
సూర్యకుమార్ యాదవ్- విరాట్ కోహ్లి
Ind Vs Aus 1st T20- ICC Latest T20 Rankings- Suryakumar Yadav: ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను అధిగమించి మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో మొదటి టీ20లో సూర్యకుమార్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. మొహాలీ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 25 బంతులు ఎదుర్కొన్న సూర్య.. రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 46 పరుగులు సాధించాడు.
దిగజారుతున్న బాబర్ ర్యాంకు
ఈ నేపథ్యంలో 780 పాయింట్లతో టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక ఎయిడెన్ మార్కరమ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ర్యాంకు పతనం కొనసాగుతోంది.
ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో వైఫల్యం కారణంగా మూడో స్థానానికి పరిమితమైన బాబర్.. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మరో స్థానం దిగజారి నాలుగో ర్యాంకుకు పడిపోయాడు. ఇక ఆసీస్‌తో తొలి టీ20లో విఫలమైన టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి(2 పరుగులు) ఒక ర్యాంకు కోల్పోయి పదహారో స్థానానికి పరిమితమయ్యాడు.
ఐసీసీ టీ20 బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే
1. మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్)
2. ఎయిడెన్ మార్కరమ్(దక్షిణాఫ్రికా)
3. సూర్యకుమార్ యాదవ్(ఇండియా)
4. బాబర్ ఆజం(పాకిస్తాన్)
5. డేవిడ్ మలన్(ఇంగ్లండ్)
Comments
Please login to add a commentAdd a comment