టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. నవంబరు 22 నుంచి బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. వీటిలో కనీసం నాలుగు గెలిస్తేనే రోహిత్ సేన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది.
ఇదే తొలిసారి..
కాగా ఇటీవలే సొంతగడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో ఆడిన మూడు టెస్టుల్లో ఓడి 0-3తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. స్వదేశంలో భారత జట్టు ఇలా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లలో ఓడిపోవడం ఇదే తొలిసారి.
ఈ నేపథ్యంలో రోహిత్ సేన ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంతగడ్డపైనే రాణించలేనివాళ్లు.. ఆసీస్ పిచ్‌లపై ఆడటం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ ఓపెనర్‌గా వద్దు
ఆస్ట్రేలియాతో టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా కాకుండా వన్‌డౌన్‌లో బరిలోకి దిగాలని సూచించాడు. కివీస్‌తో సిరీస్‌లో పేసర్ టిమ్ సౌతీని ఎదుర్కొనేందుకు రోహిత్ ఇబ్బందిపడ్డాడన్న కనేరియా.. ఆస్ట్రేలియాలో బంతి మరింత స్వింగ్ అవుతుంది కాబట్టి.. వన్‌డౌన్‌లో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియలో సౌతీ బౌలింగ్‌లో ఆడేందుకు రోహిత్ ఇబ్బందిపడ్డాడు. రెండుసార్లు అతడి బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. కాబట్టి అతడి బ్యాటింగ్ ఆర్డర్ మారిస్తే బాగుంటుంది.
జైస్వాల్‌కు జోడీగా అతడు రావాలి
టాపార్డర్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి శుబ్‌మన్ గిల్ ఓపెనర్‌గా రావాలి. రోహిత్ వన్‌డౌన్‌లో, కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలి. బ్యాటింగ్ లైనప్ విషయంలో గౌతం గంభీర్ తప్పక మార్పులు చేయాలి.
రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కూడా బ్యాట్‌తో వీలైనంత ఎక్కువగా రాణిస్తేనే ఫలితం ఉంటుంది’’ అని డానిష్ కనేరియా పేర్కొన్నాడు. కాగా ఆసీస్- టీమిండియా మధ్య నవంబరు 22 నుంచి జనవరి 3 వరకు మూడు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: BCCI- Pant: ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. మరి ఆ టెక్నాలజీ ఎందుకు వాడదంటే?
Comments
Please login to add a commentAdd a comment