Virat Kohli Might Be Dropped For Asia Cup 2022 Says Danish Kaneria - Sakshi
Sakshi News home page

Asia Cup 2022: కోహ్లిని ఆసియాకప్‌కు ఎంపిక చేయకపోవచ్చు: పాక్‌ మాజీ ఆటగాడు

Published Sun, Jul 31 2022 4:42 PM | Last Updated on Sun, Jul 31 2022 5:31 PM

Virat Kohli might be dropped for Asia Cup 2022 Says Danish Kaneria - Sakshi

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి సెంచరీ సాధించి మూడేళ్ల దాటిపోయింది. ఐపీఎల్‌లో నిరాశపరిచిన కోహ్లి.. అనంతరం ఇంగ్లండ్‌ పర్యటనలోనూ తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. ఇక ఇంగ్లండ్‌ టూర్‌ తర్వాత కోహ్లి భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే జింబాబ్వే పర్యటనకు కోహ్లిని ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ జింబాబ్వే సిరీస్‌కు కోహ్లిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు.

కాగా ఈ ఏడాదిలో భారత్‌ ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌ వంటి మేజర్‌ టోర్నీల్లో పాల్గొనబోతుంది. ఈ నేపథ్యంలో కోహ్లి ఫామ్‌ భారత్‌ను మరింత గందరగోళానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో కోహ్లిపై పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్ కనేరియా కీలక వాఖ్యలు చేశాడు. ఆసియాకప్‌-2022కు విరాట్‌ కోహ్లిని ఎంపికచేయకపోవచ్చు అని కనేరియా జోస్యం చెప్పాడు. జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌కు బదులుగా కోహ్లిని ఎంపిక చేయాల్సిందని కనేరియా అన్నాడు.

"జింబాబ్వే సిరీస్‌కు ఇషాన్ కిషన్‌ను ఎందుకు ఎంపిక చేశారో నాకు అర్ధం కావడం లేదు. జట్టులో మరో వికెట్‌ కీపర్‌గా ఉన్న సంజూ శాంసన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అటువంటి అప్పడు కిషన్‌ను ఎంపిక చేయాల్సిన అవసరం ఏముంది. కిషన్‌కు బదులుగా కోహ్లి జట్టులో ఉండాల్సింది. విరాట్‌ కోహ్లి ఈ సిరీస్‌లో భాగమై ఉంటే బాగుండేది. కోహ్లిని కేవలం ప్రధాన టోర్నమెంట్లలో మాత్రమే ఆడాంచాలని బీసీసీఐ భావిస్తోంది. కోహ్లి అక్కడ విఫలమైతే, మరోసారి అతడి ఫామ్‌పై చర్చలు జరుగుతాయి.

ఈ విషయంలో మాత్రం బీసీసీఐ కోహ్లికి అన్యాయం చేస్తుంది నేను భావిస్తున్నాను. కోహ్లి వెస్టిండీస్ పర్యటన మొత్తానికి విశ్రాంతి తీసుకున్నప్పుడు, అతడిని  ఖచ్చితంగా జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక చేయాల్సింది. అతడు జింబాబ్వేతో వన్డేల్లో రాణించి తన ఫామ్‌ను తిరిగి పొందేవాడు. తద్వారా ఆసియా కప్‌లో కూడా కోహ్లి మెరుగైన ప్రదర్శన చేసేవాడు. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆసియా కప్‌కు కూడా కోహ్లిని పక్కన పెట్టే అవకాశం ఉంది" అని కనేరియా తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండిAsia Cup 2022: ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. ఎప్పుడంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement