health card
-
TG: డిజిటల్ హెల్త్ కార్డులపై సివిల్ సప్లై శాఖ క్లారిటీ
సాక్షి,హైదరాబాద్:డిజిటల్ హెల్త్ కార్డ్ దరఖాస్తులపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియా,పలు మాధ్యమాల్లో సర్య్కులేట్ అవుతున్న దరఖాస్తు అసలైనది కాదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు.ఈ మేరకు కమిషనర్ కార్యాలయం సోమవారం(అక్టోబర్7) ఒక ప్రకటన విడుదల చేసింది.ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డు డిజైన్ ఇప్పటివరకు ఫైనల్ కాలేదని స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో చెలామణి అవుతున్న దరఖాస్తులను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: ‘హైడ్రా’ మాదిరిగా ‘నిడ్రా’ -
పేద, ధనిక తేడా లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ పేద, ధనిక అనే తేడా లేకుండా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు అందిస్తామని రెవెన్యూ, గృహని ర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబానికీ ఆరోగ్య ప్రొఫైల్ రూపొందించి యునిక్ నంబర్‌తో స్మార్ట్ కార్డ్ ఇవ్వడమే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉద్దేశమని చెప్పారు. 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రతి నియోజకవర్గం నుంచి రెండేసి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న కుటుంబాల వివరాల నమోదులో పొరపాట్లకు తావివ్వరాదని.. ఈ విష యంలో కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పలు వురు ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం సచి వాలయం నుంచి మంత్రి పొంగులేటి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫ్యా మిలీ డిజిటల్ కార్డులతోపాటు పట్టణాభివృద్ధి సంస్థలు, ఎల్ఆర్ఎస్, డబుల్ బెడ్రూం ఇళ్లు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సమీక్షించారు.యుద్ధప్రాతిపదికన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం..భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారం కోసం లక్షలాది మంది ప్రజలు నాలుగేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారని, అందువల్ల యుద్ధప్రాతి పది కన ఈ దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్ట ర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఈ ప్రక్రియ ముందుకు సాగ ట్లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణా భివృద్ధి సంస్థల పరిధి పెంపుతోపాటు కొత్త యూడీఏల ఏర్పాటు ప్రతిపాదనలను తక్షణమే పంపాలన్నారు.డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు కోసం కమిటీలుగత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్లను అరకొరగా నిర్మించారని మంత్రి పొంగులేటి విమర్శించారు. అయితే ఇప్పటికే పూర్తయిన ఇళ్ల కేటాయింపు కోసం లబ్ధిదారులను ఎంపిక చేసి దసరాలోగా అప్పగించాలని ఆదేశించారు. ఇందుకోసం జిల్లా ఇన్చార్జి మంత్రి చైర్మన్‌గా, జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా కొందరు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసినందున ప్రభుత్వ పాఠశాలలు, పీహెచ్‌సీలు, అంగన్వాడీ కేంద్రాలకు ప్రాధాన్యత ఇచ్చి మరమ్మతులు చేపట్టాలన్నారు.సన్న, దొడ్డు ధాన్యానికి వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలుఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 35 సన్న రకాల ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. ఈసారి ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 7,144 కేంద్రాలను ఏర్పాటు చేయాలని.. సన్న, దొడ్డు రకాల ధాన్యానికి వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయాల ని ఆదేశించారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వస్తుందన్న అంచనాతో ఏర్పాట్లు చేయా లని.. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు సమస్యలు తలెత్తకుండా కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు. -
మళ్లీ ‘ప్రజాపాలన’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోమారు ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డులు జారీ చేయడమే ఎజెండాగా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాలని, తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఇక నుంచి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింకు ఉండదని, వేర్వేరుగా రెండు కార్డులు జారీ చేస్తామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17 నుంచి నిర్వహించే ప్రజాపాలనలో ఇదే ఎజెండాగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి అవసరమైన వివరాలు సేకరించాలని.. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణాల్లోని ప్రతి వార్డులో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డిజిటల్ హెల్త్ కార్డుల విషయంలో ఫ్రాన్స్‌లో ఉత్తమమైన విధానాన్ని అనుసరిస్తున్నారని ఇటీవల విదేశాల పర్యటనకు వెళ్లినప్పుడు తనను కలిసిన ప్రతినిధులు చెప్పారని.. అక్కడ అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇకపై రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యసేవలతోపాటు సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అందించే సాయానికి ఈ డిజిటల్ హెల్త్ కార్డే ప్రామాణికంగా ఉంటుందని చెప్పారు. సీజనల్ వ్యాధులపై ప్రత్యేక కార్యాచరణ రాష్ట్రంలో డెంగీ, చికెన్‌గున్యా, ఇతర వైరల్ జ్వరాల కేసులు పెరుగుతున్న అంశంపై సమావేశంలో సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలన కోసం ఫాగింగ్, రసాయనాల స్ప్రే వంటి కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలని, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని సూచించారు. పనిచేయని ఉద్యోగులు, ప్రజల ఆరోగ్యం పట్ల ఉదాసీనంగా వ్యవహరించే సిబ్బందిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కలి్పంచాలని సూచించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకోవాలని ఆదేశించారు. డెంగీ, చికెన్‌గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు సూచించారు. -
జీవితంలో ఎవరికైనా ఆ మూడే ముఖ్యం : విజయ్ దేవరకొండ
జీవితంలో ఎవరికైనా ఆరోగ్యం, ఆనందం, డబ్బు.. ఈ మూడే చాలా ముఖ్యమని అన్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. శుక్రవారం ఆయన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్వంలో నిర్వహించిన హెల్త్ కార్డ్, డైరీ, ఐడికార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల అందరికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చూడాలని తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ‘జర్నలిస్టుల హెల్త్ కార్డుల సెలబ్రేషన్లో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్ మొదటి నుంచీ జర్నలిస్టులు నాతోనే ఉన్నారు.నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు మెడికల్ బిల్లులు ఎక్కువ వస్తాయేమోనని భయపడి హెల్త్ ఇన్స్యూరెన్స్ లు తీసుకునేవాడిని. వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా తెలిసేది కాదు. కొన్నిసార్లు రెన్యువల్‌కి డబ్బులు ఉండేవి కాదు. అలా ఎన్నిటినో వదిలేశాను. ఇప్పుడు ఈ అసోసియేషన్ ద్వారా అందరూ యుటిలైజ్ చేసుకుంటున్నారని తెలిసి ఆనందంగా అనిపించింది’ అన్నారు. సినిమాల విషయానికొస్తే.. విజయ్ ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ అనే మూవీ చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. గీతగోవిందం లాంటి బ్లాస్ బస్టర్ తర్వాత విజయ్‌తో పరుశురామ్ తెరకెక్కిస్తున్న రెండో సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
సీఎం జన్మదినం సందర్భంగా ఆరోగ్య కార్డులు, బట్టలు పంపిణీ చేసిన మంత్రి
-
పట్టణంలో ప్రతీ బుధవారం హెల్త్ క్యాంపు ఏర్పాటు
-
డిజిటల్ హెల్త్ ఐడీ కార్డు డౌన్లోడ్ చేశారా..?
న్యూఢిల్లీ: దేశ పౌరుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం సెప్టెంబర్ 27న సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు వీలుగా ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్’ పేరుతో ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం.. ఈ కార్యక్రమం పైలట్ దశలో ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు. ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ కింద దేశంలోని పౌరులందరికీ హెల్త్ కార్డులతో పాటు హెల్త్ ఐడీ కూడా అందిస్తారు. దీని ఆధారంగా ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని ఆ కార్డులో పొందుపరుస్తారు. దీంతో ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లినా, లేదంటే చికిత్స రికార్డ్లను పోగొట్టుకున్నా.. చికిత్స అందించాల్సి వస్తే.. మెడిసిన్స్ తీసుకోవాల్సి వచ్చినా వెంటనే ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఎవరైనా ఏదైనా ఆసుపత్రికి వెళ్లినప్పుడు తమ హెల్త్ ఐడీ నమోదు చేయగానే స్వయం చాలకంగా ఆ రోగి పూర్తి ఆరోగ్య సమాచారం డాక్టర్లకు కనిపిస్తుంది. ఒకవేళ కొత్త పరీక్షలు చేయాల్సి వస్తే ఆ వివరాలను ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. సంబంధిత సమాచారం ఈ వెబ్ సైట్లో భద్రంగా ఉంటుంది. ఇక నుంచి ఆస్పత్రికి వెళ్లి హెల్త్ ఐడి చెబితే సరిపోతుంది.(చదవండి: కార్లకు డిజిటల్ ‘కీ’ స్ తయారుచేయనున్న శాంసంగ్) డీజీటల్ హెల్త్ ఐడీ కార్డ్ 2021 ఆన్లైన్ దరఖాస్తు విధానం: ఎన్డిహెచ్ఎమ్ హెల్త్ ఐడీ కార్డ్ కోసం(https://healthid.ndhm.gov.in/register) పోర్టల్ ఓపెన్ చేయండి రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసి మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి. ఇప్పుడు, మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. మొబైల్ నెంబరు, ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు లింక్ మీద క్లిక్ చేసి వివరాలను నమోదు చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. హెల్త్ ఐడీ కార్డ్ సృష్టించబడిన తర్వాత వ్యక్తి యూజర్ నేమ్ నమోదు చేయండి. అలాగే, కొన్ని వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి. ఆ తర్వాత, మీరు డిజిటల్ హెల్త్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
అరచేతిలో... ఆరోగ్యం?!
ఒకరకంగా ఇది విప్లవాత్మక ఆలోచన. అసంఖ్యాక ప్రజానీకానికి అవసరమైన ఆరోగ్యదాయక ఆలోచన. పేద, మధ్యతరగతి వర్గాలకు వైద్యచికిత్సనూ, ఆరోగ్య సంరక్షణనూ అందుబాటులోకి తేవడా నికి సంపూర్ణంగా సాయపడితే... స్వాగతించదగ్గ ఆలోచన. దేశంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ గుర్తింపు కార్డు ఇచ్చే భారీ దేశవ్యాప్త ప్రయత్నానికి మోదీ సర్కారు సోమవారం శ్రీకారం చుట్టింది. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవంలో ఎర్రకోట సాక్షిగా ప్రధాని ప్రకటించిన ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’లో ఇది భాగం. అప్పటి నుంచి 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ బృహత్ కార్యక్రమం ఇప్పుడిక దేశవ్యాప్తం కానుంది. అంటే, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డుల జాబితాలో మరో దేశవ్యాప్త గుర్తింపు కార్డు చేరనుంది. సంక్షేమం కోసమే అయినప్పటికీ, ప్రజలందరి సమాచారాన్నీ సర్కారు సేకరించి, డిజిటల్ మ్యాపింగ్ చేసేందుకు కొత్త వీలు చిక్కింది. సమగ్ర డిజిటల్ ఆరోగ్యవ్యవస్థలో వ్యక్తులకు ఆరోగ్య ఐడీ కార్డులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల జాబితా, అలాగే ఆరోగ్య వసతుల జాబితా కూడా సిద్ధం చేయాలన్నది కేంద్ర ఆలోచన. ఈ కొత్త ఆరోగ్య గుర్తింపు కార్డు కింద ఆయా వ్యక్తుల ఆరోగ్య రికార్డులన్నీ డిజిటల్‌గా అందుబాటులో ఉంటాయి. జన్‌ధన్ ఖాతా, ఆధార్, మొబైల్ ఫోన్ (సంక్షిప్తంగా జామ్) – ఈ మూడింటì అనుసంధానం, అలాగే సర్కారీ ఇతర డిజిటల్ ప్రయత్నాల వల్ల ఈ ‘జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్’ (ఎన్డీహెచ్ఎం)కు పునాదిగా ఆన్లైన్ వేదిక ఇట్టే దొరుకుతుందని సర్కారు భావిస్తోంది. నగదు చెల్లింపుల్లో విప్లవం తెచ్చిన ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్’ (యూపీఐ) లానే, ఇక్కడ ‘యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేజ్’ (యూహెచ్ఐ) వాడతారట. డాక్టర్లు, ఆస్పత్రులు, ల్యాబ్‌లు, మందుల దుకాణాలు రోగుల గత రిపోర్ట్‌లను డిజిటల్‌గా నమోదు చేస్తాయి. దాంతో, రోగి ఐడీ కార్డుతో ఆ వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇచ్చిపుచ్చుకోవచ్చు. ఆ వ్యక్తి ఆరోగ్య చరిత్ర, తీసుకున్న చికిత్స, అందుబాటులో ఉన్న సేవలు దేశవ్యాప్తంగా చిటికెలో తెలుస్తాయి. అందుకే, ఆరోగ్యరంగంలో ఉన్నవారందరికీ పని సులువయ్యే ఈ విధానం ఓ సరికొత్త విప్లవం. ప్రతి పౌరుడికీ 14 అంకెల డిజిటల్ ఆరోగ్య ఐడీ నంబర్ ఇస్తారు. అదే ఆ వ్యక్తి ఆరోగ్య ఖాతా నంబర్. ఈ ఆరోగ్య ఖాతాలో డిజిటల్‌గా అతని ఆరోగ్య చరిత్రంతా నమోదై ఉంటుంది. పాత రికార్డుల మోతబరువు తగ్గుతుంది. రోగి కొత్త ప్రాంతానికి, కొత్త డాక్టర్ వద్దకు వెళ్ళినా సరే సమా చారమంతా డిజిటల్‌గా మీట నొక్కితే అందుబాటులో ఉంటుంది. ఇలా ఈ డిజిటల్ హెల్త్ మిషన్‌లో సేకరించే వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని గోప్యంగా, భద్రంగా ఉంచుతామని ప్రభుత్వ హామీ. ఆరోగ్యరంగంలో సాంకేతికవినియోగం ఇటీవల విస్తృతమైంది. కరోనా వేళ టెలీ మెడిసిన్ వసతి విస్తరించింది. ‘ఇ–సంజీవని’తో 125 కోట్ల రిమోట్ కన్సల్టేషన్లు జరిగాయని కేంద్రం లెక్క. వాటిలో ఏపీదే అగ్రస్థానం. ఇక, ‘ఆరోగ్యసేతు’ యాప్ లాంటివి కోవిడ్‌కు అడ్డుకట్టలో సహకరించడమూ తెలిసిందే. ఇప్పుడీ డిజిటల్ హెల్త్‌కార్డ్ మరో ముందంజ. నిజానికి, ఇది మరీ కొత్తదేమీ కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత జగన్మోహనరెడ్డి సర్కారు ఈ పని చాలాకాలంగా చేస్తోంది. ‘ఆరోగ్యశ్రీ’ పథకంతో లబ్ధి పొందుతున్న దాదాపు కోటిన్నర కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే క్యూఆర్ కోడ్ ఉన్న కార్డులిచ్చింది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరేసి డాక్టర్లను పెట్టింది. రాష్ట్రంలో మొబైల్ మెడికల్యూనిట్ ‘104’ సర్వీసుతో 700 దాకా వాహనాలు రోజూ కనీసం ఓ గ్రామానికెళ్ళి, అక్కడి ప్రజల ఆరోగ్యస్థితులు విచారించి, ఆ సమాచారం రికార్డు చేసే బృహత్ యజ్ఞం చేపట్టింది. ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డున్నవారు ఇప్పటికే రాష్ట్రంలో ఏ ప్రభుత్వ, నెట్వర్క్ ఆసుపత్రికి వెళ్ళినా వారి ఆరోగ్యచరిత్ర మొత్తం వైద్యులకు అందుబాటులో ఉంటోంది. తాజా కేంద్ర ప్రయత్నంతో డేటా దేశమంతటా ఎక్కడైనా అందుబాటులోకి వస్తుందన్న మాట. వ్యక్తుల సమాచారం, మొబైల్ ఫోన్, ఆధార్ నంబర్ లాంటి వివరాల ఆధారంగా ఉచితంగా ఈ కొత్త హెల్త్ ఐడీ కార్డ్ సృష్టి జరగనుంది. ఆరోగ్య నిపుణుల చిట్టా (హెచ్‌పీఆర్), ఆరోగ్య వసతుల చిట్టాల (హెచ్‌ఎఫ్‌ఆర్) లాంటి యాప్‌లు పెడతారు. ఇలా దేశపౌరులందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, విశ్లేషించడం వల్ల రాష్ట్రాలలో ఆరోగ్య పథకాలను మెరుగ్గా ప్లాన్ చేయవచ్చు. దేనికి తగినట్టు దానికి నిధులు కేటాయించవచ్చు. వృథా ఖర్చు అరికట్టవచ్చనేది ప్రభుత్వ వాదన. అరచేతిలో ఆరోగ్యం లాంటి ఈ మాటలు వినడానికి బాగున్నాయి. కానీ, డిజిటల్ అక్షరాస్యత మాట దేవుడెరుగు, మామూలు అక్షరాస్యతే అందరికీ లేని దేశం మనది. పాశ్చాత్య ప్రపంచానికి భిన్నంగా ఆర్థికంగానే కాదు అంతర్జాల వసతుల్లోనూ భారీ అంతరాలున్న చోట ఈ భగీరథ యత్నం ఏ మేరకు, ఎప్పటికి ఆచరణ సాధ్యమో! దేశంలోని 135 కోట్ల మందికీ హెల్త్ కార్డులంటే సంకల్పశుద్ధి అవసరం. ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపుకార్డన్న దశాబ్దకాల ఆధార్ ఆలోచనే నేటికీ సంపూర్ణ సాకారం కాలేదు. ఆధార్ నమోదులో, డేటా అక్రమ వాడకంలో ఎన్నో స్కామ్‌లు బయటపడ్డాయి. ఈ కొత్త కార్డుకైనా ఆ లోపాలు లేకుండా చూడాలి. అది సర్కార్‌కు సవాలే. అన్నిటికీ మించి ఎప్పటికప్పుడు వ్యక్తుల ఆరోగ్య రికార్డులను అప్డేట్ చేసే సత్తా మన ఆస్పత్రులకు ఏ మేరకు ఉంది? చిత్తశుద్ధితో, లోపరహితంగా ఎప్పటికప్పుడు ఆ పని చేయించడం కష్టసాధ్యం. ఆ కష్టాలెలా ఉన్నా, ఈ కార్డులతో పాటు ప్రాథమిక ఆరోగ్య వసతులు, రోగులు– వైద్యులు – పడకల నిష్పత్తిపై కేంద్ర సర్కారు వారి దృష్టి పడితే మహద్భాగ్యం. -
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ షురూ
-
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ షురూ
న్యూఢిల్లీ: దేశ పౌరుల ఆరోగ్య సంరక్షణపై కేంద్ర ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించనుంది. ఇందులోభాగంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’కు శ్రీకారం చుట్టింది. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక చర్యలకు నడుం బిగించామని డిజిటల్ మిషన్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. డిజిటల్ మిషన్‌లో భాగంగా పౌరులకు డిజిటల్ హెల్త్ ఐడీ కార్డును జారీచేయనున్నారు. గతంలో పోల్చితే సాంకేతికతను ఆరోగ్యరంగానికి మరింతగా జోడించడంతో సత్వర వైద్యసేవలు పెరిగాయని మోదీ అన్నారు. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన(ఏబీపీఎంజేఏవై) మూడో వార్షికోత్సవం రోజునే ఈ కార్యక్రమం మొదలవడం విశేషం. పీఎంజేఏవై కింద పేదలకు రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. పీఎంజేఏవై కింద 2 కోట్ల మంది ఇప్పటికే ఉచితంగా పలు వ్యాధులకు చికిత్స తీసుకున్నారని మోదీ చెప్పారు. డిజిటల్ హెల్త్ ఐడీ కార్డుతో ప్రయోజనాలు.. వ్యక్తి ఆధార్ కార్డు లేదా మొబైల్ నంబర్‌ను ఉపయోగించి 14 అంకెలు ఉండే డిజిటల్ హెల్త్ ఐడెంటిఫికేషన్(ఐడీ) నంబర్ కేటాయిస్తారు. ప్రతీ వ్యక్తి ఆరోగ్య వివరాలు, గత మెడికల్ రిపోర్టులు, కుటుంబ వివరాలు, ఉండే ప్రాంతం, చిరునామా తదితరాలను తీసుకుంటారు. కార్డులో పౌరుల ఆరోగ్య చరిత్ర నిక్షిప్తమై ఉంటుంది. వ్యక్తికి హఠాత్తుగా ఆరోగ్య సమస్య ఎదురైతే తోడుగా ఆస్పత్రికి హెల్త్ కార్డు తీసుకెళ్తే హెల్త్ హిస్టరీ సాయంతో సరైన చికిత్స సకాలంలో పొందే అవకాశాలు బాగా మెరుగుపడతాయి. దీంతో వేరే ప్రాంతాల, వేరే రాష్ట్రాల పౌరులకూ చికిత్స చేయడం అక్కడి వైద్యులకు సులభం అవుతుంది. పేద, మధ్య తరగతి వర్గాలకు సైతం ఈ సౌకర్యం ఎంతో ప్రయోజనకరం. ఖాతా వివరాలను ఒక మొబైల్ అప్లికేషన్‌తో అనుసంధానిస్తారు. హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ, హెల్త్‌కేర్ ఫెసిలిటీస్ రిజిస్ట్రీస్‌గా దీనిని పిలుస్తారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఏ) తరహాలో యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్(యూహెచ్ఐ)ను ఈ వ్యవస్థలో వాడనున్నారు. వైద్యులు, వైద్యశాలలు, డయాగ్నస్టిక్ ల్యాబ్, ఫార్మసీలు యూహెచ్ఐ ద్వారా రోగుల గత రిపోర్ట్‌లను తీసుకుంటాయి. తద్వారా సత్వర వైద్య సేవలు అందిస్తాయి. దేశంలో ఎంత మంది ఏ విధమైన వ్యాధులతో బాధపడుతున్నారో తెలిస్తే.. ప్రభుత్వం సైతం తగు విధంగా విధానపర ‘ఆరోగ్య’ నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. టెలీ మెడిసన్ వంటి సదుపాయాలు ఈ హెల్త్ కార్డు ద్వారా సులభంగా పొందొచ్చు. దీంతో టెలీ మెడిసిన్ వ్యవస్థ మరింతగా విస్తరించనుంది. -
రేపు డిజిటల్ హెల్త్ మిషన్ స్కీమ్‌ను ప్రారంభించనున్న మోదీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్ధాయిలో డిజిటల్ హెల్త్ మిషన్ అమలుకు సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని రేపు(సెప్టెంబర్ 27న) ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రతీ పౌరుడికీ హెల్త్ కార్డుల జారీతో పాటు వారి ఆరోగ్య సమాచారాన్ని ఆ కారులో నిక్లిప్తం చేయనున్నారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ అమలు చేయబోతున్నట్లు గత ఏడాది ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రస్తుతం ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు అండమాన్ & నికోబార్, చండీగఢ్, దాద్రా & నాగర్ హవేలీ మరియు డామన్ & డయు, లడఖ్, లక్షద్వీప్ & పుదుచ్చేరిలలో టెస్ట్ రన్ చేస్తున్నారు. పిఎమ్-డిహెచ్ఎమ్ అంటే ఏమిటి? పిఎమ్-డిహెచ్ఎమ్(ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్) కింద దేశంలోని పౌరులందరికీ హెల్త్ కార్డులతో పాటు హెల్త్ ఐడీ కూడా అందిస్తారు. ఇది బ్యాంక్ ఖాతా ఎలా పనిచేస్తుందో? అలాగే, వారి ఆరోగ్యానికి సంబంధించి ఒక ఖాతాగా పనిచేస్తుంది. దీని ఆధారంగా ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేస్తారు. భవిష్యత్తులో ఎప్పుడైనా జబ్బు చేసినప్పుడు చికిత్స అందించాల్సి వచ్చినా, మందులు తీసుకోవాల్సి వచ్చినా దానికి ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీరు ఏదైనా ఆసుపత్రికి వెళ్లినప్పుడు మీ హెల్త్ ఐడీ నమోదు చేయగానే స్వయం చాలకంగా మీ పూర్తి ఆరోగ్య సమాచారం డాక్టర్లకు కనిపిస్తుంది. ఒకవేల కొత్త పరీక్షలు చేయాల్సి వస్తే ఆ వివరాలను ఇందులో చేరుస్తారు.(చదవండి: ‘ఎస్బీఐ లాంటివి నాలుగైదు బ్యాంకులు కావాలి’) -
యూనివర్సల్ హెల్త్ కార్డుపై జనం మాట
-
పేద, మధ్య తరగతి కుటుంబాలకు జగన్ భారీ కానుక
-
ప్రైవేట్ టీచర్లకు హెల్త్‌కార్డులు ఇవ్వాలి
సుభాష్‌నగర్ (నిజామాబాద్ అర్బన్): ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్‌పీఎస్‌టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు రవిశ్రీ డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లోని వైశ్యభవన్‌లో ఆదివారం నిర్వహించిన టీఎస్‌పీఎస్‌టీఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆత్మ గౌరవం, అభివృద్ధి, సమైక్యతకు ప్రతిరూపంగా టీఎస్‌పీఎస్‌టీఏ ఆవిర్భవించిందని తెలిపారు. ప్రధానంగా ఐదు లక్ష్యాలతో ఈ సంస్థ ఏర్పడిందన్నారు. సంస్థను ప్రకటించిన వారం రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా కదలిక వచ్చిందని తెలిపారు. సెప్టెంబర్ 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవం నాడు కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులకే అవార్డులు ఇస్తున్నారని, జిల్లాకు, రాష్ట్రానికి పేరు తీసుకొస్తున్న ప్రైవేట్ టీచర్లను ఎందుకు పరిగణనలోకి తీసుకోరని ఆయన ప్రశ్నించారు. రానున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రైవేట్ టీచర్ల సేవలను గుర్తించి అవార్డులు ఇవ్వాలని కోరారు. అర్హులైన ప్రైవేట్ టీచర్లకు డబుల్బెడ్రూం ఇళ్లను కేటాయించాలని, హెల్త్, డెత్ ఇన్సూరెన్స్ ప్రకటించాలని, డీఎస్సీ, టీఆర్‌టీల్లో ప్రైవేట్ టీచర్లకు అనుభవం ప్రకారం వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 30లోపు తమ డిమాండ్లు నెరవేర్చకుంటే ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ ఏర్పాటు.. తెలంగాణ స్టేట్ ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్‌పీఎస్‌టీఏ) రాష్ట్ర కమిటీని ఆదివారం నిజామాబాద్‌లో ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా రవిశ్రీ, ప్రధాన కార్యదర్శిగా సతీష్, ఉపాధ్యక్షుడిగా జైసన్, కోశాధికారిగా రాధాకిషన్, కార్యవర్గ సభ్యులుగా భోజన్న, గోవర్ధన్, సుమన్, శ్రీకాంత్, గురుచరణ్, హర్షరాజ్ తదితరులు ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఏడు జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాస్పత్రులకు మెరుగులు
⇒ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి ⇒ త్వరలో రూ.12 కోట్లతో ‘గాంధీ’కి వైద్య పరికరాలు, ఫర్నిచర్ ⇒ అన్ని ఆస్పత్రులను కొత్తగా తీర్చిదిద్దుతామని వెల్లడి ⇒ హెల్త్‌కార్డుల ద్వారా చికిత్సల్లో లోపం లేదని స్పష్టీరణ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరిచే పనులు ప్రారంభించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. మౌలిక వసతుల కల్పనతోపాటు అవసరమైన వైద్య పరికరాలను అందించనున్నట్లు ప్రకటించారు. ఇటీవల గాంధీ ఆస్పత్రిని సందర్శించినప్పుడు అక్కడి పరిస్థితులు చూసి సిగ్గుపడాల్సి వచ్చిం దని.. గత ప్రభుత్వాల పాపమే దీనికి కార ణమని, ఇప్పుడు వాటిని మెరుగు పరిచేం దుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో చాలా మార్పులొచ్చాయని, లిఫ్టులను రోగు లకు అందుబాటులోకి తెచ్చామన్నారు. వైద్యశాఖ పద్దుపై గురువారం శాసనసభలో లక్ష్మారెడ్డి ప్రసంగించారు. గాంధీ ఆస్పత్రిలో రూ.12 కోట్ల వ్యయంతో కొత్త వైద్య పరికరాలు, ఫర్నిచర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 690 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగు పరిచినట్టు తెలిపారు. అన్ని ఆస్పత్రులు కలిపి 20 వేల బెడ్స్ ఉంటే ఇప్పటికే 10 వేల కొత్త బెడ్‌షీట్స్ ఏర్పాటు చేశామని, మొత్తం లక్ష బెడ్‌షిట్స్ సమకూర్చుకునేందుకు ఆర్డర్ ఇచ్చామన్నారు. హైదరాబాద్‌లో నిమ్స్ స్థాయిలో కొత్తగా మూడు ఆస్పత్రులు నిర్మించనున్నట్టు మంత్రి వివరించారు. కొత్తగా నాలుగు ఆస్ప త్రుల్లో ఐసీయూ సేవలు ప్రారంభించామని, అన్ని ఆస్పత్రుల్లో ఐసీ యూలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో పేదలందరికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించటమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వా స్పత్రుల్లో అవినీతిని నిరోధించేందుకు కొత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హెల్త్‌కార్డుల ద్వారా చికిత్సల్లో లోపం లేదని, ఇప్పటివరకు లక్షా ఆరు వేల మందికి ఆ పద్ధతి లో చికిత్సలు అందించామన్నారు. ఇందులో ప్రైవేటు ఆస్పత్రులను చేర్చాక గత మూడు నెలల్లో 4,200 మందికి చికిత్సలు అందిం చినట్లు లక్ష్మారెడ్డి వెల్లడించారు. గద్వాల ఆస్పత్రి స్థాయి పెంపుతోపాటు రూ. 1.4 కోట్లతో ఐసీయూను మెరుగుపరుస్తున్నామని, తుంగతుర్తిలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు పరిశీలనలో ఉందన్నారు. అర్చకులకు ట్రెజరీ వేతనాలు కుదరదు: ఇంద్రకరణ్‌రెడ్డి దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వడం సాధ్యం కాదని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తేల్చి చెప్పారు. ప్రభుత్వ నిబంధనలు, రోస్టర్ నిబంధనల ప్రకారం కాకుండా కేవలం ఆలయ చైర్మన్ల ద్వారా వారు నియమితులు కావడమే అందుకు కారణమన్నారు. ప్రభుత్వోద్యోగులకు దాదాపు సమంగా ఉండేలా వారికి వేతనాలు చెల్లించాలని నిర్ణయించామని, మరో పద్ధతిలో వారికి వేతనాల చెల్లింపు ఉంటుందన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ప్రతిపాదన సిద్ధం చేస్తోందన్నారు. సంవత్సరంలోపు యాదాద్రిని తెలంగాణ తిరుమలగా తీర్చి దిద్దుతామన్నారు. స్థలం ఉంటే కొత్త స్టేడియాలు: పద్మారావు నియోజకవర్గ కేంద్రాల్లో స్థలం సిద్ధంగా ఉంటే కొత్త స్టేడియాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పద్మారావు వెల్లడిం చారు. హైదరాబాద్‌లో 15 నియోజకవర్గాల్లో స్టేడియాలు ఉండేలా ప్రతి పాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో దుకాణదారులు అక్రమంగా సగంప్రాంతాన్ని కబ్జా చేసి వ్యాపారాలు చేస్తున్నారని, వాటిని తొలగిస్తామన్నారు. కొత్తగూడెం, కోరుట్ల, తుంగ తుర్తిలకు కొత్త స్టేడియాలు మంజూరయ్యాయని, భద్రాచలంలో ఇండోర్ స్టేడియం నిర్మించనున్నట్లు చెప్పారు. కనీసం వేతన చట్టం అమలు: నాయిని రాష్ట్రంలో కనీస వేతన చట్టాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. పదేళ్లుగా కనీసం వేతన బోర్డు లేదని, తమప్రభుత్వం ఏర్పాటయ్యాక దాన్ని ఏర్పాటు చేసినట్లు సభ దృష్టికి తెచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలవడంలో కార్మిక శాఖ కృషి ఉందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 1,200 పరిశ్రమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా 760 పరిశ్రమలకు అనుమతులిచ్చినట్లు చెప్పారు. కార్మిక చట్టానికి వ్యతిరేకంగా పని చేసిన 193 పరిశ్రమల యజమానులపై కేసులుపెట్టి 84 లక్షల పెనాల్టీ వసూలు చేశామన్నారు. -
కారు...కార్యాలయం...సహాయకుడు
ఇంటి అద్దె, కంప్యూటరు, ఫోనూ కావాలట.. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల డిమాండ్ సిటీబ్యూరో: ‘ఓ కారు... నడపడానికి డ్రైవర్... కార్యాలయం... సహాయకుడు... కంప్యూటరు... ఫోను...’ ఇవన్నీ మన కార్పొరేటర్లకు కావాలట.. పనిలో పనిగా ఇంటి అద్దె అలవెన్స్, హెల్త్‌కార్డులు కూడా కావాలంటున్నారు. కంప్యూటర్‌కు ప్రింటర్, స్కానర్, కారుకు డీజిల్ అదనం...ఇవన్నీ ‘సేవ’ కోసమేనట. ఇక వేతనాల పెంపు డిమాండ్ ఎలాగూ ఉన్నదే. ఓ వైపు తమ చాంబర్లలో మార్పులు చేయాలని... త గినన్ని గదులు ఇవ్వాలని... ఇతర కార్యాలయ గదులను తమ కార్యాలయాల్లో విలీనం చేయాలని మేయర్.. డిప్యూటీ మేయర్లు కోరుతున్నారు. మరోవైపు వేతనాలు పెంచాలని, ఇతర సదుపాయాలు కల్పించాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీకి కొత్త కార్పొరేటర్లు వచ్చాక తొలి సమావేశం ముగిసిందో... లేదో...వేతనాలు పెంచాలని, సౌకర్యాలు కల్పించాలని కొంతమంది కార్పొరేటర్లు పల్లవి అందుకున్నారు. ఈ మేరకు నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ పైన చెప్పినవన్నీ కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇవన్నీ సమకూరిస్తే సేవాభావం ఉన్న కార్పొరేటర్లు నిజాయితీగా పని చేయగలుగుతారని తెలిపారు. కార్పొరేటర్ అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.5 లక్షలుగా నిర్ణయించారని... ప్రస్తుత గౌరవ వేతనం నెలకు రూ.6వేలని చెప్పారు. ఐదేళ్లకు ఈ మొత్తాన్ని లెక్కిస్తే రూ.3.60 లక్షలు మాత్రమే అవుతుందని లేఖలో ప్రస్తావించారు. కనీసం ఎన్నికల ఖర్చు కూడా ఈ వేతనంతో తిరిగి రాదని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి కార్పొరేటర్లు ఈ వేతనంతో నెట్టుకురావడం కష్టమని ఏకరువు పెట్టారు. వేతనం పెంచకపోయినా... కనీసం పైన పేర్కొన్న సదుపాయాలు కల్పిస్తే నిజాయితీగా సేవ చేయగలుగుతారని, లేని పక్షంలో అప్పుల్లో కూరుకుపోవాల్సి వస్తుందని తెలిపారు. -
జీ(వి)తానికి కనాకష్టం!
- వృత్తి.. బోధన, మిగిలేది.. ఆవేదన - సమస్యల సుడిగుండంలో ఎయిడెడ్ టీచర్లు - అరచేతిలో వైకుంఠం చూపించిన ప్రభుత్వం - నెలల తరబడి వేతనాల బకాయిలు - ఇతర సదుపాయూలకూ నోచని కొలువు సాక్షి ప్రతినిధి, కాకినాడ : బుజ్జిబాబు... కాకినాడ ఎంఎస్ఎన్ చారిటీస్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. తన సర్వీసులో ఎంతోమంది శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పించారు. ఇప్పుడు మూత్రపిండాలు పాడై, ఇలాంటి సమస్యతోనే భార్య రెండు నెలల క్రితం శాశ్వతంగా దూరమై.. గంపెడు దుఖంలో కూరుకుపోయారు. మరోవైపు భార్యను దక్కించుకోవాలని చేసిన దాదాపు రూ.12 లక్షల అప్పు గుదిబండలా మారింది. మరోవైపు పిల్లల చదువులు ఎలా కొనసాగించాలో అర్థం కాని పరిస్థితి! ఇది బుజ్జిబాబు సమస్యే కాదు జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులది ఇదే పరిస్థితి. మరి ‘వీరికి హెల్త్‌కార్డు ఉంటుంది కదా? ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది కదా?’ అనే సందేహం రావచ్చు. కానీ వీరంతా ప్రభుత్వోపాధ్యాయుల్లాగే సేవలందిస్తున్న ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు. కానీ ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు సమకూర్చకుండా తమ జీవితాలతో ఆటలాడుతోందని వాపోతున్నారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ముఖ్యమంత్రి అయ్యాక అమలుపై శీతకన్ను వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు బడ్జెట్ నిధులనూ విడుదల చేయకుండా జీతాలను తొక్కిపెడుతున్నారని వాపోతున్నారు. తమ సమస్యల్ని ఇప్పటికైనా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నాలకు దిగుతున్నారు. దారి కానరాని ‘బ్లైండ్’ స్కూలు టీచర్లు జిల్లాలో ఎయిడెడ్ పద్ధతిన నడిచే స్కూళ్లు 15 ఉన్నాయి. అక్కడ పనిచేస్తున్న 730 మంది టీచర్లకు నాలుగు నెలలుగా జీతాల్లేవు. సెకండరీ హైస్కూళ్ల టీచర్లకైతే గత రెండు నెలలుగా జీతాలు పడట్లేదు. ఇక మండపేటలోని బ్లైండ్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లది మరీ దయనీయమైన పరిస్థితి. గత ఏడాది నవంబర్, డిసెంబర్, ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల జీతాలు ఇప్పటికీ ఇవ్వలేదు. విచిత్రమేమిటంటే బకారుు జీతాలు ఇవ్వకుండానే మార్చి నెల నుంచి మళ్లీ కొనసాగించారు. సరే ఇదైనా దక్కిందిలే అని ఊపిరి పీల్చుకొనే లోపే జూలై నెల నుంచి జీతం ఆగిపోయింది. జిల్లాలోనున్న 400 మంది టీచర్లకు రూ.15 లక్షల వరకూ ఎరియర్స్ రావాలి. వీటి కోసం గత మూడేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్లో కోత! వాస్తవానికి ఎయిడెడ్ టీచర్ల జీతాలకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఏటా జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి పంపిస్తుంది. మళ్లీ త్రైమాసికానికి ఒకసారి చొప్పున మళ్లీ పంపిస్తుంది. అయినా సగానికి సగం కోత విధిస్తుండటంతో జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు ఆగమ్యగోచరం... ఉద్యోగి భవిష్యనిధి (ఈపీఎఫ్)కి తన వాటా మొత్తం చెల్లించని ఏ ప్రైవేట్ సంస్థనైనా మూయించే అధికారం ప్రభుత్వానికి ఉంది. అలాంటిది ప్రభుత్వమే 730 మంది ఎయిడెడ్ పాఠశాలల టీచర్లకు కొన్నేళ్లుగా ఆ మొత్తాన్ని ఎగవేస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సాకుగా చూపిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వోద్యోగులకు టీపీఎఫ్ అవసరం లేదన్నదే ఆ ఆదేశాల సారాంశం. కానీ ఎయిడెడ్ టీచర్లను అసలు ప్రభుత్వోద్యోగులుగా పరిగణించని ప్రభుత్వం.. పీఎఫ్‌ను మాత్రం రద్దు చేసేసింది. దీంతో ఆ మొత్తం ఆదాయపన్ను కోతకు పోతోంది. అటు భవిష్యనిధి భరోసా లేక, ఇటు జీతానికి చిల్లు పడుతోందని ఎయిడెడ్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెల్త్‌కార్డులు హుళక్కే... పేదలకు ఆరోగ్యశ్రీ, ప్రభుత్వోద్యోగులకు హెల్త్‌కార్డులు ఉన్నాయి. కానీ ఎయిడెడ్ టీచర్లకు ఆ రెండూ వర్తింపజేయట్లేదు. దీంతో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా వేలకు వేలు ఖర్చుచేసుకోవాల్సిన పరిస్థితి. అటు జీతం సరిగా అందక, ఇటు ఇంటి ఖర్చులు, పిల్లల చదువులతో పాటు అనారోగ్యం పాలైతే వైద్యానికీ అప్పుల బాట పట్టాల్సిన పరిస్థితి. -
ఉద్యోగుల కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెల్త్ కార్డు
అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యంతో.. ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజాగా అపోలో హాస్పిటల్స్‌తో కలిసి కో-బ్రాండెడ్ మెడికల్ బెనిఫిట్స్ కార్డును ప్రవేశపెట్టింది. కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులకి ఇచ్చే మెడికల్ అలవెన్సులను ప్రతి నెలా ఈ కార్డు ఖాతాలో జమచేస్తాయి. వీసా/మాస్టర్ కార్డ్ అవుట్‌లెట్స్ ఉన్న చోట ఉద్యోగులు తమ వైద్య వ్యయాల చెల్లింపుల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనిపై రూ. 3 లక్షల దాకా ఉచిత ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది. అలాగే అపోలో హాస్పిటల్స్, ఫార్మసీలు, క్లినిక్స్ మొదలైన వాటిల్లో డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. దేశీయంగా ఈ తరహా కార్డు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. వీటివల్ల మెడికల్ అలవెన్సులు ఇచ్చేందుక య్యే వ్యయాలతో పాటు ఇతరత్రా అడ్మినిస్ట్రేషన్పరమైన సమస్యలను కూడా కంపెనీలు తగ్గించుకోవచ్చని బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పరాగ్ రావు తెలిపారు. -
ప్యాకేజీని 25 % పెంచండి
ఆరోగ్య కార్డులపై 12 కార్పొరేట్ ఆసుపత్రుల విన్నపం 10 శాతానికి సిద్ధమన్న సర్కార్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య కార్డుల శస్త్రచికిత్సల ప్యాకేజీని 25 శాతం పెంచాలని రాష్ట్రంలోని 12 ప్రధాన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పునరుద్ఘాటించాయి. ఔట్ పేషెంట్లుగా వచ్చే ఉద్యోగుల నుంచి ప్రత్యేకంగా ఫీజు వసూలుకు అంగీకరించాలని మరోసారి విన్నవించాయి. సచివాలయంలో గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆయా సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. 12 ప్రధాన ఆసుపత్రులు నగదు రహిత ఆరోగ్య కార్డుల ఉద్యోగుల చికిత్సకు అంగీకరించకపోవడంతో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఆరోగ్యకార్డుల ద్వారానే కాక మెడికల్ బిల్లులు సమర్పించి రీయింబర్స్‌మెంటు చేసుకునే పద్ధతిని కూడా జూన్ వరకు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి పరిష్కారం కోసం లక్ష్మారెడ్డి ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ప్యాకేజీని నిమ్స్, సీజీహెచ్ఎస్ ధరలకు అనుగుణంగా పెంచాలని యాజమాన్యాల ప్రతినిధులు కోరారు. మందులకు సంబంధించి సేకరణ ధర కాకుండా ఎమ్మార్పీపై కొనసాగించాలని కోరినట్లు తెలిసింది. ఔట్ పేషెంట్లుగా ఉచితసేవలు అందించడం చాలా కష్టమని అందుకు ఫీజు వసూలు చేసేందుకు అంగీకరించాలని కోరారు. శస్త్రచికిత్సల ప్యాకేజీని 10 శాతం పెంచుతామని, ఔట్ పేషెంట్లపై ఫీజుకు అంగీకరించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. 15 శాతం పెంపుదలకు అంగీకారం? సమావేశ వివరాలను లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి వివరిస్తూ.. వారంలోగా ఆయా ప్రధాన ఆసుపత్రు ల్లో ఉద్యోగుల ఆరోగ్య కార్డులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. రెండు మూడు రోజుల్లో వారొక నిర్ణయం తీసుకొని లేఖ రాస్తానని చెప్పారన్నారు. ఇదిలావుండగా శస్త్రచికిత్సలకు సంబంధించిన ప్యాకేజీని మధ్యస్థంగా అటు ప్రభుత్వానికి, ఇటు సూపర్‌స్పెషాలిటీలకు అంగీకారంగా 15 శాతం వరకు పెంచే సూచనలున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇతర ఆసుపత్రులకు ప్రస్తుత ప్యాకేజీలనే అమలు చేయాలని భావిస్తున్నాయి. -
ఈ జాప్యం ఇంకెన్నాళ్లు?
పీఆర్సీపై కమిటీ ఎందుకు సీఎం నిర్ణయం తీసుకోవాలి: టీచర్ల జేఏసీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై ఉపాధ్యాయులు ఆగ్రహంగా ఉన్నారు. హామీ లు ఆచరణకు నోచుకోవడంలేదని విమర్శిస్తున్నారు. హెల్త్‌కార్డులు, పీఆర్సీ అమలులో తా త్సారంపై మండిపడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల హెల్త్ కార్డుల సమస్యల పరి ష్కారానికి, పీఆర్సీ అమలులో జాప్యాన్ని నివారించేందుకు ఇంకెన్నాళ్లు పడుతుందని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ప్రశ్నిం చింది. బుధవారం హైదరాబాద్‌లోని పీఆర్టీయూ భవన్లో జరిగిన టీటీజేఏసీ సమావేశంలో వివిధ అంశాలపై ఆయా సంఘాల ప్రతినిధులు చర్చించి తీర్మానాలు ఆమోదించా రు. హెల్త్ కార్డుల ఉత్తర్వులు జారీ చేసి నాలుగు నెలలవుతున్నా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టలేకపోయిందన్నారు. 2013 జులై ఒకటో తేదీ నుం చే అమలు చేయాల్సిన పీఆర్సీ విషయంలో కాలయాపన ఎందుకని నిలదీశారు. అమలుకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. టీటీజేఏసీ చైర్మన్ పి.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరి గిన ఈ సమావేశంలో సెక్రటరీ జనరల్ భుజం గరావు, కన్వీనర్ మణిపాల్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవీ తీర్మానాలు.. తెలంగాణలో మొదటి పీఆర్సీ ఉద్యోగ, టీచర్ల, పెన్షనర్ల స్థితిగతులను మెరుగుపరిచేలా ఉండాలి. ఫిట్మెంట్ 69 శాతం ఇస్తూ 2013 జులై 1 నుంచే నగదు రూపంలో వర్తింపజేయాలి. వీటిపై సీఎం కేసీఆర్ స్వయంగా సంఘాలతో మాట్లాడి మాట నిలబెట్టుకోవాలి. కమిటీల పేరు తో కాలయాపన సరికాదు. ఈ పీఆర్సీ తో 1958 నాటి 30 శాతం వేతన వ్యత్యాస నష్టాన్ని భర్తీ చేయాలి. 9వ పీఆర్సీలో సీనియర్ టీచర్లకు మూడేళ్ల సర్వీసుకు ఒకటి చొప్పున ఇంక్రిమెంటు ఇవ్వాలి. కనీస మూలవేతనం రూ. 15 వేలకు, గ్రాట్యుటీ రూ. 15 లక్షలకు పెంచాలి. -
పీఆర్సీ వెంటనే అమలు చేయాలి
ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ డిమాండ్.. ముఖ్యమంత్రిని కలసి నివేదించాలని తీర్మానం పీఆర్సీ, హెల్త్‌కార్డులపై పీఆర్టీయూ రౌండ్ టేబుల్ సమావేశం హెల్త్‌కార్డులు జేబులో పెట్టుకునేందుకే పరిమితమయ్యాయని విమర్శ సాక్షి, హైదరాబాద్: పదో వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) సిఫార్సులను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు త్వరలోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలవాలని తీర్మానించింది. పదో పీఆర్సీ, హెల్త్‌కార్డులు తదితరల అంశాలపై శుక్రవారం పీఆర్టీయూ భవన్లో వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఇందులో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ.. హెల్త్‌కార్డులు జేబులో పెట్టుకునేందుకే పరిమితమయ్యాయని, పీఆర్సీ అమల్లో జాప్యంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొందన్నారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ.. పీఆర్సీ అమలుకు, ఉద్యోగుల విభజనకు సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో 3.5 లక్షల మంది ఉద్యోగులు, 2.7 లక్షల మంది పెన్షనర్లు పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. గతేడాది జూలై 1నుంచి ఆర్థిక లాభం వర్తింపజేయాలని సీఎంను ఇప్పటికే కోరినట్లు చెప్పారు. హెల్త్ కార్డుల అమలుపై కార్పొరేట్ ఆసుపత్రులతో సంప్రదింపుల బాధ్యతను ముఖ్యమంత్రి... డిప్యూటీ సీఎం రాజయ్యకు అప్పగించారని చెప్పారు. సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదనరెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు శివశంకర్, సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గుప్తా, ఎయిడెడ్ కళాశాలల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజమహేందర్‌రెడ్డి, డీటీఎఫ్ అధ్యక్షుడు నారాయణరెడ్డి, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు చంద్రప్రకాశరావు, పీఆర్టీయూ(టీఎస్) ప్రధాన కార్యదర్శి సరోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం తీర్మానాలివే.. పీఆర్సీ అమలుకు జేఎసీ పక్షాన సీఎం కేసీఆర్‌ను కలవడం 63 శాతం ఫిట్మెంట్తో గత జూలై నుంచి ఆర్థిక లాభం కోరడం ప్రతి మూడేళ్ల సర్వీసుకు ఒక వెయిటేజీ ఇంక్రిమెంట్ వర్తింపు మహిళా ఉద్యోగులకు రెండేళ్ల చైల్డ్‌కేర్ లీవ్ మంజూరు ఉద్యోగుల తల్లి లేదా తండ్రి మరణిస్తే 11 రోజుల ప్రత్యేక సెలవు హెల్త్‌కార్డులు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలయ్యేలా చర్యలు -
‘ఉద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం’
చెన్నూర్ : రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యకార్డుల పేరుతో ఉద్యోగులను మోసం చేసిందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి రమేశ్ ఆరోపించారు. ఆదివారం చెన్నూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగదు రహిత వైద్యం అందిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి ఉద్యోగులకు అన్యాయం చేసిందని విమర్శించారు. జీవో 32 ప్రకారం నవంబర్ ఒకటి నుంచి ఆరోగ్య కార్డుల పథకం అమలు చేసిన ప్రభుత్వం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులను మినహాయించడం శోచనీయమన్నారు. దీంతో 95 శాతం మంది ఉద్యోగులకు ఈ పథకంతో ప్రయోజనం లేకుండా పోతుందన్నారు. అలాంటపుడు కార్డులు జారీ చేయడం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అన్ని వ్యాధులకు చికిత్స చేసే విధంగా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే టీపీయూఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. టీపీయూఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శ్రీనివాస్‌రావు, రత్న లక్ష్మీనారాయణరెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు సమ్మయ్య, సాంబయ్య పాల్గొన్నారు. -
హెల్త్‌కార్డుల అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలి
టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు పరిగి: ప్రభుత్వం ఉపాధ్యాయుల హెల్త్ కార్డుల అమలుకు వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలని తెలంగాణా టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు అన్నారు. ఆదివారం పరిగిలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మదనాచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన టీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా ప్రధాన కార్యదర్శి చెర్క సత్తయ్య ఏడాది కాలంగా జిల్లాలో ఆ సంఘం నిర్వహించిన కార్యక్రమాలు, భవిష్యత్తులో నిర్వహించబోయే కార్యక్రమాలకు సంబంధించిన నివేదిక సమర్పించారు. సభ్యులందరూ దానికి ఆమోద ముద్ర వేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ ప్రభుత్వం ఆన్లైన్లో ఉంచిన హెల్త్‌కార్డులు పట్టుకుని ఉపాధ్యాయులు ఏ ఆస్పత్రికి వైద్యానికి వెళ్లినా నిరాకరిస్తున్నారని తెలిపారు. కేజీటూ పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదన్నారు. ప్రభుత్వం తెలంగాణాలో కామన్‌స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టం అమలు చేయాలన్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా తయారు చేయాలన్నారు. ఇదే సమయంలో పాఠశాలల్లో రేషనలైజేషన్ విధానం అమలు చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. ‘మన ఊరు -మనబడి‘ అనే నినాదంలో బడులను బాగు చేసే కార్యక్రమం ఓ ఉద్యమంలా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు సత్తయ్య, ప్రకాష్‌రావ్, మెదక్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు ధశరథ్నాయక్, నజీర్, భీమయ్య, భాగ్యమ్మ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మదనాచారి, ఉపాధ్యక్షులుగా నజీర్, దశరథ్, హనుమాండ్లు, ప్రధాన కార్యదర్శి నర్సింహ్మామూర్తి, కార్యదర్శులుగా భీమప్ప, భాగ్యమ్మ, సుధాకర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా భీమయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
డబ్బు కట్టేవారికే వైద్యం!
హెల్త్ కార్డుల ఉద్యోగులకు ఆస్పత్రుల స్పష్టీకరణ ఆస్పత్రులతో ఇంకా కుదరని ఒప్పందం.. కొలిక్కిరాని ప్యాకేజీ రేట్లు ఆర్భాటంగా ఈహెచ్ఎస్ పథకం ప్రారంభించిన రెండు రాష్ట్రాలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డుల జారీపై పోటీపడి వ్యవహరించిన ఏపీ, తెలంగాణ సర్కారులు వైద్యసేవలు అందించే ప్రైవేట్ ఆస్పత్రులతో ఇంతవరకూ అసలు ఒప్పందమే కుదుర్చుకోలేదు. ఈ కార్డులతో ఆస్పత్రులకు వెళ్తున్న ఉద్యోగులను డబ్బు కట్టి వైద్య సేవలు పొందాలని యాజమాన్యాలు స్పష్టం చేయటంతో కంగుతింటున్నారు. ఆరోగ్యశ్రీ ప్యాకేజీ రేట్లంటే కుదరదు.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్‌కార్డులతో నగదు రహిత వైద్య సేవలు అందిస్తామని ప్రకటించిన ఇరు ప్రభుత్వాలు ఆర్భాటంగా ఈహెచ్ఎస్ (ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్) పథకాన్ని ప్రారంభించాయి. అయితే ఇప్పటి వరకూ ఒక్క ఉద్యోగికి కూడా నగదు రహిత వైద్య సేవలు అందలేదు. వైద్య సేవలపై ఆస్పత్రులతో ఇంతవరకు అంగీకారం కుదరకపోవడమే దీనికి కారణం. ఇరు రాష్ట్రాలు ఇప్పటికే పదుల సంఖ్యలో సమావేశాలు జరిపినా ఫలితం లేదు. ఉద్యోగులకు వైద్య సేవల ప్యాకేజీ రేట్లపై ఎలాంటి నిర్ణయం జరగలేదు. కొందరు ఉద్యోగులు హెల్త్కార్డ్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు వెళ్లగా నగదు చెల్లిస్తేగానీ వైద్యం చేయలేమని కరాఖండీగా తేల్చి చెప్పాయి. ప్యాకేజీ రేట్లతో పాటు, ఓపీ సేవలు, గదుల అద్దె తదితర అంశాలపై ప్రభుత్వం ఏ విషయం తేల్చలేదని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. కార్పొరేట్ల సామాజిక బాధ్యతగా దారిద్య్రరేఖ దిగువన ఉన్నవారికి సేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ ప్యాకేజీలకు ఒప్పుకున్నామని, ఉద్యోగులకు కూడా అవే ప్యాకేజీలంటే కుదరవని స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌లోనే ఎక్కువ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉండటంతో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రీయింబర్స్‌మెంట్‌కు 30 వరకే గడువు వైద్యసేవలపై ఇంతవరకు ఓ నిర్ణయం తీసుకోకపోగా మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు నవంబర్ 30 వరకే గడువు విధించడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. డిసెంబర్ 1నుంచి వైద్యసేవలు పొందిన వారికి మెడికల్ రీయింబర్స్మెంట్ వర్తించదు. ఈలోగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు, ప్రభుత్వానికి మధ్య రేట్లపై ఒప్పందం కుదరకపోతే తమ పరిస్థితి ఏమిటని ము ఖ్యంగా పెన్షనర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇంకా ఎంవోయూ జరగలేదు ఉద్యోగులకు సేవలందించే విషయంపై ప్రభుత్వానికి, ఆస్పత్రుల యాజమాన్యాలకు ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఎంవోయూ (అవగాహనా ఒప్పందం) జరిగితే గానీ సేవలు అందించే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు త్వరలోనే ముందుకొచ్చి దీనిపై నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్నాం. - డాక్టర్ గురవారెడ్డి (తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం అధ్యక్షుడు) చాలా సమస్యలున్నాయి... ఉద్యోగులకు నగదు రహిత వైద్యసేవలపై ప్రభుత్వానికి, ఆస్పత్రుల యాజమాన్యాలకూ మధ్య సమస్యలున్నాయి. ఇరు పక్షాలు ఓ అంగీకారానికి వస్తే తప్ప వైద్య సేవలు అందించలేం. ఈనెల 12న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో ఆధ్వర్యంలో చర్చలు జరగనున్నాయి. ఫలప్రదమైతే సేవలందించేందుకు ముందుకొస్తాం. - డాక్టర్ రమణమూర్తి (ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం అధ్యక్షుడు) -
కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపు
రుద్రవరం: ఆరోగ్యశ్రీ కార్డులేని వారికి కూడా ఇకపై ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలు అందిస్తామని ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ పుల్లయ్య తెలిపారు. మండలంలోని ఎల్లావత్తుల గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ మెగా వైద్యశిబిరంలో ఆయన మాట్లాడారు. పేదలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో జిల్లాలోని మారుమూల ప్రాంతా ల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 938 రకాల జబ్బులకు కర్నూలు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తో పాటు గౌరి గోపాల్, శాంతిరామ్, క్యూర్, మెడికేర్ ఆస్పత్రి వైద్య సిబ్బంది పాల్గొని పరీక్షలు నిర్వహించారన్నారు. గతంలో ఆరోగ్య శ్రీ కార్డు ఉన్న వారికి మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించే వారని ప్రసుత్తం తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీకి అర్హులన్నారు. రేషన్ కార్డు లేని నిరుపేదలు కూడా సంబంధిత తహశీల్దార్‌తో ధ్రువపత్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారితో రోగి వివరాలను కర్నూలు జనరల్ ఆస్పత్రి సీఎంసీఓసెంటర్‌కు అందంజేస్తే వారికీ ఆరోగ్య శ్రీ పథకం వర్థిస్తుందన్నారు. మరిన్ని వివరాలకు 8333814116, 8333814117 నంబర్లకు పోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. వైద్యశిబిరం విజయవంతం మండలంలోని ఎల్లావత్తుల గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్యశ్రీ మెగా వైద్యశిబిరం విజయవంతం అయింది. డాక్టర్లు రామశర్మ, స్వాతి(శాంతిరామ్ ఆసుపత్రి), వరకుమార్ రెడ్డి(మెడికేర్), త్రినాథ్(గౌరిగోపాల్), మైత్రీ(కర్నూలు ప్రభుత్వాస్పత్రి), డేవిడ్ రాజు(క్యూర్ ఆస్పత్రి)తోపాటు ఆయా ఆసుపత్రిలకు చెందిన వైద్య సిబ్బంది 844 మంది రోగులకు వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు. 20 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించారు. శిబిరంలో రుద్రవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి శ్రీమంత్, సిబ్బంది, ఆరోగ్య మిత్ర సభ్యులు విజయ్, మోష పాల్గొన్నారు.