బెంగళూరు: కర్ణాటక ప్రాచీన నృత కళారూపం భూత కోల. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన కాంతారా సినిమాతో ఈ నృత్య వేడుక మరింత పాపులరైంది. అయితే భూత కోల చేస్తూ ఓ కళాకారుడు ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
గ్రామస్థుల ముందు ప్రదర్శన చేస్తున్న అతడు సడన్‌గా కిందపడిపోయాడు. అక్కడున్నవారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుని గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దక్షిణ కన్నడ జిల్లా కదాబా తాలూకా ఎడమంగల గ్రామానికి చెందిన ఈ భూత కోల కళాకారుడి పేరు కాంతు అజిల. వయసు 59 ఏళ్లు. చాలా సంవత్సరాలుగా నృత్య కళతో జనాల్ని అలరిస్తున్న ఇతనికి దైవ నర్తకుడిగా మంచి గుర్తింపు ఉంది.
అయితే కాంతు ఒక్కసారిగా కుప్పకూలిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. గ్రామస్థులు మాత్రం గుండెపోటు వల్లే అతను మరణించి ఉంటాడని భావిస్తున్నారు. కాంతు నృత్య ప్రదర్శన చేసే సమయంలో గ్రామస్థుడు ఒకరు మొబైల్‌లో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది.
ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Comments
Please login to add a commentAdd a comment