టీ20 ప్రపంచకప్, ఆసియాకప్‌కు భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేయాలని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సూచించాడు. ఐపీఎల్-2022లో అదరగొట్టిన ఆర్ష్‌దీప్ సింగ్‌కు భారత జట్టులో చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్ పర్యటనకు ఎంపికైన అతడు కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఐర్లాండ్ సిరీస్ అనంతరం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ తరపున ఆర్ష్‌దీప్ అరంగేట్రం చేశాడు.
తన డెబ్యూ మ్యాచ్‌లో 18 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక ప్రస్తుతం ఆర్ష్‌దీప్ విండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టులో భాగంగా ఉన్నాడు. తొలి, రెండు వన్డేల్లో బెంచ్‌కే పరిమితమైన ఆర్ష్‌దీప్.. అఖరి వన్డేలో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక డెత్ స్పెషలిస్ట్‌గా పేరొందిన ఆర్ష్‌దీప్‌ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని మాజీలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. "విండీస్‌తో మూడో వన్డేలో అర్ష్‌దీప్ ఆడనున్నాడు.
అంతే కాకుండా ఈ మ్యాచ్‌లో అతడు తన సత్తా చాటుతాడు. అర్ష్‌దీప్ బంతిని అద్భుతంగా స్వింగ్ చేయగలడు. అదే విధంగా అతడు చాలా తెలివిగా బౌలింగ్ చేస్తాడు. డెత్ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా బ్యాటర్లను ఎలా కట్టిడి చేయాలో అతడికి బాగా తెలుసు. టీ20 ప్రపంచకప్, ఆసియా కప్ కోసం భారత జట్టుకు అతడిని ఎంపిక చేయాలి. ఆసియా కప్ యూఏఈ వేదికగా జరుగుతోంది. అక్కడి పిచ్‌లు లెఫ్ట్ ఆర్మ్ పేసర్లకు ఎక్కువగా అనుకూలిస్తాయి. కాబట్టి అర్ష్‌దీప్ అద్భుతంగా రాణించగలడు" అని కనేరియా పేర్కొన్నాడు.
చదవండి: Rahul Dravid: సెంచరీ సాధించినా నా పేరు ఎవరికీ తెలియలేదు.. అప్పుడే నిర్ణయించుకున్నా!
Comments
Please login to add a commentAdd a comment