Asia Cup Under-19 cricket
-
'అతడు డెత్ ఓవర్ల స్పెషలిస్టు.. టీ20 ప్రపంచకప్, ఆసియా కప్‌కు ఎంపిక చేయండి'
టీ20 ప్రపంచకప్, ఆసియాకప్‌కు భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేయాలని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సూచించాడు. ఐపీఎల్-2022లో అదరగొట్టిన ఆర్ష్‌దీప్ సింగ్‌కు భారత జట్టులో చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్ పర్యటనకు ఎంపికైన అతడు కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఐర్లాండ్ సిరీస్ అనంతరం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ తరపున ఆర్ష్‌దీప్ అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ మ్యాచ్‌లో 18 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక ప్రస్తుతం ఆర్ష్‌దీప్ విండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టులో భాగంగా ఉన్నాడు. తొలి, రెండు వన్డేల్లో బెంచ్‌కే పరిమితమైన ఆర్ష్‌దీప్.. అఖరి వన్డేలో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక డెత్ స్పెషలిస్ట్‌గా పేరొందిన ఆర్ష్దీప్ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని మాజీలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "విండీస్‌తో మూడో వన్డేలో అర్ష్‌దీప్ ఆడనున్నాడు. అంతే కాకుండా ఈ మ్యాచ్‌లో అతడు తన సత్తా చాటుతాడు. అర్ష్‌దీప్ బంతిని అద్భుతంగా స్వింగ్ చేయగలడు. అదే విధంగా అతడు చాలా తెలివిగా బౌలింగ్ చేస్తాడు. డెత్ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా బ్యాటర్లను ఎలా కట్టిడి చేయాలో అతడికి బాగా తెలుసు. టీ20 ప్రపంచకప్, ఆసియా కప్ కోసం భారత జట్టుకు అతడిని ఎంపిక చేయాలి. ఆసియా కప్ యూఏఈ వేదికగా జరుగుతోంది. అక్కడి పిచ్‌లు లెఫ్ట్ ఆర్మ్ పేసర్లకు ఎక్కువగా అనుకూలిస్తాయి. కాబట్టి అర్ష్‌దీప్ అద్భుతంగా రాణించగలడు" అని కనేరియా పేర్కొన్నాడు. చదవండి: Rahul Dravid: సెంచరీ సాధించినా నా పేరు ఎవరికీ తెలియలేదు.. అప్పుడే నిర్ణయించుకున్నా! -
Under-19 Asia Cup : అదరగొట్టిన గుంటూరు కుర్రాడు..
అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్‌లో షేక్ రషీద్ (108 బంతుల్లో 90 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కన షేక్ రషీద్ 90 పరుగుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే బౌండరీల రూపంలో వచ్చాయి. ఇక కెప్టెన్ యష్‌దుల్ 26 పరుగులు, రాజ్ భవా 23 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రకీబుల్ హసన్ 3 వికెట్లు తీయగా.. మిగతావారు తలా ఒక వికెట్ తీశారు. -
IND Vs PAK: పాక్‌తో మ్యాచ్.. పోరాడి ఓడిన భారత్
అండర్-19 ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడిపోయింది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా ఆ మ్యాజిక్కు పాక్‌పై రిపీట్ చేయలేకపోయింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా పరుగులు చేయడంలో విఫలమైంది. ఒక దశలో 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో 150 మార్క్ చేరుతుందా అన్న అనుమానం కూడా కలిగింది. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన చోట లోయర్ ఆర్డర్లో వికెట్ కీపర్ ఆరాధ్య యాదవ్ అర్థసెంచరీ(83 బంతుల్లో 50 పరుగులు), కుషాల్ తంబే 32, రాజ్‌వర్దన్ హంగార్గేకర్ 33 పరుగులు సాధించడంతో టీమిండియా 237 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. పాక్ బౌలర్లలో జీషన్ జమీర్ 5 వికెట్లు తీయగా, అవైస్ అలీ 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్ బ్యాటింగ్‌లో ముహమ్మద్ షెహజాద్ 81 పరుగులతో మెరవగా.. ఇర్ఫాన్ ఖాన్ 32, రిజ్వాన్ మెహమూద్ 29 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రాజ్ భవా 4 వికెట్లతో మెరిశాడు. భారత బౌలర్లు పాకిస్తాన్ బ్యాటర్లను తమ బౌలింగ్‌తో ఇబ్బందిపెట్టినప్పటికి చేధించాల్సిన స్కోరు ఎక్కువగా లేకపోవడం పాక్‌కు కలిసివచ్చింది. ఇక టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌ను అఫ్గానిస్తాన్‌తో ఆడనుంది. -
అఫ్ఘానిస్తాన్ అద్భుతం
కౌలాలంపూర్: అంతర్జాతీయ క్రికెట్లో అఫ్ఘానిస్తాన్ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ తొలిసారి ఆసియా కప్ అండర్–19 టోర్నీలో చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టైటిల్ ఫేవరెట్ పాకిస్తాన్‌పై అఫ్ఘానిస్తాన్ ఏకంగా 185 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట అఫ్ఘాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు చేసింది. ఇక్రామ్ ఫైజీ (107; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా, రహ్మాన్ గుల్ 40 పరుగులు చేశాడు. మూసా 3, షాహిన్ 2 వికెట్లు తీశారు. తర్వాత పాక్ 22.1 ఓవర్లలో 63 పరుగులకే కుప్పకూలింది. తాహ (19) టాప్‌స్కోరర్ కాగా, అఫ్ఘాన్ బౌలర్లలో ముజీబ్ 5, ఖైస్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టారు. -
భారత్ ఖేల్ ఖతం
కౌలాలంపూర్: డిఫెండింగ్ చాంపియన్ భారత్ అండర్–19 ఆసియా కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మంగళవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయంపాలు కావడంతో టీమిండియా కథ ముగిసింది. గత మ్యాచ్‌లోనూ భారత్, నేపాల్ చేతిలో ఓడింది. ఈ గ్రూప్‌లో భారత్ రెండు పాయింట్లతో మూడో స్థానంలో నిలువగా... నేపాల్, బంగ్లాదేశ్ సెమీస్‌కు అర్హత పొందాయి. వర్షం కారణంగా 32 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముందుగా భారత్ 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సల్మాన్ ఖాన్ (39 నాటౌట్) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బంగ్లా 28 ఓవర్లలో 2 వికెట్లకు 191 పరుగులు చేసి విజయాన్నందుకుంది. పినాక్ ఘోష్ (81 నాటౌట్) అర్ధసెంచరీ సాధించగా, తౌహీద్ హృదయ్ (48 నాటౌట్) రాణించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు అభేద్యంగా 83 పరుగులు జోడించారు. -
భారత్‌కు రెండో విజయం
కొలంబో: ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నేపాల్ జట్టుతో శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత నేపాల్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 172 పరుగులు చేసింది. భారత స్పిన్నర్ రాహుల్ చహర్ 27 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. 173 పరుగుల లక్ష్యాన్ని భారత్ 33.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. హిమాన్షు రాణా (51; 5 ఫోర్లు), శుభ్‌మాన్ గిల్ (57; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఆదివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ ఆడుతుంది.