ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకు! భారత కల నేరవేరింది. గత 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్‌కప్ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ వసమైంది. టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా టీమిండియా నిలిచింది. బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 7 వికెట్ల తేడాతో ఓడించిన భారత్..రెండో సారి విశ్వవిజేతగా నిలిచింది.
2007లో తొలిసారి ఎంఎస్ ధోని సారథ్యంలో పొట్టి ప్రపంచకప్‌ను భారత్ సొంతం చేసుకోగా.. మళ్లీ 17 ఏళ్ల తర్వాత సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగల్గింది.
భారత విజయంలో బుమ్రా, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఛాంపియన్స్‌గా నిలిచినందుకు చాలా గర్వంగా ఉందని రోహిత్ తెలిపాడు.
"మా కల నేరివేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణం కోసమే ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాము. గత నాలుగేళ్లలో మా జట్టు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది. కొన్ని కీలక మ్యాచ్‌ల్లో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. కానీ మేము ఏ రోజు కుంగిపోలేదు. మేము ఒక యూనిట్‌గా తీవ్రంగా శ్రమించాము. ఈ రోజు మేము విజయం సాధించడం వెనక చాలా కష్టం దాగి ఉంది.
మా కష్టానికి తగ్గ ఫలితం ఈ రోజు దక్కింది. ఏమి మాట్లాడాలో కూడా నాకు ఆర్ధం కావడం లేదు. జట్టులో ప్రతీ ఒక్కరూ అద్బుతం. ఒకానొక సమయంలో మ్యాచ్ దక్షిణాఫ్రికా వైపు మలుపు తిరిగినప్పుడు కూడా మేము ఒక యూనిట్‌గా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాము. ఎలాగైనా గెలవాలనుకున్నాం. ఒక జట్టుగా ఆఖరికి విజయం సాధించాము.
ఒక టోర్నమెంట్‌ను గెలవాలంటే జట్టులోని ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలి. ఈ టోర్నీలో మా బాయ్స్ అదే చేసి చూపించారు. జట్టు మెనెజ్‌మెంట్ కూడా ప్రతీ ఒక్క ఆటగాడికి పూర్తి స్వేఛ్చను ఇచ్చింది. ఈ విజయం వెనక సపోర్ట్ స్టాఫ్ కష్టం కూడా దాగి ఉంది. ఇక విరాట్ ఒక వరల్డ్‌క్లాస్ ప్లేయర్.
కోహ్లీ ఫామ్‌పై నాతో పాటు జట్టులోని ఏ ఒక్కరికి సందేహం లేదు. అతడి సత్తా ఏంటో మాకు తెలుసు. గత 15 ఏళ్లగా వరల్డ్ క్రికెట్‌లో టాప్ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. ఇలాంటి పెద్ద మ్యాచ్‌ల్లో పెద్ద ప్లేయర్లు జట్టు కోసం కచ్చితంగా నిలబడతారు. విరాట్ కూడా అదే చేసి చూపించాడు.
ఇక అక్షర్ పటేల్ నిజంగా ఒక అద్బుతం. అతడి చేసిన 47 పరుగులు మా విజయంలో కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా బౌలింగ్‌లో బుమ్రా కోసం ఎంత చెప్పుకున్న తక్కువే. అతడు ప్రతీ మ్యాచ్‌లోనూ తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. హార్దిక్, అర్ష్‌దీప్ కూడా అద్బుతంగా బౌలింగ్ చేశాడు.
ఈ విజయంలో ప్రతీ ఒక్కరి పాత్ర ఉంది. ఇక ఈ మెగా టోర్నీలో మాకు పెద్ద ఎత్తు ఎత్తున అభిమానుల నుంచి సపోర్ట్ లభించింది. వాళ్లందరికి సెల్యూట్ చేయాలనకుంటున్నాను. 140 కోట్ల మంది భారతీయులకు ఈ విజయం సంతోషాన్నిచ్చిందని భావిస్తున్నా"అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment