సర్వీస్ రూల్స్‌తో పదోన్నతులు కల్పించాలి
Published Mon, Jul 25 2016 12:08 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
విద్యారణ్యపురి : విద్యాశాఖలో సర్వీస్‌రూల్స్ నియమాలు రూపొందించి పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యచరణ సమితి (టీటీజేఏసీ) చైర్మన్ పింగిళి శ్రీపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు.
టీటీజేఏసీ ఏర్పాటు సందర్భంగా ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. విద్యాహక్కు చట్టాన్ని సవరించాలని ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో పలు తీర్మాణాలు కూడా చేశారు. పాఠశాలల్లో మితిమీరిన రాజకీయజోక్యాన్ని తగ్గించాలని, ఉపాధ్యాయ, ఉద్యోగులకు పీఆర్‌సీ బకాయిలను చెల్లించాలని, షరుతుల్లేని నగదు రహిత హెల్త్‌కార్డులను పూర్తిస్థాయిలో అమలుచేయాలని డిమాండ్ చేస్తూ తీర్మాణించారు. ఈ సమావేశంలో పీఆర్‌టీయూ, ఎస్‌టీయూ, టీపీయూఎస్, టీఎస్‌జీహెచ్‌ఎంఏ, టీఎన్‌యూఎస్, ఎస్సీఎస్టీ యూ ఎస్‌టీఎస్, ఎస్‌టీఎఫ్, పెటా, టీఆర్‌టీయూ, టీఎస్‌సీఎస్‌టీ యూఎస్, టీబీసీటీయూ బాధ్యులు పాల్గొన్నారు.
టీటీజేఏసీ జిల్లా చైర్మన్‌గా శ్రీపాల్‌రెడ్డి
జిల్లాలోని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యచరణ సమితి (టీటీజేఏసీ)గా ఏర్పడ్డాయి. ఈమేరకు ఆదివారం హన్మకొండలోని పీఆర్‌టీయూ కార్యాలయంలో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని టీటీజేఏసీ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. టీటీజేఏసీ జిల్లా చైర్మన్‌గా పింగిళి శ్రీపాల్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌గా ఎ.సదయ్య, డిప్యూటీ చైర్మన్‌గా దేవిరెడ్డి మాలకొండారెడ్డి, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా డి.విష్ణుమూర్తి, కోచైర్మన్‌లుగా కె.శ్రీనివాస్‌రెడ్డి, ఎల్.సంజీవరెడ్డి, సెక్రటరీలుగా ఎస్.చంద్రమౌళి, ఆర్.భానుప్రసాద్‌రెడ్డి, కోశాధికారిగా ప్రవీణ్‌కుమార్, కార్యవర్గసభ్యులుగా డి.రాజమౌళి, సీహెచ్.రమేష్, జి.కోటేశ్వర్ ఎన్నికయ్యారు.
Advertisement
Advertisement