లంకతో సిరీస్‌కు ముందుకు టీమిండియాకు 119 పాయింట్లు ఉండగా.. సిరీస్ తర్వాత 121 పాయింట్లకు పెరిగిందని, దీంతో టీమిండియా రెండో ర్యాంకును సొంతం చేసుకుందని ఐసీసీ తెలిపింది. ఇక 124 పాయింట్లతో దాయాది పాకిస్థాన్ మొదటిస్థానంలో కొనసాగుతుంది. ఇక, పెళ్లి కారణంగా లంక సిరీస్‌కు దూరమవ్వడంతో ప్రభావం కోహ్లి టీ-20 ర్యాంకింగ్స్‌పై పడింది. దీంతో కోహ్లి ర్యాంకు మొదటి స్థానం నుంచి మూడోస్థానానికి పడిపోయింది. టీ-20 సిరీస్‌కు దూరమైన కారణంగా కోహ్లి పాయింట్లు 824 నుంచి 776కు పడిపోయాయి. కోహ్లిని అధిగమించి ఆరన్ ఫించ్ మొదటి ర్యాంకు సొంతం చేసుకోగా, వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ ఎవిన్ లెవిస్ రెండోర్యాంక్‌కు చేరుకున్నాడు. టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ర్యాంకు కూడా మూడోస్థానానికి పడిపోయింది. లంకతో తొలి రెండు టీ-20 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా వికెట్లేమీ తీయని సంగతి తెలిసిందే. ఇక కేఎల్ రాహుల్ నాలుగో ర్యాంకును సొంతం చేసుకోగా.. 43 బంతుల్లో 118 పరుగులు చేసి రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ 14 ర్యాంకుకు ఎగబాకాడు. -
రెండో ర్యాంక్‌కు భారత్
దుబాయ్: ఐసీసీ టి20 ర్యాంకుల్లో భారత్ ఒక స్థానం మెరుగు పర్చుకుంది. ఇప్పటివరకు మూడో స్థానంలో ఉన్న టీమిండియా తాజాగా ఇంగ్లండ్‌పై 2–1తో సిరీస్ గెలవడం ద్వారా రెండో ర్యాంక్‌కు ఎగబాకింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం విడుదల చేసిన టి20 బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో కోహ్లి నిలకడగా అగ్రస్థానంలోనే ఉన్నాడు. టి20 బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా రెండో ర్యాంకులోనే ఉండగా, అశ్విన్ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. -
ఐసీసీ వన్డే, టీ20 ర్యాంకులు వచ్చేశాయి...
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు ఒక్కో స్థానం కిందకి దిగింది. ఐసీసీ విడుదల చేసిన వార్షిక సవరణ జాబితాలో భారత్ కు టీ20ల్లో రెండో స్థానం దక్కగా, వన్డేల్లో నాలుగో స్థానంలో నిలిచింది. నిన్న ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. టీ20 ర్యాంకింగ్స్: న్యూజీలాండ్ 132 పాయింట్లతో తొలి ర్యాంకును సాధించగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్(3), దక్షిణాఫ్రికా(4), ఇంగ్లండ్ (5), ఆస్ట్రేలియా(6) ర్యాంకులు సొంతం చేసుకున్నాయి. బంగ్లాదేశ్ ను వెనక్కినెట్టి అఘ్గనిస్తాన్ కాస్త మెరుగుపడింది. బంగ్లాదేశ్(10) వన్డే ర్యాంకింగ్స్: వన్డే ప్రపంచకప్ ఐదోసారి సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా తాజా ర్యాంకింగ్స్ లో తొలిస్థానాన్ని దక్కించుకోగా, న్యూజీలాండ్(2), దక్షిణాఫ్రికా(3), భారత్(4), శ్రీలంక(5) స్థానాల్లో నిలిచాయి. ఆసీస్ ఖాతాలో 124 పాయింట్లు ఉండగా, న్యూజీలాండ్ 113 పాయింట్లు, దక్షిణాఫ్రికా 112 పాయింట్లు, భారత్ 109 పాయింట్లతో ఉన్నాయి. టెస్ట్ ర్యాంకింగ్స్: టెస్టుల్లో అయితే ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని దక్కించుకోగా, పాకిస్తాన్(3), ఇంగ్లండ్(4), న్యూజీలాండ్(5) స్థానాల్లో నిలిచాయి. కాగా, గత ర్యాంకుల్లో మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఆరో స్థానానికి పడిపోయింది. 2014-15 వార్షిక సంవత్సరంలో సాధించిన ఫలితాల ఆధారంగా టెస్టు ర్యాంకింగ్స్ ను ప్రకటించారు. -
రెండో స్థానంలోనే భారత్
ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ దుబాయ్: భారత జట్టు గత కొన్నాళ్లుగా టి20 ఫార్మాట్లో మ్యాచ్‌లు ఆడకపోయినా రెండో ర్యాంకును మాత్రం నిలబెట్టుకుంది. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత్ 123 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా కూడా భారత్‌తో సమానంగా పాయింట్లు కలిగివున్నా దశాంశ స్థానాల తేడాతో మూడో ర్యాంకుకు పరిమితమైంది. శ్రీలంక 129 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. పాకిస్థాన్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఈ నెల 16 నుంచి జరగనున్న టి20 ప్రపంచకప్‌కు ముందు పలు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగనున్న నేపథ్యంలో ఆయా జట్ల ర్యాంకులు మారే అవకాశాలున్నాయి. ఇక వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ కోహ్లి, రైనా, యువరాజ్లు వరుసగా నాలుగు, ఐదు, ఆరో ర్యాంకుల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల జాబి తాలో యువీ మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు.