Dance Performance
-
లీలా వినోదం..
ఎప్పటిలానే మన గ్లామర్ సిటీ నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో నిర్వహించనున్న ఇయర్ ఎండ్ వేడుకలకు వేదికలు రెడీ అయ్యాయి. ఇందులో లైవ్ మ్యూజిక్ సెటప్‌లు, సెలిబ్రిటీ గెస్టులు వంటి ఇతర వినోద కార్యక్రమాలకు సన్నాహాలు మొదలయ్యాయి. నగర యువత ఈ వేడుకలను ఎక్కడెక్కడ చేసుకోవాలో ఇప్పటి నుంచే ప్లాన్లు చేసుకోవడం మొదలుపెట్టేశారు. ఇప్పటికే పలువురు బుక్ మై షోలో పాస్‌లు రిజిష్టర్ చేసేసుకున్నారు. వీరి ఆసక్తి, ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే నిర్వాహకులు సైతం తమ ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో దీని గురించిన మరిన్ని విశేషాలు.. ఇప్పటికే నగరంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు, ప్రస్తుత సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు యువత సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కొన్ని థీమ్స్‌ను సైతం సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు పలువురు ఈవెంట్ ఆర్గనైజర్లు. ముఖ్యంగా సినీ తారలు, ప్రముఖ సింగర్స్, డ్యాన్సర్స్.. ఎవరు ఎక్కడ హాజరవుతున్నారనే సమాచారాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి ఢిల్లీ, ముంబయి తదితర ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న డీజే స్పెషలిస్టులు, లైవ్ మ్యూజిక్ స్పెషలిస్టులు వారి ప్రోమోలను వదులుతున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలో లైవ్ బ్యాండ్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. ఈ ఈవెంట్లకు బుకింగ్స్ ప్రారంభం కావడమే కాదు కొన్నింటికి ఇప్పటికే సోల్డ్ ఔట్ బోర్డులు పెట్టడం విశేషం. స్టార్ గ్లామర్ ఈవెంట్స్.. వేడుకలు ఏవైనా సరే... అందులో గ్లామర్ ఉంటేనే వినోదమైనా, ఉల్లాసమైనా. ఈ నేపథ్యంలో ఇయర్ ఎండ్ వేడుకల నిర్వహణలో సెలిబ్రిటీలను భాగం చేస్తున్నారు నిర్వాహకులు. సాధారణంగా ఇటువంటి ఈవెంట్స్‌లో సినీతారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో భాగంగానే నగరంలో పలు వేదికల్లో గ్రాండ్‌గా నిర్వహించే లైవ్‌మ్యూజిక్ కాన్సర్ట్‌లు, పబ్, రిసార్ట్, ఓపెన్ ఏరియా ఈవెంట్లలో పలువురు సినీతారలు, సింగర్లు తళుక్కున మెరవనున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ప్రముఖ నటి శ్రీలీల, గాయకులు సునీత, రాకింగ్ సింగర్ రామ్ మిరియాల, తదితర టాలీవుడ్, బాలీవుడ్ సింగర్స్ నగరంలో ప్రేక్షకులకు తమ గాత్రంతో అలరించనున్నారు. డీజేల సందడి.. నూతన సంవత్సర వేడుకలకు సినిమా గ్లామర్ తోడైతే ఆ కిక్కేవేరబ్బా అంటోంది నగర యువత. తమకు నచి్చన భాష, హీరోల సినిమా పాటలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి అంటూ సామాజిక మాధ్యమాల్లో శోధిస్తున్నారు. తెలుగు లైవ్ కాన్సర్ట్స్‌కు ఎక్కువ మంది మొగ్గుచూపుతుండగా, ఉత్తర భారతం నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నవారు మాత్రం హిందీ, ఇంగ్లి‹Ùకార్యక్రమాలను కోరుకుంటున్నారు. దీంతో ఈవెంట్ నిర్వాహకులు సైతం అందుకు అనుగుణంగానే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో నిపుణులైన డీజే ఆర్టిస్టులకు డిమాండ్ నెలకొంది. సాయంత్రం 8 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు.‘నై’ వేడుకల్లో శ్రీలీల... సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నిర్వహించనున్న ఇయర్ ఎండ్ వేడుకలకు అప్పుడే గ్లామర్ వచ్చేసింది. ఆల్వేస్ ఈవెంట్స్, ఎస్వీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 31న నగరంలోని నోవోటెల్ వేదికగా నిర్వహించనున్న నై (ఎన్‌వైఈ) 2025 వేడుకల్లో టాలీవుడ్ గ్లామర్ క్వీన్ శ్రీలీల తన స్టెప్పులతో అలరించనున్నారు. ఈ ఈవెంట్ పోస్టర్‌ను శుక్రవారం నోవాటెల్ వేదికగా ఆవిష్కరించారు. ఇందులో ప్రముఖ యాంకర్ రవి, నటి సౌమ్య జాను పాల్గొని సందడి చేశారు. నిర్వాహకులు సుమంత్ మాట్లాడుతూ.. బాలీవుడ్ లైవ్ మ్యూజిక్, కలర్‌ఫుల్ వేదికతో పాటు టాప్ మోడల్స్‌తో నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోతో నై (ఎన్‌వైఈ) 2025 వేదిక కానుందన్నారు. నిరావల్ లైవ్ బ్యాండ్ నగరానికి ప్రత్యేకంగా రానుందని, వేడుకల్లో ప్రముఖ సినీతార శ్రీలీల పాల్గొని అలరించనున్నారని తెలిపారు. ప్రత్యేకమైన ఎస్ఎఫ్ఎక్స్ ప్రదర్శనలతో, న్యూ ఇయర్ కౌంట్ డౌన్‌తో పాటు విభిన్న రుచుల ఆహారం, ప్రీమియం డ్రింక్స్, టాటూ, ఫొటో బూత్‌లు అందుబాటులో ఉంటాయని సహ నిర్వాహకులు వినోద్ పేర్కొన్నారు. అంతేకాకుండా పలువురు సెలిబ్రిటీలు ఇందులో భాగం కానున్నారని అన్నారు. నగరంలో పలు కార్యక్రమాలు..⇒ హెచ్ఐసీసీ నోవోటెల్లో నూతన సంవత్సర వేడుకలకు ప్రముఖ సినీ నటి శ్రీలీల హాజరుకానున్నారు. లైవ్ బ్యాండ్, డ్యాన్స్, బాలీవుడ్ డీజే, మ్యాజిక్‌షో, కిడ్స్ జోన్, ఫ్యాషన్ షో, తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ‘న్యూ ఇయర్ ఈవ్’ పేరిట రాత్రి 8 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇంగ్లిష్, తెలుగు, హిందీ పాటలు ఉంటాయి. ⇒ ప్రిజమ్ క్లబ్ అండ్ కిచెన్‌లో రామ్ మిరియాల బ్యాండ్ అమృతం ‘ది ప్రిజమ్ సర్కస్ 4.0’ కార్యక్రమన్ని ఏర్పాటు చేస్తున్నారు. ⇒ ఎల్బి నగర్ ఇండోర్ స్టేడియంలో యూబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యాండ్ కాప్రిసియోని ప్రత్యక్షంగా ప్రదర్శిస్తుంది. సంగీతం, ఎనర్జీ, ఉత్సాహంతో కూడిన విద్యుత్ వెలుగుల్లో నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. చార్ట్–టాపింగ్ హిట్లు, హై–ఎనర్జీ పెర్ఫార్మెన్స్ల మిక్సింగ్ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ⇒ బోల్డర్ హిల్స్‌లోని ప్రిజమ్ ఔట్ డోర్స్‌లో ప్రముఖ సింగర్స్ కార్తీక్, సునీత హాజరవుతున్నారు. ⇒ హైటెక్స్ ఎరీనాలో హైదరాబాద్ బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బాష్ 2025 (ఓపెన్ ఎయిర్) కార్యక్రమానికి నేహ ఆర్ గుప్తా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. -
స్ట్రీట్‌లో స్టెప్పులు.. నిరసన నిప్పులు
స్త్రీ అమ్మ... అన్యాయం జరిగితే ఆదిపరాశక్తి.స్త్రీ భూదేవి... సహనం కోల్పోతే అపరకాళి.ఈ జగత్తును తల్లిలా ఆదరించే ప్రతి స్త్రీ ఈ జగత్తులో తానొక భాగం అనుకుంటుంది. తనకు గౌరవప్రదమైన ఉనికి కోరుకుంటుంది. కానీ, మనుషులు ఘోరంగా వ్యవహరించి ఆమె విశ్వాసాన్ని ధ్వంసం చేస్తుంటారు. ఆమె సహనాన్ని పరీక్షిస్తుంటారు. కోల్‌కతాలో డాక్టర్‌పై జరిగిన ఘోరకలి ఈ దేశంలో ప్రతి స్త్రీని భద్రకాళిని చేసింది. ఆ సమయంలో ఎగసిన నిరసనల్లో కోల్‌కతా వీధుల్లో ఉగ్రతాండవం చేసింది మోక్షా సేన్ గుప్తా. ‘సాక్షి’తో ఆమె మాట్లాడింది.‘‘సమాజంలోని చీడపురుగులకు చికిత్స చేయాలి. లేకపోతే వైద్యులనే కబళించేస్తాయి. చికిత్స ఎంత తీవ్రంగా ఉంటే సమాజానికి అంత మేలు’’ అంటున్నారు మోక్షా సేన్ గుప్తా. కోల్‌కతా డాక్టర్‌పై హత్యాచారానికి నిరసనగా మోక్షా సేన్ గుప్తా స్ట్రీట్ డ్యాన్స్‌తో పాటు ఇంకా పలు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ‘అలనాటి రామచంద్రుడు’తో తెలుగు తెరపై కనిపించిన ఆమె త్వరలో విడుదల కానున్న ‘రామం రాఘవం’లోనూ నటించారు. బెంగాలీ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. ఇక ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోక్షా సేన్ గుప్తా చెప్పిన విషయాలు.→ వీధుల్లో కళా ప్రదర్శన మా సంస్కృతివీధుల్లో కళా ప్రదర్శన అనేది చాలా సంవత్సరాల నుండి వస్తున్న మా బెంగాల్ సంస్కృతి. వర్జీనియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు విభజనకు ముందు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో బెంగాల్ కూడా రాజధానిగా ఉండేది. మన పూర్వీకులు వీధి కళ, వీధి నాటకం, వీధి నృత్యం, వీధి పాటల ద్వారా వీధి ప్రదర్శనలు చేసేవారు. దర్శకుడు సత్యజిత్ రే ఏదైనా సమస్య అంటే బెంగాలీలు అందరూ ఎలా ఒక్కటవుతారో కూడా తన సినిమాల్లో చూపించారు. మన స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో బెంగాలీ స్వాతంత్య్ర సమరయోధులు వీధుల్లోకి వచ్చి, నిరసనలు చేశారు. నా రాష్ట్రం, నా కుటుంబం నేర్పిన, పెంపకం నుంచి నాకు సామాజిక బాధ్యత వచ్చింది. పూరీ్వకులు చేసిన నిరసనలే నాకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే కోల్‌కతా వైద్యురాలి హత్యాచారానికి నిరసనగా వీధుల్లో కళా ప్రదర్శనలు చేశాను. → సత్యం కోసం... కవి ఖాజీ నజ్రుల్ ఇస్లాం స్వాతంత్య్ర సమయంలో తన కవితలు, పాటల ద్వారా బెంగాల్లో పునరుజ్జీవనం తేవడానికి ప్రయత్నించిన గొప్ప వ్యక్తి. ఆయన్ను నేతాజీ సుభాష్ చంద్రబో‹స్, స్వామి వివేకానంద వంటి మహానుభావులు స్ఫూర్తిగా తీసుకున్నారు. ఇక నేను వైద్యురాలి హత్యాచారానికి నిరసనగా కవి ఖాజీ నజ్రుల్ ఇస్లాం పాటను స్ఫూర్తిగా తీసుకున్నాను. నేను రామకృష్ణ పరమహంస ఆరాధకురాలిని. ఆ విధంగా మంచి కోసం నిలబడటం అనేది నా రక్తంలోనే ఉంది. ఏ కళాకారుడైనా... అది వీధి కళాకారుడైనా ‘సత్యమేవ జయతే’ అంటూ నిజం వైపు నిలబడే ధైర్యం ఆ ఆరి్టస్ట్కి ఉండాలి. నేను డ్యాన్స్ చేసిన పాట అర్థం కూడా దాదాపు ఇలానే ఉంటుంది. ‘ఒకవేళ నువ్వు చెరసాలలో ఉన్నట్లయితే నిజం కోసం గొంతు ఇవ్వడానికి ఆ చెరసాలను బద్దలు కొట్టి బయటకు రావాలి. సత్యం కోసం స్వరం వినిపించాలి’ అన్నట్లుగా ఆ పాట ఉంటుంది. → వ్యవస్థకి వ్యతిరేకంగా.. మృత్తిక అనే స్వచ్ఛంద సేవా సంస్థ, ఇంకా మరికొన్ని అలాంటి సంస్థలు అణగారిన స్త్రీలు, పిల్లల సంక్షేమం కోసం పని చేస్తుంటాయి. వారితో మేం కలిసి పని చేస్తాం. అభయ సంఘటన విషయంలో వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడే వైద్యులతో మేం నిలబడ్డాం. నేను మాత్రమే కాదు... ఎందరో కళాకారులు మాతో వీధుల్లోకి వచ్చారు. అభయ కుటుంబానికి, వైద్యుల కోసం, న్యాయం కోసం మేం అంతా ఉన్నామని చూపించడానికి నాట్యాన్ని ఎన్నుకున్నాం. మేం చేస్తున్న నిరసన కార్యక్రమాలు చాలామందిని ప్రభావితం చేస్తున్నాయని నమ్ముతున్నాను. → డ్యాన్స్ కాదు... నిరసన నేను చేసినది డ్యాన్స్ అని నాకనిపించలేదు. ఎందుకంటే సరైన కొరియోగ్రఫీ లేదు. నిజానికి నేను వేరొక నిరసన ప్రదర్శన నుండి నేరుగా అక్కడికి వెళ్లాను. ఓ 20, 25 కిలోమీటర్ల నిరసన కార్యక్రమం అది. ఆ నిరసన పూర్తయ్యాక అక్కడికి వెళ్లాను. ఒక బలమైన విషయాన్ని నృత్యరూపంలో చె΄్పాలనుకున్నప్పుడు సరైన వేదిక అక్కర్లేదు... కెమెరా, యాక్షన్, లైట్లు అవసరంలేదు. ఓ ఆరి్టస్ట్ సత్యం కోసం ఎక్కడ నిలబ డితే అదే పెద్ద వేదిక అవుతుంది. ఆ వేదిక సత్యం, న్యాయం కోసం మాత్రమే నిలబడే వేదిక అయితే చాలు... ముందస్తు ప్రిపరేషన్ లేకుండా చేసేయొచ్చు. → ఐక్యత కోసమే... పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని స్థానిక పార్టీ సమరి్థస్తోంది. అంటే... కొందరు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కౌన్సిలర్లు, స్థానికులు. నా డ్యాన్స్ గురించి కూడా చాలా అవమానకరంగా మాట్లాడారు. ఇది నిరసనా లేక మీరు రెచ్చగొడుతున్నారా? అన్నారు. అయితే ఇప్పుడు కామన్ మేన్ కూడా తన గొంతు విప్పడానికి సిద్ధమయ్యాడు. సో... ఎక్కడో చోట మొదలయ్యే నిరసనలు సాధారణ వ్యక్తులను ప్రభావితం చేసేందుకూ ఉపయోగపడతాయి. కొన్నేళ్లుగా బెంగాలీల మధ్య ఉన్న ఐక్యత కాస్త సన్నగిల్లింది. అభయ రూపంలో మళ్లీ ఆ ఐక్యతను తిరిగి తేగలిగాం. → తలో చేయీ వేద్దాం రాష్ట్ర ప్రభుత్వం 21 మంది లాయర్లను నియమించింది. వారికి వ్యతిరేకంగా డాక్టర్లు, అభయ కుటుంబం పోరాడుతోంది. ఎందరో పెద్దలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారిని ఎదిరించి పోరాడాలంటే ఆర్థిక బలం అవసరం. వెస్ట్ బెంగాల్ డాక్టర్స్ నిధిని సమకూర్చా లని అనుకుంటున్నారు. నా వంతుగా నేనూ ఫండ్ రైజ్ చేస్తున్నాను. 100 రూపాయలు కూడా మాకు ఎక్కువే. 50 మంది 100 రూపాయలు ఇస్తే... అదే పెద్ద మొత్తం అవుతుంది. అలా తలో చెయ్యీ వేసి, ముందుకొస్తే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే వీలుంటుంది. అభయ కేసుని ఓ ఉదాహరణగా నిలపగలిగితే ఇలాంటి వెయ్యి సమస్యలను అధిగమించగలం. ‘మేం భారతీయులమని చెప్పుకోవడానికి గర్వపడుతు న్నాం’ అని ప్రపంచానికి చెప్పగలుగుతాం.→ అవసరమైతే మళ్లీ డ్యాన్స్ మలయాళంలో నేను చేసిన ‘చిత్ని’ ఈ 27న రిలీజైంది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అలాగే తెలుగులో నా ఫస్ట్ మూవీ ‘అలనాటి రామచంద్రుడు’ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాని చూడనివాళ్లు ఓటీటీలో చూడాలని కోరుకుంటున్నాను. ఇలా నా సినిమా విషయా లను ఫోకస్ చేస్తూనే డిజిటల్‌గా బాధితుల పక్షాన వీలైనంతగా ప్రచారం చేస్తున్నాను. అవసరమైతే మళ్లీ ‘స్ట్రీట్ డ్యాన్స్’ చేస్తా. ఆ ప్రదర్శనతో ఐదు రూపాయలు లాంటి చిన్న మొత్తం వచ్చినా అది ‘అభయ క్లినిక్’కి, అది ఏర్పాటు చేసిన డాక్టర్లకు వెళుతుంది. ఎందుకంటే ఈ క్లినిక్ నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ఉపయోగపడాలన్నది మా ఆశయం. అందుకే సాయం చేయాలనుకునేవారు ఈ ఫోను నంబరు +91 6291485209 లేదా ఠీb్జunజీౌటఛీౌఛ్టిౌటటజటౌn్టఃజఝ్చజీ .ఛిౌఝ ని సంప్రదించాలని కోరుకుంటున్నాను’’ అని మోక్ష విజ్ఞప్తి చేశారు. పార్టీలకు తటస్థంగా ఉంటే కొన్ని ప్రశ్నలు లేవనెత్తలేం. అయితే ప్రశ్నలు వేస్తే మీరు ప్రతిపక్ష పార్టీ కేడర్ అని అర్థం... ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనల ప్రభావం నేనో కొత్త కల కనేలా చేశాయి. ‘మావన హక్కు’ల గురించి క్షుణ్ణంగా చదవాలన్నదే ఆ కల.అభయ అనేది అంతర్గతంగా, బాహ్యంగా నన్ను మార్చేసింది. ఇక ఇప్పుడు నేను దేని గురించీ పట్టించుకోను. ఎంత దూరం అయినా ఏ మార్గంలో అయినా వెళ్లగలను. ఇది ‘మోక్ష 2.ఓ’ వెర్షన్. ఈ మారిన మోక్ష డాక్లర్లకు సపోరి్టవ్గా ఉంది... న్యాయం పక్షాన ఉంటుంది. – డి.జి. భవాని -
Hyderabad: జర్నీ ఆఫ్ రిథమ్స్! ఈ నెల 31న ప్రత్యేక నాట్యప్రదర్శన..
సాక్షి, సిటీబ్యూరో: ‘అది ఒక రైల్వేస్టేషన్... పదహారు మంది నాట్యకారిణులు అందరూ ఒకే తరహా దుస్తులు, లగేజ్ ట్రాలీలతో ప్లాట్‌ఫాంపై సిద్ధంగా ఉన్నారు. రైలు ఎప్పుడు వస్తుందా.. అని ఎదురుచూస్తున్నారు. ఇంతలో రైలు ఆలస్యంగా వస్తుందని తెలవడంతో తమ పర్యటనలో భాగంగా ఏయే నగరాలను సందర్శించాలో చర్చించుకుంటున్నారు. ఆయా నగరాల్లో ప్రసిద్ధి చెందిన సంగీత రీతుల్లో భరతనాట్య ప్రదర్శన ఇవ్వాలని నిర్ణయించుకున్నారు..’ ఇంతకీ ఇది ఏ రైల్వేస్టేషన్లో జరిగిందనేకదా.. మీ అనుమానం!ఇది నిజంగా జరగలేదు కానీ.. ఇలాంటి థీమ్‌తో ఓ నాట్యప్రదర్శన ఈ నెల 31న సాయంత్రం 6.30 గంటలకు నగరంలోని గచ్చిబౌలి గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరగనుంది. భరతనాట్యాన్ని మాధ్యమంగా చేసుకుని దేశంలోని ముఖ్యమైన 16 సంగీత రీతులను ప్రయోగాత్మకంగా ప్రదర్శించనున్నారు. శివాన్‡్ష మ్యూజిక్ అకాడమీ, తత్వ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దాదాపు 1.45 గంటలపాటు ఈ నాట్య ప్రదర్శన నాన్‌స్టాప్‌గా సాగనుంది. ఈ ప్రయోగం కోసం 6 నెలలపాటు శ్రమించినట్లు శివాన్‡్ష అకాడమీ నిర్వాహకురాలు, భరతనాట్య కళాకారిణి మైత్రీరావు చెప్పారు. ‘జర్నీ ఆఫ్ రిథమ్స్’ పేరిట సాగే ఈ నాట్య ప్రదర్శనకు ప్రముఖ రంగస్థల నటి, కర్ణాటక జానపద అకాడమీ అధ్యక్షురాలు పద్మశ్రీ మంజమ్మ జోగతి హాజరుకానున్నారు. -
నాట్యవిలాసం..
రవీంద్ర భారతిలో అద్భుత నాట్య ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకున్న నృత్య రీతులు ప్రదర్శన ఎప్పటికీ మర్చిపోలేం: ఇంద్రాణీ సుగుమార్ ప్రేక్షకుల స్పందన చూసి ఆశ్చర్యపోయాం మలేసియా నాట్యబృందంతో ‘సాక్షి’ ప్రత్యేక సంభాషణ సాక్షి, సిటీబ్యూరో/గన్‌ఫౌండ్రీ: నెమలి నాట్యం ఎంత అందంగా ఉంటుందో.. వాళ్లు నృత్యం చేస్తే అంతకన్నా అద్భుతంగా ఉంటుంది. ఆ నెమలి సైతం అబ్బురపడేలా వారి ప్రదర్శన ఉంటుంది. అమ్మవారి వేషం వేసుకుంటే అమ్మవారే పూనినట్టు అనిపిస్తుంది. రాక్షస సంహార ఘట్టం ప్రదర్శన చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఎవరైనా సరే చేతులెత్తి నమస్కరించాల్సిందే. సాక్షాత్తూ అమ్మవారే భువి నుంచి దివికి దిగి వచ్చారా అన్నట్టు అనిపిస్తుంది. ఇటీవల మలేసియా నుంచి హైదరాబాద్ వచ్చి పలు నృత్య రూపకాలను రవీంద్రభారతిలో ప్రదర్శించిన నాట్య బృందాన్ని ‘సాక్షి’పలకరించింది. ఇక్కడ వారి అనుభవాల గురించి అడిగి తెలుసుకుంది. కళ్లు చెమర్చాయి... రవీంద్ర భారతిలో మలేసియా సంప్రదాయ నృత్యమైన నెమలి నృత్యం, కళింగ అమ్మాళ్ నృత్య రూపకాలను ప్రదర్శించామని బృందానికి ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ ఇంద్రాణీ సుగుమార్ వివరించారు. మొత్తం పది మంది బృందంతో ఇచి్చన అమ్మాళ్ నృత్య ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచి్చందని తెలిపారు. రాక్షస సంహారం అనంతరం ప్రేక్షకులు కొట్టిన చప్పట్లు ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పారు. అనేక దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చామని, ఇలాంటి స్పందన ఎక్కడా చూడలేదని, ఇక్కడివారి ప్రేమాభిమానాలకు మంత్ర ముగ్ధులమయ్యామని చెప్పారు. ఇక లైటింగ్, సౌండ్‌సిస్టమ్‌తో ప్రదర్శన చేస్తుంటే రోమాలు నిక్కబొడిచాయని, అంత అద్భుతంగా స్టేజీని అలంకరించారని చెప్పారు. ప్రదర్శన అనంతరం అమ్మవారి వేషధారణలో ఉన్న తమకు కొందరు నమస్కరించారని గుర్తు చేసుకున్నారు. ఆడవాళ్లకు చాలా సురక్షితమైన ప్రాంతం మహిళలకు హైదరాబాద్ ఎంతో సురక్షిత ప్రాంతంగా అనిపించిందని చెప్పారు. నిర్వాహకులు తమను ఎంతో బాగా చూసుకున్నారన్నారు. ఇక్కడి ఆతిథ్యం ఎంతో బాగుందని వివరించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారని పేర్కొన్నారు. తొలిసారి హైదరాబాద్‌లో నృత్య ప్రదర్శన ఇచ్చామని, మరోసారి అవకాశం వస్తే ప్రదర్శన చేయాలని ఉందని చెప్పారు. హైదరాబాద్ బిర్యానీ బాగుంది.. చార్మినార్‌ను సందర్శించామని, ఇక, హైదరాబాద్ బిర్యానీ ఎంతో రుచికరంగా ఉందని, అక్కడికి వెళ్లాక చాలా మిస్ అవుతామన్నారు. ఇరానీ చాయ్ కూడా టేస్టీగా ఉందని చెప్పారు. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నామని వివరించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఎంతో మర్యాదగా మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారని తెలిపారు.దేశవిదేశాల్లో ప్రదర్శనలు.. ఏపీలోని వైజాగ్‌తో పాటు తమిళనాడులోని చిదంబరం దేవాలయం, పుదుచ్చేరిలో ప్రదర్శనలు ఇచ్చామని, చిదంబరంలో 2019లో తాము ప్రదర్శించిన చిదంబరేశ నాట్య కలైమణి ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిందని చెప్పుకొచ్చారు. దక్షిణాఫ్రికాలోని పలు ప్రాంతాల్లో ‘కల్చరల్ ఎక్సే్చంజ్ ప్రోగ్రామ్’ కింద అనేక ప్రదర్శనలు ఇచ్చామని తెలిపారు. మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్, మారిషస్‌లోని అనేక ప్రాంతాల్లో నృత్య ప్రదర్శన చేస్తుంటామని చెప్పారు. ముఖ్యంగా నవరాత్రుల సందర్భంగా తాము ప్రదర్శనలు ఇస్తుంటామని తెలిపారు. మలేసియాలోని కౌలాలంపూర్ వద్ద ఇంద్రాణీ డ్యాన్స్ అకాడమీ నెలకొల్పి, ఆసక్తి ఉన్న వారికి నృత్యం నేరి్పస్తానని తెలిపారు. భరత నాట్యంలో తాను నిష్ణాతురాలినని, అయితే భరత నాట్యంతో పాటు ఒడిస్సీ కూడా విద్యార్థులకు నేరి్పస్తానని వివరించారు. -
డెబ్బై మూడేళ్ల బామ్మ... మాధురితో పోటీపడి డ్యాన్స్ చేసింది!
‘డ్యాన్స్ వయసు ఎరగదు’ అనే సామెత ఉందో లేదోగాని ఈ వీడియో చూస్తే ‘నిజమే సుమీ’ అనిపిస్తుంది. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘డ్యాన్స్ దివానే’లో 73 సంవత్సరాల బామ్మ డ్యాన్స్ వైరల్ అయింది. ఛోబీ అనే బామ్మ ‘దేవదాస్’ సినిమాలోని మాధురి దీక్షిత్ పాపులర్ పాట ‘మార్ డాలా’కు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. రియాల్టీ షో జడ్జీలు మాధురి దీక్షిత్, సునీల్షెట్టీలకు ఛోబీ డ్యాన్స్ బాగా నచ్చింది. ‘మనసులో ఏది అనిపిస్తే అది చేయాలి. భయం అవసరం లేదు... అని మీరు మాకు చెబుతున్నట్లుగా ఉంది’ అని బామ్మను ప్రశంసించింది మాధురి. ఆ తరువాత బామ్మతో కలిసి మాధురి దీక్షిత్ డ్యాన్స్ చేసింది. ‘మాధురి అంటే డ్యాన్స్‌కు మరో పేరు. ఆమె పాపులర్ పాటకు డ్యాన్స్ చేయాలంటే సాహసం మాత్రమే కాదు. ప్రతిభ కూడా ఉండాలి. ప్రతిభ, సాహసం మూర్తీభవించిన ఛోబీజీకి అభినందనలు’. ‘మాధురితో పోటీపడి డ్యాన్స్ చేయడం మామూలు విషయం కాదు’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో సోషల్ మీడియాలో కనిపించాయి. -
అద్బుతమైన డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేసిన నీతా అంబానీ (ఫోటోలు)
-
ఏపీ సీఎం జగన్ పై మంగ్లీ పాటకు పాఠశాల విద్యార్థులు డ్యాన్స్ చేశారు
-
అలరించిన నారాయణి గాయత్రి నృత్య ప్రదర్శన
ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య, భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రోత్సహించడానికి, ప్రతిభావంతులైన కళాకారులు ప్రదర్శించడానికి వేదికను అందించడం అనే అంకితభావనతో సేవలను అందిస్తున్న సంస్థ. దాదాపు రెండు దశాబ్దాలుగా, హాంగ్ కాంగ్ లో భారతీయ సంస్కృతిని చురుకుగా ప్రచారం చేస్తోంది. భారతదేశంలోని విభిన్న కళారూపాలను ప్రదర్శించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వారి ప్రయత్నాలు భారతీయ సంప్రదాయాలను పరిరక్షించడంలో మాత్రమే కాకుండా హాంగ్ కాంగ్ లోని భారతీయ ప్రవాసులలో సమైఖ్యత - సమ భావాన్ని సృష్టించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.ఇటీవల, వారధి ఫౌండేషన్ (హైదరాబాద్) మరియు శ్రుతిలయ కేంద్ర నటరాజలయ (హైదరాబాద్) వారి సహకారంతో హాంగ్ కాంగ్ లో “మార్గం” అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. శాస్త్రీయ నృత్యం భరతనాట్యం మరియు కర్ణాటక సంగీతంలో రాణిస్తున్న యువ కళాకారిణి నారాయణి గాయత్రి ఈయుణ్ణి సోలో రిసైటల్ ఏర్పాటు చేసారు . హాంగ్ కాంగ్ నివాసులైన శ్రీ.రాజీవ్ ఈయుణ్ణి మరియు శ్రీమతి.అపర్ణ కంద దంపతుల కుమార్తె గాయత్రి ఈయుణ్ణి. గురు కలైమామణి డా.రాజేశ్వరి సాయినాథ్ గారి శిష్యరికంలో ఇటీవలే ఆగస్టు 2023లో హైదరాబాద్ లో తన ఆరంగేట్రం చేసి అందరి మన్ననలు పొందింది. ఆమె సాధించిన ఆరంగేట్ర విజయాన్ని పురస్కరించుకుని, హాంగ్‌కాంగ్‌లోని లాంటౌ ద్వీపంలో తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్లో 6 జనవరి 2024న నృత్య ప్రియులకు, ఆమె ఆరంగేత్రం నుండి కొన్నిఅంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాంగ్ కాంగ్ & మకావులోని భారత కాన్సుల్ జనరల్ హాజరై, ప్రారంభోత్సవం చేశారు, వారు గాయత్రి మరియు ఆమె తల్లిదండ్రులను శాస్త్రీయ కళారూప సంస్కృతిని కొనసాగించడాన్నిఅభినందించారు మరియు గాయత్రికి ప్రశంసా పత్రాన్ని అందించి ప్రశంసించారు. హాంగ్ కాంగ్‌లోని వివిధ శాస్త్రీయ నృత్య-సంగీత గురువులు కూడా హాజరయ్యారు. దీప ప్రజ్వలన తరువాత, గాయత్రి కర్ణాటక సంగీతంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఆమె శ్రావ్యమైన స్వరం ప్రేక్షకులను విస్మయానికి గురి చేసింది. గాయత్రి తల్లి శ్రీమత అపర్ణ, ప్రతి నాట్య అంశాన్ని లయబద్ధంగా వివరిస్తూ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గాయత్రి తన అందమైన సాంప్రదాయ భరతనాట్య వేషధారణలో సంప్రదాయ ఆవాహనతో ప్రారంభిన్చింది. పుష్పాంజలి, అల్లారిపు, దేవీ స్తుతి, ముద్దుగారే యశోధ, తిల్లానా, మరియు మంగళం వంటి అభినయ అంశాలని అద్భుతంగా ప్రదర్శిస్తూ.. చక్కని హావ భావాలతో అందరిని ఆకట్టుకుంది. ఆమె మనోహరమైన కదలికలు మరియు వ్యక్తీకరణలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఆమె ప్రతిభ మరియు ఆమెకు కళ పట్ల గల అంకితభావం ఆమె నృత్యంలో స్పష్టంగా కనిపించాయి, అలా ఆమె ప్రేక్షకుల నుండి అనేక ప్రశంసలను అందుకుంది. గాయత్రి అభినయ చాతుర్యం, ఆమె కృషి మరియు అంకితభావం ఈ తరం యువతకి చక్కని నిదర్శనం. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు ఉస్తాద్ ఘులాం సిరాజ్, కథక్ గురువులు నీశ ఝవేరి, శ్వేత రాజ్ పుట్, భరతనాట్యం గురువు సంధ్య గోపాల్, మోహినియాట్టం గురు దివ్య అరుణ్, మృదంగం కళాకారుడు అరవింద్ జేగాన్ పాల్గొన్నారు . ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి స్పందిస్తూ, మనోహరంగా సాగిన “మార్గం” లో నారాయణి గాయత్రి ఈయుణ్ణి ప్రదర్శన ద్వారా భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడానికి, తమ సమాఖ్య లక్ష్యం యొక్క నిజమైన ప్రతిబింబంమని .. గాయత్రి వంటి వర్ధమాన కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, భారతీయ సంప్రదాయాలు - సంస్కృతిని అనుసరించడానికి ఇతరులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం సరైన వేదిక యని అందుకు తమ సమాఖ్య సదా సిద్ధమే అన్నారు. -
మాస్ స్టెప్పులతో అదరగొట్టిన కేటీఆర్, కవిత
-
దుర్గా మండపంలో అమెరికా రాయబారి గార్సెట్టి డ్యాన్స్
న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఆదివారం హల్చల్ చేశారు. ఢిల్లీలోని సీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన దుర్గా మండపానికి వెళ్లిన ఆయన..సంప్రదాయ ధునుచి డ్యాన్స్ చేసి, అందరినీ వినోద పరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోను గార్సెట్టి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. బెంగాలీ స్ట్రీట్ ఫుడ్ ఝల్మురితోపాటు కొన్ని రకాల బెంగాలీ స్వీట్లను రుచి చూసిన ఆయన ‘ధునుచి నాచ్’లో పాల్గొన్నారు. ఉత్సవంలో పాలుపంచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ అందులో పేర్కొన్నారు. దుర్గా మాత మండపాల్లో సాధారణంగా చేసే నాట్యాన్ని ధునుచి నాచ్ అని పిలుస్తుంటారు. దేవతకు హారతి ఇచ్చేందుకు వాడే మట్టి పాత్రనే ధునుచి అంటారు. -
Srushti Sudhir Jagtap: రికార్డు సృష్టించింది!
సాధించాలంటే కఠోర సాధన ఉండాలి. అంతకు మించిన అంకితభావం ఉండాలి. ఈ రెండూ ఉంటే రికార్డు సాధనకు వయసు అనేది ప్రధానం కాదని నిరూపించింది సృష్టి సుధీర్ జగ్తాప్. పదహారేళ్ల సృష్టి విరామం లేకుండా 127 గంటల సేపు నాట్యం చేసి లాంగెస్ట్ డాన్స్ మారథాన్ (ఇండివిడ్యుయల్ కేటగిరీ)లో గిన్నిస్ రికార్డు సాధించింది. మహారాష్ట్రలోని లాతూర్‌కి చెందిన సృష్టి... లాతూర్‌లోని పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోంది. ఆమె అమ్మానాన్న సుధీర్, సంజీవని ఇద్దరూ టీచర్లు. వాళ్ల తాతగారు ‘బాబన్ మనే’ స్వయానా నాట్యగురువు. సృష్టికి చిన్నప్పటి నుంచి నాట్యసాధన అలవాటయింది. కానీ ఆమెకు రికార్డు కోసం నాట్యం చేయాలనే ఆకాంక్షకు కారణం బందనా నేపాల్. ఆమె 2018లో 126 గంటల సేపు నాట్యం చేసి లాంగెస్ట్ డాన్స్ మారథాన్‌లో గిన్నిస్ రికార్డు సాధించింది. అప్పుడు ‘భారతీయ నాట్యరీతులు లెక్కలేనన్ని ఉన్నాయి. మన నాట్యరీతికి ఓ రికార్డు ఉంటే బావుణ్ను. ఆ రికార్డు ద్వారా ప్రపంచదేశాలకు మన శాస్త్రీయ నాట్యం గురించి తెలుస్తుంది’... అనే ఆలోచన సృష్టిలో రేకెత్తింది. ఆమె ఆలోచనకు తల్లిదండ్రులు, తాత అండగా నిలిచారు. గిన్నిస్ రికార్డు కోసం కథక్ నాట్య సాధన చేయాలనుకుంది. తాత పర్యవేక్షణలో 15 నెలల పాటు కఠోరసాధన చేసింది. ధ్యానంలో యోగనిద్ర కూడా సాధన చేయించారు బాబన్ మనే. రోజుకు నాలుగు గంటల సేపు ధ్యానం, మూడు గంటల సేపు వ్యాయామం, ఆరు గంటల సేపు నాట్యసాధన... ఇదీ రికార్డు కోసం ఆమె చేసిన దీక్ష. గంటకు ఐదు నిమిషాల విరామం సృష్టి 127 గంటల నాట్య ప్రద్శన మే నెల 29వ తేదీన పోదార్ స్కూల్ వేదిక మీద మొదలైంది. నాట్యప్రదర్శన ఐదు రోజుల పాటు నిర్విరామంగా సాగింది. ఆహారం అందక దేహం నీరసించి, డీహైడ్రేషన్‌కు లోను కాకుండా ఉండడానికి గంటకోసారి ఐదు నిమిషాల సేపు విరామం తీసుకునేది. ఆ విరామంలో ఎనర్జీ డ్రింక్ తీసుకుంటూ తన నాట్యదీక్షను కొనసాగించింది. సృష్టి నాట్యం చేసినంత సేపూ ఆమె తల్లిదండ్రులు వేదిక పక్కనే ఉండి ఆమెకు కావలసినవి అందిస్తూ వచ్చారు. నాట్య ప్రదర్శనను వీక్షించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి స్వప్నిల్ దంగారికర్ సర్టిఫికేట్ ప్రదానం చేస్తూ సృష్టిని ప్రశంసల్లో ముంచెత్తారు. ‘‘రికార్డు సాధనలో నా లక్ష్యం నెరవేరింది. ఐదు రోజుల ఐదు గంటల పాటు (విరామంతో కలిపి దాదాపు ఆరు రోజులు) సాగిన నాట్య ప్రదర్శన మధ్యలో అప్పుడప్పుడూ తల, శరీరం తూలిపోతున్న భావన కలిగాయి. నా లక్ష్యం 127 గంటలను పూర్తి చేయడం. లాంగెస్ట్ డాన్స్ మారథాన్‌లో ఇండియాకు రికార్డు సాధించడం. దేహం నిస్సత్తువతో ఇకచాలనే సంకేతాలు జారీ చేసినప్పుడు నా లక్ష్యాన్ని గుర్తు చేసుకుని క్షణాల్లో నన్ను నేను సంబాళించుకున్నాను. మానసికంగా స్థిరంగా ఉంటే దేహం కూడా సహకరిస్తుంది’ అన్నది పదహారేళ్ల సృష్టి. -
డాక్టర్ గారు డ్యాన్స్ చేశారు!
పని ఒత్తిడిలో ఉన్న వారికి హాబీలే రిలాక్సేషన్. కర్నాటకలోని మంగళూరుకు చెందిన దర్శిని రేష్మా ప్రదీప్ డాక్టర్ కావాలనుకొని డ్యాన్సర్ కాలేదు. డాక్టర్ కావాలనుకున్న కలను నిజం చేసుకున్న దర్శిని ఎంత బిజీగా ఉన్నాసరే, తనలోని ‘నృత్యకళ’ను కాపాడుకుంటోంది. పని ఒత్తిడి నుంచి బయటపడడానికి, మనసు తేలిక చేసుకోవడానికి ఆమె అనుసరించే మార్గం.. డ్యాన్స్. షారుక్‌ఖాన్ హీరోగా చేసిన ‘రా.వన్’ సినిమాలోని పాపులర్ సాంగ్ ‘చెమ్మక్ చెల్లో’ పాటకు ఆమె చేసిన డ్యాన్స్ వీడియో క్లిప్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ‘ఐ లవ్ దిస్ పార్ట్ ఆఫ్ ది సాంగ్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోక్లిప్ 2.5 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘చెమ్మకు చెల్లో’ సాంగ్ సంగతి ఎలా ఉన్నా... దర్శిని డ్యాన్స్ స్టెప్పులను చూస్తుంటే మన ‘ఇంద్ర’ సినిమాలోని ‘దాయి దాయి దామ్మా కులికే కుందనాలబొమ్మ’ వీణ స్టెప్పులు గుర్తుకొస్తున్నాయి. ‘గుడ్ డ్యాన్సింగ్’ ‘వాట్ ఏ లవ్లీ డ్యాన్స్’... మొదలైన కామెంట్స్‌తో స్పందించారు నెటిజనులు. -
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నాట్యం చేసిన మంత్రి రోజా
-
సంగీతానికి సరిహద్దులు లేవోయి!
దేశానికి సరిహద్దులు ఉండొచ్చుగానీ సంగీతానికి ఉండవు అని మరోసారి గుర్తు చేసిన ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ అవుతూ ‘ఆహా’ అనిపిస్తోంది. విషయం ఏమనగా... భారతీయ యువతి ఒకరు లండన్‌లోని బిగ్‌బెన్(గ్రేట్ బెల్ ఆఫ్ ది గ్రేట్ క్లాక్ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్)కు సమీపంలో బాలీవుడ్ సినిమా ‘క్వీన్’లోని ‘లండన్ తుమ్ఖడా’ పాటకు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల జనాలు గుంపులుగా చేరి ఆ డాన్స్‌ను ఆసక్తితో చూడడం మొదలుపెట్టారు. సీన్ ఇదే అయితే ఈ సీన్ గురించి చెప్పడానికి అంత సీన్ ఉండేది కాదు. అయితే హిందీ భాషలో ఒక్క ముక్క కూడా అర్థం కాని ఆ జనాలు యువతితో పాటు డ్యాన్స్ చేయడం కోసం కాలు కదపడమే విషయం. . ‘ఇలాంటి దృశ్యాన్ని లండన్‌లో మాత్రమే చూడగలం’ అనే కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. -
కాంతార 'భూత కోల' చేస్తూ.. కుప్పకూలిన కళాకారుడు.. వీడియో వైరల్..
బెంగళూరు: కర్ణాటక ప్రాచీన నృత కళారూపం భూత కోల. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన కాంతారా సినిమాతో ఈ నృత్య వేడుక మరింత పాపులరైంది. అయితే భూత కోల చేస్తూ ఓ కళాకారుడు ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గ్రామస్థుల ముందు ప్రదర్శన చేస్తున్న అతడు సడన్‌గా కిందపడిపోయాడు. అక్కడున్నవారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుని గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దక్షిణ కన్నడ జిల్లా కదాబా తాలూకా ఎడమంగల గ్రామానికి చెందిన ఈ భూత కోల కళాకారుడి పేరు కాంతు అజిల. వయసు 59 ఏళ్లు. చాలా సంవత్సరాలుగా నృత్య కళతో జనాల్ని అలరిస్తున్న ఇతనికి దైవ నర్తకుడిగా మంచి గుర్తింపు ఉంది. అయితే కాంతు ఒక్కసారిగా కుప్పకూలిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. గ్రామస్థులు మాత్రం గుండెపోటు వల్లే అతను మరణించి ఉంటాడని భావిస్తున్నారు. కాంతు నృత్య ప్రదర్శన చేసే సమయంలో గ్రామస్థుడు ఒకరు మొబైల్లో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
భూత కోల వేడుకలో విషాదం.. నృత్యం చేస్తూ కుప్పకూలిన కళాకారుడు
-
దేశంలో ప్రశ్నించే పరిస్థితి లేదు
హనుమకొండ: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన రామప్ప ఆలయ సన్నిధిలో రామప్ప ఉత్సవాల నిర్వహణకు కేంద్రం అనుమతివ్వకపోవడం బాధాకరమని ప్రముఖ నృత్యకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మల్లికా సారాభాయి అన్నారు. శనివారం హనుమకొండలో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు బీవీ పాపారావుతో కలసి ఆమె విలేకరులతో మాట్లాడారు. శివుడికి ప్రీతిపాత్రమైన అభినయాన్ని శక్తి స్థలమైన రామప్పలో చేయాలని నిర్ణయించుకున్నానని, కానీ దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భావ వైరుధ్యాలను కళలకు ఆపాదించడం సమంజసం కాదన్నారు. రాజకీయంగా అభద్రత ఉన్న వారి కారణంగా దేశంలో ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అయితే భారత్ ప్రజాస్వామ్య దేశమని, ప్రశ్నించడం సగటు భారతీయుడి డీఎన్ఏలోనే ఉన్నదని పేర్కొన్నారు. వేదాల్లోంచే ఇది వచ్చిందన్నారు. అందుకే ప్రశ్నలు కొనసాగుతుంటాయని, తాను ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత మొదటిసారి ఇక్కడ నృత్య ప్రదర్శన చేయాలని అనుకున్నానన్నారు. రామప్ప ఆలయం ఆవరణలో ప్రదర్శన రద్దయినా, వెంటనే హనుమకొండలో ప్రదర్శనను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లను తాను వ్యతిరేకించానని, బాధ్యత కలిగిన పౌరురాలిగా గుజరాత్ అల్లర్లకు అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, పోలీసులు, ప్రభుత్వందే బాధ్యత అని చెప్పడంతోపాటు సుప్రీంకోర్టుకు వెళ్లానని పేర్కొన్నారు. అప్పటినుంచి ఇప్పటి పాలకులతో విభేదిస్తూనే ఉన్నానని, అదే కొనసాగుతుందని అన్నారు. -
Video: కూచిపూడి డ్యాన్స్‌తో అలరించిన రిషి సునాక్ కూతురు
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూతురు అనౌష్క సునాక్ శుక్రవారం లండన్‌లో సంప్రదాయ నృత్యం కూచిపూడి ప్రదర్శన ఇచ్చింది. తొమ్మిదేళ్ల అనౌష్క కొంతకాలంగా కూచిపూడి నేర్చుకుంటోంది. ఈ క్రమంలో రేజ్- ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్ 2022లో భాగంగా పలువురు చిన్నారులతో కలిసి కూచిపూడి నృత్యంలో పాల్గొన్నారు. అనౌష్క చేసిన కూచిపూడి నృత్యం అందరిని ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా యూకేలో జరిగే డ్యాన్స్ ఈవెంట్స్‌లో ఇదే అతిపెద్దది. నాలుగు నుంచి 85 ఏళ్ల వయసున్న దాదాపు వందమంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగీత విద్వంసులు, డ్యాన్సర్స్, వీల్‌చెయిర్ నృత్యకారులు, పోలాండ్లోని నటరంగ్ గ్రూప్‌కు చెందిన అంతర్జాతీయ బర్సరీ విద్యార్థులు ఇందులో పాలుపంచుకున్నారు. ఈ డ్యాన్స్ ఈవెంట్‌కు రిషి సునక్ తల్లిదండ్రులతో పాటు అనౌష్క తల్లి అక్షతా మూర్తి హాజరయ్యారు. Watch: Rishi Sunak's Daughter Performs Kuchipudi At UK Event https://t.co/cTDhegSN9Y pic.twitter.com/IisEz55stc — NDTV (@ndtv) November 26, 2022 కాగా యూకే ప్రధాని పదవిని చేపట్టిన తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 42 ఏళ్ల రిషి బ్రిటన్ పగ్గాలు చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా అవతరించారు. ప్రధాని రిషి సునాక్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కృష్ణ, అనౌష్క. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూతురు అక్షతామూర్తిని రిషి పెళ్లి చేసుకున్నారు. చదవండి: బాక్సర్తో కలిసి మీసాలు తిప్పిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్ -
కనువిందు చేసిన కూచిపూడి నృత్యం
యాదగిరిగుట్ట: తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రంగారెడ్డి జిల్లా రాంపల్లిలోని సాంస్కృతిక విశ్వ కళామండలి, కళాచైతన్య వేదిక వ్యవస్థాపకుడు రాంనర్సయ్య ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన కూచిపూడి నృత్య ఉపా«ధ్యాయిని హవిష సమక్షంలో 50 మంది విద్యార్థులు ఆరు గంటలపాటు కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. యాదాద్రీశుడు, వెంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గమ్మ, భద్రాద్రి రామచంద్రస్వామి ఆలయాలకు సంబంధించిన పాటలకు నృత్యం చేశారు. అలాగే పేరిణి నాట్యం ప్రదర్శించి భళా అనిపించుకున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కూచిపూడి, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పేరిణి నృత్యాలు చేశారు. -
పచ్చటి కళ.. నేచర్ డ్యాన్స్
‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’ అనే మాటలో గ్యారెంటీ ఉందో లేదో తెలియదుగానీ చాలా చిన్నవయసులోనే సంగీత, నాట్యాలపై అభిమానాన్ని పెంచుకుంది సోహిని రాయ్ చౌదురి. నాన్న మంచి సంగీతకారుడు. ఇక నానమ్మ బొకుల్సేన్ గుప్త సంగీతంలో దిట్ట. కోల్‌కతాలోని ప్రసిద్ధ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ స్థాపకురాలు. రాగాల గొప్పదనం ఏమిటంటే... నేర్చుకుంటూ పోతే కొత్త లోకాలు ఆవిష్కరించబడతాయి. నృత్యాల గొప్పదనం ఏమిటంటే... చేస్తూ పోతే కొత్త ప్రపంచాలు చేరువవుతాయి. సంగీత సాహిత్య నృత్య ప్రపంచాల సంగతి సరే... భౌతిక ప్రపంచం సంగతేమిటి? పొగలు,సెగలు, కర్బన ఉద్గారాలు... భూమికి గాయాలు చేస్తున్నాయి. ‘ఈరోజు గడిస్తే చాలు’ అనుకునేవాళ్లు తప్ప రేపటి గురించి ఆలోచించేవాళ్లు అరుదైపోయారు. ఈ నేపథ్యంలోనే కళాకారుల బాధ్యత పెరుగుతుంది. నిజమైన కళాకారులు చేసే పని సృజనాత్మక ప్రపంచాన్ని, భౌతిక ప్రపంచంతో సమన్వయం చేయడం. ప్రస్తుతం అదే పని చేస్తుంది సోహిని. పర్యావరణ సంబంధిత అంశాలను నృత్యరూపకాలుగా మలిచి మన దేశంలోనే కాదు 14 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. తాజాగా కాప్ 26, గ్లాస్గోలో ‘నేచర్ అండ్ అజ్’ పేరుతో ఇచ్చిన నృత్యప్రదర్శన దేశదేశాల ప్రతినిధులను ఆకట్టుకుంది. సాంకేతిక విషయాలతోనే కాదు దేశీయ సాంస్కృతిక మూలాలతో కూడా పర్యావరణ స్పృహ కలిగించవచ్చని నిరూపించింది సోహిని. ఈ నృత్యప్రదర్శనలో ఆమె కుమారుడు రిషిదాస్ గుప్త గిటార్ ప్లే చేయడం విశేషం. ‘కాప్26 కేంద్రసిద్ధాంతాన్ని నృత్యం, సంగీతం, కథనం, వేదపాఠాల ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేశాను’ అంటుంది సోహినిరాయ్. ఆమె ప్రయత్నం విజయవంతమైందని చెప్పడానికి ‘నేచర్ అండ్ అజ్’కు ‘కాప్26’లో ప్రపంచ ప్రతినిధుల నుంచి లభించిన ప్రశంసలే గొప్ప నిదర్శనం. -
సంకేత్‌తో దీప్తి సునయన రొమాంటిక్ డ్యాన్స్.. స్పందించిన షణ్ముఖ్
సోషల్ మీడియాలో దీప్తి సునయన- షణ్ముఖ్ జశ్వంత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట డ్యాన్స్ వీడియోలతో బాగా పాపులర్ అయిన ఈ జంట ఆ తర్వాత డబ్స్మాష్, కవర్ సాంగ్స్ వీడియోలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆన్ స్క్రీన్ పెయిర్‌గానే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ వీరిద్దరి కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులున్నారు. అయితే బిగ్‌బాస్ సీజన్ 2లో పాల్గొన్న దీప్తిపై విపరీతమైన నెగిటివిటీ వచ్చిన సంగతి తెలిసిందే. హౌస్‌లోని మరో కంటెస్టెంట్‌తో ప్రేమాయణం నడుపుతుందంటూ వార్తలు హల్చల్ చేశాయి. దీంతో వీరిద్దరి బ్రేకప్ అయిపోయిందని, వీరి లవ్ కహానీకి శుభం కార్డు పడిందని వార్తలు వచ్చినా అవి కేవలం పుకార్లేనని చెబుతూ ఇద్దరూ కలిసి కొన్ని ఫోటో షూట్స్‌లోనూ కనిపించారు. తాజాగా దీప్తి సునయన ఓ ప్రముఖ డ్యాన్స్ షోలో పాల్గొంది. ఫినాలే ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్‌కు జోడీగా రొమాంటిక్ డ్యాన్స్ చేసింది. ఆమె చేసిన ఈ పర్ఫామెన్స్పై సోషల్ మీడియాలో నెటిజన్లు భగ్గుమన్నారు. దీప్తి సునయన ఇలా రెచ్చిపోయిందేంటి అంటూ దారుణంగా ట్రోల్స్ చేశారు. అంతేకాకుండా షణ్ముఖ్ ఫేమస్ డైలాగ్ అరె..ఏంట్రా ఇది అంటూ దీప్తిపై ట్రోల్స్, మీమ్స్ నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లతో లైవ్ చాట్ నిర్వహించిన షణ్ముక్‌కు నెటిజన్లు నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. దీప్తి డ్యాన్స్‌పై వచ్చిన ట్రోల్స్‌పై మీ రియాక్షన్ ఏంటి అని ఓ నెటిజన్ ప్రశ్నించగా..కొత్తగా ఏం అనిపించలేదు.. ఇంత కన్నా దారుణాలు తట్టుకున్న గుండె ఇది.. ఇవి అన్నీ ఎంత అంటూ తన స్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు. ప్రస్తుతం షణ్ముఖ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి : ఒకే ఇంట్లో షణ్ముఖ్-దీప్తి సునయన ఫోటోలు వైరల్ 'దీప్తి సునయన -షణ్ముఖ్ పెళ్లి అప్పుడే ఉండొచ్చు' -
వైరల్: వృద్ధుడి స్టెప్పులకు..నెటిజన్ల కళ్లు జిగేల్
ఆమ్స్టర్డామ్: మనిషికి అన్నింటికన్నా ముఖ్యమైనది తన ఉనికి. బతికినంత కాలం ఆరోగ్యంతో జీవించడం ప్రధానం. కానీ, ఆరోగ్యాన్ని ఎంతగా కాపాడుకున్నా ముసలితనం మాత్రం రాకమానదు. వయసుతోబాటు శరీరం పటుత్వం కోల్పోతుంది. ఎముకలు పలచబడతాయి. చర్మానికి సాగే గుణం తగ్గుతుంది. సహజంగా కృష్ణా!రామా! అంటూ కాలం వెళ్లదీస్తారు. అయితే తాజాగా నెదర్లాండ్స్‌లోని హేగ్ వీధుల్లో ఓ వృద్ధుడు వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ఇప్పటి వరకు 2.52 లక్షల నెటిజన్లు వీక్షించారు. 10 వేల మంది నెటిజన్లు లైక్ కొట్టారు. ఈ వీడియోలో నల్లని రంగు గల పొడవాటి కోటు, బూడిద రంగు చొక్కా, టై, ప్యాంటు, టాన్ టోపీ ధరించిన వృద్ధుడు చేతిలో కర్రతో వీధిలోని సంగీతకారుడి ట్యూన్లకు అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు. గిటారిస్ట్ కూడా ఆ వృద్ధుడితో కలిసి స్టెప్పులేస్తాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా మంది హృదయాలను గెలుచుకుంటోంది. దీనిపై ఓ నెటిన్ స్పందిస్తూ..‘‘దీన్ని ప్రేమించండి’’ అని కామెంట్ చేశారు. ‘‘ఇలా డ్యాన్స్ చేయడం మరొకరికి సాధ్యం కాదు. ఈ వ్యక్తి నిజంగా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు’’ అంటూ రాసుకొచ్చారు. (చదవండి: Corona: ‘ముందస్తు ప్రణాళిక లేకుంటే.. థర్డ్ వేవ్ ఆపటం కష్టం’) This guy is truly living his best life pic.twitter.com/SQHnWoQMwk — Giles Paley-Phillips (@eliistender10) May 21, 2021 -
నేడు... రేపటిని చెక్కే ఉలి
‘నీ లక్ష్యాలను, గమ్యాన్ని నిర్ణయించాల్సింది సమాజం కాదు, నువ్వే’ అమ్మ ఈ మాట చెప్పిన క్షణం నుంచి నాకు ప్రపంచం కొత్తగా కనిపించసాగింది. నేను సమాజాన్ని అర్థం చేసుకునే తీరులో పూర్తి మార్పు వచ్చింది’... ప్రఖ్యాత ఒడిషా శాస్త్రీయ నాట్యకారుడు ప్రేమ్ సాహు చెప్పిన మాట ఇది. అలాగే ‘నిన్నటి రోజున నువ్వు నీ రోజును ఎలా గడిపావో గుర్తు చేసుకో. ఈ రోజు అంతకంటే మెరుగ్గా గడవాలి. ఈ రోజు రేపటి రోజును మరింత మెరుగు పరచాలి. అంటే జరిగి పోయిన రోజు... జరగబోయే రోజును చెక్కే ఉలి కావాలి’ అని చెప్పింది ప్రేమ్సాహు వాళ్ల అమ్మ మంజులత. అబ్బాయేనా! ఒడిశా రాష్ట్రం, కటక్ నగరంలో పుట్టిన ప్రేమ్సాహుకి నాట్యసాధన ఇష్టం. అతడికి నాట్యం నేర్పించడం అతడి తల్లికి ఇష్టం. ముప్పై ఏళ్ల కిందటి కటక్ సమాజానికి మాత్రం ఇష్టం లేదు. ప్రేమ్ నాట్యసాధన చేస్తే నవ్వేవారు. నాట్యముద్రల్లో అతడి వేళ్లు సున్నితంగా ఒదిగిపోయేవి. ‘అబ్బాయి లక్షణాలేమైనా ఉన్నాయా’ అని ముఖం మీదనే నవ్వేవారు. పాఠశాల వార్షికోత్సవంలో ప్రదర్శన కోసం ఉత్సాహంగా పేరిచ్చే వాడతడు. ప్రాక్టీస్‌కి వెళ్లడానికి క్లాసు టీచర్ని అనుమతి అడిగినప్పుడు గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తి నోటి వెంట రాకూడని ఎగతాళి మాటలు వచ్చేవి. టీచర్ల వ్యంగ్యం చాలు తోటి పిల్లలు ప్రేమ్‌ని ఏడిపించడానికి. ప్రేమ్ గురించి మాట్లాడాలంటే అతడి జెండర్ గురించిన మాటలు తప్ప మరేవీ పట్టని సమాజాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొడుకుకు ధైర్యం చెప్పింది మంజులత. గెలిపించే తెగింపు ఇదిలా ఉండగా ఓ రోజు... ప్రదర్శన తర్వాత మేకప్ గదిలో ఒక సీనియర్ నటుడు ప్రేమ్‌కు దగ్గరగా వచ్చి తాకాడు, ఆ తాకడంలో ఏదో తేడా ఉందని గ్రహించేలోపు అతడు పద్నాలుగేళ్ల ప్రేమ్‌ని గట్టిగా పట్టుకున్నాడు. అక్కడి నుంచి పారిపోయి ఓ మూల దాక్కుని వెక్కి వెక్కి ఏడ్చాడు. అంతులేని ఆవేదనతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఉరి మెడకు వేసుకునేలోపే... తల్లి ఎప్పుడూ చెప్పే ధైర్య వచనాలు గుర్తు వచ్చాయతడికి. జీవించి చూపించాలనే మొండిధైర్యం అయితే వచ్చింది. కానీ నలుగురిలో కలవడానికి బిడియపడేవాడు. రోజంతా గదిలోనే ఉంటూ గంటల కొద్దీ నాట్యసాధన చేసేవాడు. ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ఢిల్లీలోని సాహిత్య కళాపరిషత్‌లో స్కాలర్‌షిప్‌తో సీటు వచ్చింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత మాధవీ ముద్గల్ దగ్గర నాట్యంలో మెళకువలు నేర్చుకున్నాడు. హేతుబద్ధమైన విమర్శను స్వీకరించి ఆత్మపరిశీలన చేసుకోవడం, అసూయతో కూడిన అర్థరహితమైన విమర్శలను మనసుకు పట్టనివ్వకపోవడం కూడా నేర్చుకున్నాడు ప్రేమ్ సాహు. అతడు సాధించిన పరిణతి లండన్‌లోని ఒడిశా సొసైటీ యునైటెడ్ కింగ్డమ్ ఫెస్టివల్ నిర్వహించిన వేడుకల్లో ప్రేమ్ ఇచ్చిన నాట్యప్రదర్శనలో వ్యక్తమైంది. ఆ ప్రదర్శన పూర్తయిన వెంటనే ఒక వృద్ధ మహిళ వేదిక మీదకొచ్చి ‘మనోహరమైన, మనసు పెట్టి చేసిన నీ నాట్యం చూస్తుంటే నాకు ఏడుపాగలేదు’ అని కన్నీళ్లు తుడుచుకుంది. నాట్యకారులకు ఇంతకంటే గొప్ప ప్రశంస మరొకటి ఉండదని చెప్పాడు ప్రేమ్ సాహు. తనను ఈ స్థాయిలో నిలబెట్టింది తన తల్లి అలవరచిన గుండె ధైర్యమేనని చెప్పాడు. ఆమె సింహం లాంటి «గుండెదిటవు కలిగిన మనిషి అని తల్లిని ప్రశంసించాడు ప్రేమ్ సాహు. తల్లితో ప్రేమ్సాహు ప్రేమ్సాహు -
ఆ టీచర్ డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా..
గాంగ్టక్ : బాలల దినోత్సవం నాడు తమ పాఠశాల చిన్నారులను ఉత్తేజపరిచేందుకు సిక్కిం స్కూల్‌కు చెందిన ఓ టీచర్ చేసిన డ్యాన్స్ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటూ వైరల్‌గా మారింది. రణ్‌వీర్‌సింగ్ హీరోగా నటించి 2015లో విడుదలైన బాజీరావు మస్తానిలోని హిట్ సాంగ్ మల్హారికి స్కూల్‌కు చెందిన సాంస్కృతిక అంశాలు బోధించే టీచర్ షెరింగ్ దొమ భూటియా చేసిన నృత్యం విద్యార్ధులతో పాటు తోటి టీచర్లు, పాఠశాల సిబ్బందినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాటకు ఆమె హుషారుగా వేసిన స్టెప్స్ రణ్‌వీర్‌సింగ్ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ఆమె చూపిన జోరు వీక్షకులను కట్టిపడేసింది. రణ్వీర్ స్టెప్పులను సరిపోలినట్టుగా ఆమె నృత్యరీతులు ఆకట్టుకున్నాయి. మెల్లి గవర్న్మెంట్ సెకండరీ స్కూల్లో షెరింగ్ ఇచ్చిన డ్యాన్స్ ఫెరఫామెన్స్ వీడియోను స్కూల్ ఫేస్బుక్లో షేర్ చేసింది. -
ఈ త్రివేణి 'నాట్యం'లో మేటి
సాక్షి, విజయనగరం : నృత్యం చిన్నారులకు దేవుడిచ్చిన వరం. చిన్నప్పటి నుంచి నిష్ణాతులైన గురువుల వద్ద శిక్షణ ఇప్పిస్తే మెలకువలు నేర్చుకుంటారు. పెద్దయ్యాక నాట్యంలో రాణిస్తారు. వేదికలపై అలరిస్తారు. దీనికి గొట్లాం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని బోడసింగి త్రివేణి నిదర్శనం. చిన్నవయసులోనే నాట్యంలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో అవార్డులు కైవసం చేసుకుంటోంది. విద్యల నగరమైన విజయనగరం జిల్లా ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేస్తోంది. ఓ వైపు చదువులో ప్రతిభ చూపుతూ మరోవైపు కూచిపూడి, భరతనాట్యంలో కీర్తనలకు అడుగులు కదిపి అలరిస్తోంది. చక్కని ప్రతిభ... త్రివేణి కూచిపూడి, భరతనాట్యంలో నాలుగేళ్ల సర్టిఫికేట్ కోర్సును పూర్తిచేసింది. పదవర్ణం, థిల్లానా, శబ్దం, అష్టపదులు అద్భుతంగా చేస్తూ అందరిమన్ననలు అందుకుంటోంది. కూచిపూడిలో బ్రహ్మాంజలి, భామా కలాపం, కొలువైతివా.. జతిస్వరం, థిల్లానాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి త్రివేణి నాట్యంపై ఉత్సాహం చూపడంతో తల్లిదండ్రులు బి.అప్పలనారాయణ, లక్ష్మిల నర్తనశాల డాక్టర్ భేరి రాధికారాణి వద్ద శిక్షణ ఇప్పిస్తున్నారు. నాటినుంచి నేటి వరకు ఎనిమిదేళ్ల పాటు ఆమె వద్దనే శిక్షణ పొందుతూ వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇస్తూ అందరి మన్ననలు పొందుతోంది. ఇప్పటి వరకు సుమారు వెయ్యికిపైగా ప్రదర్శనలిచ్చిన త్రివేణి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీల్లో త్రివేణి విశేష ప్రతిభ కనబరుస్తోంది. జిల్లాలో ఎక్కడా ఎటువంటి కార్యక్రమమైనా తమ బృందం తరఫున ప్రధా న పాత్ర వహిస్తూ, గురువుల సారథ్యంలో అద్భుతమైన ప్రతిభను కనబరచి అందరిమన్ననలు అందుకుంటోంది. రాజస్థాన్, శ్రీకాళహస్తి, విజయవాడ, భు వనేశ్వర్, హైదరాబాద్, గుణుపూర్, బొబ్బిలి, సాలూ రు, శ్రీకాకుళం, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, తుని, తిరుపతి, భద్రాచలం, ఇలా ఆంధ్ర రాష్ట్రమంతా ప్రదర్శనలిస్తూ జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేస్తోంది. పశంసలు, రికార్డులు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది నామ సంవత్సవ వేడుకల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శనతో అవార్డును సొంతం చేసుకుంది. గురజాడ ఫౌండేషన్ (అమెరికా) సంస్థ నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది ఎలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆçహూతుల ప్రశంసలందుకుంది. విజయనగర ఉత్సవ్, డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం మ్యూజిక్ అండ్ కల్చరల్ ఫెస్టివల్లో త్రివేణి నృత్యం చూపరులను కట్టిపడేసింది. యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో త్రివేణి నృత్యానికి చోటు దక్కింది. డివిజనల్ యూత్ ఫెస్టివల్, గురజాడ 154వ జయంతి, శిల్పారామం, ఇంటర్నేనేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద జయంతి వేడుకలులో ఇచ్చిన ప్రదర్శనలకు ప్రశంసపత్రాలు, మన్ననలు అందుకుంది. విశాఖరత్న కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో త్రివేణి ప్రతిభకు నృత్యరత్న అవార్డు వరించింది.