Virat Kohli: ‘‘ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో టీమిండియా టెస్టు సిరీస్‌కు గెలిచింది. కానీ... సఫారీ గడ్డపై భారత జట్టు ఇంతవరకు ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. నిజానికి విరాట్ కోహ్లికి దక్షిణాఫ్రికా పర్యటన అతిపెద్ద సవాలు. కెప్టెన్‌గా తనను తాను మరోసారి నిరూపించుకోవడానికి ఇదే చివరి అవకాశం. బ్యాటర్‌గా పరుగులు సాధించాలి.. కెప్టెన్‌గా జట్టును విజయతీరాలకు చేర్చాలి’’అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా అన్నాడు.
అదే విధంగా... ప్రొటిస్‌తో టెస్టు సిరీస్ గెలిస్తేనే వన్డే కెప్టెన్‌గా తనను తొలగించిన బీసీసీఐకి సరైన సమాధానం చెప్పినట్లవుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత పరిస్థితుల్లో సౌతాఫ్రికా పర్యటన రూపంలో కోహ్లికి మంచి అవకాశం ఉందని పేర్కొన్నాడు. కాగా ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో ఆడిన 7 టెస్టు సిరీస్‌లలోనూ టీమిండియా పరాజయం పాలైంది. చివరిసారిగా 2-1 తేడాతో సిరీస్‌కు ఆతిథ్య జట్టుకు సమర్పించింది.
ఇక.. వన్డే కెప్టెన్‌గా కోహ్లిని తప్పించి... రోహిత్ శర్మకు బీసీసీఐ పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... టెస్టు కెప్టెన్సీకే పరిమితమైన కోహ్లి ఎలాగైనా సిరీస్ గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఇక కోహ్లి సారథ్యంలోని భారత జట్టు మూడు టెస్టులు, మూడు వన్డేల కోసం దక్షిణాఫ్రికాకు చేరుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: IND Vs SA: అతడిని కచ్చితంగా భారత జట్టులోకి తీసుకోవాలి.. ఎందుకంటే!
Comments
Please login to add a commentAdd a comment