Service rules
-
శాంతి ఆకాశం నుంచి ఊడిపడదు: తైవాన్
తైపీ: చైనా నుంచి యుద్ధం, ఆక్రమణల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. తైవాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఏడాది మిలిటరీ సర్వీస్‌ను తప్పనిసరి చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. చైనా నుంచి ఏనాటికైనా ఆక్రమణ తప్పదనే భయాందోళనలో ఉండింది ఈ చిన్న ద్వీప దేశం. ఈ నేపథ్యంలో అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ స్వయంగా ఈ ప్రకటన చేయడం విశేషం. తైవాన్‌పై చైనా బెదిరింపులు తీవ్రంగా కనిపిస్తున్నాయి. యుద్ధం కావాలని ఎవరూ కోరుకోరు. కానీ, నా తోటి పౌరులారా.. శాంతి ఆకాశం నుంచి ఊడిపడదని గుర్తించాలి అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దులో త్వరగతిన మారుతున్న పరిస్థితుల ఆధారంగా.. నాలుగు నెలల మిలిటరీ సర్వీస్ సరిపోదు. అందుకే దానిని ఏడాదికి పొడిగించాలని నిర్ణయించాం. 2024 నుంచి ఏడాది మిలిటరీ సర్వీస్ తప్పనిసరి కానుంది. 2005 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన వాళ్లందరికీ.. కొత్త కొనసాగింపు వర్తిస్తుందని సాయ్ ఇంగ్ వెన్ ప్రకటించారు. రెండు రోజుల కిందట.. తైవాన్ సమీపంలో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించింది. వాష్టింగ్టన్, తైపీలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయని.. సైనిక విన్యాసాలను చైనా సమర్థించుకుంది కూడా. తైవాన్‌లో ఒకప్పుడ ఏడాది మిలిటరీ సర్వీస్ నిబంధన ఉండేది. కానీ, తర్వాతి కాలంలో దానిని నాలుగు నెలల కాలపరిమితికి కుదించారు. అయితే, సరిహద్దులో సైనిక చర్యల ద్వారా చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యం.. డ్రాగన్ కంట్రీ నుంచి ఏనాటికైనా యుద్ధం తప్పదనే భావనలోకి చేరుకుంది తైవాన్. తమను తాము స్వపరిపాలన.. ప్రజాస్వామ్యిక దేశంగా తైవాన్ ప్రకటించుకుంది. కానీ, తైవాన్ తమ భూభాగానికే చెందుతుందని డ్రాగన్ కంట్రీ ప్రకటించుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో తైవాన్‌కు అండగా అమెరికా ప్రకటనలు ఇవ్వడం, అక్కడి ప్రతినిధులు తైవాన్ గడ్డపై పర్యటించడం చైనాకు కోపం తెప్పిస్తోంది. ఈ పరిస్థితులకు తోడు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ మధ్య కాలంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. తైవాన్ సరిహద్దులో వరుసపెట్టి మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహిస్తుండడంతో.. తరచుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా తరహాలో చైనా కూడా తమ భూభాగంపై దురాక్రమణకు పాల్పడవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తోంది తైవాన్. -
తెలంగాణ: గ్రూప్–4కు కొత్త సర్వీస్ రూల్స్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–4 కొలువులకు కొత్తగా సర్వీసు నిబంధనలను రూపొందిస్తోంది. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో అందుకు అనుగుణంగా ప్రస్తుతమున్న సర్వీసు రూల్స్‌లో మార్పులు చేయనుంది. ఇదివరకు 80:20 నిష్పత్తిలో స్థానిక, జనరల్ కేటగిరీల్లో ఉద్యోగాలు భర్తీ చేయగా ఇప్పుడు 95:5 నిష్పత్తిలో చేపట్టనుంది. ఈ క్రమంలో సర్వీసు నిబంధనలు కూడా స్థానిక అభ్యర్థులకు అధిక లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం మార్పులు చేస్తోంది. భవిష్యత్తులో ఉద్యోగులు పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు కొత్త నిబంధనలు ఆధారం కానున్నాయి. ఒకే దఫా నియామకాలతో... రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9 వేలకు పైబడిన గ్రూప్–4 ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా ఒకే దఫాలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రూప్–4 కేటగిరీలో అత్యధికం జూనియర్ అసిస్టెంట్ పోస్టులే ఉన్నాయి. పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఒకేసారి నియామకాలు చేపడుతుండటంతో ఉమ్మడి అంశాలకు తగినట్లుగా సర్వీసు నిబంధనలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం నియామకాల సమయంలో సాధారణ నిబంధనలు అన్ని శాఖలకు ఒకే విధంగా ఉండనుండగా శాఖలవారీగా నియామకాలు పూర్తయి ఉద్యోగులు విధుల్లో చేరాక ఆయా శాఖలకు సంబంధించిన నిబంధనలు కూడా వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో కామన్ సర్వీస్ రూల్స్‌పై దృష్టిపెట్టిన ప్రభుత్వం... అన్ని ప్రభుత్వ శాఖల నుంచి నిబంధనల వివరాలను సేకరిస్తోంది. సీఎస్ సోమేశ్‌కుమార్ మరికొన్ని శాఖల ఉన్నతాధికారులతో రెండ్రోజులుగా సమీక్షిస్తున్నారు. శాఖాధిపతుల నుంచి సమాచారం సేకరించినప్పటికీ లిఖితపూర్వక ఆధారాలను స్వీకరించాక ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సీఎస్ తాజాగా నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు 4–5 రోజుల్లో ప్రభుత్వానికి అందనున్నాయి. అవి అందిన వెంటనే సమీక్షించి గ్రూప్–4 నూతన సర్వీసు రూల్స్‌ను ఖరారు చేసే అవకాశాలున్నాయి. గజిబిజికి తెర పడేలా... ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన సర్వీసు రూల్స్‌లో ఉన్న లొసుగులతో స్థానికులకు తీవ్ర అన్యాయమే జరిగింది. ఉద్యోగ నియామకాల సమయంలో కోటా ప్రకారం నియమితులైనప్పటికీ పదోన్నతుల్లో స్థానిక ఉద్యోగులు వెనుకబడిపోయారు. పదోన్నతుల ఖాళీలను మెరిట్ ప్రకారం భర్తీ చేసినప్పటికీ జనరల్ కేటగిరీలోని ఖాళీలను ఇష్టానుసారంగా ప్రమోట్ చేయడంతో స్థానిక కోటా ఉద్యోగులు నష్టపోయారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నూతన జోనల్ విధానంలో స్థానికతకు ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులతోనే భర్తీ కానున్నాయి. అలాగే ఓపెన్ కేటగిరీలోని 5 శాతం పోస్టుల్లోనూ స్థానికులకు వాటా దక్కనుంది. దీంతో మెజారిటీగా స్థానికులే ఉంటారు. ఫలితంగా ఉద్యోగుల పదోన్నతులు, ఇతర ప్రయోజనాల కల్పనలో స్థానికులకే ఎక్కువ లబ్ధి కలగనుంది. తాజాగా రూపొందుతున్న కొత్త సర్వీసు రూల్స్‌తో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన గజిబిజికి ఇక తెరపడినట్లే. మరోవైపు సర్వీసు రూల్స్ ఖరారయ్యాక గ్రూప్–4 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన వెంటనే ప్రభుత్వం జీవోలు విడుదల చేయడం నుండి నియామక ఏజెన్సీకి స్పష్టమైన ఆదేశాలతో బాధ్యతలు సైతం అప్పగించనుంది. -
టీవీవీపీ సర్వీస్ రూల్స్‌లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలో త్వరలో నియామకాలు చేపడుతున్న తరుణంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేర్పులు చేసింది. ఈ మేరకు సవరణ ఉత్తర్వులతో నోటిఫికేషన్ జారీచేసింది. ఈ విభాగం పరిధిలో నియమించనున్న వైద్యులను సివిల్ అసిస్టెంట్ సర్జన్ (జనరల్), జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్‌గా విభజించారు. వీరిని ఎంబీబీఎస్ అర్హతతో నియమిస్తారు. ►గతంలో సైకియాట్రీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ విభాగాలను నియమించలేదు. ఇప్పుడు వీటిని కొత్తగా నియామకాల్లో చేర్చారు. ►పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్బీ అర్హతలను స్పెషాలిటీ పోస్టులకు అర్హతగా పరిగణిస్తారు. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరూ తప్పనిసరిగా రాష్ట్ర వైద్య మండలిలో తమ అర్హత ధ్రువపత్రాలను నమోదు చేసుకోవాలి. ►టీవీవీపీలో కొత్తగా నియమితులయ్యే వైద్యులకు కూడా ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం వర్తిస్తుంది. ►బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సు పూర్తి చేసిన అర్హులైన నర్సులను నేరుగా నియమిస్తారు. దరఖాస్తు చేసుకునే నర్సులందరూ రాష్ట్ర నర్సింగ్ మండలిలో తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాలి. ►క్లాస్ ఏ పారామెడికల్ పోస్టులకు.. సర్టిఫికెట్ ఆఫ్ రేడియాలజీ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్, పీజీ డిప్లొమా ఇన్ ఇమేజియాలజీ, బీఎస్సీ రేడియాలజీ, బీఎస్సీ ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలో ఉత్తీర్ణులైన వారు అర్హులు. వీరందరూ రాష్ట్ర పారామెడికల్ బోర్డులో తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాలి. ►క్లాస్ బి పారామెడికల్ పోస్టులకు.. ఏడాది అనుభవంతో ఎంఎల్డీ ఒకేషనల్/ఇంటర్మీడియేట్ (ఎంఎలీ ఒకేషనల్), డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు, బీఎస్సీ ఎంఎలీ/ఎంఎస్సీ ఎంఎల్టీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్(క్లినికల్ పాథాలజీ) టెక్నీషియన్, బ్యాచ్‌లర్ ఇన్ మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయో కెమిస్ట్రీ, బీఎస్సీ(మైక్రోబయాలజీ)/ఎంఎస్సీ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ ఇన్ క్లినికల్ మైక్రో బయాలజీ ఎంఎస్సీ ఇన్ బయోకెమిస్ట్రీ.. పూర్తి చేసిన వారు అర్హులు. ►క్లాస్ సి పారామెడికల్ పోస్టులకు.. డి ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మా డి అభ్యర్థులు అర్హులు -
ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు
ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) మొదలు ఏరియా, సామాజిక, జిల్లా, బోధనాసుపత్రుల వరకు అన్నిచోట్లా డాక్టర్లు ఉన్నా, ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుండటంతో వారి సేవలు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలు, దిగువ మధ్య తరగతి రోగులకు సరిగా అందడం లేదు. కొందరు డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలకు రెండు మూడురోజులకోసారి వెళ్లి వస్తున్నారు. ఈ పరిస్థితిపై వైద్యశాఖ దృష్టి సారించింది. నిమ్స్‌లో పనిచేస్తున్న డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయవద్దన్న నిబంధన ఇప్పటికే ఉంది. అలాంటి నిబంధననే ప్రభుత్వ డాక్టర్లకు వర్తింపచేయాలని వైద్యశాఖ తొలుత నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులకు వర్తింపజేస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కొత్తగా నియమితులయ్యే డాక్టర్లకు వర్తించేలా సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేయాలని భావిస్తోంది. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దుతో పాటు మరికొన్ని సంస్కరణల దిశగా వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా చేయబోయే డాక్టర్ పోస్టుల భర్తీ సందర్భంగా సర్వీస్ రూల్స్‌ల్లో మార్పులు చేర్పులు చేయాలని, ఈ మేరకు ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాలని వైద్యశాఖ వర్గాలు యోచిస్తున్నాయి. సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేశాక డాక్టర్ల పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. పేదలకు అందని వైద్యం ప్రభుత్వ వైద్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆసుపత్రుల్లో ఉండాల్సి ఉన్నా, సొంత ప్రాక్టీస్ కారణంగా చాలామంది మధ్యాహ్నం వరకే ఉండి వెళ్లిపోతున్నారు. గాంధీ వంటి ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు కొందరు అక్కడికి సమీపంలోనే ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలా వందలాది మంది ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుండటంతో, పేదలకు వైద్యం అందడం లేదని వైద్యశాఖ వర్గాలు భావిస్తున్నాయి. కొందరు డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలకు రెండు మూడు రోజులకోసారి వెళ్లి వస్తున్నారు. హైదరాబాద్ వంటి చోట్ల ఉంటూ, ప్రభుత్వ సేవలను మరిచిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇష్టారాజ్యంగా సిజేరియన్లు దేశంలో అత్యధికంగా సిజేరియన్ ఆపరేషన్లు చేసే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. రాష్ట్రంలో ఎక్కువగా కరీంనగర్ జిల్లాలో సిజేరియన్లు జరుగుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. డబ్బులకు కక్కుర్తిపడి ఇష్టారాజ్యంగా ప్రైవేట్ ఆసుపత్రులు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నాయి. సాధారణ ప్రసవానికి రూ.10 వేలు తీసుకుంటే, సిజేరియన్‌కు రూ.40 వేలు కనీసంగా వసూలు చేస్తున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అవనసరంగా సిజేరియన్ ఆపరేషన్లు చేసే ఆసుపత్రుల లైసెన్స్ రద్దు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించారు. సంబంధిత ఆపరేషన్‌లో పాల్గొనే డాక్టర్ రిజిస్ట్రేషన్ రద్దు చేసే ఆలోచనలో కూడా వైద్యశాఖ ఉంది. మరోవైపు కొందరు ముహూర్తాలు పెట్టి ఆ మేరకు సిజేరియన్ కాన్పులు చేయాలని డాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు వైద్య వర్గాలకు సమాచారం అందింది. ఇందుకోసం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని కూడా నిర్ణయించారు. ఆర్డీవోలు, ఐఏఎస్‌లకు బాధ్యతలు ఇటీవల ఎంజీఎం ఐసీయూలో ఒక రోగిని ఎలుకలు కరవడాన్ని (తర్వాత నిమ్స్‌లో చనిపోయాడు) వైద్యశాఖ వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. కిందినుంచి పైస్థాయి వరకు అనేక లోపాలు ఇందుకు కారణమని భావిస్తున్నాయి. ముఖ్యంగా అనేక ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో పారిశుధ్య లోపం ప్రధానంగా ఉంది. మరోవైపు రోగులు ఆసుపత్రులకు వెళితే వారిపట్ల సిబ్బంది వ్యవహరించే తీరు విమర్శలకు తావిస్తోంది. డాక్టర్లే ఆసుపత్రుల సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తుండటంతో వారికి పరిపాలనా అనుభవం ఉండటం లేదు. ఈ కారణంగానే ఆసుపత్రుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏరియా, జిల్లా ఆసుపత్రుల పరిపాలన బాధ్యతను ఆర్డీవోలకు అప్పగించాలని వైద్య ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. వారిని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా నియమించే అవకాశముంది. గాంధీ, కాకతీయ వంటి బోధనాసుపత్రుల నిర్వహణ, పరిపాలన బాధ్యతలను ఐఏఎస్ స్థాయి అధికారులకు అప్పగించనున్నారు. ఉస్మానియా ఆసుపత్రి బాధ్యతను ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ వాకాటి కరుణకు అప్పగించారు. సీసీ కెమెరాలతో నిఘా డాక్టర్లు పీహెచ్‌సీలకు వెళ్లేలా పకడ్బందీ చర్యలకు వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేసినా వాటిని పాడుచేసి డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి పీహెచ్సీలో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డాక్టర్, నర్సు, లేబరేటరీ ఫార్మసిస్ట్ ఉండే గదుల్లో వీటిని అమర్చుతారు. ఈ మేరకు కొన్నిచోట్ల ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 900కు పైగా ఉన్న పీహెచ్సీ, యూపీహెచ్సీల కెమెరాలన్నింటినీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు మొబైల్ ఫోన్లకు లింక్ చేస్తారు. దీంతో ఏ పీహెచ్సీనైనా వారు తమ మొబైల్ ఫోన్‌ద్వారా పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది. మరికొన్ని కీలక నిర్ణయాలు.. – ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన శానిటైజేషన్ కాంట్రాక్టులన్నీ రద్దు చేయాలని నిర్ణయం. కొత్త కాంట్రాక్టులకు కఠినమైన నిబంధనలను అమలు చేస్తారు. – గాంధీ, ఉస్మానియా సహా పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ప్రైవేట్ మందుల దుకాణాలను ఎత్తివేయాలని నిర్ణయం. ప్రభుత్వమే ఉచితంగా మందులు ఇస్తున్నప్పుడు ప్రైవేట్ దుకాణాలు ఎందుకని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. – గ్రామాల్లో ఆర్థో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారు. మోకాళ్ల నొప్పులున్న వారిని గుర్తించి వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకాళ్ల మార్పిడి లేదా చికిత్సలు చేస్తారు. – ఒక్క గాంధీలోనే దాదాపు 60 మంది వరకు అనెస్థీషియా డాక్టర్లు ఉన్నారు. ఇతర స్పెషలిస్ట్ వైద్యులు కొన్నిచోట్ల ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల డాక్టర్ల క్రమబద్ధీకరణ చేపడతారు. – ప్రతి నెలా ఆసుపత్రుల నిర్వహణపై నివేదిక రూపొందిస్తారు. ఆ ప్రకారం సమీక్ష చేస్తారు. – ప్రభుత్వ ఆధ్వర్యంలో సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. తద్వారా ప్రైవేట్ దోపిడీకి చెక్ పెడతారు. – నిమ్స్, గాంధీల్లో కొత్తగా 250 పడకల చొప్పున మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రులను (ఎంసీహెచ్) నెలకొల్పుతారు. -
ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కేసుపై సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: భారత అత్యున్నత ధర్మాసనం ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేజన్ల కేసుపై శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టులో జస్టిస్ ఎల్. నాగేశ్వర్ రావు నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు) మరియు షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పనపై తామేలాంటి ప్రమాణాలను నిర్దేశించలేమని తెలిపింది. ప్రాతినిధ్య ప్రమాణాలను నిర్ణయించడానికి న్యాయస్థానం వద్ద ఎలాంటి కొలమానం లేదని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యంపై రాష్ట్ర ప్రభుత్వాలే లెక్కలు సేకరించాలని తెలిపింది. మొత్తం సర్వీసు ఆధారంగా కాక, రిజర్వేషన్ల ఆధారంగానే డేటాను సేకరించాలని స్పష్టం చేసింది. అదే విధంగా ప్రమోషన్ల డేటా సమీక్షకు వ్యవధి సహేతుకుంగా ఉండాలని తెలిపింది. రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశ్యంతో రాష్ట్రాలు తప్పనిసరిగా సమీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. దామాషా ప్రాతినిధ్యం, తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం తదితర అంశాలన్నీ రాష్ట్రాలే చూసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. కాగా, ప్రమోషన్లలో రిజర్వేషన్ల కల్పనలో ప్రమాణాలను నిర్దేశించడంలో ఎదురవుతున్న అయోమయాన్ని దూరం చేయాలని కోరుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. చదవండి: ‘సిద్ధూ డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులను అనాథలుగా విడిచిపెట్టాడు’ -
ఇక ఓఎస్ ప్రమోషన్లకు చెల్లు
సాక్షి, హైదరాబాద్: పదోన్నతుల్లో సమస్యలు రాకుండా, సీనియారిటీ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేలా కొత్త సర్వీస్ రూల్స్‌ను పోలీస్ శాఖ తీసుకొస్తోంది. ఔట్ ఆఫ్ సర్వీస్ కింద తాత్కాలిక పద్ధతిలో ఇచ్చే పదోన్నతులను ఆపేయాలని, యాగ్జిలేటరీ ప్రమోషన్లకు ప్రత్యేక రూల్ ఉండాలని ప్రతిపాదన చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రతిపాదనలను హోం శాఖ ద్వారా ప్రభుత్వానికి పంపింది. న్యాయపరమైన సమస్యలు రాకుండా ఆ ప్రతిపాదనలను న్యాయ శాఖకు హోం శాఖ పంపించే ఏర్పాట్లు చేస్తోంది. న్యాయ శాఖ నుంచి క్లియరెన్స్ రాగానే ప్రభుత్వం ఆమోదించనున్నట్టు తెలిసింది. నాలుగేళ్లు స్టడీ..: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూపొందించిన కఠినమైన పోలీస్ సర్వీసు రూల్స్‌ను రాష్ట్ర పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సమీక్షించింది. సర్వీస్ రూల్స్‌లో అనుభవమున్న రిటైర్డ్ అధికారులతో కమిటీ వేసి నాలుగేళ్లు అధ్యయనం చేసింది. పాత సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించి విచక్షణాధికారం పేరుతో గతంలో అధికారులు చేసిన తప్పిదాల వల్ల కోర్టుల్లో కొన్ని వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో ప్రతి కోర్టు తీర్పును కమిటీ అధికారులు ముందు పెట్టుకొని కొత్త రూల్స్‌ను రూపొందించినట్టు ఉన్నతాధికారులు చెప్పారు. సీనియారిటీ విషయంలోనే 2,800 కేసులను కమిటీ అధ్యయనం చేసిందని తెలిసింది. యాగ్జిలేటరీలో ప్రమోషన్లు ఇలా ఇద్దాం..: మావోయిస్టు, ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణలో బాగా పనిచేసే పోలీస్ సిబ్బంది, అధికారులకు యాగ్జిలేటరీ పద్ధతిలో పదోన్నతులు కల్పించడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి ఏపీలో ఇచ్చిన ఓ జీవో ద్వారానే ఇలా ప్రమోషన్లు ఇస్తున్నారు. ప్రత్యేకంగా రూల్ అంటూ సర్వీస్ రూల్స్‌లో లేదు. దీంతో సమయం ప్రకారం పదోన్నతి రాని అధికారులు అభ్యంతరం తెలపడం, కోర్టులకు వెళ్లడంతో సమస్యలు వచ్చి బ్యాచ్‌ల మధ్య సీనియారిటీ సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో యాగ్జిలేటరీ పదోన్నతుల్లో కీలకమైన రూల్స్‌ను కమిటీ ప్రతిపాదించింది. ఇలా ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు అతని కన్నా ముందు బ్యాచ్ చివరి స్థానంలో, అతడి బ్యాచ్ ముందు వరుసలో సీనియారిటీ కల్పిస్తే సమస్యలుండవని వివరించింది. ఓఎస్ పదోన్నతుల్లో సమస్యలు పోలీస్ శాఖలో డ్యూటీలో మెరుగైన సేవలందించే వాళ్లకు ఓఎస్ (ఔట్ ఆఫ్ సర్వీస్)కింద తాత్కాలిక పద్ధతిలో పదోన్నతి కల్పించే వారు. అయితే ఆ హోదాలోకి సీనియారిటీ ప్రకారం వేరే అధికారులు పదోన్నతి పొందితే ఓఎస్ పద్ధతిలో పనిచేస్తున్న అధికారి మళ్లీ పాత హోదాలోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ కొంత మంది అధికారులు, సిబ్బంది ఓఎస్‌పై కోర్టులకు వెళ్లి ఓఎస్ హోదాలోనే ఉండేలా తీర్పులు తెచ్చుకున్నారు. దీంతో సర్వీస్ సమస్యలు ఎక్కువయ్యాయి. పాత సర్వీస్ రూల్స్‌ను సమీక్షించిన కమిటీ.. ఓఎస్ పద్ధతిలో తాత్కాలిక పదోన్నతులను ఆపాలని ప్రతిపాదించింది. -
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి సర్వీసు రూల్స్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవస్థీకరించిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల ముంగిట సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి సర్వీసు రూల్స్ రూపొందించి, వారికి ఉద్యోగపరమైన ప్రయోజనాలు అందజేయాల్సిన అవసరం ఉందని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు. ఆయన అధ్యక్షతన విజయవాడ ఆటోనగర్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల కమిషనరేట్‌లో గురువారం సమావేశం జరిగింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి సర్వీసు రూల్స్, సెలవుల నియమావళి, ప్రొబేషన్, ఉద్యోగుల ఆరోగ్య పథకం, కారుణ్య నియామకాలు, సర్వీసు పుస్తకం నిర్వహణ, శిక్షణ, శిక్షణ సంబంధిత పరీక్షలు, శాఖాపరమైన పరీక్షలు, డ్రెస్ కోడ్ తదితర అంశాలపై చర్చించారు. మార్చి 30లోపు ఆయా శాఖలు సర్వీసు పుస్తకాలు ప్రారంభించాలన్నారు. సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయాల కమిషనర్ డా.నారాయణ భరత్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈమేరకు రాష్ట్ర సబార్డినేట్ నిబంధనల్లో పొందుపరుస్తూ పురపాలకశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకం, జీతాల చెల్లింపు, పదోన్నతులు, క్రమశిక్షణా చర్యలు తదితర అంశాలను పురపాలక శాఖ సర్వీసు నిబంధనల్లో పొందుపరిచారు. వార్డు సచివాలయ ఉద్యోగులు జిల్లా యూనిట్‌గా పనిచేస్తారు. ఇవీ సర్వీస్ నిబంధనలు... మినిస్టీరియల్ విభాగం 1వ కేటగిరీలో వార్డు పరిపాలన కార్యదర్శి, 2వ కేటగిరీలో వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి ఉంటారు. వీరికి పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ అపాయింట్మెంట్ అథారిటీగా వ్యవహరిస్తారు. ప్రజారోగ్య విభాగం ఒకటో కేటగిరీ కింద వార్డు పారిశుధ్య, పర్యావరణ కార్యదర్శి గ్రేడ్–2గా ఉంటారు. వీరికి పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ అపాయింట్మెంట్ అథారిటీగా వ్యవహరిస్తారు. ఇంజనీరింగ్ విభాగం ఒకటో కేటగిరీ కింద వార్డు వసతుల కార్యదర్శి గ్రేడ్–2 ఉంటారు. వీరికి ప్రజారోగ్య విభాగం సూపరింటెండెంట్ ఇంజనీరు అపాయింట్మెంట్ అథారిటీగా వ్యవహరిస్తారు. టౌన్ ప్లానింగ్ విభాగం ఒకటో కేటగిరీ కింద వార్డు ప్లానింగ్, క్రమబద్ధీకరణ కార్యదర్శి ఉంటారు. వీరికి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్( టౌన్‌ప్లానింగ్) అపాయింట్మెంట్ అథారిటీగా వ్యవహరిస్తారు. సంక్షేమం, అభివృద్ధి విభాగం ఒకటో కేటగిరీ కింద వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి ఉంటారు. పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ వీరికి అపాయింట్మెంట్ అథారిటీగా వ్యవహరిస్తారు. ఏదైనా పంచాయితీ.. కార్పొరేషన్ / మున్సిపాలిటీలో విలీనం అయితే గ్రామ సచివాలయ ఉద్యోగులు సమ్మతిస్తే ఆ మున్సిపాలిటీ/ కార్పొరేషన్‌లోని వార్డు సచివాలయ పరిధిలోకి వస్తారు. లేకపోతే మరో గ్రామ సచివాలయంలో వారిని నియమిస్తారు. ఇప్పటికే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో వివిధ విభాగాల కింద ఉన్న వారిని ఇక నుంచి వార్డు సచివాలయ ఉద్యోగులుగా పరిగణిస్తారు. బిల్ కలెక్టర్లు ఇకపై వార్డు పరిపాలన కార్యదర్శులుగా వ్యవహరిస్తారు. వర్క్ ఇన్స్పెక్టర్లు, ఫిట్టర్లను ఇక నుంచి వార్డు వసతుల కార్యదర్శి గ్రేడ్–2గా పరిగణిస్తారు. టౌన్ ప్లానింగ్ ట్రేసర్లు సచివాలయ టౌన్ ప్లానింగ్ కార్యదర్శులుగా వ్యవహరిస్తారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాలు చెల్లిస్తారు. మున్సిపల్ కమిషనర్ వార్డు సచివాలయ ఉద్యోగులకు సెలవులు మంజూరు చేస్తారు. ఉద్యోగులకు రుణాలు, అడ్వాన్సులు మంజూరు చేసే అధికారాన్ని కమిషనర్‌కే దఖలు పరిచారు. ఉద్యోగులపై విచారణకు ఆదేశించడం, క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం కమిషనర్‌దే. ఉద్యోగి తప్పిదాన్ని బట్టి గరిష్టంగా ఆరు నెలలపాటు సస్పెండ్ చేయవచ్చు. విచారణ అనంతరం అపాయింట్మెంట్ అథారిటీ అనుమతితో కమిషనర్ వార్డు సచివాలయ ఉద్యోగులను సస్పెండ్ చేయడం, కింది కేటగిరీకి డిమోట్ చేయడం, ఇంక్రిమెంట్లు నిలిపివేయడంతోపాటు ఉద్యోగం నుంచి తొలగించవచ్చు. దీనిపై సచివాలయ ఉద్యోగులు తమ అపాయింట్మెంట్ అథారిటీకి నెల రోజుల్లోగా అప్పీల్ చేసుకోవచ్చు. అప్పాయింట్మెంట్ అథారిటీ ఆదేశాలపై పురపాలక శాఖ అధిపతికి మూడు నెలల్లోగా అప్పీలు చేసుకోవచ్చు. వార్డు సచివాలయ ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పరిధిలోకి వస్తారు. -
ప్రతికూల పవనాలు..
సాక్షి, శ్రీకాకుళం: ఫలితాలను సమీక్షిస్తే ఎమ్మెల్సీ ఓటర్లుగా వున్న పలు వర్గాల ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయ, అధ్యాపకులు ప్రభుత్వంపై వ్యతిరేకంగా వున్నట్లు తేటతెల్లమవుతోంది. గాదె శ్రీనివాసులు నాయుడుకు ప్రధానంగా పీఆర్టీయూ.. మరో నాలుగు సంఘాలు మద్దతు ప్రకటించాయి. రఘువర్మకు యూటీఎఫ్తోపాటు, ఎస్టియు, ఏపీటీఎఫ్, ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్, జీసీజీటీఏ, ఏపీఎంఎస్‌టీఎఫ్, కేజీబీవీ, జీటీఏ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఎమ్మెల్సీగా వున్న గాదె శ్రీనివాసులునాయుడు ప్రభుత్వ నిర్ణయాలకు వత్తాసు పలుకుతూ వచ్చారని, కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పండిత వర్గాలకు వ్యతిరేకంగా వచ్చేటట్లు వ్యవహరించారన్న ఆరోపణలు ఉపాధ్యాయ వర్గాల నుంచి బహిరంగంగానే వినిపించాయి. 2004 తరువాత ఆయన తొలిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పట్లో వైఎస్సార్ చలువతో ఉపాధ్యాయ వర్గాలకు ఆయన తీసుకున్న సానుకూల నిర్ణయాలు వలన గాదె గెలుపొందగలిగారు. రెండో దఫా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికలు జరగగా, గాదె విజయం సాధించారు. వైఎస్సార్ తీసుకున్న నిర్ణయాలు 2012 వరకు కొనసాగడంతో గాదె విజయం సాధ్యమైంది. తెలుగుదేశం వచ్చిన తరువాత ఆ పార్టీలో చేరిన గాదె ఉపాధ్యాయులకు అనుకూలంగా దేనినీ సాధించలేకపోయారు. కనీసం సమస్యలపై పోరాట ధోరణిని కూడా ప్రదర్శించలేదన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనివలనే ఆయన ఈసారి ఓటమి చెందారు. యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీటీఎఫ్ వంటి సంఘాలు తొలి నుంచి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ ఉపాధ్యాయ సమస్యలపై పోరాటాలు చేస్తూ వచ్చాయి. దీంతో వీరు బలపరిచిన రఘువర్మ ఎమ్మెల్సీగా విజయం సాధించగలిగారు. కాంట్రాక్టు అధ్యాపకులకు అన్యాయం కాంట్రాక్టు అధ్యాపకులకు సర్వీసు రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి ప్రభుత్వం విస్మరించింది. అటు తరువాత టైమ్ స్కేల్ ఇస్తున్నట్లు ప్రకటించి దీనికి సంబంధించిన ఉత్తర్వుల్లో స్పష్ఠత లేకుండా చేయడంతో పాటు, ఎన్నికల తరువాత టైమ్ స్కేల్ అమలయ్యేటట్లు పేర్కొనడంతో ప్రభుత్వంపై నమ్మకం సడలిన అధ్యాపకులు ఎమ్మెల్సీ ఓటింగులో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు ఎన్నో సమస్యలు ఉపాధ్యాయులకు ఎన్నో సమస్యలు వున్నాయి. పీఆర్సీ, డీఏ బకాయిల విషయంలో అత్యంత దారుణంగా వ్యవహరించడంతో ఉపాధ్యాయ వర్గాలు ప్రభుత్వానికి తమ సత్తాను తెలియజేశారు. సీపీఎస్ రద్దు విషయంలో కూడా ప్రభుత్వం వ్యతిరేక విధానాన్ని అవలంబించడంతో ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో అసంతృప్తితో వున్నారు. 398 ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్ విషయంలో కూడా సానుకూల నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల ముందు వీటన్నింటికి సంబంధించి సానుకూలంగా వున్నట్లు వ్యవహరించిన ప్రభుత్వం ఉత్తర్వుల్లో మాత్రం ఎన్నికల అనంతరం అమలయ్యేటట్టు పేర్కొనడంతో ప్రభుత్వాన్ని నమ్మని ఉపాధ్యాయులు ఓటును వ్యతిరేకంగా వేశారు. పండిట్, పీఈటీలను ఊరించి ఉసూరుమనిపించిన ప్రభుత్వం రాష్ట్రంలోని 12 వేలకు పైగా పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేసి వాటిని పదోన్నతులపై భర్తీ చేయకపోవడంతో ఆయా వర్గాల ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత ఉత్తర్వులు వెలువరించడానికి రెండు నెలలకు పైగా పట్టింది. అటు తరవాత పదోన్నతుల కోసం పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. మునిసిపల్ యాజమాన్యంలో పదోన్నతులు చేపట్టేలా ఉత్తర్వులు వెలురించిన ప్రభుత్వం, జిల్లా పరిషత్, ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో పదోన్నతులు చేపట్టకుండా కాలయాపన చేసింది. ఈ విషయంలో పండిట్లు, ఎస్జీటీల మధ్య వివాదం రేపి తాత్సారం చేస్తూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు నాన్చుడు ధోరణి ప్రదర్శించింది. విద్యాధికులైన ఉపాధ్యాయులు ఓటు రూపంలో ప్రభుత్వంపై వున్న వ్యతిరేకతను వ్యక్తం చేశారు. రెగ్యులరైజేషన్‌కు నోచుకోని కేజీబీవీ సిబ్బంది కేజీబీవీల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది రెగ్యులరైజేషన్‌కు నోచుకోలేకపోయారు సరికదా, ఉద్యోగ భద్రత లేకుండా అయిపోయారు. కాంట్రాక్టు పద్ధతిన వున్న కొందరిని ఏజెన్సీ పరిధిలోనికి తీసుకువచ్చి నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా చేశారు. మోడల్ స్కూళ్లలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఉపాధ్యాయులదీ ఇదే పరిస్థితి. వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఉమ్మడి సర్వీసు రూల్స్ సాధనలో గాదె విఫలం ఉమ్మడి సర్వీసు రూల్స్ సాధించడంలో గాదె శ్రీనివాసులునాయుడు విఫలమయ్యా రు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీనివాసులునాయుడు ఆధ్వర్యంలో కమిటీని ఢిల్లీ పంపించింది. అక్కడి నుంచి ఓ పనికి రాని జీఓను తీసుకువచ్చి నేరుగా తిరుమల వెళ్లి గుండు కొట్టించుకున్నారు. ఈ జీఓ వల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. –పేడాడ ప్రభాకరరావు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు -
సీపీఎస్ రద్దు చేయాలని ధర్నా
ఇచ్చోడ : కేంద్ర ప్రభుత్వం వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి వోపీసీ పునరుద్ధరించాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లరత్నాకర్ రెడ్డి అన్నారు. సీపీఎస్ రద్దు కోరుతు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈవో, జీహెచ్ఎం, ఎస్ఎలను అఫ్గ్రెడ్ చేసిన పండితులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు డైట్, జేఎల్ పోస్టులకు బదిలీలు చేపట్టి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోషియేట్ అధ్యక్షులు ప్రకాశ్‌గౌడ్, జిల్లా బాధ్యులు జయరాం, అశోక్, దేవర్ల సంతోష్, రాజేశ్వర్, మండల అధ్యక్షులు కె ప్రవీణ్‌కుమార్, కార్యదర్శి భగత్ కాశినాథ్, బుచ్చిబాబు, అన్వర్‌అలీ, రాష్ట్ర కార్యదర్శి మల్లెష్, సీపీఎస్ ఉపాధ్యాయులు రాజన్న, సిరికొండ మండల అధ్యక్షులు కాంతయ్య, కార్యదర్శి జైతు పాల్గొన్నారు. వెంటనే రద్దు చేయాలి... బోథ్: మండల తహసీల్ కార్యాలయం ఎదుట పీఆర్టీయూ నాయకులు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సీపీఎస్ విధానంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. వారి కుటుంబాలు రోడ్డునే పడే విధంగా ఈ విధానం ఉందని పేర్కొన్నారు. అనంతరం తహసీల్దార్ దుర్వ లక్ష్మణ్‌కు వినతిపత్రం అందించారు. మండల అధ్యక్షులు భిక్కులాల్, ప్రధాన కార్యదర్శి జావిద్ అలీ, మండల పరిశీలకులు ఆర్టివి ప్రసాద్, రాజ్ నారాయణ, జిల్లా నాయకులు జయరాజ్, గంగయ్య,పోశెట్టి, సతీష్, అనిల్ పాల్గొన్నారు. గుడిహత్నూర్‌లో... గుడిహత్నూర్ : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పీఆర్టీయూ మండలాధ్యక్షుడు సుభాష్ మోస్లే, ప్రధాన కార్యదర్శి మైస మాధవ్, అసోసియేట్ ప్రసిడెంట్ నాందేవ్, మహిళాధ్యక్షురాలు భూలత, కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర అసోసియేట్ ప్రసిడెంట్ జాదవ్ సుదర్శన్, ఎంఈవో నారాయణ, సీనియర్ నాయకులు రాజేషుడు, వెంకటరమణ, నాగ్నాథ్, రమేష్ రెడ్డి, భీంరావ్, మోహన్, జరీనాబేగం, అర్చన, సీపీఎస్ ఉద్యోగులు శ్రీనివాస్ ఉన్నారు. పాత పింఛన్ విధానం తేవాలి... బజార్హత్నూర్ : పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్ రాజు, జిల్లా అసోషియేట్ సభ్యులు జయరాం, ప్రకాష్‌గౌడ్, రాష్ట్ర పరిశీలకుడు సంతోష్, మండల అధ్యక్షులు చంద్రకాంత్బాబు, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, సభ్యులు లక్కం విజయ్‌శేఖర్, ఆర్.ప్రకాష్, సధానంధం, ఆర్ శంకర్, వెంకట రమణ, చందన్‌బాబు,మోహన్, శంకర్, జంగుబాబు పాల్గొన్నారు. రద్దు చేసే వరకు పోరాటం ... నేరడిగొండ : సీపీఎస్ విధానం రద్దయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర కార్యదర్శి సహదేవ్ అన్నారు. తహసీల్దార్ కూనాల గంగాధర్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆ సంఘం మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నారాయణగౌడ్, జిల్లా కార్యదర్శి గంగాధర్, ఉపాధ్యక్షుడు గంగాధర్, ఉపాధ్యాయులు నారాయణ, మల్లేష్, రాంచందర్, అరుణ్, రాంచందర్, దేవిప్రియ, హారిక, సంగీత పాల్గొన్నారు. -
ఉద్యమానికి సై!
♦ ఏకీకృత సర్వీస్ రూల్స్‌లో గిరిజన సంక్షేమ ♦ ఉపాధ్యాయులకు అన్యాయం ♦ ఉద్యమాలకు సన్నద్ధమవుతున్న గురువులు ♦ జూలై మూడో తేదీ నుంచి ఆందోళన బాట ఉమ్మడి సర్సీస్ రూల్స్ వర్తింపజేయకపోవడంపై గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. తమకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నారు. వచ్చేనెల మూడో తేదీ నుంచి దశలవారీ ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. మూడున ఐటీడీఏల వద్ద ధర్నాలు చేయతలపెట్టారు. 9న విశాఖపట్టణంలో రాష్ట్రస్థాయిలో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమావేశం జరపడానికి నిర్ణయించారు. ఏళ్ల తరబడి గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తమకు అన్యాయం జరగడాన్ని సహించలేకపోతున్నారు. సీతంపేట(పాలకొండ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 10 వేల మంది గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు ఉండేవారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఆరు వేలమంది వరకు పనిచేస్తుండగా.. శ్రీకాకుళం జిల్లాలో 600 మంది వివిధ గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ వర్తింపచేస్తూ ఇటీవల రాష్ట్రపతి ఉత్వర్వులు వెలువడ్డాయి. అయితే గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు ఎటువంటి ఉమ్మడి సర్వీస్ రూల్స్ వర్తింపజేయలేదు. దీంతో తమకు అన్యాయం జరిగిందని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. 1975లోనే విద్యాశాఖ ఉపాధ్యాయులతో సమానంగా 674, 675 జీవోలను, 25.05.76 ప్రకారం 1976లో గిరిజన సంక్షేమ టీచర్లకు లోకల్ కేడరు ఆర్గనైజేషన్ కాబడిందని, 1988లో జీవో నంబర్ 32 తెలుపుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆవిర్భావం నుంచి 010 పద్దు కింద జీతాలు డ్రా చేస్తున్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ పొందడానికి అన్ని అర్హతలు ఉన్నా 40 ఏళ్లుగా గిరిజన సంక్షేమ టీచర్లు ఎటువంటి పరిపాలనా పరమైన, ఉన్నతమైన పదోన్నతులు పొందలేకపోతున్నారు. నిబంధనల ప్రకారం మెమో నంబర్ 1656 కె.కె.1/68 ప్రకారం ప్రభుత్వ విద్యాశాఖ ఉపాధ్యాయులకు వర్తించే అన్ని ఉత్తర్వులు గిరిజన సంక్షేమ శాఖ టీచర్లకు వర్తించాలి. 2006 మార్చి పదో తేదీన ఆర్సీ నంబర్–ఏ 4145 ప్రకారం ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ 27, 2005 చట్టానికి సవరణలు చేస్తూ ఆ చట్టములో గిరిజన సంక్షేమ శాఖ టీచర్లను కూడా ఆర్డినెన్స్‌లో చేర్చమని, కామన్ సర్వీస్ రూల్స్‌లో కూడా వీరిని చేర్చాలని, కామన్ సర్సీస్ రూల్స్‌లో కూడా చేరుస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపించారని తెలిపారు. 2008లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏపీ ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిల్ 2008లో 17 మంది గిరిజన ఎంఎల్ఏలు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి గిరిజన సంక్షేమ టీచర్లను, విద్యాశాఖ ఉమ్మడి సర్వీస్ రూల్స్‌లోకి తీసుకు రావాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగింది. ఇవీ డిమాండ్లు.. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు. వాటిలో ప్రధానమైనవి.. పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ కార్యదర్శుల సమక్షంలో గిరిజన సంక్షేమ శాఖ సర్వీస్ రూల్స్ కమిటీతో సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ప్రభుత్వ సర్వీస్ రూల్స్ తయారీలో ఏర్పాటు చేసిన కమిటీలో గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఒక రాష్ట్రస్థాయి అధికారిని, గిరిజన సంక్షేమశాఖ సర్వీస్ రూల్స్ సాధన కమిటీ నుంచి ఒక రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ ప్రతినిధిని నియమించాలని, ఇక నుంచి సర్వీస్ రూల్స్‌పై పంపే ప్రతీ ఫైల్లోనూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్స్ అని రాసినప్పుడు ఇన్క్లూడింగ్ గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ అని రాయాలని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. -
సర్వీస్ రూల్స్ అమలును వేగవంతం చేయండి
కేంద్ర హోం శాఖను కోరిన ఎస్టీయూ నేతలు సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఏకీకృత సర్వీసు నిబంధనలను అమలు చేయడానికి కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. కేంద్ర హోం శాఖ వెంటనే సర్వీసు రూల్స్ అమలుకు అవసరమైన చర్యలను చేపట్టాలని ఇరు రాష్ట్రాల ఎస్టీయూ నేతలు కోరారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు షణ్ముర్తి, భుజంగరావు, ప్రధాన కార్యదర్శులు జోసెఫ్ సుధీర్‌బాబు, సదానందగౌడ్ సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్‌తో సమావేశమై వినతిపత్రాన్ని సమర్పించారు. సర్వీస్ రూల్స్ అమలుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే హోం శాఖ నుంచి ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి పంపేదుకు చర్యలు తీసుకుంటామని దిలీప్ కుమార్ హామీ ఇచ్చినట్టు కత్తి నరసింహారెడ్డి తెలిపారు. సీఐడీ ఐజీగా షికా గోయల్ కేంద్ర సర్వీసుల నుంచి ఇటీవల రిలీవై రాష్ట్ర పోలీసుశాఖలో రిపోర్టు చేసిన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి షికా గోయల్‌ను సీఐడీ ఐజీగా అటాచ్ చేస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సీఐడీలోని జనరల్ అఫెన్స్ వింగ్, ఎకానామిక్ అఫెన్స్ వింగ్ బాధ్యతలను ఆమెకు అప్పగించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ రెండు విభాగాల్లో పదేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ఆమె సోమవారం సమీక్షించారు. -
‘సర్వీసు రూల్స్’పై వేగం పెంచండి
- టీచర్లకు వేర్వేరు సర్వీసు నిబంధనలతో ఇబ్బందులు - కేంద్ర హోంశాఖను కోరిన తెలంగాణ, ఏపీ - వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో హోంశాఖ అధికారులతో కడియం శ్రీహరి, గంటా శ్రీనివాసరావు భేటీ - జూన్ 12లోపు రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడేలా చూడాలని విజ్ఞప్తి - తెలంగాణకు 84 కేజీబీవీల మంజూరుకు కేంద్రం ఓకే: కడియం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ఇరు రాష్ట్రాలు కేంద్ర హోం శాఖకు విజ్ఞప్తి చేశాయి. పంచాయతీరాజ్ టీచర్లకు, ప్రభుత్వ టీచర్లకు వేర్వేరు సర్వీసు నిబం ధనలు ఉండడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, అందువల్ల ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు చేసి... ఇరు రాష్ట్రాల్లో విద్యా ప్రమాణాల పెంపునకు తోడ్పడాలని కోరారు. ఏకీకృత సర్వీసు రూల్స్‌ను ఇటీవలే ఆమోదించిన కేంద్ర న్యాయ శాఖ.. ఆ ఫైలును కేంద్ర హోం శాఖకు పంపింది. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు కడియం శ్రీహరి, గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. ఇందులో కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్ కుమార్, డైరెక్టర్ అశుతోష్ మిశ్రాజైన్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. దాదాపు 20 ఏళ్లుగా ఉపాధ్యాయులు నిరీక్షిస్తున్న ఏకీకృత సర్వీసు రూల్స్‌కు రాష్ట్రపతి ఆమోదం లభించేలా చర్యలు తీసుకోవాలని కడియం, గంటా విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంకయ్యనాయుడు కేంద్ర హోంశాఖ కార్యదర్శితో ఫోన్లో మాట్లాడారు. సర్వీసు రూల్స్‌పై కేంద్ర న్యాయశాఖ పంపిన ఫైలును వీలైనంత త్వరగా ఆమోదించి రాష్ట్రపతికి పంపాలని కోరారు. విద్యా ప్రమాణాల మెరుగు.. వెంకయ్యనాయుడుతో భేటీ అనంతరం కడి యం మీడియాతో మాట్లాడారు. ఏకీకృత సర్వీసు నిబంధనలను అమలు చేయడం వల్ల విద్యా ప్రమాణాల మెరుగుకు ఆస్కారం ఉం టుందన్నారు. ప్రభుత్వ టీచర్లతో సమానంగా పంచాయతీరాజ్, మండల, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు పదోన్నతులు లభిస్తాయని చెప్పారు. డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో పోస్టులను భర్తీ చేస్తే విద్యా ప్రమాణాల పెంపు, పర్యవేక్షణకు వీలు కలుగుతుందని చెప్పారు. సర్వీసు రూల్స్ ఫైలును వెంటనే రాష్ట్రపతి ఆమోదానికి పంపి జూన్ 12 (పాఠశాలల పునఃప్రారంభం) లోపు ఉత్తర్వులు వెలువడేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. డిటెన్షన్‌ను వ్యతిరేకించాం.. ఐదు, ఎనిమిదో తరగతుల్లో డిటెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్న కేంద్రం ప్రతిపాదనపై ముఖ్యమంత్రితో చర్చించాక అభిప్రాయాన్ని వెల్లడిస్తామని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. వాస్తవానికి ఈ విధానాన్ని గతంలోనే వ్యతిరేకించామని.. గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ డ్రాపౌట్లకు ఆస్కారమిచ్చే అవకాశం ఉండడమే దానికి కారణమని చెప్పారు. ప్రస్తుతమున్న విద్యా వ్యవస్థలో విద్యార్థుల వైఫల్యాలను ఎత్తిచూపడం సరికాదని వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తెలంగాణకు 84 కేజీబీవీలు రాష్ట్రంలో వెనుకబడిన మండలాల్లో 84 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా ల(కేజీబీవీ) మంజూరుకు కేంద్రం అంగీకరించినట్టు కడియం తెలిపారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలసిన అనంతరం వివరాలను వెల్లడించారు. తెలంగాణకు 110 కేజీబీవీలను మం జూరు చేయాలని కోరగా.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 84 కేజీబీవీలను ప్రారంభించడానికి అంగీకరించారని తెలి పారు. అందులో 32 విద్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించి ప్రారంభించడానికి నిధులు మంజూరు చేయనున్నారని, మిగతా వాటిని తాత్కాలిక భవనాల్లో ప్రారంభిస్తారన్నారు. అలాగే 29 రెసిడెన్షి యల్ పాఠశాలలకు అనుమతులు ఇచ్చార ని చెప్పారు. ఇక కేజీబీవీల్లో ప్రస్తుతం ఎనిమిదో తరగతి వరకు కల్పిస్తున్న మధ్యాహ్న భోజన సదుపాయాన్ని పదో తరగతి వరకు పెంచాలని... యూపీఏ హయాంలో మాదిరిగా ఎన్డీయే ప్రభుత్వం కూడా మోడల్ స్కూళ్లకు నిధులు మంజూ రు చేయాలని కోరామని తెలిపారు. -
సబార్డినేట్ సర్వీస్ రూల్స్ తెలుసుకోండి
నిడమర్రు: రాష్ట్ర ప్రభుత్వం తమ యాజమాన్యంలో పనిచేసే ఉద్యోగులకు వివిధ సర్వీస్ రూల్స్ రూపొందించింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించి ఉద్యోగులకు డిపార్ట్మెంట్ల వారీగా వేర్వేరు సర్వీస్ నిబంధనలు ఉన్నాయి. అన్ని కేడర్లకు వర్తించే సాధారణ, ప్రత్యేక, తాత్కాలిక నిబంధనలతో 1996లో స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌ను ప్రభుత్వం రూపొం దించింది. ప్రభుత్వం చేపట్టే నియామక విధానాలు, ఆ నియాయకాల్లోని అభ్యర్థుల అర్హతలు, ఉద్యోగంలో చేరే గడువు, సీనియారిటీ, పరీక్షలు, ప్రొబేషన్ కాలం తదితర నిబంధనలు ఇందులో పొందుపరిచారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అర్హతలు మంచి ఆరోగ్యం, మంచి అలవాట్లు కలిగి, సంబంధిత పోస్టులో పనిచేయడానికి తగిన శారీరక దారుఢ్యం ఉండాలి. మంచి నడవడిక ప్రవర్తన కలిగి ఉన్నట్టు నివేదిక ఉండాలి. పోస్టుకు అవసరమైన విద్య, ఇతర అర్హతలు కలిగి ఉండాలి. నిర్ణీత వయోపరిమితి తప్పనిసరి. పా్యనల్ లిస్ట్ తయారీ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలోని పోస్టుల భర్తీలో స్క్రీనింగ్ కమిటీతోను, పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో సంబంధంలేని పోస్టుల విషయంలో సంబంధిత డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీతో సంప్రదించిన తర్వాత నియామక అధికారి పదోన్నతికి అర్హత గల అభ్యర్థుల జాబితా తయారు చేయడాన్ని ప్యానల్ లిస్ట్ తయారీ అంటారు. ఏటా మరుసటి ఏడాది ఆగస్టు 31కు ఏర్పడే ఖాళీలు 1:3 నిష్పత్తిలో పదోన్నతికి అర్హుల జాబితా తయారుచేస్తారు. విధుల్లో చేరేందుకు గడువు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు అపాయింట్మెంట్ ఆర్డర్ రిజిస్టర్ పోస్టులో అందిన రోజు నుంచి 30 రోజుల్లోపు విధుల్లో చేరాలి. పదోన్నతిపై నియమించిన ఉద్యోగులు ఉత్తర్వులు అందిన 15 రోజుల్లోగా ఆ పోస్టులో బాధ్యతలు తీసుకోవాలి. పదోన్నతి లభించినా విధుల్లో చేరకపోతే వచ్చే ఏడాది పదోన్నతి బదిలీలో వారి పేరు చేర్చరు. పదోన్నతిని నిరాకరించడం కుదరదు. పరీక్షలు ఇలా.. ఉద్యోగం లభించిన పిదప ప్రొబేషన్ కాలం పూర్తి అయ్యేలోపు తెలుగు భాష పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. ఎస్ఎస్సీ లేదా తత్సమాన పరీక్షను తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత చెందిన వారికి, 45 ఏళ్లు వయసు నిండిన వారికి పరీక్ష విషయంలో మినహాయింపు ఉంటుంది. కొత్తగా నిర్దేశించిన డిపార్ట్మెంటల్ పరీక్షలను ప్రొబేషన్ కాలంలో లేక పదోన్నతి లభించిన తర్వాత నిర్వహించిన రెండు డిపార్ట్మెంట్ టెస్ట్‌ల కాలంలోగా ఉత్తీర్ణత చెందాలి. సీనియారిటీ ప్రభుత్వ ఉద్యోగి సీనియారిటీ అతడు ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి లెక్కిస్తారు. అయితే నియామకం నిమిత్తం నియామక అధికారి అభ్యర్థుల జాబితా తయారుచేసి ఉంటే సదరు జాబితాలోని క్రమసంఖ్య ప్రాతిపదికగా అతని సీనియారిటీ నిర్ణయిస్తారు. నియామకం నియామకాలు నాలుగు విధాలుగా చేపడతారు. కొత్తవారిని ఎంపిక చేసి నియమించడం (డైరెక్ట్ రిక్రూట్మెంట్), ఇతర సర్వీసు లేదా అదే సర్వీసుకు చెందిన మరో సమాన స్థాయి పోస్టు నుంచి బదిలీ ద్వారా నియమించడం, ఉద్యోగంలో ఉన్న వ్యక్తికి పదోన్నతి కల్పించి నియామకం చేపట్టడం, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పద్ధతిపై నియమించడం. ప్రొబేషన్ కాలం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగుల విషయంలో నియామకపు తేదీ నుంచి మూడేళ్లు, పదోన్నతి లభించిన తేదీ నుంచి రెండేళ్ల సర్వీస్ ప్రొబేషన్ కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో సదరు ఉద్యోగి సమర్థవంతంగా పనిచేసినట్టు ఉన్నతాధికారులు ధ్రువీకరిస్తే ఆ ఉద్యోగి సర్వీస్‌లో స్థిరపడినట్టు అవుతుంది. ఈ కాలంలో ఉద్యోగి పనితీరుపై పర్యవేక్షణ ఉంటుంది. ఒకే సర్వీస్‌కు చెందిన ఒక కేటగిరీ నుంచి మరో కేటగిరీకి పదోన్నతి పొందాలంటే ఒక సర్వీస్ నుంచి వేరో సర్వీస్‌కు బదిలీపై నియామకం పొందాలన్న ఉద్యోగి తాను ప్రస్తుతం పనిచేస్తున్న క్యాడర్లో ప్రొబేషన్ కాలం పూర్తి చేసి ఉండాలి. -
‘సర్వీసు రూల్స్’పై రెండు రాష్ట్రాల ఏకాభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లకు ఏకీకృత సర్వీసు రూల్స్ కోసం కేంద్రానికి పంపనున్న ప్రతిపాదనలపై ఏకాభిప్రాయం కుదిరింది. సర్వీస్ రూల్స్ విషయమై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు పంపిన ప్రతిపాదనల్లో తేడాలుండటంతో మరోసారి చర్చించి ఒకే ప్రతిపాదనతో రావాలని గత నెలలో కేంద్రం సూచిం చింది. దీంతో మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఏపీ విద్యాశాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సమావేశమై చర్చించగా రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. టీచర్, గెజిటెడ్ పోస్టులు రెండింటికి 1998 నుంచే ఏకీకృత సర్వీసు రూల్స్ ఉండేలా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు 3 రోజుల్లో కేంద్రానికి రెండు రాష్ట్రాలు లేఖలు పంపేందుకు సిద్ధమయ్యాయని పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి తెలిపారు. -
2003డీఎస్సీ టీచర్లకు పాతపెన్షన్ వర్తింపజేయాలి
వీణవంక : 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాతపెన్షన్ విధానాన్ని వర్తింపజేసి సీపీఎస్‌ను పూర్తిగా రద్దు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు నందికొండ విద్యాసాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన యూనియన్ సమవేశంలో ఆయన మాట్లాడారు. విద్యా హక్కు చట్టం ప్రకారం అన్ని పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, పూర్వ ప్రాథమిక విద్యతో పాటు ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్నారు. సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించి పర్యవేక్షణాధికారుల పోస్టులు భర్తీ చేయాలని, పండిత, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 27న హైదరాబాద్‌లో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మండల శాఖ అ«ధ్యక్షుడు బాలాజీ, శేషాద్రి, కుమార్, రాజయ్య, బాల్‌రాజ్, అశోక్, శ్రీనివాస్, నాగిరెడ్డి, రాజేశం తదితరులు పాల్గొన్నారు. ల -
అక్టోబర్ నాటికి టీచర్లకు ఏకీకృత సర్వీసులు
జోగిపేట: అక్టోబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసులకు సంబంధించి ఉత్తర్వులు రానున్నాయని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. సోమవారం జోగిపేటలోని శ్రీ రామఫంక్షన్ హాలులో ఎంఈఓ పద్మ పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా ఉపాధ్యాయులు ఏకీకృత సర్వీసు రూల్స్ కోసం వేచిచూస్తున్నారని ఆ కల త్వరలో నెరవెరబోతుందన్నారు. ఈ విషయమై ఈనెల 27న ఢిల్లీలో హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి జవదేకర్‌తో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమావేశమవుతారన్నారు. సర్వీసు రూల్స్‌కు న్యాయశాఖకూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయన్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రం అక్షరాస్యతలో మొదటి స్థానం వచ్చేలా పనిచేయాలన్నారు. పాఠశాలల్లో అటెండర్లు, నైట్ వాచ్మెన్ పోస్టులను సీఎం దృష్టికి తీసుకువెళ్లగా పోస్టుల భర్తీకి గాను స్కూల్ గ్రాంట్ కింద నిధులు మంజూరు చేసేందుకు అంగీకరించారన్నారు. ప్రభుత్వ పాఠశాలపై మంచి అభిప్రాయం కలిగేలా చూడాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అక్టోబర్‌లో ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వస్తాయని, ఇన్‌చార్‌్జల వ్యవస్థ పోతుందన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి మాట్లాడుతూ కంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీని కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. దసరా నాటికల్లా ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ మొదలవుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొత్తపల్లి నర్సింలు, పటేల్‌రాజేందర్, పీఆర్టీయు అందోలు మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ.మాణయ్య, ఎస్.నరోత్తం కుమార్, రాష్ట్ర, అసోసియేట్ అధ్యక్షులు జీ.లక్ష్మణ్, మధుసూదన్ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు కృష్ణ, డిప్యూటీ డీఈఓ పోమ్యానాయక్, ఎంపీడీఓ కరుణశీల తదితరులు కార్యమ్రంలో పాల్గొన్నారు. -
సర్వీస్ రూల్స్‌తో పదోన్నతులు కల్పించాలి
విద్యారణ్యపురి : విద్యాశాఖలో సర్వీస్‌రూల్స్ నియమాలు రూపొందించి పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యచరణ సమితి (టీటీజేఏసీ) చైర్మన్ పింగిళి శ్రీపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీటీజేఏసీ ఏర్పాటు సందర్భంగా ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. విద్యాహక్కు చట్టాన్ని సవరించాలని ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో పలు తీర్మాణాలు కూడా చేశారు. పాఠశాలల్లో మితిమీరిన రాజకీయజోక్యాన్ని తగ్గించాలని, ఉపాధ్యాయ, ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలను చెల్లించాలని, షరుతుల్లేని నగదు రహిత హెల్త్‌కార్డులను పూర్తిస్థాయిలో అమలుచేయాలని డిమాండ్ చేస్తూ తీర్మాణించారు. ఈ సమావేశంలో పీఆర్టీయూ, ఎస్టీయూ, టీపీయూఎస్, టీఎస్‌జీహెచ్‌ఎంఏ, టీఎన్‌యూఎస్, ఎస్సీఎస్టీ యూ ఎస్టీఎస్, ఎస్టీఎఫ్, పెటా, టీఆర్టీయూ, టీఎస్‌సీఎస్‌టీ యూఎస్, టీబీసీటీయూ బాధ్యులు పాల్గొన్నారు. టీటీజేఏసీ జిల్లా చైర్మన్‌గా శ్రీపాల్‌రెడ్డి జిల్లాలోని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యచరణ సమితి (టీటీజేఏసీ)గా ఏర్పడ్డాయి. ఈమేరకు ఆదివారం హన్మకొండలోని పీఆర్టీయూ కార్యాలయంలో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని టీటీజేఏసీ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. టీటీజేఏసీ జిల్లా చైర్మన్‌గా పింగిళి శ్రీపాల్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌గా ఎ.సదయ్య, డిప్యూటీ చైర్మన్‌గా దేవిరెడ్డి మాలకొండారెడ్డి, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా డి.విష్ణుమూర్తి, కోచైర్మన్లుగా కె.శ్రీనివాస్‌రెడ్డి, ఎల్.సంజీవరెడ్డి, సెక్రటరీలుగా ఎస్.చంద్రమౌళి, ఆర్.భానుప్రసాద్‌రెడ్డి, కోశాధికారిగా ప్రవీణ్‌కుమార్, కార్యవర్గసభ్యులుగా డి.రాజమౌళి, సీహెచ్.రమేష్, జి.కోటేశ్వర్ ఎన్నికయ్యారు. -
లెక్చరర్ పోస్టుల భర్తీకి టీసర్కార్ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: ఆయా కాలేజీల్లో ఖాళీగా ఉన్న 86 లెక్చరర్ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ బుధవారం జీవో 72 జారీ చేశారు. తెలంగాణలోని ప్రభుత్వ బీఎడ్ కాలేజీలు అయిన కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్(సీటీఈ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ఈ), డీఎడ్ కాలేజీలు అయిన జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో డెరైక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీ బాధ్యతలను తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ)కు అప్పగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోన్, జిల్లా విధానం వర్తిస్తుందని, రోస్టర్ కమ్ రిజర్వేషన్ల ప్రకారం వీటిని భర్తీ చేయాలని స్పష్టం చేశారు. వీటికి సంబంధించిన ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అర్హతల వివరాలను పాఠశాల విద్యాశాఖ టీఎస్పీఎస్సీకి అందజేయాలని వివరించారు. సర్వీసు రూల్స్ సమస్య తేలితేనే మరో 70 శాతం పోస్టులు! 30 శాతం డెరైక్టు రిక్రూట్మెంట్ కోటా పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టగా పదోన్నతులపై భర్తీ చేయాల్సిన మరో 70 శాతం పోస్టుల భర్తీ తేలాల్సి ఉంది. సర్వీసు రూల్స్ సమస్య కారణంగా గత 15 ఏళ్లుగా పదోన్నతులపై భర్తీ పోస్టుల వ్యవహారం ఎటూ తేలడం లేదు. డైట్, సీటీఈ, ఐఏఎస్ఈ లెక్చరర్ పోస్టులకు తామే అర్హులమని ప్రభుత్వ టీచర్లు పేర్కొంటుండగా, ఎక్కువ సంఖ్యలో ఉన్న తమకు ఆ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని పంచాయతీరాజ్ టీచర్లు పట్టుపడుతున్నారు. దీంతో ఏకీకృత సర్వీసు రూల్స్‌కు ప్రభుత్వం చర్యలు చేపట్టినా ఎటూ తేలలేదు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త చిక్కు!
న్యూఢిల్లీ: రెండో వివాహం చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి ఆలోచించుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీసు రిజిస్టర్లో సాధరణంగా ఇచ్చే సమాచారానికి అదనంగా వారు ఎన్ని వివాహలు చేసుకున్నారో కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) ఇందుకు సంబంధించిన కొత్త ఫార్మట్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగి తన భార్య బతికి ఉండగా మరో వివాహం చేసుకోకూడదు లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ఉద్యోగి సర్వీసు పుస్తకంలో జాయినింగ్ తేదీ, పోస్టింగ్, సర్వీసు, ఇంటి అద్దె, ఉద్యోగి ఆరోగ్య బీమా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన గ్రూప్ బీమా, ప్రయాణ చార్జీలు తదితర వివరాలు ఉంటాయి. ఉద్యోగంలో చేరే ముందు ఒక ఫోటో, ఆధార్ కార్డు,18 సంవత్సరాల సర్వీసు అనంతరం మరో ఫోటో, సర్వీసు నుంచి విరమణ పొందే ఒక సంవత్సరం ముందు మరో ఫోటోను ఇవ్వాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ అందజేస్తారు. -
మోడల్ స్కూల్ టీచర్లకు సర్వీస్ రూల్స్
పీఆర్సీ ఫైలుపై సంతకం చేసిన సీఎం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూల్ టీచర్లకు సర్వీస్ రూల్స్ రూపొం దించాలని సీఎం కేసీఆర్ సూచించారు. దీంతో పాటు టీచర్లకు, సిబ్బందికి పీఆర్సీ వర్తింపజేసే ఫైలుపై సంతకం చేశారు. ఫలితంగా ఇప్పటివరకు త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడిన మోడల్ స్కూల్ టీచర్లకు ఊరట లభించనుంది. కేంద్రం చేతులెత్తేసిన తర్వాత మోడల్ స్కూల్ సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంలా మారిన విషయం తెలిసిందే. పదో పే రివిజన్ కమిషన్ అమల్లో భాగంగా రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. 2014 జూన్ నుంచి ఇది అమలు చేసింది. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న పీజీటీలు, టీజీటీలు, ప్రిన్సిపాల్స్‌కు మాత్రం ఇది వర్తించలేదు. మరోవైపు కేంద్రం మోడల్ స్కూళ్ల నిర్వహణ నుంచి వైదొలగడంతో చిక్కులు తలెత్తాయి. దీంతో ఈ సిబ్బందిని ఏ కేటగిరీ ఉద్యోగులుగా పరిగణించాలి.. వాళ్ల సర్వీస్ రూల్స్ ఏమిటనే సందేహాలు తలెత్తాయి. ఈ క్రమంలో మిగిలిన ఉద్యోగులకు అమల్లోకి వచ్చిన పీఆర్సీ ఫిట్మెంట్ వర్తింపజేసే అంశం పెండింగ్‌లో పడింది. తెలంగాణలోని 182 మోడల్ స్కూళ్లలో 3,368 మంది ఉద్యోగులున్నారు. సీఎం సంతకంతో వీరందరికీ ఊరట లభించింది. -
పురపాలనలో సొంత ముద్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఉద్యోగులందరికీ ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఉద్యోగులకు వేర్వేరు సర్వీసు రూల్స్ ఉండడంతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల మధ్య ఉద్యోగుల పరస్పర బదిలీలకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఉద్యోగులందరినీ ఏకీకృత సర్వీసు రూల్స్ పరిధిలోకి తీసుకురావాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. పురపాలన, పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధ్యయనం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం గురువారం ఇక్కడ మూడోసారి సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే ఆంగ్లేయుల కాలం నాటి ఏపీ మున్సిపల్, టౌన్ ప్లానింగ్ చట్టాలకు బూజు దులిపి తాజా అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ముద్రతో కొత్త చట్టాలను రూపొందించాలని నిర్ణయించింది. పాత నిబంధనలను సరళీకరించడం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించేలా కొత్త చట్టాలు ఉండాలని ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ సమావేశంలో మంత్రులు జోగు రామన్న, పట్నం మహేందర్ రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు పాపారావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి గోపాల్, శాఖ డెరైక్టర్ జనార్దన్‌రెడ్డితోపాటు పలు నగరాలు, పట్టణాల మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు పాల్గొన్నారు. పురపాలన, పట్టణాభివృద్ధికి సంబంధించి అమలు చేయాల్సిన స్వల్ప కాలిక ప్రణాళికలపై గత సమావేశంలో నిర్ణయం తీసుకోగా తాజా సమావేశంలో పలు మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలు, సిఫారసులపై రెండు మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు.. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 25 నగర పంచాయతీల్లో అవసరమైన 306 పోస్టులకుగానూ రానున్న 3నెలల్లో కనీసం 100 పోస్టుల భర్తీ. ఆధునిక హంగులతో శాకాహార, మాంసాహార మార్కెట్లు, పార్కులు, శ్మశానవాటికల అభివృద్ధి. ఒకే రీతిలో డిజైన్లు. ప్రతి పట్టణంలో రెండు మార్కెట్ల ఏర్పాటు జాతీయ పట్టణ జీవనోపాధి పథకం కింద కేంద్రం లక్ష జనాభా ఉన్న పట్టణాలకే నిధులిస్తున్న నేపథ్యంలో మిగిలిన పట్టణాల్లో ‘మెప్మా’ కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించాలి. ఉపగ్రహ సమాచార వ్యవస్థ (జీఐఎస్) సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నగరాలు, పట్టణాల్లో ఆస్తి పన్నుల గణన. మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాలకు హైదరాబాద్ తరహాలో ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం. మున్సిపల్ పనుల్లో నాణ్యత పరిశీలనకు ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగంలో క్వాలిటీ కంట్రోల్ విభాగం ఏర్పాటు. లే అవుట్లు, భవన నిర్మాణ నియమావళి ఏకీకృతమే లే అవుట్లు, భవన నిర్మాణాల అనుమతుల విషయంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఒకే తరహా నిబంధనలు పాటించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఇందు కోసం ల్యాండ్ డెవలప్మెంట్ కోడ్, కామన్ బిల్డింగ్ కోడ్లను రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు నిర్ణీత గడువుతో మళ్లీ ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని, దీన్ని వినియోగించుకోని అక్రమ లే అవు ట్లలో భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదని పేర్కొంది. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు మళ్లీ బీపీఎస్‌ను అమలు చేసేందుకు న్యాయ నిపుణుల సలహాను బట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది. -
‘ఏకీకృతం’పై రెండు ఫైళ్లు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌పై కసరత్తు ఓ కొలిక్కి వస్తోంది. దీనిపై రెండు రకాల ఫైళ్లను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. పంచాయతీరాజ్ టీచర్లు(జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు స్కూళ్ల ఉపాధ్యాయులు), ఎంఈవో పోస్టులను లోకల్ కేడర్(రాష్ట్రపతి ఉత్తర్వుల్లో)గా గుర్తింపునకు వీలుగా రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు ఒక ఫైలును రూపొందిస్తుండగా.. ఉపాధ్యాయుల కేడర్, పదోన్నతుల నిబంధనలు, మార్గదర్శకాలకు సంబంధించి మరో ఫైలును సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే వీటిని ప్రభుత్వానికి పంపించాలని భావిస్తున్నారు. ఈ తరువాత ప్రభుత్వ స్థాయిలో అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోనున్నారు. రాష్ట్రపతి ఆమోదానికి వీటిని పంపించాలా? వద్దా? కొత్త రాష్ట్రం అయినందున కొత్తగా సర్వీసు రూల్స్ రూపొందించుకుంటున్నందున ఆ అవసరముంటుందా? లేదా? అనే అంశాలపై అభిప్రాయం తీసుకొని ముందుకు సాగనున్నారు. అయితే, పంచాయతీరాజ్ టీచర్లు, ఎంఈవో పోస్టులను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో(371డీ) లోకల్ కేడర్‌గా గుర్తింపు తీసుకు వస్తేనే భవిష్యత్తులో న్యాయ పరమైన సమస్యలు తలెత్తబోవనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రకాల ఫైళ్లను రూపొందించే పనిలో పడ్డారు. గొడవంతా వాటి కోసమే.. ప్రస్తుతం ప్రభుత్వ టీచర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, డిప్యూటీ డీఈవో పోస్టులను లోకల్ కేడర్‌గా గుర్తిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పొందుపరిచారు. అందులో పంచాయతీరాజ్ టీచర్లు, ఎంఈవోను లోకల్ కేడర్‌గా పేర్కొనలేదు. అయితే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా ఉన్న పోస్టులను మండల విద్యాధికారి(ఎంఈవో) పోస్టుగా మార్పు చే సినందున.. ఎంఈవో పోస్టులతోపాటు లోకల్ కేడర్‌గా గుర్తింపు ఉన్న డిప్యూటీ డీఈవో పోస్టులు తమవేనని ప్రభుత్వ ఉపాధ్యాయులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతోంది. అటు అత్యధిక సంఖ్యలో ఉన్న పంచాయతీరాజ్ టీచర్లు తమకూ లోకల్ కేడర్‌గా గుర్తింపు వచ్చేలా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ఎంఈవో, డిప్యూటీ డీఈవో పోస్టుల్లో పదోన్నతులకు తమకు అర్హత లభిస్తుందని అంటున్నారు. దీనిపై సుప్రీంలో ఉన్న కేసు తేలకపోవడంతో తొమ్మిదేళ్లుగా ఈ పోస్టుల భర్తీ ఆగిపోయింది. క్షేత్ర స్థాయిలో పాఠశాలల పర్యవేక్షణ దెబ్బతింది. అందుకే ప్రస్తుతం కొత్త రాష్ట్రం ఏర్పడటంతోపాటు రూల్స్‌లో మార్పులు చేసుకునే అవకాశం వచ్చినందున.. పైగా సుప్రీంకోర్టులోని కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినదే అవుతుందనే భావనతో ఏకీకృత సర్వీసు రూల్స్ తెచ్చేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు రూపొందించే రూల్స్‌తో ఓవైపు రేషనలైజేషన్ త రువాత బదిలీలకు చర్యలు చేపట్టాలని.. మరోవైపు లోకల్ గుర్తింపు ఫైలును రాష్ట్రపతికి పంపించి సాధ్యమైనంత త్వరగా ఆమోదం పొందాలని విద్యాశాఖ యోచిస్తోంది. -
ఏకీకృత సర్వీసు రూల్స్‌పై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ త్వరలో ఖరారు కానున్నాయి. దీనిపై విద్యాశాఖ నియమించిన అధికారుల కమిటీ మూడు రోజులుగా సమావేశమై చర్చిస్తోంది. శుక్రవారం ఏకీకృత సర్వీసు రూల్స్‌లో ఏయే అంశాలుండాలన్న విషయమై చాలాసేపు చర్చించింది. మున్ముందు న్యాయపర సమస్యలు రాకుం డా ఉండాలంటే పంచాయతీరాజ్ టీచర్ల (మండల పరిషత్, జిల్లా పరిషత్) కేడర్‌ను స్టేట్ లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేయడమే ప్రధానమన్న అంశంపై చర్చించారు. ప్రతిపాదనలు పూర్తయిన వెంటనే నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు.