
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ హవా కొనసాగుతూ ఉంది. తాజా ర్యాంకింగ్స్‌లోనూ ఆజమ్ తన అగ్రపీఠాన్ని (818 పాయింట్లు) పదిలంగా కాపాడుకున్నాడు. ఈ క్రమంలో బాబర్ ఆజమ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం నంబర్ 1 స్థానంలో ఉన్న బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది.
Another record for Babar Azam 👊
— ICC (@ICC) June 29, 2022
All the changes in this week's @MRFWorldwide men's rankings 👇
కోహ్లి 1013 రోజుల పాటు అగ్రస్థానంలో కొనసాగగా.. తాజాగా బాబర్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఏడాది కేవలం 2 టీ20లు మాత్రమే ఆడిన కోహ్లి తాజా ర్యాంకింగ్స్‌లో 21వ స్థానానికి పడిపోగా.. బాబర్ మాత్రం తన రేటింగ్ పాయింట్లను మెరుగుపర్చుకుంటూ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు. బాబర్ తర్వాత రెండో ప్లేస్‌లో పాక్ వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ (794) కొనసాగుతున్నాడు. రిజ్వాన్‌కు బాబర్‌కు మధ్య 24 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది.
ఇక ఇతర స్థానాల విషయానికొస్తే.. ఈ జాబితా టాప్ 10లో టీమిండియా నుంచి ఇషాన్ కిషన్ (682) ఒక్కడికే స్థానం లభించింది. గత వారం ర్యాంకింగ్స్‌లో 6వ ప్లేస్‌లో ఉన్న ఇషాన్.. ఓ స్థానం కోల్పోయి సెవెన్త్ ప్లేస్‌కు పడిపోయాడు. ఈ ఒక్క మార్పు మినహా గత వారం ర్యాంకింగ్స్‌తో పోలిస్తే ఈ వారం పెద్దగా మార్పులు లేవు. మార్క్రమ్ (757), డేవిడ్ మలాన్ (728), ఆరోన్ ఫించ్ (716), డెవాన్ కాన్వే (703), పథుమ్ నిస్సంక (661), మార్టిన్ గప్తిల్ (658), డెస్సెన్ (658) వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. టీమిండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 17, రోహిత్ శర్మ 19 ర్యాంక్‌ల్లో కొనసాగుతుండగా.. ఐర్లాండ్ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన దీపక్ హుడా ఏకంగా 414 స్థానాలు ఎగబాకి 104వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
చదవండి: IND VS IRE 2nd T20: హార్దిక్ సేన ఖాతాలో చెత్త రికార్డు
Comments
Please login to add a commentAdd a comment