
కౌలాలంపూర్: డిఫెండింగ్ చాంపియన్ భారత్ అండర్–19 ఆసియా కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మంగళవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయంపాలు కావడంతో టీమిండియా కథ ముగిసింది. గత మ్యాచ్‌లోనూ భారత్, నేపాల్ చేతిలో ఓడింది. ఈ గ్రూప్‌లో భారత్ రెండు పాయింట్లతో మూడో స్థానంలో నిలువగా... నేపాల్, బంగ్లాదేశ్ సెమీస్‌కు అర్హత పొందాయి.
వర్షం కారణంగా 32 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముందుగా భారత్ 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సల్మాన్ ఖాన్ (39 నాటౌట్) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బంగ్లా 28 ఓవర్లలో 2 వికెట్లకు 191 పరుగులు చేసి విజయాన్నందుకుంది. పినాక్ ఘోష్ (81 నాటౌట్) అర్ధసెంచరీ సాధించగా, తౌహీద్ హృదయ్ (48 నాటౌట్) రాణించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు అభేద్యంగా 83 పరుగులు జోడించారు.
Comments
Please login to add a commentAdd a comment