ముంబై: అధికార దుర్వినియోగం, యూపీఎస్పీకి తప్పుడు అఫిడవిట్ సమర్చించారనే ఆరోపణలతో ఇటీవల ట్రైనీ ఐఏఎస్ పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్ వివాదాస్పదం అయ్యారు. ఇక, ఆమె వ్యవహారంపై ఏక సభ్య కమిటీ విచారణ జరుపుతోంది. అయితే తాజాగా ఆమెకు చెందిన లగ్జరీ ఆడీ కారును ఆదివారం పుణె పోలీసులు సీజ్ చేశారు.
పూజా ఖేద్కర్ ఉపయోగించిన లగ్జరీ ఆడీ కారు తన పేరుమీద కాకుండా ఓ ప్రైవేట్ కంపెనీ యజమానిపై ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో పుణె రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసు సదరు కంపెనీ ఓనర్‌కు నోటీసు జారీ చేసింది. అనంతరం ఆ కారును చతుర్‌శృంగి పోలీసులు తీసుకువెళ్లి.. పోలీసు స్టేషన్‌లో బారికేడ్ల మధ్య పెట్టారు. అయితే తాజాగా ఆమె ఆడి కారును పుణె పోలీసులు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
చదవండి: పూజా ఖేద్కర్ ఎపిసోడ్: ‘నా కూతురు ఏ తప్పూ చేయలేదు’
ఇక.. ఇటీవల మహరాష్ట్ర పూణే జిల్లాలో ట్రైనీ ఐఏఎస్ అధికారికగా పనిచేస్తున్న పూజా ఖేడ్కర్ తాను వినియోగించే ఆడీ కారుకు అనధికారికంగా రెడ్ బీకాన్ లైట్ల వినియోగం, గవర్నమెంట్ ఆఫ్ మహరాష్ట్ర అని స్కిక్కర్లు అంటించడంతో పాటు పైఅధికారులు లేని సమయంలో వారి ఛాంబర్‌లను అనుమతి లేకుండా ఉపయోగించుకోవడంపై వివాదం తలెత్తింది. అందుకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులు జరుపుకున్న వాట్సప్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది.
చదవండి: పూజా ఖేద్కర్‌పై మరొకటి! ఆరోపణలు నిజమని తేలితే..
ఆమె ఉద్యోగంలో చేరేందుకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె తనకు నేత్ర, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు అఫిడవిట్ ఇచ్చిందని, కానీ, వాటిని నిర్ధారించేందుకు తప్పనిసరి వైద్య పరీక్షలకు మాత్రం ఆమె డుమ్మా కొట్టినట్లు కథనాలు వచ్చాయి.
దీంతో.. నిజనిర్ధారణ కోసం కేంద్రం సింగిల్ మెంబర్ కమిటీని నియమించింది. ఈ కమిటీ దర్యాప్తు జరిపి.. రెండు వారాల్లో నివేదిక ఇస్తుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ పేర్కొంది.
చదవండి: Pooja khedkar: కూతురే కాదు తల్లి కూడా అదే దందా.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment