trainee IAS
-
దేశం విడిచి పారిపోయిన పూజా ఖేద్కర్?
న్యూఢిల్లీ: వరుస వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన ఏఐఎస్ మాజీ ప్రొబెషనరీ అధికారిణి పరారీలో ఉన్నారా?. ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారా?. ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడం వెంటనే.. ఆమె దేశం విడిచి పారిపోయారా?. ముందస్తు బెయిల్ విషయంలో పూజా ఖేద్కర్‌కు గురువారం చుక్కెదురైంది. ఓబీసీ కోటా, అలాగే దివ్యాంగుల కోటా విషయంలో ఆమె మోసం చేశారని, ఈ అంశాల్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న యూపీఎస్సీ ఆమెను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై అభియోగాల దృష్ట్యా అరెస్ట్ తప్పదని ఆమె భావించారు. వెంటనే తన లాయర్ ద్వారా ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. కానీ, కోర్టు అందుకు నిరాకరించింది. పూజాను కస్టోడియల్ విచారణ జరిపితేనే వాస్తవాలు బయటకు వస్తాయని బెయిల్ తిరస్కరణ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అయితే.. జులై 31న అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. అంతకు ముందు ముస్సోరీలోని అకాడమీ ఎదుటా హాజరై ఆమె తన వివరణ ఇచ్చుకోలేదు. దీంతో యూపీఎస్సీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే.. నోటీసులకు స్పందించేందుకు ఆగష్టు 4వ తేదీ వరకు ఆమె గడువు కోరారు. కానీ, యూపీఎస్సీ మాత్రం జులై 30 దాకా అవకాశం ఇచ్చింది. అయినా ఆమె గైర్హాజరయ్యారు. దీంతో ఆమె దుబాయ్‌కి వెళ్లిపోయి ఉండొచ్చని జాతీయ మీడియా కథనాలు ఇస్తోంది. దీనిపై పూజా తరఫు స్పందన రావాల్సి ఉంది. మరోవైపు.. పుణే పోలీసులు సైతం ఆమె పరారైన విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది. -
మరో మలుపు తిరిగిన పూజా ఖేద్కర్ వ్యవహారం
ముంబై: ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. పుణే జిల్లా కలెక్టర్ సుహార్ దివాసే తనను వేధించారంటూ వాశిం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఓ అధికారి ధృవీకరించారు. మహిళా పోలీసులు సోమవారం వాశింలోని ఖేద్కర్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలోనే ఆమె పుణే కలెక్టర్ సుహాస్ దివాసేపై ఫిర్యాదు చేశారు అని ఆ అధికారి తెలిపారు. అయితే.. గత రాత్రి 11 గం. సమయంలో ముగ్గురు మహిళా పోలీస్ సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి 1గం. టైంలో వెళ్లిపోయారు. పోలీసులు ఎందుకు వచ్చారనే దానిపై నిన్న మీడియా ముందు పూజా ఖేద్కర్ మరోలా స్పందించారు. తనకు పని ఉండి మహిళా పోలీసులను తానే పిలిచానని ఆమె చెప్పారు. అయితే ఆ పని ఏంటన్నది మాత్రం ఆమె చెప్పలేదు. ట్రెయినింగ్‌లో ఉంటూనే పూజా ఖేద్కర్ గొంతెమ్మ కోర్కెలు కోరడంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న ఆరోపణలపై ఆమెను వాశింకు బదిలీ చేసింది కలెక్టర్ సుహార్ దివాసే. మరోవైపు ఆమె శిక్షణ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ.. రీకాల్ ఆదేశాలు జారీ చేసింది ముస్సోరీ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. తక్షణమే ఆమెను వెనక్కి రావాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఆమెపై చర్యల కోసమే ఆ ఉత్తర్వులు వెలువడి ఉంటాయనే చర్చ నడుస్తోంది. -
అలా నన్ను దోషిగా తేల్చడం తప్పు!: పూజా ఖేద్కర్
ముంబై: తన వివాదాలు ముసురుకుంటున్న వేళ.. ట్రెయినీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ మీడియా ముందు పెదవి విప్పారు. దోషిగా నిరూపితం అయ్యేంత వరకు అందరూ నిర్దోషులేనని, కేవలం మీడియా కథనాల ఆధారంగా తనను దోషిగా తేల్చేయడం తప్పని అన్నారామె. శిక్షణలోనే ఉండగానే గొంతెమ్మ కోర్కెల ద్వారా బదిలీ ఉత్తర్వులతో వార్తల్లోకి ఎక్కిన 34ఏళ్ల ఈ ఐఏఎస్.. చివరకు తప్పుడు సర్టిఫికెట్లతో, అక్రమ మార్గంలో సివిల్ సర్వీస్‌లో చేరారంటూ సంచలన అభియోగాలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమె వ్యవహారంపై కేంద్రం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిటీ విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు పూజతో పాటు ఆమె కుటుంబ సభ్యుల భాగోతాలంటూ అక్కడి మీడియా ఛానెల్స్ రోజుకో కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇవాళ ఆమె మీడియాతో తొలిసారి ముఖాముఖి మాట్లాడారు. ఒక వ్యక్తి దోషిగా తేలేంతవరకు నిర్దోషినే. అలా అని మన రాజ్యాంగమే చెప్పింది. కేవలం మీడియా తన కథనాల ద్వారా నన్ను దోషిగా చూపించడం సరికాదు. అవి ఆరోపణలు అని మీరు చెప్పొచ్చు. కానీ, ఇలా నన్ను దోషిగా చూపించడం మాత్రం ముమ్మాటికీ తప్పు అని అన్నారామె. #WATCH | Maharashtra: Trainee IAS officer Puja Khedkar says "I will testify in front of the expert committee and we will accept the decision of the committee...I do not have the right to tell you whatever investigation is going on. Whatever submission I have, will become public… pic.twitter.com/vsGISCyRho— ANI (@ANI) July 15, 2024నిపుణుల కమిటీ ముందు వాంగ్మూలం ఇస్తాను. ఏం విచారణ జరుగుతోందో బహిరంగంగా వెల్లడించే హక్కు నాకు లేదు. కానీ, కమిటీ తుది నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని అన్నారామె. తనపై వస్తున్న ఆరోపణలపై ఇంతకు ముందు ఓ జాతీయ మీడియా సంస్థకు వాట్సాప్ సందేశాల ద్వారా స్పందించిన ఆమె.. తర్వాత నేరుగా మీడియా ముందుకే వచ్చి స్పందిస్తున్నారు. -
పూజా ఖేద్కర్ కేసు.. ఆడీ కారు సీజ్ చేసిన పోలీసులు
ముంబై: అధికార దుర్వినియోగం, యూపీఎస్పీకి తప్పుడు అఫిడవిట్ సమర్చించారనే ఆరోపణలతో ఇటీవల ట్రైనీ ఐఏఎస్ పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్ వివాదాస్పదం అయ్యారు. ఇక, ఆమె వ్యవహారంపై ఏక సభ్య కమిటీ విచారణ జరుపుతోంది. అయితే తాజాగా ఆమెకు చెందిన లగ్జరీ ఆడీ కారును ఆదివారం పుణె పోలీసులు సీజ్ చేశారు. పూజా ఖేద్కర్ ఉపయోగించిన లగ్జరీ ఆడీ కారు తన పేరుమీద కాకుండా ఓ ప్రైవేట్ కంపెనీ యజమానిపై ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో పుణె రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసు సదరు కంపెనీ ఓనర్‌కు నోటీసు జారీ చేసింది. అనంతరం ఆ కారును చతుర్శృంగి పోలీసులు తీసుకువెళ్లి.. పోలీసు స్టేషన్లో బారికేడ్ల మధ్య పెట్టారు. అయితే తాజాగా ఆమె ఆడి కారును పుణె పోలీసులు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.చదవండి: పూజా ఖేద్కర్ ఎపిసోడ్: ‘నా కూతురు ఏ తప్పూ చేయలేదు’ఇక.. ఇటీవల మహరాష్ట్ర పూణే జిల్లాలో ట్రైనీ ఐఏఎస్ అధికారికగా పనిచేస్తున్న పూజా ఖేడ్కర్ తాను వినియోగించే ఆడీ కారుకు అనధికారికంగా రెడ్ బీకాన్ లైట్ల వినియోగం, గవర్నమెంట్ ఆఫ్ మహరాష్ట్ర అని స్కిక్కర్లు అంటించడంతో పాటు పైఅధికారులు లేని సమయంలో వారి ఛాంబర్లను అనుమతి లేకుండా ఉపయోగించుకోవడంపై వివాదం తలెత్తింది. అందుకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులు జరుపుకున్న వాట్సప్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది.చదవండి: పూజా ఖేద్కర్‌పై మరొకటి! ఆరోపణలు నిజమని తేలితే..ఆమె ఉద్యోగంలో చేరేందుకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె తనకు నేత్ర, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు అఫిడవిట్ ఇచ్చిందని, కానీ, వాటిని నిర్ధారించేందుకు తప్పనిసరి వైద్య పరీక్షలకు మాత్రం ఆమె డుమ్మా కొట్టినట్లు కథనాలు వచ్చాయి. దీంతో.. నిజనిర్ధారణ కోసం కేంద్రం సింగిల్ మెంబర్ కమిటీని నియమించింది. ఈ కమిటీ దర్యాప్తు జరిపి.. రెండు వారాల్లో నివేదిక ఇస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ పేర్కొంది.చదవండి: Pooja khedkar: కూతురే కాదు తల్లి కూడా అదే దందా.. వీడియో వైరల్ -
పూజా ఖేద్కర్ ఎపిసోడ్: ‘నా కూతురు ఏ తప్పూ చేయలేదు’
ముంబై: ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడటంతోపాటు, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారనే ఆరోపణలు ఎందుర్కొంటున్నారు. ఆమెపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని కేంద్రం ఏకసభ్య కమిటీని నియమించింది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించి పలు వివాదాస్పద విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు.. ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. తాజాగా శనివారం పూజా ఖేద్కర్‌పై వచ్చిన ఆరోపణలపై ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్ మీడియా ముందుకు వచ్చి ఖండిచారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తన కూతురిని వేధింపులకు గురిచేయడానికే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఒక మహిళా అధికారిణిగా ఆఫీసులో కూర్చుకోవడానికి స్థలం ఇవ్వాలని కోరటం తప్పుకాదని తన కూతురు వ్యవహారించిన తీరును సమర్థించారు. ‘నా కూతురు ( ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్) ఎటువంటి తప్పు చేయలేదు. ఒక మహిళగా ఆఫీసులో కూర్చుకోవడానికి స్థలం ఇవ్వాలని కోరటం తప్పా?. ఈవ్యవహారంపై విచారణ జరుగుతోంది. విచారణకు సంబంధించి పూర్తి తీర్పు వెలువడేవరకు వేచిచూద్దాం. నేను మాత్ర ఒక్కటి చెప్పగలను. నా కూతురు పూజా ఖేద్కర్‌ను వేధింపులకు గురిచేయటం కోసమే ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు’ అని దిలీప్ ఖేద్కర్ అన్నారు. అయితే పూజా ఖేద్కర్‌పై ఎవరు కావాలని ఆరోపణలు చేస్తున్నారన్న వారి పేర్లు మాత్రం ఆయన బయటపెట్టకపోవటం గమనార్హం. గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వార్తల్లోకి ఎక్కింది. పుణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన ఆడి కారుకు రెడ్-బ్లూ బీకన్ లైట్లు, వీఐపీ నంబర్‌ప్లేటు ఏర్పాటుచేసుకున్నారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అనే స్టిక్కర్ అమర్చారు. తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బందితోపాటు ఓ కానిస్టేబుల్‌తో అధికారిక ఛాంబర్‌ను కేటాయించాలని పట్టుబట్టారు. అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయన గదిలో తన నేమ్‌ప్లేట్ పెట్టుకొని దాన్నే తన ఛాంబర్‌గా వినియోగించుకొన్నారు. వాస్తవానికి ప్రొబేషన్‌లో రెండేళ్లపాటు ఉండే జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలు లభించవు.వాస్తవానికి ఆమె ఈ సౌకర్యాల కోసం కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తూ జరిపిన వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్లు కూడా తాజాగా వైరల్ అయ్యాయి. తనకు ఉన్నతాధికారి నుంచి ఈ సిబ్బంది నంబర్ లభించినట్లు ఆమె వాటిల్లో పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆమె కొన్ని డిమాండ్లు చేసి.. తాను వచ్చే నాటికి వాటిని పూర్తిచేయాలన్నారు. అయితే పూజ వ్యవహారాన్ని పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమెను పుణె నుంచి వాసిమ్ జిల్లాకు బదిలీ చేశారు. ప్రొబేషన్ కాలం పూర్తయ్యేవరకు అక్కడే సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా పూజ వ్యవహరిస్తారని ఉన్నతాధికారులు వెల్లడించారు. -
పూజా ఖేద్కర్‌పై మరొకటి! ఆరోపణలు నిజమని తేలితే..
ముంబై: వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కెరియర్ చిక్కుల్లో పడింది. అధికార దుర్వినియోగానికి పాల్పడటంతోపాటు, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణలు రావడంతో కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆ ఆరోపణలు నిజమని తేలితే పూజా ఖేద్కర్‌ను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉంది.డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అదనపు కార్యదర్శి మనోజ్ ద్వివేదీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. రెండు వారాల్లో ఆయన ఆమె వ్యవహారంపై ఓ నివేదిక ఇవ్వనున్నారు. ఒకవేళ ఆ దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే పూజా ఖేద్కర్‌ను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా నిజాలు దాచిపెట్టి, తప్పుడు మార్గంలో ఉద్యోగంలో చేరినందుకు ఆమెపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చని తెలిపాయి. మరోవైపు.. తాజాగా ఆమెపై మరో ఆరోపణ వెలుగులోకి వచ్చింది. తన విచారణలో మనోజ్ ద్వివేదీ, నవీ ముంబై పోలీసుల నుంచి ఓ నివేదిక తీసుకున్నారు. ఓ దొంగతనం కేసులో నిందితుడ్ని విడిచిపెట్టాలంటూ ఆమె పోలీసులకు హుకుం జారీ చేశారామె. మే 18వ తేదీన నవీ ముంబై డీసీపీకి ఫోన్ చేసిన ఖేద్కర్.. తాను ఫలానా అని పరిచయం చేసుకున్నారు. ఇనుప సామాన్లు దొంగిలించిన కేసులో పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని విడుదల చేయాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఆ నిందితుడు అమాయకుడని, పైగా అతనిపై ఆరోపణలు తీవ్ర స్థాయివేం కాదని ఆమె ఫోన్లో చెప్పారు. అయినప్పటికీ ఆ పోలీసులు ఆ కాల్‌ను పట్టించుకోలేదు. అయితే ఆ ఫోన్ కాల్ పూజా ఖేద్కర్ నుంచే వచ్చిందా? లేదంటే ఆమె పేరుతో ఎవరైనా అలా చేశారా? అనేది ద్వివేదీ కమిటీ నిర్ధారించుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే..పుణేలో సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఖేద్కర్‌పై ఆరోపణలు రావడంతో ఆమెను వాసిమ్కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడటంతో మొదలైన వివాదం.. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు, సెటిల్మెంట్లు, ఇతర అధికారులపై ఒత్తిడి చేయడం ఇలా ఒక్కొక్కటీ బయటపడ్డాయి. చివరికి ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు రేకెత్తాయి. తనకు కంటితో పాటు మానసిక సమస్యలు ఉన్నట్లు యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్లో ఖేద్కర్ పేర్కొన్నారు. 2022 ఏప్రిల్‌లో తొలిసారి దిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు వైద్య పరీక్షలకు హాజరుకాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు. దృష్టి లోపాన్ని అంచనా వేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరు కాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. ఇక పూజా ఓబీసీ ధ్రువీకరణ పత్రాలపైనా వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిటీ నివేదిక కీలకంగా మారింది. ఆ నివేదికను బట్టే ఖేద్కర్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
ట్రైనింగ్‌లోనే వీఐపీ డిమాండ్లు.. మహిళా ఐఏఎస్ అధికారి బాగోతం ఇది
ఓ మహిళ ట్రైనీ ఐఏఎస్ అధికారిపై మహారాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది.ప్రొబేషనరీ సమయంలోనే సదరు మహిళా అధికారి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఆమెను మరో చోటుకు బదిలీ చేసింది.ఆమెనె.. 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి డాక్టర్ పూజా ఖేద్కర్. పుణె నుంచి వాషిమ్‌కు బదిలీ అయ్యారు. ఇక మిగిలిన శిక్షణ పదవీకాలాన్ని అక్కడే పూర్తి చేయనున్నారు. జూలై 30, 2025 వరకు అక్కడ "సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్"గా పనిచేస్తుందని ప్రభుత్వం తమ ఉత్వర్వుల్లో పేర్కొంది. కాగా పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే సీఎస్‌కు లేఖ రాసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.అసలు ఆమె ఏం చేసిందంటేట్రైనీ అధికారి అయిన ఖేద్కర్.. పుణె కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో అనేక అనుచిత ప్రవర్తనలు పాల్పడినట్లు తేలింది. ఆమె తన ప్రైవేట్ వాహనాన్ని ఉపయోగిస్తూ దానిపై వీఐపీ నంబర్ ప్లేట్‌ను పెట్టుకుంది. జిల్లా అదనపు కలెక్టర్ అజయ్ మోరే అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయాన్ని కూడా ఆమె ఆక్రమించుకున్నట్లు సమాచారం. ఆయన లేని సమయంలో తన ఛాంబర్ డోర్ మీద పేరుతో బోర్డు ఉంచి ఆ స్థలాన్ని తన స్వంత కార్యాలయ గదిగా మార్చుకుందిఖేద్కర్ అధికారులపై అనేక డిమాండ్లను పెట్టినట్లు తెలుస్తోంది. వీఐపీ నంబర్ ప్లేట్ కలిగిన అధికారిక కారు, వసతి, తగినంత సిబ్బందితో అధికారిక ఛాంబర్, ఓ కానిస్టేబుల్ కావాలని కోరినట్లు సమాచారం. అయితే నిబంధనల ప్రకారం ట్రైనీకి పైన పేర్కొన్న సౌకర్యాలేవి ఉండవు.అయినా ఖేద్కర్ ఇంతటితో ఆగలేదు. అదనపు కలెక్టర్ ముందస్తు అనుమతి లేకుండా కుర్చీలు, సోఫాలు, టేబుల్లతో సహా అన్ని మెటీరియల్‌లను కార్యాలయం నుంచి తొలగించారు. అనంతరం ఆమె పేరు మీద లెటర్ హెడ్, విజిటింగ్ కార్డ్, పేపర్ వెయిట్, నేమ్‌ప్లేట్, రాజముద్ర, ఇంటర్‌కామ్ అందించాలని రెవెన్యూ అసిస్టెంట్‌ను ఆదేశించారు.ఇదిలా ఉండగా యూపీఎస్సీ పరీక్షలో 841 ఆల్ ఇండియా ర్యాంక్) సాధించిన ఖేద్కర,.. రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి కూతురు. తండ్రి కూడా మాజీ ఐఏఎస్ కావడంతో తన కూతురు డిమాండ్లను నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఆయన ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. కూతురికి ఏదైనా లోటు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించినట్లు సమాచారం -
IAS కూతురికి IPS తండ్రి సెల్యూట్
-
ట్రైనీ ఐఏఎస్‌గా పోలీస్ అకాడమీకి కుమార్తె.. సెల్యూట్ చేసిన ఐపీఎస్ తండ్రి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమీలో ఒక అరుదైన, స్ఫూర్తిదాయకమైన సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ఉమాహారతి యూపీఎస్సీ సివిల్స్-2022 పరీక్షల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. అయితే, గతంలో నారాయణపేట జిల్లా ఎస్పీగా పని చేసిన ఆమె తండ్రి వెంకటేశ్వర్లు.. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.ఉమాహారతి ట్రైనీ ఐఏఎస్‌గా తెలంగాణ పోలీస్ అకాడమీకి రావడంతో అక్కడ తన కుమార్తెను చూసి ఎస్పీ ర్యాంకు అధికారి అయిన వెంకటేశ్వర్లు హృదయం ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. గర్వంతో ఆయన తన కుమార్తెకు సెల్యూట్ చేసి.. పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.Proud father, who is SP rank police officer, salutes his trainee IAS daughter N Uma Harathi when she visited #Telangana Police Academy #TGPA today. N Venkateshwarlu works as Deputy Director, TGPA, while his daughter topped #UPSC civils exam 2022 securing All India 3rd rank. pic.twitter.com/xM1haCHO2m— L Venkat Ram Reddy (@LVReddy73) June 15, 2024 -
ట్రైనీ ఐఏఎస్‌పై లైంగిక వేధింపుల కేసు.. నపుంసకత్వ పరీక్షకు వెళ్లాలి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐఏఎస్ బి.మృగేందర్‌లాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈనెల 27 నుంచి జనవరి 16 వరకు ఐఏఎస్ శిక్షణకు వెళ్లాల్సి ఉన్నందున హైకోర్టు 15 రోజుల తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. చదవండి: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకుపై చీటింగ్ కేసు మృగేందర్‌లాల్ దర్యాప్తునకు సహకరించాలని, నపుంసకత్వ పరీక్షకు వెళ్లాలని, లేకపోతే ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దర్యాప్తు అధికారి పిటిషన్ దాఖలు చేయొచ్చని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విచారణను డిసెంబర్ 9కి హైకోర్టు వాయిదా వేసింది. మృగేందర్‌లాల్ 2019 డిసెంబర్ 25న తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బాధితురాలు కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. చదవండి: బీఈడీకే దిక్కులేదు.. డీఎడ్ ఎందుకు? -
రెవెన్యూ సర్వేలో ట్రైనీ ఐఏఎస్‌లు
సంగారెడ్డి రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సర్వేను శుక్రవారం ట్రైనీ ఐఏఎస్‌లు పరిశీలించారు. మండల పరిధిలోని జూల్కల్లో జరుగుతున్న రెవెన్యూ సర్వేలో పాల్గొని రైతుల సమస్యలను వినడంతోపాటు ఎలా పరిష్కరిస్తున్నారో తహసీల్దార్ గోవర్ధన్‌ను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల సవరణ, ఫౌతి మార్పుల గురించి అధ్యయనం చేశా రు. స్వయంగా 1బీ ఫారాలను ట్రైనీ ఐ ఏఎస్‌లు నింపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ గ్రా మ సభల్లో సవరించిన రికార్డులను ఆ న్‌లైన్ చేసే విధానాన్ని తెలుసుకున్నా రు. కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్‌లు జితేష్ వి పాటిల్, రాహుల్‌రాజ్, గౌతంపోత్రూ,అనురాగ్ జయంతి, ప మేలా, ఆర్ఐ కార్తీక్, సర్పంచ్ మల్ల మ్మ, వీఆర్ఓలు శ్రీనివాస్, గంగాధ ర్, రాచయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిర్ణయాల్లో దేశ ప్రయోజనాలే ముఖ్యం
న్యూఢిల్లీ: మనం తీసుకునే నిర్ణయాలు దేశ ప్రయోజనాలకు ఎప్పుడూ విఘాతం కలిగించకూడదని, అలాగే నిరుపేదలకు హాని చేయకూడదని ప్రధాని నరేంద్ర మోదీ ట్రైనీ ఐఏఎస్‌లకు సూచించారు. ఈ రెండు కీలక అంశాలను దృష్టిలో ఉంచుకొని దేశానికి సేవచేయాలన్నారు. విధానాల కంటే రాజకీయాలది ఎప్పుడూ పైచేయి కాకూడదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సహాయ కార్యదర్శులుగా మూడు నెలల శిక్షణ పూర్తిచేసుకున్న ట్రెయినీ ఐఏఎస్‌లు గురువారం ప్రధాని మోదీని కలసి కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రెజెంటేషన్లు ఇచ్చారు. స్వచ్ఛ భారత్, ఈ కోర్టులు, పర్యాటకం, వైద్యం, పరిపాలనలో అంతరిక్ష సాయంపై చేసిన పరిశీలనలు బాగున్నాయంటూ మోదీ కితాబిచ్చారు. పారిశుద్ధ్య లోపం, అపరిశుభ్ర ఆహారం వల్ల దేశంలో ఏటా లక్షమంది చిన్నారులు మరణిస్తున్నారని, అలాగే రూ. 3.6 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని ఒక ఐఏఎస్ నివేదిక సమర్పించారు. పట్టణ ప్రాంతాల్లో దాదాపు 12 శాతం మంది బహిరంగ మల విసర్జన చేస్తున్నారని ట్రైనీ ఐఏఎస్ స్వధా దేవ్ సింగ్ తన పరిశీలనలో గుర్తించారు. ఈ మేరకు పీఎంవో కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. 10 గ్రూపుల ఏర్పాటు కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శులతో 10 గ్రూపులు ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయిం చారు. ఈ గ్రూపులు వ్యవసాయం, ఇంధనం, రవాణా వంటి విభాగాలపై పని చేసి వచ్చే నెల చివరికి నివేదికలు సమర్పిస్తాయి. గురువారం అన్ని శాఖల కార్యదర్శుల భేటీ సందర్భంగా ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో 8 గ్రూపుల కార్యదర్శులు ఇచ్చిన నివేదికలకు కొనసాగింపుగా కొత్త గ్రూపులు పనిచేస్తాయి. -
'నా వల్లే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చింది'
-
'నా వల్లే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చింది'
ముస్సోరీ: తన వల్లే ప్రముఖ కంప్యూటర్ సంస్థ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న యువ ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. దేశంలో సాంకేతికాభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని నాటి ప్రధాని వాజపేయికి సూచించనట్లు ఆయన వెల్లడించారు. సెల్ఫోన్లు, ఇంటర్నెట్ వచ్చాక ఎగుమతులు బాగా పెరిగాయని చంద్రబాబు పేర్కొన్నారు. సివిల్స్‌కు పోటీ పడే వారంతా మేథావి విద్యార్థులే అని ఆయన అన్నారు. ప్రజా సేవ చేయాలనుకునే వారు సివిల్స్‌కు వస్తారన్నారు. కష్టపడితే డబ్బు సంపాదించడం అనేది అంత పెద్ద విషయమేమి కాదని చంద్రబాబు అన్నారు. -
ట్రైనీ ఐఏఎస్‌ల కేటాయింపులపై క్యాట్ యథాతథ స్థితి
సాక్షి, హైదరాబాద్: ట్రైనీ ఐఏఎస్‌లు శ్రీజన తుమ్మల, శివశంకర్ లహోటిలను తాత్కాలికంగా ఏపీలోనే కొనసాగించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ మేరకు వీరి కేటాయింపులపై యథాతథస్థితి కొనసాగించాలని క్యాట్ ధర్మాసనం బుధవారం ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేస్తూ విచారణను 25కు వాయిదా వేసింది. ప్రస్తుతం వీరు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అసిస్టెంట్ కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. చిత్తూరు, విజయనగరం జిల్లాలకు చెందిన వారమైనా హైదరాబాద్ వాసులుగా చూపుతూ తాత్కాలికంగా తెలంగాణకు కేటాయించారని, దీన్ని సవాల్ చేస్తూ వీరిద్దరూ క్యాట్‌ను ఆశ్రయించడంతో వీరిని తాత్కాలికంగా ఏపీలోనే కొనసాగించాలని క్యాట్ ఆదేశించింది. అయితే ఇటీవల తుది కేటాయింపుల్లో వీరిని తెలంగాణకు కేటాయించడంతో మరోసారి వీరు క్యాట్‌ను ఆశ్రయించారు. డీఐజీ శివప్రసాద్ పిటిషన్‌పై 18న విచారణ: తన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోకుండా ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ 1998 బ్యాచ్‌కు చెందిన డీఐజీ శివప్రసాద్ క్యాట్‌ను ఆశ్రయించారు. తాత్కాలిక కేటాయింపుల్లో తనను తెలంగాణకు కేటాయించి ఇటీవల చేసిన తుది కేటాయింపుల్లో ఏపీకి కేటాయించారని, ఇది నిబంధనలకు విరుద్దమని పేర్కొన్నారు. తన భార్య, కుమారునికి వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌లో తాను ఉండాల్సి ఉందని, ఈ నేపథ్యంలో తనను తెలంగాణకు కేటాయించాలని కోరినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. తాత్కాలికంగా తనను తెలంగాణలోనే కేటాయించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను ధర్మాసనం ఈ నెల 18కి వాయిదా వేసింది. -
ఐఏఎస్ అధికారి సెల్‌ఫోన్ చోరీ
తిరువొత్తియూరు: ఐఏఎస్ అధికారి సెల్‌ఫోన్ చోరీ చేసి రూ. 10 వేలకు విక్రయించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన ప్రశాంత్‌కుమార్ మిశ్రా ఐఏఎస్ అధికారి. ఇతను శిక్షణకు సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలో చెన్నైకి వచ్చారు. చేపాక్కం గెస్ట్‌హౌస్‌లో ఉంటున్నారు. గత 2వ తేదీ రాత్రి 10.30 గంటలకు మద్రాసు యూనివర్సిటీ వద్ద వాలాజా రోడ్డులో వాకింగ్ చేస్తున్న సమయంలో బైకులో వచ్చిన ఓ వ్యక్తి ఐఏఎస్ అధికారి సెల్‌ఫోన్ లాక్కుని పారిపోయాడు. నేరస్తున్ని పట్టుకుని అరెస్టు చేయూలని పోలీసులకు కమిషనర్ జార్జి ఆదేశాలు జారీ చేశారు. సహాయ కమిషనర్ పీర్ మహ్మద్ నేతృత్వంలో అన్నా సమాధి పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ శివానందం కేసు నమోదు చేసి విచారణ చేపట్టా రు. పోలీసుల విచారణలో ప్రశాంత్‌కుమార్ మిశ్రా సెల్‌ఫోన్‌ను దుండగుడు రూ . 10వేలకు బర్మాబజార్‌లో విక్రయించినట్టు తెలిసింది. దీంతో ఈ సెల్‌ఫోన్‌ను విక్రయిం చిన ప్యారిస్‌కు చెందిన పీర్ హనీఫ్ (21) అనే యువకుడిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. -
ఇందూరుకు 18 మంది ట్రెయినీ ఐఏఎస్‌లు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : 2014వ బ్యాచ్‌కు చెందిన 18 మంది ట్రెయినీ ఐఏఎస్‌లు నిజామాబాద్ జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ముస్సోరి లోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బీఎస్ఎన్ఏఏ) శిక్షణ పొందుతున్న వివిధ రాష్ట్రాల కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లు శుక్రవారం నిజామాబాద్‌కు చేరుకున్నారు. నిజామాబాద్ కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఆధ్వర్యంలో ట్రెయినీ ఐఏఎస్‌లకు స్వాగతం పలికిన ఉన్నతాధికారులు మూడు రోజుల పర్యటనకు సం బంధించిన టూర్ షెడ్యూల్ ఖరారు చేశారు. మధ్యాహ్నం కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో ట్రెయినీ ఐఏఎస్‌లకు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కలెక్టర్ రోనాల్డ్‌రోస్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. శనివారం నుంచి 18 మంది ట్రెయినీ ఐఏఎస్‌లు నాలుగు జట్లుగా ఏర్పడి వేర్వేరు ప్రాంతాలలో క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై పరిశీలన ముస్సోరీలో శిక్షణ పొందుతున్న 18 మంది 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌లు మూడు రోజులపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పోలీసు, వైద్య ఆరోగ్య, విద్యా, అటవీశాఖ తదితర ప్రభుత్వశాఖ ల ఉన్నతాధికారులతో పరిచయం, క్షేత్రస్థాయిలో సమగ్ర అవగాహన కలిగేలా చూడాలని ఉన్నతాధికారు లు సూచించారు. దీంతో కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ట్రెయినీ ఐఏఎస్‌ల సందర్శన కోసం ఏర్పాట్లు చేయించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ‘భారత్ దర్శన్’లో భాగంగా మూడు రోజుల పర్యటన కోసం ట్రెయినీ ఐఏఎస్‌లు నిజామాబాద్‌కు చేరుకున్నారు. శనివారం నుంచి ఉపాధిహామీ, సర్వశిక్ష అభియాన్, మధ్యాహ్నభోజనం తదితర పథకాల అమలును ప్రాం తాల వారీగా పరిశీలించనున్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు, గిరిజన, గతంలో తీవ్రవాద ప్రాబల్యం గల ప్రాంతాలను వీరు సందర్శించనున్నారు. ప్రజల జీవన స్థితిగతులను అధ్యయనం చేయనున్నారు. ఈ మేరకు ఐఏఎస్‌ల పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ నలుగురు లైజనింగ్ అధికారులను నియమించారు. తిరిగి సోమవారం నాందేడ్‌కు వెళ్తారు. ట్రెయినీ ఐఏఎస్‌లు వీరే స్టడీటూర్ కోసం వచ్చిన ట్రెయినీ ఐఏఎస్‌ల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. నాలుగు జట్లుగా జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో పర్యటించే ఐఏఎస్‌ల కోసం నలుగురు జి ల్లా ఉన్నతాధికారులను లైజన్ అధికారులను నియమిం చిన కలెక్టర్ పోలీసు బందోబస్తు కూడ ఏర్పాటు చేశారు. ఇందులో నలుగురు మహిళా ఐఏఎస్‌లు ఉన్నారు. మూ డు రోజుల పాటు జిల్లాలో పర్యటించే ట్రెయినీ ఐఏఎస్ ల్లో అదితి చౌదరి, అప్సనాఫర్వీన్, మనీషఖాత్రీ, డాక్టర్ సరితయాదవ్, పి.అంబముత్తన్, సకేత్మల్యీయ, ఫయి జ్ హక్, అహ్మద్ ముంతాజ్, సందీప్‌కుమార్, దివ్యన్షు జా, డాక్టర్ ఎద్దుల విజయ్, రిషివ్గుప్త, జయశీలన్, విక్ర మ్, అనిష్యాదవ్, అక్షయ్త్రిపాఠీ, రఘునందన్మూర్తి, అభిషేక్ ఆనంద్, సందీప్కుమార్జాలు ఉన్నారు. -
కొండరెడ్డి గ్రామాల్లో ట్రైనీ ఐఏఎస్‌ల పర్యటన
కొటారుగొమ్ము(వీఆర్‌పురం), న్యూస్‌లైన్: మండలంలోని మారుమూల కొండరెడ్డి గిరిజన గ్రామాలు కొటారుగొమ్ము, పోచవరం తదితర గ్రామాల్లో మంగళవారం ట్రైనీ ఐఏఎస్‌లు పర్యటించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో మొత్తం 18 మంది ట్రైనీ ఐఏఎస్‌ల బృందం ఈ ప్రాంతంలోని గిరిజనుల జీవన విధానాన్ని, వారి ఆదాయ మార్గాలను, ప్రభుత్వం ద్వారా అందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. తొలుత వారు కొటారుగొమ్ము గ్రామంలో గిరిజనులతో సమావేశమై మాట్లాడారు. గ్రామంలో ఇటీవల నిర్వహించిన పెసా గ్రామసభ, గ్రామంలో అమలవుతున్న ఉపాధి హామీ పనులను గురించి ఎస్‌ఓపీటీజి మల్లీశ్వరి వారికి వివరించారు. అనంతరం గ్రామస్తులతో వారు మాట్లాడారు. అడవులను రక్షించుకోవాలని, తద్వారా పర్యావరణ సమతులంగా ఉంటుందని తెలిపారు అనంతరం స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని, పోచవరంలోని అంగన్వాడీ కేంద్రాన్ని, బాలబడి కేంద్రాలను సందర్శించి పిల్లలతో మాట్లాడారు. అక్కడి నుంచి బోట్లో తుమ్మిలేరు, కాకిసునూరు గ్రామాల మీదుగా పేరంటపల్లి చేరుకొని అక్కడి ప్రాచీన శివాలయాన్ని దర్శించుకున్నారు. అక్కడి గిరిజనుల ఆచార సంప్రదాయాలను తెలుసుకున్నారు. అలాగే గిరిజనులు వెదురుతో తయారు చేసి విక్రయించే వస్తువులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ శ్రీనివాస్, పీఎంఆర్‌డీ ఎన్.ప్రతిమ, ఎస్‌ఓపీటీజీ మల్లీశ్వరి, ఏటీడబ్ల్యూఓ సీతారాములు పాల్గొన్నారు.