ఛాంపియన్స్-2025లో పాల్గోనేందుకు పాకిస్తాన్‌కు టీమిండియా వెళ్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు.
ఎట్టిపరిస్ధితులలోనూ తమ జట్టును పాక్‌కు పంపేది లేదని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చేప్పగా..పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం భారత జట్టు తమ దేశానికి రావాల్సందేనని మొండి పట్టుతో ఉంది.
ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2023 ఆసియాకప్‌లో తలపడేందుకు కూడా భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లలేదు. దీంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించారు. భారత్ తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది. ఇప్పుడు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుంది.
అయితే ఈ విషయంపై ఐసీసీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో బీసీసీఐ సెక్రటరీ జై షా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికవడంతో ఛాంపియన్స్ ట్రోఫీని ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ ఏడాది నవంబర్ తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.
మా దేశానికి రావద్దు..
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు పాకిస్తాన్‌కు రావద్దని కనేరియా సూచించాడు. ఆటగాళ్ల భద్రతకు మొదటి ప్రాధన్యం ఇవ్వాలని అతడు తెలిపాడు.
"పాకిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితిని చూడండి. నేను అయితే టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లొద్దని చెబుతాను. ఈ విషయం గురుంచి పాకిస్తాన్ ఆలోచించాలి. దీనిపై ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. అంతే తప్ప పీసీబీ ఎటువంటి డిమాండ్ చేయకూడాదు.
నా వరకు అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించే అవకాశముంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరిగే ఛాన్స్ ఉంది. ఆటగాళ్ల భద్రతే మొదటి ప్రాధాన్యత.
ఆ తర్వాతే గౌరవం, ఇంకా ఏమైనా. బీసీసీఐ అద్భుతంగా పనిచేస్తోంది. వారి నిర్ణయం ఏదైనా సరే, ఇతర దేశాలు కూడా అందుకు అంగీకరించాలి. టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరిగితే బెటర్" అని స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా పేర్కొన్నాడు.
కాగా ఈ టోర్నీకి సంబంధించి డ్రాప్ట్ షెడ్యూల్‌ను పీసీబీ ఇప్పటికే ఐసీసీకి పంపించింది. ఆ షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 19 నుంచి మార్చి మార్చి 9 వరకు జరగనుంది. ఈ ఈవెంట్‌కు లాహోర్‌లోని గఢాఫీ స్టేడియం, కరాచీ నేషనల్ స్టేడియం, రావల్పిండి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి. దీంతో ఇప్పటికే ఆయా స్టేడియాల్లో పునర్నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి ఇందుకు కోసం పీసీబీ రూ. 1,280 కోట్లు కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment