
కుంభమేళాలో పూసల దండలు అమ్ముకునేందుకు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన మోనాలిసా ఇప్పుడు విదేశీయానం కూడా చేయబోతున్నారు. అది కూడా శివరాత్రి రోజున.. వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్న మోనాలిసా ఖ్యాతి ఇప్పుడు విదేశాలను కూడా తాకింది. ఇంతకీ మోనాలిసా ఎక్కడికి వెళ్లబోతున్నారు? ఏ దేశం నుంచి ఆమెకు ఆహ్వానం అందింది?
మారుమూల గ్రామం నుంచి మహానగరం ముంబైకి చేరుకున్న మోనాలిసా త్వరలో బాలీవుడ్ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనున్నారు. అయితే ఇంతలోనే ఆమె విదేశాలకు వెళ్లే అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు. ఇటీవలి కాలంలో మోనాలిసా ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఫిబ్రవరి 26న మోనాలిసా నేపాల్‌లో జరిగే శివరాత్రి వేడుకల్లో పాల్గొననున్నారు. ఇందుకు ఆమెకు ఇప్పటికే ప్రత్యేక ఆహ్వనం అందింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మోనాలిసా సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సనోజ్ మిశ్రా ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.
ఈ కార్యక్రమ వివరాలను సనోజ్ మిశ్రా ఒక వీడియో ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ఈ వీడియోలో మోనాలిసా మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ అందరినీ ఆహ్వానించారు. ప్రస్తుతం మోనాలిసా దర్శకుడు సనోజ్ మిశ్రా సహకారంతో నటనతో పాటు చదవడం, రాయడం కూడా నేర్చుకుంటున్నారు. తాజాగా ఆమె న్యూలుక్‌కు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్‌గా మారాయి. కుంభమేళాకు వచ్చిన 16 ఏళ్ల మోనాలిసా తన తేనె కళ్లతో అందరి దృష్టిలో పడ్డారు. రాత్రికిరాత్రే సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయారు.
ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా..
Comments
Please login to add a commentAdd a comment