సంగారెడ్డి రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సర్వేను శుక్రవారం ట్రైనీ ఐఏఎస్‌లు పరిశీలించారు. మండల పరిధిలోని జూల్‌కల్‌లో జరుగుతున్న రెవెన్యూ సర్వేలో పాల్గొని రైతుల సమస్యలను వినడంతోపాటు ఎలా పరిష్కరిస్తున్నారో తహసీల్దార్ గోవర్ధన్‌ను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల సవరణ, ఫౌతి మార్పుల గురించి అధ్యయనం చేశా రు. స్వయంగా 1బీ ఫారాలను ట్రైనీ ఐ ఏఎస్‌లు నింపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ గ్రా మ సభల్లో సవరించిన రికార్డులను ఆ న్‌లైన్ చేసే విధానాన్ని తెలుసుకున్నా రు. కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్‌లు జితేష్ వి పాటిల్, రాహుల్‌రాజ్, గౌతంపోత్రూ,అనురాగ్ జయంతి, ప మేలా, ఆర్‌ఐ కార్తీక్, సర్పంచ్ మల్ల మ్మ, వీఆర్‌ఓలు శ్రీనివాస్, గంగాధ ర్, రాచయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment