
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా(Mahakumbh Mela)లో పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలిసా రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది. దీంతో ఆమెకు అటు సినిమా అవకాశాలు, ఇటు ప్రకటనల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆమె ఒక బహిరంగ వేదికపై జరిగిన ప్రదర్శనలోనూ పాల్గొంది.
మహాశివరాత్రి సందర్భంగా నేపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మోనాలిసా భోంస్లే(Monalisa Bhosle) పాల్గొంది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. వేదికపై మోనాలిసా నృత్య ప్రదర్శన ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో షేర్ చేశారు. ‘నేపాల్‌లోని మైలాపూర్‌లో మహాశివరాత్రి ఉత్సవాల్లో తన లైవ్ ప్రదర్శన’ అని మోనాలిసా భోంస్లే ఈ వీడియో కింద రాశారు.
ఈ వీడియో(Video)ను చూసిన యూజర్స్ తమ ప్రదిస్పందనలను తెలియజేస్తున్నారు. ఒక యూజర్ ‘చాలా బాగుంది. దీనినే కంటిన్యూ చేయండి’ అని రాయగా మరొకరు ‘చాలా బాగుంది మోనాలిసా.. విజయం నిన్ను ముద్దాడుతుంది’ అని రాశారు. ఇంకొక యూజర్ ‘అక్కకు ఇలాంటి సపోర్ట్ ఇవ్వాలి’ అని పేర్కొన్నారు. కాగా మోనాలిసా పాల్గొన్న ఈ కార్యక్రమంలో డైరెర్టర్ సనోజ్ మిశ్రా కూడా పాల్గొన్నారు. ఆయనే మోనాలిసాకు తొలి సినిమా అవకాశం ఇచ్చారు. ఈవెంట్ ప్రారంభానికి ముందు మోనాలిసా ‘అందరికీ ఐ లవ్యూ’ అంటూ తన నృత్యాన్ని ప్రదర్శించింది.
ఇది కూడా చదవండి: Chandrashekhar Azad: ‘నా పేరు ఆజాద్.. స్వాతంత్ర్యం నా తండ్రి’