కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త చిక్కు!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త చిక్కు!
Published Wed, Apr 6 2016 7:53 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
న్యూఢిల్లీ: రెండో వివాహం చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి ఆలోచించుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీసు రిజిస్టర్లో సాధరణంగా ఇచ్చే సమాచారానికి అదనంగా వారు ఎన్ని వివాహలు చేసుకున్నారో కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) ఇందుకు సంబంధించిన కొత్త ఫార్మట్ను విడుదల చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగి తన భార్య బతికి ఉండగా మరో వివాహం చేసుకోకూడదు లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఒక ఉద్యోగి సర్వీసు పుస్తకంలో జాయినింగ్ తేదీ, పోస్టింగ్, సర్వీసు, ఇంటి అద్దె, ఉద్యోగి ఆరోగ్య బీమా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన గ్రూప్ బీమా, ప్రయాణ చార్జీలు తదితర వివరాలు ఉంటాయి. ఉద్యోగంలో చేరే ముందు ఒక ఫోటో, ఆధార్ కార్డు,18 సంవత్సరాల సర్వీసు అనంతరం మరో ఫోటో, సర్వీసు నుంచి విరమణ పొందే ఒక సంవత్సరం ముందు మరో ఫోటోను ఇవ్వాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ అందజేస్తారు.
Advertisement
Advertisement