ఉద్యోగుల కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హెల్త్ కార్డు
అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యంతో..
ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా అపోలో హాస్పిటల్స్‌తో కలిసి కో-బ్రాండెడ్ మెడికల్ బెనిఫిట్స్ కార్డును ప్రవేశపెట్టింది. కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులకి ఇచ్చే మెడికల్ అలవెన్సులను ప్రతి నెలా ఈ కార్డు ఖాతాలో జమచేస్తాయి. వీసా/మాస్టర్ కార్డ్ అవుట్‌లెట్స్ ఉన్న చోట ఉద్యోగులు తమ వైద్య వ్యయాల చెల్లింపుల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనిపై రూ. 3 లక్షల దాకా ఉచిత ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది.
అలాగే అపోలో హాస్పిటల్స్, ఫార్మసీలు, క్లినిక్స్ మొదలైన వాటిల్లో డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. దేశీయంగా ఈ తరహా కార్డు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. వీటివల్ల మెడికల్ అలవెన్సులు ఇచ్చేందుక య్యే వ్యయాలతో పాటు ఇతరత్రా అడ్మినిస్ట్రేషన్‌పరమైన సమస్యలను కూడా కంపెనీలు తగ్గించుకోవచ్చని బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పరాగ్ రావు తెలిపారు.