దినేష్ కార్తీక్(PC: hotstar)
ఆసియాకప్-2022ను విజయంతో టీమిండియా ముగించింది. దుబాయ్ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన తమ అఖరి మ్యాచ్‌లో భారత్ 101 పరుగుల తేడాతో ఘన విజయ సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీంతో 1020 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి మళ్లీ తన అంతర్జాతీయ సెంచరీ అందుకున్నాడు.
ఈ నామమాత్రపు మ్యాచ్‌లో కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 122 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అదే విధంగా బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లతో విజృంభించడంతో మ్యాచ్ ఏకపక్షం అయిపోయింది.
ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ బౌలింగ్ చేసి అందరనీ అశ్చర్యపరిచాడు. కాగా కార్తీర్ తన కెరీర్‌లో బౌలింగ్ చేయడం ఇదే తొలి సారి. ఆఫ్గాన్ ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన కార్తీక్ ఏకంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా కార్తీక్ బౌలింగ్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
India vs Afghanistan #AsiaCup2022 #DineshKarthik bowling pic.twitter.com/PEo8lxmuaw
— Deepak Dagar (@deepak123dagar) September 8, 2022
చదవండి: Queen Elizabeth II: క్రికెటర్ చెంపపై ఆటోగ్రాఫ్ నిరాకరించిన క్వీన్ ఎలిజబెత్-2
Comments
Please login to add a commentAdd a comment