ఆసియాకప్-2022లో భాగంగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఫైనల్ చేరే అవకాశాలను భారత్ చేజార్చుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్‌లో మధుశంక వేసిన ఓ అద్భుతమైన బంతికి కోహ్లి క్లీన్ బౌల్డయ్యాడు. తద్వారా ఆసియాకప్‌లో ఓ చెత్త రికార్డును కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆసియాకప్ వన్డే, టీ20 ఫార్మాట్‌లో డకౌటైన తొలి ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(72) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(34) పరుగులతో రాణించాడు.
లంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక మూడు వికెట్లు, షనక, కరుణరత్నే చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 19. 5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. భారత బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ సాధించాడు. లంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సాంక(52), కుశాల్ మెండిస్(57) పరుగులతో రాణించగా.. అఖరిలో కెప్టెన్ 33 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
— Ehsan ul haq (@the_ehsanulhaq) September 6, 2022
చదవండి: Asia Cup 2022: రోహిత్ సిక్సర్; వెనక తగిలింది కాబట్టి సరిపోయింది.. ముందు తాకుంటే!
Comments
Please login to add a commentAdd a comment