
అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్‌లో షేక్ రషీద్ (108 బంతుల్లో 90 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ మాత్రమే ఉన్నాయి.
ఈ లెక్కన షేక్ రషీద్ 90 పరుగుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే బౌండరీల రూపంలో వచ్చాయి. ఇక కెప్టెన్ యష్‌దుల్ 26 పరుగులు, రాజ్ భవా 23 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రకీబుల్ హసన్ 3 వికెట్లు తీయగా.. మిగతావారు తలా ఒక వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment