car seized
-
పూజా ఖేద్కర్ కేసు.. ఆడీ కారు సీజ్ చేసిన పోలీసులు
ముంబై: అధికార దుర్వినియోగం, యూపీఎస్పీకి తప్పుడు అఫిడవిట్ సమర్చించారనే ఆరోపణలతో ఇటీవల ట్రైనీ ఐఏఎస్ పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్ వివాదాస్పదం అయ్యారు. ఇక, ఆమె వ్యవహారంపై ఏక సభ్య కమిటీ విచారణ జరుపుతోంది. అయితే తాజాగా ఆమెకు చెందిన లగ్జరీ ఆడీ కారును ఆదివారం పుణె పోలీసులు సీజ్ చేశారు. పూజా ఖేద్కర్ ఉపయోగించిన లగ్జరీ ఆడీ కారు తన పేరుమీద కాకుండా ఓ ప్రైవేట్ కంపెనీ యజమానిపై ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో పుణె రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసు సదరు కంపెనీ ఓనర్‌కు నోటీసు జారీ చేసింది. అనంతరం ఆ కారును చతుర్శృంగి పోలీసులు తీసుకువెళ్లి.. పోలీసు స్టేషన్లో బారికేడ్ల మధ్య పెట్టారు. అయితే తాజాగా ఆమె ఆడి కారును పుణె పోలీసులు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.చదవండి: పూజా ఖేద్కర్ ఎపిసోడ్: ‘నా కూతురు ఏ తప్పూ చేయలేదు’ఇక.. ఇటీవల మహరాష్ట్ర పూణే జిల్లాలో ట్రైనీ ఐఏఎస్ అధికారికగా పనిచేస్తున్న పూజా ఖేడ్కర్ తాను వినియోగించే ఆడీ కారుకు అనధికారికంగా రెడ్ బీకాన్ లైట్ల వినియోగం, గవర్నమెంట్ ఆఫ్ మహరాష్ట్ర అని స్కిక్కర్లు అంటించడంతో పాటు పైఅధికారులు లేని సమయంలో వారి ఛాంబర్లను అనుమతి లేకుండా ఉపయోగించుకోవడంపై వివాదం తలెత్తింది. అందుకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులు జరుపుకున్న వాట్సప్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది.చదవండి: పూజా ఖేద్కర్‌పై మరొకటి! ఆరోపణలు నిజమని తేలితే..ఆమె ఉద్యోగంలో చేరేందుకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె తనకు నేత్ర, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు అఫిడవిట్ ఇచ్చిందని, కానీ, వాటిని నిర్ధారించేందుకు తప్పనిసరి వైద్య పరీక్షలకు మాత్రం ఆమె డుమ్మా కొట్టినట్లు కథనాలు వచ్చాయి. దీంతో.. నిజనిర్ధారణ కోసం కేంద్రం సింగిల్ మెంబర్ కమిటీని నియమించింది. ఈ కమిటీ దర్యాప్తు జరిపి.. రెండు వారాల్లో నివేదిక ఇస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ పేర్కొంది.చదవండి: Pooja khedkar: కూతురే కాదు తల్లి కూడా అదే దందా.. వీడియో వైరల్ -
Shivapura hanging bridge: వేలాడే వంతెనపైకి కారు
బెంగళూరు: ద్విచక్రవాహనాలు, పాదచారులు మాత్రమే వెళ్లగలిగే వేలాడే వంతెనపై ఓ ప్రబుద్ధుడు ఏకంగా కారే నడపబోయాడు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా శివపుర వంతెనపై బుధవారం జరిగిన ఈ ఘటన వైరల్‌గా మారింది. ఉళావికి చెందిన ముజాహిద్ సయ్యద్ (26) కారుతో వంతెనపైకి దూసుకెళ్లాడు. అది మధ్యలో ఇరుక్కోవడం, స్థానికులు ప్రతిఘటించడంతో కారును వెనక్కు తోసుకెళ్లాడు. పోలీసులు ముజాహిద్‌ను అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. -
కారులో గంజాయి తరలింపు: 2 గంటలపాటు పోలీసుల ఛేజింగ్.. చివరికి..
తాడేపల్లిరూరల్: ఒక కారులో విశాఖపట్నం ఏజన్సీ నుంచి గంజాయి తీసుకు వస్తున్నారని తెనాలి రూరల్ సీఐ సుబ్రహ్మణ్యానికి సమాచారం రావడంతో దుగ్గిరాల పోలీసులను శుక్రవారం అప్రమత్తం చేశారు. పోలీసులు కారుకోసం మంగళగిరి తెనాలి రోడ్లో బకింగ్‌హామ్ కెనాల్ ఒడ్డున వేచి ఉండగా మెరుపు వేగంతో కారు ముందుకు వెళ్లిపోయింది. వెంటనే పోలీసులు కారును వెంబడించారు. గంజాయి తరలిస్తున్న కారు ఈమని రోడ్డులోకి వెళ్లి పలు డొంకరోడ్లలో చక్కర్లు కొడుతూ చివరకు మోరంపూడి గ్రామ శివారుల్లో నిలిపివేసి కారు వదిలి అక్కడి నుంచి గంజాయి బ్యాచ్ పరారైంది. సేకరించిన వివరాల ప్రకారం తెనాలి ఐతానగర్‌కు చెందిన ముగ్గురు యువకులు, ఇంజినీరింగ్ చదువుతున్న మరో విద్యార్థి, చదువుతున్న మరో విద్యార్థి కలసి ఏపీ39జేడీ6606 నంబరు గల కారులో గంజాయిని తెనాలి తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలో వెంబడించడంతో ఆ ముగ్గురు యువకులు, విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు లోపల భాగంలో, సీట్ల మీద, డాష్ బోర్డులో ఉన్న చిన్నచిన్న గంజాయి పొట్లాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిక్కీ, డోర్లలో భారీగా గంజాయి ఉన్నట్లు సమాచారం. పోలీసులు జరిగిన సంఘటనపై వివరణ కోరగా కారు స్వాధీనం చేసుకున్న మాట వాస్తవమేనని, పంచనామా జరిగిన అనంతరం గంజాయి ఎంత వుందో తెలియజేస్తామని అన్నారు. చదవండి: ఒమిక్రాన్ కట్టడికి ఐదు సూత్రాల ప్రణాళిక ఇదే..: ఆరోగ్య శాఖ -
ఒక్క కారు.. 66 చలాన్లు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం జూబ్లీహిల్స్ క్లబ్ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. నల్లకుంట పద్మాకాలనీకి చెందిన కంద్రకొండ కోటేశ్వరరావుకు చెందిన కారు(ఏపీ09సీబీ3132)ను ఆపి తనిఖీలు చేయగా ఈ కారుపై 66 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. గత నాలుగేళ్లుగా పెండింగ్ చలానాలు చెల్లించకపోవడంతో బకాయిలు రూ.75,710 పేరుకుపోయాయి. దీంతో కారును సీజ్ చేశారు. నాగేశ్వరరావుకు చెందిన ఈ కారును మరో వ్యక్తి నడుపుతూ పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. -
పెంబర్తి చెక్ పోస్ట్ వద్ద రూ. 5,80,65,000 స్వాధీనం
సాక్షి, జనగామ: జనగామ జిల్లా పెంబర్తి చెక్ పోస్ట్ వద్ద మంగళవారం రూ.5,80,65,000ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో పంచేందుకు హవాలా మార్గం (లెక్కలేని నగదు) ద్వారా పెద్ద మొత్తంలో తరలిస్తున్న డబ్బు కట్టలు పట్టుబడిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు కారులో డబ్బు మూటలను తరలిస్తుండగా.. జనగామ జిల్లా వరంగల్–హైదరాబాద్ నేషనల్ హైవే.. మండలంలోని పెంబర్తి ఎస్ఎస్టీ చెక్‌పోస్టు వద్ద చిక్కారు. కారు సీటు కింద ఉన్న 500 రూపాయల నోట్ల కట్టలు చూసిన పోలీసులు వెంటనే జిల్లా ఎలక్షన్ కమీషన్ ఉన్నతాధికారులతో పాటు పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. జనగామ పట్టణ పోలీస్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ శ్రీనివాసరెడ్డితో కలిసి వరంగల్ పోలీస్ కమిషనర్ (సీపీ) డాక్టర్ విశ్వనాథ రవీందర్ మాట్లాడారు. మంగళవారం తెల్లవారు జామున తనిఖీల్లో భాగంగా సీఐ ముష్క శ్రీనివాస్, ఎస్సై శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి వస్తున్న ఏపీ 37సీకె 4985 నెంబరు గల షిఫ్టు కారును ఆపారని వారు తెలిపారు. అందులో డబ్బు అధిక మొత్తంలో ఉండడంతో కారును పట్టణ పోలీస్టేషన్‌కు తరలించి... వీడియోగ్రఫీ సమక్షంలో యంత్రాల ద్వారా లెక్కించినట్లు వివరించారు. హవాలా బ్రోకర్ ద్వారా డబ్బు సరఫరా పట్టు బడ్డు నిందుతులను ప్రశ్నించగా హైదరాబాద్ గోషామహల్‌కు చెందిన హవాలా బ్రోకర్ కీర్తి కుమార్ జైన్ షెల్ కంపెనీ ద్వారా నగదు సరఫరా చేస్తారన్నారు. అందులో భాగంగానే కొంత మందికి చెందిన నగదును తన షెల్ కంపెనీలో వేసుకుని, ప్రచారంకోసం ఆయా జిల్లాలకు చేరవేస్తున్నారన్నారు. జనగామలో పట్టుపడ్డ సొమ్ములో ఖమ్మం టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వర్రావుకు చెందిన రూ.1.50 కోట్లు, పరకాల కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ భర్త కొండా మురళికి రూ.2.30 కోట్లు, వరంగల్ తూర్పు మహాకూటమి అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన రెండు కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నట్లు నిందితులు తమ విచారణలో ఒప్పుకున్నట్లు విలేకరులకు సీపీ వి. రవీందర్ చెప్పారు. నిందితుల అరెస్ట్... నగదు తరలిస్తున్న హవాలా బ్రోకర్ కీర్తి కుమార్ జైన్, ఇద్దరు డ్రైవర్లు రాజస్తాన్‌కు చెందిన వారుగా గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్న నవరాం, మహబూబాబాద్ జిల్లా పెదవంగర మండలం కన్వాయ్గూడెంకు చెందిన ముత్యం ప్రశాంత్‌పై 179/ఈడీ, 120/బీ(ప్రోజరీ)తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీపీ రవీందర్ పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులను రిమాండ్ చేసి, కారు, నగదును కోర్టుకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈడీ విచారణ..? పెంబర్తి చెక్ పోస్టు వద్ద పట్టుబడ్డ రూ.5.80 కోట్లకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేసే అవకాశం ఉన్నట్లు సీపీ రవీందర్ చెప్పారు. ఈ నగదుకు సంబంధించి నివేదికలు సిద్ధం చేసి, ఉన్నతాధికారులకు పంపించినట్లు ఆయన వివరించారు. -
2 కిలోల గంజాయి స్వాధీనం
గాంధారి: కారులో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 2 కిలోల గంజాయితో పాటు ఇండికా కారు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చధ్మల్ వద్ద తనిఖీలు చేపడుతున్న పోలీసులు నేరెల్ గ్రామానికి చెందిన వ్యక్తి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి కారు సీజ్ చేశారు. -
హీరోయిన్‌కు చేదు అనుభవం
హీరోయిన్లంటే నేల మీద కాలుపెట్టి ఎరగరు. పట్టు పరుపుల మీద తప్ప శయనించరు. మెట్లు దిగితే కారు ఎక్కాల్సిందే. కానీ, అలాంటి పొజిషన్లో ఉండి.. నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఓ బాలీవుడ్ హీరోయన్‌కు ఎదురైంది. తెలుగు గడ్డపై పుట్టి.. బాలీవుడ్లో హీరోయిన్గా వెలుగుతున్న అదితి రావు నోయిడాలో నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోకు నడిచి వెళ్లాల్సి వచ్చింది. రాంగ్ రూట్లో వస్తున్నందుకు ఆమె కారును పోలీసులు సీజ్ చేయడంతో ఇలా జరిగింది. నోయిడాలో అత్యంత ఖరీదైన సెక్టార్ 18లో కొత్తగా తెరిచిన మాల్లో నిర్వహించే ఫ్యాషన్ షోకు ఆమె వెళ్లాల్సి ఉంది. అదే సెక్టార్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఆమె ఉంది. అక్కడి నుంచి తన జాగ్వార్ కారులో ఆమె బయల్దేరగా, ఆమె సహాయకులు వెర్నా కారులో ఆమె వెంటే వెళ్లారు. అయితే.. త్వరగా వెళ్లాలన్న తొందరలో ఆమె డ్రైవర్ షార్ట్‌కట్ రూట్ తీసుకుని, రాంగ్ రూటులో నడపసాగాడు. అంతలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ధర్మేంద్ర యాదవ్ వీరి కారును ఆపారు. ఆపేసరికి అందులో ఎవరున్నారో తనకు తెలియదని, అయినా అలా వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆపానని ఆయన చెప్పారు. కాసేపటికే వెనకాల వెర్నాలో వచ్చిన సహచరులు.. అది బాలీవుడ్ సెలబ్రిటీ కారని, అందువల్ల వదిలేయాలని కోరారు. కానీ, పేపర్ వర్క్ పూర్తి కాకుండా కారును పంపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈలోపు వెనకాల వచ్చినవాళ్లు నానా హడావుడి చేసి, మాల్ యాజమాన్యానికి ఫోన్లు చేశారు. అటు నుంచి వెంటనే కారును పంపాలంటూ ఇన్స్పెక్టర్పై ఒత్తిడి వచ్చింది. అయినా ఇన్స్పెక్టర్ మాత్రం కామ్‌గా తన పనిచేసుకుంటున్నారు. ఈలోపు అదితి రావు కిందకు దిగి, నడుచుకుంటూ మాల్‌కు వెళ్లిపోయిందట! -
రావెల సుశీల్ కారు సీజ్
బంజారాహిల్స్ : ఏపీ మంత్రి రావెల కిశోర్ తనయుడు సుశీల్(24) పోలీసు కస్టడీ గురువారం కూడా కొనసాగింది. ఆయనను బంజారాహిల్స్ పోలీసులు రెండో రోజు కూడా విచారించారు. ఈ నెల 3వ తేదీన రావెల సుశీల్ తన కారులో వెళ్తూ నడిచి ఇంటికి వెళ్తున్న ఫాతిమా బేగం అనే మహిళా టీచర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. నిర్భయచట్టం కింద కేసు నమోదై ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ ఘటనలో మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ఆయనతోపాటు డ్రైవర్ రమేష్‌ను కస్టడీకి తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆ రోజు ప్రయాణిస్తున్న కారు(ఏపీ 07 సీకే 1777)ను సీజ్ చేశారు. ఈ కారు నారాయణస్వామి పేరుపై ఉందని పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. అయితే కొద్ది రోజులు వాడుకోవడానికి తన బంధువైన నారాయణ స్వామి నుంచి కారును తీసుకున్నట్లు సుశీల్ దర్యాప్తులో వెల్లడించారు. అయితే ఈ కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడం పోలీసులు గుర్తించారు.