తెలంగాణలోని ప్రతి కుటుంబానికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు
దసరాలోగా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలి
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ పేద, ధనిక అనే తేడా లేకుండా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు అందిస్తామని రెవెన్యూ, గృహని ర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబానికీ ఆరోగ్య ప్రొఫైల్ రూపొందించి యునిక్ నంబర్‌తో స్మార్ట్ కార్డ్ ఇవ్వడమే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉద్దేశమని చెప్పారు. 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రతి నియోజకవర్గం నుంచి రెండేసి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న కుటుంబాల వివరాల నమోదులో పొరపాట్లకు తావివ్వరాదని.. ఈ విష యంలో కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పలు వురు ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం సచి వాలయం నుంచి మంత్రి పొంగులేటి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫ్యా మిలీ డిజిటల్ కార్డులతోపాటు పట్టణాభివృద్ధి సంస్థలు, ఎల్‌ఆర్‌ఎస్, డబుల్ బెడ్రూం ఇళ్లు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సమీక్షించారు.
యుద్ధప్రాతిపదికన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం..
భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారం కోసం లక్షలాది మంది ప్రజలు నాలుగేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారని, అందువల్ల యుద్ధప్రాతి పది కన ఈ దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్ట ర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఈ ప్రక్రియ ముందుకు సాగ ట్లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణా భివృద్ధి సంస్థల పరిధి పెంపుతోపాటు కొత్త యూడీఏల ఏర్పాటు ప్రతిపాదనలను తక్షణమే పంపాలన్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు కోసం కమిటీలు
గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్లను అరకొరగా నిర్మించారని మంత్రి పొంగులేటి విమర్శించారు. అయితే ఇప్పటికే పూర్తయిన ఇళ్ల కేటాయింపు కోసం లబ్ధిదారులను ఎంపిక చేసి దసరాలోగా అప్పగించాలని ఆదేశించారు. ఇందుకోసం జిల్లా ఇన్‌చార్జి మంత్రి చైర్మన్‌గా, జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా కొందరు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసినందున ప్రభుత్వ పాఠశాలలు, పీహెచ్‌సీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రాధాన్యత ఇచ్చి మరమ్మతులు చేపట్టాలన్నారు.
సన్న, దొడ్డు ధాన్యానికి వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 35 సన్న రకాల ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. ఈసారి ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 7,144 కేంద్రాలను ఏర్పాటు చేయాలని.. సన్న, దొడ్డు రకాల ధాన్యానికి వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయాల ని ఆదేశించారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వస్తుందన్న అంచనాతో ఏర్పాట్లు చేయా లని.. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు సమస్యలు తలెత్తకుండా కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment