ముంబై: తన వివాదాలు ముసురుకుంటున్న వేళ.. ట్రెయినీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ మీడియా ముందు పెదవి విప్పారు. దోషిగా నిరూపితం అయ్యేంత వరకు అందరూ నిర్దోషులేనని, కేవలం మీడియా కథనాల ఆధారంగా తనను దోషిగా తేల్చేయడం తప్పని అన్నారామె.
శిక్షణలోనే ఉండగానే గొంతెమ్మ కోర్కెల ద్వారా బదిలీ ఉత్తర్వులతో వార్తల్లోకి ఎక్కిన 34ఏళ్ల ఈ ఐఏఎస్.. చివరకు తప్పుడు సర్టిఫికెట్లతో, అక్రమ మార్గంలో సివిల్ సర్వీస్‌లో చేరారంటూ సంచలన అభియోగాలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమె వ్యవహారంపై కేంద్రం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిటీ విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు పూజతో పాటు ఆమె కుటుంబ సభ్యుల భాగోతాలంటూ అక్కడి మీడియా ఛానెల్స్ రోజుకో కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి.
ఈ క్రమంలో.. ఇవాళ ఆమె మీడియాతో తొలిసారి ముఖాముఖి మాట్లాడారు. ఒక వ్యక్తి దోషిగా తేలేంతవరకు నిర్దోషినే. అలా అని మన రాజ్యాంగమే చెప్పింది. కేవలం మీడియా తన కథనాల ద్వారా నన్ను దోషిగా చూపించడం సరికాదు. అవి ఆరోపణలు అని మీరు చెప్పొచ్చు. కానీ, ఇలా నన్ను దోషిగా చూపించడం మాత్రం ముమ్మాటికీ తప్పు అని అన్నారామె.
#WATCH | Maharashtra: Trainee IAS officer Puja Khedkar says "I will testify in front of the expert committee and we will accept the decision of the committee...I do not have the right to tell you whatever investigation is going on. Whatever submission I have, will become public… pic.twitter.com/vsGISCyRho
— ANI (@ANI) July 15, 2024
నిపుణుల కమిటీ ముందు వాంగ్మూలం ఇస్తాను. ఏం విచారణ జరుగుతోందో బహిరంగంగా వెల్లడించే హక్కు నాకు లేదు. కానీ, కమిటీ తుది నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని అన్నారామె. తనపై వస్తున్న ఆరోపణలపై ఇంతకు ముందు ఓ జాతీయ మీడియా సంస్థకు వాట్సాప్ సందేశాల ద్వారా స్పందించిన ఆమె.. తర్వాత నేరుగా మీడియా ముందుకే వచ్చి స్పందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment