TTJAC
-
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి: టీటీజేఏసీ
సాక్షి, హైదరాబాద్ : దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీటీజేఏసీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్‌లోని పీఆర్టీయూ భవన్లో టీటీజేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఏకీకృత సర్వీసు నిబంధనలను వెంటనే రూపొందించి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మండల విద్యాధికారి, ఉప విద్యాధికారి, డైట్ లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తీర్మానించారు. టీచర్ పోస్టుల్లో కొత్తగా నియమితులైన వారిని వెంటనే నియమించి, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపడుతూ, రేషనలైజేషన్ చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. జూన్ నెలాఖరు నాటికి విద్యార్థుల సంఖ్యను పరిగణనలో తీసుకొని రేషనలైజేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి , మాజీ ఎమ్మెల్సీ రవీందర్, టీటీజేఏసీ సెక్రటరీ జనరల్ విష్ణువర్ధన్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెళ్లి కమలాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈ సమస్యలన్నింటిపై ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి జి. జగదీష్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. టీటీజేఏసీ చైర్మన్‌గా పింగళి శ్రీపాల్‌రెడ్డి టీటీజేఏసీ చైర్మన్‌గా పింగళి శ్రీపాల్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ఆయన ఇటీవలే పీఆర్టీయూ–టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
జనగామ అర్బన్ : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, కామన్ సర్వీస్ రూల్స్ రూపొందించాలని టీటీజేఏసీ చైర్మన్ తిరునగరి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం టీటీజేఏసీ నూతన కార్యవర్గాన్ని వివిధ భాగస్వామ్య సం ఘాలు, పీఆర్టీయూ టీఎస్ ప్రధాన కార్యదర్శి కొల్ల మహిపాల్‌రెడ్డి సమన్వయంతో స్ధానిక పీఆర్టీయూ జిల్లా కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలన్నారు. పీఆర్సీ ఏర్పాటు కోరుతూ పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్‌ను బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. అనంతరం టీటీజేఏసీ జిల్లా చైర్మన్‌గా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తిరునగరి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్‌గా టీపీయూఎస్ అధ్యక్షుడు ముసిని వేణుగోపాల్, డిప్యూటీ చైర్మన్‌గా టీఎస్హెచ్ఎంఏ అధ్యక్షుడు గాండె మల్లికార్జున్, కోచైర్మన్‌గా డీజీటీయూ ప్రధాన కార్యదర్శి జె.రత్నాకర్, కార్యదర్శిగా టీఎస్టీఎస్టీయూఎస్ అధ్యక్షుడు సలాడి సత్తయ్యను ఎన్నుకున్నారు. సమావేశంలో రమేష్, అర్జున్‌కుమార్, విద్యాసాగర్, సోమరాజు, విజ య్‌కుమార్, ప్రభాకర్, పంచాక్షరి, రత్నాకర్, మనోజ్‌కుమార్, శ్రీనివాస్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
సర్వీస్ రూల్స్‌తో పదోన్నతులు కల్పించాలి
విద్యారణ్యపురి : విద్యాశాఖలో సర్వీస్‌రూల్స్ నియమాలు రూపొందించి పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యచరణ సమితి (టీటీజేఏసీ) చైర్మన్ పింగిళి శ్రీపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీటీజేఏసీ ఏర్పాటు సందర్భంగా ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. విద్యాహక్కు చట్టాన్ని సవరించాలని ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో పలు తీర్మాణాలు కూడా చేశారు. పాఠశాలల్లో మితిమీరిన రాజకీయజోక్యాన్ని తగ్గించాలని, ఉపాధ్యాయ, ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలను చెల్లించాలని, షరుతుల్లేని నగదు రహిత హెల్త్‌కార్డులను పూర్తిస్థాయిలో అమలుచేయాలని డిమాండ్ చేస్తూ తీర్మాణించారు. ఈ సమావేశంలో పీఆర్టీయూ, ఎస్టీయూ, టీపీయూఎస్, టీఎస్‌జీహెచ్‌ఎంఏ, టీఎన్‌యూఎస్, ఎస్సీఎస్టీ యూ ఎస్టీఎస్, ఎస్టీఎఫ్, పెటా, టీఆర్టీయూ, టీఎస్‌సీఎస్‌టీ యూఎస్, టీబీసీటీయూ బాధ్యులు పాల్గొన్నారు. టీటీజేఏసీ జిల్లా చైర్మన్‌గా శ్రీపాల్‌రెడ్డి జిల్లాలోని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యచరణ సమితి (టీటీజేఏసీ)గా ఏర్పడ్డాయి. ఈమేరకు ఆదివారం హన్మకొండలోని పీఆర్టీయూ కార్యాలయంలో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని టీటీజేఏసీ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. టీటీజేఏసీ జిల్లా చైర్మన్‌గా పింగిళి శ్రీపాల్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌గా ఎ.సదయ్య, డిప్యూటీ చైర్మన్‌గా దేవిరెడ్డి మాలకొండారెడ్డి, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా డి.విష్ణుమూర్తి, కోచైర్మన్లుగా కె.శ్రీనివాస్‌రెడ్డి, ఎల్.సంజీవరెడ్డి, సెక్రటరీలుగా ఎస్.చంద్రమౌళి, ఆర్.భానుప్రసాద్‌రెడ్డి, కోశాధికారిగా ప్రవీణ్‌కుమార్, కార్యవర్గసభ్యులుగా డి.రాజమౌళి, సీహెచ్.రమేష్, జి.కోటేశ్వర్ ఎన్నికయ్యారు. -
ఈ జాప్యం ఇంకెన్నాళ్లు?
పీఆర్సీపై కమిటీ ఎందుకు సీఎం నిర్ణయం తీసుకోవాలి: టీచర్ల జేఏసీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై ఉపాధ్యాయులు ఆగ్రహంగా ఉన్నారు. హామీ లు ఆచరణకు నోచుకోవడంలేదని విమర్శిస్తున్నారు. హెల్త్‌కార్డులు, పీఆర్సీ అమలులో తా త్సారంపై మండిపడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల హెల్త్ కార్డుల సమస్యల పరి ష్కారానికి, పీఆర్సీ అమలులో జాప్యాన్ని నివారించేందుకు ఇంకెన్నాళ్లు పడుతుందని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ప్రశ్నిం చింది. బుధవారం హైదరాబాద్‌లోని పీఆర్టీయూ భవన్లో జరిగిన టీటీజేఏసీ సమావేశంలో వివిధ అంశాలపై ఆయా సంఘాల ప్రతినిధులు చర్చించి తీర్మానాలు ఆమోదించా రు. హెల్త్ కార్డుల ఉత్తర్వులు జారీ చేసి నాలుగు నెలలవుతున్నా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టలేకపోయిందన్నారు. 2013 జులై ఒకటో తేదీ నుం చే అమలు చేయాల్సిన పీఆర్సీ విషయంలో కాలయాపన ఎందుకని నిలదీశారు. అమలుకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. టీటీజేఏసీ చైర్మన్ పి.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరి గిన ఈ సమావేశంలో సెక్రటరీ జనరల్ భుజం గరావు, కన్వీనర్ మణిపాల్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవీ తీర్మానాలు.. తెలంగాణలో మొదటి పీఆర్సీ ఉద్యోగ, టీచర్ల, పెన్షనర్ల స్థితిగతులను మెరుగుపరిచేలా ఉండాలి. ఫిట్మెంట్ 69 శాతం ఇస్తూ 2013 జులై 1 నుంచే నగదు రూపంలో వర్తింపజేయాలి. వీటిపై సీఎం కేసీఆర్ స్వయంగా సంఘాలతో మాట్లాడి మాట నిలబెట్టుకోవాలి. కమిటీల పేరు తో కాలయాపన సరికాదు. ఈ పీఆర్సీ తో 1958 నాటి 30 శాతం వేతన వ్యత్యాస నష్టాన్ని భర్తీ చేయాలి. 9వ పీఆర్సీలో సీనియర్ టీచర్లకు మూడేళ్ల సర్వీసుకు ఒకటి చొప్పున ఇంక్రిమెంటు ఇవ్వాలి. కనీస మూలవేతనం రూ. 15 వేలకు, గ్రాట్యుటీ రూ. 15 లక్షలకు పెంచాలి.