టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
India vs Australia, 4th Test: ‘‘అహ్మదాబాద్ టెస్టులో టీమిండియా బ్యాటర్లు రాణించాల్సి ఉంది. ప్రతిసారి లోయర్ ఆర్డర్ మీద ఆధారపడితే బాగుండదు. విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ ఇంకెప్పుడు బ్యాట్ ఝులిపిస్తారు? ఇండోర్ టెస్టులో టీమిండియా ఎప్పుడైతే టాస్ గెలిచి... బ్యాటింగ్ ఎంచుకుని.. 109 పరుగులకే ఆలౌట్ అయిందో.. అప్పుడే మ్యాచ్ వాళ్ల చేజారిపోయింది’’ అని పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అన్నాడు.
సూర్యను తీసుకోండి
కోహ్లి, శ్రేయస్ అయ్యర్ పూర్తిగా విఫలమయ్యారని, వాళ్లు మెరుగైన ఇన్నింగ్స్ ఆడి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ షాట్ల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 ఆరంభ టెస్టుతో అరంగేట్రం చేసిన టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌ను అహ్మదాబాద్ టెస్టులో ఆడిస్తే పరిస్థితి కాస్త మెరుగవతుందని డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు.
స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో రాణించగలడు!
ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘రోహిత్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. సూర్యకుమార్ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకుంటే బాగుంటుంది. ఇలాంటి పిచ్‌లపై అతడు స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో రాణించగలడు. నాలుగో టెస్టులో అతడిని ఆడించే విషయం గురించి మేనేజ్‌మెంట్ సీరియస్‌గా ఆలోచించాలి’’ అని కనేరియా పేర్కొన్నాడు.
విఫలమైన అయ్యర్
గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ జట్టులోకి తిరిగి రావడంతో సూర్యకు రెండో టెస్టు నుంచి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే, అయ్యర్ అంచనాల మేరకు రాణించలేకపోయాడు. రెండో టెస్టులో 16, మూడో టెస్టులో 26 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఇదిలా ఉంటే.. సూర్య కూడా అరంగేట్ర టెస్టులో పూర్తిగా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 20 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులు మాత్రమే చేసి నాథన్ లియోన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇక తొలి రెండు టెస్టుల్లో స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ విజృంభనతో టీమిండియా గెలుపొందగా.. మూడో టెస్టులో ఆసీస్ విజయం సాధించింది. నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్ మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో ఆరంభం కానుంది.
చదవండి: బుమ్రాను మర్చిపోండి.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అతడే సరైనోడు!
Shane Warne: అప్పుడే ఏడాది గడిచిపోయిందా? నమ్మలేకున్నా.. : ఆసీస్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment