
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్‌లో ఇప్పటివరకు 2లక్షల 10వేల ఓట్లను విభజించారు. వీటిలో సుమారు 21వేల ఓట్లు చెల్లుబాటు కాలేదని అధికారులు తెలిపారు.
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఇంకా 40వేల ఓట్లు విభజన చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుండి మొదటి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment