Dakshina Kannada district
-
Karnataka Assembly elections 2023: బీజేపీ కోటలో కాంగ్రెస్ పాగా వేసేనా?
సాక్షి బెంగళూరు: ఎంతో వైవిధ్యం, సాంస్కృతిక, సామాజిక, వారసత్వ సంపద కలిగిన ప్రాంతం కరావళి కర్ణాటక. సుదీర్ఘ తీరప్రాంతం, అటవీ భూభాగం కలిగిన ఈ ప్రాంతాన్ని బీజేపీ తన అడ్డాగా మార్చుకుంది. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో బీజేపీ ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. కరావళి కర్ణాటక పరిధిలోకి వచ్చే దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో గత ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని పార్టీగా అవతరించింది. గతంలో ఉత్తర కన్నడ జిల్లా కరావళి కర్ణాటక పరిధిలో ఉన్నప్పటికీ ఆ తర్వాత దాన్ని కిత్తూరు కర్ణాటకలో కలిపేశారు. అలాగే కొడుగు జిల్లా దక్షిణ కర్ణాటక ప్రాంతంలో కలిసిపోయింది. ప్రస్తుతం ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాలను కరావళి కర్ణాటకగా పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో నియోజకవర్గాల అభివృద్ధి కంటే వ్యక్తిగత కీర్తి, కుల ఆధారిత రాజకీయాలు కీలకంగా ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 13 స్థానాల్లో బీజేపీ 12 చోట్ల గెలుపొందింది. బీజేపీకి కంచుకోటలో పాగా వేయా లని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. జేడీఎస్ ఈ ప్రాంతంలో ఖాతా కూడా తెరవలేకపోయింది. హిజాబ్ ప్రభావం చూపిస్తుందా? కుల, మత ప్రాతిపదికన అంశాలు ఇక్కడ రాజకీయాలను శాసిస్తున్నాయి. హిజాబ్, హలాల్ వివాదాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే కరావళి కర్ణాటకలో అత్యధికంగా ఆరుగురు సీనియర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. కోస్తా కర్ణాటకలో పార్టీ బలాన్ని చూసుకుని టికెట్ల పంపిణీలో సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలో సరస్వత్ బ్రాహ్మిణ్‌లు, మత్స్యకార సామాజికవర్గం మొగవీరలు ఎక్కువగా ఉన్నారు. వీరంతా ప్రస్తుతం బీజేపీకే మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ప్రాంతంలోని ఉడుపి జిల్లా కార్కళ నియోజకవర్గం నుంచి శ్రీరామ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో నిలవడం గమనార్హం. దీంతో కార్కళలో హిందూ సామాజికవర్గ ఓట్లు బీజేపీకి, ముతాలిక్ మధ్య చీలిక తెచ్చే అవకాశం ఉంది. విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధం, హలాల్ మాంసం నిషేధించి జట్కా మాంసంపై బీజేపీ ప్రచారం చేస్తుండడంతో ముస్లింలలో ఆగ్రహం పెరిగిపోతోంది. ఈ ప్రాంతంలో బలంగా ఉన్న పీఎఫ్ఐ సంస్థను నిషేధించడంతో ఆ ప్రతినిధులు బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. మరోవైపు పోటాపోటీ హత్యలు, హింసాత్మక ప్రేరేపణలు, దాడుల నేపథ్యంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇవన్నీ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ పన్నుతున్న వ్యూహాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి. -
కాంతార 'భూత కోల' చేస్తూ.. కుప్పకూలిన కళాకారుడు.. వీడియో వైరల్..
బెంగళూరు: కర్ణాటక ప్రాచీన నృత కళారూపం భూత కోల. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన కాంతారా సినిమాతో ఈ నృత్య వేడుక మరింత పాపులరైంది. అయితే భూత కోల చేస్తూ ఓ కళాకారుడు ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గ్రామస్థుల ముందు ప్రదర్శన చేస్తున్న అతడు సడన్‌గా కిందపడిపోయాడు. అక్కడున్నవారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుని గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దక్షిణ కన్నడ జిల్లా కదాబా తాలూకా ఎడమంగల గ్రామానికి చెందిన ఈ భూత కోల కళాకారుడి పేరు కాంతు అజిల. వయసు 59 ఏళ్లు. చాలా సంవత్సరాలుగా నృత్య కళతో జనాల్ని అలరిస్తున్న ఇతనికి దైవ నర్తకుడిగా మంచి గుర్తింపు ఉంది. అయితే కాంతు ఒక్కసారిగా కుప్పకూలిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. గ్రామస్థులు మాత్రం గుండెపోటు వల్లే అతను మరణించి ఉంటాడని భావిస్తున్నారు. కాంతు నృత్య ప్రదర్శన చేసే సమయంలో గ్రామస్థుడు ఒకరు మొబైల్లో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
Shivapura hanging bridge: వేలాడే వంతెనపైకి కారు
బెంగళూరు: ద్విచక్రవాహనాలు, పాదచారులు మాత్రమే వెళ్లగలిగే వేలాడే వంతెనపై ఓ ప్రబుద్ధుడు ఏకంగా కారే నడపబోయాడు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా శివపుర వంతెనపై బుధవారం జరిగిన ఈ ఘటన వైరల్‌గా మారింది. ఉళావికి చెందిన ముజాహిద్ సయ్యద్ (26) కారుతో వంతెనపైకి దూసుకెళ్లాడు. అది మధ్యలో ఇరుక్కోవడం, స్థానికులు ప్రతిఘటించడంతో కారును వెనక్కు తోసుకెళ్లాడు. పోలీసులు ముజాహిద్‌ను అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. -
కంబళ.. మామూలుగా పరిగెత్తలేదుగా!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక తీరప్రాంత జిల్లాల్లో బురదనీటిలో సాగే దున్నపోతుల పరుగు పందేలు కంబళలో ఒలింపిక్స్ పరుగు రికార్డులు బద్ధలవుతున్నాయి. బురదమడిలో వంద మీటర్ల దూరాన్ని కేవలం 9.15 సెకన్లలో దక్షిణ కన్నడ జిల్లా బైందూరుకు చెందిన విశ్వనాథ్ పూర్తి చేసి కొత్త రికార్డును నెలకొల్పాడు. గత శనివారం నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచి అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టి ఆకర్షించాడు. మొత్తం 125 మీటర్ల దూరాన్ని 11.44 సెకన్లలో పూర్తి చేశాడు. గతేడాది శ్రీనివాసగౌడ 9.55 సెకన్లలో, అదేవిధంగా నిశాంత్ శెట్టి 9.51 సెకన్లలో 100 మీటర్ల పరుగు సాధించి అప్పటికి సరికొత్త రికార్డును సృష్టించారు. విశ్వనాథ్ వీటిని అధిగమించాడు. ఉసేన్ బోల్ట్ కటే వేగంగా.. ప్రపంచ పరుగు పందెం విజేత ఉసేన్ బోల్ట్ రికార్డును మంగళూరుకు చెందిన శ్రీనివాసగౌడ అనే యువకుడు కొత్త చరిత్ర సృష్టించగా నిశాంత్ శెట్టి కూడా బోల్ట్ బద్దలు కొట్టాడు. ఈసారి బైందూరుకు చెందిన మరో యువకుడు విశ్వనాథ్ కూడా పాత రికార్డులన్నీ సవరించాడు. ఎన్నో ఏళ్ల కఠోర సాధన చేసినా ఈ స్థాయిలో రికార్డు సృష్టించడానికి పరుగు పందేలా క్రీడాకారులు ఆపసోపాలు పడుతుంటే కంబళ పోటీల్లో ఇంత అవలీలగా ఎలా సాధించేశారనే కుతూహలం అందరిలోనూ మొదలైంది. కరావళి సంప్రదాయమే.. కర్ణాటకలోని కరావళి ప్రాంతంగా పిలిచే ఉత్తరకన్నడ, దక్షిణ కన్నడ జిల్లాల్లో శతాబ్దాలుగా నిర్వహిస్తున్న క్రీడ పేరు కంబళ. కరావళి ప్రాంత సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా కంబళ క్రీడను భావించే ప్రజలు దాన్ని కాపాడుకోవడానికి పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. నవంబర్‌లో మొదలయ్యే కంబళ సీజన్ మార్చి వరకు కొనసాగుతుంది. కంబళ సమితుల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తారు. 100 మీటర్లు అంత కంటే ఎక్కువ దూరం ఉండే ట్రాక్‌లు సిద్ధం చేసి వాటిలో కొద్దిమేర బురదనీటిని నింపుతారు. అనంతరం వాటిలో దున్నపోతులను పరుగెత్తించే పోటీలు నిర్వహిస్తారు. దున్నపోతులను అదుపు చేస్తూనే వేగంగా పరుగెత్తించి వాటితో పాటు అంతే వేగంతో పరుగెత్తి ఎవరైతే ముందుగా లక్ష్యాన్ని చేరుకుంటారో వారినే విజేతలుగా ప్రకటిస్తారు. క్రీడ ఒక్కటే.. ఎన్నెన్నో పోటీలు.. కంబళ పోటీల్లో ఏడు రకాల పోటీలు ఉన్నాయి. బారే కంబళ, కోరి కంబళ, అరసు కంబళ, దెవెరే కంబళ, బాలె కంబళ, కెరె కంబళ, కాద్రి కంబళగా విభజించారు. అయితే కంబళ క్రీడలో అన్ని కంబళలు పోటీ కంబళలు కావు. అందులో కొన్ని కంబళలు పోటీ కంబళలు.. కాగా మరికొన్ని పోటీ లేని సాధారణ కంబళలు. అయితే రెండు రకాల కంబళలను బురదనీటిలో నిర్వహిస్తారు. అన్ని రకాల కంబళలు మూడు శతాబ్దాలకు పైగానే చరిత్ర కలిగినవే. వీటిలో ఎక్కువశాతం దక్షిణ కన్నడ జిల్లాలోనే నిర్వహిస్తుండగా కొన్ని కంబళలు సమీపంలోని ఉడుపి జిల్లాలో నిర్వహిస్తారు. చరిత్ర ఏం చెబుతుందంటే.. కంబళ చరిత్ర గురించి తెలుసుకుంటే పరమ శివుడికి భక్తులైన నాథుల ప్రేరణతో కంబళ మొదలైనట్లు చెబుతారు. కంబళ క్రీడలు ప్రారంభమయ్యే ముందురోజు రాత్రి కొరగ తెగకు చెందిన పురుషులు కొరగ సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శిస్తారు. అందులో భాగంగా పంచకర్మగా భావించే మద్య, మాంస, మత్స్య, ముద్ర, మిథున (రతి) పాటిస్తారు. దీంతో పాటు పానిక్కులుని అనే సాంస్కృతిక వేడుకను సైతం నిర్వహిస్తారు. పోటీలు.. విభాగాలు.. కంబళ పోటీల్లో కొన్ని రకాల పోటీలను ప్రత్యేక విభాగాలుగా విభజిస్తారు. వాటిలో నెగిలు, హగ్గ, అడ్డా హాలేజ్, కేన్ హాలేజ్ ప్రధానమైనవి. ఒక్కో రకమైన కంబళకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. వాటి గురించి తెలుసుకుందాం. ► నెగిలు: చెక్క లేదా ఇనుముతో తయారు చేసిన ఓ రకమైన భారీ నాగలితో నిర్వహించే పోటీని నెగిలుగా గుర్తిస్తారు. ఈ భారీ నాగలి ని దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తి స్తారు. ఇందులో కేవలం ఎంట్రీ స్థాయి, జూనియర్, సీనియర్ రౌండ్లు మాత్రమే ఉంటాయి. ► హగ్గ: ఈ విభాగంలో పాల్గొనే దున్నలకు అనుభవం ఎక్కువగా ఉంటుంది. బలమైన తాడును దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఇందులో ఓ వ్యక్తి చేతిలో తాడుతో దున్నలను నియంత్రిస్తూ వాటితో పాటు బురద నీటిలో పరుగెత్తుతాడు. ఇందులోనూ సీనియర్, జూనియర్ రౌండ్లు ఉంటాయి. ► అడ్డా హాలేజ్: ఈ విభాగం కఠినంగానే ఉంటుంది. వంపు తిరిగిన చెక్కను దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఈ సమయంలో చెక్కపలకపై వ్యక్తి నిలబడి ఉంటాడు. దీంతో పోటీలో పాల్గొనే దున్నలు చెక్కతో పాటు వ్యక్తిని సైతం బురదనీటిలో వేగంగా లాక్కెళ్తాయి. ఇందులో సీనియర్ రౌండ్ మాత్రమే ఉంటుంది. ►కేన్ హాలేజ్: ఈ రకం పోటీలు ఎంతో రసవత్తరంగా, ఉత్కంఠగా ఉంటాయి. ప్రత్యేకంగా తయారు చేసిన గుండ్రటి చెక్కను దున్నలకు కడతారు. చెక్కకు మధ్యలో రెండు ప్రత్యేకమైన రంధ్రాలు ఏర్పాటు చేస్తారు. దున్నలు పరిగెత్తే సమయంలో ఈ రెండు రంధ్రాల నుంచి చిమ్మే నీటి ఎత్తు, వేగంతో విజేతను ఎన్నుకుంటారు. ఇందులో సూపర్ సీనియర్ రౌండ్ మాత్రమే ఉంటుంది. చదవండి: మిస్ ఇండియా రన్నరప్‌గా ఆటో డ్రైవర్ కూతురు ఆమె కోసం ఇల్లమ్మి.. ఆటోలోనే తిండి, నిద్ర -
ఆ విమానంలో వచ్చిన 20 మందికి పాజిటివ్
మంగళూరు : కరోనా వల్ల ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను విదేశాల నుంచి వెనక్కు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను సైతం స్వస్థలాలకు పంపించేస్తున్నారు. ఈ క్రమంలో వెనక్కు వస్తున్న వారివల్ల కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా దుబాయ్ నుంచి మంగళూరుకు చేరుకున్న విమానంలో 20 మంది కరోనా సోకినట్లు తేలిందని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. 179 మంది ప్రయాణికులతో కూడిన విమానం మంగళవారం దుబాయ్ నుంచి మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. (కర్ణాటకలో కరోనా కలకలం.. అతడి కోసం గాలింపు) వీరిలో 38 మంది గర్భిణీ మహిళలు కూడా ఉన్నారు. వారందరికీ పరీక్షలు నిర్వహించగా 20 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ప్రభుత్వం మిగతా ప్రయాణీకులను క్వారంటైన్లో ఉండాల్సిందిగా ఆదేశించింది. బాధితుల్లో 15 మంది దక్షిణ కన్నడ జిల్లాకు చెందినవారు కాగా ఆ జిల్లాలో కేసుల సంఖ్య 43కు చేరింది. కరోనా సోకిన మిగతా ఐదుగురు ఉడిపివాసులు కాగా వీరి సంఖ్యను కలుపుకుని ఆ జిల్లాలో కరోనా కేసుల మొత్తం 8కు చేరింది. కాగా శుక్రవారం ఉదయం నాటికి జిల్లాలో 1032 కేసులు నమోదవగా 476 మంది కోలుకున్నారు. 35 మంది మరణించారు.(ప్రాణాల మీదకు తెచ్చిన టిక్‌టాక్) -
ఐయామ్ ద హోమ్ మినిస్టర్..
“I’m the home minister of my school council. Can I speak to you for five minutes?”.. అంటూ దివిత్ పంపిన మెసేజ్ ఏకంగా ఓ రాష్ట్ర ప్రభుత్వాన్నే కదిలించింది. నలుగురు టీచర్ల బదిలీని ఆపేసింది. ఆ వివరాల్లోకెళ్తే... దివిత్ రాయ్.. కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా, హరది గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రేషనలైజేషన్ ప్రక్రియలో ఆ పాఠశాలకు చెందిన నలుగురు టీచర్లు బదిలీ అవుతున్నారని దివిత్‌కు తెలిసింది. దీంతో అప్పటిదాకా విద్యాబుద్ధులు నేర్పిన టీచర్లు వెళ్లిపోతుంటే తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా వారి బదిలీని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. పాఠశాల విద్యామండలిలో సభ్యుడైన దివిత్.. ముందుగా మిగతా టీచర్లను సంప్రదించాడు. బదిలీలను ఆపేందుకు ఏం చేయలేమా? అని ప్రశ్నించాడు. ‘అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దాన్ని ధిక్కరించే అధికారం మాకెవ్వరికీ లేద’ని చెప్పడంతో ఆ ప్రభుత్వాన్నే అడగాలనుకున్నాడు. వివిధ సంక్షేమ పథకాల అమల్లోభాగంగా ఆ రాష్ట్ర హోంమంత్రి ఫోన్ నంబర్ రాష్ట్ర ప్రజల కోసం అందుబాటులో ఉంచారన్న విషయం తెలుసుకున్న దివిత్... నేరుగా హోంమంత్రికే లేఖ విషయం చెప్పాలనుకున్నాడు. వాయిస్ మెసేజ్ రూపంలో ‘మా పాఠశాల కౌన్సిల్‌కు నేనూ హోం మినిస్టర్‌నే. నేనో ఐదు నిమిషాలు మీతో మాట్లాడవచ్చా?’ అంటూ వచ్చిన ఆ మెసేజ్‌ను హోంమంత్రిత్వశాఖ.. హోంమంత్రి జి. పరమేశ్వర దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి ఫోన్.. మరునాడే దివిత్ తల్లికి ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు దగ్గర నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ‘మీ అబ్బాయి పంపిన మెసేజ్ మాకు చేరింది. ఇంతకీ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు?’ అని అడగడంతో.. దివిత్‌ను పిలిచి ఫోన్ ఇచ్చింది తల్లి. ఫోన్ అందుకున్న దివిత్.. ‘సర్ మా టీచర్లను బదిలీ చేయాలని మీరు తీసుకున్న నిర్ణయం నాతోసహా ఎంతో మంది విద్యార్థులకు నష్టం కలిగిస్తుంది. టీచర్లు వెళ్లిపోతే దాని ప్రభావం పిల్లల చదువులపై కూడా పడుతుంది. దయచేసి బదిలీలను ఆపివేయండ’ని కోరాడు. ‘తన చదువుపట్ల, తోటివారి భవిష్యత్తుపట్ల దివిత్‌కు ఉన్న దృక్పథం నన్ను ఎంతగానో కదిలించింది. ఆ స్కూల్ టీచర్లను బదిలీ చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంటోంది. వారంతా ఇకపై కూడా అదే పాఠశాలలో కొనసాగుతార’ని హోంమంత్రి స్వయంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు.