
దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా యువ ఆటగాడు, హైదరాబాదీ తిలక్ వర్మ విధ్వంసం సృష్టించాడు. వరుస సెంచరీలతో తిలక్ సత్తాచాటాడు. ప్రోటీస్‌తో జరిగిన మూడో టీ20లో అద్బుత సెంచరీతో చెలరేగిన తిలక్.. ఇప్పుడు జోహన్స్‌బర్గ్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో అదే ఇన్నింగ్స్‌ను రిపీట్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో కేవలం 47 బంతులు మాత్రమే ఎదుర్కొన్న తిలక్ వర్మ.. 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 120 పరుగులు చేశాడు. ఈ సిరీస్ అసాంతం తిలక్ అద్బుతమైన ప్రదర్శన కరబరిచాడు. మొత్తం నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 140 సగటు, 198 స్ట్రైక్‌రేటుతో తిలక్ 280 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డులు రెండు కూడా తిలక్ దక్కాయి.
కోహ్లి రికార్డు బ్రేక్
ఈ క్రమంలో తిలక్ వర్మ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా తిలక్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది.
2020-21లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కోహ్లి 147 స్ట్రైక్‌రేటుతో 231 పరుగులు సాధించాడు. తాజా సిరీస్‌తో కోహ్లి ఆల్‌టైమ్ రికార్డును ఈ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 135 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో టీమిండియా ఎగరేసుకుపోయింది.
చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
Comments
Please login to add a commentAdd a comment