కొలంబో: ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నేపాల్ జట్టుతో శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత నేపాల్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 172 పరుగులు చేసింది.
భారత స్పిన్నర్ రాహుల్ చహర్ 27 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. 173 పరుగుల లక్ష్యాన్ని భారత్ 33.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. హిమాన్షు రాణా (51; 5 ఫోర్లు), శుభ్‌మాన్ గిల్ (57; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఆదివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ ఆడుతుంది.
భారత్‌కు రెండో విజయం
Published Sat, Dec 17 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM
Advertisement