దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. జొహనెస్‌బర్గ్ వేదికగా ఇరు జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 15) నాలుగో టీ20 జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి.
ఇదిలా ఉంటే, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్.. ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. శాంసన్ తన 32 మ్యాచ్‌ల స్వల్ప కెరీర్‌లో మొత్తం ఆరు సార్లు డకౌటయ్యాడు. శాంసన్ ఇవాళ జరుగబోయే నాలుగో టీ20లో కూడా డకౌటైతే ఓ చెత్త రికార్డును టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లితో కలిసి షేర్ చేసుకుంటాడు.
కోహ్లి తన 117 మ్యాచ్‌ల టీ20 కెరీర్‌లో ఏడు సార్లు డకౌటయ్యాడు. సంజూ నేటి మ్యాచ్‌లో డకౌటైతే విరాట్ సరసన నిలుస్తాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక సార్లు డకౌటైన అప్రతిష్ట రోహిత్ శర్మకు దక్కుతుంది. హిట్‌మ్యాన్ తన 151 మ్యాచ్ టీ20 కెరీర్‌లో 12 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. హిట్‌మ్యాన్ తర్వాతి స్థానాల్లో విరాట్ (7), సంజూ శాంసన్ (6), కేఎల్ రాహుల్ (5), శ్రేయస్ అయ్యర్ (4) ఉన్నారు.
కాగా, సంజూ తన కెరీర్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్లు కావడం ఇది రెండో సారి. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ సంజూ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. నేటి మ్యాచ్‌లో సంజూ ఎలాగైనా ఖాతా తెరిచి విరాట్ పేరిట ఉన్న అప్రతిష్టను సమం చేయకూడదని భావిస్తున్నాడు. సంజూ గత రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన సందర్భాల్లో మార్కో జన్సెన్ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సంజూ ఈసారి ఎలాగైనా జన్సెన్ ఫోబియా నుంచి బయటపడి భారీ స్కోర్ సాధించాలని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment