
బెంగళూరు: ద్విచక్రవాహనాలు, పాదచారులు మాత్రమే వెళ్లగలిగే వేలాడే వంతెనపై ఓ ప్రబుద్ధుడు ఏకంగా కారే నడపబోయాడు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా శివపుర వంతెనపై బుధవారం జరిగిన ఈ ఘటన వైరల్‌గా మారింది.
ఉళావికి చెందిన ముజాహిద్ సయ్యద్ (26) కారుతో వంతెనపైకి దూసుకెళ్లాడు. అది మధ్యలో ఇరుక్కోవడం, స్థానికులు ప్రతిఘటించడంతో కారును వెనక్కు తోసుకెళ్లాడు. పోలీసులు ముజాహిద్‌ను అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment