bangla
-
నీరవ్‌కు షాక్ : విలాసవంతమైన బంగ్లా కూల్చివేత
సాక్షి,ముంబై : పీఎన్బీ స్కాంలో కీలక నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరో షాక్ తగిలింది. ముంబైకి సమీపంలోని నీరవ్‌కు చెందిన విలాసవంతమైన అలీబాగ్ బంగ్లా కూల్చివేతకు అధికారులు ఆదేశాలిచ్చారు. ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని రాయిఘడ్ జిల్లా కలెక్టర్ సూర్యవంశి వెల్లడించారు. చాలా దృఢమైన ఈ భవాన్ని కూల్చడానికి కొంత సమయం పడుతుందని, రెండు బుల్డోజర్లు, ప్రొక్లెయిన్లతో ఇప్పటికే పని ప్రారంభించినట్టు తెలిపారు. సముద్ర తీరంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఈ భవనాన్ని నీరవ్‌మోదీ నిర్మించారని తేల్చిన అధికారులు శుక్రవారం కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ భవనంతో పాటు మరో 58 భవనాలు అక్రమంగా నిర్మించారని అధికారులు ప్రకటించారు. దాదాపు 30వేల చదరపు అడుగుల్లో విస్తరించిన వున్న ఈ బంగ్లా విలువ రూ.42కోట్లు వుంటుందని గతంలోనే ఈడీ ప్రకటించింది. కాగా బీచ్ తీరంలో అక్రమ భవనాలు, హోటళ్లు, రిస్టార్ట్లను తొలగించాల్సిందిగా కోరుతూ ఎన్జీవో కార్యకర్త శాంబూర్జే యువ క్రాంతి 2009లో హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇది అక్రమమైన కట్టడమేనని కలెక్టర్ సూర్యవంశి గత ఏడాది డిసెంబరులో ధృవీకరించారు. దీంతో కోర్టు ఆయా భవనాల కూల్చివేతకు ఆదేశించింది. అలాగే దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా నీరవ్‌మోదీ తదితరులకు నోటీసులు పంపించినా, ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఈడీతో సంప్రదింపుల అనంతరం కూల్చివేతకు నిర్ణయించామని కలెక్టరు వివరించారు. -
‘బంగ్లా’పై మమతానురాగం ఎందుకో!
సాక్షి, న్యూఢిల్లీ : దేశానికి స్వాతంత్య్రం వచ్చిన దాదాపు ఐదు దశాబ్దాల అనంతరం భారత రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. ముఖ్యంగా 1990వ దశకం నుంచి జాతీయ పార్టీ కాంగ్రెస్ బలహీన పడుతూ రాగా, ప్రాంతీయ పార్టీలు బలపడుతూ వచ్చాయి. ఈ పార్టీలు తమ ప్రాంతీయ తత్వాన్ని చాటుకునేందుకుగాను బ్రిటీష్ కాలం నాటి నగరాల ఇంగ్లీషు పేర్లను మారుస్తూ వచ్చాయి. అలా బాంబే ముంబైగా, మద్రాస్ చెన్నైగా, కలకత్తా కోల్‌కతాగా మారాయి. మరో జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ బలపడుతూ రావడంతో ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకునేందుకు మరోసారి ప్రాంతీయ రాజకీయాలను ఆశ్రయించాల్సి వచ్చింది. తమిళ ప్రాంతీయతను కాపుడుకునేందుకు ద్రావిడ మున్నేట్ర కళగం, ఒడియా గుర్తింపు కోసం బిజూ జనతా దళ్, కన్నడ గుర్తింపు కోసం కర్ణాటక కాంగ్రెస్, బెంగాలీ గుర్తింపు కోసం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు చర్యలు ప్రారంభించాయి. దానికి కొనసాగింపుగానే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గురువారం నాడు ‘పశ్చిమ బెంగాల్’ రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా మార్చాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత బెంగాల్ రాష్ట్ర విభజనను సూచిస్తున్న పశ్చిమ బెంగాల్ పేరు శాశ్వతంగా మరుగున పడిపోతుంది. ఇప్పటికే స్థానిక బాషలో బెంగాల్‌ను బంగ్లాగా పిలుస్తున్న విషయం తెల్సిందే. మమతా బెనర్జీ గత జనవరి నెలలోనే ప్రత్యేక బెంగాల్ స్టాంప్‌ను తీసుకొచ్చారు. ప్రత్యేక రాష్ట్రీయ గీతాన్ని కూడా తీసుకొస్తున్నట్లు తెల్సింది. హిందూత్వ వాదంతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి దూసుకొస్తున్న బీజేపీని కట్టడి చేయడానికే మమతా బెనర్జీ ఈ చర్యలు తీసుకుంటున్నారని ఎవరైనా గ్రహించవచ్చు. వాస్తవానికి ఆమె 2017, మే నెలలోనే ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బెంగాలీ భాషను తప్పనిసరిచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డార్జిలింగ్‌లో నేపాలీ మాట్లాడే గోర్ఖాలు ఆందోళన చేయడంతో ఆమె తక్షణం ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. ఒకప్పుడు ప్రత్యేక గోర్ఖాలాండ్ ఉద్యమాన్ని ప్రోత్సహించడం ద్వారా మమతా బెనర్జీ లాభపడ్డారు. ప్రత్యేక గోర్ఖాలాండ్ డిమాండ్‌కు ఎప్పటి నుంచో బీజేపీ మద్దతు ఇస్తుండడం, 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో డార్జిలింగ్ విషయంలో తొందరపడడం మంచిది కాదన్న దృష్టితో వెంటనే వెనక్కి తగ్గారు. హిందూత్వ ప్రచారంలో భాగంగా శ్రీరామనవమి సందర్భంగా బీజేపీ, ఆరెస్సెస్‌లు కోల్‌కతాలో కొత్తగా ర్యాలీలు నిర్వహించడంతో పరాయి సంస్కృతిని తీసుకొస్తున్నారంటూ ముందుగా దూషించిన మమతా బెనర్జీ చివరకు బెంగాలీ సంస్కృతి ప్రతిబింబించేలా శ్రీరామ నవమి ర్యాలీలను పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఎన్ని చేసినా వచ్చే ఎన్నికల్లో మమతా బెనర్జీ ఏమేరకు లాభ పడతారన్నది ప్రస్తుతానికి ప్రశ్నే. ఎందుకంటే కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రాంతీయతత్వాన్ని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం హిందీ భాషను రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. బెంగుళూరును బెంగళూరుగా మార్చింది. ప్రత్యేక రాష్ట్రీయ పతాకాన్ని తీసుకొచ్చింది. పాలనాపరంగా మంచి ప్రభుత్వం అనిపించుకుంది. అయినా ఎన్నికల ఫలితాల్లో బీజేపీకంటే ఎంతో వెనకబడింది. రాష్ట్ర పేరు మార్పునకు అసెంబ్లీ తీర్మానం -
పశ్చిమబెంగాల్ కాదు.. బంగ్లా!
న్యూఢిల్లీ/కోల్‌కతా: తమ రాష్ట్రం పేరును మార్చాలని కేంద్రాన్ని కోరుతూ పశ్చిమబెంగాల్ అసెంబ్లీ గురువారం తీర్మానించింది. తీర్మానం ప్రకారం.. బెంగాలీలో బంగ్లా, ఇంగ్లిష్‌లో బెంగాల్, హిందీలో బంగాల్‌గా మూడు పేర్లుంటాయి. తమ రాష్ట్రం బంగ్లా మాదిరిగానే పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ పేరు కూడా ఉన్నందున ఈ మార్పు అవసరమని భావిస్తున్నట్లు కేంద్రానికి తెలిపింది. అక్షరమాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రాల జాబితాలో పశ్చిమబెంగాల్ పేరు చిట్టచివరన ఉంది. ఈ ఒరవడిని మార్చడమే తాజా తీర్మానం లక్ష్యంగా భావిస్తున్నారు. బెంగాల్ సర్కారు కోరినట్లు 3 భాషల్లో 3 పేర్లు కాకుండా ఒక్క పేరే∙సూచించాలని కేంద్రం కోరుతోంది. కరుణానిధిని పరామర్శించేందుకు వచ్చిన నేతలు -
రాష్ట్ర పేరు మార్పునకు అసెంబ్లీ తీర్మానం
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పేరు మార్పులో కీలక ముందడుగు పడింది. గత కొంత కాలంగా బెంగాల్ పేరు మార్పు కోసం సీఎం మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పేరును ‘బంగ్లా’గా మార్చుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ గురువారం తీర్మానం చేసింది. అన్ని భాషల్లోనూ ‘బంగ్లా’ అనే పేరే ఉంటుందని అందులో పేర్కొంది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్ర హోం శాఖ ఆమోదం పొందిన వెంటనే ఈ పేరు అమల్లోకి రానుంది. 2016లో పశ్చిమ బెంగాల్ పేరును బెంగాలీలో ‘బంగ్లా’గా, ఇంగ్లిష్‌లో ‘బెంగాల్’గా, హిందీలో ‘బంగాల్’గా మార్చుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. అప్పుడు దీనిని విషక్ష కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు వ్యతిరేకించాయి. ఈ తీర్మానంపై కేంద్రం స్పందిస్తూ.. మూడు భాషల్లో వేర్వేరు పేర్లు కాకుండా, అన్ని భాషల్లో ఒకే పేరు ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచింది. దీంతో 2017 సెప్టెంబర్ 17న పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగ్లా’ గా మార్చుతూ మమతా క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. కాగా బెంగాల్లో అక్రమంగా చెలామణిలో ఉన్న ఓ లిక్కర్ బ్రాండ్‌కు బంగ్లా అనే పేరు ఉంది. దీంతో చాలా మంది బెంగాల్ వాసులు ఈ పేరుపై అభ్యంతరం తెలుపుతున్నారు. ప్రస్తుతం బెంగాల్‌ని పశ్చిమ్ బంగా, పశ్చిమ్ బంగ్లా అని పిలుస్తున్నారు. -
భారత్ ఖేల్ ఖతం
కౌలాలంపూర్: డిఫెండింగ్ చాంపియన్ భారత్ అండర్–19 ఆసియా కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మంగళవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయంపాలు కావడంతో టీమిండియా కథ ముగిసింది. గత మ్యాచ్‌లోనూ భారత్, నేపాల్ చేతిలో ఓడింది. ఈ గ్రూప్‌లో భారత్ రెండు పాయింట్లతో మూడో స్థానంలో నిలువగా... నేపాల్, బంగ్లాదేశ్ సెమీస్‌కు అర్హత పొందాయి. వర్షం కారణంగా 32 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముందుగా భారత్ 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సల్మాన్ ఖాన్ (39 నాటౌట్) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బంగ్లా 28 ఓవర్లలో 2 వికెట్లకు 191 పరుగులు చేసి విజయాన్నందుకుంది. పినాక్ ఘోష్ (81 నాటౌట్) అర్ధసెంచరీ సాధించగా, తౌహీద్ హృదయ్ (48 నాటౌట్) రాణించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు అభేద్యంగా 83 పరుగులు జోడించారు. -
పశ్చిమ బెంగాల్ పేరు మారబోతున్నదోచ్!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరు మారబోతున్నది. ఆ రాష్ట్రాన్ని ఇక నుంచి ఆంగ్లంలో ‘బెంగాల్’గా, బెంగాలీ భాషలో అయితే ‘బంగో’ లేదా ‘బంగా’గా పిలువాలని నిర్ణయించారు. ఈ మేరకు పేరు మార్పు ప్రతిపాదనకు బెంగాల్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. పేరు మార్పు తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. ఈ తీర్మానం ఆమోదం కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ నిర్వహించాలని మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉండటంతో ఈ తీర్మానం ఆమోదం పొందడం ఖాయమే. ఒకప్పుడు వంగ దేశంగా పిలువబడిన పశ్చిమ బెంగాల్ పేరుమార్పు ప్రతిపాదనను కేంద్రం ఆమోదిస్తే.. ఇక ఆంగ్లంలో ఆ రాష్ట్రాన్ని బెంగాల్‌గా పిలువాల్సి ఉంటుంది. ఈ మేరకు పేరుమార్పు కోసం కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే స్థానికులు మాట్లాడరీతిలోనే నగరం పేరు ఉండాలనే ఉద్దేశంతో కలకత్తా పేరును కోల్‌కతాగా మార్చిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో పశ్చిమ బెంగాల్ పేరును కూడా రాష్ట్ర ప్రజలు పలికే రీతిలో బెంగాల్, బంగాగా మార్చాలని నిర్ణయించారు. -
తిరిగి దక్కించుకునేదెలా?
హోమీబాబా బంగ్లాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాక్షి, ముంబై: ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ హోమీబాబా బంగ్లాను తిరిగి దక్కించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవలే వేలం వేసిన ఈ బంగ్లాను తిరిగి దక్కించుకొని, దానిని మ్యూజియంగా మార్చాలని యోచిస్తున్నాయి. అయితే వేలం వేసిన బంగ్లాను దక్కించుకునే విషయమై నిపుణుల నుంచి న్యాయసలహాలు తీసుకుంటున్నాయి. అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు కూడా ఇరు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. హోమీబాబాకు చెందిన ‘మెహరంగీర్’ బంగ్లాకు హెరిటేజ్ హోదా కల్పించి దాన్ని మ్యూజియంగా మార్చాలని కోరుతూ వివిధ సేవాసంస్థలు కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశాయి. అయితే కోర్టు నుంచి తీర్పు రాకముందే ‘నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ (ఎన్సీపీఏ) కొద్ది రోజుల కిందటే ఈ బంగ్లాను రూ.372 కోట్లకు వేలంలో విక్రయించింది. కాగా ఈ వేలాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆటమిక్ ఎనర్జీ వర్కర్స్ అండ్ స్టాఫ్ యూనియన్ అధ్యక్షుడు ప్రశాంత్ వర్లీకర్, నేషనల్ ఫోరమ్ ఫర్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయిస్(న్యూక్లియర్ శాఖ) అధ్యక్షుడు రామ్‌ధురి కోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఎటువంటి తీర్పును ఇవ్వకముందే ఈ బంగ్లాను మ్యూజియంగా మార్చేందుకు కేంద్రం తనవంతు ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకు సంబంధించిన లేఖను ప్రధాని కార్యాలయం, న్యాయశాఖకు పంపింది. వేలంలో విక్రయించిన బాబా బంగ్లాను దక్కించుకునేందుకు న్యాయపరమైన సలహాలు ఇవ్వాలని న్యాయశాఖను కోరింది. కాగా న్యాయశాఖ కూడా ఈ విషయమై అధ్యయనం చేస్తోందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. బాబా బంగ్లాను వారసత్వ కట్టడంగా గుర్తించి, దాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి న్యూక్లియర్ కమిషన్ డిమాండ్ చేసింది. ఈ కట్టడాన్ని మ్యూజియంగా మారిస్తే హోమీ బాబాకు మరింత గౌరవం కల్పించినట్లవుతుందని పేర్కొంది. మేధావుల అభ్యంతరం... హోమీబాబా బంగ్లాను మ్యూజియంగా మార్చాలనే డిమాండ్ వినిపించడంపై మేధావులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హోమీబాబా నివసించినట్లుగా చెబుతున్న ‘మెహరంగీర్’ బంగ్లాను మ్యూజియంగా మార్చాలని కోరుతున్నవారికి చరిత్ర తెలియదని వాదిస్తున్నారు. నిజానికి మెహరంగీర్ బంగ్లాలో బాబా కొన్నిరోజులు మాత్రమే నివసించారని, ఆయన పెడ్డర్ రోడ్డులోని కెనిల్‌వర్త్‌లోనే ఎక్కువ రోజులు గడిపారని చెబుతున్నారు.