danish kaneria
-
BGT 2024: రోహిత్ ఓపెనర్‌గా వద్దు.. వాళ్లిద్దరే ఆడాలి: పాక్ మాజీ క్రికెటర్
టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. నవంబరు 22 నుంచి బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. వీటిలో కనీసం నాలుగు గెలిస్తేనే రోహిత్ సేన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది.ఇదే తొలిసారి..కాగా ఇటీవలే సొంతగడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో ఆడిన మూడు టెస్టుల్లో ఓడి 0-3తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. స్వదేశంలో భారత జట్టు ఇలా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లలో ఓడిపోవడం ఇదే తొలిసారి.ఈ నేపథ్యంలో రోహిత్ సేన ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంతగడ్డపైనే రాణించలేనివాళ్లు.. ఆసీస్ పిచ్‌లపై ఆడటం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ ఓపెనర్‌గా వద్దుఆస్ట్రేలియాతో టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా కాకుండా వన్‌డౌన్‌లో బరిలోకి దిగాలని సూచించాడు. కివీస్‌తో సిరీస్‌లో పేసర్ టిమ్ సౌతీని ఎదుర్కొనేందుకు రోహిత్ ఇబ్బందిపడ్డాడన్న కనేరియా.. ఆస్ట్రేలియాలో బంతి మరింత స్వింగ్ అవుతుంది కాబట్టి.. వన్‌డౌన్‌లో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియలో సౌతీ బౌలింగ్‌లో ఆడేందుకు రోహిత్ ఇబ్బందిపడ్డాడు. రెండుసార్లు అతడి బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. కాబట్టి అతడి బ్యాటింగ్ ఆర్డర్ మారిస్తే బాగుంటుంది.జైస్వాల్‌కు జోడీగా అతడు రావాలిటాపార్డర్లో యశస్వి జైస్వాల్‌తో కలిసి శుబ్‌మన్ గిల్ ఓపెనర్‌గా రావాలి. రోహిత్ వన్‌డౌన్‌లో, కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలి. బ్యాటింగ్ లైనప్ విషయంలో గౌతం గంభీర్ తప్పక మార్పులు చేయాలి. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కూడా బ్యాట్‌తో వీలైనంత ఎక్కువగా రాణిస్తేనే ఫలితం ఉంటుంది’’ అని డానిష్ కనేరియా పేర్కొన్నాడు. కాగా ఆసీస్- టీమిండియా మధ్య నవంబరు 22 నుంచి జనవరి 3 వరకు మూడు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: BCCI- Pant: ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. మరి ఆ టెక్నాలజీ ఎందుకు వాడదంటే? -
'మా దేశానికి టీమిండియా రావద్దు'.. పాక్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
ఛాంపియన్స్-2025లో పాల్గోనేందుకు పాకిస్తాన్‌కు టీమిండియా వెళ్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఎట్టిపరిస్ధితులలోనూ తమ జట్టును పాక్‌కు పంపేది లేదని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చేప్పగా..పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం భారత జట్టు తమ దేశానికి రావాల్సందేనని మొండి పట్టుతో ఉంది.ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2023 ఆసియాకప్‌లో తలపడేందుకు కూడా భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లలేదు. దీంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించారు. భారత్ తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది. ఇప్పుడు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుంది. అయితే ఈ విషయంపై ఐసీసీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో బీసీసీఐ సెక్రటరీ జై షా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికవడంతో ఛాంపియన్స్ ట్రోఫీని ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ ఏడాది నవంబర్ తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.మా దేశానికి రావద్దు..ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు పాకిస్తాన్‌కు రావద్దని కనేరియా సూచించాడు. ఆటగాళ్ల భద్రతకు మొదటి ప్రాధన్యం ఇవ్వాలని అతడు తెలిపాడు."పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితిని చూడండి. నేను అయితే టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లొద్దని చెబుతాను. ఈ విషయం గురుంచి పాకిస్తాన్ ఆలోచించాలి. దీనిపై ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. అంతే తప్ప పీసీబీ ఎటువంటి డిమాండ్ చేయకూడాదు. నా వరకు అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించే అవకాశముంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరిగే ఛాన్స్ ఉంది. ఆటగాళ్ల భద్రతే మొదటి ప్రాధాన్యత. ఆ తర్వాతే గౌరవం, ఇంకా ఏమైనా. బీసీసీఐ అద్భుతంగా పనిచేస్తోంది. వారి నిర్ణయం ఏదైనా సరే, ఇతర దేశాలు కూడా అందుకు అంగీకరించాలి. టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరిగితే బెటర్" అని స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా పేర్కొన్నాడు.కాగా ఈ టోర్నీకి సంబంధించి డ్రాప్ట్ షెడ్యూల్‌ను పీసీబీ ఇప్పటికే ఐసీసీకి పంపించింది. ఆ షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 19 నుంచి మార్చి మార్చి 9 వరకు జరగనుంది. ఈ ఈవెంట్‌కు లాహోర్‌లోని గఢాఫీ స్టేడియం, కరాచీ నేషనల్ స్టేడియం, రావల్పిండి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి. దీంతో ఇప్పటికే ఆయా స్టేడియాల్లో పునర్నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి ఇందుకు కోసం పీసీబీ రూ. 1,280 కోట్లు కేటాయించింది. -
బాబర్.. విరాట్ కాలిగోటికి కూడా సమానం కాడు: పాక్ మాజీ ప్లేయర్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భారత్-పాకిస్తాన్ మెగా సమరానికి ముందు పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. సొంత జట్టు సారధి బాబర్ ఆజమ్‌పై దుమ్మెతిపోశాడు. విరాట్‌తో బాబర్‌కు పోలిక ఏంటని షాకింగ్ కామెంట్స్ చేశాడు. బాబర్ విరాట్ కాలిగోటికి కూడా సమానం కాదని పరుష పదజాలాన్ని వాడాడు. బాబర్ సెంచరీ చేసిన ప్రతిసారి పాక్ అభిమానులు అతన్ని విరాట్‌తో పోలుస్తారని.. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. బాబర్‌ను విరాట్‌తో పోలిస్తే అస్సలు ఒప్పుకోనని అన్నాడు. 16 ఏళ్ల కెరీర్లో విరాట్ 80 సెంచరీల సాయంతో దాదాపు 27000 పరుగులు చేస్తే.. బాబర్ తన తొమ్మిదేళ్ల కెరీర్లో 31 సెంచరీల సాయంతో 13000 పైచిలుకు పరుగులు మాత్రమే చేశాడని గుర్తు చేశాడు.ప్రస్తుత వరల్డ్‌కప్‌లో యూఎస్ఏపై బాబర్ ఆడిన ఇన్నింగ్స్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. పసికూనల బౌలింగ్‌లోనే తేలిపోయిన బాబర్‌కు విరాట్‌తో పోటీపడే అర్హత ఎక్కడ ఉందని నిలదీశాడు. సాధారణ యూఎస్ఏ బౌలర్లను ఎదుర్కోలేక చతికిలబడిన బాబర్.. ప్రపంచ స్థాయి బౌలర్లను ఏరకంగా ఎదుర్కొంటాడని ప్రశ్నించాడు. యూఎస్ఏతో మ్యాచ్‌లో బాబర్ ఆడిన ఇన్నింగ్సే పాక్ ఓటమికి ప్రధాన కారణమని దుమ్మెత్తిపోశాడు. 44 పరుగులు చేసేందుకు 43 బంతులు తీసుకున్న బాబర్.. విరాట్‌తో సరిసమానమైన ప్లేయర్ అయ్యుంటే చివరి వరకు క్రీజ్‌లో నిలబడి పాక్‌ను గెలిపించేవాడని అన్నాడు. నేటి మెగా సమరంలో భారత్.. పాక్‌ను చిత్తు చేయడం ఖాయమని ఘంటాపథంగా తెలిపాడు. పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో పాక్‌పై భారత్ డామినేషన్ (6-1) కొనసాగుతుందని జోస్యం చెప్పాడు. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో పోటీపడే ప్రతిసారి బౌలింగే తమ ప్రధాన బలమని జబ్బలు చరుచుకునే పాక్.. అదే బౌలింగ్ కారణంగా యూఎస్ఏ చేతిలో ఓడిందని అభిప్రాయపడ్డాడు. ప్రముఖ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా ఈ మేరకు వ్యాఖ్యానించాడు.కాగా, ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో పాక్ తామాడిన తొలి మ్యాచ్‌లో పసికూన యూఎస్ఏ చేతిలో చావుదెబ్బ తిన్న విషయం తెలిసిందే. మరోవైపు టీమిండియా.. తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను మట్టికరిపించి గెలుపు జోష్‌లో ఉంది. భారత్, పాక్‌లు ఇవాళ (జూన్ 9) న్యూయార్క్ వేదికగా అమీతుమీకి సిద్దమయ్యాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు వేదిక అయిన న్యూయార్క్‌లో మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు న్యూయార్క్ మైదానంలోని పిచ్ ఇరు జట్లను కలవరపెడుతుంది. ఈ పిచ్ ఎవరికీ అంతుచిక్కని విధంగా స్పందిస్తూ ఇరు జట్ల ఆటగాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. -
హార్దిక్ బదులు అతడిని ఎంపిక చేయాల్సింది: పాక్ మాజీ స్టార్
టీ20 వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో బీసీసీఐ ప్రకటించిన జట్టుపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. యశస్వి జైస్వాల్ వంటి యంగ్ స్టార్లకు చోటివ్వడం సరైన నిర్ణయమని.. అయితే, రింకూ సింగ్‌కు మాత్రం అనాయ్యం జరిగిందని పేర్కొన్నాడు.లోయర్ ఆర్డర్లో హిట్టింగ్ ఆడగల రింకూను పక్కన పెట్టడం సరికాదని టీమిండియా సెలక్టర్ల తీరును కనేరియా విమర్శించాడు. హార్దిక్ పాండ్యా బదులు రింకూను జట్టుకు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.రింకూ సింగ్‌కు అనాయ్యంకాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా మొదలయ్యే ప్రపంచకప్‌నకు బీసీసీఐ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ టీమ్‌లో రింకూ సింగ్‌కు స్థానం దక్కలేదు. రిజర్వ్ ప్లేయర్‌గా మాత్రమే అతడు ఎంపికయ్యాడు.వీళ్లంతా భేష్‌ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా మాట్లాడుతూ.. ‘‘నాణ్యమైన క్రికెటర్లను ఉత్పత్తి చేస్తుందనే పేరు భారత్‌కు ఉంది. ఇటీవలి కాలంలో దుమ్ములేపుతున్న యశస్వి జైస్వాల్, అంగ్క్రిష్ రఘువంశీ ఇందుకు చక్కని ఉదాహరణలు.మయాంక్ యాదవ్ సైతం తన పేస్ నైపుణ్యాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పాండ్యాకు ఎందుకు చోటిచ్చారు?రింకూ విషయానికొస్తే.. అతడు కచ్చితంగా టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఉండాల్సింది. నా అభిప్రాయం ప్రకారం.. ఐపీఎల్ ప్రదర్శనను గనుక పరిగణనలోకి తీసుకుంటే హార్దిక్ పాండ్యాను ప్రపంచకప్‌నకు ఎంపిక చేయకుండా ఉండాల్సింది.ఇప్పటికే జట్టులో శివం దూబే ఉన్నాడు. అందుకే పాండ్యా బదులు రింకూను ఎంపిక చేస్తే డౌన్ ఆర్డర్లో శక్తిమంతమైన కూర్పు కుదిరి ఉండేది’’ అని స్పోర్ట్స్ నౌ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.కాగా ప్రపంచకప్ ఈవెంట్లో కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే, డానిష్ కనేరియా మాత్రం వైస్ కెప్టెన్‌నే పక్కనపెట్టాల్సిందని చెప్పడం గమనార్హం.టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు.. -
T20 WC: టీమిండియా గెలవాలంటే అతడు జట్టులో ఉండాల్సిందే!
విరాట్ కోహ్లి గురించి వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. పనీపాటా లేని వాళ్లే వదంతులు సృష్టించి జనాల మీదకు వదులుతారని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అసలు కోహ్లి లేని ప్రపంచకప్ జట్టును ఊహించడం కూడా కష్టమన్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2024 భారత జట్టులో కోహ్లికి చోటు ఇవ్వకుండా.. యువకులకు పెద్దపీట వేయాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోహ్లి బ్యాటింగ్ స్టైల్ వెస్టిండీస్ పిచ్‌లకు అంతగా సూట్ కాదని.. అందుకే ఈ ఢిల్లీ బ్యాటర్‌ను తప్పించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వదంతులు వ్యాపించాయి. టీమిండియా గెలవాలంటే అతడు ఉండాల్సిందే ఈ విషయంపై క్రిష్ణమాచారి శ్రీకాంత్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘విరాట్ కోహ్లి లేకుండా టీ20 ప్రపంచకప్ టీమా? ఛాన్సే లేదు. 2022లో జట్టును సెమీస్‌కు చేర్చిన ఘనత తనది. ఆ ఎడిషన్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ కూడా అతడే. అలాంటి వ్యక్తికి జట్టులో చోటు ఉండదా? అసలు ఈ పుకార్లు పుట్టిస్తున్నది ఎవరు? వాళ్లకు వేరే పనులేమీ లేవా? నిరాధారపూరిత వ్యాఖ్యలతో ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారు? ఒకవేళ ఈసారి టీమిండియా గనుక టీ20 వరల్డ్‌కప్ గెలవాలంటే విరాట్ కోహ్లి కచ్చితంగా జట్టులో ఉండి తీరాల్సిందే’’ అని చిక్కా తన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్లు చెప్పాడు. ఇక ఇదే విషయం గురించి పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా స్పందించాడు. సచిన్ మాదిరే కోహ్లికి కూడా ఆ గౌరవం దక్కాలి ఈ మేరకు.. ‘‘వన్డే వరల్డ్‌కప్ లేదంటే టీ20 ప్రపంచకప్.. ఈవెంట్ ఏదైనా.. జట్టును ఒడ్డుకు చేర్చే ఆటగాడు ఉండాల్సిందే. విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లు కేవలం జట్టులో ఉంటే చాలు. అన్నీ సజావుగా సాగిపోతాయి. వందకు వంద శాతం జట్టుకు కోహ్లి అవసరం ఉంది. కోహ్లి కోసం టీమిండియా కచ్చితంగా ప్రపంచకప్ ట్రోఫీ గెలవాలి. 2011లో సచిన్ టెండుల్కర్‌కు దక్కిన మాదిరే విరాట్ కోహ్లికి కూడా గౌరవం దక్కాలి. అతడికి జట్టు ఇచ్చే గొప్ప కానుక అంతకంటే మరొకటి ఉండదు’’ అని డానిష్ కనేరియా పేర్కొన్నాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. ఇకపై -
WC 2023: స్నేహాలు, పర్సనల్ రిలేషన్షిప్స్.. అందుకే జట్టుకు ఈ దుస్థితి!
‘‘జట్టును ప్రకటించినప్పుడే నాకంతా అర్థమైపోయింది. స్నేహాలు, వ్యక్తిగత బాంధవ్యాల ఆధారంగానే ఈ సెలక్షన్ జరిగింది. జట్టు సమతూకంగా లేదు. ఇండియాలో వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్తాన్‌కు ఈ తిప్పలు తప్పవని నేను ముందే ఊహించాను. వాళ్లు(మేనేజ్మెంట్) అన్నీ మాట్లాడతారు గానీ సరైన వ్యూహాలు రచించలేకపోతున్నారు. ఇండియాలో పిచ్ పరిస్థితులు బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయన్న విషయం వాళ్లు అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. సెలక్షన్ మొత్తం తప్పుల తడక ఈ టీమ్ సెలక్షన్ మొత్తం తప్పులతడకగా ఉంది. నసీం షా అందుబాటులో లేడని హసన్ అలీ చేతికి కొత్త బంతిని ఇస్తున్నారు. హసన్ అలీ కేవలం మేనేజ్మెంట్లోని కీలక సభ్యులతో తనకున్న ఫ్రెండ్షిప్ కారణంగానే జట్టులోకి వచ్చాడు. ఇక ఉసామా మిర్.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌కు ఆడతాడు. ముస్తాక్ అహ్మద్‌కు చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా ఆటగాళ్ల ఎంపిక జరుగుతోంది. దేశానికి ప్రాతినిథ్యం వహించే జట్టు గురించి ఎవరికీ పట్టింపు లేదు. అలాంటపుడు ఇలాంటే ఫలితాలే వస్తాయి. అప్పుడు నన్నైతే పక్కనపెట్టారు అయినా.. పాకిస్తాన్ గతంలో ఇద్దరు లెగ్ స్పిన్నర్లతో బరిలోకి దిగిందే లేదు. షాహిద్ ఆఫ్రిది ఉన్నాడన్న కారణంగా వన్డే జట్టు నుంచి నన్ను తప్పించేవారు. ఈ టోర్నీలో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరిగినపుడు షాదాబ్ ఖాన్‌ను తప్పించి ఉసామా మిర్‌ను రప్పించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇమాద్ వసీం(లెఫ్టార్మ్ స్పిన్నర్)ను జట్టులోకి ఎందుకు తీసుకోలేదు’’ అంటూ పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్వప్రయోజనాల కోసం జట్టును భ్రష్టు పట్టిస్తున్నారంటూ సెలక్షన్ తీరుపై మండిపడ్డాడు. ఇకనైనా జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించకపోతే ఇలాంటి అవమానాలు మరిన్ని ఎదుర్కోక తప్పదంటూ ఘాటు విమర్శలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో ఇప్పటికే పాకిస్తాన్ చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుందన్న కనేరియా.. ఇకముందు కూడా కోలుకునే అవకాశం లేదంటూ కుండబద్దలు కొట్టాడు. కాగా భారత్ వేదికగా మెగా ఐసీసీ టోర్నీలో ఆరంభంలో వరుసగా రెండు విజయాలు సాధించిన పాకిస్తాన్.. ఆ తర్వాత మూడు పరాజయాలు చవిచూసింది. బాబర్ ఆజంను తప్పించాలంటూ డిమాండ్లు కనీవిని ఎరుగని రీతిలో వన్డే ఫార్మాట్లో అదీ మేజర్ ఈవెంట్లో అఫ్గనిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడింది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో మూడు ఓడి పట్టికలో ఐదో స్థానంలో ఉంది. పాకిస్తాన్ సెమీస్ రేసులో నిలవాలంటే మిగిలిన మ్యాచ్‌లలో గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఓటములపై స్పందించిన డానిష్ కనేరియా ఈ మేరకు ఆజ్ తక్‌తో మాట్లాడుతూ పాక్ బోర్డు, సెలక్టర్లను ఉద్దేశించి విమర్శలు గుప్పించాడు. కాగా పాక్ వరుస ఓటములు నేపథ్యంలో కెప్టెన్‌గా బాబర్ ఆజంను తప్పించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. చదవండి: WC 2023: టీమిండియాకు భారీ షాక్! హార్దిక్ పాండ్యా ఇక.. -
చహల్‌కు జట్టులో స్థానం పొందే అర్హతే లేదు: పాక్ మాజీ క్రికెటర్
Asia Cup 2023: ‘‘ప్రస్తుతం యుజువేంద్ర చహల్‌కు టీమిండియాలో స్థానం దక్కించుకునే అర్హత లేదు. గత కొంతకాలంగా అతడు నిలకడలేమి ప్రదర్శన కనబరుస్తున్నాడు. మరోవైపు.. కుల్దీప్ యాదవ్.. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా వికెట్లు తీస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొడుతూ జట్టుకు అవసరమైన సమయంలో రాణిస్తున్నాడు. చహల్‌ను కాదని సెలక్టర్లు కుల్దీప్ను ఎంపిక చేసి సరైన నిర్ణయం తీసుకున్నారు’’ పాకిస్తాన్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా అన్నాడు. ఆసియా కప్-2023కి ఎంపిక చేసిన భారత జట్టులో మణికట్టు స్పిన్నర్ చహల్‌కు స్థానం ఇవ్వకపోవడమే మంచిదైందని ఈ లెగ్ బ్రేక్ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా ఆసియా వన్డే టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టులో యుజీ చహల్‌కు మొండిచేయి ఎదురైన విషయం తెలిసిందే. అందుకే చహల్‌పై వేటు అతడిని కాదని మరో రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపింది. ఈ విషయం గురించి బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లకు జట్టులో చోటు లేదని.. ఇకపై కుల్-చా ద్వయాన్ని ఒకేసారి చూడలేమని స్పష్టం చేశాడు. అదే విధంగా.. ఆసియా కప్ జట్టు జాబితా నుంచే వన్డే వరల్డ్‌కప్‌నకు ఆటగాళ్లను ఎంపిక చేయనున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో.. కుల్దీప్ మెరుగ్గా రాణిస్తే ఐసీసీ ఈవెంట్‌పై కూడా చహల్ ఆశలు వదులుకోవాల్సిందేనని స్పష్టమవుతోంది. అంతటి మొనగాడు లేడు..అయినా ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సహా సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు చహల్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై మేనేజ్మెంట్ తీరును విమర్శిస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా స్పిన్నర్లలో చహల్‌ను మించి మొనగాడు లేడని.. అలాంటిది తనకు జట్టులో చోటు లేకపోవడం ఏమిటని భజ్జీ ఫైర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా మాత్రం బీసీసీఐ సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థిస్తూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా కప్ ఆరంభం కానుండగా.. సెప్టెంబరు 2న టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. చదవండి: అలా చేసినందుకు సిగ్గుపడుతున్నా.. ఆరోజు నేను భయపడ్డాను: గంభీర్ -
టీమిండియా ప్రపంచకప్ గెలవదు.. నటరాజన్‌కు అవకాశం ఇవ్వాలి: పాక్ మాజీ క్రికెటర్
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో 1-2 తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా భారత్ అంతగా రాణించలేకపోయింది. వన్డే వరల్డ్‌కప్ సన్నహాకాల్లో భాగంగా జరిగిన సిరీస్‌లో ఓటమిపాలైన రోహిత్ సేనపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్‌ను భారత్ గెలవాలంటే మెరుగైన బౌలింగ్ యూనిట్ అవరమని కనేరియా అభిప్రాయపడ్డాడు. కనేరియా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. "ప్రస్తుతం టీమిండియా చెత్త బౌలింగ్ లైనప్ కలిగి ఉంది. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు మెరుగైన బౌలర్లు అవసరం. ప్రస్తుత బౌలర్లతో భారత్ వన్డే ప్రపంచకప్‌ను గెలవలేదు. బుమ్రా అందుబాటులో లేడు కాబట్టి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్,టి నటరాజన్ వంటి బౌలర్లకు అవకాశం ఇవ్వాలి. ఇక భారత బ్యాటర్లు స్పిన్‌కు అద్భుతంగా ఆడుతారని అందరూ అంటుంటారు. వారు నెట్స్‌లో ముఖ్యంగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్‌లను ఎదుర్కొంటారు. వారి కొంచెం వేగంగా బౌలింగ్ చేయడం వల్ల బంతి పెద్దగా టర్న్ కాదు. అయితే మూడో వన్డేలో ఆస్ట్రేలియా స్పిన్నర్లు బంతిని అద్భుతంగా టర్న్ చేశారు. కాబట్టి భారత బ్యాటర్లు స్పిన్‌కు వికెట్లు సమర్పించుకున్నారు అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: పంత్ స్థానంలో విధ్వంసకర ఆటగాడు.. ఎవరంటే? -
ఇంకెప్పుడు బ్యాట్ ఝులిపిస్తారు? సూర్యను తీసుకోండి: పాక్ మాజీ స్పిన్నర్
India vs Australia, 4th Test: ‘‘అహ్మదాబాద్ టెస్టులో టీమిండియా బ్యాటర్లు రాణించాల్సి ఉంది. ప్రతిసారి లోయర్ ఆర్డర్ మీద ఆధారపడితే బాగుండదు. విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ ఇంకెప్పుడు బ్యాట్ ఝులిపిస్తారు? ఇండోర్ టెస్టులో టీమిండియా ఎప్పుడైతే టాస్ గెలిచి... బ్యాటింగ్ ఎంచుకుని.. 109 పరుగులకే ఆలౌట్ అయిందో.. అప్పుడే మ్యాచ్ వాళ్ల చేజారిపోయింది’’ అని పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అన్నాడు. సూర్యను తీసుకోండి కోహ్లి, శ్రేయస్ అయ్యర్ పూర్తిగా విఫలమయ్యారని, వాళ్లు మెరుగైన ఇన్నింగ్స్ ఆడి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ షాట్ల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 ఆరంభ టెస్టుతో అరంగేట్రం చేసిన టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌ను అహ్మదాబాద్ టెస్టులో ఆడిస్తే పరిస్థితి కాస్త మెరుగవతుందని డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో రాణించగలడు! ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘రోహిత్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. సూర్యకుమార్ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకుంటే బాగుంటుంది. ఇలాంటి పిచ్‌లపై అతడు స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో రాణించగలడు. నాలుగో టెస్టులో అతడిని ఆడించే విషయం గురించి మేనేజ్మెంట్ సీరియస్‌గా ఆలోచించాలి’’ అని కనేరియా పేర్కొన్నాడు. విఫలమైన అయ్యర్ గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ జట్టులోకి తిరిగి రావడంతో సూర్యకు రెండో టెస్టు నుంచి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే, అయ్యర్ అంచనాల మేరకు రాణించలేకపోయాడు. రెండో టెస్టులో 16, మూడో టెస్టులో 26 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. సూర్య కూడా అరంగేట్ర టెస్టులో పూర్తిగా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 20 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులు మాత్రమే చేసి నాథన్ లియోన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇక తొలి రెండు టెస్టుల్లో స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ విజృంభనతో టీమిండియా గెలుపొందగా.. మూడో టెస్టులో ఆసీస్ విజయం సాధించింది. నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్ మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో ఆరంభం కానుంది. చదవండి: బుమ్రాను మర్చిపోండి.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అతడే సరైనోడు! Shane Warne: అప్పుడే ఏడాది గడిచిపోయిందా? నమ్మలేకున్నా.. : ఆసీస్ మాజీ కెప్టెన్ -
అతడిని టీమిండియా చాలా మిస్ అవుతోంది.. లేదంటే ఆసీస్‌కు చుక్కలే!
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓటమికి అడుగు దూరంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకి ఆలౌట్ అయిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో ఆసీస్ ముందు కేవలం 76 పరుగుల లక్ష్యాన్నే మాత్రమే టీమిండియా నిర్దేశించింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ లో భారత్ గెలవడం అసాధ్యమే. కాగా రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ దాటికి భారత బ్యాటర్లు విలవిల్లాడారు. ఛతేశ్వర్ పూజారా(59) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. భారత జట్టులో రిషబ్ పంత్ లేని లోటు సుస్పష్టంగా కన్పిస్తోంది అని కనేరియా అభిప్రాయపడ్డాడు. ఇండోర్ టెస్టులో పంత్ ఉండి ఉంటే లియాన్, కుహ్నెమాన్‌లపై ఎదురుదాడికి దిగేవాడు అని అతడు అన్నాడు. "బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రిషబ్ పంత్‌ను సేవలను టీమిండియా కోల్పోతోంది. ఒకవేళ ఇండోర్ టెస్టుకు జట్టులో పంత్ ఉండే ఉంటే ఆసీస్ స్నిన్నర్లకు చుక్కలు చూపించేవాడు. లియోన్, కుహ్నెమాన్‌లను ఎటాక్ చేసి ఒత్తిడిలోకి నెట్టేవాడు. ఎటువంటి పిచ్‌లపైన అయినా స్నిన్నర్లపై ఎదురుదాడికి దిగే సత్తా అతడికి ఉంది. బంతిని స్టాండ్స్‌కు పంపడం ఒక్కటే అతడికి తెలుసు. అయితే ఈ టెస్టులో మాత్రం భారత బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 250 నుంచి 300 పరుగులు చేసి ఉంటే బాగుండేది. కానీ రెండు ఇన్నింగ్స్‌లలోనూ టీమిండియా విఫలమై ఓటమి అంచున నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు 80 శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి" అని స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డానిష్ కనేరియా పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పిన్నర్.. అనిల్ కుంబ్లే రికార్డు బద్దలు -
కమిన్స్‌లా టీమిండియా లేదంటే పాకిస్తాన్ కెప్టెన్ చేసి ఉంటేనా.. వెంటనే!
ఢిల్లీ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో పర్వాలేదనిపించిన ఆసీస్.. భారత స్పిన్నర్ల దాటికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం పేకమేడలా కూలిపోయింది. కేవలం 113 పరుగులకే ఆసీస్ చాపచుట్టేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఆటతీరుపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ఆసీస్ వరుసక్రమంలో వికెట్లు కోల్పోతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన కమిన్స్.. తొలి బంతికే స్లాగ్‌స్వీప్ తన వికెట్‌ను కోల్పోయాడు. అయితే అటువంటి సమయంలో కమ్మిన్స్ మరింత బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి ఉండాల్సిందని కనేరియా చురకలు అంటించాడు. ఈ నేపథ్యంలో కనేరియా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.."స్పిన్నర్లకు ఎలా ఆడాలో ఆస్ట్రేలియా బ్యాటర్లకు తెలియడం లేదు. అందుకే వారంతా స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరారు. తొలి రెండు టెస్టుల్లోనూ ఇదే రిపీట్ అయ్యింది. ముఖ్యంగా రెండో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో కమ్మిన్స్ ఆడిన తీరు మాత్రం నన్ను పూర్తిగా నిరాశపరిచింది. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన అతడు అనవసర షాట్ ఆడి వికెట్‌ను కోల్పోయాడు. కమ్మిన్స్‌కు క్రీజులోకి వచ్చే ముందే బంతి బాగా టర్న్ అవుతోంది అని పీటర్ హ్యాండ్స్కాంబ్ కూడా చెప్పాడు. అయినప్పటికీ కమ్మిన్స్ స్లాగ్‌స్వీప్ ఆడి క్లీన్ బౌల్డయ్యాడు. అదే భారత కెప్టెన్ గానీ పాకిస్తాన్ కెప్టెన్‌గానీ అలా చేసివుంటే.. ఆ తర్వాతి రోజే ఇంటికి పంపేంచేవారు. ఇక రెండో టెస్టు సగం వరకు భారత్‌పై ఆస్ట్రేలియానే పై చేయి సాధించింది. కానీ భారత స్పిన్నర్లు ఒక్క సారిగా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసారు. అయితే ఈ ఓటమి మాత్రం ఆస్ట్రేలియా జట్టు ఎప్పటికీ మర్చిపోదాని అతడు పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియా చేసిన తప్పులు ఇవే.. అందుకే ఓడిపోయింది! అలా చేసి ఉంటే? -
గిల్ టీ20లకు పనికిరాడు.. అతడికి అవకాశం ఇవ్వండి! అద్భుతాలు సృష్టిస్తాడు
లక్నో వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో హార్దిక్ సేన సమం చేసింది. ఇక ఫిబ్రవరి1న సిరీస్ డిసైడ్ చేసే మూడో టీ20లో ఆహ్మదాబాద్ వేదికగా తాడోపేడో తెల్చుకోవడానికి బారత్-కివీస్ జట్లు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కివీస్‌తో మూడో టీ20కు శుబ్‌మన్ గిల్ స్థానంలో యువ ఆటగాడు పృథ్వీ షాను జట్టులో తీసుకురావాలని కనేరియా సూచించాడు. కాగా టెస్టుల్లో, వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్న గిల్.. టీ20ల్లో మాత్రం దారుణంగా విఫలమవతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన గిల్ కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో గిల్ స్థానంలో పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. అతడు అద్భుతాలు సృష్టిస్తాడు.. ఈ క్రమంలో కనేరియా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. ఈ సిరీస్ చివరి దశకు చేరింది. కీలకమైన మూడో మ్యాచ్‌కు గిల్‌ను పక్కన పెడితే బాగుంటుంది. ఎందుకంటే తొలి రెండు మ్యాచ్‌ల్లో అతడి ఆట తీరు ఎంటో చూశం. గిల్ టీ20లకు సెట్ కాడు. అలా అని గిల్‌ను నేను తక్కువ చేసి మాట్లాడనట్లు కాదు. గిల్ కూడా అద్భుతమైన ఆటగాడు. కానీ టీ20ల్లో రాణించలేకపోతున్నాడు. కాబట్టి అతడి స్థానంలో యువ ఆటగాడు పృథ్వీ షాను ఓపెనర్‌గా పంపండి. అతడు అద్భుతమైన ఆటగాడు. పవర్ ప్లే అటాకింగ్ గేమ్ ఆడగలడు. పృథ్వీకి ఎక్కువగా అవకాశాలు ఇస్తే.. అద్భుతాలు సృష్టిస్తాడు అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Hardik Pandya: ఇదేం పిచ్.. షాక్‌కు గురయ్యాం.. టీ20 కోసం చేసింది కాదు.. క్యూరేటర్లు ఇకనైనా.. IND vs NZ: వన్డేల్లో హిట్.. టీ20ల్లో ఫట్! గిల్‌కు ఏమైంది? ఇకనైనా అతడిని.. -
హార్ధిక్‌కు అంత సీన్ లేదు.. కెప్టెన్‌గా అతను ఫెయిల్..!
3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా.. న్యూజిలాండ్ చేతిలో 21 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి మ్యాచ్‌లో హార్ధిక్ వ్యూహాలను ఎండగట్టిన కనేరియా.. భారత్‌ను గెలిపించేందుకు హార్ధిక్ దగ్గర ఎలాంటి ప్రణాళికలు లేవని, కెప్టెన్‌గా హార్ధిక్ ఘోరంగా వైఫల్యం చెందాడని తన యూట్యూబ్ ఛానల్ వేదికగా నోటికి వచ్చినట్లు వాగాడు. బౌలర్లను రొటేట్ చేయడంలో దారుణంగా విఫలమైన హార్ధిక్.. చిన్నపిల్లాడిలా తానే మొదట బౌలింగ్ చేయాలన్నట్లుగా బంతి కోసం ఎగబడ్డాడని కనేరియా మండిపడ్డాడు. శివమ్ మావీని లేటుగా బరిలోకి దించడం, దీపక్ హుడాకు అనవసరమైన ప్రాధాన్యత ఇవ్వడం.. ఇలా, ప్రణాళికలేమీ లేకుండా బౌలర్లను మార్చడంపై ధ్వజమెత్తాడు. జట్టును ముందుండి నడిపించడంలో చేతులెత్తేసిన హార్ధిక్.. వ్యక్తిగతంగానూ దారుణంగా విఫలమయ్యాడని విమర్శించాడు. మొత్తంగా తొలి టీ20లో హార్ధిక్.. జట్టును ముందుండి నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యాడని, కెప్టెన్‌గా అతనికి అంత సీన్ లేదని అర్ధం వచ్చేలా టీమిండియా కెప్టెన్‌ను తక్కువ చేసి మాట్లాడాడు. ఆఖర్లో ఇది వ్యక్తిగత విమర్శ కాదని.. హార్ధిక్ కెప్టెన్సీపై తన అభిప్రాయం మాత్రమేనని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇదిలా ఉంటే, రోహిత్ సారధ్యంలో వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే (హార్ధిక్ నేతృత్వంలో) ఓడింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకంజలో ఉంది. ఇవాళ (జనవరి 29) జరుగబోయే రెండో మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా సిరీస్ విజయావకాశాలు సజీవంగా ఉంటాయి. -
Pak Vs Eng: బాబర్ ఓ జీరో.. కోహ్లితో పోల్చడం ఆపండి ప్లీజ్: పాక్ మాజీ క్రికెటర్
Pakistan vs England Test Series 2022: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై ఆ జట్టు మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా మండిపడ్డాడు. సారథిగా బాబర్ ఓ సున్నా అని, ఇకనైనా అతడిని టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో పోల్చడం ఆపేయాలని కోరాడు. కోహ్లితో పోల్చదగిన క్రికెటర్లెవరూ పాక్ జట్టులో లేరంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బాబర్ ఆజం బృందం వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. ఇప్పటికే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన పాక్... సొంతగడ్డపై దారుణ వైఫల్యం కారణంగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు మాజీ లెగ్ స్పిన్నర్ దానిష్ కనేరియా పాక్ ఆట తీరుపై మండిపడ్డాడు. బాబర్ ఆజంకు కెప్టెన్‌గా ఉండే అర్హత లేదంటూ విమర్శించాడు. దానిష్ కనేరియా పాక్ జట్టులో అలాంటి వాళ్లు లేరు ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా కనేరియా మాట్లాడుతూ.. ‘‘దయచేసి ఇప్పటికైనా బాబర్ ఆజంను కోహ్లితో పోల్చడం ఆపేయండి. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ గొప్ప ఆటగాళ్లు. వాళ్లతో పోల్చదగిన క్రికెటర్లెవరూ పాక్ జట్టులో లేరు. ఒకవేళ ఎవరైనా వాళ్లలా ప్రశంసలు అందుకోవాలంటే ఆటలో రారాజై ఉండాలి. మెరుగైన ప్రదర్శన కనబరచాలి. లేదంటే జీరోలు అవుతారు. ఇక బాబర్ ఆజం కెప్టెన్‌గా ఓ పెద్ద సున్నా. అతడికి నాయకుడిగా ఉండే అర్హత లేదు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో జట్టును ముందుకు నడిపే సామర్థ్యం, నాయకత్వ ప్రతిభ అతడికి లేవు’’ అని బాబర్ ఆజంపై విమర్శలు గుప్పించాడు. ఇగో పక్కన పెడితేనే ఇక ఇంగ్లండ్‌తో సిరీస్ ద్వారా కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెకల్లమ్ నుంచి కెప్టెన్సీ మెళకువలు నేర్చుకునే అవకాశం బాబర్‌కు దక్కిందన్న కనేరియా.. ఇకనైనా ఇగోను పక్కనపెట్టి పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ సలహాలు తీసుకోవాలని సూచించాడు. కాగా ఇంగ్లండ్ చేతిలో ఓటమితో బాబర్ ఆజం ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. స్వదేశంలో వరుసగా నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఓడిన మొదటి పాక్ కెప్టెన్‌గా నిలిచాడు. చదవండి: FIFA WC 2022: పోర్చుగల్ స్టార్ రొనాల్డోకు అవమానం.. అర్జెంటీనా ఆటగాడు కూడా FIFA WC 2022: విజేతకు రూ. 347 కోట్లు.. మిగతా జట్ల ప్రైజ్‌మనీ, అవార్డులు, ఇతర విశేషాలు -
షకీబ్ బౌలింగ్ గురించి చిన్న పిల్లలకు తెలుసు! భారత బ్యాటర్లకు మాత్రం..
బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో భారత జట్టు ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బ్యాటర్లు మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. అదే విధంగా కేఎల్ రాహుల్ కీలక సమయంలో క్యాచ్ జారవిడిచడం మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. అయితే బంగ్లాదేశ్ వంటి చిన్న జట్టుపై ఓటమిని అభిమానులతో పాటు మాజీలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కొంత మంది టీమిండియాకు మద్దతుగా నిలుస్తుంటే.. మరి కొంత మంది విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా స్పందించాడు. బంగ్లాదేశ్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌ను అర్ధం చేసుకోవడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారని విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన షకీబ్ బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించాడు. "షకీబ్ అల్ హసన్ అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఈ మ్యాచ్‌లో కూడా రాణించాడు. అయితే అతడు చాలా ఏళ్లుగా జట్టుతో ఉన్నాడు. ఐపీఎల్ కూడా ఆడుతున్నాడు. అయినప్పటికీ అతడి బౌలింగ్ ఎలా ఉంటుందో, అతడిని ఎలా ఎదుర్కోవాలో భారత బ్యాటర్లకు ఇంకా అర్థం కాలేదా? వాళ్లెందుకిలా చేశారో తెలియదు. ఇలాంటి సమయంలో బంతి పిచ్‌పై పడిన వెంటనే టర్న్ అవుతుందన్న విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసు. కానీ టీమిండియా క్రికెటర్లు ఆ విషయం తెలుసుకో లేకపోయారు" అంటూ తన యూట్యూబ్ ఛానల్లో కనేరియా పేర్కొన్నాడు. చదవండి: PAK vs ENG: పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్‌కు భారీ షాక్.. -
అప్పుడు రాయుడు.. ఇప్పుడు సంజూకు అన్యాయం: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్‌తో మూడో వన్డేకు కూడా శాంసన్‌కు భారత తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ క్రమంలో భారత జట్టు మేనేజేమెంట్‌పై విమర్శల వర్షం కురిస్తోంది. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కీలక వాఖ్యలు చేశాడు. వరుసగా విఫలమవుతున్న రిషబ్ పంత్ స్థానంలో సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లకు ఇవ్వకపోవడం పట్ల బీసీసీఐపై కనేరియా విమర్శల వర్షం కురిపించాడు. అదే విధంగా భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడుకు జరిగిన ఆన్యాయమే ఇప్పుడు శాంసన్‌కు జరుగుతోంది అని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్ వేదికగా జరిగిన జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టులో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రాయుడుకి చోటు దక్కుతుందని అంతా భావించారు. అయితే ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనూహ్యంగా రాయుడిని ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో ఆల్ రౌండర్ విజయ్ శంకర్‌కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. దీంతో నిరాశకు గురైన రాయుడు 2019లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. రాయుడికి జరిగిన అన్యాయమే ఇప్పుడు సంజూకు "సంజూ శాంసన్ లాంటి అద్భుతమైన ఆటగాడికి తరుచూ ఆన్యాయం జరుగుతోంది. ప్రతీ ఒక్క ఆటగాడికి కొంతవరకే సహనం, ఓపిక ఉంటుంది. అతడు నిరాశకు గురై రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అప్పుడు భారత జట్టు ఒక మంచి ఆటగాడిని కచ్చితంగా కోల్పోతుంది. ఏ జట్టు అయినా మంచి ఫుల్ పాట్లు, ఎక్స్ట్రా కవర్ డ్రైవ్‌లు ఆడే ఆటగాడు కావాలని భావిస్తోంది. కానీ భారత జట్టు మాత్రం సంజూ లాంటి అద్భుతమైన ఆటగాడిని పక్కన పెడూతూ వస్తుంది. అంబటి రాయుడు కెరీర్ కూడా ఇలాగే ముగిసింది. అతడు భారత తరపున అద్భుతంగా రాణించాడు. కానీ అతడి పట్ల బీసీసీఐ చిన్నచూపు చూసింది. బీసీసీఐ, సెలక్షన్ కమిటీ అంతర్గత రాజకీయాలకు రాయడు బలైపోయాడు" అని తన యూట్యూబ్ ఛానల్లో కనేరియా పేర్కొన్నాడు. -
భువీని తీసేయండి.. అతడిని జట్టులోకి తీసుకురండి!
టీ20 ప్రపంచకప్ 2022లో ఘోర పరాభవం తర్వాత.. భారత జట్టులో మార్పులు చేయాలని మాజీ క్రికెటర్లు పలు సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. భారత టీ20 జట్టులోకి వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో దీపక్ చహర్‌ను తీసుకురావాలని కనేరియా అభిప్రాయపడ్డాడు. చాహర్ గాయాలతో బాధపడుతున్నప్పటికీ భువీ కంటే మెరుగైన ఆటగాడు అని అతడు తెలిపాడు. ఇక న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడిన భువీకి వన్డే సిరీస్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇక టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న దీపక్ చహర్ వన్డే సిరీస్‌కు భారత జట్టులోకి వచ్చాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ఆక్లాండ్ వేదికగా శుక్రవారం జరగనుంది. ఈ క్రమంలో తన యూట్యూబ్ ఛానల్లో కనేరియామాట్లాడూతూ... "దీపక్ చాహర్ అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. అతడిని భారత జట్టు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. టీ20 జట్టులో భువనేశ్వర్ కుమార్ స్థానంలో చాహర్‌ని తీసుకోవాలి. అతడు భువీ కంటే అద్భుతంగా రాణించగలడు. అతడు పవర్ ప్లేలో కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తాడు. మీకు నాలుగు ఓవర్లలో 35 నుంచి 40 పరుగులు ఇచ్చే బౌలర్ కావాలా? భువీకి గుడ్‌బై చెప్పే సమయం ఇది. ప్రసిద్ధ్ కృష్ణ, టి నటరాజన్ వంటి పేస్ బౌలర్లు అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నారు. 2024 టీ20 ప్రపంచకప్ సమయానికి భువీ ఫిట్‌గా ఉండడానికి మనకు తెలుసు. కాబట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయం"అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Dinesh Karthik Retirement?: దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం..! భావోద్వేగ పోస్టు.. ప్లీజ్ డీకే.. వద్దు అంటున్న ఫ్యాన్స్ -
కోహ్లిని చూసి నేర్చుకో! మొండితనం పనికిరాదు.. జిడ్డులా పట్టుకుని వేలాడుతూ
T20 World Cup 2022- Babar Azam: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మండిపడ్డాడు. మొండితనం వీడి ఇప్పటికైనా జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించాలని హితవు పలికాడు. అతడి స్వార్థం వల్ల జట్టు నష్టపోతోందని.. ఇప్పటికైనా కళ్లు తెరవాలని బాబర్‌కు సూచించాడు. నిస్వార్థంగా ఎలా ఉండాలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని చూసి నేర్చుకోవాలని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో పాకిస్తాన్ రన్నరప్‌గా నిలిచినప్పటికీ బ్యాటర్‌గా బాబర్ ఆజం పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. మహ్మద్ రిజ్వాన్‌తో పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ లాహోర్ బ్యాటర్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై అర్ధ శతకం మినహా మిగతా మ్యాచ్‌లలో ఆకట్టుకోలేకపోయాడు. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్- కోహ్లి జిడ్డులా పట్టుకుని వేలాడుతూ ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా బాబర్ ఆట తీరుపై విమర్శలు చేశాడు. ఓపెనింగ్ స్థానాన్ని జిడ్డులా పట్టుకుని వేలాడుతూ.. జట్టుకు నష్టం చేకూరుస్తున్నాడని ఫైర్ అయ్యాడు. ‘‘బాబర్ ఆజం చాలా మొండిగా ప్రవర్తిస్తున్నాడు. తన ఓపెనింగ్ స్థానాన్ని వదులుకోవడానికి అతడు ఇష్టపడటం లేదు. కరాచీ కింగ్స్‌తో ఉన్న సమయంలో అతడి ప్రవర్తన ఇలాగే ఉంది. నిజానికి తను మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయలేడు. అందుకే ఇలా చేస్తున్నాడు. అయితే, బాబర్ ఇలా మొండిగా ఉండటం వల్ల పాకిస్తాన్ క్రికెట్‌కు కీడు చేసినవాడు అవుతాడు. ఓపెనర్ మరీ ఇంత నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభిస్తే ఎలా?’’ అంటూ కనేరియా ప్రశ్నించాడు. ఇక జట్టు ప్రయోజనాల గురించి ఎలా ఆలోచించాలో విరాట్ కోహ్లిని చూసి నేర్చుకోవాలన్న డానిష్ కనేరియా.. ‘‘ఈ ప్రపంచంలో విరాట్ కోహ్లి లాంటి నిస్వార్థపరుడైన ఆటగాడు మరొకరు ఉండరు. కోహ్లిని చూసి నేర్చుకో తన సారథ్యంలో వరల్డ్‌కప్ ట్రోఫీ చేజారింది. దాంతో అతడు బలిపశువు అయ్యాడు. కెప్టెన్సీ వదులుకున్నాడు. ఆ తర్వాత జట్టులో అతడి స్థానం గురించి అనేక ప్రశ్నలు వచ్చాయి. అయితే, తను నిరాశ పడలేదు. కొత్త కెప్టెన్‌కు పూర్తిగా సహకారం అందిస్తూ.. అతడు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు రమ్మంటే ఆ స్థానంలో వచ్చాడు. జట్టు కోసం చేయాల్సిదంతా చేస్తున్నాడు’’ అంటూ ప్రశంసలు కురిపించాడు. అదరగొట్టిన కింగ్ టీ20 వరల్డ్‌కప్-2022లో విరాట్ కోహ్లి 296 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక పాకిస్తాన్‌పై 82 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లికి ఈ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. మరోవైపు బాబర్ ఆజం మొత్తంగా 124 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: T20 WC 2022: బాబర్ చేసిన తప్పు అదే.. అందుకే పాకిస్తాన్ ఓడిపోయింది! లేదంటే Shaheen Afridi: నీకసలు సిగ్గుందా? నా ఎదురుగా నువ్వు ఉంటేనా: వసీం అక్రమ్ -
'కోహ్లి, బాబర్ కాదు.. రాబోయే రోజుల్లో అతడే స్టార్ బ్యాటర్'
టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం భీకర ఫామ్‌లోఉన్నాడు. హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69 పరుగులు సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్‌పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ప్రశంసల వర్షం కురిపించాడు. రాబోయే ఏళ్లలో విరాట్ కోహ్లి, బాబర్ ఆజాం వంటి స్టార్ ఆటగాళ్లను సూర్య అధిగమిస్తాడని కనేరియా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం సూర్యకుమార్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడని అతడు కొనియాడాడు. కాగా సూర్య ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మూడో స్దానంలో ఉన్నాడు. ప్రత్యర్ది బౌలర్లకు వెన్నులో వణుకు "ప్రపంచ టీ20 క్రికెట్లో అత్యుత్తమ బ్యాటరల్లో సూర్యకుమార్ ఒకడు. నేను గత కొంత కాలంగా ఇదే చెబుతున్నాను. 360 డిగ్రీలలో అతడు ఆడే షాట్లు అద్భుతమైనవి. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్ది బౌలర్లకు వెన్నులో వణుకు పుడుతోంది. ఆస్ట్రేలియాతో మూడో టీ20లో సూర్య మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్య రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెద్ద స్టార్ ఆటగాడు అవుతాడు. అతడు బ్యాటింగ్ చేసే విధానం.. ఇతర బ్యాటింగ్ దిగ్గజాలందరినీ మరచిపోయేలా చేస్తుంది. కోహ్లి, బాబర్ ఇద్దరూ అద్భుతమైన ఆటగాళ్లు. కానీ రాబోయే రోజుల్లో వీరిద్దరిని అధిగమించి ప్రపంచ క్రికెట్ చరిత్రలో తన పేరును లిఖించుకుంటాడు" అని కనేరియా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా ధావన్.. వైస్ కెప్టెన్‌గా శాంసన్! -
Ind Vs Aus: ఓపెనర్‌గా కోహ్లి! రోహిత్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి!
India Vs Australia T20 Series- Rohit Sharma: టీ20లలో టీమిండియా ఓపెనింగ్ జోడీ గురించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఓపెనర్‌గా ప్రమోట్ చేసి.. కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలని సూచించాడు. ఇటీవలి కాలంలో రోహిత్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడని.. శుభారంభం లభించినా ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడని పెదవి విరిచాడు. బ్యాటింగ్ ఆర్డర్ మారితే ఆట తీరులో మార్పు రావచ్చేమోనని పేర్కొన్నాడు. ఆసియా కప్ టోర్నీలో.. కాగా ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో టీమిండియా సారథి, ఓపెనర్ రోహిత్ శర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేదు. ఈ మెగా ఈవెంట్లో నాలుగు మ్యాచ్‌లు ఆడి అతడు సాధించిన మొత్తం పరుగులు 133. సూపర్-4లో శ్రీలంకతో మ్యాచ్‌లో 72 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. మిగతా మ్యాచ్‌లలో నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యాడు. ఇక ఆస్ట్రేలియాతో స్వదేశంలో తొలి టీ20లోనూ రోహిత్ బ్యాట్ ఝులిపించలేకపోయాడు. మొహాలీలో ఆసీస్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్.. తొమ్మిది బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్ మారితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. కోహ్లిని ఓపెనర్‌గా పంపితే.. ఈ మేరకు.. ‘‘రోహిత్ శర్మ ఇటీవలి కాలంలో పెద్దగా పరుగులు రాబట్టలేకపోతున్నాడు. ఆసియా కప్‌లోనూ తన ప్రదర్శన స్థాయికి తగినట్లు లేదు. ఆరంభం బాగానే ఉన్నా.. భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్నాడు. రోహిత్ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మూడో స్థానానికి మార్చుకోవాలి. లేదంటే.. కేఎల్ రాహుల్‌ను వన్‌డౌన్‌లో ఆడించాలి. అప్పుడు విరాట్ కోహ్లి- రోహిత్ ఓపెనర్లుగా వస్తారు’’ అని డానిష్ కనేరియా చెప్పుకొచ్చాడు. కాగా ఆసియా కప్- 2022లో విరాట్ కోహ్లి 276 పరుగులతో టీమిండియా తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఆసీస్‌తో మొదటి టీ20లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఏడు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి నాథన్ ఎలిస్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైన టీమిండియా సిరీస్‌ను పరాజయంతో ఆరంభించింది. చదవండి: ఉప్పల్‌లో భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్.. హెచ్‌సీఏకు క్రీడామంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ -
T20 WC: ఇదే లాస్ట్ ఛాన్స్! అదే జరిగితే బాబర్ ఆజం కెప్టెన్సీ కోల్పోవడం ఖాయం!
T20 World Cup 2022- Babar Azam: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-3లో ఉన్న ఈ స్టార్ ఓపెనర్ ఈ మెగా ఈవెంట్లో చేసిన మొత్తం పరుగులు 68 మాత్రమే! ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి ఇలా నామమాత్రపు స్కోరుకే పరిమితమైన బాబర్ ఆజం.. కెప్టెన్‌గానూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. విమర్శల జల్లు! ముఖ్యంగా.. ఫైనల్లో శ్రీలంక చేతిలో పాక్ ఓటమి కారణంగా తీవ్ర విమర్శల పాలయ్యాడు ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్. గెలుస్తామనుకున్న మ్యాచ్ ఓడిపోవడంతో అభిమానులు సహా ఆ జట్టు మాజీ క్రికెటర్లు తమ సారథి తీరుపై మండిపడ్డారు. ఇక ఆసియాకప్- 2022లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న పాకిస్తాన్ ప్రస్తుతం.. అక్టోబరు 16 నుంచి ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్-2022కు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న ఈ ఐసీసీ ఈవెంట్‌కు ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. బాబర్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్! ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా.. బాబర్ ఆజం భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఈ మెగా టోర్నీలో గనుక పాక్ జట్టు రాణించకపోతే బాబర్ ఆజం కెప్టెన్సీ కోల్పోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మాజీ లెగ్ స్పిన్నర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘బాబర్ ఆజం ప్రస్తుతం ఫామ్‌లో లేడు. అతడి కెప్టెన్సీపై కూడా విమర్శలు వస్తున్నాయి. అలా అయితే కెప్టెన్సీ కోల్పోతాడు! నాకు తెలిసి కెప్టెన్‌గా బాబర్‌కు ఇదే ఆఖరి అవకాశం. ఒకవేళ ప్రపంచకప్‌లో పాక్ మెరుగైన ప్రదర్శన కనబరచకపోతే.. అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉంటుంది. దీంతో సహజంగానే అతడు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయి ఉంటాడు. బాబర్ గొప్ప క్రికెటర్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే, ప్రస్తుత పరిస్థితులు మాత్రం అతడికి అనుకూలంగా లేవు’’ అని చెప్పుకొచ్చాడు. జట్టు ఎంపికలో కెప్టెన్‌గా తన పాత్ర కూడా ఉంటుందని.. కాబట్టి ఎక్కడ ఏ పొరపాటు జరిగినా బాబర్ జవాబుదారీగా ఉండక తప్పదని పేర్కొన్నాడు. ఓపెనర్‌గా వద్దు! అదే విధంగా.. ఓపెనర్‌గా విఫలమవుతున్న కారణంగా బాబర్ ఆజం.. బ్యాటింగ్ ఆర్డర్లో తన స్థానాన్ని మార్చుకుంటే బాగుంటుందని డానిష్ కనేరియా సూచించాడు. ‘‘మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం స్ట్రైక్ రేటు ఆందోళన కలిగించే అంశం. పవర్‌ప్లేలో ఉండే సౌలభ్యాన్ని కూడా వారు వినియోగించుకోలేకపోతున్నారు. ఓపెనర్‌గా పరుగులు సాధించలేకపోతున్న బాబర్ ఆజం.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయేమో! ఇంగ్లండ్‌తో సిరీస్‌లో వారు ఈ ప్రయోగాలు చేయవచ్చు. రిజ్వాన్‌కు విశ్రాంతినిచ్చారు కాబట్టి కొత్త కాంబినేషన్లు ట్రై చేస్తే బాగుంటుంది’’ అని కనేరియా అభిప్రాయపడ్డాడు. కాగా ప్రపంచకప్ కంటే ముందు పాకిస్తాన్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. గతేడాది ప్రపంచకప్ టోర్నీలో లీగ్ దశలో రాణించిన బాబర్ ఆజం బృందం సెమీస్‌లో ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Aus: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. పూర్తి షెడ్యూల్, జట్లు.. ఇతర వివరాలు! ఇంగ్లండ్ క్రికెటర్ల పెద్ద మనసు.. -
'కోహ్లి మళ్లీ విఫలమయ్యాడు.. ఇదీ ఒక ఇన్నింగ్సేనా'
ఆసియాకప్-2022లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసింది. అయితే గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. దాయాదుల పోరులో 34 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 35 పరుగులు చేసి భారత విజయంలో తమ వంతు ప్రాత్ర పోషించాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజాతో కలిసి సంయుక్తంగా భారత తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముఖ్యంగా భారత టాప్ ఆర్డర్లో కోహ్లి తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. కాగా కోహ్లి తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఎంతో ఆతృతగా ఎదురు చేసిన అభిమానుల్లో ఈ ఇన్నింగ్స్ కాస్త జోష్ నిపింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా మాత్రం కోహ్లి ఫామ్‌పై ఆసక్తికర వాఖ్యలు చేశాడు. మళ్లీ విఫలమయ్యాడు! యూట్యూబ్ ఛానల్లో కనేరియా మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి విరాట్ కోహ్లిపైనే ఉండేది. అతడు మళ్లీ విఫలమయ్యాడు. అతడు తన ఇన్నింగ్స్ ఆరంభంలో బంతులను ఎదర్కొవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. చాలా సార్లు బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుంది. కేఎల్ రాహుల్ కూడా దురదృష్టవశాత్తూ ఇన్సైడ్ ఎడ్జ్ తాకి బౌల్డ్ అయ్యాడు. అయితే కోహ్లి మాత్రం అదృష్టవంతుడు. ఎందుకంటే అతడు ఎదర్కొన్న రెండో బంతికే పెవిలియన్‌కు చేరాల్సింది. కోహ్లి ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను ఫఖర్ జమాన్ జారవిడిచడంతో బతికిపోయాడు. అతడు తన ఇన్నింగ్స్‌లో కేవలం ఒకే ఒక మంచి షాట్ ఆడాడు. అతడు ఇంకా పరుగులు సాధించాల్సి ఉంది. ఇదేం అంత గొప్ప ఇన్నింగ్స్ కాదు. ఇక అఖరిగా కోహ్లి లెఫ్ట్ ఆర్మ్ స్సిన్నర్కు ఎక్స్ట్రా-కవర్ దిశగా ఆడటానికి ప్రయత్నించి ఔటయ్యాడు. అతడు షాట్లు బాగా ఆడుతున్నాడు. అయితే గతంలో కోహ్లి.. సచిన్ టెండూల్కర్‌తో కలిసి ఆడుతున్నప్పడు ఇదే షాట్‌కు ప్రయత్నించి తన వికెట్ కోల్పోయాడు. ఆనంతరం కోహ్లికి ఆటువంటి షాట్ ఆడకుండా ఉండమని సచిన్ సలహా ఇచ్చాడని నాకు ఒకరు చెప్పారు. మళ్లీ ఇప్పుడు కోహ్లి అదే తప్పు చేశాడు అని పేర్కొన్నాడు. చదవండి: Asia cup 2022: అప్పుడు స్ట్రెచర్‌పై అలా.. ఇప్పుడు పాకిస్తాన్‌పై చేలరేగి! శభాష్ హార్దిక్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కేఎల్ రాహుల్ స్ధానంలో అతడిని ఎంపిక చేయాల్సింది: పాక్ మాజీ స్పిన్నర్
ఆసియాకప్-2022కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో మ్యా శ్రీలంక- ఆఫ్గానిస్తాన్ జట్లు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఇక భారత్ విషయానికి వస్తే.. తమ తొలి మ్యాచ్‌లో దాయాది జట్టు పాకిస్తాన్‌తో ఆదివారం తలపడనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక ఈ మెగా ఈవెంట్ ప్రారంభానికి ముందు భారత జట్టును ఉద్దేశించి పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఆసియాకప్ భారత జట్టులో రాహుల్‌కు బదులుగా యువ ఆటగాడు సంజూ శాంసన్ ఉండి ఉంటే బాగుండేది అని కనేరియా అభిప్రాయపడ్డాడు. రాహుల్ స్థానంలో సంజూని ఎంపికచేయాల్సింది! ఈ నేపథ్యంలో క్రికెట్ నెక్ట్స్.కామ్‌తో కనేరియా మాట్లాడుతూ.. "కేఎల్ రాహుల్ తాజాగా గాయం నుంచి కోలుకుని జట్టులో చేరాడు. అతడు జింబావ్వే సిరీస్‌లో కూడా అంతగా రాణించలేకపోయాడు. రాహుల్ తిరిగి తన రిథమ్‌ను పొందడానికి కాస్త సమయం పడుతుంది. అతడికి మరింత ప్రాక్టీస్ అవసరం. నా వరకు అయితే రాహుల్‌ని ఆసియాకప్‌కు ఎంపిక చేయకపోవాల్సింది. రాహుల్ స్థానంలో సంజూ శాంసన్ వంటి యువ ఆటగాడిని ఎంపిక చేయాల్సింది. శాంసన్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. శాంసన్‌కు భారత్ తరుపున ఆడే అవకాశాలు చాలా తక్కువగా లభించాయి. చాలా కాలం అతడు జట్టు బయటే ఉన్నాడు. అయితే రాహుల్ ద్రవిడ్ కోచ్ బాధ్యతలు చేపట్టాక శాంసన్‌కు టీమిండియా తరపున ఆడే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే సంజూ ఎంత ప్రతిభావంతుడో ద్రవిడ్‌కు బాగా తెలుసు" అని పేర్కొన్నాడు. ఈ ఏడాది స్వదేశంలో ప్రోటీస్‌తో జరిగిన సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన రాహుల్ తిరిగి జింబాబ్వే సిరీస్‌తో జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన రాహుల్ కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: Asia Cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. దీపక్ హుడాకు నో ఛాన్స్! అశ్విన్‌కు కూడా! -
టీమిండియాను విమర్శించిన పాక్ అభిమానులు.. కనేరియా దిమ్మతిరిగే కౌంటర్!
India Tour Of Zimbabwe 2022- ODI Series- 2nd ODI: జింబాబ్వేతో రెండో వన్డేలో టీమిండియా బ్యాటింగ్‌ను విమర్శించిన పాకిస్తాన్ జట్టు అభిమానుల తీరును ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా తప్పుబట్టాడు. టీమిండియా స్థానంలో గనుక పాక్ జట్టు ఉంటే మ్యాచ్‌ను 50వ ఓవర్ల వరకు సాగదీసేదంటూ చురకలు అంటించాడు. కాగా మూడు వన్డేలు ఆడేందుకు కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హరారే వేదికగా శనివారం(ఆగష్టు 20) ఇరు జట్లు రెండో వన్డేలో తలపడ్డాయి. టాస్ గెలిచిన భారత్.. జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఆతిథ్య జట్టు 161 పరుగులు చేసి 38.1 ఓవర్లకే ఆలౌట్ అయింది. ఐదు వికెట్లు కోల్పోయి! ఇక లక్ష్య ఛేదనకు దిగిన రాహుల్ సేన 25.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 167 పరుగులు సాధించి జయకేతనం ఎగురువేసింది. అయితే, జింబాబ్వేతో మ్యాచ్‌లో స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా కీలక బ్యాటర్లు తక్కువ స్కోరుకే పరిమితం కావడాన్ని కొంతమంది పాక్ అభిమానులు ట్రోల్ చేశారు. డానిష్ కనేరియా మన జట్టు అయితే! ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ లెగ్‌స్పిన్నర్ డానిష్ కనేరియా.. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘‘161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి గెలుపొందడాన్ని చాలా మంది పాకిస్తానీ అభిమానులు విమర్శించారు. నిజానికి.. భారత ఆటగాళ్లు పూర్తి దూకుడైన ఆటతో ముందుకు సాగారు. సుమారు 25 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేశారు. మన జట్టు ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే గనుక 50 ఓవర్ల పాటు తంటాలు పడేది’’ అని కనేరియా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా మొదటి వన్డేలో 10 వికెట్లు, రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత జట్టు జింబాబ్వేతో సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య సోమవారం(ఆగష్టు 22) నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది. అంతా మీరే చేశారు! ఇదిలా ఉంటే.. ప్రతిష్టాత్మక ఆసియా కప్-2022 టోర్నీకి ముందు పాక్ కీలక బౌలర్ షాహిన్ ఆఫ్రిది గాయపడిన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరును కనేరియా విమర్శించాడు. విశ్రాంతి ఇవ్వకుండా అతడిని కష్టపెట్టారని.. అందుకే మెగా ఈవెంట్‌కు ముందు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కాగా ఆగష్టు 27 నుంచి ఆసియా కప్ టోర్నీ ఆరంభం కానుండగా.. ఆ మరుసటి రోజు చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. చదవండి: Ind Vs Zim: పాపం.. కనీసం ఆఖరి వన్డేలోనైనా వాళ్లిద్దరికీ అవకాశం ఇవ్వకపోతే అన్యాయం చేసినట్లే! Sanju Samson: అతడు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా అంతే! నాకైతే గొప్పగా అనిపిస్తోంది! -
'ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ వద్దు.. అతడినే రోహిత్ జోడిగా పంపండి'
టీ20 ప్రపంచకప్-2022కు ముందు భారత్ మరో మెగా టోర్నీకు సిద్దమవుతోంది. ఆగస్టు 27 నుంచి జరగనున్న ఆసియాకప్‌లో టీమిండియా పాల్గొనుంది. ఇప్పటికే ఆసియా కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. గత కొంత కాలంగా జట్టుకు దూరమైన భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో భారత ఓపెనింగ్ సమస్య తీరినట్టే అని చెప్పుకోవాలి. కాగా గాయం కారణంగా రాహుల్ జట్టుకు దూరం కావడంతో గత కొన్ని సిరీస్‌ల నుంచి భారత్ పలు ఓపెనింగ్ జోడీలను ప్రయోగించింది. అందులో భాగంగానే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో రోహిత్ జోడిగా సూర్యకుమార్ యాదవ్ భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. అయితే ఓపెనర్‌గా సరికొత్త అవతారమెత్తిన సూర్య పర్వాలేదనపించాడు. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన సూర్య 135 పరుగులు సాధించాడు. ఇది ఇలా ఉండగా.. రాహుల్ జట్టులోకి వచ్చినప్పటికీ రోహిత్ శర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "ఆసియాకప్‌లో రోహిత్ శర్మ జోడిగా సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగాలని నేను భావిస్తున్నాను. అతడు విండీస్ సిరీస్‌లో రోహిత్ కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చినప్పటికీ.. అతడు మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వస్తే బాగుటుంది. రాహుల్ ఏ స్థానంలోనైనా అద్భుతంగా రాణించగలడు. అతడు గతంలో చాలా సార్లు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం మనం చూశాం. కాబట్టి రోహిత్‌తో కలిసి సూర్యకుమార్ టీమిండియా ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే బాగుటుంది" అని పేర్కొన్నాడు. కాగా రాహుల్ ప్రస్తుతం పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించడంతో జింబాబ్వే సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆసియా కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ -
Asia Cup 2022: భారత్‌ను చూసి నేర్చుకోండి.. కాస్త మారండి: పాక్ మాజీ క్రికెటర్
Asia Cup 2022- India Vs Pakistan: ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ టోర్నీల ఆరంభానికి సమయం దగ్గరపడుతున్న వేళ పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ దానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాను చూసి భవిష్యత్ ప్రణాళికలు రచించడం నేర్చుకోవాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సూచించాడు. కేవలం వర్తమానం గురించి ఆలోచిస్తే సరిపోదని.. బెంచ్ బలాన్ని పెంచుకుంటేనే మనుగడ ఉంటుందని పేర్కొన్నాడు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ తొలిసారిగా ఆగష్టు 28న ఆసియా కప్ ఈవెంట్లో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీలో దాయాది చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని పలు ప్రయోగాలు చేస్తున్న భారత్.. యువ ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు ఇస్తూ బెంచ్‌ను చెక్ చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే వాళ్లు రాణిస్తుండటం సానుకూల అంశంగా మారింది. ఓవైపు అనువజ్ఞులైన సీనియర్లు.. మరోవైపు ప్రతిభ నిరూపించుకుంటున్న యంగ్‌స్టర్స్‌తో జట్టు నిండిపోయింది. దీంతో ఎవరిని సెలక్ట్ చేయాలి? ఎవరిని పక్కనపెట్టాలి? అన్న విషయంలో సెలక్టర్లకు తల నొప్పులు తప్పడం లేదంటే అతిశయోక్తి కాదు. దానిష్ కనేరియా భారత్‌ను చూసి నేర్చుకోండి! ఈ నేపథ్యంలో పాక్ మాజీ లెగ్ స్పిన్నర్ దానిష్ కనేరియా యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘గతేడాది ప్రపంచకప్ తర్వాత పాకిస్తాన్ చాలా తక్కువ టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఏడింట ఆరు గెలిచింది. ఆస్ట్రేలియా వంటి మేటి జట్టుతో ఆడిన గేమ్‌లో ఓడిపోయింది. ఇక టీమిండియా విషయానికొస్తే.. వాళ్లు 24 మ్యాచ్‌లు ఆడారు. దాదాపుగా 20 మ్యాచ్‌లు గెలిచారు. చాలా వరకు బీ,సీ టీమ్‌లతో ఆడి కూడా ఇలాంటి అద్భుత విజయాలు అందుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే తమ బెంచ్ స్ట్రెంత్‌ను మరింత బలోపేతం చేసుకునే పనిలో ఉన్నామని చెప్పాడు. భారత్.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తోంది. దురదృష్టవశాత్తూ.. పాకిస్తాన్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. బెంచ్ స్ట్రెంత్ గురించి అసలు ఆలోచించడం లేదు. ఇప్పటికైనా మెంటాలిటీ మార్చుకోవాలి. కాస్త ధైర్యంగా ముందడుగు వేయాలి. ప్రయోగాలు చేయాలి. నెదర్లాండ్స్ పర్యటనలో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి’’ అని చెప్పుకొచ్చాడు. కాగా నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా పాకిస్తాన్ ఆగష్టు 16 నుంచి ఆగష్టు 21 వరకు మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఆగష్టు 27 నుంచి ఆసియా కప్, అక్టోబరు 16 నుంచి టీ20 వరల్డ్‌కప్-2022 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చదవండి: Virender Sehwag: ‘ప్రతీకారం’ అంటూ పాక్ కామెంటేటర్ పైత్యం.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సెహ్వాగ్! నెహ్రా ఇప్పుడు.. Rishabh Pant-Uravasi Rautela: బాలీవుడ్ హీరోయిన్‌కు పంత్ దిమ్మతిరిగే కౌంటర్ -
కోహ్లిని ఆసియాకప్‌కు ఎంపిక చేయకపోవచ్చు: పాక్ మాజీ ఆటగాడు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి సెంచరీ సాధించి మూడేళ్ల దాటిపోయింది. ఐపీఎల్లో నిరాశపరిచిన కోహ్లి.. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలోనూ తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. ఇక ఇంగ్లండ్ టూర్ తర్వాత కోహ్లి భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే జింబాబ్వే పర్యటనకు కోహ్లిని ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ జింబాబ్వే సిరీస్‌కు కోహ్లిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. కాగా ఈ ఏడాదిలో భారత్ ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ వంటి మేజర్ టోర్నీల్లో పాల్గొనబోతుంది. ఈ నేపథ్యంలో కోహ్లి ఫామ్ భారత్‌ను మరింత గందరగోళానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో కోహ్లిపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కీలక వాఖ్యలు చేశాడు. ఆసియాకప్-2022కు విరాట్ కోహ్లిని ఎంపికచేయకపోవచ్చు అని కనేరియా జోస్యం చెప్పాడు. జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌కు బదులుగా కోహ్లిని ఎంపిక చేయాల్సిందని కనేరియా అన్నాడు. "జింబాబ్వే సిరీస్‌కు ఇషాన్ కిషన్‌ను ఎందుకు ఎంపిక చేశారో నాకు అర్ధం కావడం లేదు. జట్టులో మరో వికెట్ కీపర్‌గా ఉన్న సంజూ శాంసన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అటువంటి అప్పడు కిషన్‌ను ఎంపిక చేయాల్సిన అవసరం ఏముంది. కిషన్‌కు బదులుగా కోహ్లి జట్టులో ఉండాల్సింది. విరాట్ కోహ్లి ఈ సిరీస్‌లో భాగమై ఉంటే బాగుండేది. కోహ్లిని కేవలం ప్రధాన టోర్నమెంట్లలో మాత్రమే ఆడాంచాలని బీసీసీఐ భావిస్తోంది. కోహ్లి అక్కడ విఫలమైతే, మరోసారి అతడి ఫామ్‌పై చర్చలు జరుగుతాయి. ఈ విషయంలో మాత్రం బీసీసీఐ కోహ్లికి అన్యాయం చేస్తుంది నేను భావిస్తున్నాను. కోహ్లి వెస్టిండీస్ పర్యటన మొత్తానికి విశ్రాంతి తీసుకున్నప్పుడు, అతడిని ఖచ్చితంగా జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక చేయాల్సింది. అతడు జింబాబ్వేతో వన్డేల్లో రాణించి తన ఫామ్‌ను తిరిగి పొందేవాడు. తద్వారా ఆసియా కప్‌లో కూడా కోహ్లి మెరుగైన ప్రదర్శన చేసేవాడు. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆసియా కప్‌కు కూడా కోహ్లిని పక్కన పెట్టే అవకాశం ఉంది" అని కనేరియా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: Asia Cup 2022: ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. ఎప్పుడంటే..? -
జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు అతడిని ఎందుకు ఎంపిక చేశారు..?
జింబాబ్వేతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ శనివారం (జూలై 30) ప్రకటించింది. ఇక ఈ సిరీస్‌కు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో శిఖర్ ధావన్ మరోసారి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అదే విధంగా యువ ఆటగాడు రాహుల్ త్రిపాఠికు తొలి సారి భారత వన్డే జట్టులో చోటు దక్కింది. ఇక గాయం కారణంగా కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్నచ యువ పేసర్ దీపక్ చాహర్ ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. అదే సమయంలో అవేశ్ ఖాన్‌కు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అసక్తికర వాఖ్యలు చేశాడు. జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు పేసర్ అవేశ్ ఖాన్‌ను ఎంపిక చేయడాన్ని డానిష్ కనేరియా ప్రధానంగా తప్పుబట్టాడు. "అవేష్ ఖాన్ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయినప్పటికీ అతడిని సెలక్టర్లు ఎందుకు ఎంపిక చేశారో నాకు అర్దం కావడం లేదు. ఈ సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్ పేసర్లకు భారత్ విశ్రాంతినిచ్చింది. ఇక భారత స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ తన ఆరంభ మ్యాచ్‌ల్లో అంతగా రాణించలేకపోయాడు. అయితే అవేశ్ ఖాన్ స్థానంలో ఉమ్రాన్‌కు మరో అవకాశం ఇవ్వాల్సింది. అదే విధంగా అద్భుతంగా రాణిస్తున్న అర్ష్‌దీప్ సింగ్ కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. ఈ నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. జట్టు మేనేజ్మెంట్ అర్ష్‌దీప్‌కు మరిన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. తద్వారా అర్ష్‌దీప్ ఆటగాడిగా మరింత పరిణతి చెందుతాడు" అని కనేరియా పేర్కొన్నాడు. కాగా, అద్భుతంగా రాణిస్తున్న పేసర్ అర్షదీప్ సింగ్‌కు జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. చదవండి: భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించడమే నా అంతిమ లక్ష్యం: కార్తీక్ -
'అతడు డెత్ ఓవర్ల స్పెషలిస్టు.. టీ20 ప్రపంచకప్, ఆసియా కప్‌కు ఎంపిక చేయండి'
టీ20 ప్రపంచకప్, ఆసియాకప్‌కు భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేయాలని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సూచించాడు. ఐపీఎల్-2022లో అదరగొట్టిన ఆర్ష్‌దీప్ సింగ్‌కు భారత జట్టులో చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్ పర్యటనకు ఎంపికైన అతడు కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఐర్లాండ్ సిరీస్ అనంతరం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ తరపున ఆర్ష్‌దీప్ అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ మ్యాచ్‌లో 18 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక ప్రస్తుతం ఆర్ష్‌దీప్ విండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టులో భాగంగా ఉన్నాడు. తొలి, రెండు వన్డేల్లో బెంచ్‌కే పరిమితమైన ఆర్ష్‌దీప్.. అఖరి వన్డేలో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక డెత్ స్పెషలిస్ట్‌గా పేరొందిన ఆర్ష్దీప్ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని మాజీలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "విండీస్‌తో మూడో వన్డేలో అర్ష్‌దీప్ ఆడనున్నాడు. అంతే కాకుండా ఈ మ్యాచ్‌లో అతడు తన సత్తా చాటుతాడు. అర్ష్‌దీప్ బంతిని అద్భుతంగా స్వింగ్ చేయగలడు. అదే విధంగా అతడు చాలా తెలివిగా బౌలింగ్ చేస్తాడు. డెత్ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా బ్యాటర్లను ఎలా కట్టిడి చేయాలో అతడికి బాగా తెలుసు. టీ20 ప్రపంచకప్, ఆసియా కప్ కోసం భారత జట్టుకు అతడిని ఎంపిక చేయాలి. ఆసియా కప్ యూఏఈ వేదికగా జరుగుతోంది. అక్కడి పిచ్‌లు లెఫ్ట్ ఆర్మ్ పేసర్లకు ఎక్కువగా అనుకూలిస్తాయి. కాబట్టి అర్ష్‌దీప్ అద్భుతంగా రాణించగలడు" అని కనేరియా పేర్కొన్నాడు. చదవండి: Rahul Dravid: సెంచరీ సాధించినా నా పేరు ఎవరికీ తెలియలేదు.. అప్పుడే నిర్ణయించుకున్నా! -
పంత్‌కు అంత సీన్ లేదు, బుమ్రాను చెడగొట్టొద్దు.. పాక్ మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
IND VS ENG: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోవిడ్ బారిన పడటంతో ఇంగ్లండ్‌తో జరుగబోయే రీ షెడ్యూల్డ్ టెస్ట్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు టీమిండియా పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న అంశంపై సర్వత్రా చర్చ సాగుతుంది. కొందరు పంత్ అయితే బాగుంటుందని అంటే మరికొందరు బుమ్రా పేరును ప్రతిపాదిస్తున్నారు. ఇదే అంశంపై పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సైతం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా కెప్టెన్‌గా పంత్, బుమ్రా ఇద్దరూ వద్దని అతను అభిప్రాయపడ్డాడు. పంత్ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే పరిణితిని సాధించాల్సి ఉందని, ఇటీవలి దక్షిణాఫ్రికా సిరీస్‌లో కెప్టెన్‌గా అతని వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపించాయని అన్నాడు. అసలు పంత్‌కు టీమిండియా పగ్గాలు చేపట్టే సామర్థ్యం లేదని సంచలన కామెంట్స్ చేశాడు. కెప్టెన్సీ ప్రభావం అతడి బ్యాటింగ్‌పై కూడా పడిందని అభిప్రాయపడ్డాడు. మరోవైపు బుమ్రాకు సైతం కెప్టెన్సీ అప్పజెప్పకుంటేనే మంచిదని సలహా ఇచ్చాడు. కెప్టెన్సీ భారం వల్ల బుమ్రా తన లయను కోల్పోతాడని, ఈ భారాన్ని అతని తలపై మోపి చెడగొట్టొదని సూచించాడు. బుమ్రాకు స్వేచ్ఛగా బౌలింగ్ చేసే అవకాశం కల్పించాలని కోరాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్ ప్రారంభమయ్యే సమయానికి రోహిత్ శర్మ కోవిడ్ నుంచి కోలుకోకపోతే బుమ్రా, పంత్, అశ్విన్‌లలో ఎవరో ఒకరికి టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: పాకిస్థాన్ క్రికెట్‌ను 'అతను' భ్రష్టు పట్టిస్తాడు..! -
'ఏమైనా ఉంటే మీరిద్దరు తేల్చుకోండి.. మా దేశాన్ని ఎందుకు లాగుతారు?'
పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా షాహిద్ అఫ్రిదిపై గత వారం నుంచి వరుస ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. అఫ్రిది ఒక క్యారెక్టర్‌లెస్.. అబద్దాల కోరు.. జట్టు నుంచి బహిష్కరించడానికి ప్రధాన కారణం అఫ్రిదియేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక గురువారం తనను ఇస్లాం మతంలోకి మారాలంటూ అఫ్రిది ఒత్తిడి చేశాడంటూ.. హిందువులకు ఇక్కడ చోటు లేదంటూ అవమానపరిచాడంటూ పేర్కొన్నాడు. అయితే కనేరియా వరుస ఆరోపణలపై షాహిద్ అఫ్రిది ఎట్టకేలకు స్పందించాడు. కనేరియా కేవలం పబ్లిసిటీ కోసం ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తున్నాడని.. శత్రు దేశానికి(భారతదేశం) చెందిన మీడియా చానెల్‌కు ఇంటర్య్వూ ఇచ్చి తనను అవమానపరచాడంటూ పేర్కొన్నాడు. ''కనేరియా ఆరోపించినట్టు తాను అంత చెడ్డవాడినే అయితే అప్పుడే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించాడు. కేవలం తన పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నాడు. కనేరియా నాకు సోదరుడు లాంటివాడు. కొన్నేళ్లపాటు ఇద్దరం కలిసి పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాము. అది మరిచిపోయి పబ్లిసిటీ కోసం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. నన్ను అబద్దాల కోరు.. క్యారెక్టర్ లేనివాడు అనే ముందు అతడి క్యారెక్టర్ ఏంటో చూసుకుంటే బాగుంటుంది. అతడు మన శత్రు దేశం మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి మత చిచ్చు రగిలిస్తున్నాడు. ఇది అంత మంచి పరిణామం కాదు.'' అని ఆగ్రహం వక్తం చేశాడు. అయితే అఫ్రిది ఆరోపణలపై టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఘాటుగా స్పందించారు. ''కనేరియా నీపై ఆరోపణలు చేశాడు నిజమే.. ఏమైనా ఉంటే మీరిద్దరు తేల్చుకోండి.. మధ్యలో మా దేశాన్ని ఎందుకు లాగుతున్నారు''.. ''ఒక ఆటగాడు ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఆయా మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చే హక్కు ఉంటుంది. ఆ క్రమంలో మా దేశానికి చెందిన ప్రముఖ చానెల్‌కు ఇంటర్య్వూ ఇచ్చి ఉండొచ్చు''.. ''అసలు మత చిచ్చు రగిలిస్తుంది నువ్వు(అఫ్రిది).. శత్రుదేశం అని సంభోదించినప్పుడే నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైంది'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: షాహిద్ అఫ్రిది ఒక క్యారెక్టర్ లెస్.. అబద్ధాల కోరు : పాక్ మాజీ స్పిన్నర్ -
'షాహిద్ అఫ్రిది ఒక క్యారెక్టర్ లెస్.. అబద్ధాల కోరు'
''నేను పాకిస్తాన్ జట్టు నుంచి బయటికి వెళ్లడానికి షాహిద్ అఫ్రిది ప్రధాన కారకుడు.. అతనికి క్యారెక్టర్ అనేదే లేదు. నా గురించి జట్టు సభ్యులకు తప్పుగా చెప్పి వారి ముందు దోషిని చేశాడు. అతని నమ్మకద్రోహం నేను ఎప్పటికి మరిచిపోనూ'' -పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా 41 ఏళ్ల దానిష్ కనేరియా.. పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిపై నిప్పులు చెరిగాడు. ఏఎన్ఐ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తాను జట్టు నుంచి బహిష్కరణకు గురవ్వడంలో అఫ్రిది పాత్ర ఉందంటూ తెలిపాడు. ''పాకిస్తాన్‌కు క్రికెట్ ఆడినంత కాలం షాహిద్ అఫ్రిది నన్ను హేళన చేసేవాడు. తోటి ఆటగాళ్ల ముందు అవమానపరుస్తూ మాట్లాడేవాడు. ఇద్దరం కలిసి చాలా ఏళ్లపాటు పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాం. అతను కెప్టెన్‌గా ఉన్నప్పుడు నన్ను ఎక్కువగా బెంచ్‌కే పరిమితం చేసేవాడు. దాని మూలంగా చాలా వన్డే మ్యాచ్‌లకు దూరం కావాల్సి వచ్చింది. అంతేకాదు నేను హిందువునంటూ.. ఈ దేశంలో అతనికి చోటు లేదని.. జట్టు నుంచి బహిష్కరించాలని సహచరులకు నూరిపోసేవాడు. అతనొక అబద్దాల కోరు, అందరిని ప్రభావితం చేసే వ్యక్తి.. ఇంకా చెప్పాలంటే ఒక క్యారెక్టర్ లేని మనిషి. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా క్రికెట్‌పైనే ఫోకస్ చేసేవాడిని. జట్టులో ఉన్నంతకాలం నన్ను ద్వేషించేవాడు. నేనంటే ఎందుకంత అసూయ అనేది నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఒక్కటి చెప్పగలను. పాకిస్తాన్ జట్టుకు ఆడడం నా అదృష్టంగా భావిస్తా.. నా జీవితంలో అది గొప్పది.'' అంటూ చెప్పుకొచ్చాడు. 2009లో ఇంగ్లీష్ కౌంటీ చాంపియన్‌షిప్ ప్రో లీగ్‌లో భాగంగా కనేరియా స్పాట్ ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిక్సింగ్ ఆరోపణలు నిజమని తేలడంతో 2012లో ఇంగ్లీష్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అతనిపై జీవితకాల నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని పీసీబీ కూడా సమర్థించింది. కాగా తనపై విధించిన జీవతకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ పీసీబీకి మొరపెట్టుకున్నాడు. ''క్రికెట్లో ఫిక్సింగ్ చేసిన ఎంతో మంది బయట యథేచ్చగా తిరుగుతున్నారు. కానీ నాపై ఉన్న నిషేధాన్ని మాత్రం పీసీబీ తొలగించలేదు. ఒక దేశానికి క్రికెట్ ఆడాను.. నిషేధం తొలగిస్తే ప్రైవేట్ లీగ్‌ల్లో ఆడాలని ఉంది. ఎలాగూ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం పోయింది. పీసీబీని నేను అడిగేది ఒక్కటే.. నాపై బ్యాన్ ఎత్తేయండి.. నా పనేదో నేను చూసుకుంటా'' అని పేర్కొన్నాడు. కాగా దానిష్ కనేరియా 2000 సంవత్సరం నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. పాక్ తరపున 61 టెస్టుల్లో 261 వికెట్లు, 18 వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టాడు. -
Pak Vs Aus: పాక్ ఫ్యాన్స్‌కు ద్రోహం చేశాడు.. ఈ వయసులో నువ్వు కూడా!
Pakistan Vs Australia 1st Test: పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజాపై మండిపడ్డాడు. పనికిమాలిన పిచ్ తయారు చేయించిందే గాక.. ఇంకా సమర్థించుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా సుదీర్ఘ కాలం తర్వాత మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా మార్చి 4-8 మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. పేలవమైన ఈ పిచ్ ఒక్కసారి కూడా బౌలింగ్‌కు అనుకూలించకపోవడం గమనార్హం. ఫలితంగా బ్యాటర్లు చెలరేగారు. పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు చేయగా.. అజర్ అలీ, అబ్దుల్లా షఫిక్(136 నాటౌట్) చెరో శతకం బాదారు. ఆసీస్ ఆటగాళ్లలో ఓపెనర్ ఖావాజా 97, లబుషేన్ 90 పరుగులు చేశారు. ఈ క్రమంలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో పిచ్ రూపొందించిన విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై స్పందించిన పీసీబీ చీఫ్ రమీజ్ రాజా.. మ్యాచ్ పేలవ డ్రాగా ముగియడాన్ని తాను స్వాగతించడం లేదని, నాణ్యమైన పిచ్‌లను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ఇందుకు సమయం పడుతుందని చెప్పుకొచ్చాడు. PCB Chairman reflects on the Rawalpindi Test and reiterates his plans on pitches for domestic and international matches in the country#PAKvAUS l #BoysReadyHain pic.twitter.com/OuD7wDvJw1 — Pakistan Cricket (@TheRealPCB) March 9, 2022 ఈ నేపథ్యంలో కనేరియా తన యూట్యూబ్ చానెల్ వేదికగా రమీజ్ రాజా తీరుపై దుమ్మెత్తిపోశాడు. ‘‘రమీజ్ రాజా పాక్ అభిమానులకు ద్రోహం చేశాడు. వెన్నుపోటు పొడిచాడు. ఆయన తన కుమారుడి పెళ్లి పనులతో బిజీగా ఉన్నాడేమో! పర్లేదు! ఇప్పుడు మాత్రం ఈ జీవం లేని వికెట్ గురించి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఇక్కడికి వచ్చింది. కానీ.. మీరు.. ఇలంటి పిచ్ రూపొందించారు. బౌలర్లు రాణిస్తే చూడటం ఇష్టం లేదా? మీ కెప్టెన్ ఒక అసమర్థుడు. దూకుడుగా ముందుకు వెళ్లలేకపోతున్నాడు. ఇది ఎలాంటి పిచ్ అంటే రమీజ్ రాజా ఈ వయసులో కూడా అక్కడ పరుగుల వరద పారించగలడు’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా బాబర్ ఆజం సారథ్యంలోని పాక్ ఆసీస్‌తో తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని డ్రాగా ముగించింది. పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టు స్కోర్లు: ఆస్ట్రేలియా- 459 ఆలౌట్ పాకిస్తాన్ 476/4 డిక్లేర్డ్ & 252/0 చదవండి: IPL 2022- CSK: సీఎస్కే అభిమానులకు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! -
టీమిండియాలో రెండు గ్రూపులు.. కోహ్లి, రాహుల్ వేర్వేరుగా..
దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా తాడో పేడో తేల్చుకోవడానికిసిద్దమైంది. సిరీస్‌లో నిలవాలంటే తప్పనిసారిగా ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలి. కాగా పార్ల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 31 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి చెందింది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ప్రోటిస్ జట్టు ముందుంజలో ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా వివాదస్పద వాఖ్యలు చేశాడు. ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో రెండు గ్రూపులు ఉన్నాయని అతడు పేర్కొన్నాడు. “భారత డ్రెస్సింగ్ రూమ్ రెండు గ్రూపులుగా విభజించబడిందని మనకు సృష్టంగా తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో తొలి వన్డే సమయంలో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వేరువేరుగా కూర్చున్నారు. అలాగే, కోహ్లి కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఉన్న ఉన్న జోష్.. ప్రస్తుతం అతడిలో లేదు. కానీ విరాట్ టీమ్ మ్యాన్.. మరింత బలంగా తిరిగి వస్తాడు అని కనేరియా పేర్కొన్నాడు. కాగా టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం కావడంతో రాహుల్ సారథ్య బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. -
Ind Vs Sa Test Series: కెప్టెన్‌గా కోహ్లికిదే చివరి అవకాశం.. కాబట్టి
Virat Kohli: ‘‘ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో టీమిండియా టెస్టు సిరీస్‌కు గెలిచింది. కానీ... సఫారీ గడ్డపై భారత జట్టు ఇంతవరకు ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. నిజానికి విరాట్ కోహ్లికి దక్షిణాఫ్రికా పర్యటన అతిపెద్ద సవాలు. కెప్టెన్‌గా తనను తాను మరోసారి నిరూపించుకోవడానికి ఇదే చివరి అవకాశం. బ్యాటర్‌గా పరుగులు సాధించాలి.. కెప్టెన్‌గా జట్టును విజయతీరాలకు చేర్చాలి’’అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా అన్నాడు. అదే విధంగా... ప్రొటిస్‌తో టెస్టు సిరీస్ గెలిస్తేనే వన్డే కెప్టెన్‌గా తనను తొలగించిన బీసీసీఐకి సరైన సమాధానం చెప్పినట్లవుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత పరిస్థితుల్లో సౌతాఫ్రికా పర్యటన రూపంలో కోహ్లికి మంచి అవకాశం ఉందని పేర్కొన్నాడు. కాగా ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో ఆడిన 7 టెస్టు సిరీస్‌లలోనూ టీమిండియా పరాజయం పాలైంది. చివరిసారిగా 2-1 తేడాతో సిరీస్‌కు ఆతిథ్య జట్టుకు సమర్పించింది. ఇక.. వన్డే కెప్టెన్‌గా కోహ్లిని తప్పించి... రోహిత్ శర్మకు బీసీసీఐ పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... టెస్టు కెప్టెన్సీకే పరిమితమైన కోహ్లి ఎలాగైనా సిరీస్ గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఇక కోహ్లి సారథ్యంలోని భారత జట్టు మూడు టెస్టులు, మూడు వన్డేల కోసం దక్షిణాఫ్రికాకు చేరుకున్న సంగతి తెలిసిందే. చదవండి: IND Vs SA: అతడిని కచ్చితంగా భారత జట్టులోకి తీసుకోవాలి.. ఎందుకంటే! -
'కోహ్లికి కనీస గౌరవం ఇవ్వకుండానే తొలగించారు'
Ex- Cricketer Danish Kaneria Slams BCCI.. టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లిని తొలగించి మూడురోజులు కావొస్తుంది. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట కోహ్లిని కెప్టెన్సీ పదవి నుంచి తప్పించడంపై చర్చ జరుగుతూనే ఉంది. కోహ్లి స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపికచేయడంపై కొందరు విమర్శిస్తే.. మరికొందరు నిర్ణయం సరైందేనంటూ మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా కోహ్లి విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరును తప్పుబట్టాడు. తన యూట్యూబ్ చానెల్ లో కనేరియా మాట్లాడాడు. చదవండి: "విరాట్ కోహ్లిని తప్పించి బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుంది" “కోహ్లీతో బీసీసీఐ సరిగా వ్యవహరించిందా అంటే? అలా జరగలేదని నా అభిప్రాయం. బీసీసీఐ కోహ్లికి కనీస గౌరవం ఇవ్వలేదు. అతను కెప్టెన్‌గా భారత్‌కు 65 విజయాలు సాధించాడు. టీమిండియాకు అత్యధిక విజయాలు కట్టబెట్టిన భారత నాలుగో సారథిగా నిలిచాడు. రికార్డుల పరంగా చూస్తే అతన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. కెప్టెన్‌గా ఐసీసీ ట్రోఫీలను గెలవకపోవచ్చు.. కానీ కెప్టెన్‌గా టీమిండియాను అతను నడిపించిన మార్గం అసాధారణమైనది. ఇక ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న ఇద్దరు సూపర్స్టార్లు మాత్రమే నాకు కనిపిస్తున్నారు. ఒకరు విరాట్ కోహ్లీ అయితే ఇంకొకరు బాబర్ అజమ్. మీరు సూపర్స్టార్లను గౌరవించాలి. కోహ్లీకి తెలియజేయకుండా బీసీసీఐ అతనిని తొలగించడంలో కఠినంగా వ్యవహరించింది. సౌరవ్ గంగూలీ గొప్ప వ్యక్తి, మాజీ కెప్టెన్ కూడా… అతను మేము రోహిత్‌ని కెప్టెన్‌గా చేయాలనుకుంటున్నామని విరాట్‌కు ముందే చెప్పాల్సింది. అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: బలమైన జట్టును తయారు చేయడం కష్టం.. కానీ నాశనం చేయడం ఈజీ కదా -
చెత్త వాగకు రజాక్.. టీమిండియాదే అన్ని విధాలా పైచేయి: పాక్ మాజీ క్రికెటర్
Danish Kaneria Blasts Abdul Razzaq: టీమిండియాను తక్కువగా అంచనా వేస్తూ పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఖండించాడు. చెత్త వాగడం సరికాదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కోహ్లి, రోహిత్‌ను అవుట్ చేసినంత మాత్రాన భారత జట్టును ఓడించలేమని, ఇంగ్లండ్ ద్వితీయ శ్రేణి జట్టు చేతిలో పాక్ చిత్తుగా ఓడిన విషయం మరిచిపోయావా అంటూ చురకలు అంటించాడు. అసలు పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ జట్టు సరిగా లేదన్న కనేరియా.. కోహ్లి సేన అన్ని విధాలా ఆధిక్యంలో ఉందని పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అక్టోబరు 24న చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లి సేన అసలు తమకు పోటీయే కాదని.. టీమిండియాకు అంత సీన్ లేదంటూ అబ్దుల్ రజాక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. పాక్ క్రికెటర్ల ప్రతిభ ముందు.. భారత ఆటగాళ్లు ఏమాత్రం పనికిరారంటూ అవమానకర రీతిలో మాట్లాడాడు. ఈ విషయంపై స్పందించిన కనేరియా తన యూట్యూబ్ చానెల్ వేదికగా రజాక్‌కు కౌంటర్ ఇచ్చాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ... ‘‘పాకిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్లో అసలు నిలకడ ఉందా? కోహ్లి, రోహిత్‌ను అవుట్ చేస్తే... భారత జట్టును ఓడించడం సులభమమని రజాక్ చెబుతున్నాడు. నాన్సెన్స్.. అసలు టీమిండియాను మనవాళ్లు ఎలా ఓడించగలరు? పాకిస్తాన్ జట్టు కూర్పులోనే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల బ్యాటర్లు ఎక్కడ ఉన్నారు? ఇంగ్లండ్- బీ టీమ్ మనల్ని ఓడించింది. అసలు సెలక్షన్ ఎలా ఉందో చూశారా? ఇవన్నీ తెలిసి కూడా.. ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం సరికాదు’’ అని హితవు పలికాడు. అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ గుర్తింపు పొందిన పాకిస్తాన్ క్రికెటర్ నుంచి ఇది ఏ మాత్రం ఊహించలేదని చురకలు అంటించాడు. ఇక అన్ని విభాగాల్లో టీమిండియా పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉందన్న కనేరియా... ‘‘ప్రతీ విభాగంలో వాళ్లు పటిష్టంగా ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా వంటి ఎంతో మంది కీలక ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లను ఎలా అవుట్ చేస్తారు? అన్నీ అంత సులభమేమీ కాదు కదా’’ అని పేర్కొన్నాడు. ఇక బుమ్రా గురించి కూడా రజాక్ చేసిన వ్యాఖ్యలు సరికావన్న కనేరియా... ‘‘వసీం అక్రమ్, వకార్ యూనిస్ తర్వాత యార్కర్లను అద్భుతంగా సంధించగల పర్ఫెక్ట్ బౌలర్ బుమ్రా. బుమ్రాను ఓడించగల యార్కర్ కింగ్ పాకిస్తాన్లో ఇంతవరకూ పుట్టలేదు. తన బౌలింగ్ అత్యద్భుతం. పాక్ బౌలర్లలో ఎవరూ తనకు అసలు పోటీనే కాదు’’ అని ప్రశంసలు కురిపించాడు. చదవండి: Jason Holder: నయా సంచలనం ఉమ్రాన్‌పై హోల్డర్ ప్రశంసలు -
పీసీబీని బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ పాక్ క్రికెట్ బోర్డు పెద్దల్ని బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా విమర్శించాడు.అంతర్జాతీయ క్రికెట్‌కి గత ఏడాది గుడ్‌బై చెప్పిన అతను ఐపీఎల్లో ఆడేందుకు బ్రిటీష్ సిటిజన్‌షిప్ కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా అమీర్ వ్యవహారంపై కనేరియా స్పందిస్తూ.. '' ప్రతి ఒక్కరూ వాళ్ల అభిప్రాయాన్ని చెప్పొచ్చు. ఇక్కడ మహ్మద్ అమీర్‌ని నేనేమీ తప్పుబట్టడం లేదు. కానీ.. అతను తన స్టేట్మెంట్స్ ద్వారా ఇతరుల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనిపిస్తోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ వెళ్లి.. అక్కడ బ్రిటీష్ సిటిజన్‌షిప్‌ని తీసుకుని ఐపీఎల్లో ఆడతానని చెప్తున్నాడు. దీనిబట్టి అతని ఆలోచన తీరుని అర్థం చేసుకోవచ్చు'' అని చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అజహర్ మహ్మద్ కూడా ఇలానే బ్రిటీష్ సిటిజన్‌షిప్ తీసుకుని.. ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ తరఫున గతంలో మ్యాచ్‌లు ఆడాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ అమీర్.. ఏడాది వ్యవధిలోనే స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతూ ఫిక్సింగ్‌కి పాల్పడటంతో అక్కడే జైల్లో కూడా కొన్ని రోజులు గడిపాడు. నిషేధం తర్వాత మళ్లీ పాక్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అమీర్.. అంచనాలకి మించి రాణించాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ని పాక్ ఓడించి టోర్నీ విజేతగా నిలవడంలో అమీర్ క్రియాశీలక పాత్ర పోషించాడు. కానీ.. గత ఏడాది పీసీబీ తనని మెంటల్ టార్చర్‌కి గురిచేస్తోందని వాపోయిన అమీర్.. ఎవరూ ఊహించని రీతిలో 29 ఏళ్లకే ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేశాడు. కాగా పాక్ తరపున అమీర్ 36 టెస్టుల్లో 119 వికెట్లు, 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టీ20ల్లో 59 వికెట్లు తీశాడు. చదవండి: ‘ఆ రెండు టెస్టుల్లో ఫిక్సింగ్ జరగలేదు’ టీమిండియా మహిళా క్రికెటర్లపై బీసీసీఐ వివక్ష! -
ఆమిర్‌కు ఇచ్చిన విలువ నాకెందుకు ఇవ్వలేదు
కరాచీ : పాకిస్తాన్ పేసర్ మొహమ్మద్ ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గురువారం రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెట్టే మానసిక క్షోభ భరించలేకే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు వీడియో సందేశంలో పేర్కొన్నాడు. ఆమిర్ రిటైర్మెంట్ నిర్ణయం తర్వాత షోయబ్ అక్తర్ సహా పలువురు మాజీ క్రికెటర్లు అతనికి మద్దతుగా నిలిచారు. అయితే పాక్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా ఆమిర్‌కు వస్తున్న మద్దతును తప్పుబడుతూ ట్విటర్లో కామెంట్ చేశాడు.(చదవండి : మెంటల్ టార్చర్.. అందుకే ఇలా) 'పీసీబీ మెంటల్ టార్చర్ భరించలేక రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆమిర్ ప్రకటించాడు. అది ఆమిర్ వ్యక్తిగత నిర్ణయం.. అతని నిర్ణయాన్ని నేను తప్పుబట్టను. స్పాట్ ఫిక్సింగ్ తర్వాత దోషిగా తేలిన ఆమిర్ మళ్లీ పాక్‌కు క్రికెట్ ఆడాడు. అయితే పీసీబీ అదే ధోరణిలో అతను చూడడంతో ఇప్పుడు ఆటకు గుడ్‌బై చెప్పాడు. కానీ ఆమిర్ విషయంలో పీసీబీని తప్పుబడుతూ పలువురు మాజీ, స్టార్ క్రికెటర్లు మద్దతు పలికారు. గతంలో ఇదే పీసీబీ విషయంలో నాకు న్యాయం జరగాలని వారికి విజ్ఞప్తి చేశాను.. అప్పుడు నేను మతం కార్డును ఉపయోగించానన్న కారణంతో ఏ ఒక్క క్రికెటర్ మద్దతుగా నిలవలేదు. ఆమిర్‌కు ఇచ్చిన విలువలో కనీసం సగం ఇచ్చినా బాగుండు అనిపించిందంటూ' ట్వీట్ చేశాడు.(చదవండి : ఆ రికార్డుకు 51 ఏళ్లు పట్టింది) 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన దానిష్ కనేరియా పాక్ తరపున అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా నిలిచాడు. కనేరియా పాక్ తరపున 61 టెస్టుల్లో 261 వికెట్లు.. 18 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు. 2012లో ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ ఆడుతుండగా.. దానిష్ కనేరియా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతడిపై జీవితకాల నిషేధం విధించింది. ఈసీబీ చర్యను సమర్థిస్తూ పీసీబీ కూడా కనేరియాపై నిషేధం విధించింది. దీంతో కనేరియా అప్పటినుంచీ ఎలాంటి క్రికెట్ ఆడడం లేదు. 2018లో ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్పాట్ ఫిక్సింగ్ చేసినట్లు అంగీకరించాడు. అయినా పీసీబీ తనపై కనికరం చూపడం లేదంటూ చాలాసార్లు తన ఆవేదన వ్యక్తం చేశాడు. తాను హిందువు అయినందున పాక్ బోర్డు తన విషయంలో జోక్యం చేసుకోవట్లేదని బాహాటంగానే ఆరోపించాడు. ఈ విషయం అప్పుట్లో పెద్ద దుమారం రేపింది. కనేరియా వ్యాఖ్యలపై అప్పట్లో కొందరు పాక్ క్రికెటర్లు తప్పుబడుతూ విమర్శించారు. -
జై శ్రీరామ్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్
ఇస్లామాబాద్: అయోధ్యలో జరిగిన రామ మందిర భూమి పూజపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రామ మందిర భూమి పూజ గురించి ట్విటర్ ద్వారా కనేరియా స్పందించాడు. న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో డిస్ప్లే చేసిన రామమందిరం ఫోటోను షేర్ చేసి దానికి ‘జై శ్రీరామ్’ అనే శీర్షికను జోడించాడు. శ్రీరాముడి అందం ఆయన పేరులో కాకుండా వ్యక్తిత్వంలో దాగి ఉందని, శ్రీరాముడు మంచితనానికి, సౌభ్రాతృత్వానికి, ఐకమత్యానికి ప్రతీక అని పేర్కొన్నాడు. Today is the Historical Day for Hindus across the world. Lord Ram is our ideal. https://t.co/6rgyfR8y3N — Danish Kaneria (@DanishKaneria61) August 5, 2020 ఎప్పటి నుంచో వివాదంలో ఉన్న అయోధ్యలో రామ మందిర భూమి పూజ జరగడంతో ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఆనందంగా ఉన్నారని కనేరియా తెలిపాడు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌లో ఆడిన రెండవ హిందూ క్రికెటర్ కనేరియా, అంతకు ముందు అనిల్ దల్పత్ అనే హిందూ బౌలర్ 1980 ప్రాంతంలో పాక్ జట్టు తరుపున ఆడిన హిందూ క్రికెటర్. అనిల్ దల్పత్, కనేరియాకు బంధువు. ఇక రామ మందిరం గురించి కనేరియా వ్యాఖ్యలపై ప్రపంచంలో ఉన్న హిందువులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నా, ఆయన అభిమానులు మాత్రం కనేరియా భద్రత విషయం గురించి ఆందోళన చెందుతున్నారు. ఇక మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడటంతో కనేరియాపై జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ... నిషేధాన్ని ఎత్తివేయాలని పాక్ క్రికెట్ బోర్డును కోరానని, తాను ఒక హిందువు అయినందునే పీసీబీలో మద్దతు దొరకడం లేదని చెప్పాడు. ఓ పాకిస్తాన్ ఆటగాడిపై మూడేళ్ల నిషేధాన్ని పీసీబీ ఇటీవల సగానికి తగ్గించిందని, తన విషయంలో మాత్రం పీసీబీ కఠినంగా వ్యవహరిస్తోందని డానిష్ కనేరియా వాపోయాడు. (గంగూలీని ఆశ్రయిస్తా : పాక్ మాజీ క్రికెటర్) We are safe and no one should have any problem with our religious beliefs. Life of Prabhu Shri Ram teaches us unity and brotherhood. https://t.co/De7VaZ5QhS — Danish Kaneria (@DanishKaneria61) August 5, 2020 చదవండి: అయోధ్య భూమిపూజ: రావణుని గుడిలో వేడుకలు The beauty of Lord Rama lies in his character, not in his name. He is a symbol of the victory of right over the evil. There is wave of happiness across the world today. It is a moment of great satisfaction. #JaiShriRam pic.twitter.com/wUahN0SjOk — Danish Kaneria (@DanishKaneria61) August 5, 2020 -
పీసీబీపై కనేరియా మరోసారి ఆగ్రహం
కరాచీ : పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌కు విధించిన మూడేళ్ల నిషేదాన్ని 3 సంవత్సరాల నుంచి 18 నెలలకు తగ్గించడం పట్ల పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. అక్మల్ విషయంలో కనికరించిన పీసీబీ నా విషయంలో మాత్రం ఏం పట్టింపులేనట్లు వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ' జీరో-టాలరెన్స్ విధానం నాపై మాత్రమే వర్తిస్తుందని, పాకిస్తాన్‌లోని ఇతర ఆటగాళ్లకు మాత్రం వర్తించదు. కేవలం మతం కారణంగా నేను వివక్షకు గురయ్యా. మ్యాచ్ ఫిక్సింగ్ విధానాన్ని నివేదించడంలో విఫలమైనందుకు ఉమర్ అక్మల్‌కు క్రికెట్ నుంచి మూడేళ్ల నిషేధం 18 నెలలకు తగ్గించబడింది.. అంటే అతను వచ్చే ఏడాది ఆగస్టులో తిరిగి ఆటలోకి తిరిగి వస్తాడు. నాకు జీవిత నిషేధం విధించడానికి గల కారణాన్ని ఎవరైనా సమాధానం చెప్పగలరా.నా రంగు, మతం, బ్యాక్ గ్రౌండ్ కారణంగా నాకు ఈ విధానాలు వరిస్తాయి. అయితే నేను హిందువును అందుకు నేను గర్వంగా ఉన్నాను' అని డానిష్ కనేరియా తెలిపాడు.('ఆ మ్యచ్ ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా') 2012లో ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ ఆడుతుండగా.. డానిష్ కనేరియా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతడిపై జీవితకాల నిషేధం విధించింది. దీంతో కనేరియా అప్పటినుంచీ ఎలాంటి క్రికెట్ ఆడడం లేదు. 2018లో ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన నేరాన్ని అంగీకరించాడు. అయినా పీసీబీ తనపై కనికరం చూపడం లేదంటూ చాలాసార్లు తన ఆవేదన వ్యక్తం చేశాడు. తాను హిందువు అయినందున పాక్ బోర్డు తన విషయంలో జోక్యం చేసుకోవట్లేదని బాహాటంగానే ఆరోపించాడు. ఈ విషయం అప్పుట్లో పెద్ద దుమారమే రేపింది. -
గంగూలీని ఆశ్రయిస్తా : పాక్ మాజీ క్రికెటర్
ఇస్లామాబాద్ : అంతర్జాతీయ క్రికెట్ నుంచి జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఎన్నికైతే తనపై విధించిన నిషేధాన్ని తొలగించాలని కోరతానంటూ తెలిపాడు. ఆదివారం ఓ లోకల్ చానల్‌తో మాట్లాడిన కనేరియా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్టు (పీసీబీ) తనపై కుట్రపూరితంగా వ్యవరించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఐసీసీ చైర్మన్‌గా గంగూలీ ఎన్నికైతే తనకు సాయం చేస్తాడనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. తనపై విధించిన జీవిత కాల నిషేధాన్ని తొలగించాలని పాక్ క్రికెట్ బోర్డులోని ప్రతి ఒక్కరి కాళ్లావేళ్లా పడ్డనని, కానీ ఏ ఒక్కరూ కరునించలేదని తన గోడును వెల్లబోసుకున్నాడు. (నీలాగ దేశాన్ని అమ్మేయలేదు..!) పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సైతం ఎన్నోసార్లు తన సమస్యను విన్నవించానని, కానీ మాజీ క్రికెటర్ అయిఉండి కూడా ఆయన నుంచి సానుకూల స్పందన కరువైందని ఆవేదన చెందాడు. ఇప్పటికే అనేక మంది ఐసీసీ పెద్దలను సైతం కలిశానని, ఏ ఒక్కరూ కూడా తనను ఆదుకోలేదని కనేరియా గుర్తుచేశాడు. గంగూలీ తన బాధను అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తనపై నిషేధం తొలగించినా ప్రస్తుతం మైదానంలోకి దిగే ఆలోచన తనకు లేదని, పాక్ పౌరుడిగా గౌరవం దక్కితేచాలని వ్యాఖ్యానించారు. కాగా ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ (2009) సీజన్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు స్పిన్నర్ డానిష్ కనేరియాపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జీవిత కాల నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విధించిన బహిష్కరణపై కనేరియా చేసుకున్న అప్పీల్ పీసీబీ తిరస్కరించి నిషేధాన్ని సమర్థించింది. క్రికెట్ సంబంధిత వ్యవహారాల్లో కనేరియా ఎలాంటి జోక్యం చేసుకోకుండా జీవిత కాలంపాటు బహిష్కరించామని పీసీబీ 2009లో ప్రకటించింది. అయితే ఈ కేసులో ఆది నుంచీ పీసీబీ తనకు ఎలాంటి సహకారం అందించలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని బలిపశువును చేసిందని లెగ్ స్పిన్నర్ కనేరియా అనేక సార్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తాను హిందువును కావడం వల్లే తమ దేశ క్రికెట్ బోర్డు సాయం చేయలేదని బహిరంగానే విమర్శలు గుప్పించారు. కాగా అతను 61 టెస్టుల్లో పాక్‌కు ప్రాతినిధ్యం వహించి 261 వికెట్లు పడగొట్టాడు. కాగా గంగూల్ ఐసీసీ చైర్మన్ రేసులోకి వచ్చాడంటూ ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. -
నా కెరీర్‌ను నాశనం చేశాడు..
కరాచీ: తన కెరీర్ నాశనం కావడానికి షాహిద్ అఫ్రిదినే కారణమని పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా మరోసారి ధ్వజమెత్తాడు. అఫ్రిది కారణంగా తన కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోయిందని విమర్శించాడు. ప్రత్యేకంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో వన్డేలు ఎక్కువ ఆడకపోవడానికి అఫ్రిది తనపై ఉన్న చులకన భావనే కారణమన్నాడు. తనతో అఫ్రిది చాలా దారుణంగా వ్యహరించేవాడన్నాడు. ఇది దేశవాళీ క్రికెట్ నుంచి జరుగుతూ వస్తుందని, అక్కడ కూడా కెప్టెన్ అయిన అఫ్రిది.. తనను రిజర్వ్ బెంచ్‌లో కూర్చోబెట్టేవాడన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో కూడా వన్డేల్లో తనకు అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడన్నాడు. తాను కేవలం 18 వన్డేలే ఆడటానికి కారణం అఫ్రిదినేనని అన్నాడు. ‘ ఎప్పుడూ మిగతా క్రికెటర్లరు అఫ్రిది సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. నాకు మాత్రం అఫ్రిది ఎప్పుడూ సహకరించలేదు. నేను పాకిస్తాన్ తరఫున క్రికెట్ బానే ఆడినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి.(ధోని.. ఈరోజు నీది కాదు!) తాను ప్రపంచ గర్వించే స్థాయిలో ఎదగలేకపోయినా, ఆడినంతలో తృప్తిగానే ఉన్నానని కనేరియా తెలిపాడు. ‘ నన్ను జట్టులో రెగ్యులర్ సభ్యుడు కాకుండా అఫ్రిది ఎప్పుడూ అడ్డుకునేవాడు. నేను ఒక లెగ్ స్పిన్నర్‌ని. అతను కూడా లెగ్ స్పిన్నర్ కావడంతో నన్ను తొక్కేయాలని చూసేవాడు. పాకిస్తాన్ తరఫున ఒక స్టార్ క్రికెటర్ కావడంతో నన్ను చులకనగా చూసేవాడు. తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉండాల్సిన అవసరం లేదని ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో నా ఫీల్డింగ్‌ను కూడా తొలిగించడానికి కారణంగా చూపేవాడు. అఫ్రిది ఒక సుప్రీమ్ ఫిట్ లీడర్ అయితే నా ఫీల్డింగ్‌ను ఎత్తిచూపాలి. పాకిస్తాన్ క్రికెట్లో ఎప్పుడూ ఒకరిద్దరు మించి ఫీల్డర్లు ఉండేవారు కాదు. ఫీల్డింగ్ పరంగా మేము మెరుగైన జట్టేమీ కాదు. కానీ ఏదొక సాకుతో నన్ను రిజర్వ్ బెంచ్‌లో ఉంచేవాడు’ అని కనేరియా ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ తరఫున 61 టెస్టులు ఆడిన కనేరియా 261 వికెట్లు సాధించాడు. ('ఆరోజు హర్భజన్‌ను కొట్టడానికి రూమ్‌కు వెళ్లా') -
‘పాక్ క్రికెటర్లు.. చిల్లర మాటలు ఆపండి’
కరాచీ: ఇటీవల కాలంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పాక్ క్రికెటర్లు గతాన్ని తవ్వుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ క్రికెట్ హెడ్ కోచ్ మిస్బావుల్ హక్‌ను ఆ దేశ దిగ్గజ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ విమర్శించగా, ఇమ్రాన్ ఖాన్, అక్రమ్‌లపై బాసిత్ అలీ మండిపడ్డాడు. తాజాగా డానిష్ కనేరియా-ఫైజల్ ఇక్బాల్‌ల మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ సోహైల్ తన్వీర్ స్పందించాడు. పాకిస్తాన్ క్రికెట్లో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలపై పెదవి విప్పాడు. సోషల్ మీడియా వేదికగా ఇలా బహిరంగ విమర్శలు చేసుకోవడం మంచిది కాదని హితవు పలికాడు. అందరికీ తెలిసేలా ఇలా విమర్శలు చేసుకుంటూ పోతే పాకిస్తాన్ క్రికెట్‌కు చెడ్డ పేరు రావడమే కాకుండా, చులకనగా మారిపోతామన్నాడు. ఈ విషయంలో మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. ‘ ఇలా సోషల్ మీడియాలో రచ్చ చేసుకోవడం పాకిస్తాన్ క్రికెట్‌కు దురదృష్టకర పరిణామం. సోషల్ మీడియాను ఉపయోగించినప్పుడు బాధ్యతగా ఉండాలని తెలియదా. బహిరంగా విమర్శలు పాకిస్తాన్ క్రికెట్‌పై ఎంతటి ప్రభావన్ని చూపుతుందో అర్థం కావడం లేదు. కనీసం ఆలోచనే లేకుండా ఇలా వీధికెక్కడం వల్ల ఉపయోగం ఏమిటి. చాలా జుగుప్సాకరంగా ఉంది. మీరు ఎప్పుడైనా ఒకర్ని ఒకరు కలవాల్సి వచ్చినప్పుడు ఇది చాలా చిరుగ్గా అనిపిస్తుంది. మీకు మీరే చిన్నబుచ్చుకునే పరిస్థితి వస్తుంది. ఎవరికైనా విభేదాలు సోషల్ మీడియాలో కానీ ఒకరికి ఒకరు ఎదురుపడినప్పుడు కానీ వెల్లడించవద్దు. అది మిమ్మల్ని చులకనగా చేస్తుంది. మిగతా ప్రజలు మిమ్మల్ని అసహ్యించుకుంటారు. పాక్ క్రికెటర్లు చిల్లర మాటలు ఆపండి’ అని తన్వీర్ పేర్కొన్నాడు. పాకిస్తాన్ తరఫున రెండు టెస్టులు మాత్రమే ఆడిన తన్వీర్ సోహైల్ 62 వన్డేలు, 57 అంతర్జాతీయ టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. 2017లో పాకిస్తాన్ తరఫున సోహైల్ ఆడాడు. చదవండి: నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా..? డీకాక్ స్థానం ఎవరిది.. ఇంకా నో క్లారిటీ! -
నీలాగ దేశాన్ని అమ్మేయలేదు..!
లాహోర్: ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో మాటల యుద్ధం నడుస్తోంది. లాక్డౌన్లో ప్రపంచ దేశాల క్రికెటర్లంతా తమ ఇంట్లోనే సరదా సరదాగా గడుపుతుంటే పాకిస్తాన్ క్రికెట్లో మాత్రం ఇప్పుడు గతాన్ని తవ్వుకుంటూ విమర్శించుకుంటున్నారు. అంతకుముందు పాక్ దిగ్గజాలైన ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్‌లపై ఆ దేశ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ మండిపడిన సంగతి తెలిసిందే. జావేద్ మియాందాద్‌ను జట్టు నుంచి తొలగించడానికి ఇమ్రాన్, అక్రమ్‌లు కుట్ర చేశారంటూ బాసిత్ అలీ ధ్వజమెత్తగా, తాజాగా మరో ఇద్దరు పాక్ మాజీ క్రికెటర్లైన డానిష్ కనేరియా, ఫైజల్ ఇక్బాల్‌ల మధ్య ట్వీటర్ వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. ఇందులో 2006లో ముల్తాన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ కారణమైంది. వీరి మధ్య వాగ్వాదానికి మాత్రం పరోక్షంగా ఇంజమాముల్ హక్ కారణమయ్యాడు.(అది ఇమ్రాన్, అక్రమ్ల కుట్ర..!) వివరాల్లోకి వెళితే.. 2006 ముల్తాన్ టెస్ట్‌లో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా.. కనేరియా బౌలింగ్‌లో విరుచుకుపడిన వీడియోను ఇంజమాముల్ హక్ పోస్ట్ చేశాడు. ఆ మ్యాచ్‌లో కనేరియాపై లారా పూర్తి ఆధిపత్యం చెలాయించాడని హక్ పేర్కొన్నాడు. దీనికి స్పందించిన కనేరియా..తాను ఐదుసార్లు లారాను అవుట్ చేశానని, పీసీబీ మద్దతుగా నిలిస్తే తాను ఎన్నో రికార్డులు కొల్లగొట్టేవాడినని చెప్పుకొచ్చా డు. అయితే దీనికి స్పందించిన ఫైసల్ ఇక్బాల్.. లారాని స్లెడ్జింగ్ చేయబోయి అభాసుపాలయ్యాడని, బ్రియాన్ ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే కనేరియా ప్రేక్షకుడిగా మిగిలిపోయాడని ఎద్దేవాచేశాడు. దీనికి ఘాటుగా బదులిచ్చిన కనేరియా ‘ఫైసల్లాంటి క్రికెటర్ నాపై వ్యాఖ్యలు చేయడమా. మొదట నీ స్థాయి ఏపాటిదో తెలుసుకో’ అని సూచించాడు. దాంతో ఇక్బాల్ చిర్రెత్తుకొచ్చింది. ‘నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావ్. నువ్వు ఎటువంటి విలువలు లేని క్రికెటర్‌వి. నేను నీలాగ దేశాన్ని అమ్మేయలేదు’ అని ఇక్బాల్ ఘాటగా బదులిచ్చాడు.(‘ఆ రోజు పంత్‌ను ఆపడం ఎవరితరం కాదు’) -
యువీ, భజ్జీ.. సాయం చేయండి: మాజీ క్రికెటర్
కరాచీ: కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న దేశాలలో పాకిస్తాన్ కూడా ఉంది. అక్కడ ప్రజలు సైతం కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్నారు. ప్రపంచమంతా లాక్డౌన్ అయిన నేపథ్యంలో ఆకలి బాధ తీర్చుకోవడం కూడా కష్టమై పోయింది. కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు పోవడం సంగతి అటుంచితే, ఆకలితో అల్లాడిపోయేవారు వేలల్లో ఉన్నారు. అది పాకిస్తాన్లో ఎక్కువగా ఉంది. దీనిలో భాగంగా ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న వారికి తన ఫౌండేషన్ ద్వారా సాయం చేయాలని పాక్ మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది ముందుకొచ్చాడు. దీనిలో భాగంగా తన ఫౌండేషన్ ద్వారా మందులు, ఆహారం అందిస్తున్నాడు. (అతను హిందూ కాబట్టే వివక్ష : అక్తర్) అయితే 'ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరికి ఇది చాలా కఠినమైన సమయం. ముఖ్యంగా పేదవారు, రెక్కాడితే గాని డొక్కాడని వారి కష్టాలు చెప్పలేనివి. వారికి వీలైనంత సాయం చేద్దాం. అఫ్రిదీ ఫౌండేషన్‌కు నా మద్దతు ఉంటుంది. కరోనాపై పోరాటంలో అతడి ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయం. అఫ్రిది పౌండేషన్‌కు విరాళాలు ఇవ్వండి' అని యూవీ, భజ్జీ విజ్ఞప్తి చేశారు. ఇది కొంతమంది భారత అభిమానులకు నచ్చలేదు. దాంతో యువీ, భజ్జీలపై విమర్శలకు దిగారు మానవత్వం కంటే ఏది ఎక్కువ కాదని వీరిద్దరూ కౌంటర్ ఇవ్వడంతో ఒక వర్గం ఫ్యాన్స్ కాస్త శాంతించారు. పాక్‌లో మైనార్టీలకు మీ సాయం అవసరం ఇప్పుడు తాజాగా మరో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానేష్ కనేరియా కూడా యువరాజ్, హర్భజన్‌ల సింగ్‌ల సాయం కోరాడు. పాక్‌లో ఉన్న మైనార్టీలకు యువీ, భజ్జీలు సాయం చేయాలని విన్నవించాడు. మైనార్టీ అయిన కనేరియా.. ఇంతటి క్లిష్ట సమయంలో మా దేశంలోని మైనార్టీలకు యువీ, భజ్జీల సాయం అవసరం ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు ఒక వీడియో రూపంలో యువీ, భజ్జీల సాయాన్ని అభ్యర్థించాడు. హిందూ మతస్థుడైన కనేరియా.. పాక్ తరఫున ఆడే రోజుల్లో వివక్షకు గురయ్యాడు. ఈ విషయం ఇటీవల షోయబ్ అక్తర్ బయటపెట్టాడు. తమ దేశ క్రికెటర్లు కనేరియాను చాలా చిన్నచూపు చూసేవారంటూ స్పష్టం చేశాడు. దీనిపై కనేరియా అవుననే సమాధానం ఇచ్చినా, అక్కడ మైనార్టీ కావడంతో దీన్ని పెద్ద విషయం చేయకుండా వదిలేశాడు. తనపై విధించిన సస్పెన్షన్ విషయంలో కూడా పీసీబీ న్యాయం చేయలేదని గతంలో కనేరియా పేర్కొన్నాడు. ఫిక్సింగ్‌కు పాల్పడిన చాలామంది పాకిస్తాన్ క్రికెటర్లపై నిషేధం ఎత్తివేసిన పీసీబీ.. తాను మైనార్టీ కావడం వల్లే వివక్ష చూపిస్తుందన్నాడు. -
కనేరియా.. మతం మార్చుకో
న్యూఢిల్లీ: మతం మార్చుకోవాలని సలహా ఇచ్చిన నెటిజన్‌కు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. తాను మతం మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. ‘ఇస్లాం మతాన్ని స్వీకరించండి. ఇస్లాం బంగారం లాంటిది. ఇస్లాం లేకపోతే జీవితం లేదని నాకు తెలుసు. దయచేసి ఈ బంగారాన్ని అంగీకరించండి’ అంటూ ఓ నెటిజన్ ట్విటర్లో కనేరియాను కోరాడు. ‘మీలాంటి చాలా మంది నన్ను వేరే మతంలోకి మార్చాలని ప్రయత్నించారు. కానీ వారెవరూ విజయవంతం కాలేద’ని కనేరియా సమాధానం ఇచ్చాడు. కాగా, హిందువైన కారణంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టులో వివక్ష ఎదుర్కొన్నానని అంగీకరించి గతేడాది కనేరియా వివాదాలపాలయ్యాడు. తన సహచర క్రికెటరైన కనేరియాను హిందూ అనే కారణంగా తీవ్రంగా అవమానించిన సందర్భాలు చాలానే ఉన్నాయని మాజీ పేసర్ షోయబ్ అక్తర్ వెల్లడించడంతో వివాదం రేగింది. ‘షోయబ్ అక్తర్ ఒక లెజెండ్. నాకు ఎప్పుడూ అక్తర్ మద్దతుగానే ఉండేవాడు. కానీ ఆ సమయంలో నాపై వివక్ష చూపెట్టేవారిని ఎదురించే సాహసం చేయలేకపోయాను. అక్తర్‌తో పాటు ఇంజమాముల్ హక్, మహ్మద్ యూసఫ్, యూనస్ ఖాన్లు నాకు అండగా ఉండేవార’ని కనేరియా పేర్కొన్నాడు. -
దయచేసి క్రికెట్‌ను మతంతో కలపకండి : ఇంజమామ్
-
దయచేసి క్రికెట్‌ను మతంతో కలపకండి : ఇంజమామ్
కరాచి : పాక్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియాకు కొందరు ఆటగాళ్ల తమ దగ్గరకు రానిచ్చేవారు కాదని వస్తున్న ఆరోపణలపై పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ స్పందించాడు. ఇంజమామ్ మాట్లాడుతూ.. దానిష్ కనేరియాను కొంతమంది ఆటగాళ్లు దూరంగా పెట్టేవారని, ఎవరు అతనితో తినడం కానీ బయటికి వెళ్లరని వస్తున్న ఆరోపణలను తాను ఖండిస్తున్నానని పేర్కొన్నాడు. తన కెప్టెన్సీలో కనేరియా చాలా మ్యాచ్‌లు ఆడాడని స్పష్టం చేశాడు. సక్లెయిన్ ముస్తాక్ రిటైర్ అయిన తర్వాత ఒక లెగ్ స్పిన్నర్‌గా కనేరియా భవిష్యత్తులో మంచి ఆటగాడిగా పేరు సంపాదిస్తాడని అప్పట్లో జట్టు మేనేజ్మెంట్ భావించేది. తాను జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో దానిష్ కనేరియాతో ఏ ఒక్క ఆటగాడు కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని, తనకు తెలిసి ఒక ముస్లిమేతర ఆటగాడిని దూరంగా పెట్టడం చేయలేదని పేర్కొన్నాడు. దీనికి ఉదాహరణ పాక్ మాజీ బ్యాట్సమెన్ మహ్మద్ యూసఫ్ అని వెల్లడించాడు. యూసఫ్ మతం మారకముందు ఒక క్రిస్టియన్ అని, అతని పేరు కూడా యూసఫ్ యోహన అన్న విషయం మీ అందరికి తెలిసిందే. అలాంటిది అతను మతం మారిన తర్వాత మహ్మద్ యూసఫ్‌గా పేరు మార్చుకున్నప్పుడు ఎలాంటి వివాదాలు చెలరేగలేదని గుర్తు చేశాడు. క్రికెట్‌ను, మతాన్ని ఎప్పుడు ఒకటిగా కలిపి చూడొద్దని ఇంజమామ్ పేర్కొన్నాడు. అంతేకాదు పాక్ ప్రజలు సహృదయులని, వారు అందరిని పెద్ద హృదయంతో అంగీకరిస్తారని అన్నాడు. అందుకు ఉదాహరణ పాక్ జట్టుకు నేను కెప్టెన్‌గా ఉన్న సమయంలో 15 సంవత్సరాల తర్వాత 2004లో భారత జట్టు పాక్‌లో పర్యటించింది.మ్యాచ్‌ల ఫలితం ఎలా ఉన్నా, అప్పుడు మేము భారత ఆటగాళ్లను గౌరవించిన తీరును పాక్ ప్రజలు తమ దేశానికి వచ్చిన వారిని ఎంతగా అభిమానిస్తారో మీకే తెలస్తుందని పేర్కొన్నాడు. అయితే మేం ఒక సంవత్సరం తర్వాత భారత పర్యటనకు వెళ్లినప్పుడు కూడా అదే రీతిలో మాకు స్నేహపూర్వక స్వాగతం లభించిందని చెప్పుకొచ్చాడు. ఇరు దేశాల ప్రజల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని , ఈ విషయంలో తాను ఏ ఒక్కరిని తప్పుబట్టాల్సిన అవసరం లేదని తెలిపాడు. ముస్లిమేతర ఆటగాళ్లను మాతో పాటు తిననివ్వలేదని ఆరోపణలను తాను కొట్టివేస్తున్నానని తెలిపాడు. 2005లో మేము భారత పర్యటనకు రాకముందు తాను సౌరవ్ గంగూలీ కొత్తగా ప్రారంభించనున్న హోటల్‌ను సచిన్‌తో కలిసి హాజరయ్యానని తెలిపాడు. ఆ తర్వాత గంగూలీ తన రెస్టారెంట్ నుంచి చాలా సార్లు పంపించిన ఆహారాన్ని తాను ఎంతో ఇష్టంతో తినేవాడినని ఇంజమామ్ వెల్లడించాడు. (ఇక ఆపండి చాలు: షోయబ్ అక్తర్) (‘కనేరియా.. నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావ్’) -
ఇక ఆపండి చాలు: షోయబ్ అక్తర్
కరాచీ: తాను క్రికెట్ ఆడిన సమయంలో సహచర క్రికెటర్ దానిష్ కనేరియాపై వివక్ష చూపెట్టారంటూ పాక్తిసాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. అక్తర్ వ్యాఖ్యలకు భారత్‌లోని పలువురు క్రికెటర్లు మద్దతుగా నిలవగా, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ల మాత్రం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జావెద్ మియాందాద్ మొదలుకొని ఇంజమాముల్ హక్, మహ్మద్ యూసఫ్, షాహిద్ అఫ్రిదిలు అక్తర్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. దానిష్ కనేరియా హిందూ అనే కారణంగా ఎవరూ అవమానించలేదని పేర్కొన్నారు. అదే సమయంలో ఆ వివక్ష భారత్‌లో లేదా అంటూ కూడా అక్తర్‌ను నిలదీశారు. ఇది పెద్ద వివాదంగా మారడంతో అక్తర్ వివరణ ఇచ్చుకునే యత్నం చేశాడు. తాను ఏ సందర్భంలో, ఎందుకోసం అన్నానో ముందు తెలుసుకోవాలన్నాడు. తనపై వస్తున్న విమర్శలకు బాధ్యత వహిస్తూ అందుకు సమాధానం కూడా ఇవ్వాల్సి ఉందన్నాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మొత్తంగా మత వివక్ష ఉందని తాను అనలేదని, కేవలం ఒకరో, ఇద్దరో కనేరియాను హిందూ అనే కారణంగా చిన్నచూపు చూసేవారని మాత్రమే తాను పేర్కొనట్లు అక్తర్ తెలిపాడు. తాను చేసిన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తూ మొత్తం పాకిస్తాన్ క్రికెట్లోనే మత వివక్ష ఉందనే విధంగా తాను అన్నట్లు ఆపాదించడం తగదన్నాడు. ‘నేను రెండు రోజులుగా చూస్తున్నా. నా చుట్టూ పెద్ద వివాదాన్ని సృష్టించారు. దాన్ని నేను విన్నాను.. చూశాను కూడా. అది నాకు క్లియర్‌గా అర్థమైంది. అందుకోసమే మరొకసారి మాట్లాడుతున్నా. ఇక విమర్శలు ఆపుతారనే యూట్యూబ్ ద్వారా వివరణ ఇస్తున్నా. నేను యూట్యూబ్ చానల్‌ను ఆరంభించడానికి కారణమే క్రికెట్ టాక్ ద్వారా కేవలం వినోదాన్ని పంచడానికి మాత్రమే కాదు.. మన సమాజంలో అభివృద్ధికి సంబంధించి కూడా చెబుతూ ఉంటా. పాక్ క్రికెట్ కల్చర్‌లో ఒక రాయబడలేని ఒప్పందం ఏదైనా ఉందంటే అది మనం ఒకరినొకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలనే సంగతి. కాకపోతే కొంతమందిలో అలా గౌరవం ఇచ్చి పుచ్చుకోవడంలో సంశయం కనబడుతోంది. ఇది మన జట్టు కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా కాదు.. వివక్ష చూపెట్టారని నేను చెప్పింది.. ఒకరో-ఇద్దరో క్రికెటర్ల గురించి మాత్రమే చెప్పా. ఆ బ్లాక్ షీప్స్ ప్రతీ చోట ఉండవచ్చు. అది పాకిస్తానా, ఇండియానా, ఇంగ్లండా, ఐర్లాండా అనేది సమస్య కాదు. దీనికి ఇక్కడితోనైనా ముగింపు దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని అక్తర్ పేర్కొన్నాడు. -
‘కనేరియా.. నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావ్’
కరాచీ: తాను క్రికెట్ ఆడిన రోజుల్లో పలువురు పాకిస్తానీ ఆటగాళ్లు అవమానించిన మాట వాస్తవమేని మాజీ లెగ్ స్పిన్నర్ దానిష్ కనేరియా స్పష్టం చేసిన నేపథ్యంలో అతనిపై విమర్శల వర్షం కురుస్తోంది. అతనొక నీతి లేని క్రికెటర్ అంటూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ విమర్శించాడు. అసలు ఇప్పుడు ఏమి సాధించడానికి ఈ వ్యాఖ్యలు చేశారంటూ మియాందాద్ ప్రశ్నించాడు. ఇది కేవలం కనేరియా డబ్బు కోసం మాత్రమే ఇలా చేసి ఉంటాడన్నాడు. ఎప్పుడో ముగిసిన అధ్యాయాన్ని తాజాగా తెరపైకి ఎందుకు తీసుకొచ్చారో తనకు తెలియడం లేదన్నాడు.(ఇక్కడ చదవండి: అతను హిందూ కాబట్టే వివక్ష : అక్తర్) ‘కనేరియా.. నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావ్. నువ్వు ఎటువంటి విలువలు లేని క్రికెటర్‌వి. క్రికెట్లో ఫిక్సింగ్‌కు పాల్పడిన ఒక క్రికెటర్ మాటలు ప్రజలు ఎలా నమ్ముతున్నారో నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతను దేశ పరువును తీశాడు. 2000 సంవత్సరానికి ముందు నేను పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్నా. అప్పుడు కనేరియా జట్టులోనే ఉన్నాడు. ఆ సమయంలో కనేరియాను అవమానించిన ఏ ఒక్క ఘటన నాకు తారస పడలేదు. అతను హిందూ అనే వివక్ష ఎవరూ చూపట్టలేదు. నిన్ను అవమాన పరిస్తే 10 ఏళ్ల పాటు పాక్ క్రికెట్లో ఎలా కొనసాగావో తెలీడం లేదు. నీకు పాకిస్తాన్ చాలా గౌరవం ఇచ్చింది’ అని మియాందాద్ ధ్వజమెత్తాడు. పలువురు పాకిస్తానీ ఆటగాళ్లు దానిష్ కనేరియాపై వివక్ష చూపెట్టేవారంటూ ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వెల్లడించడంతో వివాదం మొదలైంది. తన సహచర క్రికెటరైన కనేరియాను హిందూ అనే కారణంగా తీవ్రంగా అవమానించిన సందర్భాలు చాలానే ఉన్నాయన్నాడు. చివరకు అతనితో కలిసి భోజనం చేయడానికి కూడా అయిష్టత చూపెట్టడం తాను చూశానన్నాడు. ఇక్కడ మొత్తం జట్టు అంతా అలా ఉండేది కానీ, మెజార్టీ సభ్యులు మాత్రమే వివక్ష చూపెట్టేవారన్నాడు. ఇందుకు అక్తర్‌కు కనేరియా థాంక్స్ చెప్పడంతో వివాదం మరింత రాజుకుంది. వారి పేర్లను త్వరలోనే వెల్లడిస్తానంటూ కనేరియా స్పష్టం చేశాడు. దాంతో కనేరియాపై పాక్ మాజీ క్రికెటర్లు విమర్శలు ఎక్కుపెట్టారు. -
పాక్ క్రికెట్లో వివక్ష
మర్యాదస్తుల క్రీడగా అందరూ చెప్పుకునే క్రికెట్లో మళ్లీ చాన్నాళ్లకి తుపాను రేగింది. పాకిస్తాన్ క్రికెట్ టీంలో బాగా ఆడి, మంచి స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న డేనిష్ కనేరియాపై అప్పటి కెప్టెన్‌తోపాటు, తోటి ఆటగాళ్లు కొందరు వివక్ష ప్రదర్శించేవారని ఒక టీవీ షోలో పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ బాంబు పేల్చాడు. అతడు కేవలం హిందువు కావడం వల్లే ఈ వివక్ష ఉండేదని కూడా అన్నాడు. అయితే ఆ బాంబు తాలూకు చప్పుళ్లు పాకిస్తాన్ మాటేమో గానీ...మన దేశంలో బాగానే వినబడ్డాయి. వర్తమాన పరిస్థితుల్లో అది సహజం కూడా. అసలు అలాంటివారి కోసమే తాము పౌరసత్వ చట్టాన్ని సవరించామని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ చెప్పగా, ఉత్తరప్రదేశ్ మంత్రి కనేరియాకు నేరుగా ఒక ఆఫర్ ఇచ్చారు. ఇక్కడకు వస్తానంటే పౌరసత్వం కల్పిస్తామని అభయమిచ్చారు. అయితే షోయబ్, కనేరియా మాదిరే క్రికెట్లో కీర్తిప్రతిష్టలు ఆర్జించి, ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని పీఠంపై వున్న ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఇంతవరకూ మాట్లాడలేదు. ఈ విషయంలో చెప్పేదేమీ లేదని పాక్ క్రికెట్ బోర్డు చేతులు దులుపుకుంది. ఇలాంటివి జరగకుండా చూస్తామని మాటవరసకైనా అనలేదు. పైగా షోయబ్, కనేరియాలిద్దరూ ప్రస్తుతం మాజీ ఆటగాళ్లు కదా అంటూ తర్కం లేవనెత్తుతోంది. కనేరియా ఆడుతున్నప్పుడు ఇంజమామ్–ఉల్– హక్, రషీద్ లతీఫ్, యూనిస్ ఖాన్, మహమ్మద్ యూసుఫ్‌లు కెప్టెన్లుగా పనిచేశారు. వీరిలో ఇంజమామ్, యూనిస్‌ఖాన్, మహమ్మ ద్ యూసుఫ్‌లు తనను ప్రోత్సహిం చేవారని కనేరియా అంటున్నాడు కనుక రషీద్‌పైనే సహజంగా అందరికీ అనుమానాలు వస్తాయి. ఎటూ కనేరియా త్వరలో ఆ పేర్లు బయటపెడతానంటున్నాడు కనుక ఆ కెప్టెన్, ఇతర ఆటగాళ్లెవరో తేలిపోతుంది. వివక్ష ఒక మతానికి, కులానికి, దేశానికి లేదా జాతికి పరిమితమైన దురాచారం కాదని, ఇది అన్నిచోట్లా వ్యాపించివున్నదని గతంలో సైతం చాలాసార్లు వెల్లడైంది. నువ్వా నేనా అన్నట్టు ఆట సాగుతున్నప్పుడు ప్రత్యర్థి టీంల మధ్య స్పర్థలు పెరగడం, ఆవేశంతో ఎదుటివారిని జాతి పేరుతో, మతం పేరుతో దూషించడం, వారి ముఖకవళికలను హేళన చేయడం వంటివి క్రికెట్ అభిమానులు తరచు చూస్తున్నదే. దక్షిణాఫ్రికాకు చెందిన బేసిల్ డి అలివేరాను పూర్తి స్థాయి శ్వేత జాతీయుడు కాదన్న కారణంతో 1960లో క్రికెట్ టీంలోకి తీసుకోలేదు. దాంతో అతను అలిగి ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత అక్కడి టీం తరఫున దక్షిణాఫ్రికా వెళ్లినప్పుడు కూడా ఆనాటి దక్షిణాఫ్రికా ప్రధాని జాన్ వోర్స్టర్ బేసిల్ గురించి అవమానకరంగానే మాట్లాడారు. తమ టీం కెన్యాపై ఓడినప్పుడు బ్రియాన్ లారా 1996లో కెన్యా ఆటగాళ్లతో మాట్లాడుతూ దక్షిణాఫ్రికా టీంపై చేసిన జాతిపరమైన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. పదేళ్లక్రితం సిడ్నీ టెస్ట్‌లో సైమండ్స్‌ని హర్భజన్ సింగ్ కోతి అంటూ వెక్కిరించడం, అప్పట్లో అది భారత్, ఆస్ట్రేలియా టీంల మధ్య పెను వివాదం సృష్టించడం ఎవరూ మరిచిపోరు. అయితే ఆటలో ఉత్కంఠ పెరిగి, నువ్వా నేనా అన్నట్టు సాగుతుండగా ఆటగాళ్లు ఆవేశానికి లోనై అప్పటికప్పుడు ఏదో అనడం వేరు. కనేరియాకు జరిగింది ఇది కాదు. పాక్ ఆటగాళ్లలో కొందరు అతనితో కలిసి భోంచేసేందుకు సిద్ధపడేవారు కాదని, కనేరియాను వేరేచోటకు వెళ్లమనేవారని షోయబ్ వెల్లడించాడు. కేవలం తాను అన్య మతస్తుడిననే ఇలా ప్రవర్తించేవారని కనేరియా కూడా చెబుతున్నాడు. నిజానికి మన దేశంలో దళితులకు, ఇతర కులాలకు ఇది నిత్యానుభవం. అన్య మతస్తులపై కత్తులు నూరేవారు అన్నిచోట్లా వున్నారు. కానీ అలాంటి ఉన్మాదులు క్రీడాప్రపంచంలోకి సైతం చొరబడ్డారని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. దాదాపు 87 ఏళ్ల చరిత్రవున్న మన క్రికెట్ టీంలో ఆధిపత్య కులాలకు చెందినవారే కనిపిస్తారన్న ఫిర్యాదు చాలా తరచుగా దళిత వర్గాల నుంచి వినబడుతుంటుంది. దళిత ఆటగాళ్లు ఇంతవరకూ కేవలం నలుగురు మాత్రమే వున్నారని ఆ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దళిత కులాలవారు క్రికెట్ చూడరని, ఆడరని ఎవరూ అనుకోరు. మరి ఆ వర్గాలవారు టీంలో ఎందుకు కనబడరన్నది జవాబులేని ప్రశ్న. 1993లో టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టిన వినోద్ కాంబ్లీ మంచి ఆటగాడిగా రాణించాడు. కులం కారణంగా తనను పక్కనబెట్టారని కాంబ్లీ ఎప్పుడూ చెప్పలేదు. కానీ దళితుడన్న కారణంతో అతనికి అన్యాయం చేశారని మొన్నటివరకూ బీజేపీ ఎంపీగా వున్న ఉదిత్ రాజ్ ఆరోపించారు. క్రికెట్లో సైతం రిజర్వేషన్లు వచ్చినప్పుడే దళితులకు, వెనకబడిన కులాలకు అందులో చోటు దక్కుతుందని రిపబ్లికన్ పార్టీకి చెందిన కేంద్రమంత్రి రాందాస్ అథ్వాలే కూడా చెప్పారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వున్నప్పుడు క్రీడల్లో ఎందుకుండరాదన్నది ఆయన ప్రశ్న. క్రికెట్ టీముల్లో ఇంతవరకూ ఆడినవారు ఆధిపత్య కులాలవారే అయినా వారంతా డబ్బూ, పలుకుబడీ వున్న కుటుంబాల నుంచో, రాజకీయ నాయకుల కుటుంబాలనుంచో రాలేదని వాదించే వారున్నారు. అందులో అవాస్తవం లేకపోవచ్చు. కానీ దళితులు ఎందుకు రాలేకపోయారన్న ప్రశ్నకు జవాబులేదు. దక్షిణాఫ్రికా జాత్యహంకారంతో తన టీంలో శ్వేతజాతీయులకే చోటిస్తున్న దని నిర్ధారణయ్యాక ఆ దేశాన్ని ఐసీసీ 1970లో సస్పెండ్ చేసింది. ఇందువల్ల పొలాక్, రాబిన్ స్మిత్, టోనీ గ్రెగ్ వంటి మంచి ఆటగాళ్లు వేరే దేశాల టీంలకు వలస పోవలసివచ్చింది. 90వ దశకంలో దక్షిణాఫ్రికాలో జాత్యహంకార ప్రభుత్వం అంతరించినప్పటినుంచీ నల్లజాతీయులు కూడా ఆ టీంలో ఆడగలుగుతున్నారు. ఇప్పుడు కనేరియా ఉదంతంలో పాక్‌పై నాలుగు రాళ్లేయడం మాటెలా వున్నా మన క్రికెట్‌కు, ఇతర క్రీడలకు అలాంటి మచ్చ రాకుండా ఏం చేయగలమో చూడవలసిన అవసరం వుంది. -
పాక్ నిజస్వరూపం బయటపడింది: గంభీర్
న్యూఢిల్లీ: పాక్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియాపై వివక్ష చూపారన్న షోయబ్ అక్తర్ వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. షోయబ్ క్రికెట్ ఆడే రోజుల్లో మతం, కులం, ప్రాంతం ఆధారంగా వివక్ష ఎక్కువగా కనబడేదని షోయబ్ చెప్పిన విషయాన్ని గౌతమ్ గుర్తు చేశాడు. కనేరియా హిందూ అనే కారణంతో తీవ్రంగా అవమానించిన సందర్భాలు చాలానే ఉన్నాయని గౌతమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న దేశంలో ఇలాంటి వివక్షకు గురవ్వడం శోచనీయమన్నాడు. కనేరియా పాక్ టెస్ట్ క్రికెట్ జట్టులో సభ్యుడిగా కొనసాగిన సమయంలో ..అతని పట్ల వివక్ష చూపడం సిగ్గుచేటన్నారు. భారత్‌లో మహమ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, మునాఫ్ పటేల్ లాంటి క్రికెటర్లకు గౌరవం ఇచ్చిందన్నారు. మునాఫ్ పటేల్ తనకు అత్యంత సన్నిహితుడని.. దేశం గర్వించేలా మేమందరం ఒకే జట్టుగా ఆడామని తెలిపాడు. తాజాగా వస్తున్న ఆరోపణల దృష్యా పాక్ నిజస్వరూపం బయటపడిందని గంభీర్ తెలిపాడు. ఒక క్రికెటర్‌కే ఇలాంటి వివక్ష ఎదురయితే పాక్‌లో నివసిస్తున్న హిందువులు, సిక్కులు ఇతర మైనారిటీలు ఏ విధమైన వివక్షకు గురవుతారో అర్థం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశాడు. తన మామ అనిల్ దల్పత్ తర్వాత పాక్ తరఫున ఆడిన ఏకైక హిందూ క్రికెటర్ దానిష్ కనేరియా అని గంబీర్ కొనియాడాడు. కనేరియా 61 టెస్టుల్లో 261 వికెట్లు, 18 వన్డేలలో 15వికెట్లు పడగొట్టాడు. చదవండి: అతను హిందూ కాబట్టే వివక్ష : అక్తర్ -
అతను హిందూ కాబట్టే వివక్ష : అక్తర్
కరాచీ: తాను క్రికెట్ ఆడిన రోజుల్లో పాకిస్తాన్ క్రికెట్లో ఎంతటి వివక్ష ఉండేదో ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తాజాగా వెల్లడించాడు. పాకిస్తాన్ జట్టులో చాలా మంది ఆటగాళ్లలో మతం, కులం, ప్రాంతం అనే వివక్ష ఎక్కువగా కనబడేదని విమర్శించాడు. ఈ క్రమంలోనే మాజీ ఆటగాడైన దానిష్ కనేరియాపై వివక్ష చూపెట్టేవారన్నాడు. తన సహచర క్రికెటరైన కనేరియాను హిందూ అనే కారణంగా తీవ్రంగా అవమానించిన సందర్భాలు చాలానే ఉన్నాయన్నాడు. చివరకు అతనితో కలిసి భోజనం చేయడానికి కూడా అయిష్టత చూపెట్టడం తాను చూశానన్నాడు. ఇక్కడ మొత్తం జట్టు అంతా అలా ఉండేది కానీ, మెజార్టీ సభ్యులు మాత్రమే వివక్ష చూపెట్టేవారన్నాడు. ‘ నా కెరీర్లో కొంతమంది పాక్ క్రికెటర్లు వివక్షకు పెద్ద పీట వేసేవారు. ఎప్పుడూ నీ మతం ఏమిటి, ప్రాంతం ఏమిటి అనే దానిపైనే ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు. నువ్వు కరాచీకి చెందిన వాడివా.. పంజాబ్‌కు చెందిన వాడివా.. పెషావర్‌కు చెందిన వాడివా అనే విషయాలను ఆరా తీస్తూ ఉండేవారు. ప్రత్యేకంగా ముగ్గురు క్రికెటర్లకు ఇదే పని. ఈ క్రమంలోనే కనేరియా ఎక్కువ అవమానించ బడ్డాడు. ఆ హిందూ వల్లే ఇంగ్లండ్‌పై మేము టెస్టు గెలిచాం. ఇంగ్లండ్‌పై పాకిస్తాన్ విజయం సాధించడంలో కనేరియా కీలక పాత్ర పోషించాడు. ఆ సమయంలో కనేరియా జట్టులో లేకపోతే మేము కచ్చితంగా మ్యాచ్‌ను కోల్పోయే వాళ్లం. కానీ అతనికి దక్కాల్సిన క్రెడిట్ ఇవ్వలేదు’ అని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. దీనిపై కనేరియాను సంప్రదించగా అదే నిజమేనని ఒప్పుకున్నాడు. ‘షోయబ్ అక్తర్ ఒక లెజెండ్. నాకు ఎప్పుడూ అక్తర్ మద్దతుగానే ఉండేవాడు. కానీ ఆ సమయంలో నాపై వివక్ష చూపెట్టేవారిని ఎదురించే సాహసం చేయలేకపోయా అక్తర్‌తో పాటు ఇంజమాముల్ హక్, మహ్మద్ యూసఫ్, యూనస్ ఖాన్లు నాకు అండగా ఉండేవారు. కానీ ఎవరైతే నాకు మద్దతుగా లేరో వారి పేర్లను త్వరలోనే వెల్లడిస్తాం. నాకు పాకిస్తాన్ తరఫున ఆడటం అదృష్టమే కాకుండా గొప్ప గౌరవంగా భావిస్తా’ అని కనేరియా చెప్పాడు. పాకిస్తాన్ తరఫున క్రికెట్ ఆడిన రెండో హిందూ క్రికెటర్ కనేరియా. అతని మేనమామ అనిల్ దల్పత్ పాకిస్తాన్‌కు ఆడిన తొలి హిందూ క్రికెటర్ కాగా, కనేరియా రెండోవాడు.పాకిస్తాన్ తరఫున 61 టెస్టులు ఆడిన కనేరియా 261 వికెట్లు సాధించగా, వన్డేల్లో కేవలం 18 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 15 వికెట్లు తీశాడు. -
‘నేను మ్యాచ్ ఫిక్సింగ్ చేశా’
కరాచీ: పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్నాడు. తనను క్షమించాలని ప్రాధేయపడ్డాడు. ‘నా పరిస్థితిని అర్థం చేసుకోవాలని క్రికెట్ బోర్డు, అభిమానులు, ప్రజలను కోరుకుంటున్నా. దయచేసి నన్ను మన్నించండి. బుకీ అనుభట్‌ను కలిసి చాలా పెద్ద తప్పుచేశా. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయలేదు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నా’ అని కనేరియా మీడియాకు తెలిపాడు. ‘ఆరేళ్ల నుంచి అబద్ధాలు చెబుతూ ఇప్పుడు నిజం చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. నాకెంతో భారంగా ఉంది. అందుకే ఇప్పుడు నిజం చెబుతున్నా. స్ఫాట్ ఫిక్సర్ అని పిలిపించుకోలేను. ఇక ఎంత మాత్రమూ ఖండించనూ లేను. నేను చేసింది చాలా పెద్ద తప్పు. ప్రజలు నన్ను క్షమిస్తారని అనుకుంటున్నా. ఈ కేసుకు సంబంధించి నా బ్యాంకు ఖాతాను ఇప్పటికే చాలా సార్లు తనిఖీ చేశారు. అనుభట్‌కు దగ్గరవ్వడమే నేను చేసిన పొరపాటు. ఇలాంటి ఘోర తప్పిదాలు చేయొద్దని యువ ఆటగాళ్లకు చెప్పడం ద్వారా ఆటకు నేను సేవ చేయగలను’ అని కనేరియా అన్నాడు. కనేరియా 61 టెస్టుల్లో 261 వికెట్లు తీశాడు. తన స్పిన్ మాయాజాలంతో జట్టుకు మంచి విజయాలు అందించాడు. ఇంగ్లండ్‌లో 2010లో అతడు చివరి టెస్టు ఆడాడు. స్ఫాట్ ఫిక్సింగ్ కేసులోనే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కనేరియాపై జీవిత కాల నిషేధం విధించింది. అతడి ఎసెక్స్ జట్టు సహచరుడు మెర్విన్ వెస్ట్‌ఫీల్డ్‌ను ఫిక్సింగ్ చేయమని కనేరియా సూచించాడు. దాంతో ఫిక్సింగ్‌కు పాల్పడ్డ వెస్ట్‌ఫీల్డ్ జైలు శిక్ష అనుభవించాడు. -
కనేరియాపై పీసీబీ సీరియస్
కరాచీ: తాను హిందువును కావడం వల్లే తమ దేశ క్రికెట్ బోర్డు సాయం చేయలేదన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా చేసిన వ్యాఖ్యలపై పీసీబీ సీరియస్ అయ్యింది. ప్రధానంగా పీసీబీని అస్త్రంగా చేసుకుని కనేరియా చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి వాస్తవం లేదని బోర్డు మీడియా డైరెక్టర్ అమ్ జాద్ హుస్సేన్ భట్టి ఖండించారు. ఒకవేళ అది గనుక జరిగి ఉంటే పాకిస్తాన్ జట్టు తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం వచ్చేది కాదన్న విషయాన్ని కనేరియా గుర్తిస్తే బాగుంటుందని విమర్శించారు. 'మమ్ముల్ని కనేరియా ప్రకటన నిరాశకు గురి చేసింది. అతన్ని పాకిస్తాన్ క్రికెట్ ఏమీ నిషేధించలేదు. ఇంగ్లిష్ కౌంటీల్లో ఫిక్సింగ్ పాల్పడటంతో ఇంగ్లండ్ నిషేధించింది. ఐసీసీలో ఇంగ్లండ్ సభ్యదేశం కాబట్టే నీపై నిషేధం అమల్లో ఉంది. దీనిపై పోరాటం చేయడం మాని, అనేక మ్యాచ్‌ల్లో అవకాశం ఇచ్చిన పీసీబీని విమర్శిస్తావా?, అలా అనుకుంటే నీకు పాకిస్తాన్ జట్టులో ఆడే అవకాశమే ఉండేది కాదు' అని హుస్సేన్ తీవ్రంగా మండిపడ్డారు. పాక్ తరపున 61 టెస్టులు, 18 వన్డేలు ఆడిన తరువాత కనేరియా మతపరమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకూ సమంజమన్నారు. పాకిస్తాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించినప్పుడు హిందువుగానే జట్టులో ఆడావన్న సంగతి కనేరియా గుర్తించుకుంటే మంచిందన్నారు. 2012 ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన కనేరియా జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్నాడు. దీనిలో భాగంగా తమకు రూ. 2.5 కోట్లు చెల్లించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఆదేశించడంతో కనేరియా మరింత ఇబ్బందుల్లో పడ్డాడు. గతంలో దీనిపై బీసీసీఐని కూడా ఆశ్రయించాడు. తనకు న్యాయ సహాయం అందించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. కాగా, తాజాగా పీసీబీపై కనేరియా చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లు ఉండటంతో అతని పరిస్థితి మరింత ఇరకాటంలో పడింది. -
బీసీసీఐ సాయం కోరిన కనేరియా
కరాచీ: గత ఐదు సంవత్సరాల క్రితం ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్ లో ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన పాకిస్తాన్ స్పిన్నర్ డానిష్ కనేరియా తన దేశ క్రికెట్ బోర్డు నుంచి ఎటువంటి సాయం అందకపోవడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)ని ఆశ్రయించాడు. తనపై నిషేధం ఎత్తివేయడానికి బీసీసీఐ సాయం చేయాలని తాజాగా విజ్ఞప్తి చేశాడు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)తో భారత క్రికెట్ బోర్డు చర్చించి తనకు నిషేధం నుంచి విముక్తి కల్పించాలని విన్నవించాడు. తన ఆర్థిక పరిస్థితి బాలేనందున శిక్ష సందర్భంగా పడ్డ జరిమానా కూడా తాను చెల్లించే స్థితిలో లేనని కనేరియా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తాను ఫిక్సింగ్ కు పాల్పడినట్లు భారత్ మీడియాలో అప్పట్లో వక్రీకరించి పెద్ద ఎత్తున దుమారం చెలరేగినా, దానిపై ఇప్పుడు ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదన్నాడు. ఆ సమయంలో భారత్ మీడియా అత్యుత్సాహం చూపడం తనను ఎక్కువగా బాధించిందన్నాడు. ఇదిలా ఉండగా, కనేరియా అన్నయ్య వికీ మాట్లాడుతూ.. తన కుటుంబం పాకిస్తాన్ క్రికెట్ ను కిందికి తోసే పని ఏనాటికీ చేయదన్నాడు. గతంలో ఫిక్సింగ్ పాల్పడిన ముగ్గురు పాకిస్తాన్ క్రికెటర్లకు నిషేధం అనంతరం జాతీయ జట్టులో పునరాగమనం కల్పించినట్లే కనేరియాపై కూడా నిషేధం ఎత్తివేయడానికి పీసీబీ సహకరించాలన్నాడు. 2010 నుంచి కనేరియా చాలా క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడని వికీ తెలిపాడు. ఆర్థికంగా కూడా తమ పరిస్థితి చిన్నా భిన్నంగా మారిందన్నాడు. కనేరియా మొత్తం అకౌంట్లను స్తంభింపజేయడంతో ఉమ్మడి కుటుంబమైన తమ పరిస్థితి అద్వానంగా ఉందని వికీ తెలిపాడు. 2010లో ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన కనేరియా ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంగ్లండ్‌లో కోర్టును ఆశ్రయించి గతంలో భంగపడ్డాడు. ఫిక్సింగ్ చేసినందుకు, తమను కోర్టుకు పిలిచినందుకు ఖర్చులకు గాను అన్నీ కలిపి కనే రియా తమకు రూ. 2.5 కోట్లు చెల్లించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆదేశించడంతో కనేరియా ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వచ్చింది. -
‘జరిమానా’కి సాయం కావాలి
పాకిస్తాన్ స్పిన్నర్ డానెష్ కనేరియా గుర్తున్నాడుగా... ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటున్నాడు. తాను ఫిక్సింగ్ చేయలేదని ఇంగ్లండ్‌లో కోర్టును ఆశ్రయించి గతంలో భంగపడ్డాడు. ఫిక్సింగ్ చేసినందుకు, తమను కోర్టుకు పిలిచినందుకు ఖర్చులకు గాను అన్నీ కలిపి కనే రియా తమకు రూ. 2.5 కోట్లు చెల్లించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆదేశించింది. అయినా స్పందించకపోవడంతో లాహోర్‌లోని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే కనేరియా దీనిపై భిన్నంగా స్పం దించాడు. తనకు పాకిస్తాన్ బోర్డు సాయం చేయాలని కోరాడు. ఎవరైనా న్యాయ పోరాటం చేస్తాను సాయం చేయమని కోరాలి. కానీ కనేరియా జరిమానా కట్టడానికి సాయం చేయమని కోరుతున్నాడు. ఇదేం చిత్రమో మరి.