ఆందోళనలు, ఉద్యమాలతో ప్రభుత్వంపై పోరాటం చేసి సాధించుకున్న హెల్త్‌కార్డుల్లో ఉద్యోగుల పేర్ల నమోదు జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఆరోగ్యకార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాల్లో స్పష్టత లోపించింది. దీంతో వివరాలు నమోదు చేసుకునేందుకు ఉద్యోగులు ముందుకు రావడం లేదు. జిల్లాలో 65 వేల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఉండగా.. ఇప్పటివరకు వెరుు్యలోపే హెల్త్‌కార్డులు జారీ అరుునట్లు సమాచారం.
కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నగదు ప్రమేయం లేని వైద్యం కోసం హెల్త్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 14,500 మంది ఉపాధ్యాయులు, 26 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 22 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ హెల్త్‌కార్డులు వర్తిస్తాయి. సుమారు 65 వేల మంది ఉద్యోగుల కుటుంబసభ్యులతో మొత్తం మూడు లక్షల మందికి పైగా ఈ పథకం ద్వారా నగదు ప్రమేయం లేని వైద్యసేవలు అందుతాయి.
నమోదు ప్రక్రియ ఆలస్యం కావడంతో జిల్లాకు వెయ్యి లోపు మాత్రమే హెల్త్‌కార్డులు జారీ అయినట్లు సమాచారం. హెల్త్‌కార్డులు అందినవారు కొత్త నగదు ప్రమేయం లేని వైద్యసేవలకు అర్హులు. మిగతా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు పాత వైద్యవిధానం చేసుకునేందుకు మాత్రమే అర్హులవుతారు. హెల్త్‌కార్డుల్లో వైద్య పరిమితిని రూ.2 లక్షలకు కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఉద్యోగులు వివరాల నమోదుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పెన్షనర్లు మాత్రం హెల్త్‌కార్డుల కోసం వివరాల నమోదులో బిజీగా ఉన్నారు.
మార్గదర్శకాలపై అయోమయం
కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వు ల్లో స్పష్టత లోపించడంతో అంతా గందరగోళం గా ఉంది. ఉద్యోగుల కోసం సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్(డీడీవో)లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉండగా.. వీరికి ఇంతవరకు ఉత్తర్వులు అందలే దు. ఈ హెల్త్‌కార్డులతో ఏ వైద్యశాలలో వైద్యం చేయించుకోవాలో నిర్దేశించలేదు.
నవంబర్ 25 నాటికి అందరికీ తాత్కాలిక హెల్త్‌కార్డులు జారీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణ లో విఫలమైంది. హెల్త్‌కార్డుల కోసం ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే అసలు వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదు. పెన్షనర్లకు సంబంధించి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్(పీపీవో) నంబర్ తప్పనిసరి. అయితే పెన్షనర్ల పీపీవో నంబర్లన్నీ వెబ్‌సైట్‌లో ముందుగా నమోదు చేయకపోవడంతో ఇబ్బంది తలెత్తింది. మండలాల్లో హైస్కూళ్లలో ఉపాధ్యాయులందరి వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరచకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు.
‘కార్డు’ వైద్యం గందరగోళం
Published Thu, Dec 5 2013 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
Advertisement
Advertisement