DOPT
-
క్యాట్‌లో ఐఏఎస్‌ల పిటిషన్: నాలుగు వారాలకు విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్: ఐఏఎస్ అధికారుల కేటాయింపుపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్)లో ఇవాళ( సోమవారం) విచారణ జరగింది. స్వాపింగ్, డొమిసిల్ (స్థిర నివాసం) ఆధారంగా తమ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోలేదన్న ఐఏఎస్‌ల పిటిషన్‌పై క్యాట్ విచారణ చేపట్టింది. అయితే ఈరోజు డీఓపీటీ కౌంటర్ దాఖలు చేయలేదు. ఇక.. ఎడుగురు ఐఏఎస్ అధికారుల విడిగా కౌంటర్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఐఏఎస్ తరుపు న్యాయవాదులు కోరారు. వచ్చే విచారణకు ఏడుగురు ఐఏఎస్‌ల కేటాయింపుపై విడిగా కౌంటర్లు ఫైల్ చేయాలనీ డీఓపీటీకి క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ క్యాట్ 4 వారాలకు వాయిదా వేసింది.గత నెలలో కేటాయించిన రాష్ట్రాల్లోనే విధులు నిర్వహించాలంటూ డీవోపీటీ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఐఏఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. ఐఏఎస్‌ల పిటిషన్‌పై క్యాట్ విచారణ చేపట్టింది. వాదనల అనంతరం ..డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. ప్రతివాదులైన కేంద్రం, డీవోపీటీలకు నోటీసులు ఇచ్చింది. నవంబరు 5లోపు కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఆదేశాలతో ఇప్పటికే కేటాయించిన రాష్ట్రాల్లో ఐఏఎస్‌లు రిపోర్ట్ చేశారు.అయితే తమని డొమిసిల్,స్వాపింగ్ ఆధారంగా కేటాయింపు జరగలేదని, డీవోపీటీ తమ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోలేదని ఏడుగురు ఐఏఎస్‌లు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
అలా నన్ను దోషిగా తేల్చడం తప్పు!: పూజా ఖేద్కర్
ముంబై: తన వివాదాలు ముసురుకుంటున్న వేళ.. ట్రెయినీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ మీడియా ముందు పెదవి విప్పారు. దోషిగా నిరూపితం అయ్యేంత వరకు అందరూ నిర్దోషులేనని, కేవలం మీడియా కథనాల ఆధారంగా తనను దోషిగా తేల్చేయడం తప్పని అన్నారామె. శిక్షణలోనే ఉండగానే గొంతెమ్మ కోర్కెల ద్వారా బదిలీ ఉత్తర్వులతో వార్తల్లోకి ఎక్కిన 34ఏళ్ల ఈ ఐఏఎస్.. చివరకు తప్పుడు సర్టిఫికెట్లతో, అక్రమ మార్గంలో సివిల్ సర్వీస్‌లో చేరారంటూ సంచలన అభియోగాలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమె వ్యవహారంపై కేంద్రం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిటీ విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు పూజతో పాటు ఆమె కుటుంబ సభ్యుల భాగోతాలంటూ అక్కడి మీడియా ఛానెల్స్ రోజుకో కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇవాళ ఆమె మీడియాతో తొలిసారి ముఖాముఖి మాట్లాడారు. ఒక వ్యక్తి దోషిగా తేలేంతవరకు నిర్దోషినే. అలా అని మన రాజ్యాంగమే చెప్పింది. కేవలం మీడియా తన కథనాల ద్వారా నన్ను దోషిగా చూపించడం సరికాదు. అవి ఆరోపణలు అని మీరు చెప్పొచ్చు. కానీ, ఇలా నన్ను దోషిగా చూపించడం మాత్రం ముమ్మాటికీ తప్పు అని అన్నారామె. #WATCH | Maharashtra: Trainee IAS officer Puja Khedkar says "I will testify in front of the expert committee and we will accept the decision of the committee...I do not have the right to tell you whatever investigation is going on. Whatever submission I have, will become public… pic.twitter.com/vsGISCyRho— ANI (@ANI) July 15, 2024నిపుణుల కమిటీ ముందు వాంగ్మూలం ఇస్తాను. ఏం విచారణ జరుగుతోందో బహిరంగంగా వెల్లడించే హక్కు నాకు లేదు. కానీ, కమిటీ తుది నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని అన్నారామె. తనపై వస్తున్న ఆరోపణలపై ఇంతకు ముందు ఓ జాతీయ మీడియా సంస్థకు వాట్సాప్ సందేశాల ద్వారా స్పందించిన ఆమె.. తర్వాత నేరుగా మీడియా ముందుకే వచ్చి స్పందిస్తున్నారు. -
పూజా ఖేద్కర్‌పై మరొకటి! ఆరోపణలు నిజమని తేలితే..
ముంబై: వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కెరియర్ చిక్కుల్లో పడింది. అధికార దుర్వినియోగానికి పాల్పడటంతోపాటు, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణలు రావడంతో కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆ ఆరోపణలు నిజమని తేలితే పూజా ఖేద్కర్‌ను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉంది.డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అదనపు కార్యదర్శి మనోజ్ ద్వివేదీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. రెండు వారాల్లో ఆయన ఆమె వ్యవహారంపై ఓ నివేదిక ఇవ్వనున్నారు. ఒకవేళ ఆ దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే పూజా ఖేద్కర్‌ను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా నిజాలు దాచిపెట్టి, తప్పుడు మార్గంలో ఉద్యోగంలో చేరినందుకు ఆమెపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చని తెలిపాయి. మరోవైపు.. తాజాగా ఆమెపై మరో ఆరోపణ వెలుగులోకి వచ్చింది. తన విచారణలో మనోజ్ ద్వివేదీ, నవీ ముంబై పోలీసుల నుంచి ఓ నివేదిక తీసుకున్నారు. ఓ దొంగతనం కేసులో నిందితుడ్ని విడిచిపెట్టాలంటూ ఆమె పోలీసులకు హుకుం జారీ చేశారామె. మే 18వ తేదీన నవీ ముంబై డీసీపీకి ఫోన్ చేసిన ఖేద్కర్.. తాను ఫలానా అని పరిచయం చేసుకున్నారు. ఇనుప సామాన్లు దొంగిలించిన కేసులో పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని విడుదల చేయాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఆ నిందితుడు అమాయకుడని, పైగా అతనిపై ఆరోపణలు తీవ్ర స్థాయివేం కాదని ఆమె ఫోన్లో చెప్పారు. అయినప్పటికీ ఆ పోలీసులు ఆ కాల్‌ను పట్టించుకోలేదు. అయితే ఆ ఫోన్ కాల్ పూజా ఖేద్కర్ నుంచే వచ్చిందా? లేదంటే ఆమె పేరుతో ఎవరైనా అలా చేశారా? అనేది ద్వివేదీ కమిటీ నిర్ధారించుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే..పుణేలో సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఖేద్కర్‌పై ఆరోపణలు రావడంతో ఆమెను వాసిమ్కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడటంతో మొదలైన వివాదం.. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు, సెటిల్మెంట్లు, ఇతర అధికారులపై ఒత్తిడి చేయడం ఇలా ఒక్కొక్కటీ బయటపడ్డాయి. చివరికి ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు రేకెత్తాయి. తనకు కంటితో పాటు మానసిక సమస్యలు ఉన్నట్లు యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్లో ఖేద్కర్ పేర్కొన్నారు. 2022 ఏప్రిల్‌లో తొలిసారి దిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు వైద్య పరీక్షలకు హాజరుకాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు. దృష్టి లోపాన్ని అంచనా వేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరు కాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. ఇక పూజా ఓబీసీ ధ్రువీకరణ పత్రాలపైనా వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిటీ నివేదిక కీలకంగా మారింది. ఆ నివేదికను బట్టే ఖేద్కర్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
పూజా ఖేద్కర్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్
ఢిల్లీ: వివాదాస్పదంగా మారిన ట్రెయినీ ఐఏఎస్ పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్‌కు ఝలక్ తగిలింది. తప్పుడు ధ్రువీకరణలు సమర్పించిందని ఆమెపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఏకపక్ష సభ్య కమిటీని నియమించింది. ఆమె ఉద్యోగంలో చేరేందుకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె తనకు నేత్ర, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు అఫిడవిట్ ఇచ్చిందని, కానీ, వాటిని నిర్ధారించేందుకు తప్పనిసరి వైద్య పరీక్షలకు మాత్రం ఆమె డుమ్మా కొట్టినట్లు కథనాలు వచ్చాయి. దీంతో.. నిజనిర్ధారణ కోసం కేంద్రం సింగిల్ మెంబర్ కమిటీని నియమించింది. ఈ కమిటీ దర్యాప్తు జరిపి.. రెండు వారాల్లో నివేదిక ఇస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(DoPT) పేర్కొంది. వివాదం ఇదే..గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వార్తల్లోకి ఎక్కింది. పుణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన ఆడి కారుకు రెడ్-బ్లూ బీకన్ లైట్లు, వీఐపీ నంబర్‌ప్లేటు ఏర్పాటుచేసుకున్నారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అనే స్టిక్కర్ అమర్చారు. తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బందితోపాటు ఓ కానిస్టేబుల్‌తో అధికారిక ఛాంబర్‌ను కేటాయించాలని పట్టుబట్టారు. అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయన గదిలో తన నేమ్‌ప్లేట్ పెట్టుకొని దాన్నే తన ఛాంబర్‌గా వినియోగించుకొన్నారు. వాస్తవానికి ప్రొబేషన్‌లో రెండేళ్లపాటు ఉండే జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలు లభించవు. వాస్తవానికి ఆమె ఈ సౌకర్యాల కోసం కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తూ జరిపిన వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్లు కూడా తాజాగా వైరల్ అయ్యాయి. తనకు ఉన్నతాధికారి నుంచి ఈ సిబ్బంది నంబర్ లభించినట్లు ఆమె వాటిల్లో పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆమె కొన్ని డిమాండ్లు చేసి.. తాను వచ్చే నాటికి వాటిని పూర్తిచేయాలన్నారు. అయితే పూజ వ్యవహారాన్ని పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమెను పుణె నుంచి వాసిమ్ జిల్లాకు బదిలీ చేశారు. ప్రొబేషన్ కాలం పూర్తయ్యేవరకు అక్కడే సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా పూజ వ్యవహరిస్తారని ఉన్నతాధికారులు వెల్లడించారు.నియామకమే వివాదం.. 2022 ఏప్రిల్‌లో తొలిసారి దిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకొన్నారు. దృష్టి లోపాన్ని అంచనావేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకొంది. ఇక పూజా ఓబీసీ ధ్రువీకరణపైనా వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది. నాకు అనుమతి లేదు.. వివాదాల నేపథ్యంలో.. ఐఏఎస్ పూజా ఖేద్కర్ తొలిసారి మీడియా వద్ద స్పందించారు. ‘‘నాకు ఈ అంశంపై మాట్లాడటానికి ప్రభుత్వ అనుమతి లేదు. నిబంధనలు అనుమతించవు క్షమించండి. మహారాష్ట్రలోని వాసిమ్‌లో కొత్త పాత్ర పోషించడం సంతోషంగానే ఉంది’’ అని పేర్కొన్నారు. -
ఆ అధికారం కేంద్రానిదే..
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారుల కేటాయింపుపై తలెత్తిన వివాదంలో నిర్ణయం తీసుకునే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిబ్బంది, శిక్షణ విభాగానికి (డీవోపీటీ) అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. రాష్ట్రాల మధ్య అధికారుల కేటాయింపులు చేసే పరిధి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)కు లేదని తేల్చిచెప్పింది. రాష్ట్ర విభజన సమయంలో అధికారుల కేటాయింపు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాల మేరకు చట్టప్రకారం అధికారి వారీగా నిర్ణయం వెలువరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అధికారుల అభ్యంతరాలను విడివిడిగా పరిశీలించాలని.. స్థానికత, పదేళ్ల సర్వీస్, ఇంకా మిగిలి ఉన్న సర్వీస్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. కేడర్ వివాదం ఎదుర్కొంటున్న అధికారులు డీవోపీటీకి పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. నీ మేరకు ప్రత్యూష్ సిన్హా కమిటీ కేటాయింపులను క్యాట్ మార్చడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావుల ధర్మాసనం తీర్పునిచ్చింది. కేడర్ వివాదం ఇదీ.. ఉమ్మడి ఏపీ విభజన నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులను ఇరు రాష్ట్రాల మధ్య విభజించారు. కమిటీ ఏపీకి కేటాయించిన కొందరు అధికారులు క్యాట్‌ను ఆశ్రయించి.. తెలంగాణలో విధులు నిర్వర్తించేలా ఉత్తర్వులు పొందారు. కేంద్ర ప్రభుత్వం క్యాట్ ఉత్తర్వులను తప్పుబడుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. విచారణ జరిపిన హైకోర్టు.. గత ఏడాది జనవరిలో తెలంగాణ సీఎస్‌గా ఉన్న సోమేశ్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాల్సిందేనంటూ తీర్పునిచ్చింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ కేటాయింపులలో క్యాట్ జోక్యాన్ని తప్పుపట్టింది. అయితే కేడర్, సర్వీస్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా తమ పిటిషన్లను విడిగా విచారించాలంటూ అప్పటి డీజీపీ అంజనీకుమార్ సహా ఇతర అధికారులు కోరడంతో.. ఆ విచారణను జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ బెంచ్‌కు అప్పగించింది. వాదనలు సాగాయిలా.. కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) నరసింహ శర్మ వాదనలు వినిపించారు. ఏఐఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించి ప్రత్యూష్ సిన్హా కమిటీ కేటాయింపులకు వ్యతిరేకంగా ఉపశమనం పొందడం చట్టరీత్యా ఆమోదయోగ్యం కాదని వివరించారు. సోమేశ్‌కుమార్ అంశంలో తీర్పు సందర్భంగా హైకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల తరఫున న్యాయవాదులు కె.లక్ష్మీనరసింహ, గోదా శివ, సుధీర్ తదితరులు వాదనలు వినిపించారు. ‘‘ధర్మాసనం అలా నిర్ణయాన్ని కేంద్రానికి వదిలేయవద్దు. పిటిషన్ల వారీగా విచారణ చేయాలి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 80 ప్రకారం అధికారుల కేటాయింపునకు ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలను ఐపీఎస్‌లు సవాల్ చేశారు. స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేడర్ వివాదం ఎదుర్కొంటున్న అధికారుల కేటాయింపు బాధ్యతను కేంద్రానికే అప్పగిస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. -
కేడర్ వివాదం కేసు.. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేత
హైదరాబాద్, సాక్షి: ఏడేళ్లుగా సాగుతున్న.. ఏపీ-తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ వివాదం కేసును ముగించింది ఎట్టకేలకు ముగించింది తెలంగాణ హైకోర్టు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్- క్యాట్(Central Administrative Tribunal) తీర్పును ఉన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. ప్రత్యూష సిన్హా కమిటీ మార్గదర్శకాల మేరకే కేడర్ కేటాయింపు ఉండాలన్న కేంద్రం వాదనతో ఏకీభవించిన కోర్టు.. మరోవైపు ఐఏఎస్, ఐపీఎస్‌ల అభ్యంతరాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని తన తీర్పులో స్పష్టం చేసింది. తాజా తీర్పులో.. ఏడేళ్ల కిందటి నాటి క్యాట్ తీర్పును కొట్టేయడంతో పాటుగా డీవోపీటీకి ఐఏఎస్, ఐపీఎస్‌లు తమ అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం కల్పించింది తెలంగాణ హైకోర్టు. అలాగే.. అధికారుల సీనియారిటీ, స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. అప్పటివరకు ఇప్పుడున్న రాష్ట్రాల్లోనే విధులు కొనసాగించాలని ఆదేశించింది. ‘‘ఈ 13 మంది బ్యూరో క్రాట్ లు క్యాడర్ కేటాయింపు అంశంపై కేంద్రాన్ని అభ్యర్థించాలి. అధికారులు 10 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ చేసిన విషయాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలి. ఒక్కొక్క అధికారి అభ్యర్థనను కేంద్రం విడివిడిగా వినాలి. అధికారులు అవసరమైతే లీగల్‌గా ముందుకు వెళ్లొచ్చు. అధికారుల కేటాయింపుకు క్యాట్ లు ఎలాంటి హక్కు లేదు. బ్యూరో క్రాట్ ల కేటాయింపు కేవలం డీవోపీటీ పరిధిలో అంశమే’’ అని తీర్పు సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. వివాదం ఏంటంటే.. రాష్ట్ర విభజన సమయంలో 14 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లను తెలుగు రాష్ట్రాలకు కేటాయించింది కేంద్రం పరిధిలోని డీవోపీటీ( Department of Personnel and Training). అయితే.. ఆ ఉత్తర్వుల్ని క్యాట్ కొట్టేసింది. తన కేటాయింపులు పక్కనపెట్టి మరీ క్యాట్ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ 2016లో డీవోపీటీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తన పరిధి దాటి బ్యూరోక్రాట్ లపై క్యాట్ ఉత్తర్వులు జారీ చేసిందని వాదిస్తూ వచ్చింది. 2016 నుండి హైకోర్టు లో ఈ వివాదంపై విచారణ కొనసాగుతుండగా.. ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ కేటాయింపుల పై తుది వాదనలు ముగిశాయి. ఈ మధ్యలో కేడర్ కేటాయింపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కు పంపుతామని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే.. సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయిస్తూ గత ఏడాది హైకోర్ట్ ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో.. మిగిలిన 13 మంది అధికారుల క్యాడేర్ కేటాయింపు పై తుది వాదనలు ఇవాళ జరిగాయి. -
వ్యవసాయ భూమి... ఐదెకరాల్లోపే ఉండాలి
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లకు కుటుంబ వార్షిక ఆదాయం ఒక్కటే కొలమానం కాదు. ఇతరత్రా ఆస్తులనూ పరిగణనలోకి తీసుకుంటారు. కుటుంబానికి ఐదెకరాలు, ఆపై వ్యవసాయ భూమి ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అనర్హులే. అలాగే 1,000 చదరపు అడుగులు, ఆపై వైశాల్యంలో నివాస గృహం/ఫ్లాట్ ఉన్నా ఈ రిజర్వేషన్ వర్తించదు. నోటిఫైడ్ పురపాలికలు, మున్సిపాలిటీల్లో 100 చదరపు గజాలు, ఆపై విస్తీర్ణంలో నివాస స్థలం(ప్లాట్) కలిగి ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో 200 చదరపు గజాలు, ఆపై విస్తీర్ణంలో నివాస స్థలం కలిగి ఉన్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించవు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండి, పైన పేర్కొన్న పరిమితుల్లోపు స్థిరాస్తులు ఉంటేనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ మేరకు ఈడబ్ల్యూఎస్ అమలుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీఓపీటీ) 2019 జనవరి 19న ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ... లాంటి ఏ ఇతర రిజర్వేషన్ల కిందకు రాని వారు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోటాకు అర్హులు. యూపీఎస్సీతో సహా ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్ పేరుతో అగ్ర కుల పేదలకు 10 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ సవరణ ద్వారా 2019 జనవరిలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.(చదవండి: ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం కోటా: కేసీఆర్ ప్రకటన) ఈ క్రమంలో... దాదాపు రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో సైతం 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు మూడు రోజుల్లో సమీక్ష నిర్వహించి ఈ రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు జారీ చేస్తామని ఈ నెల 21న సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎవరికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయి? అనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు జారీ చేయ బోతోంది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు అవకాశాలున్నాయి. కుటుంబ ఆదాయ గణన ఇలా.. ఈడబ్ల్యూఎస్ కోటా కోరుకునే వ్యక్తి కుటుంబ వార్షిక వేతనం రూ.8 లక్షల లోపు ఉండాలి. ఇక్కడ కుటుంబ వార్షిక ఆదాయాన్ని లెక్కించే సమయంలో సదరు వ్యక్తి తల్లిదండ్రులు, 18 ఏళ్లలోపు ఉన్న తొబుట్టువులు, జీవిత భాగస్వామి, 18 ఏళ్లలోపు ఉన్న సంతానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. కుటుంబంలో 18 ఏళ్లకు పైబడిన తోబుట్టువులు, సంతానమున్నా వారి ఆదాయాన్ని కుటుంబ ఆదాయం కింద లెక్కించరు. కుటుంబ సభ్యుల వేతనాలు, వ్యవసాయం, వ్యాపారం, వృతి అన్ని మార్గాల నుంచి వచ్చే ఆదాయాన్ని కుటుంబ ఆదాయంగా లెక్కిస్తారు. -
కోటిన్నర మందికి పాఠాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఓ వైపు కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండగా, రోగ లక్షణాలు మొదలుకుని చికిత్స దాకా క్షేత్రస్థాయిలో అవగాహన అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా రెండో దశ కొనసాగుతుండగా, మూడో దశకు చేరుకుంటే తలెత్తే పరిస్థితులపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు కరోనా విస్తరిస్తే కట్టడి చేయడం సాధ్యం కాకపోవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు కేంద్ర పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) ‘ఈ ప్లాట్పారమ్’ను రూపొందించింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఎన్సీసీ, నెహ్రూ యువకేంద్రం, స్కౌట్స్ అండ్ గైడ్స్, రెడ్‌క్రాస్ సంస్థలకు చెందిన కార్యకర్తలకు ‘ఆన్లైన్ లెర్నింగ్’ విధానంలో పాఠాలు బోధించాలని డీఓపీటీ నిర్ణయించింది. వీరికి ముందస్తు అవగాహన, శిక్షణ ద్వారా అత్యయిక స్థితిని ఎదుర్కోవచ్చని డీఓపీటీ భావిస్తోంది. డీఓపీటీకి చెందిన ‘ఐ గాట్’ వెబ్సైట్లో అంతర్భాగంగా పనిచేసే ‘ఈ ప్లాట్ఫారం’ద్వారా దేశవ్యాప్తంగా కోటిన్నర మందికి శిక్షణ ఇస్తారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎవరెవరు ఏయే విధులు నిర్వర్తించాలి అనే అంశంపై సలహాలు, సూచనలకు సంబంధించిన మాడ్యూల్స్ అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో సుమారు లక్ష మందికి ఈ తరహా అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. -
‘సీబీఐ వార్’లోకి కాంగ్రెస్
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ అధికారాల్ని తొలగించడం చట్టవిరుద్ధం, ఏకపక్ష నిర్ణయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే సుప్రీంకోర్టుకు తెలిపారు. సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిలోకి రాజకీయ కార్యనిర్వాహక వర్గం చొరబడిందని ఆరోపించారు. సీబీఐ డైరెక్టర్ చట్టబద్ధ అధికారాలు తొలిగించి, ఆయన్ని సెలవుపై పంపుతూ అక్టోబర్ 23 అర్ధరాత్రి దాటిన తరువాత కేంద్ర విజలెన్స్ కమిషన్(సీవీసీ), సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వ శాఖ(డీఓపీటీ) జారీచేసిన ఆదేశాలు చెల్లవని పేర్కొన్నారు. ఈ మేరకు ఖర్గే శనివారం కోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలుచేశారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం(డీఎస్‌పీఈఏ) ప్రకారం సీబీఐ డైరెక్టర్ పదవీకాలానికి రక్షణ ఉందని, హైపవర్డ్ కమిటీ ఆమోదం లేనిదే ఆయన్ని బదిలీ కూడా చేయరాదని గుర్తుచేశారు. సీబీఐ డైరెక్టర్‌ను ఎంపికచేసే హైపవర్డ్ కమిటీలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. అలోక్ వర్మను సెలవుపై పంపుతూ ఆదేశాలు జారీచేసే ముందు కమిటీ సభ్యుడినైన తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. సీవీసీ, డీఓపీటీ ఉత్తర్వులను రద్దుచేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కమిటీ సమావేశం లేకుండానే కానిచ్చేశారు అలోక్ వర్మ అధికారాలు, విధులు తొలగిస్తూ సీవీసీ, డీఓపీటీ జారీచేసిన ఆదేశాలు..సీబీఐ స్వతంత్రతను దెబ్బతీసేందుకు నేరుగా జరిగిన మూకుమ్మడి ప్రయత్నాలు అని ఖర్గే అభివర్ణించారు. సీబీఐలో ముదిరిన వివాదంపై చర్చించడానికి కమిటీ సమావేశం కాలేదని అక్టోబర్ 25నే లేఖ రాసినట్లు గుర్తుచేశారు. ‘సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిలోకి రాజకీయ కార్యనిర్వాహక వర్గం చొరబడి యథేచ్ఛగా నిబంధనల్ని ఉల్లంఘించిన సంగతిని సంబంధిత భాగస్వామిగా కోర్టు దృష్టికి తెస్తున్నా. డైరెక్టర్ అధికారాల్ని తొలగిస్తూ సీవీసీ, డీఓపీటీ జారీచేసిన ఆదేశాలు చట్టవిరుద్ధం. సీబీఐ డైరెక్టర్‌పై చర్య తీసుకునే అధికారాలు సీవీసీకి లేవని చట్టాలు చెబుతున్నాయి. ఎంపిక కమిటీని తక్కువచేసేలా డీఎస్పీఈ చట్టం కింద కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టరాదు’ అని ఖర్గే పేర్కొన్నారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలానికి రక్షణనిస్తున్న డీఎస్పీఈ చట్టం ప్రకారం హైపవర్డ్ కమిటీ ఏర్పాటైందని, ఆ కమిటీ పాత్రకు పూర్తి వ్యతిరేకంగా డీఓపీటీ ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొన్నారు. మధ్యవర్తికి బెయిల్ నిరాకరణ సీబీఐ అవినీతి కేసులో అరెస్టయిన మధ్యవర్తి మనోజ్ ప్రసాద్‌కు బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. బెయిల్ కోరుతూ ప్రసాద్ పెట్టుకున్న అర్జీని జడ్జి శనివారం తోసిపుచ్చారు. ఈ దశలో ఆయనకు బెయిల్ మంజూరుచేయడం సరికాదని జడ్జి పేర్కొన్నారు. నిందితుడికి ఎంతో పలుకుబడి ఉందని, బెయిల్‌పై విడుదల అయితే విచారణను ప్రభావితం చేయగలడని సీబీఐ వాదించింది. తనను కస్టడీలో ఉంచడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదన్న ప్రసాద్ పిటిషన్‌తో కోర్టు విభేదించింది. అక్టోబర్ 17న అరెస్టయిన ప్రసాద్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో అరెస్టయిన సహ నిందితుడు, సీబీఐ డీఎస్పీ దేవేంద్రకుమార్‌కు అక్టోబర్ 31నే బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. -
సివిల్ సర్వీసెస్ ఎంపిక రద్దు చేయడం చెల్లదు
సాక్షి, హైదరాబాద్: అంగవైకల్యం ఉన్నట్లుగా అప్పిలేట్ మెడికల్ బోర్డు ధ్రువీకరించాక, అంగవైకల్య కోటాలో సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడాన్ని నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా రద్దు చేయడం చెల్లదని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఒంగోలుకు చెందిన రిజ్వాన్ బాషా షేక్ అంగవైకల్యం కోటా కింద 2016లో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరై జాతీయ స్థాయిలో 48వ ర్యాంకు సాధించారు. బాషాకు 30 శాతం దృష్టి లోపం ఉన్నట్లు మెడికల్ బోర్డు ధ్రువీక రించింది. దీనిపై బాషా కేంద్ర వైద్య వ్యక్తిగత వ్యవహారాల శాఖ (డీవోపీటీ)కి చెందిన అప్పిలేట్ మెడికల్ బోర్డులో అప్పీల్ చేసుకున్నారు. దృష్టి లోపం 40 శాతం ఉన్నట్లు అప్పీల్లో తేలింది. బాషా అంగవైకల్యంపై అందిన ఫిర్యాదును యూపీఎస్సీ చైర్మన్ నిపుణుల కమిటీకి నివేదించారు. నిపుణుల కమిటీ 30 శాతమే దృష్టి లోపం ఉందని 2017 నవంబర్ 7న తేల్చడంతో బాషా సివిల్ సర్వీసెస్ ఎంపికను యూపీఎస్సీ రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని బాషా క్యాట్‌లో సవాల్ చేయగా ఒకసారి మెడికల్ అప్పిలేట్ బోర్డు అంగవైకల్యాన్ని నిర్ధారించాక దాన్ని నిపుణుల కమిటీకి పంపడం సరికాదంది. సివిల్ సర్వీసెస్‌కు బాషా ఎంపికను రద్దు చేయడం చెల్లదని జస్టిస్ రెడ్డి కాంతారావు, సభ్యులు మిన్నీ మాథ్యూస్‌ల ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. -
ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లకు కేంద్రం కొర్రీ!
సాక్షి, హైదరాబాద్ : ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల పెంపునకు ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుకు పీటముడి పడింది. దీనిపై కేంద్ర ప్రభుత్వంలోని రెండు శాఖలు భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఆ బిల్లును నిలిపేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) కేంద్ర హోం శాఖకు సూచించింది. మొత్తం రిజ ర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు విరుద్ధంగా ఉన్నాయంటూ డిసెంబర్ 11నే ఆఫీస్ మెమొరాండం పంపించింది. మరోవైపు ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బిల్లులోని అంశాలను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సమర్థించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 9.08 శాతం ఎస్టీ జనాభా ఉందని, ఆ మేరకు రిజర్వేషన్లు అమలు చేసే ప్రతిపాదనకు మద్దతిస్తున్నట్ల తెలిపింది. మొత్తం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఎస్టీల రిజర్వేషన్ 9.08 శాతానికి తగ్గకూడదంటూ డిసెంబర్ 18న కేంద్ర హోంశాఖకు ఆఫీస్ మెమోరాండం పంపింది. మొత్తంగా భిన్నాభిప్రాయాల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ రిజర్వేషన్ల పెంపు బిల్లును రాష్ట్రపతికి పంపకుండా పెండింగ్‌లో పెట్టింది. పది నెలలుగా నిరీక్షణ ముస్లిం రిజర్వేషన్లను (బీసీ–ఈ కోటా) 4 శాతం నుంచి 12 శాతానికి, 6 శాతమున్న ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని దాదాపు ఏడాది కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది ఏప్రిల్ 16న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బిల్లును ఆమోదించి.. కేంద్రానికి పంపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్టీ జనాభా 9.08 శాతానికి, ముస్లింల జనాభా 12.68 శాతానికి చేరిందని.. ఈ మేరకు రిజర్వేషన్లను పెంచాలని బిల్లులో ప్రతిపాదించింది. అయితే ఈ రిజర్వేషన్ల పెంపుతో మొత్తం రిజర్వేషన్లు 62 శాతానికి చేరినట్లయింది. సందేహాలు లేవనెత్తిన డీవోపీటీ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులోని ప్రతిపాదనలను కేంద్ర డీవోపీటీ సున్నితంగా తిరస్కరించింది. 1992లో ఇంద్రా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 (4) ప్రకారం.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించడానికి వీల్లేదని పేర్కొంది. అసాధారణ పరిస్థితుల్లో దీనికి మినహాయింపు ఇవ్వొచ్చని, అందుకు సహేతుక కారణాలు చూపాలని, చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీం చేసిన సూచనలను ప్రస్తావించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో అటువంటి కారణాలు, అసాధారణ పరిస్థితులేమీ చూపలేదని స్పష్టం చేసింది. కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో ఓబీసీలకున్న 27 శాతం రిజర్వేషన్లలో.. మైనారిటీలకు ఉప కోటా కింద 4.5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేసింది. -
చంద్రబాబు వల్లే కాపులకు అన్యాయం
సాక్షి, కాకినాడ : కాపు రిజర్వేషన్ల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు వల్లే కాపులకు అన్యాయం జరుగుతోందని ఆయన విమర్శించారు. కాగాకాపు రిజర్వేషన్ల అంశానికి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్లపై ఇందుకు డీఓపీటీ ...కేంద్ర హోంశాఖకు రాసిన లేఖే ఉదాహరణ అని అన్నారు. చంద్రబాబు చేసిన తీర్మానంలో పసలేదని డీవోపీటీ చెప్పిందని, మంజునాథ కమిషన్ తన నివేదిక ఇవ్వకముందే చంద్రబాబు హడావుడిగా కాపు రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపారన్నారు. అందుకే ఆ తీర్మానంపై డీవోపీటీ అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. చంద్రబాబు మరోసారి కాపులకు ద్రోహం చేస్తున్నారన్నారు. భవిష్యత్‌లో కాపులకు బీసీ రిజర్వేషన్లు రాకుండా చేస్తున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. -
50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వలేం..!
-
కేంద్ర ఉద్యోగుల ఎల్టీసీపై డీఏ కట్
న్యూఢిల్లీ: సెలవు ప్రయాణ రాయితీ(ఎల్టీసీ) సదుపాయం పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆయా ప్రయాణ రోజుల్లో రోజువారీ భత్యాన్ని(డీఏ) పొందలేరని కేంద్ర సిబ్బంది శిక్షణా సంస్థ(డీవోపీటీ) తెలిపింది. దీంతోపాటు ఉద్యోగుల స్థానిక ప్రయాణాలకు ఎల్టీసీ వర్తించదని పేర్కొంటూ డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది. ఎల్టీసీ ప్రకారం సొంత నగరానికి, వేరే ప్రాంతాలకు వెళ్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిబంధనల మేరకు సెలవులు ఇవ్వడంతో పాటు వారి టికెట్ ఖర్చుల మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. వీరి హోదాను బట్టి గతంలో డీఏ కూడా ఇచ్చేవారు. తాజాగా ఈ సదుపాయాన్ని రద్దు చేస్తూ డీవోపీటీ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ్రíపీమియం, సువిధా, తత్కాల్ రైళ్లలో ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగుల టికెట్ చార్జీలను రీయింబర్స్ చేస్తామని డీవోపీటీ తెలిపింది. వీటితో పాటు రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లల్లో డిమాండ్‌కు అనుగుణంగా పెరిగే చార్జీలను ఎల్టీసీ పరిధిలోకి తెచ్చామంది. అయితే విమాన ప్రయాణానికి ఎల్టీసీ అనుమతి లేని ఉద్యోగులు విమాన ప్రయాణం చేసి.. తమకు అర్హత ఉన్న దురంతో, రాజధాని, శతాబ్ది రైళ్ల చార్జీలను రీయింబర్స్ ద్వారా పొందలేరని స్పష్టం చేసింది. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు నడిపే వాహనాలకే ఎల్టీసీ వర్తిస్తుందంది. ఒకవేళ ప్రభుత్వ రవాణా వ్యవస్థలు అందుబాటులో లేకుంటే గరిష్టంగా 100 కి.మీ వరకు ప్రైవేటు లేదా వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించవచ్చని, 100 కి.మీ. దాటితే తర్వాత ఖర్చులను సదరు ఉద్యోగే వ్యక్తిగతంగా భరించాల్సి ఉంటుంది. ఏడవ పే కమిషన్ సిఫార్సుల అధారంగానే తీసుకున్న ఈ నిర్ణయాలు 2017, జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. -
బ్యూరోక్రాట్ల వీఆర్ఎస్ నిబంధనల్లో మార్పులు
న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు సంబంధించిన నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. వీఆర్ఎస్ కోసం బ్యూరోక్రాట్లు పెట్టుకున్న విజ్ఞప్తిని ఎక్కువ కాలం పెండింగ్‌లో పెట్టకుండా, నిర్దేశిత గడువులోగా పరిష్కరించేలా మార్పులు తెచ్చింది. ఒకవేళ నిర్దేశిత గడువులోగా దరఖాస్తులను పరిష్కరించకపోతే.. అప్పట్నుంచే వారి స్వచ్ఛంద పదవీ విరమణ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలను డీఓపీటీ విడుదల చేసింది. -
ఏపీ నుంచి తెలంగాణకు 60 మంది ఏఎస్‌వోలు!
సాక్షి, హైదరాబాద్: సెక్షన్ ఆఫీసర్లు, ఏఎస్‌వోల కేటాయింపు అంశాన్ని డీవోపీటీకి అప్పగించాలని నిర్ణయించారు. ఏపీ నుంచి 60 మందికిపైగా ఏఎస్‌వోలు తెలంగాణకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. దీంతో శుక్రవారం సచివాలయంలో జరిగే కమలనాథన్ కమిటీ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఏపీలో పనిచేస్తున్న 263 మంది తెలంగాణ ఉద్యోగుల అంశంపైనా ఈ భేటీలో చర్చించొచ్చని తెలుస్తోంది. గురువారం స్పెషల్ పోలీస్ ఫోర్స్ విభజనపై కమలనాథన్ కమిటీ చర్చించింది. -
రాష్ట్రానికి మరో 45 మంది ఐఏఎస్‌లు
- కేటాయించిన కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం - ప్రస్తుతమున్న 163 మంది కోటా 208కి పెంపు - వరుసగా చేసిన విజ్ఞప్తులకు స్పందించిన కేంద్రం - ఇక ఐఏఎస్‌ల కొరత తీరినట్టే - కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం మరింత సుగమం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల కొరత తీరింది. ఐఏఎస్‌ల కేడర్‌ను సమీక్షించిన కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం (డీవోపీటీ) తెలంగాణకు 45 మంది ఐఏఎస్ అధికారులను అదనంగా కేటాయిం చింది. ఈ మేరకు తుది కేటాయింపుల వివరాలతో డీవోపీటీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు నిర్దేశించిన ఐఏఎస్ కోటా 163. ప్రస్తుతం ఈ సంఖ్యను 208కు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పుడున్నదానితో పోలిస్తే అదనంగా 30 శాతం కోటా పెరిగినట్లయింది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి అవసరం మేరకు అఖిల భారత సర్వీసు అధికారులను ఇవ్వాలంటూ ఏడాదిన్నరగా తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఐఏఎస్ అధికారుల కొరతతో కొత్త రాష్ట్రం సతమతమవుతోందని, పాలనాపరంగా బ్బందులు ఎదురవుతున్నాయని పలుమార్లు డీవోపీటీ దృష్టికి తీసుకెళ్లింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని మోదీని కలిసిన సందర్భంలోనూ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దీంతో డీవోపీటీ జనవరిలోనే సీఎస్ రాజీవ్‌శర్మను ఢిల్లీకి పిలిపించి వివరాలను సేకరించింది. అదే సందర్భంగా రాష్ట్ర కేడర్‌ను సమీక్షించేందుకు నిర్ణయం తీసుకుంది. హోదాల వారీగా కేడర్ ఇలా.. తుది కేటాయింపులకు సంబంధించిన ఉత్తర్వుల్లో ఐఏఎస్‌కు నిర్దేశించిన శాఖలవారీ హోదాలపైనా డీవోపీటీ స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలో చీఫ్ సెక్రెటరీతోపాటు ఇద్దరు స్పెషల్ చీఫ్ సెక్రెటరీలు, 16 మంది ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులు, 18 మంది కార్యదర్శి స్థాయి, 19 మంది కమిషనర్ స్థాయి అధికారులు, 10 మంది కలెక్టర్లు, 11 మంది జాయింట్ కలెక్టర్లు, 21 మంది డెరైక్టర్లు, ఐదుగురు ప్రాజెక్టు డెరైక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్లుగా ముగ్గురు, స్పెషల్ కలెక్టర్(ఐఅండ్‌కాడ్)గా ముగ్గురు, తెలంగాణ విజిలెన్స్ డిపార్టుమెంట్‌కు ఒక పోస్టు, టీఎస్పీఎస్సీకి ఒకటి, ఎన్నికల సంఘం డిప్యూటీ సీఈవోగా ఒక పోస్టు, సీసీఎల్ఏ కార్యదర్శిగా ఒక పోస్టు, కమర్షియల్ టాక్స్ జాయింట్ కమిషనర్‌గా ఒక పోస్టును నిర్దేశించింది. వీరితో పాటు కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై 45 మంది ఐఏఎస్‌లు, స్టేట్ డిప్యుటేషన్‌పై 28 మంది ఐఏఎస్‌లు, రిజర్వు ఫర్ ట్రైనింగ్‌కు ముగ్గురు, రిజర్వ్ ఫర్ లీవ్‌గా 18 మందిని పరిగణించింది. వీరితోపాటు 63 మంది కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా ఉంటారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఊతం కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఐఏఎస్‌ల కోటా పెంపు కలిసొచ్చినట్లయింది. అదనంగా ఐఏఎస్‌లను కేటాయించనుండటంతో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల కొరత తీరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు వివిధ శాఖల్లో ఉన్న ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల పోస్టులు భర్తీ కానున్నాయి. కీలకమైన శాఖలను ఇన్చార్జిలతో నెట్టుకు వచ్చే పరిస్థితి కాస్తా మెరుగుపడనుంది. కానీ కేంద్రం సీనియర్ ఐఏఎస్ అధికారులను కేటాయించకపోవడం గమనార్హం. దీంతో ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్ అధికారులు సొంత రాష్ట్రానికి సేవలందించే వెసులుబాటు కల్పించటం, కొత్తగా వచ్చే ఏఐఎస్ కోటాను కేటాయించడం ద్వారా అదనపు కోటాను భర్తీ చేసే అవకాశాలున్నాయి. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో ఇప్పుడున్న ఐఏఎస్‌లకు పదోన్నతులు కల్పించి కేడర్ సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. స్పెషల్ సీఎస్‌లుగా ఎస్కే జోషి, రేమండ్ పీటర్? ప్రస్తుతం ముఖ్య కార్యదర్శుల హోదాలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు రేమండ్ పీటర్, శైలేంద్ర కుమార్ జోషి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ప్రమోషన్ పొందనున్నారు. శుక్రవారం సీఎస్ రాజీవ్ శర్మ సారథ్యంలో జరిగిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కౌన్సిల్(డీపీసీ) ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఫైల్‌ను సీఎం కేసీఆర్‌కు పంపింది. ప్రస్తుతం జోషి నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తుండగా.. రేమండ్ పీటర్ భూపరిపాలన ప్రధాన కమిషనర్‌గా ఉన్నారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త చిక్కు!
న్యూఢిల్లీ: రెండో వివాహం చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి ఆలోచించుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీసు రిజిస్టర్లో సాధరణంగా ఇచ్చే సమాచారానికి అదనంగా వారు ఎన్ని వివాహలు చేసుకున్నారో కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) ఇందుకు సంబంధించిన కొత్త ఫార్మట్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగి తన భార్య బతికి ఉండగా మరో వివాహం చేసుకోకూడదు లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ఉద్యోగి సర్వీసు పుస్తకంలో జాయినింగ్ తేదీ, పోస్టింగ్, సర్వీసు, ఇంటి అద్దె, ఉద్యోగి ఆరోగ్య బీమా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన గ్రూప్ బీమా, ప్రయాణ చార్జీలు తదితర వివరాలు ఉంటాయి. ఉద్యోగంలో చేరే ముందు ఒక ఫోటో, ఆధార్ కార్డు,18 సంవత్సరాల సర్వీసు అనంతరం మరో ఫోటో, సర్వీసు నుంచి విరమణ పొందే ఒక సంవత్సరం ముందు మరో ఫోటోను ఇవ్వాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ అందజేస్తారు. -
మగాళ్లకు 180 రోజుల సెలవులు!
న్యూఢిల్లీ: సరోగసీ ద్వారా సంతానం పొందే దంపతులకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సర్వీసు నిబంధనలు మార్చాలని యోచిస్తోంది. సరోగసీ ద్వారా సంతానం పొందాలనుకునే మహిళా ఉద్యోగులకు 180 రోజులు ప్రెటర్నిటీ లీవు ఇవ్వాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్స్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) ప్రతిపాదించింది. సరోగసీతో తండ్రులయ్యే పురుషులకూ ఆరు నెలలు ప్రెటర్నిటీ సెలవు ఇవ్వాలని సిఫారసు చేసింది. 'సరోగసీ ద్వారా సంతానం పొందే మహిళలకు లేదా అద్దెగర్భం మోసే తల్లులకు ప్రెటర్నిటీ సెలవులు ఇవ్వడం అనేది ఇప్పటివరకు సర్వీసు రూల్స్ లో లేదు. నవజాత శిశువులను కంటికి రెప్పలా చూసుకునేందుకు సరోగసీ దంపతులకు 180 సెలవులు ఇవ్వాలని ప్రతిపాదించామ'ని డీఓపీటీ పేర్కొంది. ప్రతిపాదిత నిబంధనలను డీఓపీటీ తన వెబ్ సైట్ లో పెట్టింది. వీటిపై అభిప్రాయాలు తెలపాలని కోరింది. చైల్డ్ కేర్ లీవు(సీసీఎల్) నిబంధన సడలించాలని కూడా కేంద్రం ప్రతిపాదించింది. వికలాంగ చిన్నారుల సంరక్షణకు తల్లికి రెండేళ్లు(730 రోజులు) చైల్డ్ కేర్ లీవు ఇస్తున్నారు. అయితే సదరు చిన్నారి మైనారిటీ అయివుండాలన్న వయసు నిబంధనను సడలించాలని సిఫారసు చేసింది. సీసీఎల్ లో ఉన్నప్పుడు మహిళా ఉద్యోగులకు ప్రయాణ చార్జీల్లో రాయితీ ఇవ్వాలని కూడా ప్రతిపాదించింది. -
విభజనపై నేడు డీవోపీటీ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం (డీవోపీటీ) కార్యదర్శి సంజయ్ కొఠారి మంగళవారం రాష్ట్రానికి రానున్నారు. సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఉద్యోగుల విభజన, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కేడర్‌పై సమీక్షించనున్నారు. ఇప్పటికీ విభజనపై స్పష్టత లేని రాష్ట్ర పోలీసు అకాడమీకి సంబంధించిన అంశాలను చర్చిస్తారు. -
ముదిరిన ‘సివిల్’ వార్!
సాక్షి, హైదరాబాద్ : అఖిల భారత సివిల్ సర్వీసు అధికారుల మధ్య అంతర్యుద్ధం ఊపందుకుంది.ఇంక్రిమెంట్ల విషయంలో ఇతర సర్వీసుల కంటే ఐఏఎస్‌కు ఉన్న ‘ఎడ్జ్’ ఇందుకు కారణమవుతోంది. ఈ నెల మూడో వారంలో ఏడో వేతన సంఘం (సెంట్రల్ పే కమిషన్) కేంద్రం ఆధీనంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)కి నివేదిక సమర్పించనునున్న నేపథ్యంలో ఐఏఎస్‌తో పాటు ఇతర సర్వీసు అధికారులు తమ డిమాండ్లు, ప్రాదమ్యాలను వివరిస్తూ లేఖలు రాస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలో పని చేస్తున్న పలువురు ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులూ డీఓపీటీకి ఇప్పటికే లేఖలు పంపారు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ద్వారానే వీరందరూ ఎంపికవుతారు. అయితే కొన్నేళ్లుగా ఇతర సర్వీసుల కంటే ఐఏఎస్‌లకు జీతం విషయంలో రెండు ఇంక్రిమెంట్ల ‘ఎడ్జ్’ కొనసాగుతోంది. వీరు ఉద్యోగంలో చేరే సమయంలోనే ఇతర సర్వీసుల కంటే గ్రేడ్ పే రెండు ఇంక్రిమెంట్లు ఎక్కువగా ఉంటోంది. జీతం కాదు జీవితం ముఖ్యం రెండు ఇంక్రిమెంట్లతో ప్రారంభమయ్యే వేతన వ్యత్యాసం నాలుగేళ్లకు రూ.4 వేల నుంచి రూ.5 వేలు, 14 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకునేప్పటికి రూ.15 వేల నుంచి రూ.16 వేలు, 17 ఏళ్లకు రూ.18 వేల నుంచి రూ.20 వేలకు చేరుతోంది. అయితే ఈ జీతం విషయంలో అభ్యంతరం లేదంటున్న ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు... గ్రేడ్‌పే వ్యత్యాసం కారణంగా ఉన్నత స్థాయి పోస్టుల్లో నియామకాలు కోల్పోతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో అత్యున్నత పోస్టులైన సెక్రటరీ, అదనపు సెక్రటరీ, సంయుక్త సెక్రటరీలుగా నియామకాలకు అఖిల భారత సర్వీసు అధికారులందరూ అర్హులే. అయితే ఆయా పోస్టుల నియామక సమయంలో సీరియారిటీతో పాటు నిర్ణీత గ్రేడ్‌పే ఉండాలని స్పష్టం చేస్తోంది. ఫలితంగా ‘ఎడ్జ్’ ద్వారా అధిక గ్రేడ్ పే పొందుతున్న ఐఏఎస్‌లకు మాత్రమే ఆయా పోస్టులు వస్తున్నాయని, దీనిపైనే తాము అభ్యంతరం చెబుతున్నట్లు ఇతర సర్వీసు అధికారులు పేర్కొంటున్నారు. -
అసమర్థ అధికారులకు ఉద్వాసన!
అలాంటి వారి జాబితా పంపాలని కోరిన డీవోపీటీ న్యూఢిల్లీ: బ్యూరోక్రాటిక్ వ్యవస్థలో ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా అలసత్వ, అసమర్థ అధికారులకు ఉద్వాసన పలకడానికి నిర్ణయించింది. అలాంటి వారి జాబితా ఇవ్వాలని అన్ని శాఖలను కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) కోరింది. కేబినెట్ సెక్రటరీ పి.కె.సిన్హా నేతృత్వంలో ఈ మధ్యనే జరిగిన సమావేశంలో ప్రభుత్వ అధికారుల్లో బాధ్యత, సచ్ఛీలత పెంచడానికి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజాప్రయోజనార్థం అసమర్థ అధికారులకు ఫండమెంటల్ రూల్ 56 (జె) ప్రకారం ముందస్తుగానే రిటైర్మెంట్ ఇచ్చేయాలని తీర్మానించారు. గ్రూప్ ఎ, బి, సి ఉద్యోగుల్లో అవినీతి, అసమర్థ అధికారులపై ఈ విధమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గత కొన్నేళ్లుగా ఇంక్రిమెంట్లు ఆగిపోయిన, ఐదేళ్లుగా ఏ విధమైన ప్రమోషన్లులేని అధికారులపై వేటు వేయనున్నారు. సున్నితమైన, ఇతర పోస్టుల్లోని అధికారుల రొటేషన్పైన కూడా ఆ సమావేశంలో చర్చించారు. తమ నిర్ణయాలను నిర్ణీత కాలవ్యవధిలో అన్ని శాఖలు అమలు చేయాలని డీవోపీటీ కోరింది. అసమర్థ, అవినీతి అధికారులకు సంబంధించిన సమాచారాన్ని తొందరగా అంతర్గత నిఘా విభాగానికి పంపాలని అన్ని శాఖలకు విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించి కేబినెట్ సెక్రటరీ ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తారని పేర్కొంది. -
లేటుగా వచ్చారో.. ఇక అంతే!
న్యూఢిల్లీ: 'రోజులో ఏదో ఒక సమయంలో ఆఫీస్‌కు వచ్చామా.. పంచ్ కొట్టామా.. ఓ నాలుగైదు ఫైళ్లు కెలికామా.. ఇంటికి వెళ్లిపోయామా.. ఒకటో తారీఖున జీతం తీసుకున్నామా..' బాపతు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. అన్ని శాఖల ఉద్యోగులు సమయపాలన కచ్చితంగా పాటించాల్సిందేనని, లేని పక్షంలో తీవ్ర చర్యలకు కూడా వెనుకాడేది లేదని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో కొత్త విషయమేముంది? ప్రభుత్వం అప్పుడప్పుడూ చేసే తాటాకు చప్పుళ్లకు బెదిరిపోయి ఉద్యోగులందరూ సమయపాలన పాటిస్తారా? అని అనుకుంటే మాత్రం పొరపడ్డట్టే! ఇప్పటికే ఢిల్లీ ఎన్నికల్లో ఉద్యోగులు ఇచ్చిన షాక్‌తో రగిలిపోతోన్న బీజేపీ.. వారిపై ఎలాంటి చర్యలకైనా వెనుకడుగు వేసేదిలేదని తేల్చిచెబుతోంది. ఆ క్రమంలోనే తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలుస్తోంది. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో నివసిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఓట్లేసిన సంగతి తెలిసిందే. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ కార్యాలయంలో చేరిన కొద్ది రోజులకే ఉద్యోగుల సమయపాలన విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆయా శాఖలకు ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో అప్పటివరకు అమలవుతోన్న బయోమెట్రిక్ విధానాన్ని మరింత పారదర్శకంగా తీర్చిదిద్దారు. కొత్తగా రూపొందించిన విధానంలో ఆధార్ నంబర్‌తో అనుసంధానించిన బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఒక్క క్లిక్ తో ఏ రోజు ఎంత మంది ఉద్యోగులు కార్యాలయానికి వచ్చారో www.attendance.gov.in ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉందని, సమయపాలన విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలంటూ కేంద్రం తమను ఆదేశించిందని డీఓపీటీ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వ సిబ్బంది నియమాకాల్లో పలు విమర్శలను ఎదుర్కొంటున్న కేంద్రం తాజాగా తన ఉద్యోగుల నుంచి ఎదురయ్యే వ్యతిరేకంతను ఎలా అధిగమిస్తుందో చూడాలి.