- పీఆర్‌సీపై కమిటీ ఎందుకు
- సీఎం నిర్ణయం తీసుకోవాలి: టీచర్ల జేఏసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై ఉపాధ్యాయులు ఆగ్రహంగా ఉన్నారు. హామీ లు ఆచరణకు నోచుకోవడంలేదని విమర్శిస్తున్నారు. హెల్త్‌కార్డులు, పీఆర్సీ అమలులో తా త్సారంపై మండిపడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల హెల్త్ కార్డుల సమస్యల పరి ష్కారానికి, పీఆర్‌సీ అమలులో జాప్యాన్ని నివారించేందుకు ఇంకెన్నాళ్లు పడుతుందని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ప్రశ్నిం చింది.
బుధవారం హైదరాబాద్‌లోని పీఆర్‌టీయూ భవన్‌లో జరిగిన టీటీజేఏసీ సమావేశంలో వివిధ అంశాలపై ఆయా సంఘాల ప్రతినిధులు చర్చించి తీర్మానాలు ఆమోదించా రు. హెల్త్ కార్డుల ఉత్తర్వులు జారీ చేసి నాలుగు నెలలవుతున్నా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టలేకపోయిందన్నారు.
2013 జులై ఒకటో తేదీ నుం చే అమలు చేయాల్సిన పీఆర్‌సీ విషయంలో కాలయాపన ఎందుకని నిలదీశారు. అమలుకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. టీటీజేఏసీ చైర్మన్ పి.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరి గిన ఈ సమావేశంలో సెక్రటరీ జనరల్ భుజం గరావు, కన్వీనర్ మణిపాల్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ తీర్మానాలు..
తెలంగాణలో మొదటి పీఆర్‌సీ ఉద్యోగ, టీచర్ల, పెన్షనర్ల స్థితిగతులను మెరుగుపరిచేలా ఉండాలి.
ఫిట్‌మెంట్ 69 శాతం ఇస్తూ 2013 జులై 1 నుంచే నగదు రూపంలో వర్తింపజేయాలి.
వీటిపై సీఎం కేసీఆర్ స్వయంగా సంఘాలతో మాట్లాడి మాట నిలబెట్టుకోవాలి.
కమిటీల పేరు తో కాలయాపన సరికాదు.
ఈ పీఆర్‌సీ తో 1958 నాటి 30 శాతం వేతన వ్యత్యాస నష్టాన్ని భర్తీ చేయాలి.
9వ పీఆర్‌సీలో సీనియర్ టీచర్లకు మూడేళ్ల సర్వీసుకు ఒకటి చొప్పున ఇంక్రిమెంటు ఇవ్వాలి.
కనీస మూలవేతనం రూ. 15 వేలకు, గ్రాట్యుటీ రూ. 15 లక్షలకు పెంచాలి.